naga chaitanya

మొదలైన చైతన్య- సమంత చిత్రం

Updated By ManamSat, 09/29/2018 - 13:02

Samantha, Naga Chaitanyaటాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య- సమంత కలిసి నాలుగో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా.. తాజాగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం చైతన్య, సమంతలు ఫారిన్ ట్రిప్‌లో ఉండగా.. వారిద్దరు కాకుండా మిగిలిన పాత్రాధారులపై దర్శకుడు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే చైతన్య, సమంత ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు. కాగా వివాహానంతరం వచ్చిన మనస్పర్థలను భార్య, భర్త ఎలా పరిష్కరించుకున్నారో అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. సాహు గారపాటి, హరీశ్ పెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. తొందరపడటం లేదు: అను

Updated By ManamThu, 09/06/2018 - 17:51
Anu emmanuel in sailajareddy alludu

కథ విన్నాకే సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటాను అని అంటుందీ అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడు నాగచైతన్య సరసన నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి దర్శకుడు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ఈ సందర్బంగా అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ ‘రమ్యకృష్ణగారి కూతురి పాత్రలో నటించాను. ఇగోయిస్టిక్ పాత్ర నాది. ఈ సినిమాలో నా పాత్ర ఎక్కువగా మాట్లాడుతుంటుంది. నిజ జీవితంలో కూడా నేను కాస్త ఇగోయిస్ట్‌గా.. కాస్త కోపంగానే ఉంటాను. 

నేను ఇప్పటి వరకు నటించిన హీరోల్లో డౌన్ టు ఎర్త్ పర్సన్ చైతన్య. అలాగే రమ్యకృష్ణగారితో నటించడం మంచి ఎక్స్‌పీరియెన్స్. ఆవిడ బ్రిలియంట్ పర్సన్. ఎంత పెద్ద డైలాగ్ అయినా ఓసారి చూసుకుని చెప్పేస్తుంటారు. మంచి పాత్రలు కోసం ఎదురు చూస్తున్నాను.  ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే మరో సినిమా చేసేయాలనే తొందరలో లేను. ఈ సినిమా విడుదలయ్యాక నిలిచి నిదానంగా ఆలోచించి చేస్తాను. 

తమిళంలోనూ మంచి స్క్రిప్ట్‌లు వింటున్నా. మలయాళం ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఈ మధ్య నివిన్ పాల్‌తో ఓ సినిమా చేస్తే, స్క్రీన్ స్పేస్ మరీ తక్కువగా ఉంది. అలా కాకుండా మంచి పాత్రలను ఎంపిక చేసుకుంటాను. ఇప్పుడు హైదరాబాద్ నా సొంతిల్లులా ఉంది. ఇక్కడ నిలదొక్కుకున్నాక మిగిలిన పరిశ్రమల మీద కాన్‌సెన్‌ట్రేట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ‘శైజారెడ్డి అల్లుడు’ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.శైలజ రెడ్డి అల్లుడు కోసం వస్తున్న దేవదాసులు 

Updated By ManamWed, 09/05/2018 - 13:21

nag naniనాగచైతన్య హీరోగా, రమ్యకృష్ణ కీలకపాత్రలో రూపొందిన చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ 9వ తేదీన జరగనుంది.

ఇక ఈ వేడుకకు దేవదేసు సినిమాలో నటిస్తున్న నాగార్జున, నాని అతిధులుగా హాజరు కానున్నారు. చైతూ కోసం నాగార్జున వస్తుండగా.. మారుతి కోసం నాని రానున్నట్లు తెలుస్తోంది. కాగా మారుతీ గతంలో నానికి ‘భలే భలే మగాడివోయ్' చిత్రంతో మంచి హిట్‌ను అందించిన విషయం తెలిసిందే. అందుకోసమే నాని కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.చైతూ కోసం మనసు మార్చుకున్న సమంత

Updated By ManamFri, 08/24/2018 - 10:30

Chaithu, Samanthaఓ వైపు చైతన్య, సమంత దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. అయితే కెరీర్ పరంగా ఈ ఇద్దరు మొదటిసారి పోటీ పడాల్సి వచ్చింది. కానీ ఈ విషయంలో భర్త కోసం సమంత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా మారుతి శైలజారెడ్డి అల్లుడు చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం మామూలుగా ఆగష్టు 31న విడుదల అవ్వాల్సి ఉంది. అయితే రీ రికార్డింగ్‌లో ఆలస్యం అవ్వడం వలన వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు.

ఇక మరోవైపు సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘యూటర్న్’ చిత్రాన్ని అదే రోజున విడుదల చేయాలని ఎప్పుడో రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఈ సినిమాను వాయిదా వేయడం లేక ముందే విడుదల చేయడం చేయాలని సమంత భావిస్తుందట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి విడుదల తేదిని 27వ తేదిన ప్రకటిస్తామని తాజాగా ప్రకటించింది సమంత. దీంతో చై కోసం సామ్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జీవితంలోనే కాకుండా కెరీర్ పరంగా కూడా ఈ ఇద్దరి అండర్‌స్టాడింగ్ అందరినీ మెప్పిస్తోంది.వాయిదా పడ్డ ‘శైలజారెడ్డి అల్లుడు’

Updated By ManamTue, 08/21/2018 - 09:08

నాగ చైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపిన నాగచైతన్య.. వాయిదా పడుతున్నందుకు క్షమాపణలు చెప్పాడు.

కేరళలో ఉన్న దారుణ పరిస్థితుల దృష్ట్యా శైలజా రెడ్డి అల్లుడు రీ-రికార్డింగ్ పూర్తి అవ్వలేదు. దీని వలన మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయిదా పడ్డాయి. శైలజా రెడ్డి అల్లుడు కొత్త విడుదల తేదిని త్వరలో ప్రకటిస్తాం. అనుకోకుండా సినిమాను వాయిదా వేస్తున్నందుకు మీ అందరికీ నా క్షమాపణలు. మీకు తోచినంత సహాయం కేరళ వాసులకు చేయండి. వారందరూ త్వరగా కోలుకోవాలని నను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఇక మరోవైపు శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడటంతో ఆగష్టు 30న రానున్న నాగశౌర్య నర్తనశాలకు కలిసొచ్చే అవకాశం ఉంది.చై, సామ్‌ మూవీ టైటిల్ ఇదేనా..!

Updated By ManamThu, 08/16/2018 - 11:28

Naga Chaitanya, Samanthaటాలీవుడ్ క్రేజీ కపుల్ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం కోసం టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లైన భార్య భర్తల మధ్య జరిగే కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మజిలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా వివాహం తరువాత చైతన్య, సమంత నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.హిట్ టైటిల్‌తో నాగ్‌

Updated By ManamTue, 08/14/2018 - 11:22

Nagarjuna16 ఏళ్ల క్రితం నాగార్జున, సోనాలి బ్రిందే, అన్షు హీరో హీరోయిన్లుగా న‌టించిన `మ‌న్మ‌థుడు` చిత్రం పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఈచిత్రానికి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించారు. నాగార్జున‌కు మంచి విజ‌యంతో పాటు.. పేరుని తెచ్చి పెట్టిన చిత్ర‌మిది. ఇప్పుడు నాగార్జున మ‌న్మ‌థుడు 2 అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించార‌ట‌. మ‌రి ఈ టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించడానికి కార‌ణ‌మేంటో తెలియ‌డం లేదు. మ‌న్మ‌థుడుకి సీక్వెల్ రూపొందనుందా? ఒక‌వేళ రూపొందితే అందులో నాగార్జునే న‌టిస్తాడా?  లేక ఆయ‌న త‌న‌యులు చైత‌న్య‌, అఖిల్‌ న‌టిస్తారా?  అని తెలియ‌డం లేదు. అయితే మొత్తానికి `మ‌న్మ‌థుడు 2` రావ‌డం ప‌క్కా అయింది. ‘శైలజా రెడ్డి అల్లుడు’ మొదటి సింగిల్ విడుదల

Updated By ManamFri, 08/10/2018 - 11:00

Sailajareddy Alluduనాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ విడుదలైంది. బేబి అనూ బేబి అంటూ సాగే ఈ పాటలో హీరోయిన్ అనూ ఇమ్మాన్యుల్‌ను పడగొట్టేందుకు నాగచైతన్య ట్రై చేస్తుంటాడు. కృష్ణకాంత్ ఈ పాటకు సాహిత్యాన్ని అందించగా.. గోపి సుందర్ సంగీతం అందించాడు. అనుదీప్ దేవ్ పాటను ఆలపించారు. ఇక ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు.ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది

Updated By ManamTue, 08/07/2018 - 11:21

Sailaja Reddy Alluduనాగచైతన్య, అను ఇమ్మాన్యుల్ జంటగా నటించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర మొదటి సింగిల్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘అను బేబి’ అంటూ సాగే మొదటి పాట ఆగష్టు 10వ తేదిన ఉదయం 10గంటలకు విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు.‘శైలజారెడ్డి అల్లుడు’ టీజర్ ఎప్పుడంటే..!

Updated By ManamTue, 07/31/2018 - 15:15

SRAనాగచైతన్య హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆగష్టు 1వ తేది ఉదయం 7.10గంటలకు టీజర్‌ విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగచైతన్య సరసన అనూ ఇమ్మాన్యుల్ నటించగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించాడు. ఆగష్టు 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News