a.karunakaran

ల్యాండ్‌మార్క్ జ‌ర్నీ (స్పెష‌ల్ ఆర్టిక‌ల్‌)

Updated By ManamWed, 05/02/2018 - 15:56

land markప్ర‌తి ప్ర‌యాణంలోనూ కొన్ని మైలురాళ్ళు ఉంటాయి. సినిమా వాళ్ళ‌కి కూడా.. అలాంటి మైలురాళ్ళు వాళ్ళ ప్ర‌యాణంలో సినిమాల సంఖ్య ప‌రంగానూ లేదంటే సంవ‌త్స‌రాల ప‌రంగానూ ఉంటాయి. అలా సంవ‌త్స‌రాల ప‌రంగా.. ఒక్కో మైలురాయికి చేరుకుంటున్న కొంద‌రి సినీ ప్ర‌ముఖుల ప్ర‌యాణం గురించి టూకీగా..

చిరంజీవి@ 40 
తెలుగు సినిమా చ‌రిత్ర‌లో మెగాస్టార్ చిరంజీవి న‌ట ప్ర‌స్థానం.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఓ అధ్యాయం. 1978 సెప్టెంబ‌ర్‌లో  విడుద‌లైన 'ప్రాణం ఖ‌రీదు'తో న‌టుడిగా తొలి అడుగులు వేసిన చిరంజీవి.. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ ట‌చ్ ఉన్న పాత్ర‌లు చేసినా.. ఆ త‌రువాత క‌థానాయ‌కుడిగానే ఎదిగారు.1983లో వ‌చ్చిన 'ఖైదీ'తో స్టార్‌డమ్ పొందారు. ఆ త‌రువాత ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించారు. 'ప‌సివాడి ప్రాణం, య‌ముడికి మొగుడు, జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి, గ్యాంగ్ లీడ‌ర్‌,  ఘ‌రానా మొగుడు, చూడాల‌ని ఉంది, ఇంద్ర‌' వంటి ఇండ‌స్ట్రీ హిట్స్‌తో దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌భావం చూపించారు. 2008 నుంచి రాజ‌కీయాలపై దృష్టిపెట్టిన చిరు.. గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన 'ఖైదీ నంబ‌ర్ 150'తో దాదాపు తొమ్మిదేళ్ళ త‌రువాత‌ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చారు. రికార్డు స్థాయిలో వ‌సూళ్ళు ఆర్జించిన ఈ సినిమాతో మెగా స్టామినా త‌గ్గ‌లేద‌ని నిరూపించారు. ఈ ఏడాదితో చిరు సినీ జీవితం నాలుగు ద‌శాబ్దాలు పూర్తిచేసుకుంటోంది. ప్ర‌స్తుతం చిరు.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న 'సైరా న‌ర‌సింహారెడ్డి'తో బిజీగా ఉన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

ఎ.క‌రుణాక‌ర‌న్ @ 20
తెలుగు తెర‌పై ఎన్నో ప్రేమ‌క‌థ‌లు వ‌చ్చాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే ప్ర‌భావం చూపించాయి. వాటిలో 'తొలి ప్రేమ' ఒక‌టి. ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్‌ను కీల‌క మ‌లుపు తిప్పిన ఈ చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యారు క‌రుణాక‌ర‌న్‌. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్నారు. స్వ‌ల్ప‌ విరామం త‌రువాత‌ త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడికి మేన‌ల్లుడైన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ప్ర‌స్తుతం 'తేజ్ ఐ ల‌వ్ యు' సినిమా చేస్తున్నారు ఈ ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్‌. ఈ జూలై 24కి 'తొలి ప్రేమ' విడుద‌లై 20 ఏళ్ళు పూర్తికానున్నాయి. అంటే ద‌ర్శ‌కుడిగా క‌రుణాక‌ర‌న్ ప్ర‌యాణం మొద‌లై రెండు ద‌శాబ్దాలు పూర్త‌వుతోంది అన్న‌మాట‌. 

అల్లు అర్జున్ @15
సినిమా సినిమాకి త‌న స్థాయిని పెంచుకుంటున్న యువ క‌థానాయ‌కుడు స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు 100వ చిత్రం 'గంగోత్రి'(2003)తో హీరోగా తొలి అడుగులు వేసిన బ‌న్ని.. రెండో చిత్రం 'ఆర్య'తో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నారు. ఆ త‌రువాత 'బ‌న్ని, దేశ‌ముదురు, ప‌రుగు, జులాయి, రేసు గుర్రం, స‌రైనోడు' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌తో స్టార్ హీరోగా ఎదిగారు. ప్ర‌తి సినిమాలోనూ లుక్స్ ప‌రంగా తీసుకునే శ్ర‌ద్ధ.. అలాగే పాత్ర‌ల ఎంపిక ప‌రంగా తీసుకునే జాగ్ర‌త్త‌లు.. బ‌న్నికి యువ‌త‌లో ప్ర‌త్యేక గుర్తింపు తీసుకువ‌చ్చాయి. ఈ ఏడాదితో  హీరోగా ఒక‌టిన్న‌ర ద‌శాబ్ద‌పు ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకున్నారు బ‌న్ని. ఈ సంద‌ర్భంగా త‌న కెరీర్ మొద‌లైన వేస‌విలోనే.. త‌న త‌దుప‌రి చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'తో సంద‌డి చేయ‌నున్నారు. మే 4న రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. యారోగెంట్‌ ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌డం కోసం బ‌న్ని మేకోవ‌ర్ అయిన విధానం ఇప్ప‌టికే అభిమానుల‌ని ఫిదా చేసేసింది.

క‌ల్యాణ్ రామ్ @ 15
బాబాయ్ బాల‌కృష్ణ న‌టించిన 'బాల‌గోపాలుడు' చిత్రంలో బాల‌న‌టుడిగా సంద‌డి చేసిన‌ క‌ల్యాణ్ రామ్‌.. 'తొలి చూపులోనే' (2003) చిత్రంతో హీరోగా అడుగులు వేశారు. అయితే తొలి విజ‌యాన్ని అందుకుంది మాత్రం 'అత‌నొక్క‌డే' (2005) చిత్రంతోనే. ఆ త‌రువాత కొన్ని ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించినా.. మూడేళ్ళ క్రితం రిలీజైన 'ప‌టాస్‌'తో గుర్తుండిపోయే విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. గ‌త ఏడాది త‌న త‌మ్ముడు ఎన్టీఆర్ హీరోగా 'జై ల‌వ కుశ' చిత్రాన్ని నిర్మించిన క‌ల్యాణ్ రామ్‌.. ఇటీవ‌లే 'ఎం.ఎల్‌.ఎ'గా సంద‌డి చేశారు. అతి త్వ‌ర‌లో 'నా నువ్వే' చిత్రంతో మ‌రోసారి ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ అక్టోబ‌ర్ 9కి హీరోగా క‌ల్యాణ్ రామ్ కెరీర్ మొద‌లై ఒక‌టిన్న‌ర ద‌శాబ్దం పూర్తి కానుంది.

నాని @ 10
ఓ యువ‌ క‌థానాయ‌కుడు వ‌రుస‌గా ఏడు చిత్రాల‌తో విజ‌యాలు అందుకోవ‌డం అంటే సాదాసీదా విష‌యం కాదు. అయితే.. దాన్ని సుసాధ్యం చేసి వార్త‌ల్లోకెక్కారు నేచుర‌ల్ స్టార్ నాని. మేటి ద‌ర్శ‌కుల వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేయ‌డంతో మొద‌లైన నాని ప్ర‌యాణం.. 'అష్టా చమ్మా' రూపంలో న‌టుడిగా చేసిన తొలి ప్ర‌య‌త్నంతో మ‌లుపు తిరిగింది. ప్రారంభంలో కొన్ని అడుగులు త‌డ‌బ‌డినా.. గ‌త మూడేళ్ళుగా నిల‌క‌డ‌గా ప్ర‌యాణం సాగిస్తున్నారు ఈ యంగ్ హీరో. 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్' నుంచి ఇటీవ‌ల విడుద‌లైన 'ఎంసీఏ' వ‌ర‌కు వ‌రుస‌గా ఏడు విజ‌యాలు అందుకుని వార్త‌ల్లో నిలిచారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్న నాని.. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు నాగార్జున వంటి సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడితో మ‌ల్టీస్టార‌ర్ మూవీ కూడా చేస్తున్నారు. ఈ సెప్టెంబ‌ర్ 5తో క‌థానాయ‌కుడిగా నాని ప్ర‌యాణం ద‌శాబ్దం పూర్తిచేసుకోనుంది.

వీరితో పాటు.. సంగీత ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ గోగుల (20), క‌థానాయ‌కుడు మంచు విష్ణు (15 ), ద‌ర్శ‌కులు శ్రీ‌కాంత్ అడ్డాల (10), ప‌రశురామ్ (10) త‌దితరులు త‌మ త‌మ కెరీర్స్‌లో మైలురాయికి చేరుకుంటున్నారు. అలాగే త‌మ సినీ ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు.                              -మ‌ల్లిక్ పైడి'తేజ్ - ఐ ల‌వ్ యూ' ఫ‌స్ట్ లుక్ వ‌చ్చేసింది

Updated By ManamSat, 04/28/2018 - 17:06

tej - i love youప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'తేజ్ - ఐ ల‌వ్ యూ'. మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో కేర‌ళ‌కుట్టి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఈ రోజు (శ‌నివారం) చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్ లుక్‌లో సాయిధ‌ర‌మ్‌, అనుప‌మ కాంబినేష‌న్ ఫ్రెష్‌గా ఉండ‌డ‌మే కాకుండా.. ఓ మంచి ఫీల్ గుడ్‌ ల‌వ్ స్టోరీని చూడ‌బోతున్నామ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీస్‌తో అల‌రించిన ఐ.ఆండ్రూ ఈ సినిమాకి ఛాయాగ్రహ‌ణం అందిస్తున్నారు. రెండు పాట‌లు మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా జూన్ నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రం టీజ‌ర్‌ను మే 1న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.తేజ్ - ఐ ల‌వ్ యు

Updated By ManamWed, 04/04/2018 - 23:14

saidharam tej 'దేవుడు వ‌ర‌మందిస్తే..', 'అంద‌మైన చంద‌మామ‌'.. ఇలా నెల‌కో టైటిల్ పుట్టుకొస్తోంది యువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ కొత్త చిత్రానికి సంబంధించి. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ యంగ్ హీరో ఈ టైటిల్స్ నిజం కాద‌ని ఖండిస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. తాజాగా ఈ సినిమాకి మ‌రో టైటిల్ వినిపిస్తోంది. అదేమిటంటే.. 'తేజ్ - ఐ ల‌వ్ యు'. తేజ్ టైటిల్ కాగా.. ఐ ల‌వ్ యు అనేది ట్యాగ్ లైన్‌. మ‌రి.. ఈ టైటిల్ అయినా క‌న్‌ఫ‌ర్మ్ అవుతుందో.. లేక మ‌రోసారి సాయిధ‌ర‌మ్ ఖండ‌నకి గురవుతుందో చూడాలి. ఎ.కరుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జూన్ నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది. సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్రానికి ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్‌

Updated By ManamSun, 03/11/2018 - 22:40

saidharam tejసాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ఎ.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. గోపీ సుంద‌ర్ సంగీత‌మందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి 'దేవుడు వ‌ర‌మందిస్తే' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముంది. కాగా, ఈ సినిమాని జూన్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.సాయి, క‌రుణాక‌ర‌న్ మూవీ షెడ్యూల్ మారింది

Updated By ManamSun, 02/11/2018 - 18:21

saidharam tejమెగా ఫ్యామిలీ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్.. 'ఇంటిలిజెంట్‌'గా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోక‌పోవ‌డంతో.. ఇప్పుడు త‌న కొత్త చిత్రంపై మ‌రింత దృష్టి పెట్టాడు ఈ మెగా హీరో. నాటి 'తొలిప్రేమ' ద‌ర్శ‌కుడు ఎ.కరుణాక‌ర‌న్ కాంబినేష‌న్‌లో చేస్తున్న ఈ సినిమా.. ఈ నెల 16 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్‌ను ప్రారంభించుకోనుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14 నుంచే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ను మొద‌లుపెట్ట‌నున్నార‌ని తెలిసింది. క‌రుణాక‌ర‌న్ మార్క్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక కాగా.. గోపీ సుంద‌ర్ స్వ‌రాలు అందించ‌నున్నారు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ అధినేత కె.ఎస్‌.రామారావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 
 13 ఏళ్ళ ‘బాలు’

Updated By ManamSat, 01/06/2018 - 15:52

balu “ప్రేమించిన అమ్మాయి కోసం ఒక అబ్బాయి ఏమైనా చేస్తాడు” అనే ఇతివృత్తంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘బాలు’. దీనికి ఎ.కరుణాకరన్ దర్శక‌త్వం వ‌హించారు. వీరి కాంబినేషన్‌లో విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమా ఘన విజయం సాధించడంతో.. అనేక అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. శ్రియ, నేహా ఒబెరాయ్ క‌థానాయిక‌లుగా న‌టించిన ఈ చిత్రంలో జ‌యసుధ, సునీల్, గుల్షన్ గ్రోవర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

అనాథైన ఘని (పవన్)ని ఖాన్ (గుల్షన్ గ్రోవర్) పెంచుతాడు. ఘని ఎంతో కృతజ్ఞతతో, నమ్మకంతో ఖాన్ దగ్గర‌ పని చేస్తూ ఉంటాడు. ఖాన్‌కు ఎవరైనా ఎదురుతిరిగితే సహించలేడు ఘని. ఇటువంటి పరిస్థితుల్లో ఘనికి ఇందు (నేహా ఒబెరాయ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ సమయంలో ఘని తన గురించి ఇందుకి చెబుతాడు. ఇందు ఘనిని బాలుగా మారుస్తుంది. ఇదిలా ఉంటే...ఒక అనాథ‌ శరణాలయాన్ని తన వశం చేసుకోవడం కోసం రాత్రికి రాత్రే దాన్ని తగలబెట్టిస్తాడు ఖాన్. అందులో ఉండే చిన్నారులు అందరూ చనిపోతారు. దీనికి సాక్ష్యంగా నిలుస్తుంది ఇందు. అందుకే ఇందుని చంపే పనిని ఘనికి అప్పగిస్తాడు ఖాన్. ఆ పని చేయలేని ఘని.. అసలు విషయం తెలుసుకుని ఇందుని ఖాన్ మనుషుల నుంచి కాపాడుకునే పనిలో పడతాడు. ఆ పోరాటంలో ఇందు చనిపోతుంది. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఇందు చనిపోవడంతో.. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు హైదరాబాద్ వచ్చిన బాలుకి అప్పటికే ఖాన్ ఆగడాల వలన ఆ కుటుంబం నష్టపోయిన విషయం తెలుస్తుంది. ఆ కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఖాన్‌ను ఎదిరించక తప్పని పరిస్థితుల్లో.. ఖాన్‌ను అంతం చేస్తాడు బాలు. 

మాఫియా నేపథ్యంలో తెరకెక్కి ప్రేమ, కుటుంబ సన్నివేశాలతో సినిమాని నడిపించిన కరుణాకర్ ప్రయత్నం.. కొంతవరకు ఫలించి బాక్సాఫీస్‌ వద్ద పవన్ కెరీర్‌లో యావరేజ్ ఫిలింగా నిలిచింది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన బాణీలు ఎస్సెట్‌గా నిలిచాయి. ‘బాలు’ సినిమా పేరు చెబితే.. మొద‌ట ఇందులోని పాట‌లే గుర్తొస్తాయి. ''ఇంతే ఇంతింతే'', ''నీలో జ‌రిగే తంతు'' పాట‌లు బాగా పాపుల‌ర్ అయ్యాయి.   అలాగే “తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, నువ్వు మనిషివైతే విధితో పోరాడు నాతో కాదు” వంటి స్పూర్తినిచ్చే మాటలను సంధించిన కోన వెంకట్ డైలాగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వైజయంతి మూవీస్ పతాకంపై 20వ చిత్రంగా ఈ సినిమాని అశ్వ‌నీదత్ నిర్మించారు.  జనవరి 6, 2005న‌ విడులైన ఈ చిత్రం..నేటితో 13 సంవత్సరాలను పూర్తిచేసుకుంది.సాయిధ‌ర‌మ్‌, క‌రుణాక‌ర‌న్ సినిమా మొద‌లైంది

Updated By ManamTue, 12/12/2017 - 14:58

karunaయువ క‌థానాయ‌కుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌రిచ‌య‌మై మూడేళ్ల‌య్యింది. ఈ మూడేళ్ల కాలంలో 8 సినిమాల‌తో సంద‌డి చేశాడు సాయి. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న‌ వి.వి.వినాయ‌క్ చిత్రం అత‌ని 9వ సినిమా. ఇక 'తొలి ప్రేమ' ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్‌తో ఈ మెగా హీరో త‌న 10వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఎప్పుడో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మ‌లు జ‌రుపుకున్నా.. ఈ రోజు (మంగ‌ళ‌వారం) నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఐ.ఎం.టి కాలేజ్‌లో చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.45గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సీనియ‌ర్ నిర్మాత కె.ఎస్. రామారావు.12 నుంచి సాయిధ‌ర‌మ్, క‌రుణాక‌ర‌న్ మూవీ?

Updated By ManamSat, 12/09/2017 - 21:45

a.karunakaranప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాలా నిలిచిన ద‌ర్శ‌కుల‌లో ఎ.క‌రుణాక‌ర‌న్ ఒక‌రు. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే క‌రుణాక‌ర‌న్‌.. దాదాపు మూడేళ్ల త‌రువాత ఓ సినిమా చేస్తున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. కాగా, ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ఈ నెల 12 నుంచి ప్రారంభించ‌నున్నార‌ని తెలిసింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టించ‌నున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కుడు. 'డార్లింగ్' త‌రువాత స‌రైన విజ‌యం లేని క‌రుణాక‌ర‌న్‌.. ఈ సినిమాతోనైనా స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌స్తారేమో చూడాలి. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Updated By ManamTue, 12/05/2017 - 18:11

tolipremaతెలుగు సినిమా చరిత్ర‌లో ఎన్నో ప్రేమ‌క‌థా చిత్రాలు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్ర‌మే ఎవ‌ర్‌గ్రీన్ ల‌వ్‌స్టోరీస్ అనిపించుకున్నాయి. అలాంటి వాటిలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'తొలి ప్రేమ' ఒక‌టి. ఎ.క‌రుణాక‌ర‌న్ తీర్చిదిద్దిన ఈ అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం.. యువ‌త‌నే కాదు కుటుంబ ప్రేక్ష‌కుల‌ను కూడా మెప్పించింది.  అంతేకాకుండా.. ప‌వ‌న్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిపోయింది. మ‌ళ్లీ ఇర‌వై సంవ‌త్స‌రాల త‌రువాత అదే టైటిల్‌తో.. మ‌రో సినిమా రాబోతోంది. ఇది కూడా మెగా ఫ్యామిలీకి చెందిన హీరో సినిమానే కావ‌డం ఇక్క‌డి విశేషం. ప‌వ‌న్ చిన్న‌న్న‌య్య నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న ప్రారంభం కానుంది. ఈ రెండు చిత్రాల‌కి సంబంధించిన కామ‌న్ పాయింట్ ఏమిటంటే.. అప్ప‌టి 'తొలి ప్రేమ‌'ని నూత‌న ద‌ర్శ‌కుడు ఎ.క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కిస్తే.. ఇప్ప‌టి 'తొలి ప్రేమ‌'ని కూడా కొత్త ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి రూపొందించ‌డం.  త‌న ఫ్రెష్ ఐడియాస్‌తో నాటి 'తొలి ప్రేమ‌'ని ప్రేమికుల‌కు ఓ న‌జ‌రానాలా అందించారు క‌రుణాక‌ర‌న్‌. మ‌రి.. నేటి 'తొలి ప్రేమ' విష‌యంలోనూ కొత్త ద‌ర్శ‌కుడు అదే సూత్రాన్ని అనుస‌రిస్తాడా? 1998 నాటి మ్యాజిక్ 2018లోనూ రిపీట్ అవుతుందా? వెయిట్ అండ్ సీ!

toliగోపీసుంద‌ర్ సంగీతంలో..

Updated By ManamThu, 10/26/2017 - 13:20

music directorశ‌ర్వానంద్‌, నిత్యా మీన‌న్ జంట‌గా వ‌చ్చిన 'మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు'తో టాలీవుడ్ కి మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌య‌మ‌య్యారు మ‌ల‌యాళ సంగీత ద‌ర్శ‌కుడు గోపీసుంద‌ర్‌. ఆ త‌రువాత 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌', 'ఊపిరి', 'మ‌జ్ను', 'ప్రేమమ్‌', 'నిన్ను కోరి' చిత్రాల‌తో మెలోడీ పాట‌ల‌కు చిరునామాగా నిలిచిన గోపీ.. తాజాగా సాయిధ‌ర‌మ్ తేజ్‌, ఎ.కరుణాక‌ర‌న్ కాంబినేష‌న్‌లో రానున్న సినిమాకి సంత‌కం చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 'తొలి ప్రేమ' వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత 'యువ‌కుడు', 'వాసు', 'బాలు', 'హ్యాపీ', 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'డార్లింగ్' చిత్రాల‌తో ఇక్క‌డి వారికి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. 2014లో విడుద‌లైన‌ 'చిన్న‌దాన‌ నీ కోసం' త‌రువాత చిరు విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌.. సాయిధ‌ర‌మ్ చిత్రం కోసం మ‌రోసారి మెగాఫోన్ ప‌ట్టారు.

స్వ‌త‌హాగా క‌రుణాక‌ర‌న్ సినిమాలు మ్యూజిక‌ల్ గా బాగుంటాయి. గోపీసుంద‌ర్ వంటి మెలోడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ని ఎంపిక చేసుకున్నారంటే.. రాబోయే చిత్రం కూడా మ్యూజిక‌ల్ గా మెప్పిస్తుంద‌న‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Related News