in vijayavada

దుర్గమ్మకు బంగారు రాళ్ల హారం 

Updated By ManamFri, 09/07/2018 - 23:26

imageవిజయవాడ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గకు ఓ భక్తురాలు బంగారు రాళ్ల హారాన్ని కానుకగా సమర్పించారు.  శ్రీ చలుమూరు వెంకటేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీహెచ్.గోవిందమ్మ ద్వారా దివ్య భవాని, అవినాష్, ఆదిత్య శ్రీకాంత్ శివాని, వెంకటమహేష్, బాలశ్రీదేవి, గీతాంజలీ తదితరులు రూ.10 లక్షలు విలువైన 241 గ్రాముల బంగారు రాళ్ల హారాన్ని అమ్మవారికి కానుకగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ కు శుక్రవారం అందజేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన వీరేష్ రెడ్డి అనే భక్తుడు రూ.88 వేలు విలువైన బంగారు వజ్రాల నత్తు (ముక్కు పుడుక)ను అమ్మవారికి కానుకగా ఆలయ ఈవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఆర్‌వో యస్.అచ్యుతరామయ్య, ఆలయ ప్రధాన అర్చకులు యల్.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



మత్తుమందు ఇచ్చి గ్యాంగ్‌రేప్

Updated By ManamFri, 07/06/2018 - 00:24
  • యువతిపై నలుగురు అఘాయిత్యం.. ఆసుపత్రికి బాధితురాలు తరలింపు

  • పోలీసుల అదుపులో నిందితులు.. విజయవాడ శివారులో దారుణం 

imageవిజయవాడ: ఇటీవల కృష్ణా జిల్లాలోని అగిరిపల్లిలో విద్యార్థినిపై అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించగా.. తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతికి మత్తుమందు ఇచ్చి నలుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. పాలిటెక్నిక్ చదివిన ఆ యువతికి పరిచయం ఉన్న ఓ యువకుడు పార్టీ పేరుతో ఆమెకు మాయమాటలు చెప్పి ఆహ్వానించాడు.

కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఆమెను నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి మరో ముగ్గురు యువకులతో కలసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిని అక్కడే వదిలేసి ఆ నలుగురు యువకులు వెళ్లిపోయారు. నగర శివారు ప్రాంతంలో అచేతనంగా పడి ఉన్న ఆ యువతిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మాట్లాడే పరిస్థితిలో లేదని సమాచారం. మద్యం మత్తులో ఉన్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి వాంగ్మూలం, వైద్య నివేదికను బట్టి చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.





Related News