solar power

300 మెగావాట్ల పవర్ ఉత్పత్తికి సిద్ధం

Updated By ManamSun, 09/23/2018 - 00:46
  • నిర్మాణ వ్యయం రూ. 1,360కోట్లు

  • సింగరేణి ఆధ్వర్యంలో తొమ్మిది చోట్ల ఏర్పాటు

  • 12 నెలల్లో పనులు పూర్తి : డైరెక్టర్ (పా) చంద్రశేఖర్

Solar powerహైదరాబాద్: సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి, విద్యుత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా రాష్ట్రంలోని తొమ్మిది ప్రాంతాల్లో రూ.1,360కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు సింగరేణి యాజమాన్యం కార్యచరణ సిద్ధం చేస్తోంది. మొదటి దశలో తొమ్మిది చోట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఏర్పాటుచేసి 300 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సోలార్ ప్లాంట్ ప్రభుత్వ రంగ నిర్మాణ సంస్థ ‘‘సౌత్ ఈస్టర్న్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇండియా’’ తో సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ బోర్డు చర్చలు జరిపింది.

ఉష్టోగ్రతలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు
కొత్తగూడెం, ల్లెందు, మందమర్రి, రామగుండం, మణుగూరు, బెల్లంపల్లి, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో సాధారణంగా 30-38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. వేసవి కాలంలో 45-48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఒకసారి వ్యయం చేస్తే కొన్నేళ్లపాటు మెయింటనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదని సింగరేణి భావిస్తోంది. తక్కువ మ్యాన్ పవర్‌తో విద్యుత్ ఉత్పత్తికి వీలు కలుగుతుంది. వివిధ రకాల సామర్ధ్యాలను ఆధారంగా చేసుకొని ఇల్లెందులో 60 మెగావాట్స్, మందమర్రిలో 60 మెగావాట్స్, రామగుండం-1లో 50 మెగావాట్స్, రామగుండం-2లో 25 మెగావాట్స్, మణుగూరులో 30 మెగావాట్స్, బెల్లంపల్లిలో 30 మెగావాట్స్, కొత్తగూడెంలో 25 మెగావాట్స్, భూపాలపల్లిలో 10 మెగావాట్స్, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్స్, 10 మెగావాట్స్ ప్లాంటులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సింగ రేణి సంస్థ థర్మల్ విద్యుత్‌ను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉత్పత్తి చేస్తుంది.

12 నెలల్లో పనులు పూర్తి: సింగరేణి డైరెక్టర్ (పా) చంద్రశేఖర్
సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్‌తో పాటు సోలార్ విద్యుత్ కూడా ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు అనుమతి పొందింది. అయితే ఫండింగ్ విషయంలో నిర్ణయానికి రానుంది. సోలార్ ప్లాంట్స్ నిర్మాణం విషయంలో ప్రభుత్వ సోలార్ విభాగంతో చర్చించాం. ముందుగా ఫ్రీ బిల్డింగ్, టెండర్స్, టెక్నికల్ సోర్సు తదితర వాటిని పూర్తిచేయాలని భావిస్తున్నాం. వచ్చే 12 నెలల్లో సోలార్ ప్లాంట్స్ పూర్తిచేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సింగరేణి బొగ్గు గనులు ఉన్న తొమ్మిది ప్రాంతాల్లో ఈ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు మొదటి దశ కింద రూ.1,360కోట్ల అంచనాలో పనులు ప్రారంభిస్తామని, దీనికోసం సింగరేణి సీఎండీ ఎన్. శ్రీధర్ ప్రత్యేక చొరవచూపుతున్నారని డైరెక్టర్ (పా) చంద్రశేఖర్ మీడియాకు తెలిపారు.



సౌర విద్యుత్ పెట్టుబడులకు

Updated By ManamTue, 09/11/2018 - 22:22
  • సీఎల్పీ ఇండియా సిద్ధం

Solar powerన్యూఢిల్లీ: సంయుక్త రంగంలో రెండు సౌర విద్యుదుత్పాదన ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సి.ఎల్.పి ఇండియాతో చేతులు కలుపనున్నట్లు విండ్ టర్బైన్ తయారీ సంస్థ సుజలాన్ మంగళవారం వెల్లడించింది. మహారాష్ట్రలోని ధులే 50 మెగావాట్లతో ఒకటి, 20 మెగావాట్లతో మరోటి ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సి.ఎల్.పి ఇండియా, సుజలాన్ గ్రూప్ మధ్య 2018 సెప్టెంబర్ 10న సంతకాలు జరిగాయి. సుజలాన్ నెలకొల్పిన రెండు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్.పి.వి) గేల్ సోలార్ ఫార్మ్స్ లిమిటెడ్, టోర్నడో సోలార్‌ఫార్మ్స్ లిమిటెడ్‌లలో  49 శాతం వాటా స్వీకరించేందుకు సి.ఎల్.పి ఇండియా అంగీకరించింది. భవిష్యత్తులో మిగిలిన 51 శాతం వాటా స్వీకరించే అవకాశం కూడా సి.ఎల్.పి ఇండియాకు ఉంది. హాంకాంగ్ స్టాక్ ఎక్చ్సేంజిలో లిస్ట్ అయిన సి.ఎల్.పి హోల్డింగ్స్ లిమిటెడ్‌కి సి.ఎల్.పి ఇండియా అనుబంధ సంస్థగా ఉంది. భారతీయ విద్యుదుత్పాదన రంగంలో పెట్టుబడులు పెట్టిన పెద్ద విదేశీ సంస్థల్లో అది ఒకటి. అది రూ. 14,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు మాట ఇచ్చింది. సుజలాన్ షేర్ ధర బి.ఎస్.ఇలో రూ. 7.17 వద్ద కోట్ అవుతోంది.



చైనా సోలార్ సెల్స్‌పై దిగుమతి సుంకం?

Updated By ManamWed, 07/18/2018 - 00:37

imageన్యూఢిల్లీ: చైనా నుంచి దిగుమతయ్యే సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌పై ఒక ఏడాదిపాటు 25 సుంకం విధించాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం సిఫార్సు చేసింది. దేశీయ సౌర శక్తి పరికరాల తయారీ పరిశ్రమకు ముప్పుగా తయాైరెన చైనా వస్తువులను ఎదుర్కొనేందుకు ఈ చర్య అనివార్యమని తెలిపింది. సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ధరలు పతనమవడంతో, సౌర శక్తి విద్యుదుత్పాదన కూడా తగ్గింది. భారతీయులు ఆ టెక్నాలజీని అనుసరించడం ఎక్కుైవెంది. ఈ పరికరాల్లో 90 శాతం పైగా చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి.

ప్రతిపాదిత సంరక్షణ సుంకం చైనా, మలేషియాల నుంచి దిగుమతయ్యే వాటికి మొత్తం రెండేళ్ళ కాలానికి వర్తించే అవకాశం ఉంది. రెండో ఏడాది దిగుమతి సుంకాన్ని 20 శాతానికి, తర్వాత ఆరు నెలల కాలానికి 15 శాతానికి తగ్గిస్తారు. అధికారులు జనవరిలో సూచించిన దానికన్నా ఈ ప్రతిపాదిత సుంకం 70 శాతం తక్కువగా ఉంది. మంత్రిత్వ శాఖ ప్రచురించిన ఈ సిఫార్సును ఆమోదం నిమిత్తం ప్రభుత్వానికి సమర్పించనున్నారు. చైనా దిగుమతుల నుంచి దేశీయ సోలార్ వస్తూత్పత్తి పరిశ్రమకు ఉన్న తీవ్ర ముప్పును పరిష్కరించే అభిమతంతో ఈ ఆలోచన చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీస్ (డి.జి.టి.ఆర్) న నివేదికలో పేర్కొంది. 

అనారోగ్యకర పోటీ
చౌకకు వచ్చిపడుతున్న చైనా దిగుమతులు దేశీయ పరిశ్రమను దెబ్బతీస్తున్నాయని భారతదేశపు సోలార్ సెల్, మాడ్యూల్ తయారీదారులు మొత్తుకుంటున్నారు. ‘‘సోలార్ మాడ్యూల్  తయారీదారులు దిగుమతి అవుతున్న మాడ్యూల్స్ నుంచి కఠినైమెన, అనారోగ్యకరైమెన పోటీని ఎదుర్కొంటున్నారు’’ అని నార్త్ ఇండియా మాడ్యూల్ మాన్యుఫ్యాక్చరర్ అసోసియేుషన్ ఒక నివేదికలో పేర్కొంది.  ‘‘భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరుల కార్యక్రమాన్ని వేగవంతం చేసుకునేందుకు దిగుమతులు సహాయపడుతున్నాయి’’ అని చైనా తయారీదారులు చెబుతున్నారు. ‘‘భారతదేశంలో పరిశ్రమలకు నిజైమెన దెబ్బ దిగుమతుల నుంచి లేదు. ఇతర భారతీయ తయారీదారుల ధరల విధానాల్లో ఉంది’’ అని యంత్రాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు, ఎగుమతుల చైనా చాంబర్ ఆఫ్ కామర్స్ పేర్కొంది. 

మొత్తం విద్యుదుత్పాదన సామర్థ్యంలో సుమారు 40 శాతం భాగం 2030 నాటికి  పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే రావాలని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం అది 20 శాతంగా ఉంది. 
ఇతరత్రా వాణిజ్య ఉద్రిక్తతలు ఉన్నా భారత్-చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవలి కాలంలో సుహృద్భావపూర్వకైమెన రీతిలోనే సాగుతూ వస్తున్నాయి. భారతీయ వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలను పెంచే మార్గాల గురించి రెండు పక్షాలు చర్చించాయి. అలాగే చైనా సాఫ్ట్‌వేర్ సర్వీసు సంస్థలకు యాక్సెస్ కల్పించే దిశగా ఇండియా చొరవ చూపుతోంది. అయితే, గత దశాబ్ద కాలంలో వాణిజ్య లోటు చైనాకు అనుకూలంగా తొమ్మిది రెట్లకు పైగా పెరిగి 62.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

 చైనా నుంచి ఎగుమతవుతున్న సోలార్ సెల్స్, మాడ్యూల్స్‌లో  భారతదేశపు వాటా 2016 మొదటి ఆరు నెలల్లో సుమారు ఐదో వంతుగా ఉన్నది ఒక ఏడాది గడిచేసరికి రెండు ఐదో వంతులకు చేరుకుందని డి.జి.టి.ఆర్ పేర్కొంది. చైనా ‘‘భారతీయ మార్కెట్‌ను మరింత వేగంతో లక్ష్యం చేసుకోవడం ప్రారంభించింది’’ అని తెలిపింది.  అయితే, అవాడ లిమిటెడ్ వంటి కొన్ని భారతీయ సౌర విద్యుదుత్పాదన సంస్థలు సుంకాల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. సంరక్షణ సుంకం వల్ల లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన సోలార్ ప్రాజెక్టులు ఇబ్బందులు ఏర్పడతాయని అవాడ సంస్థ డి.జి.టి.ఆర్‌కు తెలిపింది.



సౌరశక్తితో ఉజ్వల భవిష్యత్

Updated By ManamFri, 07/06/2018 - 01:23

imageతెలంగాణ రాష్ట్రంలో సంప్రదా య ఇంధన వనరులైన నీరు, బొగ్గులాంటి శిలాజ ఇంధన వనరుల నిల్వలు క్రమంగా అడుగంటి పోతున్నాయి. జలాశయాల్లో నీటి కొర త వలన హైడల్ పవర్ ఉత్పత్తి కూడా కష్టతరమౌతుంది. బొగ్గు నిక్షేపాలు తరిగి పోతున్నాయి. మనం సాధారణంగా డ బ్బు, నీటిని, పొదుపుగా వాడాలని అంటా రు. కాని ఈనాటి ఆధునిక కాలంలో అన్ని అవసరాలు తీర్చాలంటే ‘విద్యుత్తు’ తప్పని సరిగా మారింది. విద్యుత్తు విలువలు తెలిసిన మనం పొదుపుగా వాడాలని ఇన్నాళ్ళు ప్రచారం చేశాం. దాన్ని ఎంత పొదుపుగా వాడితే అంత మంచిదని, లేకపోతే భవిష్యత్ అంధకారం అవు తుందని ‘నేటి విద్యుత్తు పొదుపు రేపటి జాతికి వెలుగు’ అనే నినాదం కాస్త దశ మార్చుకుని ఎన్న టికీ తరగని ‘సౌరశక్తి’ నుంచి విద్యుత్తు తయారీ చేయాలనే నినాదంతో ముందుకు కదులుదాం. పున రుత్పాదన లేని సంప్రదాయ వనరులు క్రమంగా క్షీణి స్తున్న వేళ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ సిద్ద పునరుత్పాదక వనరైన సౌరవిద్యుత్తుపై ప్రజల్లో అవగా హన పెంచాలని భావిస్తున్నాయి. ఇలా క్రమంగా సూర్య వెలుగుల వైపు వెళ్ళితే ఈ శక్తిలో కరెంటు ఉత్పత్తి జరిగితే ఇటు వినియోగదారులు, అటు పాలకులు తీవ్రమైన సమ స్య నుంచి బయట పడడం ఖాయం. మరోమార్గం లేదు. సౌరవిద్యుత్తు వైపే అనివార్యతగా వెళ్లడానికి వీలైనన్ని రా యితీలు ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇలాంటి విపత్కర కాలంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి, వాడకం, సౌక ర్యాలు, రాయితీల గూర్చిన అవగాహనను ప్రభుత్వాలు క ల్పించాలి. ప్రజలు అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత క్రమేణా సౌరవెలుగులు సాకారం చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం భారీ స్థాయిలో సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యం పెట్టు కొని ముందుకు వెళ్తోంది. ఇప్పటి వరకు పెద్దపెద్ద నగరాల్లో వాడేవారు. కానీ క్రమేణా చాలాచోట్ల సౌరవిద్యుత్తును ఉత్ప త్తి చేస్తున్నారు. ఇళ్లల్లో, అపార్ట్‌మెంట్లలో వీటిని వాడుతూ కరెంటు ఆదా చేస్తున్నారు. ఒక కిలోవాట్ పెట్టుకుంటే రోజుకు 4 యూనిట్లు సౌర విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. నగరంలోని అనేక కార్యాలయాలు, భవనాలపై, జనాలు సంచరించే ప్రాంతాలు, నివాస సముదాయాలపై అటవీ ప్రాంతంలో ఫలకలు ఏర్పాటు చేసుకొని స్వయం ప్రత్యు త్పత్తిని సాధిస్తున్నారు. రహదారులు, మార్కెట్ యార్డుల్లో పెట్రోల్ పంపుల్లో, హోటళ్లలో సౌర వెలుగుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల గురించి ప్రచారం బాగా చేయాలి. దీని వాడకం ఎంతో అవసరమని అవగాహన కల్పించాలి. ప్రజలలో అవగా హన పెంచి దీని వాడకాన్ని పెంచాలి. అదే సమ యంలో రాయితీలను కూడా కల్పిస్తున్నప్పటికీ, వీటిని సరళతరం చేయాలి. ప్రపంచంలోనే అత్యధిక సౌర విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్న నాలుగో దేశంగా మనం స్థానాన్ని సాధించగలిగాము. గిగావాట్లలో చైనా 130.4, అమెరికా 85.3, జపాన్ 63.3, భారత్ 57.4, జర్మనీ 48.4 ఉత్పత్తిని చేస్తున్నాయి. ప్రపం చంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్తు పార్కు తమిళ నాడులోని కమూతిలో ఉంది. ఇది 2500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ పార్కులో 27 లక్షల సౌర ఫలకలు ఏర్పాటు చేశారు. అలాగే మన భారతదేశంలో సౌర విద్యుత్తు ఉత్పత్తి క్రమేణా ఇలా పెరుగుతూ వస్తుంది. 2013-14లో 3.35, 2014-15లో 4.60, 2015-16లో 7.45, 2016-17లో 12.09, 2017-18లో 25.87 (టెర్రావాట్ పర్ అవర్) ఇలా పెంచుకుంటూ వెళ్తున్నాం.

ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు పెరుగుతున్న విద్యు త్తు వాడకం, అవసరాలు, ఇలా పవర్‌గేమ్ పరేషాన్ ముం దు డిమాండుకు తగ్గ ఉత్పత్తి కావాలంటే? ప్రపంచ నేత (పాలకు)ల నుంచి మనదేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్య మంత్రి వరకు ఒకే ఒక్కమార్గం... అదే సౌర విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్లాంట్ల ఏర్పాటుకు పూనుకోవడం. ఈ విధానంపై అవ గాహన చేస్తూ చైతన్యం, ప్రోత్సాహం, రాయితీలు కల్పించా ల్సిన బాధ్యత పాలకులదే. దేశంలో మన రాష్ట్రం మినహా యిస్తే చాలా రాష్ట్రాల్లో విద్యుత్తు విపత్తును ఎదుర్కొంటు న్నాయి. విద్యుత్తు ఉత్పాదక వనరులైన బొగ్గు, నీరు, గ్యాస్, అణు ఇంధనాల వనరులు నానాటికి తగ్గిపోతున్నాయి. తగు జాగ్రత్తలతో ప్రత్యామ్నాయ సౌర విద్యుత్తు ఉత్పత్తిని పెంచు కోకపోతే, మునుముందు చీకటిగా మారుతుంది. సౌర వి ద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు తొలుత భారీఖర్చులైనా ఆ తర్వా త తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30%, 20% శాతంగా రాయితీని ఇస్తున్నాయి. 50% శాతం లబ్ధిదారులు భరించాలి. ఈ అవకాశాలను అందిపుచ్చుకొని వినియోగ దార్లు ముందుకు వస్తున్న వేళ, సౌర విప్లవానికి తగ్గట్టుగా సౌర విద్యుత్తు ప్లాంట్ల రేట్లు దిగివస్తున్నాయి. ప్రభుత్వాలు సౌర విద్యుత్తు పాలసీని క్రమేణా మార్చుకుంటున్నారు. గృహ వాడకానికే కాకుండా, వ్యవసాయ రంగంలో సాగు నీ రు కోసం తెలంగాణ రైతాంగ నీటి వనరులైన బోరులు, బావుల నుంచి నీరును తోడటానికి సోలార్ పంపుసెట్లను వాడుకలోకి తెస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ విధా నం ఖర్చుతో కూడుకున్నా తర్వాత లాభాలు వస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ రంగానికి రాయితీలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అవగాహన లేక చాలామంది వెనుకబడు తున్నారు. ఏమాత్రం పొద్దు కనబడినా వెలుతురు తోడై సౌర విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమౌతుంది. ఎండ తీవ్రతను బట్టి పెరుగుతుంది. ప్రజలు, ప్రభుత్వాలు సౌరవిద్యుత్తు తయారీ, వాడకంకు సిద్ధమైతుండడం శుభపరిణామమని చెప్పక తప్పదు.

మనదేశం భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నందు వలన ప్రపంచంలో ఏ దేశానికి లేని అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థానంలో సౌరవిద్యుత్తు కేంద్రాలు విరివిగా ఏర్పరచవచ్చు. అలాగే మన తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ఏ రాష్ట్రానికి లేని ప్రత్యే క అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వి నియోగపరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగం లోకి దిగి సౌరవిద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు పూనుకుంది. సౌరవిద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. ఎత్తైన ప్రాంతాలు, కొండలు, గుట్ట లు, మైదానాలు సర్వే చేసి సుమారు 30 వేల ఎకరాల భూ మి ఉన్నట్లు గుర్తించారు. పవర్ ప్లాంట్లకు ఉపయోగపడే ఏ ఒక్క అవకాశాన్ని వదలకూడదని ఆదేశాలు ఇచ్చారు. అం దులో సుమారు 10వేల ఎకరాలకు పైగా సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రై వేట్ వ్యాపారుల, కంపెనీల భాగస్వామ్యంతో ఉత్పత్తి కేం ద్రాల ఏర్పాటు బాధ్యతలు పరిశ్రమల శాఖకు అప్పగిం చింది. ఏర్పాటు చేసిన పలకలపై వెలుతురు, ఉష్ణశక్తి పడగానే ఉత్పత్తి మొదలౌతుంది. దగ్గరలోని విద్యుత్తు కేంద్రాలకు అనుసంధానం చేసి వాడుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం యుద్ధప్రాతిపధికపై సౌరవిద్యుత్తు ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధి పరచాలని నిర్ణయించుకున్నాయి. మన రాష్ట్రం విద్యుత్తు కొనుగోలు చేసి నేడు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తోంది. ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో అనే దశ నుంచి 24 గంటలు విద్యుత్తు పోని దశకు చేరుకున్నాము.

అయినా ముందు చూపుతో మన పాలకులు  ఎప్పటికీ తరగని సూర్య శక్తి నుంచి సౌర విద్యుత్తు ఉత్పత్తిని చేయాలనే నిర్ణయం అభినందనీయం. ప్రజలు ప్రభుత్వం ఇచ్చే రాయితీలు అవకాశాలను అందిపుచ్చుకుని దేశంలోని సహజంగా, భౌగోళికంగా మనకున్న అవకాశాలను సంపూ ర్ణంగా వినియోగించుకుని దేశానికి ఆదర్శంగా నిలవాల్సి ఉంది. మనము ఎన్నో కొరతలతో జీవితాన్ని గడుపుతు న్నాము. కానీ సౌరశక్తిలో మనకు కొరతలేదు. అలా నాణ్య మైన వాతావరణ, పర్యావరణ కాలుష్యం లేని ఈ విధానం లో సౌర విద్యుత్తు ఉత్పత్తికి, వాడకానికి మనమే బాధ్య తగా ముందునడుద్దాం. సౌర విద్యుత్తు తప్ప వేరే మార్గం లేదని బోధపడిన వేళ ప్రభుత్వాలు దీని ఆవశ్యకతను, అని వార్యతను గమనించి ఉధృతంగా చైతన్యం, ప్రచారం, ప్రో త్సాహం, రాయితీలు కల్పించాల్సి ఉంది. పాలకులు స్వంత ప్రయోజనాలకు ఇస్తున్న ప్రచార పటాటోపం కన్నా దీనిపై ఎక్కువ దృష్టిపెట్టాలని సమస్య తీవ్రత రీత్యా పాలకుల బాధ్యతను మరువరాదు. ‘‘నేటి సౌర విద్యుత్ ఉత్పత్తి  రేపటి జాతి ఉజ్వల భవిష్యత్తు’’            

- మేకిరి దామోదర్
9573666650





Related News