Teachers

గురువు గుప్పిట్లోనే దేశ భవిష్యత్

Updated By ManamFri, 10/05/2018 - 01:38

imageఅక్టోబర్ ఐదో తేదీన ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. 1966 అక్టోబర్ 5న పారిస్‌లో జరిగిన అంతర్జాతీయ సద స్సులో ఉపాధ్యాయుల హోదా గురించి విశిష్టమైన తీర్మానం ఆమోదించబడింది. ఆ రోజును ఏటా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని 1994లో యునెస్కో ప్రకటిం చింది. ఏటా ఒక ప్రత్యేక నినాదంతో ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరుగుతుంటాయి. అదే సందర్భంలో విశాలమైన విద్యారంగాన్ని అనేక కోణాల నుంచి పరిశీలిం చాల్సి ఉంది. విద్యారంగంలో ఉపాధ్యాయుల, విద్యార్థుల, తల్లిదండ్రుల స్థితిగతులతోపాటు అంతర్జాతీయంగా జరుగు తున్న అనేక పరిణామాలు, విధానాల ప్రభావం వలన నా ణ్యమైన విద్య అందుతోందా? గౌరవప్రదమైన ఉపాధ్యా య స్థానానికి విలువలు కాపాడబడుతున్నాయా? విద్యా రంగం ఒత్తిడులకు గురవుతుందా? వంటి అనేక ప్రశ్నలు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. నేడు విశ్వవ్యాప్త విద్యారం గం, విశాల ప్రయోజనాలు, ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యా యుల పాత్ర, బాధ్యత, స్థానం గురించి చర్చించుకునే రో జు. మనదేశంలో ఉపాధ్యాయ దినోత్సవం అంటే అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గుర్తుకువస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 దేశాలు అక్టోబర్ ఐదు నుఅంతర్జాతీయ గురుపూజోత్సవాన్ని జరుపుకుంటున్నా యి. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ ముఖ్య ఉద్దేశం.. భవిష్యత్ తరాలకు విద్యా ప్రణాళిక ఎలా ఉండాలి అనే అంశంపై ఉపా ధ్యాయుల మద్దతు కూడగట్టడం.

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అని తల్లిదండ్రుల తరువాత గురువులనే ప్రత్యక్ష దైవంగా భావిimage స్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలను కనడం.. పెంచడం వర కే బాధ్యత. అభివృద్ధి పథంలో నడిచే ప్రతి సమాజంలో గురువుల పాత్ర తప్పక వుంటుంది. వారు పాఠ్యాంశాలను బోధించ డంతోనే సరిపెట్టుకోరు. ప్రపంచ గమనాన్ని అవగతం చేయడం ద్వారా విద్యార్థుల నడవడికను తీర్చిదిద్దుతారు. ఉన్నతమైన ఆశయాలను ఉద్బోధిస్తారు. ఆ ఆశయ సాధన దిశగా దిశానిర్దేశం చేస్తారు. ప్రతి గురువూ తన వ్యక్తిత్వం ద్వారా విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తారు. అలాంటి గురువు ఎప్పటికీ విద్యార్థుల మనసుల్లో దేవుడుగా నిలిచిపోతారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి రత్నాలుగా మలిచేది, బండరాయిని రమణీయమైన శిల్పా లుగా చెక్కేది... అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేది... సమాజ స్థితిగతులను అధ్యయనం చేసి నవతరానికి ప్రగతిబాటను పరిచేది... ఒక్క ఉపాధ్యాయుడే. అందుకే ఆయనకు అంతటి గౌరవం. గురువుగా అత్యున్నత పీఠం. తన శిష్యులను ఉన్నత శిఖరాలకు నడిపించి... తాను మాత్రం నేలపైనే వుండి వారి ఎదుగుదలకు సోపాన మౌతాడు. మార్గదర్శకమౌతాడు. మనం మాట్లాడే మాటల లో గురువు శక్తి వుంటుందని, మనం మాట్లాడే శక్తిలోను గురువు ప్రభావం ఉంటుందని, మనలోని అజ్ఞానాంధకారా న్ని పోగొట్టడానికి గురువే ఆధారమని, లోకంలో ఏ పని చె య్యాలన్నా గురువే ఆదర్శమని, అందువల్ల గురువు లేనిదే ఏ శక్తీ లేదని అర్థం.. మనో మేధోపరమైన, జాతిపరమైన, సంస్కృతి పరమైన, శాస్త్ర సంబంధమైన వారసత్వాన్ని ఒక తరం నుంచి మరోతరానికి అందించే వాటిని విద్యా లయా లు అంటారు మాజీ రాష్ట్రపతి, విద్యావేత్త సర్వేపల్లి రాధా కృష్ణన్. విద్యాలయాలు బండిలాంటివి అయితే వాటిని నడిపించే యిరుసులు మన గురువులని అన్నారు. ఒకతరం తరలించాలన్నా, విలువల పతనంతో అంతరించాలన్న అది గురువుతోనే. ఏ దేశంలోనూ దక్కని గౌరవం ఉపాధ్యాయు లకు మన సమాజంలో దక్కుతుంది.

జీవితంలో విజయం సాధించాలని కోరుకునే వారు ఉండరు. కానీ కొందరే విజయతీరాన్ని చేరగలరు. అనుకు న్న లక్ష్యం చేరడం సులవు కాదు.... అలాగని అసాధ్యం కా దు. ఓ సామాన్యుడు విజేతగా మారిన ప్రతి నేపథ్యం వెనుక ఓ గురువు ఉంటాడు. గురువు అంటే నడిపించే నాయకుడు.. ప్రేరణగా నిలిచే మార్గదర్శకుడు. నరేంద్రుడు అనే సామాన్యమైన ఒక యువకుడిని భారత జాతికే స్ఫూరి ్తగా నిలిపి, ప్రపంచ యవనిక పైన వివేకనందుడిగా నిలిపి  అందరి మదిలో ఉన్నత స్థానంలో నిలిపింది అతడి  గురువు రామక్రిష్ణ పరహంస. గురువు గొప్పతనం అలాంటింది. 
గురువు, దేవుడు ఎదురైతే నేను ముందుగా గురువుకే వందనం చేస్తానంటాడు కబీర్. గురువులేని విద్య గుడ్డి విద్యగా భావించి ఏకలవ్యుడు సైతం గురువు ప్రతిమ సాక్షి గా విలువిద్యనభ్యసించాడు. ఒక ఇంజనీర్.... ఒక డాక్టర్.... ఒక లాయర్..... నిర్లక్ష్యం వహిస్తే సమాజానికి కొంత నష్టమే వాటిల్లితుంది. ఉపాధ్యాయుడు అలాచేస్తే ఓ భావి తరం నష్టపోతుంది. మారుతున్న కాలం మాస్టార్ రూపు రేఖలను, విలువలని మార్చేస్తుంది. బడే గుడి.. పిల్లలే దేవు ళ్లు అనే ప్రేమాభిమానాలు నానాటికి సన్నగిల్లుతున్నాయి. అక్కడక్కడ జరిగే కొన్ని సంఘటనలు, ఉపాధ్యాయుడి ప్రవ ర్తన సభ్యసమాజాన్ని బాధిస్తున్నాయి.  

కంప్యూటర్‌లు, వీసీడీలు, ప్రయోగశాలలు, ఎల్‌సీడీలు, ప్రోజెక్టరులు ఇలా అత్యాధునిక పరికరాలు ఎన్ని అందు బా టులోకి వచ్చిన గురువు చెప్పిన మాటలే మనకు అనుభవా ల మూటలు మిగులుస్తాయి. పుస్తకంలో పాఠాలే కాదు... జీవితంలో నేర్వాల్సిన గుణపాఠాలు నేర్చుకోవాలంటే గురు వు వద్దకు చేరాలి. ఏ వృత్తికి లేని ఇతివృత్తం ఉపాధ్యాయ రంగానిది. ఏ వ్యక్తికి లేని శిష్యకోటి పరివృత్తం ఉపాధ్యాయు నికి మాత్రమే సొంతం.

లోకంలో తండ్రీకొడుకుల సంబంధం, అట్లాగే భార్యా భర్తల, తల్లీకొడుకుల సంబంధం వలె గురు - శిష్య సంబం ధం కూడా స్థిరమైనది, పవిత్రమైనది. గురువు శిష్యునికి విద్యాబుద్ధులను నేర్పించడమే కాకుండా అతడు తన ను మించిపోయేంతగా అభివృద్ధి చెందాలని, ఆకాశమే హద్దుగా ఎదగాలని, చివరకు తాను కూడా శిష్యుని చేతిలో పరాజ యం పొందేంతగా శిష్యుని శ్రేయస్సును గురువు కాం క్షిసా ్తడు. శిష్యుడు కూడా తనకు పునర్జన్మ వంటిదైన జ్ఞానజన్మ ను ప్రసాదించిన గురువు పట్ల కాలపరిమితి లేకుండా జీవి తమంతా కృతజ్ఞతాభావాన్ని కలిగివుండడమే కాకుం డా, గురువు ప్రశస్తిని లోకానికి తెలియజెప్పే రీతిలో ప్రవర్తిస్తాడు.

గురువు అంటే బోధకుడు కాదు.. మీ అనుభూతిలో లేని దాన్ని మీకు మేధాపరంగా బోధించలేము. మిమ్మల్ని వేరేస్థాయి అనుభూతిలోకి తీసుకువెళ్ళి మాత్రమే అది మీకు బోధించగలం. ఒక వ్యక్తి అనుభవాన్ని ఒక దశ నుంచి వేరొ క దశకు తీసుకుపోవాలంటే అతని కంటే తీవ్రం, శక్తిమంతం అయిన స్థాయిలో ఉన్న పరికరం లేక సాధనం అవసరం అవుతుంది. ఆ సాధనం లేదా పరికరాన్నే ‘గురువు’ అని పిలుస్తున్నాం. దీనివల్లే గురుశిష్య సంబంధం అతి ముఖ్యమై నదిగా, పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఎవరైతే శక్తి పరంగా మీకంటే ఉన్నత స్థాయిలో ఉంటారో, వారే అలా మిమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్ల గలరు. వేరెవరికీ అది సాధ్యం కాదు.

విద్యా వ్యవస్థ శరవేగంగా మారిపోతున్న ప్రస్తుత తరు ణంలో ఇలాంటి గొప్ప గురువుల అవసరం నేటి సమాజా నికి ఎంతో వుంది. అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు ఉపాధ్యాయులు- విద్యార్థుల మధ్య సంబంధాలు కొన సాగ డం లేదు. వారిపట్ల గురుశిష్య సంబంధాలు మాయ మై  డబ్బు సంబంధాలను మాత్రమే మిగుల్చుతున్నాయి. ఐతే మనం పురోగమనంలో ఉన్నామా, తిరోగమనంలో ఉన్నా మా అనే ఆశ్చర్యకరమైన సందిద్గావస్తలో ఉన్నమాట నిజం.
నేటి కార్పొరేట్ విద్యావ్యవస్థలో ర్యాంకులే పరమా వధి కావడం వల్ల  ఉపాధ్యాయుల పట్ల చూపించాల్సిన విధేయ త, గౌరవాభిమానాలు తగ్గుముఖం పట్టాయి.   ఉపాధ్యా యుడు నిరంతరం నేర్చుకుంటూ ఉంటే తప్ప భావితరా లను ప్రభావితం చేయలేడు. 

- కాళంరాజు వేణుగోపాల్ 
ఉపాధ్యాయుడు, 8106204412
(నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం)జగన్ పాదయాత్రకు వెళ్లారని..

Updated By ManamTue, 10/02/2018 - 13:24

YS Jaganవిశాఖపట్నం: ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ చేస్తోన్న ప్రజా సంకల్ప యాత్రల్లో పాల్గొన్నారని తొమ్మిది మంది ఉపాధ్యాయులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆదివారం వారు జగన్ పాదయాత్రలో పాల్గొనగా.. వారిని సస్పెండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా విద్యాశాఖాధికారి లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు వెలవరించారు. ఈ ఉత్తర్వులు ఇప్పుడు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. 

అయితే తాను ముఖ్యమంత్రి అయితే నెలరోజుల్లోనే కాంట్రిబ్యూటరీ ఫించన్ పథకాన్ని రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన ఆ తొమ్మిది మంది జగన్‌ను కలిసి కృతఙ్ఞతలు చెప్పారు. వీరంతా జగన్‌ను సీఎం చేసేందుకు కలిసి పనిచేస్తామని నినాదాలు చేసినట్లు పలు వార్తాపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన లింగేశ్వరరెడ్డి ఆ ఉపాధ్యాయులను విధుల నుంచి తప్పించారు. గవర్నమెంట్ సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకే వీరిపై చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు.టీచర్లకు.. ఇతర పనులే ఎక్కువ!

Updated By ManamFri, 09/21/2018 - 22:44
  • బోధనలో గడిపేది కొంత సమయమే

  • 220 రోజుల్లో 42 రోజులే క్లాసులో పాఠాలు

  • మిగతా రోజుల్లో ఎన్నికలు, సర్వేల విధుల్లో..

Teachersన్యూఢిల్లీ: ఉపాధ్యాయులు.. విద్యార్థులకు పాఠాలు బోధించడమే ప్రధాన విధి! కానీ.. అందుకు విరుద్ధంగా వారు ఇతర కార్యక్రమాల్లోనే ఎక్కువగా పని చేస్తున్నారని తాజా నివేదికలో వెల్లడైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏడాదిలో 220 రోజుల్లో టీచర్లు విద్యాబోధన చేయాల్సి ఉంది. కానీ.. వారు 42 రోజులే పాఠాలు చెబుతున్నారని తేలింది. అంటే.. 19 శాతం మాత్రమే వారు విద్యాబుద్ధలు చెప్పడంలో గడుపుతున్నారని, మిగతా సమయం ఎన్నికలు, సర్వేలు, పల్స్‌పోలియో, మధ్యాహ్న భోజన రిజిష్టర్ల నిర్వహణ.. ఇలా ఇతరత్రా కార్యకలాపాల్లో మునిగితేలుతున్నారని తేలింది. ‘ఉపాధ్యాయులు.. బోధన కార్యక్రమాలు.. విద్యా వ్యవస్థపై ప్రభావం’ అన్న పేరుతో రూపొందించిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం.. 2015-16లో టీచర్లు కేవలం 42 రోజులపాటే విద్యాబోధనవ ఇధుల్లో గడిపారు. 2009నాటి  ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం.. ఒక విద్యా సంవత్సరంలో 1-5 తరగతులకు 200 పనిదినాలు, 6-8 తరగతులకు 220 పని దినాలు ఉండాలి. ఆ మేరకు టీచర్లకు విద్యా బోధన చేయాలన్నమాట. వారానికి సగటున 45 గంటలు పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. కానీ.. ఇందుకు భిన్నంగా ఈ పనిదినాల్లో దాదాపు 81 శాతం.. అంటే సుమారు 180 రోజులు వారు ఇతర విధులు అంటే మండలస్థాయి అధికారి విధులను నిర్వహించాల్సి వస్తోంది. ఈ 81 శాతంలో 31 శాతం బోధనేతర కార్యక్రమాల్లో, 6.5 శాతం శాఖాపరమైన కార్యక్రమాల్లో వారు తలమునకలు కావాల్సి వస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14.67 లక్షల  పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 10.7 లక్షలు ప్రభుత్వ, 3.49 లక్షలు ప్రైవేటు స్కూళ్లు. ప్రభుత్వ పాఠశాలల్లో 11 కోట్ల మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలల్లో 7.43 కోట్ల మంది  విద్యను అభ్యసిస్తున్నారు.విద్యావ్యాపారంలో టీచర్లూ సమిధలే

Updated By ManamTue, 09/11/2018 - 01:40

Teachersప్రైవేటు బడుల్లో వెట్టి కూలీల్లా పనిచేస్తున్న టీచర్ల వ్యథ ఇది. దశాబ్దాల వ్యథార్థ జీవితాలు మెల్లగా రోడ్డెక్కుతు న్నాయి. గొంతులు సవరించుకుంటున్నాయి. అమానవీయ విద్యా వ్యాపారానికి ఒకపక్క రోజుకొక్క బిడ్డ రాలిపోతుంటే, మరో పక్క టీచర్లు జీతమంటే ఏమిటో, జీవన భద్రత అంటే ఏమి టో తెలీకుండా తాము శిథిలమవుతూ, అనివా ర్యంగా విద్యార్థుల్ని కూడా ఆ రొంపిలో వేధిస్తున్న ఈ పరిస్థితి మారాలని మంద్ర స్వరంలోనైనా ఇప్పుడు మాట్లాడుతు న్నారు. అనేక ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఇన్నాళ్ళకు ఇప్పు డొక యూని యన్ పెట్టుకున్నారు. ఇది కూడా ఎన్నాళ్ళు ఉండనిస్తారో తెలీదు కానీ కిందా, మీదా పడుతూ, చిన్నా చితకా సహకారాలు తప్ప పెద్దగా ఎవరి దన్ను లేకపోయినా ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకు దిగారు. వీరిని సంఘటితం కాకుండా చేయడానికి ప్రైవేట్ స్కూల్ యజమానులు చకచకా కదులుతున్నారు చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రైవేట్ స్కూల్ టీచ ర్లకు రోజు కూలీ కూడా గిట్టదు. ఉదయం ఆరుగంటల నుం డే క్లాసులు మొదలు. రాత్రి తొమ్మిది గంటల దాకా చాకిరీ. ఇదికాక రోజూ పరీక్షలు, ఆన్సర్ పేపర్ల వాల్యుయేషన్. ఎప్పు డో తప్ప సెలవులుండవు. ఆదివారం పదో తరగతికి స్పెషల్ క్లాసెస్, స్టడీ అవర్స్. ఎప్పుడన్నా లీవడిగితే తమ శరీరంలో భాగాన్ని కోసిమ్మన్నట్లు మేనేజిమెంట్ విలవిల్లాడి పోతుంది. బడులు చూస్తే ఇరుకిరికు గదుల్లో పిల్లలను కిక్కిరిసి పడేసే కోళ్లఫారాలు. మైదానం ఉండదు, చెట్లు ఉండవు, గాలి చొర బడదు, వెలుతురు కూడా తక్కువే. ప్రైవేట్ స్కూళ్లొచ్చాక ఆటలు, వ్యాయామం అనేవి ఉంటాయని కూడా విద్యా ర్థులు, తల్లిదండ్రలు ఎప్పుడో మర్చిపోయారు. చూపుడుకు ఒక పీఈటీ టీచర్ ఉంటారు గాని ఆయనకు ఉండేది పిల్లలు అల్లరి చేస్తే అదుపులో పెట్టే పోలీసు పనే. ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. కార్పొరేట్ విద్యాసంస్థల్లో, హాస్టళ్లలో ఈ హింస 24 గంటలూ ఉంటుంది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వందల సంఖ్యలో పిల్లలు చనిపోతున్నా ప్రభుత్వాలకు సిగ్గు లేదు, బాధ్యత అంతకన్నా లేదు. 

ఈ విద్యాసంస్థ మౌలిక సౌకర్యాల గురించి ఎంత మాట్లాడినా తక్కువే. మామూలుగా పత్రికలన్నీ ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు లేవు అని రాస్తుంటాయి. నిజానికి ప్రైవేటు బడులు అధ్వానంగా ఉన్నాయి. విద్యార్థులకే కాదు, టీచర్లు ప్రశాంతంగా కూర్చోడానికి కూడా సరైన గదులు ఉండవు. మహిళా టీచర్లకు టాయిలెట్లు కూడా సరిగా ఉండవు. స్టాఫ్ రూంలో నలుగురూ కలిసే పరిస్థితి ఉండదు. చాలా చోట్ల అసలు స్టాఫ్ రూమే ఉండదు. రోజంతా నిలబడీ నిల బడీ ముప్పై ఐదేళ్లకే మడిమ నొప్పులొచ్చి, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయే పరిస్థితి. కాలేజీల విషయానికొస్తే ఏప్రిల్, మే నెలల్లో క్లాసులుండవు కాబట్టి స్టాఫ్ రానక్కర్లేదు. అంటే ఆ రెండు నెలలూ జీతాలుండవు. లేదా ఆ రెండు నెలలూ ఊర్లు తిరిగి పిల్లల్ని తమ స్కూళ్ళలో చేర్పించమని ప్రచారం చేయాలి. ఇటీవలి కాలంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు తప్పనిసరిగా కొంతమంది విద్యార్థులనైనా చేర్పిస్తేనే ఉద్యోగాలుంటాయని ఆర్డర్లు వేస్తున్నారు. ‘మీకు అన్నం పెట్టే సంస్థను మీరే కాపాడుకోవాలి, లాభాలు తెచ్చిపెడితేనే మీకు జీతాలివ్వగలం’ అంటున్నారు. నోరెత్తితే బైట నిరుద్యోగులు చాలామంది వెయిటింగ్, నువ్వు వెళ్లిపోవచ్చు. 

చాలామంది టీచర్లు ఏకకాలంలో రెండు మూడు స్కూళ్ల లో పనిచేస్తారు. స్కూల్ యాజమాన్యాలకు ఏదో పద్ధతిలో క్లాసులు జరిగితే సరి. ఫుల్ టైం పేమెంట్ కన్నా ఇలా పార్ట్ టైం వాళ్ళతో నడిపిస్తే సరిపోతుంది అనుకుంటారు. ఒకే స్కూల్లో పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చేయడం కన్నా వేరు వేరు స్కూళ్ళలో గంటల చొప్పున ఒప్పుకుంటే కొంతైనా డబ్బులొస్తాయి. కానీ ఊర్లో నాలుగు మూలల ఉండే నాలు గు స్కూళ్ళకు రోజంతా పరుగులు తీయాలి. గడియారం ముల్లు జీవితం. ఇంత మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వరు. సర్టి ఫికెట్లు చూపిస్తే పనిలో పెట్టుకుంటారు. ఇచ్చినంత తీసుకొని నచ్చినట్లు పనిచేస్తే ఉంచుకుంటారు. లేదంటే వద్దు పొమ్మం టారు. ఇక ఇంక్రిమెంట్లు, పిఎఫ్ అంటే అవేమిటి అని అడిగే పరిస్థితి.

ఈ విద్యా వ్యాపారస్తులంతా ఎప్పుడో యూనియన్ పెట్టే సు కున్నారు. దానిపేరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్. ఇది ప్రభుత్వ అధికారులతో లాబీలు చేయడానికి, విద్యార్థి సం ఘాలను ఎదుర్కోడానికీ, ఒకరి దోపిడీకి ఒకరు సహకరిం చుకోడానికి ఒక ఏర్పాటు. వీరిలో వీరికి ఎన్ని వైరుధ్యాలున్నా, ఒకరికొకరికి శత్రుపూరిత పోటీ ఉన్నా ఉమ్మడి ప్రయో జనం కోసం అసోసియేషన్‌గా కలుస్తారు. ఇప్పుడుండేది కార్మిక సంఘాలు కాదు. అన్నిచోట్లా యజమానుల సంఘా లు, పెట్టుబడిదారుల సంఘాలే. శ్రమదోపిడికి గురయ్యే కార్మికుల మధ్య వైరుధ్యాలను, పోటీని, ఈర్షా ద్వేషాలను పెంచిపోసిస్తూ యజమానులు మాత్రం ఎవరికే ఇబ్బంది వచ్చినా ఐక్యంగా ఉంటారు. ప్రైవేట్ స్కూళ్లలో ఇదే జరు గుతోంది. (స్కూళ్ళు అన్నప్పుడల్లా కాలేజీలు అని కూడా చదువుకోండి) ప్రభుత్వ యంత్రాంగానికి ప్రైవేట్ విద్యాసంస్థల మీద నియంత్రణ ఏమాత్రం లేదు. ఒకవేళ పొరపాటున ఏ అధికారైనా రూల్స్ ఫాలో కమ్మంటే ‘మేం స్కూళ్ళు నడిపేదెట్లా’ అని విచిత్రంగా అడుగుతారు. రిజిస్టర్ దగ్గరి నుంచి పరీ క్షలు, రిజల్ట్స్ దాకా అడుగడునా మోసాలే. ఒక ఫ్రాడ్ విద్యా వ్యవస్థ పునాది మీద చదువులు నేర్చుకునే విద్యార్థులు ఎటు వంటి పౌరులుగా తయారవుతారోనన్న కనీస పట్టింపు ప్రభు త్వానికి ఉండదు. ఇక టీచర్లు తమ బాధను  ఎవరికి చెప్పా లి, ఏమని చెప్పాలి? చెప్పుకుంటే ఉన్న ఉద్యోగం ఊడిపోయే పరిస్థితి.  

ఈ స్థితి భరించీ భరించీ చివరికి ఒక యూనియన్ పెట్టు కోగానే సభ్యులను స్కూల్ యాజమాన్యాలు బెదిరించడం మొదలుపెట్టాయి. యజమానులకు సంఘం ఉండొచ్చు గాని కార్మికులకు ఉండకూడదట. ఇక్కడ టీచర్లు కార్మికులే. చాక్ పీస్ దుమ్ముతో సావాసం చేస్తూ, అరిచీ అరిచీ గొంతులు అరిగిపోయేలా, గంటల తరబడి నిల్చొని చాకిరీ చేసే కార్మి కులు. ఒక వర్గంగా సంఘటితం కాలేని కార్మికులు. సహజం గానే సంఘటితమయ్యే ప్రయత్నం చేస్తుంటే ప్రైవేట్ స్కూల్ యజమానుల అసోసియేషన్ టీచర్స్ యూనియన్ నాయకు లను టార్గెట్ చేసింది. ఎవరైనా పొరపాటున కాస్త మంచి కరస్పాండెంట్లు వీళ్ళను ఉద్యోగంలో ఉంచుకుంటే అసోసియే షన్ వాళ్ళ మీద ఒత్తిడి తెస్తోంది. ఇలాంటి ఎన్నో సవాళ్ళ మ ద్య టీచర్లు రాష్ట్రవ్యాప్త ధర్నాలకు సిద్ధమయ్యారు. ప్రైవేట్ విద్యాసంస్థలు కనీస నిబంధనల పాటించాలని వీళ్లు డిమాం డ్ చేస్తున్నారు. ప్రధానంగా జి.వో. ఎం.ఎస్. నెం.1 అమల య్యేలా చూడాలని అడుగుతున్నారు. స్కూలు ఆదాయంలో 50 శాతం ఉపాధ్యాయిలకు జీతాలుగా చెల్లించడం, 15 శాతం ప్రావిడెండ్ ఫండ్, భీమా వంటి సౌకర్యాలకు కేటా యించడంతో పాటు ఈ జీవో ఒక స్కూలుకు ఉండవలసిన మౌలిక సదుపాయాల గురించి చెప్తుంది. తక్షణంగా వీళ్లు కోరుకునేది ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు ఇవ్వా లని, అధిక పనిగంటలు నియంత్రించాలని. అట్లాగే టీచర్లకు ఉద్యోగ భద్రత పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ సదుపాయాలు కల్పించా లని అడుగుతున్నారు.

ప్రైవేట్ టీచర్ల, లెక్చరర్ల యూనియన్‌పై ఉక్రోషం పట్ట లేక ఒక ఊర్లో (ప్రొద్దుటూరు) ప్రైవేట్ స్కూల్ యాజమా న్యాలు నిరసన ర్యాలీ తీశాయి. అది కూడా యూనియన్ ధర్నా చేస్తున్న సమయంలోనే. పైకి వీళ్ళ నిరసన బందులకు వ్యతిరేకంగానని చెప్పారు. ఉద్దేశం మాత్రం తమ టీచర్లు యూనియన్ తరపున జరుగుతున్న ధర్నాకి వెళ్లకుండా చేయ డం. బందుల వల్ల క్లాసులు నష్టపోయి సిలబస్ పూర్తి చేయ డానికి ఇబ్బందులు పడుతున్నామని, పైగా సెలవులు కూడా ఎక్కువగా ఉన్నాయని, విద్యార్థులు, రాజకీయ పార్టీలకు తో డు ఇప్పుడు టీచర్లు కూడా యూనియన్లు, బందులంటే విద్యార్థులు నష్టపోతారని మాట్లాతున్నారు. ఈ ర్యాలీకి తమ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లను తరలించారు. దాదాపు అంద రూ మహిళా టీచర్లు. దుర్భరమైన శ్రమదోపిడికి గురవుతున్న వాళ్ళు బందులు వద్దని ప్లకార్డులు పట్టుకున్నారు. వీళ్లను చూస్తే మా రక్తం ఇంకా ఇంకా పీల్చండి అని పీక్కుపోయిన ముఖాలతో మధ్యాహ్నపు ఎండలో నాలుగు రోడ్ల కూడలి వ ద్ద నిలబడినట్లుంది. ఈ యాజమాన్యాలు ప్రభుత్వం మమ్మ ల్ని కాదని ఎక్కడికి పోతదనే ధైర్యంతో ఇట్లా కూడా బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి.

మనకు ఎన్నో ఏళ్ల నుంచి ఉపాధ్యాయ సంఘాలున్నా యి. భద్రత జీవితాలు గడుపుతున్న ప్రభుత్వ టీచర్లే ఇం దులో ఉంటారు. నిజానికి ఇప్పుడు విద్యారంగంలో సంఖ్య రీత్యా చూసినా, ప్రయివేట్ సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయిలే కీలకం. కనీసం అభ్యుదయ ఉపాధ్యాయ సంఘాలైనా ప్రైవేట్ టీచర్ల దారుణమైన స్థితిగతుల్ని చూడాలి. వీరిని ఉపాధ్యా య ఉద్యమంలో భాగం చేసుకొని కొత్త పంథాలో పోరాటా లు నడపాల్సిన అవసరం ఇవాళ ఉంది. విద్యావ్యవస్థ ఇప్పటికే సర్వనాశనమై పోయిందని గుర్తించి, సరిదిద్దే బాధ్యత ఉపాధ్యాయ సంఘాల మీద ఉంది. విద్యార్థి సంఘాలు ప్రైవేట్ టీచర్ల పోరాటానికి మద్దతు తెలపడం మాత్రమే కాదు, వీళ్ళతో కలిసి పోరాడాల్సి ఉంది. పిల్లల మీద పెరిగిపోతున్న ఒత్తిడి, ఆత్మహత్యలు, సారం లేని చదువులు వీటితో ముడి పడి ఉన్నదే ఈ పోరాటం కూడా. ఈ తరాన్ని, భవిష్యత్ తరాలకు కాపాడుకోవాలంటే పరమ అనైతికమైన విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా అందరం పోరాడాలి.
పి.వరలక్ష్మి
8179912123 ఏకీకృత రూల్స్ చెల్లవు

Updated By ManamWed, 08/29/2018 - 00:34
  • ఉపాధ్యాయుల సర్వీసుపై హైకోర్టు తీర్పు   

imageహైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యా యులకు ఒకే విధమైన సర్వీస్ నిబంధనలు చెల్లవని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు-స్థానిక సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనలకు వీలుగా రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు చెల్లవని మంగళవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  ఏకీకృత సర్వీసు నిబంధనలకు అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పలు వ్యాజ్యాలపై ఇరుపక్షాల వాదప్రతివాదనలు ముగిడంతో ఈ నెల 8న హైకోర్టు తీర్పును తర్వాత వెలువరిస్తామని ప్రకటించింది. మంగళవారం ప్రధాన న్యాయమూర్తి టీబీఎన్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్లతో కూడిన డివిజన్ బెంచ్ రాష్ట్రపతి ఆదేశాలను కొట్టివేస్తూ 61 పేజీల తీర్పు వెలువరించింది.

1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తూ 2017 జూన్ 23న రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వుల్ని కొట్టేసింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ నిమిత్తం 1975 ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పేరా రెండును తోసిపుచ్చింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ 1998 నుంచి అమల్లో ఉండేలా రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని మూడో షెడ్యూల్లో చేర్చిన 23-ఎలో ఎంఈవో, జెడ్పీ హెడ్మాస్టర్లు చేర్చడం చెల్లదు. అధికరణ 371డీకి విరుద్ధం. వివిధ పోస్టులకు ఆ అధికరం ఉంది. కేడర్ల విలీనం, ఏకీకరణ చేయడానికి ఉద్దేశించి ఆ అధికరణం లేదు.  ఆ అధికర ణం లోకల్ కేడర్, లోకల్ ఏరియా, లోకల్ క్యాడేట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులోబడే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇవ్వొచ్చు. అయితే రాష్ట్రపతి ఏకంగా సర్వీస్ రూల్స్ ఏకీకరణ విషయంలో ఉత్తర్వులు ఇవ్వడం చెల్లదు. రాష్ట్రపతి ఆదేశాల్లోని పేరా 3లో పలు రకాల కేటగిరి పోస్టుల నిర్వహణ గురించి మాత్రమే ఉందిగానీ వివిధ కేటగిరీల విలీనం లేదా ఏకీకరణ ప్రస్తావన లేదు. ప్రాంతీయ అసమరతలు తొలగించేందుకే ఆ అధికరణంలోని పేరా 3 నిర్ధేశించి ఉంది. ఆ తరహా అసమానతలను నివారణకే ఆరు సూత్రాల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీనిలో కూడా కేడర్ల విలీనం లేదా ఏకీకృత అంశాలు లేవు.  గత ఏడాది రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసే అవి 1998 నుంచి అమలు చేయాలనే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నం కూడా చట్ట వ్యతిరేకమే అవుతుంది. కాబట్టే రాష్ట్రపతి ఉత్తర్వులు చెల్లవు... అని బెంచ్ తీర్పు చెప్పింది.చెట్టులెక్కగలవా.. ఓ టీచరమ్మ!

Updated By ManamThu, 10/26/2017 - 14:06
  • ఈ-హాజరు కోసం టీచర్ల తిప్పలు
  • గ్రామాల్లో అందని ఇంటర్‌నెట్ సిగ్నల్
  • చెట్లు.. పుట్టలు ఎక్కుతున్న వైనం
  • నడివయసులోనూ తప్పని తిప్పలు

Poor interent, signal problem, Teachers, climb, tree, E-attendance

శ్రీకాకుళం/ విజయునగరం/సాలూరు రూరల్, అక్టోబరు 26 (మనం న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో చాలా మందికి చెట్లు, పుట్టలు ఎక్కక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులందరికీ ఈ-హాజరు విధానాన్ని అమలు చేస్తోంది. దీనికోసం ప్రతి పాఠశాలకూ బయోవెుట్రిక్ పరికరాలను అందించారు. పాఠశాలకు హాజరైన వెంటనే, అలాగే తిరిగి వెళ్లేటపుడు అందులో తమ వేలిముద్రలు నమోదుచేయాలి. అప్పుడే వాళ్లకు హాజరు పడుతుంది. ఏమాత్రం ఆలస్యైమెనా, లేదా అసలు వేలిముద్ర నమోదు చేయకపోయినా ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు వెళ్లిపోతాయి. ఉపాధ్యాయుల హాజరును మెరుగుపరచడానికి చేపట్టిన ఈ విధానం మంచిదే అయినా.. అమలులో సవాలక్ష సమస్యలు వస్తున్నాయి.

ఏమిటీ సమస్య..
బయోవెుట్రిక్ పరికరాలు పనిచేయాలంటే తప్పనిసరిగా ఇంటర్‌నెట్ సిగ్నల్ అందుబాటులో ఉండాలి. నగరాలు, పట్టణాలు, వైుదాన ప్రాంతాల్లో ఉండే పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. మారుమూల, గిరిజన ప్రాంతాల వారికి మాత్రం కొన్ని ఇబ్బందులున్నాయి. ఇక్కడ మామూలుగా సెల్‌ఫోన్ సిగ్నల్ అందడమే కనాకష్టం. అలాంటిది ఇంటర్‌నెట్ సిగ్నల్ అంటే అసలు అందడం లేదు. అలాంటప్పుడు సమయానికి హాజైరెనా కూడా ఇంటర్‌నెట్ సిగ్నల్ లేక సమయానికి హాజరు వేయలేకపోతున్నారు. ఒకవేళ అందులో నమోదు చేయాలంటే... ఇదిగో ఇలా చెట్లు, మేడలు ఎక్కాల్సి వస్తోంది. చాలావరకు మారుమూల, గిరిజన ప్రాంతాల పాఠశాల భవనాలు చిన్నవి కావడంతో మేడమీదకు వెళ్లే సావకాశం ఉండదు. అందుకే ఇలా చెట్లెక్కి హాజరు వేసుకోవాల్సి వస్తోంది. లేదంటే తాము సమయానికే వెళ్లినా వెళ్లనట్లుగా అందులో నమోదవుతుంది. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని మామిడిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు ఇలాగే నానా కష్టాలు పడి చెట్లెక్కి బయోవెుట్రిక్ హాజరు వేసుకుంటున్నారు.

ఇక్కడి ప్రాధమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సూర్యకుమారి , ఉపాధ్యాయులు రమేష్, సుశీల, లావణ్య తమకు బయో మెట్రిక్ హాజరు వచ్చినప్పటి నుంచి హాజరు నమోదుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా సమస్యలు వస్తున్న విషయాన్ని డీఈవో శారద దృష్టికి తీసుకు వెళ్లగా ఆమె సానుకూలంగా స్పందించారు. సిగ్నల్ ఎప్పుడుంటే అప్పుడే హాజరు వేసుకోవచ్చన్నారు. అలాగే తిరిగి వెళ్లేటప్పుడు కూడా సిగ్నల్ ఉంటేనే హాజరు వేయాలన్నారు. ఎటూ పాఠశాల మొత్తం ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి.. బయోమెట్రిక్ పనిచేయని చోట్ల వాళ్ల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇక మీదట సమస్య తలెత్తకుండా ఉండేందుకు అందరికీ కొత్త 4జి సిమ్ కార్డులతో కూడిన బయోమెట్రిక్ మిషన్లు ఇస్తున్నామని ఆమె తెలిపారు.

ప్రయోజనాలు కూడా..
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఈ-హాజరు ప్రవేశపెట్టిన తర్వాత 80 - 85 శాతం వరకు హాజరు నమోదవుతోంది. రోజూ ఈ హాజరు వివరాలు రాష్ట్రస్థాయి వరకు వెళ్తాయి. దాంతో ముందురోజు ఎందుకు రాలేదంటూ వాళ్ల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌లు కూడా వస్తాయి. ఆ భయంతో అంతా సరైన సమయానికి హాజరై.. వేలిముద్రలు వేస్తున్నారు.

జీతాల్లో కోత విధిస్తే.. చూస్తూ ఊరుకోం
- జేసీ రాజు, ఏపీటీఎఫ్ జిల్లా నాయకుడు

అదరాబాదరాగా ఈ-హాజరు విధానం ప్రవేశపెట్టారు గానీ అందుకు తగిన సౌకర్యాల్లేవు. సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదు. సర్వర్లకు తగిన సామర్థ్యం లేదు. దీనిపేరు చెప్పి ఉపాధ్యాయుల సమయం వృథా అవుతోంది. హాజరు కోసం మిషన్లు పట్టుకొని చెట్లు, పుట్టలు ఎక్కాల్సి వస్తోంది. ఇది మరీ దారుణం. హాజరు పడకపోతే జీతాల్లో కోత విధిస్తామని అధికారులు భయ పెడుతున్నారు. అలాగైతే చూస్తూ ఊరుకోం. పూర్తి స్థాయిలో మిషన్లు పని చేస్తే సరే.. కానీ ఇలాగే సమస్యలు కొనసాగితే ఈ విధానాన్ని బహిష్కరిస్తాం.

సరైన సాంకేతికత లేకుండా అమలు అసాధ్యం
- శేషగిరి, ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు

అనుకున్నదే తడవుగా టీచర్లకు ప్రభుత్వం ఈ హాజరు అమల్లోకి తీసుకువచ్చింది. అందుకోసం సరైన మిషనరీని ఇవ్వలేదు. రిపేర్లు చేసే సాంకేతిక యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో లేదు. సిగ్నల్స్ అందడం లేదు. బయోమెట్రిక్ మిషన్లలో సిమ్స్‌ను వాళ్లే పెట్టి ఇచ్చారు గానీ అవి సిగ్నల్స్‌ను అందుకోవడం లేదు. హాజరు కోసం టీచర్ల సమయం వృథా అవుతోంది. ప్రభుత్వం అన్నీ సమకూర్చిన తర్వాత ఈ హాజరు విధానాన్ని అమలు చేస్తే మంచిదని మా అభిప్రాయం.

Related News