Ramachandrapuram

మెసేంజర్ యాప్‌లో ప్రియుడితో స్కెచ్ వేసి.. భర్తను చంపిన భార్య

Updated By ManamWed, 09/12/2018 - 11:40

Murderఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది భార్య. మెసేంజర్ యాప్ ద్వారా స్కెచ్ వేసి తన భర్తను చంపేసి ఏమీ తెలీనట్లు ఉండిపోయింది ఆ భార్య. గత నెల 26న అనుమానాస్పద స్థితిలో భర్త మరణించగా.. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.

కాగా తోటవారిపల్లె వీధికి చెందిన రాంబాబు, ప్రియదర్శిని 17ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నుంచి ఈ ఇద్దరి మధ్య తరచుగా తగాదాలు వస్తుండగా.. ఆ క్రమంలో ప్రియదర్శినికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు శివసాయి కిశోర్. ఇంట్లో తగాదాల వలన భర్తను వదిలిపెట్టి ప్రియుడితో చెన్నైకి చెక్కేసింది ప్రియదర్శిని. అయితే పోలీసుల సాయంతో మళ్లీ ప్రియదర్శినిని వెనక్కి తెచ్చుకున్నాడు రాంబాబు. 

ఇక ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రియదర్శిని.. ఇటీవల మెసేంజర్ యాప్ ద్వారా ప్రియుడు కిశోర్‌తో ముచ్చట్లు మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతో రాంబాబును చంపేందుకు వారిద్దరు ప్రణాళికను వేసుకున్నారు. గత నెల 26న కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రియదర్శిని, రాంబాబుకు ఇవ్వగా అతడు నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత వారి ఇంటికి వచ్చిన కిశోర్, ప్రియదర్శిని సాయంతో రాంబాబు గొంతు నలిపి చంపేశాడు. అనంతరం కేసు తన మీదకు రాకూడదని కిశోర్‌కు 2లక్షల రూపాయలను కూడా ఇచ్చింది. అయితే పోస్ట్‌మార్టంలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు ప్రియదర్శినిని ప్రశ్నించగా నిజం బయటికొచ్చింది. వెంటనే ప్రియదర్శిని, కిశోర్‌లపై కేసును నమోదుచేసుకున్న పోలీసులు వారిద్దరి తమ అదుపులోకి తీసుకున్నారు.



చిలక.. గోరింకల్లా సంసారం చేసి ఇప్పుడేమో..!

Updated By ManamSat, 07/07/2018 - 17:59

YSRCP Chief Jagan Criticized CM Chandrababu In Ramachandrapuram Sabhaతూర్పు గోదావరి: వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో విజయవంతంగా జరుగుతోంది. శనివారం సాయంత్రం ఆయన రామచంద్రాపురలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం హాజరుకావడంతో పోటెత్తిపోతుంది. 

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీ-టీడీపీ చిలకా-గోరింకల్లా సంసారం చేశారన్నారు. ఆ నాలుగేళ్లు ఒకరినొకరు పొగిడేసుకుని.. ఎన్నికల ఆర్నెళ్ల ముందు విడాకులు తీసుకున్నారని దుయ్యబట్టారు. విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు గుర్తొస్తారు.. ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ ఏవిధంగా పెట్టాలో బాబుకు గుర్తొస్తుందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

" ఎన్టీఆర్‌కు ఆయనే వెన్నుపోటు పొడిచి.. ఎన్నికలొచ్చినప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి దండకూడా బాబే వేస్తారు. ఇలాంటి వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో మీకు(ప్రజలకు) ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడాకులిచ్చిన పెద్ద మనిషి.. బయటికొచ్చినట్లు డ్రామాలేసి.. ఏపీకి న్యాం జరగాలంటే మరో ఐదేళ్లు తనకు అవకాశం ఇవ్వాలని కోరతారు. నిజంగా ఇటువంటి మోసం చేసే వ్యక్తిని ఏమనాలి..?. రైతుల రుణాలన్నీ బేషరుతుగా మాఫీ, బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి తెప్పిస్తామని ఈ పెద్ద మనిషే హామీ ఇచ్చి ఇప్పుడేమో మాటమారుస్తున్నారు.. ఈయన్ను నిజంగా ఏమనాలి మీరే (ప్రజలే) చెప్పండి?" అని చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు వర్షం కురిపించారు.



207వ రోజు ప్రారంభమైన జగన్ పాదయాత్ర

Updated By ManamSat, 07/07/2018 - 09:36

jagan  రామచంద్రాపురం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర 207 రోజుకు చేరింది. యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని జగన్నాయకపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి. అక్కడ నుంచి చిన్నతాళ్లపొలం, పెద తాళ్ల పొలం, వేళ్ల క్రాస్‌ రోడ్ మీదుగా రామచంద్రాపురం చేరుకొని అక్కడ నిర్వహించే బహిరంగ సభలో జగన్ పాల్గొననున్నారు. మరోవైపు యాత్రలో జగన్‌ను కలుస్తున్న సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకొంటున్నారు. 





Related News