Hardik Patel

దీక్ష విరమించిన హార్దీక్ పటేల్.. 

Updated By ManamWed, 09/12/2018 - 16:48

Patidar Leader, Hardik Patel, Hunger Strike, Patidar reservationsగుజరాత్: పాటిదార్ల రిజర్వేషన్ల కోసం నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమ నేత హార్దిక్ పటేల్ దీక్ష విరమించారు. బుధవారం ఆయన దీక్షను విరమించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పటేళ్ల రిజర్వేషన్ల కోసం 19 రోజులుగా హార్దిక్ దీక్ష చేస్తున్నారు. అయితే హార్దీక్ ఆరోగ్యం క్షీణించడంతో తన అనుచరులు, మద్దతుదార్ల అభ్యర్థన మేరకు నిరాహార దీక్షను విరమిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

పటేళ్ల రిజర్వేషన్లు, విద్య, రైతుల రుణమాఫీ కోసం హార్దిక్ తన నివాసం వద్ద ఆగస్టు 25న నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ మంగళవారం హార్దీక్‌ను నిరాహార దీక్షను విరమించాల్సిందిగా కోరారు. ఇటీవల రావత్ అసోం కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా రావత్‌.. హార్దీక్ దీక్ష చేసే ప్రాంగణానికి వెళ్లి మద్దతు తెలిపారు. క్షీణించిన ఆరోగ్యం.. వీలునామా రాసిన యువనేత

Updated By ManamMon, 09/03/2018 - 09:30

Hardikగాంధీనగర్: గుజరాత్‌లో పటేళ్లకు రిజర్వేషన్లు, రైతు రుణమాఫీ చేయాలని గత పది రోజులుగా అమరణ దీక్ష చేస్తున్న యువనేత హార్ధిక్ పటేల్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయన వీలునామా రాసి సంచలనం సృష్టించారు. తన ఆస్తులను పంచుతూ హార్ధిక్ వీలునామా రాశారు. బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.50వేలలో తల్లిదండ్రులకు రూ.20వేలు, పంజ్రపోల్ గ్రామాంలో ఆవుల షెడ్ నిర్మాణానికి రూ.30వేలు ఇవ్వాలని అందులో తెలిపారు.

అలాగే తన జీవితగాథపై వస్తున్న ‘హూ టుక్ మై జాబ్’ అనే బుక్ విక్రయాల ద్వారా వచ్చే రాయల్టీ, తనపై ఉన్న బీమా డబ్బులు, తన కారు అమ్మగా వచ్చిన మొత్తాన్ని తల్లిదండ్రులు, చెల్లలితో పాటు మూడు సంవత్సరాల క్రితం పటీదార్ ఉద్యమం సమయంలో మరణించిన 14మందికి సమానంగా పంచాలని తెలిపారు. ఈ విషయాలను పటీదార్ సంఘం అధికార ప్రతినిథి మనోజ్ పనారా తెలిపారు. ఇక ఈ దీక్షలో తాను మరణిస్తే కళ్లను దానం చేయాలని హార్ధిక్ చెప్పారు.అమల్లో 144 సెక్షన్.. నిరవధిక దీక్షకు హార్దిక్..  

Updated By ManamSat, 08/25/2018 - 13:59

Hardik Patel, indefinite hunger strike, section 144 impose, Ahmedabadఅహ్మదాబాద్: పటేళ్ల రిజర్వేషన్ల కోసం ఉద్యమించి మూడేళ్ల పూర్తి అవుతున్న నేపథ్యంలో పాటిదార్ అన్మత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్దిక్ పటేల్ శనివారం నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నారు. అహ్మదాబాద్‌లోని సత్యాగ్రహ్ చవానీ ప్రాంతంలో దీక్షకు పోలీసు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో ఆయన తన నివాసం వద్దే నిరవధిక దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో 144 సెక్షన్ అమల్లో ఉండటంతో బహిరంగ ప్రదేశాల్లో గుంపుగా కనిపించటానికి వీలు లేదని పోలీసులు హెచ్చరించారు. పాటీదార్లకు ఓబీసీ రిజర్వేషన్, రైతు సమస్యలపై ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొనేందుకు నికోల్ వెళ్తుండగా గత ఆదివారం హార్దిక్ పటేల్‌, ఇతర పాటీదార్ నేతలను అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం ఆయన ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చారు. హార్దిక్ ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పటేల్ ముందస్తు బెయిల్‌ను తిరస్కరించాలంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది. మూడేళ్లుగా పాటిదార్ రిజర్వేషన్ల కోసం హార్దిక్ పటేల్ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే.  శ్రీదేవి, మాధురిలాగే సన్నీ కూడా ఒక నటి

Updated By ManamMon, 06/11/2018 - 12:59

hardik, sunny నర్గిస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాగే సన్నీ లియోన్ కూడా ఒక నటేనని ఆమెకు మద్దతుగా మాట్లాడారు పటేదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్. ఓ మీడియా సమావేశంలో సన్నీ లియోన్‌పై అతడి అభిప్రాయం అడగగా.. ఇతర నటీనటులను చూసినట్లు సన్నీని ఎందుకు చూడలేరని ప్రశ్నించారు.

గతంలో ఆమె పోర్న్‌స్టార్‌గా పనిచేసిందని ఇప్పుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం సబబు కాదని తెలిపారు. దేనిపై అయినా మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదని స్పష్టం చేశారు. కాగా ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సన్నీ లియోన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.రాహుల్‌పై హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు

Updated By ManamSat, 02/24/2018 - 13:45
  • రాహుల్ గాంధీ నా నాయకుడే కాదు.. ప్రియాంకా వాద్రా రాజకీయాల్లోకి రావాలి

  • వ్యక్తిగతంగా రాహుల్ అంటే ఇష్టం.. రాజకీయ నాయకుడిగా కాదు

Rahul Gandhi,  Priyanka Gandhi, Hardik Patelముంబై: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) ఉద్యమనేత హార్దిక్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అసలు నాయకుడే కాదన్నారు. ఒకవైపు రాహుల్‌ను విమర్శిస్తూనే.. మరోవైపు ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి రావాలని పటేల్ ఆకాంక్షించారు. ‘ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నా నాయకుడు కాదు. వ్యక్తిగతంగా రాహుల్ అంటే నాకు ఇష్టం. కానీ, ఆయన్ను ఓ నాయకుడిగా భావించలేను. ఎందుకంటే రాహుల్‌ను ఎన్నడూ ఓ నేతగా నేను చూడలేదు’ అని పటేల్ చెప్పారు. ప్రియాంక గాంధీ వాద్రా రాజకీయాల్లోకి రావాలని, ఆమెలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి తరపున ఎంపీగా హార్దిక్ పోటీ చేయబోతున్నారనే కథనాలు వచ్చాయి.

ఈ వార్తలపై స్పందించిన హార్దిక్.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని స్పష్టం చేశారు. గత గుజరాత్ ఎన్నికల సమయంలో పటేల్‌ వయస్సు 25ఏళ్ల కంటే తక్కువ ఉండటంతో పోటీ చేయలేకపోయారు. 2019 నాటికి పోటీ చేసే అర్హత ఉన్నప్పటికీ కూడా తాను పోటీ చేయనని చెప్పారు. ‘వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో (ప్రధాని నరేంద్ర మోదీ) వ్యతిరేకంగా పోటీచేయడం లేదు. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేయగలిగినప్పుడు నన్నెవరూ ఆపలేరు. అసెంబ్లీ లేదా పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించాలో ప్రజల నిర్ణయమే ప్రాధాన్యమని భావిస్తాను’ అని హార్దిక్ అభిప్రాయపడ్డారు.మళ్లీ మోదీ వస్తే.. దేశంలో రాష్ట్రపతి పాలనే..!

Updated By ManamSun, 02/11/2018 - 14:02
  •  దేశాన్ని విడదీసే శక్తిని ఎదుర్కొనేందుకు అన్నిపార్టీలు ఏకం కావాలి 

Narendra Modi, returns to power, President’s rule, Hardik Patelకోల్‌కతా: 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో రాష్ట్రపతి పాలన చూడాల్సి వస్తుందని పాటీదార్‌ ఉద్యమనేత హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్డేయేతేర ప్రభుత్వాలన్నీ విచ్ఛిన్నమవుతాయనే ఉద్దేశంతో పటేల్ ‘రాష్ట్రపతి పాలన’ అనే పదాన్ని వాడినట్టు తెలుస్తోంది. దేశాన్ని విడదీసేందుకు యత్నిస్తున్న శక్తిని ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచొప్పారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల తరువాత నరేంద్ర మోదీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే.. దేశంలో రాష్ట్రపతి పాలనను స్వాగతించినట్టే అవుతుందని నేను స్పష్టంగా చెప్పాను’ అని కోల్‌కతాలో శనివారం ఓ స్థానిక మీడియాకు పటేల్ వెల్లడించారు. ‘దేశాన్ని విడగొట్టేందుకు యత్నిస్తున్న శక్తికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవశ్యకత ఉంది’ అని స్పష్టం చేశారు. ఇటీవల మోదీ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలపై చేసిన వ్యాఖ్యలను పటేల్ తప్పుబట్టారు.

అలాంటి ప్రధాని మాకొద్దు...
‘విద్య, ఉద్యోగం, వ్యవసాయం, ఆరోగ్యం, భద్రత, రక్షణ.. పలు సమస్యలపై మాట్లాడే దేశ ప్రధానమంత్రిని నేను చూడాలనుకుంటున్నాను. కానీ, పార్లమెంట్‌లో 90 నిమిషాల ప్రసంగంలో కేవలం ప్రతిపక్షాన్ని మాత్రమే విమర్శలు చేయడానికే కేటాయించారు. అటువంటి ప్రధానమంత్రిని నేను కావాలనుకోవడం లేదు’ అని హార్దిక్ పటేల్ మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. శనివారం తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసిన పటేల్.. ఆమెను పొగడ్తలతో ముంచేత్తారు. ఇటీవల కోల్‌కతాలోని సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆమె నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, టీఎంసీ సుప్రీమో మమత ‘లేడీ మహాత్మా’ అంటూ హార్దిక్ పటేల్ అభివర్ణించారు.రండి.. మాతో కలవండి

Updated By ManamSat, 12/30/2017 - 14:24
  • గుజరాత్ డిప్యూటీ సీఎంకు హార్దిక్ పటేల్ ఆఫర్

Hardik Patel Invites Gujarat Deputy CM Nitin Bhai Patelఅహ్మదాబాద్: గుజరాత్ డిప్యూటీ సీఎంకు పటేల్ రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) కన్వీనర్ హార్దిక్ పటేల్ ఓ ఆఫర్ ఇచ్చారు. తమతో కలిసి నడవాలని ఆయన్ను ఆహ్వానించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వారం రోజులైనా కాకముందే.. గుజరాత్ ప్రభుత్వంలో లుకలుకలొచ్చిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్‌కు ఇచ్చిన ఆర్థిక శాఖ, పట్ణాభివృద్ధి, పెట్రోలియం శాఖలను బీజేపీ వెనక్కు తీసుకోవడంతో.. అసహనంతో ఉన్న ఆయన బాధ్యతలు తీసుకోలేదు. దీంతో ఇదే అదునుగా భావించిన హార్దిక్ పటేల్.. నితిన్ పటేల్‌కు ఆహ్వానం పంపారు. బీజేపీలోని తమ వర్గానికి చెందిన నేతకు ఆ పార్టీ గౌరవం ఇవ్వడం లేదని, ప్రతిఒక్కరూ ఆయన తరఫున నిలబడాలని హార్దిక్ కోరారు.

‘‘బీజేపీ సరైన గౌరవం ఇవ్వడం లేదనుకుంటే నితిన్ పటేల్ మాతో చేరొచ్చు. ఆయన బీజేపీ కోసం ఎంతో శ్రమించారు’’ అని అన్నారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలో భాగంగా శనివారం బోతద్‌లో చింతన్ శిబిర్ కార్యక్రమం నిర్వహించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆయన బీజేపీని వీడాలనుకుంటే.. ఆయన చెబుతున్నట్టు మరో 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన వెంట వస్తే.. మేం మద్దతిస్తాం. నేను కాంగ్రెస్‌తో మాట్లాడి ఆయనకు ప్రాధాన్యమున్న పదవిని ఇప్పిస్తాను’’ అని అన్నారు. మరోవైపు బీజేపీ లుకలుకల విషయాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోందని, ఆ మధ్య ఆనందిబెన్ పటేల్‌ను, ఇప్పుడు నితిన్ పటేల్‌ను బీజేపీ లక్ష్యం చేసుకుందని కాంగ్రెస్ గుజరాత్ అధ్యక్షుడు భరతసిన్హ సోలంకి అన్నారు. నితిన్ భాయ్ పటేల్ తమకు మద్దతిచ్చి, మరో కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేవని సోలంకి చెప్పారు. ఈవీఎంల ట్యాంపరింగ్

Updated By ManamSun, 12/17/2017 - 23:17
  • బీజేపీ గెలిస్తే అదే కారణం: హార్దిక్ పటేల్

hardik patel, gujratఅహ్మదాబాద్, డిసెంబరు 17: అత్యంత హోరాహారీగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో  వెల్లడికానున్న నేపథ్యంలో పటీదార్ నేత హార్థిక్ పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంల)ను బీజేపీ ట్యాంపరింగ్ చేసే అవకాశముందని ఆయన అన్నారు. మొత్తం 17 జిల్లాల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.బీజేపీకి వ్యతిరేకంగా గుజరాత్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన హార్థిక్ పటేల్.. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు చేయడంతో ఈ ట్వీట్లను పటీదార్లు (పటేల్ సామాజికవర్గం) సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నారు. ఇందులో ప్రజలను రెచ్చగొట్టే సందేశాలు కూడా ఉంటున్నాయి. వడోదరలోని కర్జాన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సైతం ఎన్నికల ఫలితాలపై ప్రజలను రెచ్చగొట్టేరీతిలో వీడియో మెసేజ్ పోస్టు చేశారు. ఎన్నికల్లో బీజేపీ గెలిస్తేప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ‘‘గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే.. అది ఆ పార్టీ చేసుకున్న స్వయం కృతాపరాధం. బీజేపీ కేవలం ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం ద్వారానే గుజరాత్ ఎన్నికలను గెలువగలదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోయి గుజరాత్ ఎన్నికల్లో గెలువడం ద్వారా ఎవరికీ అనుమానాలు రాకుండా చూడాలని బీజేపీ చూస్తోంది. ఈవీఎం రిగ్గింగ్‌కు పాల్పడకపోతే బీజేపీ గుజరాత్‌లో 82 సీట్లకు మించి గెలువదు. బీజేపీ ఓడిపోతుందని నేను నమ్ముతున్నాను. కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వస్తుంది. అలా కాకుండా బీజేపీ గెలిచిందంటే అది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే..’’ అని హార్థిక్ అన్నారు. రెండు కోట్లిస్తే.. సీఎం సెక్స్ వీడియో పుట్టిస్తా

Updated By ManamWed, 11/29/2017 - 00:56
  • మోదీ పాలనలో వ్యక్తిగత భద్రత లేదు: హార్దిక్ పటేల్ 

hardik patelఅహ్మదాబాద్, నవంబరు 28:   రెండు కోట్ల రూపాయలిస్తే చాలు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సెక్స్ వీడియోలు పుట్టిస్తానంటూ పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సవాలు విసిరారు. గుజరాత్ అభివృద్ధిపై మాట్లాడటం మాని, వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటం సరికాదన్న హార్దిక్, ‘నాపై వచ్చిన మార్ఫింగ్ వీడియోలో ఒకవేళ నేను ఉన్నా అది నా వ్యక్తిగత జీవితం, దీని గురించి అడిగే ప్రశ్నలకు నేనెందుకు సమాధానం చెప్పాలి’ అని ఎదురు ప్రశ్నించారు. మోదీ పరిపాలనలో వ్యక్తిగత జీవితానికి, ఏకాంతతకు భద్రత లేదని ఆయన వాపోయారు. మార్ఫింగ్ వీడియోలతో బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని హార్దిక్ పటేల్ మండిపడ్డారు.  ఓ హోటల్‌లో అమ్మాయితో హార్దిక్ పటేల్ గడిపిన వీడియో ఓవైపు ఇంకా సంచలనం సృష్టిస్తూ ఉంటే, హార్దిక్ మాత్రం..‘గుజరాతీలు అభివృద్ధి సీడీలకోసం ఎదురు చూస్తున్నారు, 22 ఏళ్ల హార్దిక్ సీడీల కోసం కాదు’ అంటూ ట్వీట్ చేయడం విశేషం.'ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం'

Updated By ManamWed, 11/22/2017 - 12:00
  • రిజర్వేషన్ల కోటా ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుంది.. అధికారంలోకి వచ్చాక కోటాపై బిల్లు తెస్తామని హామీ

  • ఎన్నికల మేనిఫెస్టోలో పాటిదార్ కోటా చేరుస్తామంది.. మీడియాతో పాటిదార్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్..  

Hardik Patel, Congress has assured him, Patidar quota, BJP, Gujarat assembly electionsఅహ్మదాబాద్: పటేల్ వర్గానికి రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఒప్పుకుందని పాటిదార్ కోటా ఉద్యమ నేత హార్దిక్ పటేల్‌ స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నట్టు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పటేల్ రిజర్వేషన్ల కోసం జరుగుతున్న తమ పోరాటానికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తామని హార్దిక్ పేర్కొన్నారు. బుధవారం అహ్మదాబాద్‌లో హార్దిక్ మీడియా సదస్సులో మాట్లాడుతూ.. తమ షరతులకు కాంగ్రెస్ అంగీకరించిందని, విద్యాసంస్థల్లో పటేల్ వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తామని, ఇతర వెనుకబడిన తరగుతుల వర్గాలు (ఓబీసీ) వారికి కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు.

‘ఇన్నేళ్లుగా బీజేపీ వ్యతిరేకించిన మా డిమాండ్లను కాంగ్రెస్ అంగీకరించింది. కోటా విషయంలో కూడా హామీ ఇచ్చింది’ అని 24 ఏళ్ల పటేల్ వెల్లడించారు. పటేల్ కోటాను కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి గుజరాత్‌లో అధికారంలోకి రాగానే పటేల్ రిజర్వేషన్ బిల్లు అమలులోకి తెచ్చేలా చేస్తామని హామీ ఇచ్చిందని ఆయన ఉద్ఘాంటించారు. కాంగ్రెస్ కోటా ఫార్మూలా ఆమోదయోగ్యంగా ఉండటంతో తాను అంగీకరించినట్టు హార్దిక్ చెప్పారు. కాగా, వచ్చే నెల 9 నుంచి గుజరాత్‌లో రెండు దశల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Related News