Hardik Patel

మరో నాలుగు వీడియోలు...

Updated By ManamWed, 11/15/2017 - 15:28
 • ఒక్కరోజైనా గడవకుండానే మళ్లీ నెట్‌లో హార్దిక్ సెక్స్ వీడియోలు.. హోటల్‌లో అమ్మాయితో జల్సా

 • సహచరులతో కలిసి జల్సా చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

 • మరోసారి బీజేపీపై మండిపడిన పటేల్ లీడర్.. నా గోప్యతా హక్కును బీజేపీ హరిస్తోంది

 • లాయర్లతో మాట్లాడి న్యాయ పోరాటం చేస్తా.. నా వ్యక్తిత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నాలు

 • అయినా పటేళ్ల పోరాటం ఆగదు: హార్దిక్.. హార్దిక్‌ పటేల్‌కు కాంగ్రెస్ నేతల మద్దతు

Hardik Patel and his Aides In hotel room with Young Womanఅహ్మదాబాద్, నవంబరు 15: హార్దిక్ పటేల్ రెండు సెక్స్ వీడియోలు విడుదలై ఒక్క రోజు గడవకముందే.. మరో నాలుగు వీడియోలు నెట్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఓ హోటల్ రూంలో మందు కొడుతూ అమ్మాయితో హార్దిక్, ఆయన అనుచరులు గడిపిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పటేళ్ల రిజర్వేషన్ల పోరాటంలో భాగంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించారు. కాల్పుల్లో మరణించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపిస్తూ 2015 మే 21న హార్దిక్ సహా ఐదుగురు పాటీదార్ రిజర్వేషన్ నేతలు బోతద్‌లో గుండు గీయించుకుని నిరసన తెలిపారు. ఆ మరుసటి రోజే అంటే మే 22న ఓ అమ్మాయితో తన సహచరులు సహా హార్దిక్ పటేల్ సన్నిహితంగా ఉన్న వీడియోను ఇప్పుడు బయటపెట్టారు. అయితే, ఆ వీడియో నిజమైనదా కాదా అన్నది ఇంకా తేల్చాల్సి ఉంది.

ముప్పేట పెరుగుతున్న ఈ ‘వీడియో’ల దాడితో బీజేపీపై మరోసారి ఫైర్ అయ్యారు హార్దిక్ పటేల్. తన గోప్యత (ప్రైవసీ) హక్కును బీజేపీ హరిస్తోందన్న హార్దిక్ పటేల్.. ఆ పార్టీని న్యాయపరంగానే ఎదుర్కొంటానని హెచ్చరించారు. ‘‘పరుల వ్యక్తిగత జీవితాల్లోకి తల దూర్చడమంటే బీజేపీ వారికి మహా సరదాలా ఉంది. వారి 22 ఏళ్ల ‘వికాస్’ (అభివృద్ధి అజెండా)ను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎత్తిచూపినందుకు.. ఓ 23 ఏళ్ల అబ్బాయి వ్యక్తిగత జీవితాన్ని నలుగురిలో పెట్టేస్తోంది. మా లాయర్లతో మాట్లాడి న్యాయపరంగా పోరాడతా. ఈ సెక్స్ సీడీలను బహిర్గతం చేస్తున్న వ్యక్తిపై త్వరలోనే కేసులు పెడతా’’ అని హెచ్చరించారు. ఒకరి వ్యక్తిత్వంపై దెబ్బకొట్టినంత మాత్రాన పాటీదార్ల ఆందోళన మాత్రం ఆగబోదని మరోసారి ఉద్ఘాటించారు. ‘‘నేను చెడ్డవాడినైనంత మాత్రాన పటేళ్ల రిజర్వేషన్ల కోటా డిమాండ్‌పై ప్రభావం పడదు’’ అని అన్నారు.

కాగా, హార్దిక్‌కు గుజరాత్‌కు చెందిన దళిత యువనేత జిగ్నేశ్ మేవాని మద్దతు పలికారు. ‘‘ప్రియమైన హార్దిక్.. ఈ వీడియోలతో కలత చెందొద్దు. నేను నీ వెంటే ఉంటా. శృంగార హక్కు అనేది కూడా ఓ ప్రాథమిక హక్కే. మీ ఏకాంతాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు’’ అని మేవానీ ట్వీట్ చేశారు. మరోవైపు హార్దిక్‌కు ఒకప్పుడు సహచరుడైన చిరాగ్ పటేల్ వీడియోలపై స్పందిస్తూ.. ఈ వీడియోల వల్ల పటేల్ వర్గంలో హార్దిక్‌పై నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. ‘‘ఇక నుంచి పటేల్ ప్రజలెవరూ హార్దిక్‌ను తమ ఇళ్లలోకి తీసుకెళ్లరు. ఆయన సభల నుంచి మహిళలు దూరంగా ఉంటారు. బీజేపీ కావాలని తనను ఇరికిస్తుందని హార్దిక్ చెప్పినా పటేల్ వర్గం నుంచి మాత్రం ఎలాంటి మద్దతు దొరకదు’’ అని అన్నారు. దేశద్రోహం కేసులో ఇరుక్కుని అప్రూవర్‌గా మారిన హార్దిక్ మరో అనుచరుడు కేతన్ పటేల్ కూడా.. హార్దిక్‌పై విమర్శలు గుప్పించారు. సెక్స్ టేప్‌లో ఉన్నది కచ్చితంగా హార్దిక్ పటేలేనని, తన తప్పులను ఒప్పుకొని పటేల్ రిజర్వేషన్ల పోరాటాన్ని విరమించుకోవాలని, పటేల్ కులస్థులు ఇలాంటి నీచమైన చర్యలను ఒప్పుకోరని కేతన్ అన్నారు. Hardik Patel and his Aides In hotel room with Young Woman

అయితే, కాంగ్రెస్ గుజరాత్ నేతలు మాత్రం హార్దిక్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ కుళ్లు రాజకీయాలు చేస్తోందని, బీజేపీ ఎప్పటిలాగానే వ్యక్తిత్వంపై చెడు ముద్ర వేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ గుజరాత్ చీఫ్ భరతసిన్హ సోలంకి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని హార్దిక్ ముందే చెప్పారని, ఇప్పుడు బయటకు వస్తు్న్న వీడియోలన్నీ హార్దిక్ వ్యక్తిగతమైనవని, ఓ వ్యక్తిని కిందకు దిగజార్చేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇలాంటి నీచమైన ఎత్తుగడలు వేయదని గుజరాత్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్ అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. మరోవైపు ఇలాంటి ఎన్ని సీడీలు బయటకు వచ్చినా పటేళ్ల ఆందోళనపై ఎలాంటి ప్రభావం ఉండబోదని మరో పటేల్ ఆందోళన వర్గం సర్దార్ పటేల్ గ్రూప్ ప్రతినిధి పుర్వీన్ పటేల్ అన్నారు. ఆందోళన నుంచి హార్దిక్ పోతే మరో కొత్త వ్యక్తి ఆ బాధ్యతలను భుజాలకు ఎత్తుకుంటారని ఆయన అన్నారు. హార్దిక్ చెప్పినట్టే జరిగింది

Updated By ManamTue, 11/14/2017 - 14:54
 • పటేల్ రిజర్వేషన్ నాయకుడి సెక్స్ వీడియోలు బహిర్గతం.. హార్దిక్ పటేల్ రాసలీలలంటూ వీడియోలు

 • అవి తన వీడియోలు కావని ఖండించిన పటేల్ లీడర్.. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇదే నిదర్శనం

 • నేను మనిషినే.. అలా అని చేతకాని వాడిని కాదు.. నా వ్యక్తిగత జీవితంపై బీజేపీ నేతలు దాడి చేస్తున్నారు

 • బీజేపీలోనూ ఎంతో మంది కామపిశాచులున్నారు.. వారి వీడియోలను త్వరలోనే బయటపెడతా: హార్దిక్

 • కాంగ్రెస్ నేతల మద్దతు.. బీజేపీపై విమర్శలు.. హార్దిక్‌పై పాస్ మాజీ కన్వీనర్ అశ్విన్ పటేల్ మండిపాటు

 • అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపణ.. హార్దిక్ అనుచరులూ తక్కువేమీ కాదని వ్యాఖ్య

 • హార్దిక్ పటేల్‌పై కేంద్ర మంత్రి మన్షుక్ మండిపాటు.. కావాలంటే కేసు పెట్టుకోవచ్చని హార్దిక్‌కు హితవు

hardik patel in controversy as he is in sex scandalఅహ్మదాబాద్, నవంబరు 14: హార్దిక్ పటేల్ చెప్పినట్టే జరిగింది. పది రోజుల క్రితం ఆయన సరిగ్గా ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు నిజమైంది. పాటీదార్ రిజర్వేషన్ల లీడర్ శృంగార వీడియోలు రెండు యూట్యూబ్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ తన నకిలీ సెక్స్ సీడీలను విడుదల చేసినా చేస్తుందని హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అలా చెప్పి పది రోజులు తిరగకముందే వీడియోలు నెట్‌లో ప్రత్యక్ష ప్రసారమవడం గమనార్హం. 2017 మే 16న రికార్డు చేసినట్టు ఉన్న ఆ వీడియోను ‘‘పాటీదార్లు, గుజరాత్‌ను మోసం చేస్తున్న హార్దిక్ పటేల్ రాసలీలలు’’ అంటూ సోషల్ మీడియాలో దానని పోస్టు చేశారు. అయితే, ఆ వీడియోలు నిజమైనవేనా కావా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణకు రాలేదు.

అయితే, ఆ వీడియో క్లిప్పులు తనవి కావని హార్దిక్ పటేల్ చెప్పారు. గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాటీదార్ అనామత్ ఆందోళన సమితి (పాస్) ప్రధాన కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆ వీడియోలను తోసిపుచ్చారు. అది ఓ ఫేక్ వీడియో అని, మార్ఫ్ చేసి తీశారని ఎప్పటిలాగానే ఖండించారు. బీజేపీ మరోసారి తన నీచ రాజకీయాలను బయటపెట్టిందని, తనను దిగజార్చేందుకే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తానూ ఓ మనిషినేనని, అయితే తాను అంత చేతకాని వాడిని మాత్రం కానని హెచ్చరించారు. తన వ్యక్తిగత జీవితంపై బీజేపీ దాడి చేస్తోందని అన్నారు. బీజేపీలో చాలా మంది కామపిశాచులున్నారని, త్వరలోనే వారి సీడీలనూ తాను బహిర్గతం చేస్తానని హార్దిక్ హెచ్చరించారు. ప్రజల్లో హార్దిక్ చాలా పెద్దవాడైపోయాడని గ్రహించిన బీజేపీ.. తన పరువును బజారుకీడ్చేందుకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి నీచ రాజకీయాల పట్ల తానేమీ బాధపడట్లేదని, ఆ వీడియో బయటపెట్టి గుజరాత్ మహిళలను అవమానపరిచారని ఆయన అన్నారు. ఈ వీడియోలతో పటేళ్ల రిజర్వేషన్ల పోరాటంపై పెద్ద ప్రభావమేమీ ఉండదన్న హార్దిక్.. అది బీజేపీకే తిప్పి కొడుతుందని చెప్పారు. వీడియో క్లిప్పులు వైరల్ అవ్వగానే తాను కాదికి వెళ్లానని, అక్కడ వేలాది మంది యువత తనకు అండగా నిలబడ్డారని అన్నారు. ప్రజలు తన వెంట ఉన్నంత వరకు తన మీద ఎవరెన్ని వ్యక్తిగత దాడులు చేసినా పటేళ్ల రిజర్వేషన్లపై ప్రభావం చూపబోవని ధీమా వ్యక్తం చేశారు. hardik patel in controversy as he is in sex scandal

దీనిపై 2012లో పాస్ కన్వీనర్‌గా ఉండి పటేళ్ల ఆందోళనకు నేతృత్వం వహించిన అశ్విన్ పటేల్ స్పందించారు. హార్దిక్‌పై మండిపడ్డారు. చాలా మంది అమ్మాయిల జీవితాలతో హార్దిక్ పటేల్ ఆడుకున్నాడని అన్నారు. ‘‘చాలా మంది అమ్మాయిల జీవితాలతో హార్దిక్ ఆడుకున్నాడు. అందుకే ఆయన వర్గం నుంచి నేను విడిపోయాను. సూరత్, మోర్బి, రాజ్‌కోట్‌కు చెందిన హార్దిక్ అనుచరులు కూడా తక్కువేమీ తినలేదు. వాళ్లూ అమ్మాయిల జీవితాలను పణంగా పెట్టినవారే’’ అని అశ్విన్ ఆరోపించారు. 2015లో హార్దిక్ ఢిల్లీ వెళ్లినప్పుడు ఓ అమ్మాయిని వెంటబెట్టుకెళ్లాడని, ఆ అమ్మాయే తన భార్య అని ప్రకటించాడని గుర్తు చేశారు. ఆ తర్వాత ఆమెను తీసుకుని మనాలీ వెళ్లారని, దానికి సంబంధించిన రికార్డులు, ఆడియో క్లిప్పులు తన వద్ద ఉన్నాయని చెప్పారు. ఆ విషయంపై ఇప్పుడు హార్దిక్ వివరణ ఇవ్వకపోతే నాలుగు రోజుల్లో వాటన్నింటినీ బయటపెడతానని హెచ్చరించారు.

ఆ సెక్స్ వీడియోలు పాటీదార్ వర్గానికి చెందిన వారివి కాదని సర్దార్ పటేల్ గ్రూప్ కన్వీనర్ లాల్జీ పటేల్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ హార్దిక్ పటేల్‌కు మద్దతుగా నిలుస్తోంది. బీజేపీ ఇలాంటి వీడియోలను బయటపెట్టి దిగజారిపోయిందని, అలా వీడియోలను బయటపెట్టడం ద్వారా పౌరుడి ప్రాథమిక హక్కైన ప్రైవసీని ఉల్లంఘించిందని కాంగ్రెస్ నేత శక్తి సిన్హ్ గోహిల్ మండిపడ్డారు. ఇక, కేంద్ర మంత్రి హార్దిక్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్దిక్ పటేల్ వీడియోలతో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదని, బీజేపీపై బురదజల్లే బదులు ఆ వీడియోలపై పోలీసులకు హార్దిక్ ఫిర్యాదు చేయాల్సిందని రోడ్డు రవాణ, హైవేల సహాయ మంత్రి మన్షుక్ మాందవియ మండిపడ్డారు. కోటాపై మూడు మార్గాలు!

Updated By ManamSat, 11/11/2017 - 11:27
 • ఏదో ఒకటి ఎంచుకోండి.. పటీదార్లకు కాంగ్రెస్ ఆఫర్ 

Congress, three Options for Quota, Patidars, Hardik Patel, Rahul Gandhiఅహ్మదాబాద్, నవంబరు 10: గుజరాత్ ఎన్నికల్తో తమ మద్దతు కావాలంటే రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ నెల 7లోగా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని పటీదార్లు డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. కాంగ్రెస్ మూడు మార్గాలను సూచించింది. వాటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించింది. గురువారం రాత్రి అహ్మదాబాద్‌లో పటీదార్లతో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ చర్చలు జరిపారు. శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల వరకు ఈ సమావేశం కొనసాగింది. దీనికి  13 మంది పటీదార్ నేతలు హాజరయ్యారు.  అయితే.. హార్దిక్ పటేల్ సమావేశానికి హాజరుకాలేదు. కోటాకు సంబంధించిన వివిధ నిబంధనలు, రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలను కాంగ్రెస నేతలు పటీదార్ నేతలకు వివరించినట్లు తెలిసింది. అయితే.. కోటాకు సంబంధించి కాంగ్రెస్ ఎలాంటి ప్రతిపాదనలు చేసిందనే విషయం మాత్రం మీడియాకు వెల్లడించలేదు.ఫేక్ సెక్స్ సీడీలను వాడతారేమో

Updated By ManamSat, 11/04/2017 - 13:22
 • బీజేపీ కావాలనే నేనున్నట్టుగా వాటిని సృష్టించింది.. ఎన్నికల్లో వాటి ద్వారా బీజేపీ లబ్ధి పొందే అవకాశం

 • నా ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించొచ్చు.. మతకల్లోలానూ సృష్టించే అవకాశం: హార్దిక్ పటేల్ 

Hardik Patel file photoఅహ్మదాబాద్, నవంబరు 4: గుజరాత్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ‘శృంగార సీడీ’ని అడ్డుపెట్టుకుని తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నించే అవకాశాలున్నాయని పటేల్ రిజర్వేషన్ల నాయకుడు హార్దిక్ పటేల్ ఆరోపించారు. అంతేగాకుండా మత కల్లోలాలను బీజేపీ రెచ్చగొట్టే అవకాశాలున్నాయన్నారు. ‘‘నేనున్నట్టుగా ఓ సెక్స్ సీడీని బీజేపీయే కావాలని తయారు చేసింది. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆ సీడీని బీజేపీ విడుదల చేసే అవకాశాలున్నాయి. తద్వారా నా పరువు ప్రతిష్ఠలను ఆ పార్టీ దిగజార్చొచ్చు. బీజేపీ ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరు మాత్రం ఊహించగలరు? కాబట్టి ఆ పార్టీ ఏం చేస్తుందో వేచి చూద్దాం’’ అని హార్దిక్ పటేల్ అన్నారు. అయితే, ఆ సీడీ గురించి ఎలా తెలిసిందన్న విలేకరుల ప్రశ్నకు.. ‘బీజేపీకి అలాంటివి వెన్నతో పెట్టిన విద్య’ అని బదులిచ్చారు. అనేకలోపాలున్న వీవీపాట్ (ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్) వ్యవస్థలున్న ఈవీఎంలను గుజరాత్ ఎన్నికల్లో వినియోగించే అవకాశాలూ లేకపోలేదని హార్దిక్ ఆరోపించారు. 3,550 వీవీపాట్ వ్యవస్థల్లో లోపాలున్నట్టు ఎన్నికల సంఘం తొలి దశ పరీక్షల్లో తేలిందన్నారు. అలాంటి వాటినే బీజేపీ ఎన్నికల్లో వినియోగించే అవకాశం ఉందన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో వీవీపాట్ ఈవీఎంల వినియోగానికి ఈసీ సంకల్పించిందని, పలు ఎన్నికల్లో అవి సరిగ్గా పనిచేయలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు. అధికార బీజేపీకి దాని ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. వాటిని ఉపయోగించుకుని బీజేపీ ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అయితే, ఆ వ్యాఖ్యలను ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాత్రం ఖండించారు. గుజరాత్ ఎన్నికల కోసం 70 వేల వీవీపాట్ ఈవీఎంలను సిద్ధం చేస్తే అందులో ఫెయిలైనవి కేవలం 4 శాతం అని ఆయన చెప్పారు. సిబ్బందికి వాటి వినియోగంపై అవగాహన లేకపోవడమూ అవి ఫెయిలవడానికి కారణమని చెప్పారు. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ వీవీపాట్ ఈవీఎంలను పరీక్షిస్తామని గుజరాత్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీబీ స్వెయిన్ వెల్లడించారు. హార్దిక్‌కు బెయిల్ మంజూరు

Updated By ManamThu, 10/26/2017 - 15:41

అహ్మదాబాద్‌: బిజెపి ఎమ్మెల్యేపై దాడి కేసులో పటేల్‌ వర్గ పోరాట నాయకుడు హార్దిక్‌ పటేల్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. రూ. 5వేల పూచికత్తుతో గుజరాత్‌లోని విసానగర్ న్యాయ‌స్థానం ఆయ‌న‌కు బెయిల్‌ ఇచ్చింది. ఎమ్మెల్యే కారుపై దాడి కేసులో హార్దిక్‌పై బుధవారం అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. 2016లో విసానగర్‌లోని మెహసనా ప్రాంతంలో బిజెపి ఎమ్మెల్యే రిషికేశ్‌ పటేల్‌ కారుపై దాడి జరిగింది.

ఈ దాడికి పాల్పడింది పాటిదార్‌ ఆందోళనకారులేన‌ని ఆరోపణ‌లు రావ‌డంతో ఈ కేసులో హార్దిక్‌, లాల్జీ పటేల్‌లతో పాటు పలువురికి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. ఈ నేప‌థ్యంలో గురువారం హర్దిక్‌ కోర్టులో హాజరయ్యారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయ‌న‌కు బెయిల్‌ మంజూరు చేసింది. 2015లో హార్దిక్‌ పటేల్‌ ఆధ్వర్యంలో పటేల్‌ వర్గీయులు పెద్దఎత్తున ఉద్య‌మం చేపట్టిన సంగ‌తి విదిత‌మే.

Related News