2.0

‘2.0’ టీజ‌ర్ అప్‌డేట్‌

Updated By ManamMon, 05/21/2018 - 15:48

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘2.0’. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్ర టీజర్‌ను ఐ.పి.ఎల్ ఫైనల్ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ నెల 27న ముంబైలో విడుద‌ల చేయ‌నున్నారు. అత్యున్న‌త సాంకేతిక విలువ‌ల‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.



40 రోజుల‌కి రూ.65 కోట్లు.. ర‌జ‌నీకాంత్ స్టామినా ఇది

Updated By ManamThu, 05/03/2018 - 16:34

rajiniసూపర్‌స్టార్‌ రజనీకాంత్ ఈ ఏడాదిలో రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. జూన్ 7న 'కాలా'తోనూ.. ఈ ఏడాది ద్వితీయార్థంలో '2.0'తోనూ ఆయ‌న ప‌ల‌క‌రించనున్నారు. ఇదిలా ఉంటే.. యువ ద‌ర్శ‌కుడు కార్తిక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ర‌జ‌నీ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇది ర‌జ‌నీ 165వ చిత్రం కావ‌డం విశేషం. స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో సంద‌డి చేయ‌నున్నారు. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ సంగీత‌మందించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమా కోసం ర‌జ‌నీ 40 రోజుల కాల్షీట్స్ కేటాయించార‌ని.. అలాగే రూ.65 కోట్ల పారితోషికం తీసుకోనున్నార‌ని తెలిసింది. అయితే.. ఈ వార్త‌ల్లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.



'2.0'లో ఐశ్వ‌ర్యారాయ్‌?

Updated By ManamThu, 04/05/2018 - 22:45

aishwarya raiసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. గ‌తంలో ర‌జ‌నీ, శంక‌ర్ జట్టుక‌ట్టిన 'రోబో'లో ఐశ్వ‌ర్య క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే.  తాజా చిత్రం 'రోబో'కి సీక్వెల్ కాదంటూ శంక‌ర్ ప‌లు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ నేప‌థ్యంలో ఐశ్వ‌ర్య ఎంట్రీ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.



'కాలా'కు రూ.75 కోట్ల శాటిలైట్ రైట్స్‌

Updated By ManamTue, 03/20/2018 - 14:36

kaalaaసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం 'కాలా'. 'క‌బాలి' ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ర‌జ‌నీ అల్లుడు, యువ క‌థానాయ‌కుడు ధ‌నుష్ నిర్మించిన సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 27న ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ రూ.75 కోట్ల వ‌ర‌కు అమ్ముడ‌య్యాయ‌ని వినిపిస్తోంది. స్టార్ యాజ‌మాన్యం.. అన్ని భాష‌ల‌కుగానూ ఈ సినిమా హ‌క్కుల‌ను ఈ మొత్తంలో కొనుగోలు చేసింద‌ని స‌మాచారం. ర‌జ‌నీ న‌టించిన మ‌రో చిత్రం '2.0'కి సంబంధించిన‌ శాటిలైట్స్ రైట్స్ రూ.110 కోట్ల మొత్తానికి అమ్ముడ‌య్యాయి. ఆ మొత్తంతో పోలిస్తే.. ఇది త‌క్కువ‌నే చెప్పాలి.



హిమాల‌యాల‌కు వెళుతున్న ర‌జ‌నీ

Updated By ManamFri, 03/09/2018 - 19:03

rajaniసూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హిమాల‌యాల‌కు త‌రుచుగా వెళ్తూ ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. మ‌రోసారి ఆయ‌న హిమాల‌యాల‌కు వెళ్ళేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. రేపు (శ‌నివారం) అక్క‌డికి చేరుకుని.. తిరిగి మ‌రో వారం త‌రువాత వ‌చ్చేలా ప్లాన్ చేసుకున్నారు సూప‌ర్ స్టార్‌. ఇటీవ‌లే రాజ‌కీయ అరంగేట్రం చేసిన ర‌జ‌నీ.. హిమాల‌యాల‌కు వెళ్ళి అక్క‌డ బాబాల ఆశీర్వాదం తీసుకోనున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాల‌ స‌మాచారం.  ఇదిలా ఉంటే.. ర‌జ‌నీ తాజా చిత్రం 'కాలా' ఏప్రిల్ 27న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. అలాగే శంక‌ర్ డైరెక్ష‌న్‌లో న‌టించిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్ల‌ర్ '2.0' ఈ ఏడాది ద్వితీయార్థంలో తెర‌పైకి రానుంది.



'2.0'.. వి.ఎఫ్‌.ఎక్స్ వ‌రల్డ్ ఎలా ఉంటుందంటే..

Updated By ManamMon, 03/05/2018 - 17:38

2.0'రోబో' వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో సైంటిఫిక్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన‌ ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. డ‌బుల్ ఆస్కార్ అవార్డ్స్ గ్ర‌హీత‌ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం త్వ‌ర‌లోనే తెర‌పైకి రానుంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే సిద్ధ‌మైన '2.0' టీజ‌ర్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుద‌ల చేయ‌క‌ముందే.. ఎవ‌రో దుండ‌గులు లీక్ చేసి ఆన్‌లైన్‌లో ఉంచిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. చిత్ర బృందం '2.0' వి.ఎఫ్‌.ఎక్స్ వ‌ర‌ల్డ్ నుంచి స్నీక్ పీక్ అంటూ ఓ వీడియోని విడుద‌ల చేసింది. సాంకేతికంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉండ‌బోతోందో ఈ వీడియో చూస్తే ఓ అంచ‌నాకి వ‌చ్చేయొచ్చు. మొత్త‌మ్మీద 'రోబో' మ్యాజిక్ మ‌రోసారి వెండితెర‌పై రిపీట్ కాబోతుంద‌న్న‌మాట‌.



'2.O' టీజ‌ర్ లీక్‌పై ర‌జ‌నీ కుమార్తె స్పంద‌న‌

Updated By ManamSun, 03/04/2018 - 14:53

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ క‌ల‌యిక‌లో '2.O' సినిమా తెర‌కెక్కిన‌ విష‌యం విదిత‌మే. ఎమీ జాక్స‌న్ క‌థానాయికగా న‌టించిన ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా క‌నిపించ‌నున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన‌ ఈ చిత్రం విడుద‌ల తేదిపై ఇప్ప‌టికీ సందిగ్ధం నెల‌కొనిఉండ‌గా.. క‌నీసం టీజ‌ర్‌నైనా చూడాల‌ని ఆశ‌ప‌డుతున్న ర‌జ‌నీ అభిమానుల‌కు ఆ ఆశ కూడా నెర‌వేర‌డం లేదు. దీనిని ఆస‌రాగా తీసుకుని కొంత‌మంది దుండ‌గులు.. తాజాగా టీజ‌ర్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాల‌ను ఆన్ లైన్‌లో లీక్ చేసేశారు. 

ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌జ‌నీ కుమార్తె సౌంద‌ర్య స్పందిస్తూ, "అధికారికంగా విడుద‌ల కాని టీజ‌ర్‌ను ఇలా ఆన్ లైన్‌లో విడుద‌ల చేయ‌డం స‌హించ‌రానిది. ఇటువంటి వాటిని ప్రోత్స‌హించ‌కూడ‌దు. కొన్ని నిమిషాల ఆనందం కోసం నిర్మాత‌ల కృషినీ, ప్ర‌య‌త్నాన్నీ, క‌ష్టాన్నీ విస్మ‌రించి ఇలా చేయ‌డం మ‌తిలేని చ‌ర్య" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

 



 '2.0' టీజ‌ర్ లీకైంది

Updated By ManamSun, 03/04/2018 - 12:08

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్, సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం '2.0'. బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రంలో ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించింది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ చిత్రం గ‌త ఏడాది దీపావ‌ళికే విడుద‌ల కావాల్సి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదాలు ప‌డింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ సినిమాని ఆగ‌స్టు లేదా ఈ ఏడాది దీపావ‌ళికి తెర‌పైకి తీసుకువ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేదు. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న యూనిట్‌కు.. ఓ షాక్ త‌గిలింది. అదేమిటంటే.. ఇప్ప‌టికే రెడీ అయిన‌ టీజ‌ర్.. గ‌త రెండు రోజులుగా ఆన్‌లైన్‌లో ద‌ర్శ‌న‌మిస్తోంద‌ని కోలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. టీజ‌ర్‌ను లీక్ చేసిన దుండ‌గుల‌పై చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోబోతోంద‌ని తెలిసింది. అలాగే డ్యామేజ్‌ను కంట్రోల్ చేయ‌డానికి నిర్ణీత స‌మ‌యం కంటే ముందే ఈ టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని స‌మాచారం.



మ‌ళ్ళీ వాయిదా ప‌డ‌నున్న '2.0'?

Updated By ManamTue, 01/30/2018 - 19:27

2.0ర‌జ‌నీకాంత్ అభిమానులే కాకుండా భార‌తీయ సినీ ప్రేమికులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న చిత్రం '2.0'. ద‌క్షిణాది అగ్ర ద‌ర్శ‌కుడు శంక‌ర్ రూపొందించిన ఈ చిత్రం నిర్మాణ వ్య‌వ‌హారాలు పూర్తిచేసుకున్నా.. వి.ఎఫ్‌.ఎక్స్ కార‌ణాల‌తో విడుద‌ల విష‌యంలో వాయిదాల ప‌ర్వం కొన‌సాగిస్తోంది. తొలుత దీపావ‌ళికి వ‌స్తుంద‌నుకున్న సినిమా కాస్త‌.. జ‌న‌వ‌రి 26కి వాయిదా ప‌డింది. అక్క‌డితో ఆగ‌కుండా.. ఏప్రిల్‌కి పోస్ట్ పోన్ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న చెన్నై క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం మ‌రో మారు వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మ‌రో 2, 3 నెల‌ల త‌రువాతే '2.0' తెర‌పైకి వ‌స్తుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై క్లారిటీ వ‌స్తుంది. ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టించిన '2.0'లో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ స్వ‌రాలు అందించారు.



ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ‘2.0’ టీజ‌ర్‌?

Updated By ManamSun, 01/28/2018 - 23:26

2.0సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్‌,  సూప‌ర్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ చిత్రం ‘2.0’. ఎమీ జాక్స‌న్ క‌థానాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో అక్ష‌య్ కుమార్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించాడు. వేస‌వి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. త్వరలోనే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల శంకర్  ట్విట్ట‌ర్‌లో ప్రకటించారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేయాలని చిత్ర దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ టీజ‌ర్ కార్యక్రమం జరిగే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచార‌మ్‌. ఒకేసారి.. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన‌ టీజర్‌ల‌ను విడుదల చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ న‌టుడుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, మ‌ల‌యాళ అగ్ర‌తార‌లు మోహన్‌లాల్‌, మమ్ముట్టి కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.





Related News