History

రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్

Updated By ManamWed, 09/12/2018 - 11:55

Mithali Rajభారత మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు నాయకత్వం వహించిన కెప్టెన్‌గా మిథాలీ నిలిచారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ మైలురాయిని అందుకున్నారు. కాగా ఇప్పటివరకు 195 వన్డేలను ఆడిన మిథాలీ 118 వన్డేలను కెప్టెన్‌గా వ్యవహరించారు. దీని ద్వారా ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్ చార్లెస్ ఎడ్వర్ట్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు.‘సైరా’ చరిత్రలో నిలిచిపోతుంది!

Updated By ManamWed, 08/22/2018 - 19:01

Sye Raa Movie Creates History Said T Subbarami Reddy

నేడు అనగా ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మరోవైపు కొందరు అభిమానులు సేవా కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. చిరుకు కాంగ్రెస్ సీనియర్ నేత, సినీ ఇండస్ట్రీకి బాగా కావాల్సిన వ్యక్తి టి. సుబ్బరామిరెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న టీఎస్సార్‌ను బుధవారం మధ్యాహ్నం చిరు పరామర్శించారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన చిరుకు టీఎస్సార్ పుష్పగుచ్చమిచ్చి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సుమారు అరగంట ఇద్దరూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సుబ్బరామిరెడ్డి మోకాలికి ఇటీవల విదేశాల్లో శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చిరు.. ఆయన ఇంటికెళ్లి పరామర్శించారు.

Sye Raa Movie Creates History Said T Subbarami Reddy

ఈ సందర్భంగా.. ‘సైరా’ సినిమా గురించి మాట్లాడిన టీఎస్సార్.. ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సినిమా తప్పకుండా ఘన విజయం సాధించి.. చరిత్రలో నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. చిరుతో పాటు చిత్ర సమర్పకురాలు సురేఖ, చిత్ర నిర్మాత రాంచరణ్‌, దర్శకుడు సురేందర్ రెడ్డికి చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.శభాష్ హిమ.. రన్నింగ్‌లో చరిత్ర

Updated By ManamFri, 07/13/2018 - 10:56

hima das న్యూఢిల్లీ: ఇండియన్ స్పింటర్ హిమా దాస్ కొత్త చరిత్ర సృష్టించింది. ఫిన్‌లాండ్ టాంపెర్‌లో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్  ఛాంపియన్‌షిప్స్‌లో 400మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచిన హిమా దాస్.. ఈ పతకం సాధించిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఈ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా కూడా ఆమె ఘనతను సాధించింది.

అస్సాంకు చెందిన 18సంవత్సరాల వయసున్న హిమ 51.46 సెకన్లలో ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక రొమేనియాకు చెందిన ఆండ్రియా మిక్‌లోస్ రెండో స్థానంలో నిలవగా.. అమెరికాకు చెందిన టేలర్ మన్‌సన్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లోనూ 51.32 టైమింగ్‌తో హిమ ఆరోస్థానంలో నిలిచింది. 

మరోవైపు హిమా దాస్ విజయంపై పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్ హిమ అంటూ సోషల్ మీడియాలో తమ అభినందనలు తెలిపారు. వారిలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, క్రీడామంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, బబితా పొగత్, సునీల్ చెత్రి, అక్షయ్ కుమార్, ఫర్హాన్ అక్తర్, తాప్సీ తదితరులు ఉన్నారు.

 

Related News