google

ఐఫోన్లు వద్దు ఆండ్రాయిడ్ వాడండి...

Updated By ManamThu, 11/15/2018 - 18:55
  • ఆపిల్ వర్సెస్ ఫేస్‌బుక్

  • ఫేస్‌బుక్ పట్ల జాగ్రత్తగా ఉండాలి: టిమ్‌కుక్

  • ఐఫోన్లు ఎవరూ వాడొద్దు: జుకర్ బర్గ్

zuckerberg orders Facebook employees to give up iPhone

కాలిఫోర్నియా : ఆపిల్ ఫోన్, ఫేస్‌బుక్ సీఈవోల మధ్య రగడ మొదలైంది. డాటా చౌర్యం ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తన ఉద్యోగులకు ఆపిల్ సీఈవో టిమ్ కుక్ సూచించిన నేపథ్యంలో..  ఫేస్‌బుక్ సీఈవో జుకర్‌బర్గ్ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఆపిల్ ఫోన్లతో పాటు ఆ సంస్థ తయారు చేసే ఇతర ఉత్పత్తులను వాడకూడదని ఫేస్‌బుక్ ఉద్యోగులకు ఆయన సూచించినట్లు తెలిసింది.

ఐఫోన్ బదులు ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లను వాడాలని ఆయన కోరినట్లుగా అమెరికాకు చెందిన ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో టిమ్ కుక్ మాట్లాడుతూ.. తమ వినియోగదారుల ప్రైవసీని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని, డాటా చౌర్యం తదితరాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్‌ను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా అందరూ భావిస్తున్నారు. ఈనేపథ్యంలో జుకర్‌బర్గ్ కూడా అదే స్థాయిలో స్పందించారు.   డేటా చోరీ ఆరోపణలు.. గూగుల్ ప్లస్ మూసివేత

Updated By ManamTue, 10/09/2018 - 08:56

Google +ప్రముఖ సర్చ్ ఇంజన్ గూగుల్.. తమకు చెందిన సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్ గూగుల్ ప్లస్‌ను మూసివేయనున్నది. సాంకేతిక సమస్యల కారణంగా సుమారు 5లక్షల మంది గూగుల్ ప్లస్ యూజర్ల డేటా చోరీ అయినట్లు ఆరోపణలు రాగా.. ఆ సైట్‌ను మూసివేయాలని సంస్థ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ విషయాన్ని గూగుల్ ప్లస్ వైస్ ప్రసిడెంట్ బెన్ స్మిత్ వెల్లడించారు.

అయితే ఆరునెలల క్రితమే ప్రాజెక్ట్ స్ట్రోబ్ కింద గూగుల్ చేపట్టిన సెర్చ్‌లో టెక్నికల్ బగ్‌ను గుర్తించారు. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ సమీక్ష నిర్వహించి విరుగుడు కూడా కనుగొన్నారు. కాగా ఆ 5లక్షల యూజర్ల డేటాకు ఎలాంటి హాని జరగలేదని గూగుల్ వెల్లడించింది. వారి డేటాలో పేరు, ఈ-మెయిల్ అడ్రస్, వృత్తి, జెండర్, వయసు మాత్రమే ఉంటాయని.. మిగిలిన డేటాకు ఎలాంటి హాని జరగలేదని సంస్థ వెల్లడించింది.వెంటాడే గూగుల్!

Updated By ManamTue, 08/14/2018 - 07:20
  • వద్దని చెప్పినా వినని సెర్చింజన్.. ప్రైవసీ సెట్టింగు మార్చినా అంతే

  • ఎక్కడెక్కడ తిరిగారో రికార్డు.. ప్రతి నిమిషం లొకేషన్ స్టోరేజి

  • సాంకేతిక నిపుణుల ఆందోళన.. లొకేషన్ ఆఫ్ చేసినా నోయూజ్

googleశాన్ ఫ్రాన్సిస్కో: సరదాగా గర్ల్‌ఫ్రెండుతో కలిసి ఇనార్బిట్ మాల్లో చక్కర్లు కొడదామని వెళ్లారు. అక్కడ మిమ్మల్ని ఎవరూ చూడలేదనుకుని సంబరపడ్డారు. అంతవరకు బాగానే ఉన్నా.. ఇంటికి తిరిగొచ్చిన తర్వాత ఐదు నిమిషాల్లో మీ భార్య మీ కాలర్ పట్టుకుని, ఇనార్బిట్ మాల్‌కి ఎవరితో వెళ్లావని అడిగేస్తారు. ఎవరూ చూడలేదే.. ఎవరు చెప్పారని మీరు కంగారు పడక్కర్లేదు. మీ ఫోనే ఆ విషయాన్ని మీ ఆవిడకు చెప్పేస్తుంది. అవును.. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో ఉన్న పలు రకాల యాప్‌లు మీ లొకేషన్ డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తున్నాయి. కేవలం గూగుల్ మ్యాప్స్ మాత్రమే కాక, ఇంకా అనేక యాప్‌లు మనం ఏ నిమిషం ఎక్కడికెళ్లామో అన్నీ గుర్తుపెట్టుకుంటున్నాయని ప్రిన్స్‌టన్‌లోని కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. తొలుత ఏదైనా యాప్ వేసుకునేటపుడు లొకేషన్  సమాచారానికి సంబంధించిన పర్మిషన్ అడుగుతుంది. సాధారణంగా మనం తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే అక్కడకు దారి చూపించడానికి గూగుల్ మ్యాప్స్ మన లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది. అప్పుడు మీ లొకేషన్ రికార్డు చేయడానికి అనుమతి ఇస్తే.. మీ టైమ్‌లైన్‌లో ఆ చరిత్ర మొత్తాన్ని డిస్‌ప్లే చేస్తుంది. అక్కడినుంచి మీరు ఏ నిమిషం ఎక్కడికెళ్లారో, ఏంటో అంతా చూపించి, గుట్టు రట్టు చేసేస్తుంది. మనం ఏ నిమిషంలో ఎక్కడికి వెళ్లామో అంతా రికార్డు చేయడం వల్ల వ్యక్తుల ప్రైవసీకి తీవ్ర భంగం వాటిల్లుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని సందర్భాలలో నిందితుల గుట్టు రట్టు చేయడానికి ఇది ఉపయోగపడుతున్నా, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఇతరులు తాము ఎక్కడికెళ్లామో ఎవరికీ తెలియకూడదని అనుకోవచ్చు. కానీ వాళ్ల గుట్టంతా ఇలా బయటపడిపోతే ఎలాగన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఈ విషయం మీద గూగుల్ సపోర్ట్ పేజి చూస్తే.. ఎప్పుడు కావాలంటే అప్పుడే లొకేషన్ హిస్టరీ టర్నాఫ్ చేసుకోవచ్చని, అలా చేస్తే ఇక మీరు వెళ్లే ప్రదేశాలు ఎక్కడా స్టోర్ కావని ఉంది. కానీ, అది ఏమాత్రం వాస్తవం కాదట. లొకేషన్ హిస్టరీ పాజ్  చేసినా కూడా.. కొన్ని గూగుల్ యాప్స్ ఆటోవేుటిగ్గా లొకేషన్ డేటాను స్టోర్ చేస్తున్నాయి. అదికూడా మనల్ని అడగకుండానే! ఉదాహరణకు మీరు కేవలం మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయగానే మీరు ఎక్కడున్నారన్న విషయాన్ని ఒక స్నాప్‌షాట్ తీసుకుని గూగుల్ స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లలో మీరు ఎక్కడుంటే అక్కడి వాతావరణ అప్‌డేట్లు వస్తుంటాయి. కొన్ని రకాల వస్తువుల కోసం మనం సెర్చ్ చేసినపుడు లొకేషన్‌తో పని ఉండదు. ఉదాహ రణకు వెన్నపూస, పూతరేకులు లాంటివి చూసినపుడు మన అక్షాంశ రేఖాంశాలతో సహా కచ్చితంగా మనకు ఎన్ని అడుగులు లేదా కిలోమీటర్ల దూరంలో అవి దొరుకుతాయో కూడా చెప్పేస్తుంది. అవన్నీ మన గూగుల్ అకౌంటులోకి స్టోర్ అయిపోతాయి. గూగుల్ వాళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ వాడుతున్న రెండు వందల కోట్ల యూజర్లకు ఈ తరహా ముప్పు పొంచిఉంది. అలాగే, మ్యాప్ లు లేదా సెర్చ్ కోసం గూగుల్‌ను వాడే ఐఫోన్ యూజర్లకూ ఇది తప్పదు. యూజర్ అనుమతి లేకుండా ఇలా వాళ్ల సమాచారాన్ని స్టోర్ చేయడం నిబంధనల ఉల్లంఘనే అని ప్రిన్స్‌టన్ కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్  చెప్పారు. అయితే దీనిపై గూగుల్ వాదన మరోలా ఉంది.చైనాలో రీ ఎంట్రీకి గూగుల్‌ యత్నం

Updated By ManamFri, 08/03/2018 - 11:53
google-china

చైనా నిబంధ‌న‌ల‌ను త‌ట్టుకోలేక బ‌య‌ట‌కు వ‌చ్చిన గూగుల్ తిరిగి అక్క‌డ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు ప్రారంభించింది.  డ్రాగ‌న్‌ సెన్సార్‌షిప్‌, హ్యాకింగ్ కార‌ణంగా 2010లో అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అక్క‌డ గూగుల్ సెర్చ్ ఇంజిన్‌, గూగుల్ మెయిల్, ప్లే యాప్ స్టోర్‌ త‌దిత‌రాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో మ‌రో ప్ర‌త్యామ్నాయంతో అడుగు పెట్టేందుకు చైనా అధికారుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది.

బ్లాక్‌ లిస్టెడ్‌ సెర్చ్‌ అనే మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. దీని కోసం ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంకు మార్పులు చేసి చైనా అధికారులకు చూపించింది.  అయితే, ఈ వార్తలపై గూగుల్‌ స్పందించ‌లేదు. గూగుల్ ప్ర‌య‌త్నాల‌పై చైనా మాన‌వ హ‌క్కుల సంఘం తీవ్రంగా స్పందించింది. చైనా సెన్సార్‌షిప్‌న‌కు గూగుల్ అంగీక‌రించ‌డం ఇంట‌ర్‌నెట్ స్వ‌తంత్ర‌త‌కు చీక‌టి రోజుగా అభివ‌ర్ణించింది.అతగాడికి గూగుల్, నెట్‌ఫ్లిక్స్‌లో ఆఫర్

Updated By ManamTue, 07/31/2018 - 11:31
david castarez

ఉద్యోగం కోసం రోడ్డెక్కిన అమెరికన్ యువకుడికి అదృష్టం అందలం ఎక్కించింది. జాబ్ కావాలంటూ రోడ్డుపై రెజ్యూమ్స్ పంచిన అతగాడికి ఇప్పుడు ఆఫర్స్ వెల్లువెత్తాయి. ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ రారాజు గూగుల్ మొదలు ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్, లింక్డిన్‌ వరకూ  ఉద్యోగాలు ఇస్తామంటూ ముందుకు వచ్చాయి. దీంతో ‘నక్క తోకను తొక్కిన’ సామెత ఈ యువకుడి వర్తిస్తుందనుకుంట. 

వివరాల్లోకి వెళితే...కాలిఫోర్నియాకు చెందిన డేవిడ్ కసరెజ్ వెబ్ డెవలపర్‌గా పని చేసేవాడు. అయితే ఓ ఏడాదిగా అతడికి జాబ్ లేకపోవడంతో కారులోనే కాలం గడిపేస్తున్నాడు. ఉండటానికి ఇల్లే కాకుండా పని చేసేందుకు జాబ్ లేదు. దీంతో పలుచోట్ల ఫ్రీలాన్సర్‌గా పని చేసినా... అవి తన అవసరాలను తీర్చలేకపోయాయి. దీంతో డేవిడ్ అందరు వెళ్లే దారిలో కాకుండా నా రూటే సపరేట్ అంటూ నీట్‌గా రెడీ అయి... ఫ్లకార్డు చేతపట్టి రోడ్డెక్కాడు.

‘ఉండేందుకు ఇల్లు, చేసేందుకు జాబ్ లేదు. నా రెజ్యూమ్ తీసుకోండి’ అంటూ ఫ్లకార్డు పట్టుకుని రోడ్డుపై నిలబడి...తన బయోడేటాను పంచడం మొదలుపెట్టాడు. ఈ తతంగాన్ని అంతా గమనించిన ఓ మహిళ... డేవిడ్ ఫోటోతో పాటు అతగాడి రెజ్యూమ్‌ను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో డేవిడ్‌కు జాబ్ ఆఫర్స్ క్యూ కట్టాయి. గూగుల్‌ సహా 200 కంపెనీలు జాబ్ ఆఫర్స్ ఇచ్చినట్లు అతడు తెలిపాడు. అయితే తన ఫోటోతో పాటు రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మహిళకు డేవిడ్ కృతజ్ఞతలు తెలిపాడు.గూగుల్ యాడ్ సెన్స్ ఇక తెలుగులో

Updated By ManamWed, 06/27/2018 - 23:39

GOOGLEహైదరాబాద్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ దాని ప్రకటన ఉత్పత్తులైన గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ యాడ్‌సెన్స్‌లలో తెలుగు సపోర్ట్‌ను ఇస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించింది. తెలుగు వెబ్‌సైట్లు, అడ్వర్‌టైజర్‌లకు తెలగు భాషలో యాడ్ సెన్స్‌ను అందుభాటులోకి తెస్తున్నాం.దీని ద్వారా లక్షలాదిగా ఉన్న తెలుగు ఇంటర్నెట్ యూజర్లకు గూగుల్ చేరువకానుంది అని గూగుల్ సాత్ ఈస్ట్ ఏషియా, ఇండియా ఉపాధ్యక్షులు ఆనందన్ తెలిపారు. ‘‘ భారతీయ భాషల్లో యాడ్‌సెన్స్‌ను అందుభాటులోకి తీసుకురావడంతో పాటు, వంద కోట్ల భారతీయులకు ఇంటర్నెట్ ఉపయోగపడేల చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన అన్నారు. తెలుగు లో వెబ్ సైట్లను నడిపిస్తున్న వారు ఇకపై తమ అకౌంట్‌తో లాగ్ ఇన్ అయ్యి గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్‌ని పొందవచ్చన్నారు. దీని ద్వారా వారి కంటెంట్‌ను వారి వినియోగదార్లకు  సేవలంధించడంతో పాటు ఆదాయాన్ని పొందవచ్చని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతీయ భాషల్లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారిలో దేశీయంగా 234 మిలియన్‌ల మంది ఉన్నారని, 2021నాటికి ఆ సంఖ్య 536 మిలియన్లకు చేరనున్నట్లు గూగుల్ ఇండియా మార్కెటింగ్ సర్వీస్ డైరెక్టర్ షాలిని గిరీష్ అన్నారు.  హిందీ, బెంగాలి, తమిళ భాషల్లో గూగుల్ యాడ్ సెన్స్‌ను అందుబాటులోకి తర్వాత ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి తెస్తున్నాం అని ఆమె తెలిపారు. ‘భారత సినీ పితామహుడు’కి గూగుల్ నివాళి

Updated By ManamMon, 04/30/2018 - 09:53
Dada Saheb Phalke

‘భారత సినిమా పితామహుడు’ దాదా సాహెబ్ ఫాల్కే 148వ జయంతి సందర్భంగా ఆయనకు గూగుల్ నివాళులు అర్పించింది. గూగుల్ డూడుల్‌ను ఆయన ఫొటోలతో నింపి ఆయనకు ఘనంగా నివాళులు ఇచ్చింది. 

అయితే ఇప్పటి మహారాష్ట్రలోని త్రింబక్‌లో పుట్టిపెరిగిన ఫాల్కే చిన్నప్పటి నుంచే సినిమాకు సంబంధించిన వివిధ కళలపై మక్కువను చూపి వాటిపై పట్టు సాధించారు. ఈ క్రమంలో 1910లో అలీస్ గై దర్శకత్వంలో వచ్చిన మూకీ చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ క్రిస్ట్‌’ చిత్రానికి పనిచేసిన ఫాల్కే ఆ సమయంలోనే సినిమాలను తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ తరువాత లండన్‌ వెళ్లి ఫిల్మ్‌ మేకింగ్ నేర్చుకొని వచ్చిన ఆయన 1931 సంవత్సరంలో భారత సినిమా తెరపై మొదటిసారిగా ‘రాజా హరిశ్చంద్ర’ అనే మూకీ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతి సినిమాలలో ఆయన భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. అలాగు 19 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 130 చిత్రాలు తీశారు. ఇక ఫాల్కే చివరి చిత్రం ‘గంగావతారన్’ 1932లో విడుదల కాగా.. 1944 ఫిబ్రవరి 16న ఆయన మరణించారు. ఆ తరువాత 1969లో భారత ప్రభుత్వం ఆయన సేవలకు గుర్తుగా ఆయన పేరుపై అవార్డును ప్రకటించింది. సినిమా రంగంలో అత్యుత్తమ సేవలు చేసే వారికి ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందిస్తుంటారు. భారత సినిమాకు సంబంధించిన అత్యుత్తమ అవార్డులలో ఇది ఒకటి కావడం విశేషం.గూగుల్ జరిమానాపై స్టే

Updated By ManamFri, 04/27/2018 - 22:18

NCLAT-Googleన్యూఢిల్లీ: ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో అసమంజస వ్యాపార విధానాలకుగాను గూగుల్‌పై భారతీయ కాంపిటీషన్ కమిషన్ (సి.సి.ఐ) విధించిన రూ. 136 కోట్ల జరిమానా పైన  జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ శుక్రవారంనాడు స్టే విధించింది. కమిషన్ ఆదేశంపై గూగుల్ పెట్టుకున్న అభ్యర్థనను అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎస్.జె. ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఎన్.సి.ఎల్.ఎ.టి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. జరిమానా మొత్తంలో 10 శాతాన్ని నాలుగు వారాల లోపల  తన వద్ద డిపాజిట్ చేయాలని ఆ ఇంటర్‌నెట్ దిగ్గజాన్ని ఆదేశించింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ ఈ అంశంపై తదుపరి విచారణను మే 28కి వాయిదా వేసింది. ‘‘కాంపిటీషన్ కమిషన్ నిర్ణయానికి సంబంధించిన వివిధ కోణాలను, ఆ సందర్భంగా అది పేర్కొన్న అంశాలను సమీక్షించాలని మేం పెట్టుకున్న అప్పీలును అప్పిలేట్ ట్రైబ్యునల్ విచారణకు స్వీకరించింది’’ అని గూగుల్ ప్రతినిధి వెల్లడించారు. ఆన్‌లైన్ సెర్చ్‌కి ఇండియన్ మార్కెట్‌లో అసమంజస వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సెర్చ్ ఇంజన్ గూగుల్‌పై ఈ ఏడాది ఫిబ్రవరిలో కాంపిటీషన్ కమిషన్ రూ. 136 కోట్ల జరిమానా విధించింది. ఏనాడో 2012లో వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ ఆ విధమైన ఆదేశాన్ని జారీ చేసింది. యాంటి-ట్రస్ట్ కాన్‌డక్ట్‌ను ఉల్లంఘించినందుకు గూగుల్‌పై జరిమానా విధిస్తున్నట్లు కమిషన్ పేర్కొంది. వివిధ వ్యాపార విభాగాల నుంచి 2013, 2014, 2015 సంవత్సరాల్లో ఇండియా నుంచి వచ్చిన కంపెనీ మొత్తం సగటు రాబడిలో 5 శాతాన్ని (రూ. 135.86 కోట్లను) జరిమానా మొత్తంగా నిర్ణయించినట్లు కమిషన్ తెలిపింది. గూగుల్ ఎల్.ఎల్.సి, గూగుల్  ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గూగుల్ ఐర్లాండ్ లిమిటెడ్‌లపై 2012లో మ్యాట్రిమొని డాట్‌కామ్, కన్జ్యూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీలు చేసిన ఫిర్యాదులపై కమిషన్ ఆ విధమైన రూలింగ్ ఇచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆ యాప్‌లు అవుట్

Updated By ManamTue, 03/06/2018 - 14:34

googleతమ పాలసీలను ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలతో పది యాప్స్‌ను తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ సంస్థ తొలగించేసింది. అందులో ఇటీవల వైరల్‌గా మారిన సారా(Sarah) మెస్సేజింగ్ యాప్ కూడా ఉంది. దాంతో పాటు సీఎం ఇన్‌స్టాల్లర్, యూట్యూబ్‌ నుంచి వీడియోలు డౌన్‌లోడ్ చేసుకునే ట్యూబ్‌మెట్, నచ్చిన టీవీ షోను చూసుకునేందుకు వీలు కల్పించే పాప్‌కార్న్ టైమ్, యాడ్ బ్లాక్ యాప్‌లైన యాడ్‌అవే, లక్కీ పాచర్.. గ్రూవ్‌షార్క్, అమేజాన్ అండర్ గ్రౌండ్, పీఎస్ఎక్స్4డ్రాయిడ్, రష్ పోకర్‌లను తమ ప్లే స్టోర్ నుంచి తీసేసింది గూగుల్. ఇవన్నీ తమ పాలసీలను ఉల్లంఘిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది.పాక్ ఫ్యాన్స్ మనసు దోచిన కోహ్లీ

Updated By ManamSat, 12/16/2017 - 16:55

virat kohliఇది నమ్మశక్యం కాకున్నా...పచ్చి నిజం. ఈ ఏడాది పాకిస్థాన్‌లో అత్యధికులు గూగుల్‌లో సెర్చ్ చేసిన క్రికెటర్  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారత్‌లోనే కాదు పాకిస్థాన్‌లోనూ విరాట్ కోహ్లీకున్న తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్‌కు ఇది అద్ధంపడుతోంది. విరాట్ కోహ్లీకి భారత్ ఉపఖండంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. అయితే పాకిస్థాన్ క్రికెటర్ల కంటే ఎక్కువగా కోహ్లీ కోసం పాకిస్థాన్ క్రికెట్ అభిమానులు గూగుల్‌లో సెర్చ్ చేయడం విశేషం. పాక్ క్రికెట్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ తర్వాత ఎక్కువగా పాక్ కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్, ఫేసర్ మొహమద్ అమీర్, బ్యాట్స్‌మన్ అహ్మద్ షేజాద్ కోసం గూగుల్ చేశారు.

మైదానంలోనూ, మైదానానికి బయట ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో కోహ్లీ ఫ్రెండ్లీగా ఉంటాడన్న గుర్తింపు ఉంది. గతంలో పాక్ ఆటగాళ్లను మీడియా ముఖంగా కోహ్లీ మెచ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. డిసెంబరు 11న అనుష్క శర్మను పెళ్లాడిన కోహ్లీకి...పలువురు పాక్ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు విషెస్ చెప్పారు. 

Related News