olive oil

చేతి గోర్లు అందంగా,ఆరోగ్యంగా ఉండటానికి... 

Updated By ManamTue, 09/04/2018 - 14:42

nailsసాధారణంగా అమ్మాయిలు చేతి గోర్లను చాల జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇంట్లో పనుల వలన గోర్లు విరిగిపోవడం, పొడిబారిపోవడం సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ చూసి తెలుసుకోండి.

ఆలివ్ ఆయిల్... 
ఆలివ్ ఆయిల్ ఎంత సహజసిద్ధమైందో తెలిసిందే. అలాంటి ఆలివ్ ఆయిల్‌ను గోర్లకు వాడడం వలన సరైన పోషణ అంది.. అవి బలంగా, అందంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

పోషకాహారాన్ని తీసుకోవాలి..
గోర్లు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన ఆహారం గుడ్లు, క్యాలీఫ్లవర్, అవకాడ్. ఇవి ఎక్కువగా తీసుకోవడం వలన గోర్లకు సరైన పోషణ అంది అందంగా కనిపిస్తాయి.

గోర్లకు ఎక్కువ ఒత్తిడి ఇవ్వకూడదు..

నీటిలో గోర్లు ఎక్కువసేపు ఉండడం వలన వాటి దృఢత్వవాన్ని కోల్పోయి విరిగిపోతాయి. అందుకే చేతికి గ్లౌజులు వాడి వాటిని సంరక్షించుకోవాలి. అలాగే వాటిని నీటిలో ఎక్కువ సమయం ఉంచకుండా చూసుకోవాలి అప్పుడే అవి ఆరోగ్యాంగా ఉంటాయి..



ఆలీవ్ ఆయిల్‌తో మేకప్..ప్యాకప్

Updated By ManamWed, 07/18/2018 - 16:59
make-up

మేకప్ వేసుకోవడం ఈజీనే. ముఖానికి మేకప్ వేసుకున్నప్పుడు ఎంత అందంగా ఉన్నా... దాన్ని తొలగించాలంటే మాత్రం కొంచెం కష్టమైన పనే.  మరి  మేకప్‌ని సులువుగా తొలగించాలంటే ఈ టిప్స్‌ను ఫాలో అయితే సరిపోతుంది.

మేకప్‌ని సులువుగా తొలిగించడానికి ప్రతిసారి కెమికల్స్ ఉపయోగిస్తే ముఖం మీద మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంట్లో అందుబాటులో ఉండే పాలతో సులభంగా మేకప్‌ను తీసేయవచ్చు.  పాలల్లో రెండు చుక్కలు అలివ్ నూనె కలిపి దాన్ని దూదితో తుడిస్తే చాలు మేకప్ చాలా ఈజీగా పోతుంది.

ఇంకొన్ని చిట్కాలు... 
వంటసోడా, తేనె కలిసి మేకప్‌ని శుభ్రపరుచుకోవచ్చు. ఈ చిట్కా వాడటం వల్ల చర్మంపై తేమ, మృదుత్వాన్ని కోల్పోకుండా చేస్తుంది.అలాగే వాటర్ ప్రూప్ మేకప్ తొలిగించడం కూడా కష్టమే. దాన్ని తొలగించాలంటే చాలా టైమ్ పడుతుంది. అలాంటప్పుడు కొబ్బరినూనెలో తేనేని కలిపి ముఖానికి రాసుకొని పదినిమిషాలు ఉంచి, ఆ తర్వాత నీళ్లతో కడుక్కుంటే సరిపోతుంది.





Related News