mathanam

పొగాకుపై నియంత్రణ సాధించలేమా?

Updated By ManamMon, 11/05/2018 - 01:19

imageమద్యపానం, ధూమపానాలు అనేవి జాతి సంక్షేమాన్ని, సౌభాగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న వ్యసనాలు కాగా అందులో మొదటిది పిశాచైతే, రెండవది దెయ్యమని మహాత్మా గాంధీ ఎప్పుడో సెలవిచ్చారు. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, చుట్టా, బీడీ, జర్దా ఇలా ఒక్కొక్క దాంట్లో ఎన్నో మరెన్నో రకాలు. నాణ్యతను బట్టి కొన్ని, రుచిని బట్టి కొన్ని, పరిమా ణాన్ని బట్టి కొన్ని, ఇలా ఎన్ని ఉన్నా చివరికి వాటి ముడి పదా ర్థం మాత్రం పొగాకు. వీటిని వినియోగించే వారికీ మాత్రమే గాకుండా, వారి పక్కనున్న వారికీ హాని కల్గించే శక్తి కలిగిన పొగాకును ఎవరైనా ఒక్కసారి రుచి చూశారా? అంతే వారు వాటి బారిన పడాల్సిందే. అంత సులభంగా వదులుకునే ప్రస క్తే ఉండదు.

ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే ఒక సిగరెట్ షేర్ చేసుకుంటూ మాట్లాడుకుంటారు. మెకానిక్స్ డ్రైవర్లల్లో ఎక్కువ శాతం గుట్కా, సిగరెట్ అలవాటు ఉన్నవారే ఉంటారు. రైతు, కూలీ కుటుంబాలలో బీడీ, చుట్టా, జర్దా అంటూ పొగాకున్న వారే అనేకం. మానసిక వ్యధతో బాధపడేవారు, ప్రశాంతతకై కొందరు, ఫ్యాషన్‌కని కొందరు దీని బారిన పడుతుంటారు. ప్రత్యేకంగా రాత్రి సమయాలలో పనిచేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి ఎక్కువశాతం పొగాకును వినియోగిస్తున్నారనడం లో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇలా విద్యార్థులు, విద్యావేత్తలు, మేస్త్రీలు, సుతారీలు, కార్మికులు, రైతులు, పేద, ధనిక, ఆడ, మగ, చిన్న, పెద్ద అని ఎలాంటి తారతమ్య భేదాలు లేకుండా వారు వారి స్తోమతను బట్టి వీటి బారినపడినవారే వుంటారు. పొగాకు ఏ రకంగా ఉపయోగించిన అదిచేయాల్సిన పనిని మా త్రం తప్పకుండా చేసి తీరుతుంది. విశ్వవ్యాప్తంగా ఏటా మద్యం కారణంగా సంభవిస్తున్న మరణాల కన్నా, మాదక ద్ర వ్యాల వాడకం వల్ల అర్ధాయుష్కులవుతున్న అభాగ్యుల సంఖ్యే అధికమని, 2030 నాటికీ పొగాకు సంబంధిత మరణాలు అత్యధికంగా ఇండియాలో నమోదవుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడం సగటు భారతీయుడిని కలవపరిచే విష యం. చైనా తర్వాత ధూమకేతులు అత్యధికంగా ఉన్న దేశం భారత్ కాగా, దాదాపు 57 శాతం పురుషులు, 11 శాతం మహిళలు ఏదోవిధంగా పొగాకును సేవిస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. భారతదేశంలో 12 కోట్ల మందికి పైగా ధూమకేతులుండగా, మరో 18.5 కోట్ల మంది పొగాకు ఉత్ప త్తుల వినియోగదారులున్నారు. 

image


దేశంలో 90 శాతం నోటి క్యాన్సర్లకు కారణం గుట్కా అని వైద్యులు చెబుతున్నారు. 1910-2010 శతాబ్ద కాలంలో 10 కోట్ల మంది పొగ రాక్షసి బారినపడి అర్థ జీవితానికే పరిమిత మైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దంలో 20 కోట్ల మంది మృత్యువాత పడటానికి కార ణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

పొగాకు ఉత్పాదనల్లో 400కు పైగా రసాయనాలు ఉంటా యని, వాటిలో 200 రసాయనాలు ప్రమాదకరమైనవి కాగా, అందులో 20కి పైగా క్యాన్సర్ కారకాలున్నాయని పలు పరిశోధ నలు శాస్త్రీయంగా నిరూపించాయి. పొగాకు ఉత్పత్తుల్నీ నమిలి బహిరంగ ప్రదేశాలల్లో ఉమ్మడం వలన క్షయ, శ్వాసకోశ వ్యాధులు, స్వైన్ ఫ్లూ వంటి విభిన్న ప్రమాదకర రోగాలు వ్యాపిస్తున్నాయని, ఒక క్షయ వ్యాధి కారణంగా ప్రతి సంవత్స రం మనదేశంలో రెండు లక్షల మంది మరణిస్తున్నారని కేం ద్రమే చెబుతుంది. పొగాకు వినియోగం ప్రాణాంతకమని ప్ర చారోద్యమాలు సాగుతున్న పొగాకు ఉత్పతుల వినియోగంతో ఏటా ప్రపంచ వ్యాప్తంగా 60 లక్షల మంది, మన దేశంలో 10 లక్షల మంది, ప్రతిరోజు 2300 మందికి పైగా విగజీవులవు తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే రోజురోజుకి పొగాకు విక్ర యాలు పెరిగి వినియోగదారులు ఎక్కువై 2020 నాటికీ దేశం లో ఏటా కోటిమంది ప్రాణాలు గాలిలో కలుస్తాయని ప్రజా ఆరోగ్య ఫౌండేషన్ సాగించిన అధ్యయనం సగటు మానవున్ని కలవర పెడుతుంది.

ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలంటే పొగాకు వినియోగాన్ని నియంత్రించేలా ప్రత్యక్ష కార్యాచరణ ఉండి తీరాలని ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలు నిర్ణయించాయి. సిగరెట్ ప్యాకెట్ల మీద హెచ్చరికల ముద్రణ విషయంలో మనదేశం 136వ స్థానంలో ఉంది. కాబట్టి నిర్దేశిత లక్షాన్ని సాధించలేకపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సదస్సులో ఒక నివేదిక ఎలుగెత్తి చాటింది. అయితే సిగరెట్ పెట్టెలపై ప్రస్తుతమున్న 40 శాతం సచిత్ర హెచ్చరికల్ని 85 శాతం వరకు కేటాయించాలంటూ కేంద్రం 2014 అక్టోబర్‌లోనే చేసిప గెజిట్ ప్రకటన ఏప్రిల్ 1, 2015న అమలులోకి రావాల్సినది పార్లమెంట్ కమిటీతో ఆటకెక్కింది. దేశంలో 62 లక్షల మంది పొగాకు రైతులు, ఆ ఉత్పత్తులు, విక్రయాలపై ఆధారపడిన 6.4 కోట్ల మంది కార్మికులు, కూలీ లు, చిన్నతరహా వ్యాపారుల ఉపాధి ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ ప్రస్తావన ఒకరకంగా పేదలకు (తయా రీ రంగానికి) మేలు జరిగినప్పటికీ తీసుకునే నిర్ణయాలు అందరికి, ఆమోదయోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.

2006లో సుప్రీంకోర్టు యువతరం మత్తుపానీయాలకు బా నిస అవుతుందని వ్యాఖ్యానిస్తూ ‘రోగగ్రస్త జాతిని కాదు మనం కోరుకునేది’ అంటూ అప్పటి ప్రభుత్వానికి చురక వేసింది. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పొగాకు రైతుల్ని ప్రత్యాన్మాయ పంటలకు మళ్లించడం కోసం 5000 కోట్లతో కార్యక్రమం ప్రకటించింది. కానీ ఎన్నో పథకాల మాదిరిగానే అది తెల్లారిపోయింది.
2008 అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో, వ్యాపార సంస్థలు, రైల్వే ప్రయాణ ప్రాంగణా లు, సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్స్ లాంటి వాటిలో బహిరంగంగా పొగతాగితే 200 నుంచి 1000 రూపాయల వరకు జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధించే చట్టాన్నీ తెచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పొగాకు వినియో గదారులకు కనిష్ట వయసును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచింది. అలాగే బహిరంగంగా ప్రదేశాలల్లో ధూమపానం చేస్తే 1000 జరిమానా విధిస్తూ, చట్ట ఉల్లంఘన కేసుల విచార ణకు ప్రత్యేక సెషన్స్ కోర్టుల ఏర్పాట్లు, ఉల్లంఘనకు పాల్పడే వారిపై జరిమాన 10000 నుంచి లక్ష రూపాయలకు పెంపు, పొగాకు ఉత్పతుల్ని నమిలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మటంపై నిషేధం వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
బహిరంగ ప్రదేశాలల్లో ధూమపానాలు చేస్తే జరిమానా విధించే అధికారాన్ని పొలీసు శాఖలోని ఎస్సైలకు, ఆహార కల్తీ నిరోధకశాఖ అధికారులకు, గ్రామా సర్పంచులకు, పంచాయితీ కార్యదర్శులకు, జాతీయ రూరల్ హెల్త్ మిషన్ ఫైనాన్స్ మేనేజ ర్లుకు, ప్రభుత్వ వైద్యాధికారుల పరిధిలో ఉంటుంది. అలాగే న్యాయవాదులు, రిజిస్టార్లు, డిప్యూటీ రిజిస్టార్లు, కోర్టు భవనా ల్లో ఆ బాధ్యత తీసుకోవచ్చు. పాఠశాలలో నిబంధలను డీఈ వో అమలు చేయాలి మరియు ట్రాఫిక్ సూపరిండెంట్లు, బస్ స్టేషన్ అధికారులు, టికెట్ కలెక్టర్లు, కండక్టర్లు రవాణా వాహ నాల్లో జరిమానా విధించే అధికారాన్ని కలిగి వుంటారు.

చైనా, థాయిలాండ్ లాంటి దేశాలలో మాదక ద్రవ్యాల అక్రమరవాణ, విక్రయాల నేరారోపణలు రుజువైతే మరణ శిక్షలు విదించే చట్టాలు అమలులో వున్నాయి. ఫిలిప్పీన్, మలే సియా, ఇండోనేషియా లాంటి చోట్ల కఠిన శిక్షలతో మాదక ద్రవ్యాలను నియంత్రిస్తున్నారు. మనదేశంలోని నేటి పరిస్థితి చట్టాలు చేయడానికి, కమిటీలు, చర్చలు, విశ్లేషణాలంటూ కా లయాపన చేసి, చట్టాలు చేసిన అమలులో అనుకున్నంత మేరలో ఫలితాలను నోచుకోవడం లేదు. అధికారిక అంచనాల ప్రకారం దేశంలో డ్రగ్స్ బానిసలు 34 లక్షలు, ఒక పంజాబ్‌లో 70 శాతానికి పైగా యువత డ్రగ్స్ వినియోగిస్తు న్నట్లు అక్కడీ ‘మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ’ ఉన్నత న్యాయస్థానా నికి నివేదించింది. ఇదిలా ఉండగా దేశంలో డ్రగ్స్ పునరావాస కేంద్రాలు మాత్రం కేవలం 400కే పరిమితం. దీనిని బట్టి ఏళ్ల తరబడి మన పాలకులు తీసుకునే నిర్ణయాలు, అమలుపరిచే విధానాలు ఏ మేరలో ఉన్నాయో తెలియకనే తెలుస్తుంది. 

నేడు కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతో మనదేశ యువ త సంఖ్య పదేపదే ప్రస్తావించడం జరుగుతుంది. ఆ యువ తను మాదక ద్రవ్యాల బారి నుండి కాపాడుకోవాల్సిన బాధ్య త కూడా ప్రభుత్వాల పైననే వున్నది. కావున కఠినమైన చట్టా లను తయారు చేసిన ఖచ్చితంగా అమలు పరుస్తూ, పటిష్ట మైన పర్యవేక్షణతతో ఫలితాలను రాబట్టడానికి కార్యాచరణను రూపొందించి యువతరాన్ని మాదక ద్రవ్యాల చెర నుంచి విముక్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రోజురోజుకు పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరి ణామాలను వివిధ అధ్యయనాల గణాంకాలు ఆందోళన కలి గించే విధంగా ఉంటున్నాయి. నేటి యువత వీటిని చూసైనా మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండటానికి ప్రయ త్నించాలి. వీటి బారినపడి మృత్యువు ఒడిలోకి చేరుకోని తన ను నమ్ముకున్న కుటుంబాన్ని బజారుపాలు చేయకుండా, వీటి పర్యవసానాలపై పునరాలోచించి సరైనా నిర్ణయం తీసుకోవా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పొగాకును నిరోధించి ఆరో గ్యాన్ని కాపాడుకుందాం.

- పోలం సైదులు
9441930361విజ్ఞాన వారధి ‘వట్టికోట’

Updated By ManamThu, 11/01/2018 - 02:00

imageతెలంగాణలో గ్రంథాలయోద్యమానికి, సాహిత్యోద్యమానికి జీవితాన్ని అర్పించిన అభ్యుదయ సాహిత్యోద్యమ తొలి నవలా కారుడు, రిక్షా కార్మిక సంఘం కార్యకర్త, గుమస్తాల సంఘం నాయకుడు, రెల్వే కూలీల మేస్త్రిగా, మహిళల హక్కుల కోసం వారి ఆశయాల కోసం కృషిచేసిన ఘటికుడు, తొలితరం పౌర హక్కుల సంఘం కార్యకర్త, కమ్యునిస్టు కార్యకర్తగా, కాంగ్రెస్ కార్యకర్తగా మన ఆళ్వారుస్వామి లాంటి వారు తెలంగాణలో లేరు మరో గ్రంథాలయ ఉద్యమ నాయకుడు లేరు. ‘కొవ్వొత్తి ఏ విధంగా తనుకరుగుతూ నలుగురికి వెలుగునిస్తుందో ఆ విధంగా తన జీవితాన్ని తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమా నికి, గ్రామగ్రామాన గ్రంథాలయాల ఏర్పాటుకు, సాహిత్య ఉ ద్యమానికి ధారపోశారు వట్టికోట ఆళ్వారు స్వామి.

రైతాంగ పోరాటాలకు, సాయుధ పోరాటాలకు, అనేక సాంఘిక సాహిత్య ఉద్యమాలకు నాందిైయెున ఉద్యమ గుమ్మంimage  నల్లగొండ జిల్లా నకిరేకల్లు తాలుకాలో (శాలిగౌరారం మండ లం) మాధవరం కలాన్ గ్రామంలో 1915 నవంబరు 1వ తేదీన మధ్యతరగతి నిరుపేద శ్రీ వైష్ణవ కుటుంబంలో మాచ వరం సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులకు జన్మించారు. ఆయన చిన్నతనంలోనే 11వ యేట తండ్రి మరణించారు. తరువాత వంట పనిచేస్తూ సీతారామారావు అనే గురువు దగ్గ ర విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. నకిరేకల్లు, సూర్యాపేట, కం దిబండ తరువాత విజయవాడ వివిధ ప్రాంతాలు సీతారామ రావుకి ఎక్కడి బదిలీ అయితే అక్కడకి ఆయునతో వలసి వెళ్లి వారి దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. నిరంతర అధ్యయనమే ఆయునను వివిధ ఉద్యమాల వైపు పురికొల్పింది. 
20వ శతాబ్దంలో సాంఘిక, సాంస్కృతిక, పునరుజ్జీవ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన వారిలో జాగిర్దార్ రావి చెట్టు రంగారావు, కొమర్రాజు లక్ష్మణరావు, దివాన్ మునగాల సంస్థానాదీశుడు నాయిని వెంకట రంగారావు తదితరులున్నా రు. ఆధునిక తెలంగాణ దార్శనికులలో వట్టికోట ఆళ్వారు స్వామి పేరు ముందు వరుసలో ఉంది. హైదరాబాదులో 1901 శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం, రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం హన్మకొండ 1904, ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం 1905 సికింద్రాబాద్, బాలాభారతి నిలయ ఆం ధ్ర భాషాభి వర్తక సంఘం 1905- శంషాబాద్, మన్ మోహన్ ఆంధ్ర పుస్తకాలయం- 1907- వడ్డేపల్లి, శ్రీ జ్ఞాన విద్యుత్ ప్ర వాహిణి ఆంధ్ర భాషా నిలయం- 1910- ఖమ్మం, సంస్కృతి కళా సంవర్ధిని  గ్రంథాలయం-1913- రేమిడిచర్ల, శ్రీ ఆంధ్ర విజ్ఞాన ప్రకాశీని గ్రంథాలయం-1917, సూర్యాపేట, ఆంధ్రసర స్వతి గ్రంథాలయం -1918- నల్లగొండ... ఈ భాషా నిల యాల స్థాపనలో నిజాం రాష్ట్రంలో సాహిత్య, సామాజిక ఉద్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేయడంలో ప్రముఖపాత్ర పోషించారు. 1921లో ఏర్పడిన అంధ్ర జన సంఘం నాటి నిజాం రాష్ట్రంలో అనేక సభలు, సమావేశాలు (సూర్యాపేట, నల్గొండ, వరంగల్, దేవరకొండ, జోగిపేట) ప్రజలను జాగృతం చేసేందుకు నిర్వహించారు. ఈ ఆంధ్ర జన సంఘం ముఖ్య ఉద్దేశ్యం గ్రామాలలో తెలుగు పాఠశాలలు, పఠనాలయాలు (రీడింగ్ రూమ్స్) గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం వలన స్థాపించి ప్రజలను విద్యావంతులు చేసి స్వా తంత్య్రోద్యమ కాంక్షను ప్రజలలో చిగురింప జేస్తాయి.

20వ శతాబ్ద ప్రథమార్ధంలో ప్రజలను సామాజికంగా  సాం స్కృతికంగా, సాహిత్య పరంగా, ప్రజలను చైతన్య పరిచి వారిని జాగృతం చేసిన ఉద్యమాలలో ‘గ్రంథాలయ ఉద్యమం’ ప్రాముఖ్యతను సంతరించుకుంది. మాడపాటి హనుమంత రావు, సురవరం ప్రతాపరెడ్డి, కోదాటి నారాయణరావు తదిత రులు గ్రంథాలయ ఉద్యమాన్ని ఉరూరా వ్యాపింపచేసి ప్రజల ను ఉద్యమంలో భాగస్వాములను చేశారు.

1933 హైదరాబాదుకు వలస వెళ్ళిన తరువాత కోదాటి నారాయణరావు సహకారంతో ‘గోలకొండ’ పత్రికలో ప్రూఫ్ రీడర్‌గా కొంతకాలం పనిచేసిన కాలంలో నిరంతర అధ్యయ నాన్ని, సాహిత్య పిపాస, విజ్ఞానాన్ని సంపాదించాలనే తపననే వారిని గ్రంధాలయ ఉద్యమం వైపు అడుగులు వేయించింది. వట్టి కోటఆళ్వారు స్వామి వివిధ ఉద్యమాల వైపు ఆకర్షితుడై నిజాం వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు, రచనలు, వ్యాసాలూ, ముద్రణలు చేయడం వలన నిజాం ప్రభుత్వం మూడుడు సార్లు దాదాపు ఆరేళ్లకు పైగా సికింద్రాబాదు, సంగారెడ్డి, గుల్బర్గా, వరంగల్, నిజామాబాదు జైళ్లలో ఆయన ఖైదీగా ఉన్నారు. మొదటి పర్యాయం ‘క్విట్ ఇండియా’ పోరాట కాలం లో 1942 అక్టోబరు నుంచి 1943 అక్టోబరు వరకు సికింద్రా బాదులోని ముషీరాబాదులో జైలు జీవితం అనుభవించారు. ఆ కాలంలోనే 250 రూ.లు జరిమానా సైతం చెల్లించారు. తదుపరి నిత్యావసర వస్తువుల లభ్యత విషయంలో ప్రజల కష్టాలు తెలుపుతూ ‘హైదరాబాద్ ప్రజల రేషన్ కష్టాలు’ అనే వ్యాసం ప్రచురించి మరో పర్యాయం కొన్ని రోజులు జైలు జీవి తం గడిపారు. ఇంకో పర్యాయం నిజాం వ్యతిరేక పోరాటంలో 1946 నుంచి 1951 వరకు వేర్వేరు జైళ్లలో ఉన్నారు. ఆళ్వారు స్వామి ‘జైలు లోపల’ కథానికల్లో అధికశాతం జైలే కథాస్థలం.

వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజా గ్రంథాలయాలను స్థాపిం చి, గ్రామగ్రామన గ్రంథాలయాలను స్థాపించి ‘తెలంగాణ గ్రం థాలయాల పితామహుడుగా’ కీర్తికెక్కారు. తెలంగాణ సాహిత్య ఉద్యమంలో అత్యున్నత పాత్ర పోషించారు. వీరి పేరు ఆధు నిక తెలంగాణ సాహిత్యంలో వినీలాకాశంలో రెపరెపలాడుతు ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో 125 సంవత్సరాలు దాటి నా  భాషానిలయం  1901 శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం, 100 సంవత్సరాలు పై బడిన రాజరాజ నరేంద్ర ఆం ధ్ర భాషా నిలయం హన్మకొండ 1904, ఆంధ్ర సంవర్దిని గ్రం థాలయం 1905- సికింద్రాబాద్, బాలాభారతి నిలయ ఆం ధ్ర భాషాభి వర్తక సంఘం 1905-శంషాభాద్ గ్రంథాల యా లు ఉన్న, గ్రామ గ్రామాన గ్రంథాలయాలు అదే విధంగా సంచార గ్రంథాలయాలు నెలకోల్పిన ఘనత మన వట్టికోటదే. ప్రజల వద్దకే విజ్ఞనాన్ని అందించడం అంటే పుస్తకాలను బుట్ట లలో నెత్తిమీద పెట్టుకొని ఊరు, ఊరు, వాడ వాడలా తిరుగు తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు నూతనవిజ్ఞానాన్ని అందిం చారు. అందు కోసం వారు ‘అణా గ్రంథమాలను’ ఆదర్శంగా తీసుకున్నారు.
అదే విధంగా  కాశీనాదుని నాగేశ్వరరావు మీద ప్రేమతో ‘దేశోద్ధారక గ్రంథమాలను’ స్థాపించి తక్కువ ‘ధర’కే వివిధ గొప్ప రచయితల (కాళోజి, సురవరం ప్రతాప్ రెడ్డి, ) 35 పుస్త కాలు, వ్యాసాలూ ముద్రించి ప్రజలకు విజ్ఞానాన్ని అందించే వారు. గ్రంథాలయ ఉద్యమాన్ని గ్రామ గ్రామాన వ్యాప్తి చేసి (ఊరు ఊరున గ్రంథాలయాలు) నూతన సాంఘీక సంస్కరణ ద్యమానికి, సాంస్కృతిక రాజకీయ చైతన్యానికి నాంది పలి కారు. ఆ రోజులలో ఆళ్వారుస్వామికి తెలియని గ్రామం గాని, వారి ప్రచురణలు లేని గ్రామం లేదంటే అతిశేయోక్తి లేదు. అంటే దానికి ప్రధాన కారణం వారు అంతంగా ప్రతి గ్రామం పుస్తకాలను బుట్టలో పెటుకుని తిరిగారు వారు చదివిన తరు వాత (10 రోజుల తరువాత ) తీసుకునేవారు.

అదేవిధంగా ఆంధ్ర మహాసభ స్పూర్తితో భూస్వామ్య వ్య తిరేక ఉద్యమంలో అనేక ప్రజా పోరాటలలో ప్రముఖపాత్ర పోషించారు. తెలంగాణ ప్రాంతంలోని రైతాంగ పోరాట ఉద్య మంలో, సామాజిక ఆర్థిక స్థితిగతులపై, సాంఘిక దురాచారా లపై వాటిని పారదోలడానికి తన కలం ద్వారా సాహిత్య వ్య వసాయం చేసిన నిత్య కృషీవలుడు. అదేవిధంగా అణగారిన కులాల, తరగతుల సాంఘిక రుగ్మతలు (వెట్టి చాకిరి, జోగిని, ఆడ పాప) విముక్తికై పోరాటం చేసిన సాంఘిక సంస్కరణ వాధి మన ఆళ్వారు. నాటి ప్రజల పరిస్థితిని ఆధారంగా చేసుని ప్రజల మనిషి (పీపుల్స్ మాన్) (1952)అనే నవలను, గంగు (1940-45)అనే అసంపూర్ణ నవలను, 1952లో రాసిన జైలు లోపల కథల సంపుటి, రామప్ప రబస వ్యాస సంపుటి మొదలగు నవలలు రచించారు. 
ప్రజల మనిషి నవలలో నాటి నిజాం కాలం నాటి గ్రామీ ణ ప్రాంత ప్రజలను సాంఘికంగా, ఆర్థికంగా రాజకీయంగా  భూస్వాములు ఏ విధంగా దగా చేస్తున్నారో, మధ్య తరగతి ప్రజల పరిస్థితి. ఆంధ్ర మహాసభల వలన ప్రజల ఏ విధంగా పోరాటం చేశారో కళ్ళముందు తెలియాడినట్లు నవలను చిత్రీక రించారు. ఈ నవల నాటి ఆచారాలను, సంప్రదాయాలు, ప్రజల కట్టుబాట్లు, భూస్వాముల దురాగతాలు వారిపై ప్రజల తిరుగుబాట్లు అద్భుతంగా తెరకెక్కించారు. తెలంగాణలోని తొలి నవలాకారుడిగా సాహిత్య ప్రపంచంలో గుర్తింపు పొందా రు. నూతన ఆధునిక తెలంగాణను సాహిత్య, సాంస్కృతిక, విజ్ఞానపరంగా అభివృద్ధి చేయడంలో మేథావుల పాత్ర ఎంతో ఉంది. అలాంటి వారిలో మన ఆళ్వారు స్వామి మొదటి స్థానంలో ఉంటారు.

గ్రంథాలయ ఉద్యమం ద్వారా, తెలుగు పత్రికా రంగం, సాహిత్యం, అణా గ్రంథమాల, గ్రంథాలయాల ద్వారా, దేశో ద్ధారక గ్రంథమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసి నిజాం వ్యతిరేక ఉద్యమంలో వట్టికోట పాత్ర వెలకట్టలేనిది.
నూతన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం సందర్భంగా  తెలంగాణ సాహితోద్యమ బిడ్డ, వైతాళికులు వట్టికోట ఆళ్వారు 104వ జయంతి సందర్భంగా మన ప్రభుత్వం ‘మిషన్ వట్టి కోట’ పథకాన్ని ఏర్పాటు చేసి విజ్ఞానాన్ని గ్రామీణ, అణగారిన వర్గాలకు అందించే ప్రయత్నం చేయాలి. అంటే గ్రామ గ్రామా న, వాడవాడలా గ్రంథాలయాలు నెలకొల్పాలి. అంటే ప్రజల చెంతకే విజ్ఞానం (గ్రామగ్రామన గ్రంథాలయాలు) అందించా లి. విజ్ఞనావంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత మన అందరిపై ఉన్నది. నేడు మన రాష్ట్రంలో మలిదశ ఎన్నికలు సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు తమ తమ మానిఫెస్టో ను విడుదల చేస్తున్నాయి. ఆ మానిఫెస్టోల్లో గ్రామ గ్రామాన, ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు స్థాపించాలి అనే అంశం ఉండాలి. వట్టికోట ఆళ్వార్ స్వామి వారి ఆశయాలకు అనుగుణంగా గ్రామ గ్రామన గ్రంథాలయాలు నెలకొల్పి మిషన్ వట్టికోటకు ప్రజా ప్రతినిధులు, బుద్ధిజీవులు, ప్రభుత్వం శ్రీకారం చుట్టాలి.

- రవికుమార్ చేగొని
గ్రంథాలయ శాస్త్ర నిపుణుడు
(నేడు వట్టికోట ఆళ్వార్ స్వామి జయంతి)స్వరాష్ట్రంలోనూ ఆవరించిన అభద్రత

Updated By ManamThu, 11/01/2018 - 02:00

imageప్రపంచ వ్యాప్తంగా ఒకేలా ఉన్నా.. తెలంగాణ సమాజంలో మను గడ సాగిస్తున్న సగటు మనిషిగా... అందులో ఉన్నతమైన విద్యన భ్యసించిన సగటు మనిషి ఆత్మ పరిశీలనలోకి తొంగిచూస్తే మనసు ను కదిలించే విషయాలెన్నో వాటికి సమాధానమివ్వలేని పరిస్థితు లు ఎదుర్కొనే సందర్భాన్ని చూడవచ్చు. ప్రస్తుత సమాజంలో ఉ న్నత చదువులు చదివి, కష్టపడి ఉన్నతమైన కొలువు సాధించి, సమాజంలోని అసమానతను దోపిడీని అన్యాయాలను ఎదిరించా లనే కృతనిశ్చయంతో పోరాడాలనుకునే వారిపై జరుగుతున్న అన్యా య దాడులు సగటు మానవున్ని భయాందోళనలకు గురి చేస్తున్నా యనడంలో అతిశయోక్తి లేదు.

ఎందుకంటే ఎంత చదువులు చదివిన ఎంత ఉన్నతమైన ప్ర భుత్వ కొలువులు ఉన్నా వారందరు రాజకీయimage నాయకులచే ఏర్పడి న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయక తప్పదు. లేదా న్యాయం కోసం పోరాడుతానంటే అతడు అన్యాయం అవుతాడనే సత్యాన్ని ఎరుగక తప్పదు. సమాజంలోని పాలకులు అభివృద్ధి అనే పేరుతో మాయమాటలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ... తమ మను గడానుసారంగా పాలనను కొనసాగిస్తున్నారనడంలో ఎలాంటి అతి శయోక్తి లేదు. సమాజాభివృద్ధిని కాంక్షించే మేధావి వర్గం పాలకుల అసత్య ప్రచారాన్ని సాక్ష్యానుసారంగా ఎండగట్టిన వాటికీ విలువ లేకపోగా వారిని కక్షగట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనడంలో ఎలాంటి ఆశ్చర్యం అక్కరలేదు. పాలకుల ధోరణని వ్యతిరేకించే విద్యార్థి సంఘాలే, మేధావులు, ప్రతిఘటించే వారిైపె కక్షగట్టే ధోర ణి ఉందనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. ఉదాహరణకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు ఎందరో బలిదానాలు చేసు కొని తర్వాతి తరాలన్నా అభివృద్ధి చెందుతాయనే నేపథ్యంతో పోరాడా రు. ఆంధ్ర పాలకులున్న సమయంలో కల్పించిన ఉద్యోగా ల కన్నా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నెలకొల్పిన ఉద్యోగాల సంఖ్య అత్యల్పం. ఆ పోరాటంలో పాల్గొన్న వారి కంటే వ్యతిరేకించే వారికే ప్రత్యేక రాష్ట్రంలో గుర్తింపు హోదా... పదవులు దక్కాయనడంలో అతిశ యోక్తి లేదు. (రికార్డు అయిన చరిత్రను చూస్తే తెలుస్తూనే ఉన్నది). ప్రస్తుత మన రాష్ట్రంలో ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెల గాట మాడుతోందనడంలో సందేహం అక్కర్లేదు. ప్రభుత్వం నుంచి కొలువులు వస్తున్నాయని రోజూ ఊరిస్తూనే ఉంటారు. ‘నిరుద్యో గులూ కలత చెందకండి. మీ వయో పరిమితిని 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు పెంచుతా’మని ఇంకో ఉచిత ప్రోత్సా హం.

 ఇంకొన్ని పెంచి ఎక్కువ కొలువులు వేస్తామని ఊరిస్తూ నిరు ద్యోగులను మభ్య పెడతారు. కానీ అదీ రాదు. ఒక శాతం కొలువు లొస్తే గగనం. వీటన్నింటిని గమనించే మేధావులు, విద్యార్థి సం ఘాలు, కవులు, కళాకారులూ, నిరుద్యోగులు ప్రశ్నిస్తే వారిపై ఉక్కు పాదం మోపుతారు. నాకున్న పరిశోధనానుభవం వల్ల కొన్ని వ్యక్తి గత చరిత్రలపై సమాచారం సేకరించాను. అందులో నాదొకటి. ఇ లాంటి సమస్యను మన రాష్ట్రంలో ఎందరో అనుభవిస్తున్నారనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం నాగరు కర్నూల్ జిల్లాకు చెందిన వంగూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన భారతమ్మ, నిరంజన్ అనే దంపతులకు 1984లో పుట్టాను. నాతో పాటు ఇద్దరు చెలెళ్లు ఒక తమ్ముడు. మాకు మా తాత నుంచి వచ్చి న స్థిరాస్తి నాలుగు ఎకరాల భూమి. 1999లో అందులో రెండు ఎక రాలు అమ్మేసి చెల్లికి బాల్యవివాహం చేశారు. నన్ను పదవ తరగతి వరకు ప్రైవేటు పాఠశాలలో చదివించడం, అందులో మంచి మా ర్కులు రావడంతో ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాతో మహబూబ్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాను. మొదటి రెండు సంవత్సరాలు బాగానే ఉన్నా చివరి సంవత్సరంలో  ఆరునెలల వ్యవధిలో నా ఇద్దరు చెల్లెళ్ళు అకాల మరణం పొందడం, మా తల్లిదండ్రులు మానసిక సంక్షోభానికి గురికావడం, నన్ను మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి, ఫైన ల్ ఇయర్‌లో ఒక సబ్జెక్టు తప్పడం ఒకెత్తయితే కుటుంబ బాధ్యత పెరగడం వల్ల ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా జాయి నై దూరవిద్యలో డిగ్రీ పూర్తిచేసి కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ ఎంట్ర న్స్‌లో ప్రథమ ర్యాంక్ పొంది రెండు సంవత్సరాలలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించాను. ఆ తర్వాత రెగ్యులర్‌గా బీఈడీ పూర్తిచేసి దేవరకొండ కాలేజ్ టాపర్‌గా నిలవడం, వెంటనే పీహెడీలో కాకతీయ యూనివర్సిటీలో సీటు పొంది డాక్టర్ అయిలయ్య పర్య వేక్షణలో పూర్తిచేశాను. ఈలోపే పెళ్లి కావడం, పిల్లలు పుట్టడం చదువు ఖర్చులు, కుటుంబ పోషణ ఖర్చులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులకు గురిచేయగా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం గత నాలు గు సంవత్సరాలుగా ఎదురుచూస్తూ పదికి పైగా ఇంటర్నేషనల్ జర్నల్లో ఆర్టికల్ ప్రచురింపబడటం, వివిధ తెలుగు జర్నల్లో యాబై కి పైగా ఆర్టికల్స్ ప్రచురితవువటం, అకడమిక్‌లో కూడా మెరిట్ ఉండటంతో ప్రభుత్వ కొలువుకై ఎదురుచూస్తూ అతి తక్కువ జీతా నికి ప్రైవేట్ కొలువు చేస్తూ కుటుంబాన్ని గడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యనే కేవలం ఆర్థికలేమి కారణంగా మా నాన్న గారి మరణానికి కారణమయ్యాను. ఎన్నో ఇబ్బందులు పడుతూ బతుకుతో పోరాటం చేస్తున్నా. సర్కారు కొలువులకై ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. మేమందరం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రి యాశీలకంగా పనిచేసి రాష్ట్రమొచ్చాక మా జీవితాలు బాగుపడతా యనుకుంటే సమస్యలు ఎక్కువయ్యాయి. దీనిని ఎంత తొందరగా పరిష్కరిస్తే అంత మంచింది.
ఎంతోమంది రచయితలు, కవులు, మేధావులు, అధికారులు ఉన్నారు...కానీ వారెవరికీ నిరుద్యోగుల సవుస్య పట్టినట్లుగా కనిపించడం లేదు.  వారందరూ నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి మార్గాన్ని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

- పోలం సైదులు
9441930361బడిలోని బాలకార్మికులే వీళ్లు!

Updated By ManamThu, 11/01/2018 - 02:00

image‘అందరూ చదవాలి అందరూ ఎదగాలి’ అనే నినాదంతో సర్వశిక్షా అభియాన్, ‘పిల్లలు బడికి, పెద్దలు పనికి’ అనే నినాదంతో విద్యాహక్కు చ ట్టం ఏర్పడ్డాయి. విద్యాహక్కు చట్టం ఏర్పడి ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటికి ఏడు సంవత్సరాలు పూర్తి అయింది. చట్టంలో ఉన్న విషయాలన్నిం టిని అమలు చేయమని సుప్రీంకోర్టు సైతం ఆ యా ప్రభుత్వాలకు సూచనలు చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. విద్యార్థులు లేరనే సాకుతో ఏ పాఠశాలనూ మూసివేయరాదు. కాని పాలకులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం హేతుబద్ధీకరణ, విలీనం పేరుతో వందలాది పాఠశాలలను మూసివేస్తూనే, మరోవైపు ఎటువంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ పాఠశాలలకు విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గటమే కాకుండా, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాల జోరు పెరిగింది.

విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో పిల్లలెవరూ కూడా వెట్టిచాకిరి చేయరాదు. జీతంimage అధారంగా వారిని పనిలోకి తీసుకోకూడదు. ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ బడిబయటి పిల్లలను గుర్తించి బడిలోకి చేర్పించాలి. కాని పేదరికం, వలసలు, పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేకపోవటం, తల్లిదండ్రుల నిరక్ష్యరాస్యత వలన ఉన్నత పాఠశాలల్లో చేరే నాటికి చాలామంది పిల్లలు బాలకార్మికులుగా మారుతున్నారు. డ్రాపౌట్స్ శాతం ప్రాథమిక పాఠశాలల్లో పోల్చుకుంటే ఉన్నత పాఠశాలల్లో ఎక్కువుగా కనిపిస్తోంది. బడిబయటి పిల్లలను ఆయా యాజమాన్యాలు తమ పనులలో పెట్టుకుని వారికి స్వల్ప మెుత్తంలో డబ్బు చెల్లిస్తున్నారు. వారి చేత వెట్టిచాకిరి చేయిస్తున్నారు. మరికొంతమంది బడిబయటి పిల్లలు అనేక మోసాలకు గురవుతున్నారు. వారిలో కొంతమంది బాలనేరస్థులుగా మారుతున్నారు. చిన్న తనంలోనే అనారోగ్యం పాలవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల పరిస్థితి ఈ విధంగా ఉంటే, ప్రైవేట్ పాఠశాలల్లో  చదివే పిల్లల పరిస్థితి మరోవిధంగా ఉన్నది.

ప్రైవేట్ పాఠశాలల్లో డ్రాపౌట్స్ పెద్దగా ఉండవు. ఆ పాఠశాలల్లో రూపొందించుకునే పాఠ్య ప్రణాళికలు కఠినతరంగా ఉంటున్నాయి. అంగ్ల మాధ్యపు నేపథ్యంలో పుస్తకాల బరువు పెరుగు తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా తమ పాఠశాలల్లోనే అధిక ధర లకు పుస్తకాలు అమ్ముతున్నాయి. సబ్జెక్ట్స్ సంఖ్య పెరగటంతో పుస్తకాల సంఖ్య పెరుగుతుంది. తద్వా రా పిల్లలు అధిక బరువుతో ఉన్నటు వంటి బ్యాగ్‌లను మోయలేకపోతున్నారు. అధిక బరువుల ఫలి తంగా చాలామంది పిల్లలు మెడనొప్పి, వెన్నునొప్పులతో బాధపడుతున్నారు. వారు నిటారుగా నిల బడి నడవలేకపోతున్నారు. సిలబస్ ఎక్కువుగా ఉండుట వలన తలనొప్పి వంటి వాటితో సతమత మవుతున్నారు. ఇరుకు గదులు, అధిక ఒత్తిడి, ఎక్కువ ఇంటిపని (హోంవర్క్) ఇవ్వటం వలన విద్యార్ధులు తీవ్ర మానసిక అందోళనకు గురవుతున్నారు. యశ్‌పాల్ కమిటీ సిఫార్సులను సైతం ప్రభుత్వం పక్కన పెడుతోంది. ఇటీవలి కాలంలో ముంబయిలో కొందరు విద్యార్ధులు తాము అధిక బరువున్న బ్యాగ్‌లను మోయలేమని బడిబయటే ధర్నా చేయటం సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. అయినప్పటికి పాఠశాలల యజమానుల అలోచనలో గానీ, ప్రభుత్వాధికారుల పద్ధతుల్లో గాని ఎటువంటి మార్పు రాలేదు. స్కూల్ బ్యాగ్‌లతో పాటు వాటర్ బాటిల్, ఇతరత్రా సామాగ్రితో పిల్లలు తమ బరువు కన్నా రెట్టింపు బరువును మోస్తున్నారు. చాలా ప్రైవేట్ పాఠశాలల్లో మెుక్కు బడిగానే సిలబస్ పూర్తిచేస్తున్నారు. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులకు  సైతం స్వల్పం మెుత్తంలో జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన విద్యావిషయక కేలండర్‌ను వారు ఏమాత్రం పట్టించుకోవటంలేదు. చాలా ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా కార్పొరేట్ పాఠశాలలు తెలుగు, హిందీ వంటి భాషలను నిర్లక్ష్యం చేస్తున్నారు. అసెంబ్లీని సైతం నామమాత్రంగా నిర్వహిస్తున్నాయి. నైతిక విద్య అనేది వారికి ఏ మాత్రం పట్టటం లేదు. అధిక బరువు ఉన్న బ్యాగ్, ఎక్కువ ఇంటి పని వయస్సుకు మించిన పాఠ్యప్రణాళికల ఫలితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా బాలకార్మికులుగా మారిపోతున్నారు. కాకపోతే వీరు బడిబయటి బాల కార్మికు ల్లాగా కాకుండా బడికి వెళ్లే బాలకార్మికులగా మనం వర్ణించవచ్చు. ఇకనైనా విద్యాశాఖాధికారులు ప్రభుత్వం పాఠశాలలతో పాటు సమాంతరంగా ప్రైవేట్ పాఠశాలలను కూడా నిరంతరం తనిఖీ చేస్తూ అక్కడి విద్యార్థులకు ఆ యాజమాన్యాలు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించవలసిన అవ సరం ఎంతైనా ఉంది. ఈ దిశగా పాలకులు అలోచించాలి.

- మందడపు రామ్‌ప్రదీప్
9492712836సిరా చుక్కతో భవితవ్యం!

Updated By ManamMon, 10/29/2018 - 00:27

imageఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసి నా ఒకే ప్రశ్న. ఎన్నికలలో ఏమి జరగబోతోంది? ఒకరికొకరు ఏదో సమాధానం చెప్పుకుం టారు. కాసేపు తమ నాయకులను వెనకేసుకు రావడానికి తర్జనభర్జన పడతారు. వాదనలు, వాటికి పోటీవాదనలు ముందుకు వస్తాయి. చివరకు, అప్ప టికే తమ మనసులో ఉన్న అభిప్రాయంతో కొత్త సమా చారాన్ని కలుపుకుంటారు. అందుకే భారతదేశ వ్యవస్థలో ఓటరు ఆలోచన మారాలా..? ఎన్నికలలో ఏదో జరుగబో తోంది అన్న కుతూహలం వెనుక, సమాజం అంతరాల్లో అంతుపట్టని జనాభిప్రాయం పురు డు పోసుకుంటూ ఉన్నది అన్న అనుమానం లేకపోలేదు. అయితే, తటస్థంగా నిలబ డి, ఆ ప్రశ్నలు వేసేవారే ఆ ప్రశ్నకు సమాధానం కాగలరు. మంచిచెడ్డలు లాభనష్టాలు జాగ్రత్తగా చూసి, ఒక నిశ్చయం కల్పించుకోవలసింది ఈ తటస్థులే ఇప్పుడున్న మంచి కొనసాగాలి ఇప్పు డున్న చెడు ఆగిపోవాలి. ఏ ఒక్క పార్టీ బలం పెరగడమో తగ్గడమో కాదు, పార్టీల బలాబలా లను నిర్ణయించేది తామేనన్న ఆత్మవిశ్వాసం ఓటర్లలో పెరగాలి.

తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్ల పాలనను సమీక్షించే పనిపూర్తిగా నెరవేరకుండానే, అసెంబ్లీకి ఆఖరి బె ల్లుimage మోగింది. ముగిసిన కాలానికి తోడు ఇంకా గడవవలసి న కాలం ఇంకొంచెం ఉంది కదా అని లెక్కలు వేసుకుం టుండగానే, ఎమ్మెల్యేలు మాజీలయ్యారు. ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గం ఆపద్ధర్మం అయిపోయింది. ప్రత్యర్థులకు ఊపిరిసలపనివ్వని వేగంతో మొదటి అడుగులు తానే వేసి దెబ్బకొట్టాడు కేసీఆర్ అని... గిట్టనివారు కూడా మెచ్చుకు న్నారు. తానూ గెలవడం మాత్రమే కాదు, సాధారణ ఎన్నికల నాటికి తనకు చేదోడు కూడా కాగలను అని హామీ ఇచ్చారో ఏమిటో... కేంద్రంలోని వ్యవస్థలన్నీ కేసీఆర్ అభీష్ఠా నికి అనుగుణంగా సానుకూలం అవుతున్నాయి. ముందస్తు ఎన్నికల సమాచారంతో పాటు, 105 మంది అభ్యర్థుల ప్రకటన కూడా చేసి, రణరం గాన్ని ఏకపక్షంగా రచించి ప్రతిపక్షాలకు టిఆర్ ఎస్  సవాల్ విసిరింది. మొత్తంగా అలుముకు న్నట్టు కనిపించిన ఏకపక్ష సానుకూల వాతావరణం, ఎందుకో క్రమంగా సడలిపోతున్నట్టు కనిపి స్తున్నది. ప్రగతి నివేదన సభ ఆశించిన స్థాయిలో జరగ లేదన్న అభిప్రాయం కావచ్చు. వ్యతిరేకతను మూటగట్టు కున్న సిటింగ్ శాసనసభ్యులకు కూడా తిరిగి అభ్యర్థిత్వాలను ఇవ్వడంపై కలిగిన నిరాశకావచ్చు. అవసరమైనంతగా కాదు కానీ, ఊహించిన దానికంటె మెరుగు గానే కాంగ్రెస్ స్పందిస్తుండడం కావచ్చు. పోరు తీవ్రంగానే ఉంటుందన్న ఊహలకు రెక్కలు వచ్చాయి. ఎన్నికల ప్రచా రపు ఆర్భాటం ఒక్కటే కాదు, నాలుగేళ్ల పాలనలోని మంచి చెడ్డలన్నీ చర్చకు వస్తున్న సూచన కనిపిస్తున్నది. కొన్ని అంశాలలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేకున్నా, కొన్ని ప్రశ్నలకు మాత్రం ఆ పార్టీ వద్ద సమాధానం లేకపోవడం అధికార పార్టీ శ్రేణులకు కూడా నిరుత్సాహజనకంగా ఉన్నది.
 

image

నాలుగేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి మరే ప్రభుత్వం ఉన్నా జరిగేదా? వెయ్యిరూపాయల పింఛను ఎప్పుడన్నా కళ్ల జూశామా? పెళ్లికి, పురుటికి ప్రభుత్వమే కట్నాలు ఇవ్వడం కనీవినీ ఎరుగుదుమా? అనేక ప్రాజెక్టులు నడిమధ్యలో ఉ న్నాయి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉన్నాయి. వాటికి పూచీ కావాలంటే కేసీఆరే మళ్లీ సీఎంగా ఉండాలి కదా? ఎమ్మెల్యేలదేముంది సార్, బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లను చూసి ఓటు వేస్తారా ఏమిటి, అక్కడ కారు గుర్తు ఉంటది. వాళ్లకు అందులో కేసీఆర్ బొమ్మ కనిపిస్తది టిఆర్‌ఎస్ అభిమానులు చేస్తున్న ఈ వాదన తీసి పారేయదగ్గది కాదు. నిన్నటిని రేపటిని కలిపి ఆలోచించవల సిన బాధ్యతను ఇప్పుడు ఓటరు తలకెత్తుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారపార్టీ శాసనసభ్యుల అక్రమా ల మీద జనానికి వ్యతిరేకత ఉన్నది. ఆ జనమే కాదు, చం ద్రబాబు మీద ఎంతో అయిష్టం ఉన్న వారు కూడా ఇంకో అవకాశం బాబుకు ఇవ్వాలేమో అనే విచికిత్సలో ఉన్నారు. కొత్త రాష్ట్రం రాజధాని నిర్మాణం, అసంపూర్తి ప్రాజెక్టులు, పెట్టుబడుల సమీకరణ, వంటి కారణాలు చెప్పుకుని, అనుభవజ్ఞుడే ఉండాలేమో ఇంకోసారి కూడా అని వ్యా ఖ్యా నిస్తున్నారు.

 అదేమీ స్థిరపడిపోయిన అభిప్రాయం కాదు కానీ, జనం ఆలోచనా ధోరణికి ఒక సూచిక. కేసీఆర్ వంటి సాహసి, సమర్థుడు, సంకల్పబలం ఉన్న నాయకుడు ఉంటే కానీ, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరవు అని ఆలోచించే వారు ఒక బలమైన సెక్షనే ఉన్నారు. కేసీఆర్ పాలనలో సాధించిన విజయాలు అంతటి తిరుగులేని ప్రభావాన్ని కలిగిస్తే, ముందుస్తుకు ఎందుకు వెళ్లినట్టు? ఏ అనుమానం తో వెళ్లినట్టు, ఈ తొమ్మిది నెలల ముందస్తు ఏ అదనపు ఫలాలను ఇస్తుందని భావించి నట్టు? ఆశ్చర్యకరంగా ఈ ప్రశ్నకు కేసీఆర్ కనీసం దబాయింపు సమాధానం కూడా చెప్పడం లేదు. ఇంతకూ ముందస్తు ఎందుకు అని ఓ టీఆర్‌ఎస్ చిన్ననేతనో, పెద్దనేతనో అడిగితే, వాళ్లు అదే ప్రశ్న ఎదురు వేస్తున్నారు. ఇదొక్క అంశం చాలు వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి, కానీ కాంగ్రెస్ నేతలకు ఆ ధ్యాసే లేదని టీఆర్‌ఎస్ నాయకులు అనుకుంటు న్నారు. నిగూఢమైన, ప్రణాళికాబద్ధం అయిన వ్యవ హార సరళి కేసీఆర్‌ది. దానికి ఆయన గర్వపడతారో లేదో తెలియదు కానీ, ఆయన వీరభక్తులు మాత్రం దాన్ని గొప్ప లక్షణంగా భావిస్తారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, సెక్రటేరియట్‌కు వెళ్లకపోవడం. అవకాశం ఉన్నా ఆడవాళ్లకు కేబినెట్‌లోకి ససేమిరా అనడం. ధర్నాచౌక్‌ను, బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలను నిషేధించడం. ఫాంహౌ జ్లో వారాల తరబడి గడపడం. ఇవన్నీ కేసీఆర్ ప్రశంస నీయమైన భక్తులకు చెప్పుకోవడం కష్టంగా మారింది. ఇక వాటిని ఎవరి మాటా వినని గాంభీర్యానికి గుర్తులుగా టీఆర్‌ఎస్ అభిమాన శ్రేణులు పరిగణిస్తాయి. ముందస్తు ప్రక టనను కూడా వాళ్లు ఆ కోవలోనిదిగానే పరిగణిస్తారు. నాలు గేళ్ల కాలంలో మంత్రులకు, శాసనసభ్యులకు ఉండిన వెసు లుబాటు ఎంతో అందరికీ తెలుసు. ఎవరెవరు క్షేత్రస్థాయిలో హద్దుమీరుతున్నారో కేసీఆర్‌కూ తెలుసు. అయినా, ఆయన ధీమాగా ఉన్నారు కాబట్టి, గెలిపించే బాధ్యత కూడా ఆయనదే అని కింది నేతలు అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది?

ఎన్నికలలో నాయకుల తీరు హామీలు ఎన్ని ఇచ్చినా ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా... ఓటు వేసే సమయానికి ఓటరు అభివృద్ధి ఫలాలను లెక్కలు వేసుకు న్నాకనే తన నిర్ణయాన్ని ఎంచుకుంటారు. గత ప్రభుత్వాల తో పోల్చితే కొత్తగా  చేసిన సంస్కరణలు ఎన్ని ఉన్నాయనే స్పష్టత ఓటరుకు వచ్చినప్పుడే ఎన్నిక ఒకవైపు ఉంటుంది. కేసీఆర్ వ్యవహార సరళిపై సామాన్య ఓటర్లు విముఖతతో స్పందిస్తారా? గత ప్రభుత్వాల పాలనతో పోలిస్తే, ప్రజలకు అందుతున్న సంక్షేమం నిస్సందేహంగా కేసీఆర్ హయాంలో అధికమే. ఎన్ని వివాదాలున్నా, పెద్దపెద్ద ప్రాజెక్టులలో నీరు పారితే, తెలంగాణ జనానికి కలిగే సంతోషమూ అధికమే. చెప్పినన్ని కాకపోయినా, నిరుద్యోగులలో అసంతృప్తి ఉన్నా, నియామకాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో జరగలేదు. నిధుల వ్యవహారం జనం అనుభవంలోకి వచ్చేది కాదు. హైదరా బాద్ కారణంగా వస్తున్న అధిక ఆదాయానికి తోడు బయటి నుంచి ఎడాపెడా అప్పులు కూడా తీసుకున్నారంటున్నారు. దాని పర్యవసానం వెంటనే అనుభవంలోకి రాకపోవచ్చు. వీటన్నిటి కారణంగా పర్వా లేదనిపించే తీరులో ఉన్న పాల నను, ప్రజలు స్వేచ్ఛ తక్కువైందనో, ముఖ్యమంత్రి ప్రజలను కలవడం లేదనో, సంక్షేమం కొన్ని శ్రేణులకు చేర డం లేదనో, గొప్పగా చెప్పుకున్న పథకాలు కొన్ని నత్తనడక నడుస్తున్నాయనో నిరాకరి స్తారా? అసలు ఈ ప్రభుత్వం మీద పెట్టగలిగే విమర్శ ఏమిటో, ప్రధాన ప్రతిపక్షానికి తెలుసు నా? అని ఆలోచన సాగుతున్నది.

టీఆర్‌ఎస్‌కు కేసీఆర్ సరళి పెద్ద సమస్య అయితే, కాంగ్రెస్ పార్టీకి దాని బహు నాయకత్వం సమస్య. తెలం గాణ రాష్ట్ర సాధనలో తమ పార్టీ ఏమిచేసిందో చెప్పుకోవడం కూడా ఆ పార్టీకి కష్టమే అయింది. దాదాపు నాలుగేళ్ల పాటు బీజేపీ భాగస్వామ్య పక్షంగా కొనసాగి, సందర్భం రాగానే, తానే బీజేపీకి ప్రత్యర్థిని అన్నరీతిలో చంద్రబాబు పార్టీ వైఖరిని మార్చగలిగారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీకి నడుమ ఏదో అనుబంధం ఉన్నదన్న సాధారణ అభిప్రాయం ఏర్పడిన తరువాత కూడా ఆ అంశం మీద విస్తృత ప్రచారం చేయ డానికి కాంగ్రెస్ సమయం లెక్కిస్తున్నది. అంతర్గత కలహా లు, నాయకత్వం కోసం పోటీలు, వీటి మధ్య ఇప్పుడు కొత్త గా మహాకూటమి ప్రయత్నాలు.. వీటి మధ్య కాంగ్రెస్ తన లో తానే సతమతమవుతున్నది తప్ప, గట్టి వ్యూహరచన చేయలేకపోతున్నది. ఉద్యమదశ దాటిన వెంటనే, రాజకీయ నైతికతను పక్కనబెట్టి ఇతర పార్టీల వారిని చేర్చుకుని, ఉద్య మ సహచరులను పక్కనబెట్టి, ఉద్యమస్ఫూర్తికి భిన్నమ యిన నిర్ణయాలు కూడా తీసుకోగలిగిన కేసీఆర్, అవసరమ నుకుంటే తన స్వరంలో ఉద్యమ తీవ్రతను పలికించగల రు. ఇప్పుడే కాదు, 2014లో కూడా ఉద్యమస్ఫూర్తి ఏ మాత్రం లేకుండా, ఏ సైద్ధాంతికతా లేని నాయకుల గుంపు లాగా వ్యవహరించడం కాంగ్రెస్ బలహీనత. కాంగ్రెస్ కనుక ఒక కట్టు మీద ఉండి, అధికారపక్షం రాజకీయ అనైతికతను, తాము ఆరోపిస్తున్న ఆర్థిక అవినీతిని, ముఖ్యమంత్రి ఏకపక్ష ధోరణిని సమర్థంగా వివరించగలిగితే, ఓటర్ల విచక్షణకు గట్టి పనిపెట్టినట్టవుతుంది. ఇప్పటికయితే, అంతటి పట్టుద ల కనిపించడం లేదు. రానున్న రోజుల్లో పరిస్థితులు వారి మీద ఒత్తిడి తెస్తే మార్పు వస్తుందేమో తెలియదు. ఏమిటి, ఏమి జరగబోతోంది? అన్న కుతూహలం వెనుక, సమా జం అంతరాల్లో మనకు అంతుపట్టని జనాభిప్రాయం రూపు దిద్దుకుంటోందేమోనన్న అనుమానం లేకపోలేదు. అయితే, తటస్థంగా నిలబడి, ఆ ప్రశ్నలు వేసేవారే ఆ ప్రశ్నకు స మాధానం కాగలరు. మంచిచెడ్డలు, లాభనష్టాలు జాగ్రత్తగా చూసి, ఒక నిశ్చయం కల్పించుకోవలసింది ఈ తటస్థులే. ఇప్పుడున్న మంచి కొనసాగాలి. ఇప్పుడున్న చెడు ఆగిపోవా లి. ఏ ఒక్క పార్టీ బలం పెరగడమో తగ్గడమో కాదు, పార్టీల బలాబలాలను నిర్ణయించేది తామేనన్న ఆత్మవిశ్వాసం ఓట ర్లలో పెరగాలి. ప్రజలంటే నేతలకు భయభక్తులు కలగాలి. వివిధ పక్షాల యుద్ధవ్యూహాల మధ్య, ఓటరును గెలిపించే ఫలితం రావాలి. 

రాజకీయం అంటే ఓపెద్ద నాటక రంగస్థలం ఇక్కడ నాయకులు వారి వారి కళా ప్రదర్శనలను ఎవరికీ వారు గొప్పగా చెప్పుకుంటారు. ప్రజలను కీలుబొమ్మలుగా చేసి ఆడుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. కానీ రాజ్యాంగం ప్రకారం వారే ప్రజల చేతిలో కీలుబొమ్మలు అని మరచి పోతారు. చివరకు నాయకుల కళా ప్రదర్శనకు మార్కులు వేసే న్యాయనిర్ణేతలు మాత్రం ప్రజలే. కేసిఆర్ తానూ రాష్ట్ర రాజకీయాలను వదిలి దేశరాజకీయాల వైపు మొగ్గు చూపు తున్న సమయంలో తనకు ఇతర తెలుగు నాయకుల నుంచి ఒత్తిడి ఎదురు కావొద్దు అని వ్యూహరచనను పక్కగా అమ లు చేస్తున్నారు. తాను జాతీయ రాజకీయాలలోకి వచ్చి సంచలనం సృష్టించాలనుకున్న సందర్భంలోనే, అను కోకుం డా చంద్రబాబు కూడా రావడం కేసీఆర్ కోరుకుని ఉండరు. ఇంతకాలం చంద్రబాబుతో ఉన్న బీజేపీ, ఇప్పుడు తన వెను క ఉన్నదని గిట్టనివారు మాట్లాడుకోవడం కూడా ఆయన ఇష్టపడరు.

 ఎవరి వెనుక ఎవరు ఉన్నా, ఎవరి వెనుక ప్రజ లు ఉంటే వారిదే విజయం అన్నది మంచి మాటే కానీ, ఇన్ని గజకర్ణగోకర్ణ రాజకీయాలలో మంచిచెడ్డలను ఎంచి, రంగస్థలాన్ని ఆక్రమించగలిగే శక్తి, సంకల్పం ప్రజలకు ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇక నాయకులను పక్కన బెట్టి.. రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే పరి స్థితులు ప్రజలకు నివేదించడమైనా, వాటి మీద వ్యాఖ్యానించడమైనా నాటక రంగ విమర్శలాగానో, సినిమా విమర్శలాగానో మారిపో యిందని అమెరికాలో మీడియా పండితులు ఆవేదనతో చెబుతుంటారు. ఒక నాయకుడో అతని, ఆమె పార్టీయో అనుసరించే విధానాలేమిటి, వాటి పర్యవసానాలేమిటి? ప్రత్యర్థుల విధానాలతో పోల్చినప్పుడు వాటి మంచిచెడ్డ లేమిటి.. వంటి అంశాలతో రాజకీయాలను విశ్లేషించ డం పాతబడిపోయిందని, రంగస్థల అలంకరణ, ఒక్కొక్కరి నట నావిన్యాసం, నాటకీయమైన సంభాషణలు, ఉత్కంఠతోనో ఉత్సాహంతో నో ప్రేక్షకులను రంజింపజేయడం అంశాల ఆధారంగా వ్యాఖ్యానించడమే అత్యాధుని కమని అమెరికాలోనే కాదు, భారత దేశంలోనూ అనుకుంటున్నారు. కాని అక్కడ అవినీతి నాయకులను తోటి నాయకులే ఎత్తి చెత్తకుప్పలో పడవేస్తే... భారతరాజకీయాలలో వారికి అత్యున్న త స్థానంలో పడకేస్తున్నారు. రాజకీయ రంగ స్థలానికి మంచి చెడ్డలేమీ లేవు. ఉద్వేగాలతో తప్ప ప్రేక్షకుడికి వేదిక మీద జరిగే పరిణామాలతో ప్రమేయమేమీ లేదు. చివరికి ఏమి జరుగనున్నదోనన్న కుతూహలం తప్ప, కథను మలుపు తిప్ప గలిగే కీలకమేదీ జనం దగ్గర లేదని నాయకుల విశ్వాసం.

ఓటు నాయకునికి బందీ కావద్దు.. ఓటు కుల, మత ప్రలోభాలకు లొంగవద్దు... ఓటు ప్రజల చేతిలో అస్త్రంగా ఉండాలి. రాజకీయ నాయకుడు ధరించే వస్త్రంగా కాదు. ఎందుకంటే ఓటు నాయకునికి బలం కాదు. భయం కావాలి. ఆలోచిం చు ఒక్క సిరా చుక్కనే నీ భవితవ్యాన్ని మారుస్తుంది. భావితరాలకు అభివృద్ధి ఫలాలను అందిస్తుంది. అందుకే ఓటు తో అవినీతి నాయకులకు ఓటమి పోటును పొడవాలి. ఒక్కరోజు ఒక్క క్షణంలో ఓటరు తీసుకునే నిర్ణయం ఐదు సంవత్సరాల వరకు మార్చలేమని గుర్తించా లి. ఏ ఓటరు తీసుకునే నిర్ణయం అయినా.. ఆ ఒక్కరికే  వర్తించకుండా... ఇతరులపై కూడా ప్రభావం చూపు తోంది. అందుకే ఓటు వ్యక్తి  కోసం కాకుండా వ్యవస్థ బాగుపడాలని ఆలోచించి వేస్తే అభివృద్ధి వైపు మార్పు మొదలవుతుంది. అంతేగాని ఓటు ఏ నాయకునికి గొడుగుకాయకూడదు ఒకవేళ అలా జరిగితే అభివృద్ధి మందగించి దేశ ఆర్ధికవ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. 
 
‘ఎన్నికలు ఇదంతా ఒక ప్రక్రియ. సొంత ఆలోచనలతో ఓటు చేయాలనుకునే వారి మనసులో ఒక నిర్ణయం స్థిరపడే క్రమం అది. గొర్రెదాటుగా ఓటుచేసే వారిని నడిపించే నాయక గొర్రెల మనసుల్లో సైతం జరిగే రాజకీయ మథనం అది. మంచిచెడ్డల విచక్షణ మాత్రమే పనిచేయకుండా ఆర్భాటాలూ వ్యూహ నైపుణ్యాలూ జిత్తులమారి తనాలూ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాని పోలింగ్ తేదీ నాటికి మౌనం గానో బాహాటంగానో జనాభిప్రాయం ఎలా మారు తుందో ఎవరు ఉహించలేరు’.

- అర్జున్ మహేంద్ర 
సామాజిక విశ్లేషకులు మత్తులో యువత చిత్తు

Updated By ManamMon, 10/29/2018 - 00:27

imageజగిత్యాల జిల్లా జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కాలే జీ పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు సాగుతున్నాయన్న నేపథ్యంలో పోలీ సులు దాడులు నిర్వహించి కిలోన్నర గంజాయి స్వాధీనం, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరి ధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా పరిధిలో గం జాయి విక్రయిస్తున్న 12 మందిని, గంజాయికి బానిసలుగా మారిన 139 మంది యువకులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్, విశాఖ మ న్యంలో హైదరాబాద్‌కు వాహనాలలో అక్రమం గా  తరలిస్తున్న అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా నుంచి 200 కేజీల గంజాయిని పోలీసుల బృం దాలు స్వాధీనం చేసుకుంటున్న ఇలాంటి ఎన్నో సంఘటనలు మీడియాలో సంచనాలు సృష్టిస్తు న్నాయి. మాదక ద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా పరిణమించాయి. మాదక ద్రవ్యాలకు బానిసలు గా మారడంతో ఉత్సాహంతో ఉరకలెత్తాల్సిన యువత, జవసత్వాలు సన్నగిల్లి యవ్వనంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వమైపోతున్నా రు. దుర్వ్యసనాల బారినపడుతూ యుక్త వయ సులోనే అనారోగ్యానికి గురవుతున్నారు. శరీర అంతర్భాగం తూట్లుతూట్లుగా మారిపోవడంతో జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారు. తులసీవనం లాంటి అడవులలో గంజాయి మత్తెక్కిస్తోంది. రోజుల తరబడి మత్తులో ముంచెత్తే ఈ మహమ్మారి యువతను లక్ష్యంగా చేసుకుంటుంది. కళాశాల ల్లో చదివే విద్యార్థుల్లో చాలామంది ఈ అల వాటుకు బానిసవుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోకపోతే చేయిదా టే ప్రమాదం ఉంది.

డ్రగ్ మాఫియాపై ప్రభుత్వాలు, పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ, ప్రింట్ మీడి యా, ఎలక్ట్రానిక్image మీడియా, సోషల్ మీడియా చైతన్యం కలిగిస్తున్నప్పటికీ మారుమూల ప్రాం తాల్లో గంజాయి భూతం యువతను పట్టి పీడి స్తోంది. విద్యార్ధుల జీవితాలను మత్తులో ముంచేస్తోంది. తెలుగు రాష్ట్రాలలోని అడవి ప్రాం తాలు, అంతర్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో గంజా యి మాఫియా రెచ్చిపోతోంది. మారుమూల  గ్రామాల్లోని యువతలో గంజాయి మత్తు ఆవహి స్తోంది. సులువుగా డబ్బుల సంపాదనే ధ్యేయం గా యువకులను మత్తులో ముంచుతున్న గంజా యి ముఠాలు. మత్తుకు బానిసగా మారిన యు వతను ఏజెంట్లుగా మార్చి వ్యాపార సామ్రాజ్యా న్ని విస్తరిస్తున్నాయి. గంజాయి, బిజినెస్ మాఫి యాకు కాసులు పండిస్తుంటే, బానిసైన యువత భవిష్యతును చిత్తుచేస్తోంది. తమ అక్రమ సంపా దన కోసం మారుమూల ప్రాంతాల్లో ఉన్న పాఠశాల, కళాశాలల విద్యార్ధులకు గంజాయికి అలవాటు చేసి కోట్ల రూపాయలను  దండుకుం టున్నారు. గ్రామాల్లోని పాఠశాల విద్యార్ధులు, కాలేజి విద్యార్థులు గంజాయికి అలవాటు పడ టంతో లేత వయసులోనే విద్యార్దుల జీవితాలు చిక్కి శల్యమైపోతున్నాయి. ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలను ప్రోత్సహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. మద్యపానం, ధూమపానం అనే ది ప్రస్తుత కాలంలో  చాలా చిన్న వయసు నుంచే మొదలవుతోంది. పిల్లలతో చర్చించలేక పోవడం, ఒంటరితనాన్ని, బాధను మర్చి పోవ టం కోసం మత్తు పదార్థాలకు చేరువయ్యే అవకాశం ఉంటుంది. బాల్యం అనేది భవిష్య త్తుకు పునాది వేసుకొనే మంచి అవకాశాల దశ. కౌమార దశకు  ఎదిగే క్రమంలో పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకోవడం, పలు సామర్థ్యాలను రూపొందించుకోవడం, మంచి వ్యక్తిత్వానికి పు నాది వేసుకోవడం జరుగుతుంది.

గంజాయికి బానిసలుగా మారిన యువకుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది.  తల్లిదండ్రులు, తమ పిల్లలను ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలి. గంజాయి బానిసలుగా మారిన యువకుల కళ్లు కాస్త ఎరుపు రంగులో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. శుభ్రతను ఎక్కువగా పట్టించుకోక మాసిన దుస్తులతో తిరుగుతుం టారు. కనీసం గడ్డం కూడా చేయించుకోరు. 

గంజాయి పీల్చే వారి మానసిక స్థితి క్రమే ణా అధ్వాన్నం అవుతుంది. వారు తరచూ,  మనుషులు లేని చోట మనుషులను చూడడం, మనుషుల మాటలను లేదా ఇతర శబ్దాలను, శూన్యంలో శబ్దాలను వింటున్నట్లుగా  జరుగు తుంది. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు హాని తలపెట్టే ఉద్దేశంలో ఉన్నారని భావిస్తూ ఉంటారు. విద్యాలయం తర్వాత ఇం ట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతారు.  పిల్లల పై పర్యవేక్షణ కరువవుతోంది. యుక్త వయస్సుకు చేరుకుంటున్న తమ పిల్లల్లో వస్తున్న మార్పుల ను గురించి ప్రధానంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గమనించాలి. తమ పిల్లలకు డ్రగ్ తీసుకొనే అలవాటుందని తెలిసి.. దానివల్ల అతడి బంగారు భవిష్యత్తు ఎక్కడ పాడైపోతుందనే ఆందోళన ఒకవైపు, ఈ విషయం బయటకు పొక్కితే సమాజంలో ఎంత చులకనైపోతామో, కుటుంబ పరువు బజారున పడుతుందేమో.. అనే భయం చుట్టుముడుతూ ఉంటే ఆ తల్లిదండ్రుల వేదన వర్ణనాతీతం. 

సాటి మనిషికి సహాకారం చేసే అలవాటు పిల్లలలో పెంచాలి: మాదక ద్రవ్యాల కంటే కిక్ నిచ్చే విషయాలు ప్రపంచంలోఎన్నో ఉన్నాయి. ఒక గంటసేపు కదలకుండా ఒకచోట కూర్చుని , ఒక విషయంపై శ్రద్ధ పెట్టి తదేకంగా ధ్యానం చేస్తే వచ్చే కిక్ ఎన్ని మాదక ద్రవ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి పని చేసినప్పుడు, సాటి మనిషికి ఉపకారం, సహా యం చేసినప్పుడు, ఆకలితో అలమటిస్తున్న పేద వాళ్లకు కడుపునిండా అన్నం పెట్టినప్పుడు వచ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విషయా లను ప్రతి విద్యార్థికి అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు చిన్నతనం నుంచి చెప్పగలగాలి.

- డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి
కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్పటేల్ మంత్రాంగం

Updated By ManamMon, 10/29/2018 - 00:27

imageసెప్టెంబర్ 17 వచ్చిందంటే తెలంగాణ గాయాలన్నీ జ్ఞాపకానికొస్తాయి. ఇప్పటి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న కిరాతకాలు తెలంగాణ డెబ్బయి యేళ్ళ క్రితమే అనుభవించింది. 1940లో హైదరాబాదు సంస్థా నంలో నిజాం రాజు అండ చూసుకుని రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ బలవంతంగా పన్నులు వసూలు చేసేవాడు. చెల్లించని వారి గోర్ల కింద మాంసం కత్తిరించి గోర్లు ఊడబెరికించే వాడు. అప్పట్లో భర్తల ముందు భార్యలపై అత్యాచారాలు చేయడం, భార్యల కళ్ళెదుటే భర్తల్ని నరికి చంపడం సర్వ సాధారణం. ఈ బాధలు పడలేక ఎవరైనా పారిపోతే వారి పిల్లల్ని దొరికించుకుని వారిని ఎగరేసి కత్తికి గుచ్చి చంపేవారు. తన రాజ్యంలో అలాంటి కిరాతకాలు జరిపించిన నిజాంరాజు మంచోడని, సెక్యులర్ రాజు అని పొగిడేవారు పిచ్చోళ్ళు, మూర్ఖులు మాత్రమే అయి ఉంటారు.

సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ వల్ల 1948 సెప్టెంబర్ 17న భారత ప్రభుత్వం హైదరాబాదు సంస్థానాన్ని ఇండియన్image యూనియన్‌లో విలీనం చేసుకుంది. వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పిన మాట ఏమిటంటే నిజాంను అరెస్ట్ చేయమని ఖాసిం రజ్వీని చంపేయమని కానీ, జవహర్ లాల్ నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంను ఏమీ చేయకుండా ఖాసిం రజ్వీని మాత్రం అరెస్ట్ చేయమన్నారు. పాకిస్థాన్‌కు వెళ్ళిపోదలచిన వారికి ఉదారం గా అనుమతులివ్వాలని చెప్పారు. ఆ మాట ఎంతోమందికి ఉపయోగ పడింది. నెహ్రూ దయాగుణం వల్ల నిజాం రాజ్ ప్రముఖ్ (గవర్నర్ హో దా) అయ్యాడు. అప్పటి దాకా నిజాం దగ్గర పని చేసిన దీవాన్, మేజర్ జనరల్, ఇతర ఉన్నతోద్యోగులంతా ముందే మేల్కొని పాకిస్థాన్ పారి పోయారు. ఇక్కడ హైదరాబాదులో దొరికిన రజాకార్లను దొరికినట్లుగా భా రత సైన్యం చంపేసింది. తెలివిగా తప్పించుకున్న వాళ్ళు ఉన్న పళంగా గ డ్డాలు, మీసాలు తీయించుకుని మామూలు పౌరుల్లో కలిసిపోయి, ప్రాణాలు దక్కించుకున్నారు. సంస్థానంలో అన్ని కిరాతకాలకు కారకుడైన ఖాసిం రజ్వి చివరి నిమిషంలో విషయం అర్థం చేసుకున్నాడు. ఇక్కడే ఉంటే జనం నిట్ట నిలువునా తనని చీల్చి చంపుతారని భయపడ్డాడు. అయితే పాకిస్థాన్‌కు పారి పోయే ముందు పార్టీ బాధ్యతలు ఎవరికైనా అప్ప గించి వెళ్ళాలని అనుకున్నాడు. పార్టీ సభ్యులందరికీ వర్తమానం పంపాడు. కేవ లం 30, 40 మంది మాత్ర మే సమావేశానికి హాజరయ్యారు. హాజరైన వారిలో పార్టీ బా ధ్యతలు తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. పాకిస్థాన్‌కు వెళ్ళిపోయే తొందరలో ఉన్న రజ్వి మరో ప్రకటన చేశాడు. పన్నెం డేళ్ళు దాటిన బాలుడైన నవయువకుడైనా ఎవరైనా సరే ధైర్యంగా ముందు కొస్తే పార్టీ పగ్గాలు అప్పజెప్పుతానని  ప్రకటించాడు. ఆ ప్రకటనకు స్పం దించి అబ్దుల్ వహీద్ ఓవైసీ అనే 18 ఏళ్ల యువకుడు ముందుకొచ్చాడు. అప్పటికి అతనికి ఆ పార్టీతో సంబంధంగాని, రాజకీయ పరిజ్ఞానం గానీ లేవు. వహీద్ ఒవైసీ ధైర్యాన్ని చూసి నిజాం రాజు పార్టీ అధినేతగా అతని పేరు ప్రస్థావించాడు. అంతే ఎన్నిక జరిగిపోయింది. పార్టీ పగ్గాలు వహీద్ ఒవైసి చేతుల్లోకి వచ్చాయి. 

- డాక్టర్ దేవరాజు మహారాజుఆదివాసీల ఆత్మవిశ్వాసం 

Updated By ManamSat, 10/27/2018 - 00:49

imageఆశ్వీజ మాసంలో తెలంగాణ గిరిజన పోరాటవీరులను స్మరించుకునే సందర్భం. ఆనాటి నైజాం పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కొరకు వీరోచితంగా పోరాడిన కుమ్రంభీం దాదా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. ఆ స్ఫూర్తికి చిహ్నంగా తెలంగాణ ప్రభు త్వం పోరుగడ్డ జోడేన్‌ఘాట్‌లో కుమ్రంభీం స్మృతిపథం (మ్యూజియం) నిర్మించింది. పోరాట చిరునామాగా ‘కుమ్రంభీం అసిఫాబాద్’ జిల్లా ఏర్పడింది. జోడెన్‌ఘాట్ భూపొదలో భీమ్‌కు కుడి భుజంగా కుమ్రంసూరు తుడుందెబ్బ మోగిస్తే, అతని ఎడమ భుజంగా తూటు కొమ్ముతో పోరాట ధ్వనిని పొలివేురల్లో వున్న పన్నెండు గ్రామాల్లో ప్రతిధ్వనింపజేసింది మాత్రం వెడ్మరాము. ఆదివాసీ తెగలలో కుమ్రంభీం ‘గోండు’ యోధుైడెతే, కుమ్రం సూరు ‘కోలాం’ కొదవుసింహం, వీరిద్దరికి ‘తోటి’ వాద్య ప్రచారకుడు వెడ్మరాము.

కుమ్రంభీమ్‌కు అక్షర జ్ఞానం కొరవడినా అన్యాయాల్ని, భూ ఆక్రవుణల్ని పసిగట్టే జ్ఞాన పిపాసి జల్-జంగిల్-జమీన్image పోరాట పంథాకు కుమ్రంసూరు ప్రణాళికలు రచిస్తే, వెడ్మరాము వాద్యప్రచార కర్తగా పనిచేశారు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన సముదాయైమెన గొండులలో పెళ్ళిళ్ళు, కర్మకాండలు, పండుగలు, జా తరలు, చారిత్రక విశేషాలను వాయిద్య సహేతంగా వినిపించే ఒక ఆశ్రిత తెగ తోటీలది అలాంటి తోటి తెగలో వెడ్మరాము 1914, జూలైలో వెడ్మమెంగు జంగుబాయిల తొలి సంతానంగా జన్మించా డు. అది మంచిర్యాల జిల్లా కాసింపేట మండలంలోని ముల్కపల్లి గ్రామం.
వెడ్మరాము గోండి, తోటీల సంప్రదాయ వాయిద్యాైలెన సొరడెంసా- అట్రావాజంగ్, కర్నట్, దహ్కి(డవురు), పెప్రె, కాలికోం (తూటు కొమ్ము) వంటి పరికరాలను వాయించడం చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. కులవృత్తిలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గోండు గ్రామాలను సందర్శించి వారి చారిత్రక గాథలను విన్పించాడు. తమ జాతి మూలపురుషుైడెన పహండి కుపార్ లింగో మధ్యప్రదేశ్‌లోని కచర్‌గడ్ ప్రాంతంలో గోండ్వానా జాతి నిర్మాణం చేశాడని నమ్ముతాడు. అక్కడి నుంచి వెడ్మరాము ఆసిఫాబాద్ మీదుగా కుమ్రంభీం స్వయంపాలన ప్రకటించుకున్న 12 గ్రామాలను చూడాలని బాబేఝరికి చేరుకున్నాడు. అక్కడున్న మడావి మెహ్పతి ద్వారా వెడ్మరాము వాయిద్య కళాప్రతిభ భీం కు తెలిసింది. రాము కథా ప్రదర్శను స్వయంగా చూసిన భీం భూపోరాటంలో తుడుందెబ్బకు తోడు తూటుకొమ్ముతో ప్రచార భేరీమోగించడానికి తనకు సహాయుకుడిగా నియుమించుకున్నాడు.

గోండుల వాయిద్యాల్లో తూట కొమ్ము శబ్దం శత్రువుల రాక ను ఒక శబ్దం చేరవేస్తే, ఆయుధాలతో బయుటికి రమ్మని సంకేతం గా మరోశబ్దం చెబుతుంది. కుమ్రం సూరు మోగించిన తుడుం దెబ్బలతో పాటు వెడ్మరాము పలికిన తూటు కొమ్ము సవురశం ఖం పూరించడంతో వందల మంది గోండులను జోడేన్ ఘాట్ సాయుధ పోరులో చురుగ్గా పాల్గొనేట్లు చేశాయి. ఇలా భీం పోరా టం తదనంతరం తెలంగాణ ప్రజలకు వెడ్మరాము తన కళా ప్రదర్శనతో స్ఫూర్తి నింపాడు. 1940 అక్టోబరు 8న జోడేఘాట్ గుట్టల్లో నైజాం సైనికుల దాడిలో కుమ్రంభీం అవురుడైన తర్వాత అక్కడి గోండులు, కోలాములు, నాయుకపోడులు, తోటోళ్ళు చెల్లాచెదైరెనారు. పరిసర గ్రామైమెన గిన్నెధరికి చేరిన రాము ఆవేశంతో ఆవేదనతో భీం చరిత్రను తొలిసారిగా కథారూపంలో గా నం చేశాడు. అందుకే భీం పోరాట విశేషాలను తెలుసుకునేందు కు గిన్నెధరి ఒక వేదికగా మారింది. ఆ తర్వాత రాము అధికంగా గోండులున్న ఏదులపాడ్‌లో సంప్రదాయ పూజారిగా చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.

కుమ్రంభీం పోరాట నేపథ్యాన్ని అధ్యయనం చేయుడానికి నైజాం ప్రభుత్వం ప్రముఖ ఆంథ్రొపాలజిస్టు హైమండార్ఫ్‌ను నియుమించింది. డార్ఫ్ గిన్నెధరిలోని గోండు పెద్దైలెన సిడాం మారూమాస్టర్, కోట్నాక సోంజీ, మార్సుకోల రాము, ఆత్రం లచ్చుపటేల్ చెప్పిన వివరాలను బట్టి వెడ్మరాము నివసిస్తున్న ఏదులపాడ్‌కు వెళ్ళాడు. వెడ్మరాము కథారూపంలో చెప్పిన భీం గాథను విని హైమండార్ఫ్ నిజాం ప్రభుత్వానికి నివేదిక పం పాడు. అంతేకాదు డార్ఫ్ గోండుల విశిష్టైమెన సంస్కృతీ సంప్రదాయాలను వెడ్మరాము నుంచే తొలిసారి తెలుసుకున్నాడు. 1960 - 80 మధ్య గోండుల జీవనంపై సుమారు ఎనిమిది పుస్తకాలు రచించాడు. డార్ఫ్ రాసిన పుస్తకాలను చదివి ప్రభావితుైడెన మరో విదేశీ వైుఖేల్ యోర్క్ గోండుల పోరాట చరిత్రను, వారి జీవన సరళిని రాము నుంచే తెలుసుకున్నాడు. రాము పెప్రె, కీక్రి, ధహ్కి, కాలికోమ్ వంటి వాయిద్యాలను పలికించే తీరు, కుమ్రంభీం కాలం నాటి తూటు కొమ్ము ఊదిన తీరును యోర్క్‌వెుచ్చుకున్నాడు. వెంటనే రా మును గిన్నేధరిలోని రాయ్ సెంటర్‌కు పిలిపించి గోండు పెద్దల స వుక్షంలో భీం చరిత్రను, గోండుల రాజరిక, సాం స్కృతిక ఆచారాల గురించి వాద్యగాన సహితంగా ప్రదర్శన ఇప్పించాడు. దీనిపై వైుఖేల్ యోర్క్ డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాడు. ఇది మూడున్నర దశాబ్దాల కిందటే బీబీసీ టెలివిజన్‌లో ప్రసారం జరిగింది. కుమ్రంభీం భూపోరాటంలో వెడ్మరాము, అతని ఎడమ భుజంగా ఉంటూనే భీం చరిత్రను, గోండుల గొప్పదనాన్ని కథారూపంలో ప్రపంచానికి చాటిన ఘనత తోటి తెగలో వెడ్మరాముకే దక్కింది. తన వాద్య సంగీత ప్రచారకుడిగా ఆదివాసీల్లో ఆత్మవిశ్వాసం నింపిన వెడ్మరాము అనారోగ్యంతో 1987 అక్టోబర్ 26న కన్నుమూశాడు. జోడేన్ ఘాట్‌లో నిర్మించిన కుమ్రంభీం స్మారక మ్యూజియంలో భీం శిల్పం ఎడమ వెడ్మరాము శిల్పం పెట్టారు. 

- గుమ్మడి లక్ష్మీనారాయణ
 7989134271చేనేత ఆకాంక్షలు ‘మేనిఫెస్టో’ల్లో ప్రతిబింబించాలి

Updated By ManamSat, 10/27/2018 - 00:49

imageఇది ఎన్నికల కాలం. ఏది కోరితే, దాని సాధ్య సాధ్యాలను పార్టీలు ఆలోచన చేసే ఓట్ల సమయ మి ది. గ్లోబలైజేషన్ పుణ్యమంటూ సబ్బండవర్ణాల కుల వృత్తులన్నీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. విధిలేని స్థితుల్లో గ్రామాల్లో జీవనం సాగిస్తున్నవారు అదే సంప్రదాయ పద్ధతుల్లో తమ తమ వృత్తులను కొనసాగిస్తు న్నారు. వీటికి సరైన ముడిసరుకు అందక, ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ లేక దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. తెలం గాణ ఏర్పడిన తర్వాత తమ దశ దిశ మారుతుందని ఆశించిన వారికి కొంతలో కొంత ఆశాకిరణం చిక్కింది. అందులో పద్మ శాలీల కుల వృత్తి చేనేత ఒకటి. చేనేత రంగం మొత్తంగా ఏ మేరకు అభివృద్ధి చెందిందన్న విషయాన్ని పక్కనబెడితే, సిరిసిల్ల మాత్రం ఆత్మహత్యలు లేని చేనేత కేంద్రంగా గుర్తింపు పొందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కేటీఆర్ ఇక్కడి నుంచి సారథ్యం వహిస్తుండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బతుకమ్మ చీరలతో ఒక్కో కార్మికుడు నెలవారీగా రూ.10 నుంచి రూ.20 వేల వేతనం పొందే అవ కాశం కలిగింది. అదే పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, వరంగల్ తదితర చేనేత కేంద్రాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. రాష్ట్ర బడ్జెట్‌లో వేల కోట్లు పెట్టిన ప్పటికీ ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అనే కానేక సమస్యలతో చేనేత కునారిల్లుతున్నది. ఈ సమస్యలకు పరిష్కారంగా ఎన్నికలను ఎంచుకోవ లసిన సమయం ఆసన్నమయిందని చేనేత కార్మి కులు గుర్తించారు. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో చేనేత పరిశ్రమను రక్షించేందుకు అవసరమైన అన్నిరకాల అంశాలను పొందుపరిచేలా ఒత్తిడి తీసుకువస్తున్నారు.

దశాబ్దాలుగా ఆర్థిక సమ స్యలతో సతమతమవుతూ జీవ న పోరాటం సాగిస్తున్న చేనే త కార్మికులకు తెలంగా ణimage ప్రభుత్వం ప్రక టించిన వృత్తి, ఆర్థిక ప్రోత్సాహకాలు కొంతమేరకు ఊరటనిచ్చాయి. అయితే జనాభాలో  పది శాతానికి పైగా ఉన్న పద్మశాలీలకు చెందిన ప్రతినిధులు చట్ట సభలో లేకపోవడంతో కులవృత్తికి చెందిన చాలా సమస్యలు సభ దృష్టికి రాలేకపోతున్నాయి. దీంతో చేనేత వృత్తి రోజురోజుకీ దిగ జారుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ప్రత్యక్షంగా, లక్షా యాబై వేలకు పైగా పరోక్షంగా మగ్గాలు ఉన్నప్పటికీ, జియో ట్యా గింగ్‌తో కేవలం 16 వేల మగ్గాలకే ప్రభుత్వం పరిమితం చేసింది. 2017, 2018 రాష్ట్ర బడ్జెట్‌ల్లో చేనేతకు రూ.1280 కోట్లు కేటాయి స్తూ, ఇదే బడ్జెట్‌ను 2018, 2019వ బడ్జెట్‌లో చూపించి, ఇందు లో రూ.373 కోట్లు కేటాయించి చేనేతను పక్కదారి పట్టించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ కేటాయింపుల్లో రూ.50 కోట్లు కూడా వ్యయం చేయలేకపోయింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చేనేతరంగానికి నిర్దిష్టమైన ప్రణాళికను మేనిఫె స్టోలో పార్టీలు పొందుపరిచి చేనేత కార్మికులను ఓటు బ్యాంకుగా మార్చుకోవాలి. ఈ మేరకు కార్మికవర్గాలు తమ అవసరాలు, డిమాండ్లను ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాయి.

చేనేత పరిశ్రమను పరిరక్షించేందుకు అవసరమైన అన్నిరకాల అంశాలను ప్రతి రాజకీయ పార్టీ  పరిశీలించాలి. లక్షలాది మంది నేత కార్మికులను ఆదుకునే దిశగా ప్రణాళికను తయారు చేయవల సిన గురుతరమైన బాధ్యత ప్రతి పార్టీపై ఉంది. ఈ రంగంపై స్పష ్టమైన హామీ ఇచ్చేలా మేనిఫెస్టోలో ఉంచి ఓట్లు అడగడానికి వెళ్ళా ల్సిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీలు భావించా లి. ఆకలి ఆత్మహత్యలను నివారించడానికి వృత్తిపైన భరోసా ఇవ్వా లి. చేనేత, పవర్‌లూమ్ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. దీంతోపాటు ప్రతి చేనేత కుటుంబానికి నెలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడంతో పాటు ప్రతి కుటుంబానికి నిర్దిష్టమైన ఆరోగ్య బీ మా అందించాలి. చేనేత కార్మికులకు ఇళ్ళ స్థలాలు లేవు, డబుల్ బెడ్‌రూం ఇళ్ళు లేవు, వర్క్ షెడ్లులేవు. కుటుం బ పోషణ భారమై విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకుంటున్న వారికి రూ.6 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలి. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీన్ని అందించే ఏర్పాటు చేయాలి. ప్రధాన మంత్రి జీవన జ్యోతి ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేయాలి. వీటిని పరిగణనలోకి తీసుకుని పార్టీలు మేనిఫెస్టోలో చేనేతకు గౌరవ నీయమైన స్థానాన్ని కల్పించాలి. 

చేనేత కార్మికుల రుణమాఫీ ఓ ప్రహాసనంలా మారింది. ప్ర భుత్వం రుణమాఫీ ప్రకటన చేసి ఏడాదిన్నర అవుతున్నప్పటికీ మాఫీకి నోచుకోలేదు. వెంటనే మాఫీ చేసి, ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల వడ్డీలేని రుణం అందించే వెసులుబాటు కల్పించాలి. సబ్సిడీ బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించినందున, జియోట్యాగ్ కలిగిన నేత కార్మికుడికి నెలకు రూ.6 వేలు అందివ్వాలి. అలాగే పొదుపు బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించగా, దీన్ని సక్రమంగా అమలు జరుపుతూ బ్యాంకు అధికారులతో సమన్వయపరిచి ప్రతినెలా ఆర్డీ 2 ఖాతాలో ప్రభుత్వ వాటా జమయ్యేలా చూడాలి. వస్త్ర కొనుగోలు చేయడానికి కేటాయించిన రూ.147 కోట్ల బడ్జెట్ కింద సహకార సంఘాల్లో, సహకారేతర రంగంలో పేరుకుపోయిన వస్త్ర నిల్వలను వెంటనే కొనుగోలు చేయాలి. నూలు సబ్సిడీ 40 శాతానికి ప్రకటించి, రెండు కిలోల నూలుకే పరిమితం చేశారు. దీన్ని పెంచి సక్రమంగా అమలుచేయాలి. చేనేత కార్మికుల పొదుపు పథకం అమలుపరచడంలో ఉద్యోగుల పాత్ర ప్రశ్నార్ధకంగా మార డంతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేనేత రం గం నుంచి రిటైర్‌మెంట్ అయ్యే కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రెండు లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఇం తవరకు అమలులోకి రాలేదు. అలాగే చేనేత సహకార, సహకారే తర రంగాలలోని కార్మికుల ప్రయోజనార్ధం ఏర్పాటు చేసిన కార్పొ రేషన్ ఇంతవరకు ప్రారంభం కాలేదు.

చేనేతకారుల ఆకాంక్షలు మేనిఫెస్టోలో ప్రతిబింబించాలి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అమలు జరగనివి ఎందుకు జరగలేదో, పక డ్బందీగా అమలు జరపడానికి తీసుకునే చర్యలు ఆ పార్టీ మేనిఫె స్టోలో వివరించాలి. ఇతర పార్టీలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై తీసుకునే చర్యలను ప్రస్తవిస్తూనే, ఇంతకు మించి ప్రయోజనం కలిగించేవాటిని స్పష్టంగా వివరించాలి. ఆ యా పార్టీల మేనిఫెస్టోల కోసం చేనేత వర్గాలు ఎంతో ఆశగా ఎదు రుచూస్తున్నాయి. వీటికనుగుణంగా ఎన్నికలకు పోవాలని భావిస్తు న్నాయన్న విషయాన్ని పార్టీలు విస్మరించరాదు.

- కోడం పవన్‌కుమార్
9848992825ప్లాస్టిక్ భూతం

Updated By ManamThu, 10/25/2018 - 02:31

imageమనం ఏదైనా ఫంక్షన్‌కు వెళ్ళామనుకోండి అక్కడ మనం తినేవి, తాగేవి, వాడేవి అన్ని కూ డా ఒక్కసారి చూస్తే అంతా ప్లాస్టిక్ మయం. వా డి పారేసే గ్లాసులు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ కవర్స్ అలా ఆ ప్రదేశం అంతా నానా బీ భత్సంగా ఉంటుంది. కారణాలను అన్వేషిస్తే ఈ జీగా ఉంటుందని, ఖర్చు తక్కువగా ఉం టుంద ని, త్వరగా శుభ్రం చేసుకోవచ్చని ఇలా అనేక ర కాల కారణాలతో మనమే దానిని ఎక్కువగా వాడుతున్నాము. ఈ కారణంతో మనం 21వ శతాబ్దాన్ని ప్లాస్టిక్ శతాబ్దంగా మార్చి వేస్తున్నా ము. ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చాక, వస్తు త యారీ కనీవినీ ఎరుగని కొత్త పుంతలు తొక్కిం ది. ఉష్ణం, విద్యుత్, ద్రావకాన్ని తట్టుకోగల శక్తి ఉండటంతో ప్లాస్టిక్ వస్తు తయారీలో కీలక పదా ర్థంగా అవతరించింది. నేడు కంప్యూటర్ నుంచి గడియారం వరకు.. జెట్  విమాన భాగాల నుం చి జుట్టుకు పెట్టుకునే క్లిప్‌ల వరకు అంతా ప్లాసి ్టక్ మయం. ప్రతి చిన్నదానికి ప్లాస్టిక్‌ను విరివిగా వినియోగిస్తున్నాము.

40 మైక్రాన్ల మందంకు మించిన కవర్లను యథేచ్ఛగా వాడుతున్నారు. వాడి పడేసిన కవర్లు భూమిలోimage కలవకపోవడంతో పర్యవరణానికి తూ ట్లు పడుతున్నాయి. అంతే కాకుండా పంటలను సైతం దెబ్బతీస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అ వి తాత్కాలికంగా శిథిలమైనా చిన్న రేణువులు గా మారి మట్టిలో కలిసిపోయి దాని సహజ లక్ష ణాన్ని దెబ్బతీస్తాయి. మట్టిని కాలుష్య కారకం గా మారుస్తున్నాయి. మట్టి మాత్రమే కాదు భూ మి లోకి ఇంకే నీరు సైతం కలుషితమవుతుంది. దీంతో మానవ మనుగడకు పెనుముప్పు కలుగు తుంది. 
ప్లాస్టిక్ వినియోగం తెచ్చి పెడుతున్న నష్టా లకు అంతు లేకుండా వుంది. నేలలో చేరిన ప్లాస్టిక్ పదార్థాలు, నేల నీటి నిలువ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా భూసారం క్షీణి స్తోంది. భూగర్భ జలమట్టం పడిపోతుంది. త ద్వారా పంటలు పండడం తక్కువగా ఉండ డం, పంట దిగుమతి తగ్గిపోవడం జరుగుతుం ది. మురికి కాలువల్లో చేరి ప్లాస్టిక్ సంచులు ము రుగునీటి పారుదలను అడ్డుకొంటున్నాయి. ఫలి తంగా కాలవల్లో మురికి నీరు పేరుకుపోయి దోమల ఉత్పత్తి ఎక్కువవుతుంది. దోమల ద్వా రా వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. అలాగే పందుల బెడద ఎక్కువవుతుంది. దాని వల్ల ఆ చుట్టుపక్కల వాతావరణం అపరిశుభ్రం కావడం రకరకాల అంటువ్యాధులు అభివృద్ధి చెందడం, వివిధ రోగాలు రావడం జరుగుతుం ది. పశుగ్రాసం లేనప్పుడు పశువులు, వివిధ జీ వాలు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటాయి. వాటి మాం సం మనం తినటం వల్ల ప్లాస్టిక్ అవశేషాలు మనిషి కడుపులోకి చేరి పలు రోగాలు వచ్చే అవ కాశం ఉంది. ఆవులు, గేదెలు వీటిని తినడం వల్ల అవి పాలు ఇతర పాలపదార్ధాల రూపంలో మనకి చేరుకుంటాయి. పాలల్లో ప్లాస్టిక్ అవశే షాలని ఇటీవల కనుకున్నారు కూడా. ఈ మధ్య చనిపోయిన ఆవు శరీరంలోంచి దాదాపు 75 కేజీ ల ప్లాస్టిక్ బయట పడిందంటే ఎంత ఘోరమో ఆలోచించండి. చెరువుల్లో, నదుల్లో ఈ వ్యర్థా లు వేయటం వల్ల చేపలు ఇతర జలచరాలు చనిపోతాయి. సముద్రపు ఒడ్డులో గుడ్లుపెట్టడా నికి ఒడ్డెక్కే జలచరాలు ప్లాస్టిక్ బ్యాగ్‌లను జెల్లీ చేపలుగా భ్రమించి వాటిని తిని ప్రాణాలు విడు స్తున్నాయి. ప్రమాదరమైన ప్లాస్టిక్ వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా సంవత్స రానికి వేల టన్నుల క్యారీ బ్యాగులు, వాటర్ బాటిళ్లు, టీ కప్పులు వాడుతున్నారని ప్లాస్టిక్ ని షేధ నిపుణులు చెపుతున్నారు. 

ప్లాస్టిక్ సంచులను ఇతర విధాలుగా విని యోగించే ప్రయత్నం ముమ్మరం చేయాలి. వ్య ర్థం నుంచి అర్థం పొందే ఈ కార్యక్రమాలు మ రింత ఊపందుకోవాలి. ప్లాస్టిక్‌ల వల్ల పర్యావర ణానికి హాని కలుగుతోందన్న విషయం తెలిశా క, మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్స్ రూప కల్పనలు ప్రారంభమయ్యాయి. ఈ దిశలో శాస్త్రజ్ఞులు స త్ఫలితాలు సాధించడం ఊరట కలిగించే విష యం. త్రివేండ్రంలోని దుంప పంటల పరిశోధ నా కేంద్రం ఈ విధమైన కొత్తరకం ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసి పరీక్షిస్తోంది. అమెరికా శాస్త్రవేత్తలు జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా మొక్కల నుండి వీ హెచ్‌బీవీ అనే ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేశారు. ఇది భూమిలోకి తేలికగా మళ్లిపోతుంది. జపాన్ శాస్ర ్తజ్ఞుల కృషి ఫలితంగా ‘చిటోసాన్’ అనే సరికొత్త ప్లాస్టిక్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లాడ్‌కు చెందిన సింఫనీ పర్యావరణ సంస్థకొద్ది వారా ల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోయే పాలిథీన్ సంచులు తయారు చేసింది

 సింగపూర్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలనుపయోగించి ‘కిరోసిన్’ ఉత్పత్తి చేస్తున్నారు. మనదేశం ఇం దుకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ది గుమతి చేసుకోవాలి లేదా మన శాస్త్రజ్ఞుల పరిశో దన ఈ కోణంలో సాగాలి. కొన్ని మహిళా బృం దాలు వృథాగా పారవేసే పాలిథీన్ కవర్లతో మ్యా ట్‌లు, చేతి సంచులు, టేబుల్ కవర్లు వంటి గృ పకరణాలు తయారుచేస్తున్నారు. ప్రభుత్వం, ఇతర ఆర్థిక సంస్థలు వీరికి చేయూత నివ్వాలి. అలాగే వృధా ప్లాస్టిక్‌ను కరిగించి రోడ్లు వేయ డంలో ఉపయోగిస్తున్నారు అలాంటి టెక్నా లజీ ని అంది పుచ్చుకోవాలి. మహారాష్ట్ర ప్రభుత్వం  జపాన్‌కి చెందిన సంస్థతో ఒప్పందం కుదుర్చు కుని ఈ ప్లాస్టిక్ చెత్త నుంచి డీజిల్ ఉత్పత్తి చేసే మిషన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి మొత్తం పెట్టుబడి 5 కోట్లు మాత్రమే. ఇటువంటి వాటిని అభివృద్ధి పరచడం వల్ల ప్లాస్టిక్ నష్టాన్ని తగ్గించవచ్చు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణా నికి మానవ ఆరోగ్యానికి హాని జరుగుతోంది. ప్రతి ఒక్కరూ జూట్ సంచులను ఉపయోగించా లి. ప్రతి వ్యక్తి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషిచేయాలి. పర్యావరణాన్ని పదిలంగా కాపా డుకోవాలి. భావితరాలకు నివాసయోగ్యమైన రీతిలో భూగోళాన్ని అందించాలి.

- కాళంరాజు వేణుగోపాల్
ఉపాధ్యాయుడు, 8106204412

Related News