Shiva Nirvana

మొదలైన చైతన్య- సమంత చిత్రం

Updated By ManamSat, 09/29/2018 - 13:02

Samantha, Naga Chaitanyaటాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య- సమంత కలిసి నాలుగో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘మజిలి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తుండగా.. తాజాగా ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం చైతన్య, సమంతలు ఫారిన్ ట్రిప్‌లో ఉండగా.. వారిద్దరు కాకుండా మిగిలిన పాత్రాధారులపై దర్శకుడు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు. ఇక త్వరలోనే చైతన్య, సమంత ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వనున్నారు. కాగా వివాహానంతరం వచ్చిన మనస్పర్థలను భార్య, భర్త ఎలా పరిష్కరించుకున్నారో అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. సాహు గారపాటి, హరీశ్ పెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెళ్లి తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 



చై, సామ్‌ మూవీ టైటిల్ ఇదేనా..!

Updated By ManamThu, 08/16/2018 - 11:28

Naga Chaitanya, Samanthaటాలీవుడ్ క్రేజీ కపుల్ చైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా ‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం కోసం టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లైన భార్య భర్తల మధ్య జరిగే కథాంశంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి మజిలి అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా వివాహం తరువాత చైతన్య, సమంత నటిస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.



చై, సామ్ కొత్త మూవీ ప్రారంభం

Updated By ManamMon, 07/23/2018 - 10:18

Chai, sam చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర పూజా కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భార్యాభర్తల బంధం కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో కనిపించనుంది. ఆగష్టు నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. సాహు గారపాటి, హరీశ్ పెద్దలతో కలిసి కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా చై, సమంత కాంబోలో ఇప్పటికి ఏమాయ చేశావే, మనం, ఆటోనగర్ సూర్య చిత్రాలు తెరకెక్కగా.. ఇది నాలుగో చిత్రం కానుంది. అలాగే పెళ్లి తరువాత ఈ ఇద్దరు కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.





Related News