nayanatara

కమల్‌తో పోటీగా నయనతార

Updated By ManamSun, 07/15/2018 - 12:14

Nayanatara, while Kamal hassan movie, Kollywood film industryచెన్నై: కోలీవుడ్‌ సినీ పరిశ్రమలో హీరోలకు తామేమీ తీసిపోమనే తరహాలో అందాల తార నయనతార దూసుకెళ్తున్నారు. తన అభినయంతో హీరోయిన్‌ స్థాయిని మించి హీరోలకు గట్టి పోటీ ఇస్తోంది. హీరోలకు సమానమైన పాత్రలను పోషిస్తూ ఒక ప్రత్యేకమైన ట్రెండ్‌ను సెట్ చేస్తున్న నయన.. విలక్షణ నటుడు, అగ్రహీరో కమల్‌హసన్‌తోనే పోటీపడేందుకు సిద్ధమవుతోంది. ‘మాయా’, ‘అరం’ వంటి చిత్రాలతో మెప్పించిన నయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కోలమావు కోకిల’. ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే అదే రోజున ప్రపంచ వ్యాప్తంగా కమల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘విశ్వరూపం 2’ను విడుదల చేయనున్నారు.

ఇటీవల కమల్‌హాసన్‌ తన సినిమాను ఈ నెల10న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘తూంగావనం’ తర్వాత దాదాపు రెండు సంవత్సరాల అనంతరం కమల్‌ సినిమా మళ్లీ తెరపైకి వస్తోంది. కమల్‌తో పోటీ పడేందుకు లేడీ సూపర్‌స్టార్‌ నయనతార ఎంతమాత్రం వెనకాడటం లేదని కోడంబాక్కం వర్గాలు చెబుతున్నాయి. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ‘కోలమావు కోకిల’ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందించారు. నయనతార, జాక్లిన్‌, యోగిబాబు, శరణ్య పొన్‌వన్నన్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.  న‌య‌న‌తార‌.. ఓ స్మ‌గ్ల‌ర్‌

Updated By ManamSat, 05/19/2018 - 15:51

nayanకోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా స్మ‌గ్ల‌ర్ అవ‌తారం ఎత్తింది. అయితే.. ఇదంతా రియ‌ల్ లైఫ్‌లో అనుకుంటే పొర‌పాటే. రీల్ లైఫ్ కోస‌మే ఆమె స్మ‌గ్ల‌ర్‌గా మారిపోయింది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. ప్ర‌స్తుతం న‌య‌న్ న‌టిస్తున్న సినిమాల‌లో త‌మిళ చిత్రం ‘కొలమావు కోకిల’ ఒక‌టి.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న్ పాత్ర చుట్టే క‌థ తిరుగుతుంది. క‌థానుసారం.. ఆర్ధికపరమైన ఇబ్బందుల‌తో  మాదక ద్రవ్యాలను స‌ర‌ఫ‌రా చేసే స్మగ్ల‌ర్ పాత్ర‌లో న‌యన్ క‌నిపించ‌నుంది. ఈ సినిమాతో న‌టిగా న‌య‌న‌తార మ‌రో స్థాయికి వెళతార‌ని చిత్ర బృందం పేర్కొంది. యోగి బాబు, శరణ్య, అరణ్తాంగి ఇత‌ర‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్‌ రవిచంద్రన్ స్వరాలను సమకూరుస్తున్నారు.న‌య‌న‌తార కాదు.. ర‌మ్య‌కృష్ణ‌?

Updated By ManamFri, 04/20/2018 - 23:59

ramyaస‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త నేత వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం 'యాత్ర‌'. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ సినిమా.. అతి త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇదిలా ఉంటే.. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మాలీవుడ్ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్న‌ ఈ చిత్రానికి మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. వై.ఎస్‌.ఆర్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ పాత్ర‌లో న‌య‌న‌తార న‌టించ‌నుంద‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. అయితే.. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇప్పుడా పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ర‌మ్య ఎంట్రీపై క్లారిటీ రానుంది.'జై సింహా' 100 డేస్ ఫంక్ష‌న్ అప్‌డేట్‌

Updated By ManamTue, 04/17/2018 - 20:13

balakrishnaనంద‌మూరి బాల‌కృష్ణ, న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి హీరోహీరోయిన్లుగా ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ రూపొందించిన చిత్రం 'జై సింహా'. సంక్రాంతికి విడుద‌లైన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా.. వ‌సూళ్ళ ప‌రంగానూ మెప్పించింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 21తో ఈ చిత్రం 100 రోజులు పూర్తిచేసుకోనుంది. ఈ సంద‌ర్భంగా.. ఏప్రిల్ 22న గుంటూరు జిల్లాలోని చిల‌క‌లూరి పేట న్యూ మార్కెట్ యార్డ్‌లో సాయంత్రం 5 గంట‌ల‌కు శ‌త‌దినోత్స‌వ వేడుక జ‌రిపేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది. 'రంగస్థలం’ విలేజ్ సెట్‌లో ‘సైరా నరసింహారెడ్డి’

Updated By ManamMon, 04/16/2018 - 16:19

syeraaమెగాస్టార్ చిరంజీవి, లేడీ సూప‌ర్ స్టార్ నయనతార జంట‌గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న‌ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి ఇత‌ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై.. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా రూపొందించిన కోయిలకుంట్ల ట్రెజ‌రీ సెట్‌లో షూటింగ్‌ను జ‌రుపుతున్నారు.

ఇదిలా ఉంటే.. ‘రంగస్థలం’ మూవీ కోసం వేసిన విలేజ్‌ సెట్ స్థలంలోనే.. ‘సైరా’ కోసం మరో భారీ సెట్‌ను వేయనున్నార‌ని తెలిసింది. ప్రస్తుతం ఈ సెట్ నిర్మాణానికి సంబంధించిన‌ పనులు చకచకా జరుగుతున్నాయి. తదుపరి షెడ్యూల్‌ను ఈ సెట్‌లోనే చిత్రీకరించనున్నట్టు చిత్ర స‌న్నిహిత వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.ఆ ఇద్ద‌రితోనూ న‌య‌న్‌ మ‌రోసారి?

Updated By ManamWed, 04/04/2018 - 23:03

nayanataraతమిళ క‌థానాయ‌కుడు శివ కార్తికేయన్, దర్శకుడు ఎం.రాజేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతారను సంప్రదించారు దర్శకుడు. ప్రస్తుతం వీరి మధ్య చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ నయనతార ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే.. ఈ ఇద్ద‌రి కాంబినేషన్‌లో ఈమె న‌టించే రెండో సినిమా ఇద‌వుతుంది. గతంలో ఎం.రాజేష్ దర్శకత్వంలో ‘బాస్ ఎంగిర భాస్కరన్’ చిత్రంలో నటించగా.. తాజాగా శివ కార్తికేయన్ సరసన ‘వేలైక్కారన్’ సినిమాలో నటించారు నయన్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలను వెల్లడించనున్నారు.ఆ రీమేక్‌లో న‌య‌న‌తార‌?

Updated By ManamWed, 04/04/2018 - 15:38

nayanataraత‌మిళ‌నాట లేడీ సూప‌ర్‌స్టార్‌గా రాణిస్తున్నారు న‌య‌న‌తార‌. ప్ర‌స్తుతం.. క‌థానాయిక ప్రాధాన్య‌త ఉన్న సినిమాల వైపే మొగ్గు చూపిస్తున్నారు ఈ కేర‌ళ‌కుట్టి. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టికే 'మాయ' (తెలుగులో మ‌యూరి), 'డోర' వంటి హార‌ర్ మూవీ చిత్రాలు చేసిన న‌య‌న్‌.. మ‌రో హార‌ర్ మూవీ చేయ‌బోతున్నార‌ని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. అనుష్క శ‌ర్మ క‌థానాయిక‌గా హిందీలో రూపొందిన హార‌ర్ మూవీ 'ప‌రి'. ఈ సినిమాని త‌మిళంలో రీమేక్ చేసేందుకు ఓ నిర్మాత స‌న్నాహాలు చేసుకుంటున్నారు. అనుష్క శ‌ర్మ పాత్ర కోసం.. న‌య‌న‌తార అయితే బాగుంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. మ‌రి.. న‌య‌న్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారో లేదో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. కాగా, ప్ర‌స్తుతం చిరంజీవి 151వ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌య‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.    న‌య‌న‌తారపై నిర్మాత‌ల ఆగ్ర‌హం

Updated By ManamFri, 03/30/2018 - 18:36

nayanataraడిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ (డి.ఎస్.పీ) వైఖరికి నిరసనగా ఈ నెల 16నుంచి కోలీవుడ్ పరిశ్రమలో బంద్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సినిమా విడుదల కాని, ఆడియో ఫంక్షన్స్‌గాని.. ఇలా సినిమాలకి సంబంధించి ఏ ఒక్క వేడుకని కూడా నిర్వహించరాదని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో తెలుగు, మలయాళం, హిందీ సినిమాలు మినహా ఒక్క‌ తమిళ సినిమా కూడా విడుదల కావ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. కోలీవుడ్‌ లేడీ సూపర్ స్టార్ నయనతార 2016లో ‘పుదియ నియమం’ అనే మళయాళ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్‌ను కూడా సొంతం చేసుకున్నారు నయన్‌. తాజాగా ఈ చిత్రాన్ని ‘వాసుకి’ అనే పేరుతో తమిళంలోకి డ‌బ్‌ చేశారు. ఈ సినిమాని నిన్న (గురువారం) తమిళనాట విడుదల చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ బంద్ పాటిస్తున్న ఈ క్రమంలో.. సినిమా ఎలా విడుదలైందనీ, ఎవరికీ లేని ప్రత్యేకత నయనతారకు మాత్రం ఎందుకని ఓ వర్గం నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిరసిస్తూ చెన్నైలో నయన్‌ ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో నయన్‌ స్పందిస్తూ, “మలయాళం వెర్ష‌న్‌కు సంబంధించి.. నేను ఈ సినిమాలో నటించాను. త‌మిళ డ‌బ్బింగ్ వెర్ష‌న్‌కు సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాంట‌ప్పుడు.. కేవలం ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో నటించినంత మాత్రాన నన్ను బాధ్యురాలిని చేయడం ఎంతవరకు సమంజసం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.వైర‌ల్.. 'సైరా'లో అమితాబ్‌ లుక్‌

Updated By ManamTue, 03/27/2018 - 16:22

amitaab bacchanమెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా  జ‌రుగుతోంది. తాజాగా రెండో షెడ్యూల్‌ను కూడా పూర్తిచేశార‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్‌లో చిరంజీవి, నయనతార, జగపతి బాబు తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.  

ఈ నెల 29 (గురువారం) నుంచి మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంద‌ని తెలిసింది. ఈ షెడ్యూల్‌లో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్‌పై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు విజయ్ సేతుపతి, సుదీప్ పాత్రలు కూడా ప్రత్యేక‌ ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. 'సైరా'లో అమితాబ్ లుక్ అంటూ ఓ స్టిల్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. దీనికి మంచి స్పంద‌న వ‌స్తోంది.

కాగా, ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ విషయంపై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వ‌చ్చే ఏడాది  ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా తెర‌పైకి రానుంది.‘సైరా’.. నయనతార సంద‌డి మొద‌లైంది

Updated By ManamTue, 03/20/2018 - 13:36

nayanataraమెగాస్టార్ చిరంజీవి,  ద‌ర్శ‌కుడు సురేందర్ రెడ్డి కలయికలో ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతున్న విషయం విదితమే. నయనతార కథానాయిక కాగా.. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పూర్తైన మొదటి షెడ్యూల్‌లో.. సంతృప్తికరంగా లేని కొన్ని సన్నివేశాలను ఇటీవ‌ల‌ మళ్ళీ చిత్రీకరించారు. అలాగే.. తాజాగా రెండో షెడ్యూల్‌ను కూడా ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో నయనతార కూడా ‘సైరా’ టీంతో జాయిన్ అయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, నయనతార, జగపతిబాబుపై కొన్ని సన్నివేశాలను నానక్ రామ్ గూడా(హైదరాబాద్)లో చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ప్రధాన ఆకర్షణగా చెప్పుకునే సన్నివేశాల్లో ఇవి కూడా ఉంటాయ‌ని చిత్ర బృందాలు వెల్లడిస్తున్నాయి. కాగా, ఈ నెల 28నుంచి ఈ షెడ్యూల్‌లో అమితాబ్ కూడా చేరుతారని నిర్మాణ వర్గాలు తెలియజేస్తున్నాయి. రూ.150కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News