Congress party

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Updated By ManamFri, 11/02/2018 - 20:23

Komati Reddy Venkata Reddy, TRS, KCR, Congress partyహైదరాబాద్: టీఆర్ఎస్ తనను చంపాలని ప్రయత్నిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను హతమార్చి, తరువాత తనను చంపేందుకు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. గడపగడపకు ప్రచార కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని 13వ వార్డులో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కేసీఆర్ చెప్పిన బంగారు తెలంగాణ వారి కుటుంబానికే పరిమితమైందని విమర్శించారు. ఎవరి బతుకులను వారే మార్చుకోవాలని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించాలని కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. నేటి నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి

Updated By ManamThu, 10/04/2018 - 05:07
 • జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలతో శ్రీకారం

 • అలంపూర్, గద్వాలలో బహిరంగ సభలు, రోడ్ షోలు

 • పాల్గోనున్న కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి తదితరులు

imageహైదరాబాద్: ముందస్తు ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి శ్రీకారం చుట్టునుంది. దక్షిణకాశిగా పేరుగాంచిన అలంపూర్  జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార భేరి మోగించనుంది. అలంపూర్‌లో జరిగే  ప్రచార కార్యక్రమంలో పార్టీ అగ్రనేతలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె. జానారెడ్డి, మండలిలో విపక్ష నాయకుడు మహ్మద్ అలీ షబ్బీర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, ఎ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ఎన్ని కల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, కో చైర్ పర్సన్ డీకే అరుణ, ప్రచార కమిటీ సలహాదారు, సినీనటి విజయశాంతి, పబ్లిసిటీ సెల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసురాజు, శ్రీని వాస్ క్రిష్ణణ్, అలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ సంపత్ కుమార్ తదితరులు పాల్గొంటారు. ప్రత్యేక పూజల అనంతరం అలంపూర్, అలంపూర్ చౌరస్తా, శాంతినగర్, అయిజ పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో పాల్గొంటారు. అక్కడి నుంచి గద్వాల పట్టణం చేరుకుని జమ్ములమ్మ దేవాలయంలో పూజలు చేస్తారు. సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా, పార్టీ ఎన్నికల ప్రచార భేరీని తమ జిల్లానుంచే ప్రారంభిస్తున్నందున అగ్రనేతలు పాల్గొనే బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరణ చేసేందుకు గద్వాల తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, అలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎ సంపత్‌కుమార్ జన సమీకరణకు ప్రయత్నిస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్‌షోలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు మహిళలను పెద్ద సంఖ్యలో తరలించాలని నిర్ణయించారు.

‘కేసుల’ ఆందోళన
అయినా బెదిరేది లేదంటున్న కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులకు ఐటీ దాడులు, పోలీసు కేసులు, నోటీసులు వణుకు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు నలుగురు సీనియర్ నాయకులను పాత కేసులు చుట్టు ముట్టాయి. మరి కొంత మందికి నోటీసులు అందే అవకాశం ఉందనే సమచారం ఆందోళనకు గురి చేస్త్తోంది. కాంగ్రెస్‌తో పాటే ఒకరిద్దరు అధికార పార్టీ నాయకుల వ్యవహారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. వారిని కూడా దర్యాప్తులు, కేసులు, దాడుల బెడద వెంటాడుతోంది. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసాలపై ఐటీ దాడులు నిర్వహించారు. బుధవారం ఆయన ఐటీ అధికారుల విచారణకు హాజరయ్యారు. మరో సీనియర్ నాయకుడు జగ్గారెడ్డిపై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆయన జైలు జీవితం గడిపి బయటికి వచ్చారు. వరంగల్ నేత గండ్ర వెంకటరమణారెడ్డిపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అవి తప్పుడు కేసులని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖండించింది. తెదేపా తాజా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుపై అర్ధిక అక్రమాలకు సంబంధించి సీబీఐకి ఫిర్యాదు అందింది. ఖమ్మం పార్లమెంటు సభ్యులు పి. శ్రీనివాసరెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి.

కొత్తగా మంథని మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాటు పై గతంలో నమోదైన కేసును తెరపైకి తెచ్చారు.  అప్పట్లో ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలు ఆయనవా, కావా అనేది నిర్ధారించి నివేదిక ఇవ్వాలంటూ చిక్కడపల్లి పోలీసులు ఫోరెన్సిక్ అధికారులను కోరినట్లు తెలుస్తోంది.  పెద్దపల్లి జిల్లా ఓడేడు గ్రామానికి చెందిన కిషన్ రెడ్డి అనే టీఆర్‌ఎస్ నేతపై గంజాయి కోసం సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్త శ్రీధర్ బాబు సహాయం కోరినట్లు అభియోగం ఉంది. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు ఫోన్ సంభాషన మొత్తం రికార్డు అయిందంటున్నారు. ఇది తెలిసిన కిషన్‌రెడ్డి  ఆ వాయిస్ రికార్డర్‌ను సంపాదించి శ్రీధర్‌బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్ బాబు హైదరాబాద్‌లోని చిక్కడపల్లి లో నివాసం ఉండటంతో ఆయనపై ఇక్కడ కేసు నమోదయింది. ఇప్పుడా కేసును తిరగదోడుతున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి వచ్చే నివేదిక ఆధారంగా పోలీసులు కేసు పురోగతిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్‌లోని బలమైన నాయకులపై నమోదైన పాత కేసులను తిరగదో డటం, కొత్తగా కేసులు నమోదుకావడం, మరికొందరికి కూడా జైలు కూడు తప్పదనే సంకేతాలు వెలువడటంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయ  కక్షతో వ్యవహరిస్తుందనే వాదన బలపడుతుంది. ఒక వర్గం, ఒకే పార్టీ వారిని కేసుల్లో ఇరికిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ నాయకు లు కూడా దీన్నో ప్రచారాస్త్రంగా మలుచుకోబోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కక్ష పూరితంగా తెదేపా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్ధల దర్యాప్తుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెరాస ఇస్తున్న వివరణ సంతృప్తికరంగా నమ్మశక్యంగా లేదంటున్నారు.  కేసుల్లో కూరుకుపోయిన కొంతమంది అధికార పార్టీ నాయకులు పేర్లను కూడా బయటపెట్టేందుకు కాంగ్రెస్ సిద్దమైందని తెలిసింది. తన నివాసాలపై ఐటీ దాడులు జరిగిన సందర్బంగా రేవంత్‌రెడ్డి  ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విసిరిన సవాల్‌కు సమాధానం రాకపోవడంతో ముఖ్యమంత్రి కూడా అవినీతిపరుడనే ప్రచారం చేయడానికి తమకు అవకాశం ఏర్పడిందని కాంగ్రెస్ శ్రేణులు బహిరంగంగానే ప్రకటించాయి. తన ఆస్తులు, ముఖ్యమంత్రి ఆస్తులపై సుప్రీంకోర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించడానికి రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను ముఖ్యమంత్రి స్వీకరించక పోవడంతోనే తెరాస నైజం బయట పడిందంటున్నారు.

తెదేపా నాయకుల పైన నామమాత్రంగా ఐటీ దాడులు జరిపించడం, సీబిఐకి ఫిర్యాదు చేయించడం తప్ప వారిపై చర్యలేవని ప్రశ్నిస్తున్నారు. ధీటైన నాయకులను కేసుల్లో ఇరికించడం ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే అది తెరాసకే నష్టమని అంటున్నారు. తెరాస నేతల అధికార దుర్వినియోగ చిట్టా తమ వద్ద ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలియచేశారు. కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు, కాని ఆ నాయకులకు ప్రజాభిమానం ఉంది, ప్రజల ఆదరణ చూరగొంటున్నారు. వారిని ప్రజల నుండి దూరం చేయడం కేసీఆర్ తరం కాదని ఆయన పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోనే కేసీఆర్ నైజం బయటపడిందన్నారు.పాత కాపులకు పెద్దపీట  

Updated By ManamWed, 10/03/2018 - 02:56
 •  వ్యూహాత్మకంగా హస్తం అడుగులు

 • టీఆర్‌ఎస్ అసమ్మతులతో మంతనాలు

 • ఇప్పటికే  కొండా దంపతులు, బాలునాయక్, త్వరలో డీఎస్ చేరిక

 • మరో 25 మందితోనూ సీనియర్ల సంప్రదింపులు

imageహైదరాబాద్ః  ఎన్నికల్లో విజయబావుటా ఎగుర వేసేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వ్యూహాహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్ నాయకులు తమ ప్రణాళికలు పసిగట్టకుండా కూటమి నేతలతో పొత్తులు కుదుర్చుకుంటూ అభ్యర్థ్దుల జాబితా బయటకు లీకు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌లో టికెట్  లభించని  నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకునేందుకు  గులాబీ బాసు ప్లాన్ చేస్తున్నారు. కానీ కూటమి సీట్ల పంపకాలు పూర్తి కాలేదని పేర్కొంటూ ఎన్నికల ప్రకటన వచ్చేవరకు ప్రకటించకుండా టీఆర్‌ఎస్‌ను ఎత్తుగడలను చిత్తుచేసేందుకు వ్యుహాలు రచిస్తున్నారు. మరోపక్క హస్తం పార్టీలో రాజకీయంగా ఎదిగి, పదవులు అనుభవించి, కొన్ని రాజకీయ కారణాలతో గులాబీ కండువాల కప్పుకుని అవమానాలు ఎదుర్కొంటున్న నాయకులను  మళ్లీ సొంతగూటికి రావాలని ఆహ్వానాలు పలుకుతున్నారు. పాత స్థానం కల్పిస్తామని హామీలిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌లో ఉంటే కుటుంబాల పాలన ఉంటుందని, కాంగ్రెస్‌లోకి వస్తే బలోపేతంతో పాటు కూటమితో ఎన్నికలకు వెళ్లుతున్నాం ఖచ్చితంగా గెలుపు మానదేదని నచ్చజెబుతూ గాంధీభవన్ మెట్లు ఎక్కిస్తున్నారు. ఇటీవల కాలంలో  అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎింపీ రమేష్ రాథోడ్, సుమన్‌రాథోడ్ దంపతులు పెద్ద ఎత్తున అనుచరులతో కాంగ్రెస్ తీర్థం పుచుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డి  హస్తిన వెళ్లిన హస్తం పెద్దలతో  మాట్లాడి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మెదక్ జిల్లా పటాన్‌చెరువు  మాజీ శాసనసభ్యులు నందీశ్వర్‌గౌడ్ కమలంలో ఇమడలేక  ఉత్తమ్‌కుమార్ సమక్షంలో హస్తం జెండా పట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటకు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి  శివకుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీతో న్యాయం జరుగుతుందని కండువా కప్పుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి కొండా సురేఖ, మురళీదంపతులు రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచుకున్నారు. మరుసటి రోజున  నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్ కూడా పాత గూటికి చేరుకున్నారు. చెవేళ్ల మాజీ ఎమ్మెల్యే రత్నం టీఆర్‌ఎస్ ప్రకటించిన  జాబితాలో స్థానం లేకపోవడంతో కాంగ్రెస్‌కు జైకొట్టారు. త్వరలో రాజ్యసభసభ్యులు డి.శ్రీనివాస్ అనుచరగణంతో పెద్దఎత్తున కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య టీర్‌ఆస్‌కు రాజీనామా చేశారు. ఈయన కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

సత్తుపల్లికి చెందిన మట్టాదయానంద్, పినపాన నియోజకవర్గానికి చెందిన వట్టం రాంబాబులకు టికెట్ రాకపోవడంతో వారు పార్టీ మార్చే అవకాశం ఉందని వారి చేర్చుకునేందుకు  ఆ జిల్లా నాయకులు పొంగులేటి, భట్టి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. నల్లగొండలో మిర్యాలగూడకు చెందిన అమరేందర్‌రెడ్డి, నాగార్జున సాగర్‌కు చెందిన  నాయకులు కోటిరెడ్డి, భువనగిరి జిట్టా బాలక్రిష్ణరెడ్డిలతో చర్చలు జరుపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బిసి సంక్షేమ సంఘం ఆర్.క్రిష్ణయ్య, ఇబ్రిహీంపట్నం చంద్రశేఖర్‌రెడ్డి వంటి నాయకులను చేరుకునేందుకు పార్టీ సీనియర్ల ఎప్పటికప్పడు మంతనాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సారయ్యను కూడా వరంగల్‌లో ఏదో ఒక నియోజకవర్గం సీటు సర్దుబాటు చేసి తీసుకునేందుకు డీఎస్ వర్గం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు గుసగుసలాడుతున్నారు. డోర్నకల్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సత్యవతిరాథోడ్ కూడా చేరికకు సిద్ధం చేసుకున్నట్లు అనుచరులు చెబుతున్నారు.టీఆర్‌ఎస్‌లోని తాజా మాజీలు మేడ్చల్ సుధీర్‌రెడ్డి, మల్కాజిగిరి కనకారెడ్డి, చొప్పదండికి చెందిన శోభ, మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన మనోహర్‌రెడ్డిలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని టీపీసీసీ పెద్దలు సమాలోచలు చేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కాంగ్రెస్ ఉద్దండులు ఎన్నో రాజకీయ ఉపద్రవాలు చూసిన వారు కేసీఆర్‌ను ఎదుర్కోడం తమకు పెద్ద పనేమికాదని, కొంతమంది నాయకుల స్వార్థం వల్ల పార్టీలో ఇబ్బందులు తలెత్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.అలాంటివి ఈసారి రాకుండా గట్టి చర్యలు తీసుకుని హస్తం అభిమానులకు పార్టీలో సముచిత స్థానం కల్పించి కీలక బాధ్యతలు అప్పగిస్తామని పేర్కొంటున్నారు. 

ఇప్పటికే ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన విద్యార్థిసంఘాలు నాయకులు గాంధీభవన్‌లో తిష్టవేసి గులాబీపార్టీ ప్రజావ్యతిరేక వైఖరిని కార్యకర్తలను వివరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు చేసిన ఘనత పార్టీ చీఫ్ సోనియాగాంధీకే దక్కుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు ఎన్నికల అస్త్రాలతో ప్రచార రథం ఎక్కుతున్నారు. కూటమి నాయకులను ఐక్యంచేసి కాంగ్రెస్ నాయకత్వంతో 100సీట్లు గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు పాటు పడుతామని కుండబద్దలు కొడుతున్నారు.పట్టుబిగిస్తున్న కాంగ్రెస్

Updated By ManamSat, 09/29/2018 - 05:53
 • నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో పూర్వవైభవానికి నేతల కృషి

 • కేఎస్ రత్నం, బాలూనాయక్ చేరికతో కార్యకర్తల ఖుషీ

imageహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంతో ఉన్న టీపీసీసీ ఆ దిశలో పావులు కదుపుతోంది. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలో పట్టుబిగించేందుకు  టీఆర్‌ఎస్ నాయకులకు గాలం వేస్తూ అధికార పార్టీ నేతలకు ఝలక్ ఇస్తోంది. పార్టీ బలహీనంగా ఉన్న  నియోజకవర్గాల్లో  బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటు పట్టుబిగిస్తోంది. బడా నాయకులు సైతం విబేధాలను పక్కనబెట్టి పార్టీని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఆ క్రమంలోనే  పూర్వ రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన టీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్ బాలూనాయక్‌లను కాంగ్రెస్ లో చేర్చుకుని టీఆర్‌ఎస్‌ను కంగుతినిపించారు. ఈ  ఇద్దరు నాయకులు కాంగ్రెస్ లో చేరడంతో చేవెళ్ల, దేవరకొండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ, దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు టీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటు రాకుండా చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి, టీపీసీసీ పబ్లిసిటి కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విబేధాలను పక్కనబెట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు.

ఈ  ముగ్గురు నేతలు  కూడా సీఎం రేసులో ఉన్నారు. ఇప్పటికైతే పార్టీని జిల్లాలో గెలిపించుకుందాం.., మెజారిటీ సీట్లు వచ్చాక అధిష్టానంతో తేల్చుకుందామనే దోరణిలో ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు ఖాయమని  ఇప్పటికే అపద్ధర్మ సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ సవాల్‌ను కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఒక్కో జిల్లాలో టీఆర్‌ఎస్‌ను ఖాళీ చేయించేందుకు స్కెచ్ వేస్తున్నారు. అందు లోభాగంగా తమ సొంత జిల్లా నల్గొండ నుంచే ప్రణాళికను అమలు చేస్తున్నారు. 2014 ఎన్నిక ల్లో పూర్వ నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా, టీఆర్‌ఎస్ 6 స్థానాల్లో, సీపీఐ ఒక స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మిర్యాలగూడ తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్ భాస్కరరావు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకొండ నుండి సీపీఐ పార్టీ అభ్యర్థిగా గెలిచిన రమావత్  రవీంద్రకుమార్ కూడా కాంగ్రెస్ లో చేరడంతో టీఆర్‌ఎస్ బలం 8 కి పెరిగింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన భాస్కరరరావు టీఆర్‌ఎస్ లో చేరడంతో కాంగ్రెస్ బలం 4 కి తగ్గింది.

హుజూర్ నగర్ నుంచి గెలిచిన టీపీసీసీ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నాగార్జునసాగర్ నుంచి గెలిచిన కె జానారెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ సతీమణి ఎన్ పద్మావతికే తిరిగి పార్టీ టికెట్లు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తిరిగి వారే  కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోఉండే అవకాశం ఉన్నందున ఈ నాలుగు స్థానాల్లో పార్టీ గెలుపు నల్లేరు మీద నడకే అన్న ధీమాతో నేతలు ఉన్నారు.. మిగతా 8 స్థానాల్లో కూడా అభ్యర్థుల గెలుపుకై వ్యూహరచన చేస్తున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్‌ను తిరిగి సొంత గూటికి వచ్చేలా చేసిన ప్రయత్నం ఫలించింది. ఆయన గురువారం గాంధీభవన్‌లో వేలాది కార్యకర్తల మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన  కాంగ్రెస్ లో చేరడంతో అభ్యర్థి ఎవరైనా దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సునాయాసం అవుతుందని చెబుతున్నారు. అలాగే, సూర్యాపేట, మిర్యాలగూడ, మునుగోడు, భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థుల అన్వేషణలో  పార్టీ ఉంది.  తుంగతుర్తిలో గత ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్‌కు,  నకిరేకల్‌లో తెలంగాణ ఇంటిపార్టీకి పొత్తులోభాగంగా టికెట్లు  కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు స్థానాల్లో కూడా కొంచెం కష్టపడితే  పార్టీ గెలుపు తథ్యమని కాంగ్రెస్ అంచనా. మిగతా నియోజకవర్గాలైన సూర్యా పేట, భువనగిరి, తుంగతుర్తి, ఆలేరు, మిర్యాల గూడ, మునుగోడు  నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపును కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.  ఆ దిశలోనే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెబు తున్నారు. 

  రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో  2014 ఎన్నికల్లో 14 సీట్లకు గానూ  కేవలం 2 స్థానాలతోనే సరిపెట్టుకుంది.  ఈ సారి 12  సీట్లలో గెలవాలనే లక్ష్యంతో ఉంది. రద్దయిన శాసనసభలో  టీఆర్‌ఎస్ 3 , బీజేపీ ఒకటి,  మిగతా 7 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. టీఆర్‌ఎస్‌కు సంబంధించి   మేడ్చల్ లో సుధీర్ రెడ్డి , మల్కాజిగిరిలో సీహెచ్ కనకారెడ్డి, తాండూరులో పి మహేందర్ రెడ్డి గెలిచారు. ఉప్పల్ లో బీజేపీ నేత ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ గెలిచారు. టీడీపీ తరపున కుత్బుల్లాపూర్‌లో వివేకానంద, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు, ఇబ్రహీంపట్నంలో ఎం కిషన్ రెడ్డి, ఎల్బీ నగర్‌లో ఆర్ కృష్ణయ్య, మహేశ్వరంలో తీగల కృష్ణారెడ్డి, రాజేంద్రనగర్‌లో టి ప్రకాష్ గౌడ, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన ఆర్ కృష్ణయ్య తప్ప మిగతా వారంతా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో  జిల్లాలో పట్టుకై  టీపీసీసీ నేతలతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ వ్యూహరచన చేస్తున్నారు. జిల్లాలో మెజారిటీ స్థానాల్లో గెలుపుకై కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా చేవెళ్లకు చెందిన టీఆర్‌ఎస్ పార్టీ నేత కేఎస్ రత్నంను పార్టీలో చేర్చుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరికతో చేవెళ్లలో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకగాఉంటుందని పార్టీ నేతల ధీమా. అదే విధంగా గతంలో టీడీపీ గెలిచిన స్థానాల్లో మెజారిటీ సీట్లను ప్రజా కూటమి పొత్తులోభాగంగా టీడీపీకి ఇచ్చేందుకు అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. ముఖ్యంగా కూకట్ పల్లి,  శేరిలింగంపల్లి, ఎల్బీ నగర్ టీడీపీకి ఖాయమైందనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయం తెలిసే అక్కడ పోటీ చేయాలనుకున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అప్పగించిన కమిటీ బాధ్యతలను వద్దన్నారని చెబుతున్నారు. 'తులసి వనంలో రేవంత్ గంజాయి మొక్క'

Updated By ManamFri, 09/28/2018 - 16:51
 • సర్వేలన్ని మాకు అనుకూలంగా వున్నాయి

 • ఐటీ దాడులకు టీఆర్ఎస్‌‌కు ఎలాంటి సంబంధం లేదు

 • కాంగ్రెస్ నేతల ఆరోపణలను ఖండిస్తున్నాం

 • రేవంత్ రెడ్డిపై ఎంపీ బాల్క సుమన్ ధ్వజం

Balka Suman, Revanth Reddy, Congress Party, IT Raids, Revanth Reddy assetsహైదరాబాద్: కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, కంపెనీలపై జరుగుతున్న ఐటీ దాడులకు టీఆర్ఎస్‌‌కు ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ ఎంపీ బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌కు సంబంధం వుందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. కాంగ్రెస్  నేతల తీరు దొంగే దొంగ అని అరుస్తున్నట్లు ఉందని, గొంగట్లో కూసోని తింటూ వెంట్రుకలు రావొద్దని అనుకున్నట్లు వుంది వారి వ్యవహారమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, వారిపైన ఐటీ సోదాలు జరగటం లేదు కదా ? అని ప్రశ్నించారు. తప్పుడు లెక్కలతో ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించినందుకుగాను వచ్చే ఎన్నికల్లో రేవంత్‌ పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు.

ఆ కంపెనీ కారులోనే తిరుగుతున్నాడు..
తెలంగాణ తులసి వనంలో రేవంత్ రెడ్డి గంజాయి మొక్కని, సెటిల్మెంట్‌లు, భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డిని, ఒకే అడ్రస్‌పై 18 కంపెనీలు పెట్టి అక్రమ వ్యాపారాలు చేయటం న్యాయమా? కాంగ్రెస్ నేతలు చెప్పాలన్నారు. 14కోట్ల రూపాయల ఒక యంత్రం చేతులు మారి.. ఒక కంపెనీ 80 కోట్లకు దాన్ని కొనడం అంటే ఏంటీ..?అని మరోమారు సుమన్ ప్రశ్నించారు. ఈ కంపెనీ ఇచ్చిన గిఫ్ట్ కారులోనే రేవంత్ తిరుగుతున్నాడని, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ నేతలు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఒక చోటా షకీల్, ఒక విజయ మాల్య, ఒక దావూద్ ఇబ్రహీం, 2009 ఎలక్షన్ అఫిడవిట్‌లో 3.6 కోట్లు, 2014లో అఫిడవిట్ 13.2 కోట్లు చూపించారని విమర్శలు గుప్పించారు.

‘ఓటుకు నోటు’ ఆరా తీస్తే డొంక కదిలింది..
చంద్రబాబుతో కలిసి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాలు నడిపించాడని, ఓటుకు నోటు కేసులో దొరికిన 50 లక్షల రూపాయలు ఎక్కడినుంచి వచ్చాయి అనేది ఆరా తీస్తే డొంక కదిలిందని తెలిపారు. నారాయణగూడలో మామూలు పెయింటర్ రేవంత్ రెడ్డి ఇన్ని కోట్లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. మిలట్రీలో పని చేసిన ఉత్తమ్ మని లాండరింగ్ చేసిన రేవంత్‌కి ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల ముఠా స్టువర్టుపురం దొంగల ముఠా.. వారిలో ఎవరిని కదిలించినా వేల కోట్లు బయటపడతాయని దుయ్యబట్టారు. 

రేవంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి..
ఉమ్మడి ఏపీలో ఆంధ్ర నేతల మోచేతి నీళ్ళు తాగి అక్రమర్జన చేశారని, చిల్లర రాజకీయాలతో తాము అధికారంలోకి రావాలని అనుకోవటం లేదని, సర్వేలన్ని తమకు అనుకూలంగా వున్నాయన్నారు. తాము చేసిన అభివృద్దే తమను గెలుపిస్తుందని సుమన్ ధీమా వ్యక్తం చేశారు. వాళ్లకు అధికారం ఇస్తే అమరావతి, ఢిల్లీలో మన ఆత్మ గౌరవం తాకట్టు పెడుతారని విమర్శించారు. సచీలుడని చెప్పుకుంటున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. అభివృద్ధిలో గజ్వేల్ నంబర్‌వన్: హరీశ్ రావు

Updated By ManamTue, 09/25/2018 - 20:07
 • అభివృద్ధికి, అవకాశ వాదానికి జరుగుతున్న ఎన్నిక...

 • మంత్రి హరీష్ రావు వ్యాఖ్య

Gajwel development, Harish rao, Congress party, TDP, Kcrసిద్దిపేట: జిల్లాలోని గజ్వెల్ నియోజకవర్గంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మార్కుక్ మండలం ఎర్రవల్లిలో టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ... గజ్వెల్ ఎన్నిక అభివృద్ధికి, అవకాశవాదానికి మధ్య జరుగుతున్న ఎన్నికగా అభివర్ణించారు. కాంగ్రెస్, టీడీపీలు అవకాశవాద పొత్తులతో ముందుకు వస్తున్నాయని విమర్శించారు. నియోజకవర్గ ఓటర్లు అభివృద్ధి వైపు అడుగులు వేస్తారో, అవకాశవాదానికో వేస్తారో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటింటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించే విధానాలతో ముందుకు పోతుంది. చాలా పనైంది. ఇంకా చాలా పని మిగిలి ఉందని, ప్రణాళికలు తయారు చేసుకుంటే పనులు చేసుకుందామని కేసీఆర్ అంటున్నారు.  అభివృద్ధి అంటే ఏమిటో ఈ నాలుగున్నర ఏళ్లలో చూపించాం. కాంగ్రెస్ వస్తే ఏమిస్తది కాలిపోయే మోటార్లు, ఎరువుల కొరత, కరెంట్ కొరత తప్ప ఇంకేమీ ఉండదన్నారు.
 
టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. కళ్ల ముందు, కంటి ముందు అభివృద్ది కనిపిస్తుంటే కేసిఆర్‌కు, కారు గుర్తుకు తప్ప ఎవరికి ఓటు వేయరని అన్నారు. రైతులు చనిపోతే కాంగ్రెస్ ఒక్క రూపాయి అయిన ఇచ్చిందా? కనీసం పరామర్శించిందా ? అని ప్రశ్నించారు. ఈ రోజు రైతుబందుతో పెట్టుబడి, రైతు బీమాతో రైతులకు ధీమా కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 95 శాతం పూర్తయిందని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇస్తామంటున్నారని చెప్పారు. అభివృద్ధిలో గజ్వెల్ నంబర్ వన్, మెజారిటీతో కూడా గజ్వెల్ నంబర్ వన్‌గా ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో వర్షం పడినా, పడక పోయినా కాళేశ్వరం నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు.'రుణమాఫీ అంతా బూటకం'

Updated By ManamFri, 09/21/2018 - 19:06

Gutta Sukhender reddy, ghulam nabi azad, Congress party, TRS, KCR, Farmers Loawavierనల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం అంతా బూటకమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేత ఆజాద్ టీఆర్‌ఎస్, కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ గుత్తా స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆజాద్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. రాజకీయాల కోసమే ఆజాద్ అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.

తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్ ప్రమేయం లేదని ఆజాద్ అనడం సరికాదన్నారు. కేసీఆర్ పోరాటం, దార్శనికత, చాకచక్యం లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని గుత్తా స్పష్టం చేశారు. ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందని నొక్కివక్కాణించారు. రాష్ట్రం అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 'అధికారంలోకి వస్తే రుణమాఫీ'

Updated By ManamFri, 09/21/2018 - 17:57

congress party, power, loanwaivers, Uttam kumar reddy హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం వీస్తోందని ఆయన చెప్పారు. ఆదిలాబాద్‌ మాజీ ఎంపీ రమేశ్‌ రాఠోడ్‌, ఆయన సతీమణి మాజీ ఎమ్మెల్యే సుమన్‌ రాఠోడ్‌ తమ అనుచరులతో కలిసి శుక్రవారం కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్‌ మధ్యలో ఎన్నికల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. నవంబర్‌, డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓటర్ల జాబితాలో కూడా భారీగా అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు.

రమేశ్‌ రాఠోడ్‌ పార్టీలో చేరడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఎస్సీ, గిరిజనులను అణిచివేస్తున్నారని ఉత్తమ్ వివర్శించారు. అమరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ వారిని విస్మరించారరని దుయ్యబట్టారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 నియోజకవర్గాలకు గాను ఒక్క స్థానంలో గెలిచామని గుర్తు  చేశారు. వచ్చే ఎన్నికలు కాంగ్రెస్‌, టీఆర్ఎస్ పార్టీ మధ్య కాదని, కేసీఆర్‌ కుటుంబం, తెలంగాణ ప్రజలకు మధ్య అని ఉత్తమ్ చెప్పారు. 'ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాం'

Updated By ManamTue, 09/18/2018 - 16:40

Special status, AP people, congress party, Rahul Gandhi, former CM Sanjeevaiah కర్నూలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన కర్నూలులో ఏర్పాటుచేసిన సత్యమేవ జయతే సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, కాంగ్రెస్ పార్టీకి ఏపీతో ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్యను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతిమయమని, ఏపీలోనూ అవినీతికి మినహాయింపు లేదని విమర్శించారు. సంజీవయ్య అవినీతిపరుడని జవహర్ లాల్ నెహ్రూకు ఫిర్యాదు చేశారని, నిజానిజాలు తెలుసుకునేందుకు నెహ్రూ కర్నూలుకు ఓ ఒప్పందాన్ని పంపారని తెలిపారు. అవినీతి ఆరోపణలు తప్పని తేలడంతో నెహ్రూ సంజీవయ్యను ఏపీ ముఖ్యమంత్రిని చేశారని రాహుల్ గుర్తు చేశారు. 

సంజీవయ్య లాంటి ముఖ్యమంత్రి ఏపీకి కావాలని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏపీకి కేంద్రం నుంచి ప్రత్యేక సాయం, మద్దతు అందాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై ఏపీకి నాటి ప్రధాని సభలో హామీ ఇచ్చారని, ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రతిరోజు చైనా 50వేల ఉద్యోగాలు సృష్టిస్తోందని, అదే మనదేశంలో 450 ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయని అన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థ కొందరి చేతుల్లో చిక్కుకుపోయిందని విమర్శించారు. ఏపీలో స్వయం సహాయక సంఘాల పనితీరు బాగుందని, మిగతా రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయని రాహుల్ తెలిపారు. రాహూల్ పరిశీలనలో ఎన్నికల కమిటీ

Updated By ManamTue, 09/18/2018 - 00:58
 • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. చిట్ ఛాట్ లో ఉత్తమ్  

imageహైదరాబాద్ః రాష్ట్ర పార్టీ ఎన్నికల కమిటీల నియామకం రాహుల్ గాంధీ పరిశీలనలో ఉందని, త్వరగా కమిటీలు వేయాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సోమవారం గాంధీభవన్‌లో విలేఖరులతో ఆయన చిట్ ఛాట్ నిర్వహించారు. టీఆర్‌ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమిని ఏర్పాటుచేస్తున్నామని, ఈ కూటమికి సంబంధించి టీడీపీ, సీపీఐతో ప్రాధమిక చర్చలు మాత్రమే జరిగాయన్నారు. పొత్తులపై చర్చ సందర్భంగా సీట్ల అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.

 కూటమికి ఉమ్మడికి ఉమ్మడి ఎజెండా రూపకల్పనపై కసరత్తు చేస్తున్నామని ఉత్తమ్ చెప్పారు. పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే సీట్లను వదిలే ప్రసక్తిలేదన్నారు. కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారనేది  కలిసొచ్చే పార్టీలతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. పొత్తుల అంశం తేలకుండా కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన జరగదన్నారు. అభ్యర్థుల ప్రకటన అంశం పార్టీ ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలనలో ఉందన్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం ఉత్తమ్ హామీ
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం గాంధీభవన్ లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఉత్తమ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ఉత్తమ్‌కు వరాలు కురిపించారు. సంస్థను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటామని, కొత్త బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉత్తమ్‌ను కలిసిన వారిలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ అధ్యక్షఉలు టి సుధాకర్, ప్రధాన కార్యదర్శి కె హన్మంతు ముదిరాజ్ ఇతర నాయకులు సవీపీ డీవీకే రావు, జీవీకె రెడ్డి, మొగులప్ప, రాకేష్ తదితరులు ఉన్నారు.

Related News