Congress party

రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’కు నో

Updated By ManamTue, 08/21/2018 - 14:55
 • పరోక్ష ఎన్నికలలో వద్దన్న సుప్రీంకోర్టు.. 2014లో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్

 • అది అవినీతికి తావిస్తుందన్న కాంగ్రెస్.. నోటాను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు

 • కాంగ్రెస్ వాదనకు ఎన్డీయే మద్దతు.. నోటిఫికేషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

NOTA, Rajya Sabha Elections, Supreme Court, NDA, Congress Party, Non of the Aboveన్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో నోటా (నన్ ఆఫ్ ద ఎబోవ్) ఆప్షన్‌ను అనుమతించేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను ఓవర్ రూల్ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీ నోటిఫికేషన్‌ను రద్దుచేసింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలట్ పేపర్లలో నోటా కూడా అనుమతిస్తూ ఈసీ ఇంతకుముందు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, రాజ్యసభ ఎన్నికలు వివిధ రాష్ట్రాలకు నైష్పత్తిక ప్రాతినిధ్యం కల్పించడానికి పరోక్షంగా నిర్వహించే ఎన్నికలని, వాటిలో నోటాను పెట్టడం ఏమాత్రం తగదని సుప్రీం వ్యాఖ్యానించింది. బ్యాలట్ పేపర్లలో నోటా పెట్టడాన్ని సవాలు చేస్తూ గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ చీఫ్‌విప్ శైలేష్ మనుభాయ్ గత నెలలో దాఖలుచేసిన కేసులో తీర్పు వెలువరిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. నోటాను అనుమతిస్తే రాజ్యసభ ఎన్నికల్లో సభ్యుల కొనుగోలు, అవినీతి పెరుగుతాయని ఆయన వాదించారు. 

నోటా అనేది ప్రత్యక్ష ఎన్నికలలో వ్యక్తులు ఉపయోగించడానికి మాత్రమే ఉద్దేశించినదని కోర్టు తెలిపింది. ఈ ఎన్నికలలో ఎవరైనా ఓటు వేయకపోతే వాళ్లను ఆ పార్టీ బహిష్కరించే అవకాశం ఉందని, కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఓటు వేయకపోవడాన్ని చట్టబద్ధం చేస్తున్నారని అంటూ.. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలో కోర్టును ఎందుకు ఒక పార్టీగా చేస్తారని ప్రశ్నించింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఉండాలని 2013లో సుప్రీంకోర్టే సూచించింది. దాంతో 2014లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కూడా నోటాను ఈసీ ప్రవేశపెట్టింది. దాన్ని గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సవాలు  చేసింది.  కాగా, రాజ్యసభ ఎన్నికల్లో నోటా వద్దన్న వాదనకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా మద్దతు తెలపడం విశేషం.నేడే రాహుల్ రాక

Updated By ManamMon, 08/13/2018 - 05:14
 • ఏర్పాట్లు పూర్తి చేసిన పీసీసీ.. అధినేత ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

 • శేరిలింగంపల్లి సభపై సెటిలర్ల దృష్టి.. సరూర్‌నగర్ సభకు భారీగా నిరుద్యోగుల రాక!

 • ఓయూ విద్యార్థులపైనే అందరి చూపు

హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వస్తుండడంతో పీసీసీ నేతలు ఈ పర్యటనను ప్రతిష్టాత్మ కంగా భావించి ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కలిసోస్తుందనే పలువురు అభిప్రా యపడుతున్నారు. ప్రధానంగా నగరంలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బహిరంగ సభ పెట్టడం కాంగ్రెస్‌కు కలిసిరానుంది. ఎందుకంటే, గత ఎన్నికల తో పోల్చిసే, టీడీపీ బలహీన పడడం.. టీఆర్‌ఎస్ సెటిలర్ల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాలపై రాహుల్ ప్రసంగం సుదీర్ఘంగా సాగనుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరడం ఖాయమని కాంగ్రెస్ నేతలు చెప్పు కొస్తున్నారు. ఏది ఏమైనా గత రాహుల్ పరట్యనలతో పోల్చుకుంటే.. ఈసారి పర్యటనకు అధిక ప్రాధాన్యత చోటుచేసుకుంది.

image


రాహుల్ ప్రసంగంపై ఆసక్తి..
ఇటీవల పార్లమెంటులో రాఫెల్ యుద్ధవిమానాల చర్చ సందర్భంగా రాహుల్ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. నిన్నమొన్నటి దాకా రాహుల్ ప్రసంగాల్లో ఏమాత్రం వాడివేడి కన్పించేది కాదు. కానీ పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న విధానాలు, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వంటి అంశాలపై ఆయన విశ్లేషాణాత్మకంగా ప్రసంగం ఆద్యంతం రసవత్తరంగా సాగడంపై దేశ ప్రజలతో పాటు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహన్ని నింపింది. అయితే హైదరాబాద్ పర్యటనలో భాగంగా రాజేంద్రనగర్‌లో మహిళలతో సమావేశం, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్ స్టేడియాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాహుల్ మరోసారి తన ప్రసంగ వేడిని ప్రత్యర్థులకు రుచిచూపనున్నారనే ఊహగాహనాలు లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంఘాలకు రుణాల విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, సమభావన సంఘాలు, అభయహస్తం పింఛన్ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మహిళ సంఘాల రుణాలకు పెద్దపీట వేశారు. ఆ రుణాల వల్ల ఎంతోమంది మహిళలు, గృహిణులు ఆర్థికంగా బలపడ్డారు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో ఆ దిశగా చెప్పుకోదగ్గ ప్రయత్నాలు జరగలేదు. దీంతో మహిళా సంఘాలతో సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఓయూ సభకు అనుమతి నిరాకరణతో ఊపు..
రాహుల్ గాంధీ ప్రజా చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులతో సదస్సు నిర్వహించాలని భావించారు. అందులో భాగంగానే ఓయూ జేఏసీ నాయకులు ఏర్పాట్లు చేసేందుకు వర్సిటీ వీసీకి దరఖాస్తు చేసుకున్నారు. భద్రతా కారణాల వల్ల తాము అనుమతి ఇవ్వలేమంటూ.. వర్సిటీ ఎస్టేట్ సెల్ అధికారి అనుమతి నిరాకరించారు. ఈ విషయాన్ని ఓయూ విద్యార్థులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో అనుమతి నిరాకరణ అంశంపై జోరుగా చర్చ సాగింది. ఫలితంగా రాహుల్‌గాంధీ పర్యటనకు అప్పటివరకు లేని ప్రాధాన్యత కల్పించినట్టయ్యింది. ఓయూలో సదస్సు పెడితే.. కేవలం 1500 మందితోనే ముగిసేది. కానీ అనుమతి నిరాకరణ కారణంగా సరూర్‌నగర్‌లో బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అంతకుముందు వరకు ఒక్క శేరిలింగంపల్లిలో మాత్రమే బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఓయూ అనుమతి నిరాకరణ కారణంగా మరో బహిరంగ సభ ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థులు పెద్ద ఎత్తున రానున్నారు. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం.. ఓయూపై నీలినీడలు కమ్ముకున్నాయనే ఆరోపణలున్నాయి. శతాబ్ది ఉత్సవాలు, నిధుల కేటాయింపు, వర్సిటీ వసతి గృహాల్లో అసౌకర్యాలు, సిబ్బంది, ప్రొఫెసర్ల కొరత, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన లేమి వంటి అంశాలపై రా్రష్ట్ర ప్రభుత్వం చిన్న చూపుచూసిందనే విమర్శలు ప్రస్తుతం జోరుగా విన్పిస్తున్నాయి. దీంతో సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు ఓయూ విద్యార్థుల హాజరుపై అందరి దృష్టి నెలకొంది.

ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు..
రాహుల్ పర్యటనకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో సదస్సుకు నిరాకరణతో పాటు ముస్లింలతో చర్చించేందుకు హకీం గ్రౌండ్‌లో అనుమతి ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఎట్లాగైనా ప్రజా చైతన్య బస్సు యాత్రలో రాహుల్ పర్యటనను నూటికినూరుశాతం విజయవంతం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాహుల్ పర్యటించే ప్రాంతాల్లో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాపై ఇటీవల టీఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలనుద్దేశించి మంచి ప్రసంగం చేస్తారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని పీసీసీ నేతలు చెబుతున్నారు.రఫేల్‌పై జేపీసీ వేయాల్సిందే

Updated By ManamSat, 08/11/2018 - 01:03
 • పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యుల ఆందోళన

 • గాంధీ విగ్రహం ఎదుట సోనియా నేతృత్వంలో నిరసన

imageన్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆధ్వర్యంలో శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. కొనుగోళ్లపై  కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఎంపీలు రాజ్ బబ్బర్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అంబికా సోని, సీపీఐ నేత డి రాజా, ఆప్ ఎంపీ సుశీల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు వ్యవహారంపై పార్లమెంటరీ సంయుక్త సంఘం (జేపీసీ) ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. బోఫోర్స్ కుంభకోణం రఫేల్ వ్యవహారం పెద్దదని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి చేసిన ఆరోపణలను వారు ప్రస్తావిస్తూ..ఈ  అంశాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

కొనుగోలు ఒప్పందంపై కాగ్‌తో విచారణ జరిపించాలని శౌరి, సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.  కాగా. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. దాంతో సభ రెండు సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. సభ ప్రారంభం కాగానే కొనుగోలు అంశంపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చశారు. సభ స్థానంలో తొలిసారి కూర్చున్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రతిపక్ష సభ్యులను సముదాయించేందుకు ఎంతగానే ప్రయత్నించినప్పటికీ.. వినలేదు. వెల్‌లోకి దూసుకువచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దాంతో జీరో అవర్‌కు ముందే సభ ఒకసారి వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. రఫేల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణమని, దానిపై జేపీసీ విచారణ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. 

 బీకేపై ప్రధాని వ్యాఖ్యల తొలగింపు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభ్యం తర కర వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించినట్టు రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు.  రాజ్యసభ డిప్యుటీ చైర్మన్ పదవికి పోటీపడ్డ ప్రతిపక్ష నేత బీకే హరిప్ర సాద్‌పై మోదీ చేసిన వ్యాఖ్య లపై ప్రతిపక్షాలు చేసిన డిమాం డ్ నేపథ్యంలో చైర్మన్ ఈ నిర్ణ యం తీసుకున్నారు. కాగా పెద్దల సభహుందాత నం దిగజారేలా ప్రధాని వ్యాఖ్యలుండడం దురదృష్టమని హరిప్రసాద్ పేర్కొన్నారు. 

పార్లమెంట్ నిరవధిక వాయిదా
పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 18న ప్రారంభమైన సమావేశాలు 21 రోజుల పాటు కొనసాగాయి. 112 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ జరిగింది.  ఎస్సీ, ఎస్టీ చట్టంలో సవరణతోపాటు 21 బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. అలాగే.. సమావేశాల్లోనే టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానంపై 51 మంది సభ్యులు 11.46 గంటలపాటు మాట్లాడారు.  ఈ తీర్మానం వీగిపోయింది. విపక్షాల నిరసనలు, అంతరాయాల కారణంగా సభ సమయంలో 8.26 గంటలు వృథా అయ్యింది. అయితే.. వివిధ అత్యవసర అంశాల కోసం సభ 21 గంటలపాటు అత్యధికంగా సమావేశమైంది. ఈసందర్భంగా స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ.. గత బడ్జెట్ సమావేశాలతో పోలిస్తే వర్షాకాల సమావేశాలు పలఫ్రదంగా ముగిశాయని పేర్కొన్నారు. మరోవైపు, రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. ‘యూపీఏ’లోనే గిరిజనులకు లబ్ధి

Updated By ManamThu, 08/09/2018 - 23:50
 • లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి

 • కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం

 • పార్టీ నేతలు రఘువీరా, ఊమెన్ చాందీ

 • బెజవాడలో 76 మీ. జాతీయ జెండా ప్రదర్శన

imageవిజయవాడ: గిరిజనులకు యూపీఏ ప్రభుత్వంలోనే మేలు జరిగిందని, అటవీ హక్కుల చట్టంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 12.12 లక్షల ఎకరాలు పంపిణీ చేశారని  ఏపీసీసీ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ పేర్కొన్నారు. గురువారం విజయవాడ లెనిన్‌సెంటర్‌లో  ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ సేవాదళ్ అధ్వర్యంలో 76వ క్విట్ ఇండియా ఉద్యమం దినోత్సవ  సందర్భంగా 76 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమెన్‌చాందీ, ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లెనిన్ సెంటర్ నుంచి ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం వరకు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

ఆంధ్రరత్న భవన్‌లో యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని  పురస్కరించుకొని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పి.రాకేష్ రెడ్డి తదితరులకు ఉమెన్ చాందీ, రఘువీరారెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రరత్న భవన్‌లో సేవాదళ్ అధ్వర్యంలో జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమెన్‌చాందీ విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, వారికి నివాళులర్పించడంతో పాటు వారి ఆశయ సాధనకు కృషి చేయాడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు.  క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించిన మహాత్మా గాంధీని మనం స్మరించుకోవాలన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలను కాలరాసే ప్రయత్నం జరుగుతోంది, దీన్ని దేశ యువత తిప్పి కొట్టాలని కోరారు. లౌకికవాదం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.

అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆదివాసీల హక్కులను టీడీపీ ప్రభుత్వం కాలరాస్తోందని రఘువీరారెడ్డిimage వివుర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదివాసీ, గిరిజనులకు 12లక్షల ఎకరాల భూమి, పట్టాలు పంపిణీ చేశారని వివరించారు. దేశానికి, కాంగ్రెస్ పార్టీకి  నేడు చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన రోజని, 76 సంవత్సరాల క్రితం బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టడానికి మహాత్మాగాంధీ నేతృత్వంలో ‘‘క్విట్ ఇండియా.. ఈ దేశాన్ని వదిలిపొండి’’ అని  సింహగర్జన చేసినటువంటి రోజని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తామని  రఘువీరా రెడ్డి పేర్కొన్నారు.

ఇప్పుడు అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని వివుర్శించారు. గిరిజనులు, ఆదివాసీల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని రఘువీరా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చింతామోహన్, గిడుగు రుద్రరాజు, మెయప్పన్, క్రిష్టోపర్ తిలక్, ఎస్.ఎన్.రాజా, పక్కాల సూరిబాబు, జంగాగౌతమ్ తదితరులు పాల్గొన్నారు.ఓయూ విద్యార్థులతో రాహుల్ భేటీ

Updated By ManamSat, 08/04/2018 - 00:22
 • ఆర్ట్స్ కాలేజీ వద్ద 14 న సభ  

imageహైదరాబాద్: ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులతో సమావేశం కానున్నారు. 14వ తేదీన ఆర్ట్స్ కాలేజీ వద్ద సభ నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. సభ ఏర్పాట్లపై ఉస్మానియా విద్యార్ధులతో శుక్రవారం నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమై చర్చించారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులను సమీకరించనున్నారు. అదేరోజు రాహుల్ గాంధీ చిన్న వ్యాపారులు, నగర ప్రముఖులు, మహిళా సంఘాలు,  వీడియా అధిపతులతోనూ చర్చించే అవకాశం ఉందని పీసీసీ నాయకుడు ఒకరు తెలిపారు. 

అధికార ప్రతినిధిగా జైపాల్ రెడ్డి
జైపాల్ రెడ్డిని ఏఐసిసి అధికార ప్రతినిధిగా రాహుల్ గాంధీ నియమించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం వస్తుందని భావించినప్పటికీ ఆయనకు ఆ పదవి దక్కలేదు.  జైపాల్ రెడ్డిని కీలకమైన ఏఐసీసీ అధికార ప్రతినిధిగా నియమించడం పట్ల పీసీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.అవినీతికి కేరాఫ్ కాంగ్రెస్

Updated By ManamThu, 08/02/2018 - 02:15
 • ప్రాజెక్టుల్లో అవినీతి అంటూ విషం కక్కుతున్నారు

 • ఈ బ్లాక్ మెయిలర్లకు జవాబివ్వాల్సిన అవసరం లేదు?

 • ఎవరిపై అవినీతి కేసులున్నాయో గూగుల్‌లో చూసుకోండి

 • రేవంత్, ఉత్తమ్, కోదండరామ్‌లది గొబెల్స్ ప్రచారమే

 • విపక్షాలపై శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజం

imageహైదరాబాద్: అవినీతికి, కేరాఫ్ ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీయేనని శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో సహా పలు ప్రాజెక్టుల్లో లక్షల కోట్లు అవినీతి జరిగిందని లొల్లి చేస్తూ, తెలంగాణ అభివృద్ధిపై కాలనాగులా విషం చిమ్ముతున్న ఈ బ్లాక్ మెయిలర్లకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొంత మంది కుహానా మేధావులు ఆవీనీతి కేసులు ఎవరిమీద ఉన్నాయో? గూగుల్‌లో కొడితే అందరికి తెలుస్తుందని, అ కేసులన్నీ కాంగ్రెస్ మీదే ఉందని స్పష్టంగా తెలుస్తుందని పల్లా చురకలు అంటించారు. బుధవారం టీఆర్‌ఎస్‌ఎల్పీలో ఏర్పాటుచేసిన సమావేశంలో శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణపై అడుగడుగునా అడ్డుపడుతున్నారంటూ ప్రతిపక్ష, విపక్షాలపై ద్వజవెుత్తారు.

అయితే, కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలు పెట్టినప్పటి నుండి ప్రతి పక్షాలు విష ప్రచారం చేస్తున్నారని శాసన మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వాటిని ప్రజలు నమ్మకపోవడంతో కాంగ్రెస్ వాళ్ళు కొందరు కోర్టుకు కూడా వెళ్లారని తెలిపారు. కొంత మంది కుహానా మేధావులు గోబెల్స్ ప్రచారం చేస్త్తున్నారని..పల్లా ఘాటుగా విమర్శించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎందుకు పెరగాల్సి వచ్చిందో హరీష్ ఇచ్చిన క్లారిటీకి అందరూ సంతృప్తి చెందితే, రేవంత్, ఉత్తమ్, కోదండరాం మాత్రం కావాలనే పాత పాట పాడుతూ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణహిత కాస్ట్ 17వేల కోట్ల పైచిలుకు ఉన్న ప్రాజెక్టు కాస్ట్‌ను... కాంగ్రెస్ 34వేల కోట్లకు ఎలా పెంచిందన్నారు. ఎనిమిదేళ్లలో ప్రాణహిత ప్రాజెక్ట్...కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్రతో అగ్రిమెంట్ కూడా చేయలేకపోయారని పల్లా విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రాజెక్టు నిధుల్లో వేల కోట్లు ల్యాండ్ సర్వే, మొబిలైజేషన్ అడ్వాన్స్‌కే ఖర్చు చేశారన్నారు. 238లో ప్రాజెక్టుకు సంబందించిన అన్ని వివరాలు ప్రజలకు తెలిపామన్నారు.

ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ ఖర్చు పెట్టిన లెక్కలు రేవంత్ చెప్పాడు. అవి నిజమని నిరూపిస్తే మేము ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం..అవి ఆరొపణలు చేసే నాయకులు వారిది తప్పైతే, ముక్కు నేలకు రాయాడానికి సిద్దమా? అని అంటూ ప్రాజెక్ట్‌లపై మాట్లాడే నేతలకు పల్లా సవాల్ విసిరారు. సిడబ్యుసి చెప్పిన గైడ్ లైన్స్ మాత్రమే మేము అనుసరిస్తున్నామన్నారు. హరీష్ రావు మాటలను వెక్కిరిస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇకపై సహించేది లేదని పల్లా హెచ్చరించారు. పార్మా సిటిలో 12 వందల 15 ఎకరాలకు.. ఎకరాకు 12 లక్షలు అందరికి చెల్లించామన్నారు. ఒకరికి ఎక్కువ.. మరొకరికి తక్కువగా చెల్లించలేదన్నారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ వాళ్ళేనన్నారు. కాల్వలు కట్టడం...దానితో డబ్బులు సంపాదించడం కాంగ్రెస్ వాళ్ళు చేసిందేనని పల్లా ఆరోపించారు. భూమి, ఆకాశాల్లో ఎక్కడ అవకాశం వస్తే... అక్కడ కాంగ్రెస్ నాయకులు విపరీతంగా దోచుకున్నారని పల్లా ద్వజవెుత్తారు. అందుకే భారతదేశ చిత్ర పటం నుంచి కాంగ్రెస్‌ను ప్రజలు తొలగించారన్నారు. త్వరలో తెలంగాణ నుంచి కూడా తరివేుస్తారని హెచ్చరించారు.ఒంటరిగానే బరిలోకి  

Updated By ManamTue, 07/10/2018 - 22:14
 • అధికారంలోకి రాగానే ఏపీకి హోదా.. పోలవరం ఖర్చు మొత్తం భరిస్తాం

 • అక్టోబర్2 నుంచి ఇంటింటికీ కాంగ్రెస్.. కార్యకర్తలతో భేటీలో ఉవెున్‌చాందీ  

imageఅమరావతి: 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఉవెున్‌చాందీ వెల్లడించారు. యూపీఏ-3 ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తూ, రాహుల్ ప్రధానిగా తొలి సంతకం చేస్తారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు ఖర్చు మొత్తాన్ని యూపీఏ-3 ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. గుంటూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యకర్తలతో మంగళవారం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించారు.

అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘవీరారెడ్డితో కలిసి చాందీ విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి రావాల్సిన అవ సరం ఉందన్నారు. రాష్ట్ర విభజనకు అన్నీ పార్టీలు అనుకూలంగా లేఖలు ఇచ్చి తర్వాత యూ టర్న్ తీసుకున్నాయని ఆయన గుర్తుచేశారు. టీడీపీ నాలుగేళ్లు పాటు ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదా పేరు ఎత్తకుండా, ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకుందని విమర్శించారు. అమరావతి నిర్మాణానికి మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాడును అందిస్తుందన్నారు. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 19 వరకు ఇంటింటికీ కాంగ్రెస్, ఇందిరాగాంధీ సంస్మరణ కార్యక్రమాల పేరుతో ప్రచారం చేస్తామని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో 44వేల బూత్ స్థాయి కమిటీలను, సెప్టెంబర్ 30 లోగా ఏర్పాటు చేస్తామని, ఈ నెల 31లోగా అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీ స్థితిగతులపై నాయకులు, కార్యకర్తలతో మాట్లాడతామని ఉవెున్‌చాందీ తెలిపారు. పార్టీని వీడిన వారిని వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియ చేపట్టామని, కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి ముందు  మార్కెట్ సెంటర్‌లోని గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్రగా డీసీసీ కార్యాలయానికి చేరుకుని, కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అభిశంసన!

Updated By ManamSat, 04/21/2018 - 04:30
 • ప్రధాన న్యాయమూర్తిపై వేటుకు నోటీసు

 • కాంగ్రెస్ సహా పలు విపక్షాల నిర్ణయం

 • అధికార దుర్వినియోగం.. దుష్ప్రవర్తన

 • వెంకయ్యనాయుడికి విపక్షాల నోటీసు

 • 64 మంది రాజ్యసభ సభ్యుల సంతకాలు

 • భారైమెన హృదయంతోనే ఇచ్చాం: సిబల్

 • అభిశంసనపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు

 • తనకు సంబంధం లేదన్న సల్మాన్ ఖుర్షీద్

 • సంతకం చేయని మన్మోహన్, చిదంబరం

 • సీనియర నేత అభిషేక్ సింఘ్వీదీ అదే దారి

 • నాయుకుల తీరు దురదృష్టకరం: సుప్రీం

 • మీడియా నియంత్రణకు కోర్టు నిరాకరణ

SUPREME COURTన్యూఢిల్లీ : దేశ చరిత్రలోనే ఎన్న డూ లేనట్లుగా.. సుప్రీంకో ర్టు ప్రధాన న్యాయుమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మీద కాంగ్రెస్, మరో ఆరు ప్రతిపక్ష పార్టీలు కలిసి అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టా లని నిర్ణయించాయి. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దుష్ప్రవర్తన కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఈ తీర్మానానికి నోటీసిచ్చారు. ప్రతిపక్ష నేతలు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలిసి, ప్రధాన న్యాయుమూర్తిని అభిశంసించాలంటూ 64 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేసిన నోటీసును ఆయునకు అందించారు. దేశంలో ఇంతవరకు ఏ ఒక్క ప్రధాన న్యాయుమూర్తినీ అభిశంసన ద్వారా తొలగించలేదు. దాంతో.. ఇప్పుడు ఏం చేయాలన్న విషయమై న్యాయుసలహా తీసుకునే అవకాశముంది. సీబీఐ కోర్టు జడ్జి లోయా మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖైలెన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేయుడంతో ఆ తర్వాతిరోజే అభిశంసనకు నిర్ణయం తీసుకోవడం గవునార్హం. నోటీసు అందిన తర్వాత అసలు ఆ తీర్మానాన్ని చర్చకు తీసుకోవడానికి దానికి తగిన అర్హత ఉందో లేదో రాజ్యసభ చైర్మన్ పరిశీలిస్తారు. ఒకవేళ అర్హత ఉందని ఆయన భావిస్తే.. అప్పుడు దాని పరిశీలనకు ఒక కమిటీ  నియుమించచ్చు. లేదా అర్హత లేదనుకుంటే దాన్ని తిరస్కరించచ్చు. ఒకవేళ తీర్మానాన్ని తీసుకుంటే మాత్రం.. దేశంలో ఇదే మొట్టమొదటిసారిగా ప్రధాన న్యాయుమూర్తిపై అభిశంసన తీర్మానం అవుతుంది. 

ఆరోపణలు ఇవీ...
నోటీసులో ప్రధాన న్యాయుమూర్తి మీద ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు ఇలా ఉన్నాయి... ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టుకు అక్రమంగా d.mishraఅనువుతులు ఇవ్వడానికి కుట్ర పన్నడం, అదే విషయంలో హైకోర్టు రిటైర్డ్ న్యాయుమూర్తిపై కేసు వేయుడానికి నిరాకరించడం; న్యాయువాదిగా ఉండగా తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం ద్వారా కొంత భూమిని పొందడం. నోటీసు మీద సంతకాలు చేసిన వాళ్లలో కాంగ్రెస్, ఎన్‌సీపీ, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ, బీఎస్పీ, ఐయూఎంఎల్ తదితర పార్టీల ఎంపీలున్నారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చించేందుకు సమావేశైవెునవారిలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, రణ్‌దీప్ సుర్జేవాలా, సీపీఐ నేత డి.రాజా, ఎన్‌సీపీ నేత వందనా చవాన్ తదితరులున్నారు. 

బాధ్యత వహించాలి: సిబల్
భారైమెన హృదయంతోనే అవిశ్వాస నోటీసును సిద్ధం చేసినట్లు కాంగ్రెస్ నాయుకుడు, ప్రముఖ న్యాయువాది కపిల్ సిబల్ తెలిపారు. తాము ప్రజలకు ఎలా బాధ్యత వహించాలో.. ప్రధాన న్యాయుమూర్తి కూడా అలాగే తమకు బాధ్యత వహించాలని.. వ్యక్తుల కన్నా చట్టమే అత్యున్నతైవెునదని ఆయన అన్నారు. ప్రధాన న్యాయుమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మీద విచారణ జరిపించాలని కూడా ప్రతిపక్షాలు డిమాండు చేశాయి. వాస్తవాలే విజయం సాధించాలంటే పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని సిబల్ అన్నారు. న్యాయువ్యవస్థ సుస్థిరంగా, స్వతంత్రం గా ఉండి.. తన రాజ్యాంగ విధులను నిజాయితీగా, నిర్భీతిగా, నిష్పక్షపాతంగా నిర్వహించినపుడే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని చెప్పారు. న్యాయువ్యవస్థ స్వతంత్రత ప్రమాదంలో పడిందని స్వయంగా సుప్రీంకోర్టు న్యాయుమూర్తులే అంటున్నారని కూడా సిబల్ అన్నారు. 

ఏడుగురిని తప్పించండి
అభిశంసన నోటీసు మీద 71 సంతకాలున్నా... తమ సభ్యులలో ఏడుగురు ఇప్పటికే రాజ్యసభ నుంచి రిటైర్ అయినందున వాళ్ల పేర్లు తీసేయాలని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ కోరారు. రాజ్యసభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతుండాలి. 

కాంగ్రెస్‌లో చీలిక?
అభిశంసన తీర్మానం విషయంలో కాంగ్రెస్ పార్టీలోనే చీలిక వచ్చినట్లు కనపడుతోంది. సంతకాలు చేసినవారిలో తన పేరు ఉండకపోవచ్చని కేంద్ర న్యాయుశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయుకుడు సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. అభిశంసన అనేది చాలా తీవ్రైమెన అంశమని, ఒక్క తీర్పుతో విభేదించినంత మాత్రాన దాంతో ఎలా పడితే అలా ఆడుకోకూడదని వ్యాఖ్యానించారు. అత్యంత సంక్లిష్ట అంశాలను కూడా పరిష్కరిం చేందుకు సుప్రీంకోర్టు సవుర్ధైవెునదని చెప్పారు. సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆమోదించాలి, గౌరవించి తీరాలని తెలిపారు. 

సంతకం చేయని మన్మోహన్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా నోటీసు మీద సంతకం చేయులేదు. ఈ విషయాన్ని కపిల్ సిబల్ కూడా నిర్ధారించారు. ఆయన మాజీ ప్రధాని కావడం వల్లే ఆయన సంతకం తాము తీసుకోలేదని సిబల్ తెలిపారు. అయితే, ఈ విషయమై పలు రకాల చర్చలు జరిగాయి. ఆయునతోపాటు సీనియర్ నాయకులు పి.చిదంబరం, అభిషేక్ సింఘ్వీ కూడా సంతకాలు చేయులేదు. ఇంతమంది చేయుకపోయినా.. అభిశంసనపై ఏకాభిప్రాయం ఉందని కాంగ్రెస్ ప్రకటించడం గవునార్హం.


బహిరంగ ప్రకటనలు దురదృష్టకరం: సుప్రీం
న్యాయుమూర్తుల అభిశంసనపై రాజకీయ నాయుకులు బహిరంగ ప్రకటనలు చేయడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది తామందరినీ ఎంతగానో ఇబ్బంది పెట్టిందని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనలు మీడియాలో కూడా రాకుండా చూడాలంటూ ఒక పిటిషన్ దాఖలు కావడంతో.. పిటిషన్ విచారణ విషయంలో తమకు సహకరించాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను కోర్టు కోరింది. కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే.. మీడియాను నియం త్రిస్తూ ఉత్తర్వులు జారీ చేసేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. అటార్నీ జనరల్ సలహా లేనిదే తాము అలాంటి ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. 'కాంగ్రెస్‌ది రెండు నాల్కల ధోరణి'

Updated By ManamMon, 04/02/2018 - 16:22

Congress party, Harish rao, CAG report, BJP allegations హైదరాబాద్‌: కాగ్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను తెలంగాణ మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. కాంగ్రెస్‌ నేతలు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ పార్టీ రెండు నాల్కల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాగ్‌ నివేదిక తప్పులతడక అని పార్లమెంటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ అన్నారని, ప్రభుత్వ విధానాలను తప్పబట్టడానికి కాగ్‌కు అధికారం లేదని గత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా అన్నారని ఈ సందర్భంగా హరీశ్ గుర్తు చేశారు. కాగ్‌ నివేదిక భగవద్గీత, బైబిల్‌ కాదని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారని హరీశ్ చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాగ్‌ నివేదిక పట్టించుకోనక్కర్లేదని, అధికారంలో లేకపోతే మాత్రం దుమ్మెత్తిపోస్తారా? అని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కాగ్‌ నివేదికలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా.. బీజేపీయేతర రాష్ట్రాల్లో మరోలా ఉంటున్నాయి. ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజల్లో చులకన అయిపోతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అధికార యావ తప్ప.. ప్రజా సంక్షేమం పట్టడం లేదు. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ కాంగ్రెస్‌ పార్టీ అమలు చేయలేదని హరీశ్ విమర్శించారు.నేటి నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర 

Updated By ManamSat, 03/31/2018 - 23:14
 • రెండో విడతకు రామగుండంలో శ్రీకారం

 • 10న వరంగల్ ఈస్ట్‌లో సభతో ముగింపు

 • ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, కాగ్ నివేదికతో

 • ప్రభుత్వంపై దాడికి పీసీసీ వర్గాలు సిద్ధం

imageహైదరాబాద్:  తెలంగాణ  ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి రెండో విడత బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి ప్రజా చైతన్య బస్సు యాత్ర ప్రారంభం కానుంది. రామగుండంలో సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లుభట్టి విక్రమార్క, సీఎల్పీ నాయకుడు జానా రెడ్డి,  జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వంటి నేతలు పాల్గొంటారు.  ఏప్రిల్ 10న వరంగల్ ఈస్ట్‌లో జరిగే బహిరంగ సభతో బస్సు యాత్ర ముగియనుంది. రామగుండం, పెద్దపల్లి, మంథని, బెల్లంపల్లి,  స్టేషన్ ఘన్‌పూర్, పాలకుర్తి, నర్సంపేట, పరకాల, వరంగల్ వెస్ట్, ఇల్లందు, పినపాక, డోర్నల్, మహబూబాబాద్, వెంకటాపురం, ములుగు, వర్ధన్నపేట, వరంగల్ ఈస్ట్ ల్లో బహిరంగ సభలు నిర్వహిస్తారు. ఏప్రిల్ ఒకటి రామగుండం, 2న పెద్దపల్లి, ఏప్రిల్ 5న నర్సంపేటల్లో మాత్రం ఒక్కొక్క బహిరంగ సభనే నిర్వహిస్తున్నారు. మిగిలిన తేదీల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో రెండు సభలు జరుగుతాయి. శాసన సభలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు, మిగిలిన సభ్యులను సభ ప్రారంభానికి ముందే సస్పెండ్ చేయడం, కాగ్ నివేదికలో వెల్లడించిన అంశాలు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏయే పనులు చేస్తుందన్న విషయాలను ఈ సభల్లో ప్రధానంగా ప్రస్తావించాలని పీసీసీ నిర్ణయించింది.

Related News