nayanatara

న‌య‌న‌తార 'కోకో' ఫ‌స్ట్ లుక్

Updated By ManamMon, 03/05/2018 - 20:17

nayanataraకోలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార న‌టించిన తాజా త‌మిళ చిత్రం 'కోల‌మావు కోకిల‌' (కోకో). నెల్స‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను సోమ‌వారం విడుద‌ల చేశారు. ఎక్క‌డికో ప్ర‌యాణ‌మైన న‌య‌న్‌.. ఓ చోట నిల‌బ‌డి ఏదో విష‌య‌మై ఆలోచిస్తూ ఉన్న‌ట్లుగా ఈ ఫ‌స్ట్ లుక్‌ను డిజైన్ చేశారు. కాగా, మార్చి 8న ఈ సినిమాకి సంబంధించిన ఫ‌స్ట్ సింగిల్‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లో మెగాస్టార్‌?

Updated By ManamThu, 03/01/2018 - 20:19

ysrఇండియన్ స్క్రీన్‌పై బయోపిక్‌ల హవా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితకథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వై.ఎస్.ఆర్ పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటిస్తాడని కూడా ఆ మ‌ధ్య‌ వార్తలు వినిపించాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటిస్తారట. యూనిట్ కూడా మమ్ముట్టిని ఇప్ప‌టికే సంప్రదించార‌ని స‌మాచారం. అలాగే వై.ఎస్.ఆర్ సతీమణి విజయమ్మ పాత్రలో నయనతారను నటింపచేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.అజిత్ సినిమాలో అర్జున్‌?

Updated By ManamMon, 02/19/2018 - 19:43

arjunయాక్ష‌న్ కింగ్ అర్జున్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. త‌మిళ అనువాద చిత్రాల‌తో పాటు నేరుగా తెలుగు సినిమాలు చేసి ఇక్క‌డివారిని అల‌రించారు ఈ యాక్ష‌న్ కింగ్. గ‌త ఏడాది 'లై'లో విల‌న్‌గా న‌టించిన అర్జున్‌.. ప్ర‌స్తుతం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'అభిమ‌న్యుడు' చిత్రాల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. అజిత్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న త‌మిళ చిత్రం 'విశ్వాస‌మ్'లోనూ అర్జున్ ఓ ముఖ్య పాత్ర చేయ‌బోతున్నార‌ని త‌మిళ‌నాట క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇదివ‌ర‌కు అజిత్ 50వ చిత్రం 'మాంగాత్తా' (గ‌్యాంబ్ల‌ర్‌)లో అర్జున్ కీల‌క పాత్ర పోషించారు. ఆ సినిమా ఘ‌న‌విజ‌యం సాధించింది. మ‌ళ్ళీ ఈ కాంబినేష‌న్‌లో సినిమా అంటే.. అది ఆస‌క్తిక‌ర‌మే. న‌య‌న‌తార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా విడుద‌ల కానుంది. 2018 తొలి ఏడు వారాలు.. లోటు తీర్చిన విజ‌యాలు

Updated By ManamSat, 02/17/2018 - 22:58

nayan2018లోకి అడుగుపెట్టి 7 వారాలు పూర్త‌య్యింది. ఈ ఏడు వారాల్లో.. ప్ర‌తి వారం కూడా తెలుగు తెర‌పై సినిమాలు సంద‌డి చేస్తూనే ఉన్నాయి. ఈ 50 రోజుల కాలంలో అటుఇటుగా 20 సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల గ‌ల‌గ‌లల‌కు చిరునామాగా నిలిచాయి. ఆ చిత్రాలే 'జై సింహా', 'భాగ‌మ‌తి', 'ఛ‌లో', 'తొలిప్రేమ‌'. ఈ సినిమాల్లో ప్ర‌తి సినిమా కూడా క‌నీసం ఇద్ద‌రికి చాలా కాలంగా విజ‌యాలు, బ్రేక్ లేని కొర‌త‌ని తీర్చ‌డం విశేషం. ఓ సారి వారిపై దృష్టి పెడితే..

సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి హిట్‌
న‌య‌న‌తార‌.. కోలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్‌. తెలుగులోనూ ఈమెకి మంచి క్రేజే ఉంది. అయితే.. త‌మిళంలో ఉన్నంత స్టార్ డ‌మ్‌ మాత్రం ఇక్క‌డ లేద‌న్న‌ది వాస్త‌వం. న‌య‌న‌తార కెరీర్‌ను 'శ్రీ‌రామ రాజ్యం' చిత్రానికి ముందు, త‌రువాత అని చెప్పుకోవ‌చ్చు. ఎందుకంటే.. ప్ర‌భుదేవాని పెళ్ళి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌తో.. ఆ స‌మ‌యంలో సినిమాల‌కి దూరంగా ఉండాల‌నుకుంది ఈ మ‌ల‌యాళ మందారం. అయితే.. ఊహించ‌ని విధంగా ప్ర‌భుదేవాతో బ్రేక‌ప్ అవ‌డంతో.. తిరిగి కొత్త‌ ఇన్నింగ్స్ మొద‌లు పెట్టింది న‌య‌న్‌. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్' చిత్రంలో న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌డ‌మే కాకుండా.. త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది. అంతేనా.. ప్ర‌మోష‌న్స్‌కు దూరంగా ఉండే ఈ అమ్మ‌డు.. ఆ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కూడా బాగానే పాల్గొంది. అయితే.. ఇంత‌చేసి ఆ సినిమా ఆమెకి ఏ విధంగానూ ప్ల‌స్ కాలేక‌పోయింది. ఆ త‌రువాత 'గ్రీకు వీరుడు', 'అనామిక‌', 'బాబు బంగారం' వంటి సినిమాలు చేసినా.. విజ‌యం మాత్రం ద‌క్క‌లేదు. మ‌రో వైపు.. అదే స‌మ‌యంలో త‌మిళనాట వ‌రుస విజ‌యాల‌తో నంబ‌ర్ వ‌న్ క‌థానాయిక అనిపించుకుంది. కోట్ల పారితోషికానికి ప‌డ‌గ‌లెత్తింది. అయితే.. ఒక‌టే లోటు. తెలుగులో స‌రైన విజ‌యం లేద‌ని. అయితే.. ఆ ముచ్చ‌టా తీరింది. తెలుగులో త‌న‌కి క‌లిసొచ్చిన క‌థానాయ‌కుల్లో ఒక‌రైన బాల‌కృష్ణ‌కి జోడీగా న‌టించిన 'జై సింహా' చిత్రం.. న‌య‌న్‌కు చాలా కాలం త‌రువాత తెలుగులో విజ‌యాన్ని అందించింది. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న 'సైరా న‌ర‌సింహారెడ్డి'లో న‌టిస్తోంది న‌య‌న్‌. 

తొలి విజ‌యం ద‌క్కింది
కె.ఎస్‌.రవికుమార్‌.. త‌మిళ‌నాట నంబ‌ర్ వ‌న్ డైరెక్ట‌ర్‌.  ఆయ‌న రూపొందించిన ప‌లు చిత్రాలు ఇక్క‌డా అనువాద‌మై.. ఘ‌న‌విజ‌యం సాధించాయి. 'ముత్తు', 'భామ‌నే స‌త్య‌భామ‌నే', 'న‌ర‌సింహా' వంటి చిత్రాల‌ను ఈ జాబితాలో చేర్చుకోవ‌చ్చు. అయితే.. తెలుగులో నేరుగా రూపొందించిన సినిమాలు మాత్రం ర‌వికుమార్‌కు అంత‌గా అచ్చిరాలేదు. చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేసిన 'స్నేహం కోసం' యావ‌రేజ్ కాగా.. నాగార్జున‌తో చేసిన 'బావ‌న‌చ్చాడు', రాజ‌శేఖ‌ర్‌తో రూపొందించిన 'విల‌న్' ప‌రాజ‌యం పాల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో.. దాదాపు 15 ఏళ్ళ త‌రువాత కె.ఎస్‌.ర‌వికుమార్ చేసిన తెలుగు  చిత్రం 'జై సింహా'. బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో చేసిన ఈ మాస్ మూవీ.. బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌గా నిలిచింది. ర‌వికుమార్‌కు తెలుగులో తొలి విజ‌యాన్ని అందించింది.

తొమ్మిదేళ్ళ త‌రువాత‌
అనుష్క ద‌శ‌, దిశ‌ని మార్చివేసిన చిత్రం 'అరుంధ‌తి'. ఆ సినిమా త‌రువాత హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్ర‌స్‌లా మారింది ఈ మంగ‌ళూరు బ్యూటీ. 'పంచాక్ష‌రి', 'వ‌ర్ణ‌', 'రుద్ర‌మ‌దేవి', 'సైజ్ జీరో'.. ఇలా స్వీటీ చేసిన నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల‌న్నీ ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇలాంటి త‌రుణంలో  వ‌చ్చింది.. 'భాగ‌మ‌తి' . జ‌న‌వ‌రి 26న విడుద‌లైన ఈ పొలిటిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్‌.. 'అరుంధ‌తి' త‌రువాత లేడీ ఒరియెంటెడ్ మూవీస్ ప‌రంగా అనుష్కకు విజ‌యాలు లేని లోటును తీర్చింది. అలాగే.. ఓవ‌ర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూళ్ళు సాధించిన తొలి నాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రంగా నిలిచింది. 

నిరీక్ష‌ణ ఫ‌లించింది
'పిల్ల జమీందా'ర్ చిత్రంలో మాన‌వ‌తా విలువ‌ల‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు ద‌ర్శ‌కుడు జి.అశోక్‌. అయితే ఆ త‌రువాత ఆయ‌న రూపొందించిన 'సుకుమారుడు', 'చిత్రాంగ‌ద' చిత్రాలు పూర్తిగా నిరాశ‌ప‌రిచాయి. అయితే.. అనుష్క‌తో రూపొందించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ 'భాగ‌మ‌తి'..  అశోక్‌కు మ‌రో మంచి విజ‌యాన్ని అందించింది. కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో ఆయ‌న సెల్యూలాయిడ్‌పై చేసిన మాయాజాలం.. స‌క్సెస్ కోసం నిరీక్షిస్తున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌కు సూప‌ర్ హిట్ రిజ‌ల్ట్‌ను అందించింది. 

వినోదం మెప్పించింది
'ఊహ‌లు గుస‌గుస‌లాడె' చిత్రంతో యువ‌త‌రంలో త‌నకంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య‌. ఆ త‌రువాత 'దిక్కులు చూడ‌కు రామ‌య్య‌', 'క‌ల్యాణ వైభోగ‌మే', 'జో అచ్యుతానంద' వంటి సినిమాలు చేసినా.. సాలిడ్ హిట్ మాత్రం ద‌క్క‌లేదు. అయితే.. త‌న హోమ్ బేన‌ర్‌పై చేసిన 'ఛ‌లో' చిత్రంతో సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఫిబ్ర‌వ‌రి 2న విడుద‌లైన ఈ సినిమా.. ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కి లాభాల బాట ప‌ట్టింది. ఈ సినిమా త‌రువాత నాగ శౌర్య మార్కెట్ పెరిగింద‌నే చెప్పాలి.

తండ్రికి త‌గ్గ త‌న‌యుడు
మ‌ణిశ‌ర్మ‌.. ఇండ‌స్ట్రీ హిట్ చిత్రాల‌న్నెంటికో సంగీత‌మందించిన నిన్న‌టి త‌రం మేటి సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న స్వ‌ర‌వార‌సుడిగా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్‌. 'జాదుగాడు' వంటి సినిమాలు చేసినా.. అత‌ని ప్ర‌తిభ‌కి స‌రైన గుర్తింపు రాలేదు. ఇలాంటి స‌మ‌యంలో 'ఛ‌లో' రూపంలో వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్నాడు. త‌న పాట‌ల‌తో, నేప‌థ్య సంగీతంలో ఆ సినిమా విజ‌యంలో భాగ‌స్వామ్యం వ‌హించాడు. ముఖ్యంగా 'చూసీ చూడంగానే' పాట‌తో సంగీత ప్రియుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్నాడు.

ప్ర‌తిభ‌కి త‌గ్గ గుర్తింపు
'ఊహ‌లు గుస‌గుస‌లాడె' చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌యం అయ్యింది ఉత్త‌రాది భామ రాశి ఖ‌న్నా. ఆ సినిమా త‌రువాత 'జోరు, జిల్‌, బెంగాల్ టైగ‌ర్‌, శివ‌మ్‌, సుప్రీమ్‌,  హైప‌ర్‌, జై ల‌వ‌కుశ‌, ఆక్సిజ‌న్‌, ట‌చ్ చేసి చూడు' వంటి సినిమాలు చేసినా.. ఆ చిత్రాల‌న్నీ ఆమెను గ్లామ‌ర్ హీరోయిన్‌గానే ఎలివేట్ చేశాయి. అయితే ఈ నెల 10న విడుద‌లైన 'తొలిప్రేమ' చిత్రం ఆమెలో దాగిఉన్న మంచి న‌టిని ఆవిష్క‌రించింది. భావోద్వేగాల‌కు అవ‌కాశ‌మున్న వ‌ర్ష పాత్ర‌లో రాశి జీవించింద‌నే చెప్పాలి. ఈ ఒక్క‌ చిత్రంతో నాలుగేళ్ళుగా.. ఇంత‌కు ముందు చేసిన ప‌ది తెలుగు చిత్రాల‌తో రాని గుర్తింపు వ‌చ్చింది. 

ప్రేమ‌క‌థల‌కు సైతం..
త‌మ‌న్‌.. ఒక‌ప్పుడు ఈ పేరు వింటే బీట్ ఒరియెంటెడ్ సాంగ్స్ మాత్ర‌మే గుర్తొచ్చేవి. ఇప్పుడు.. ఆ లెక్క మారింది. కేవ‌లం మాస్ మూవీస్‌, హార‌ర్ చిత్రాలకే త‌ను ప‌రిమితం కాద‌ని.. స‌రైన అవ‌కాశం రావాలే కాని.. ప్రేమ‌క‌థా చిత్రాల‌కు త‌ను అద్భుత‌మైన స్వ‌రాలు ఇవ్వ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు త‌మ‌న్‌. 'తొలిప్రేమ' చిత్రం.. ఇందుకు వేదిక‌గా నిలిచింది. ఇందులోని 'నిన్నిలా నిన్నిలా', 'తొలిప్రేమ టైటిల్ సాంగ్‌', 'అల్ల‌సాని' అనే మెలోడీ గీతాలు త‌మ‌న్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి.

ఇలా.. ఏడు వారాల కాలంలో 8 మంది ప్ర‌తిభావంతుల‌కు క‌లిసొచ్చిన 2018.. పూర్తి సంవ‌త్సరంలో ఇంకెంత‌మందికి నెగెటివ్ సెంటిమెంట్స్‌కు బ్రేక్ వేస్తుందో,  అలాగే స‌రైన బ్రేక్ లేనివారికి ట‌ర్నింగ్ పాయింట్‌లా నిలుస్తుందో చూడాలి.  అజిత్ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా..

Updated By ManamWed, 02/14/2018 - 18:51

d.imaanత‌ల అజిత్ హీరోగా న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం 'విశ్వాస‌మ్‌'. లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా డి.ఇమాన్‌ను క‌న్‌ఫ‌ర్మ్ చేశారు. మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా నిలిచిన ఇమాన్‌కు.. అజిత్ కాంబినేష‌న్‌లో ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టికే మ‌రో స్టార్ హీరో విజ‌య్ న‌టించిన 'త‌మిళ‌న్‌', 'జిల్లా' చిత్రాల‌కు ఇమాన్ స్వ‌రాల‌ను అందించారు. ఇదిలా ఉంటే.. దీపావ‌ళి కానుక‌గా 'విశ్వాస‌మ్' తెర‌పైకి రానుంది.'జై సింహా' ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamTue, 02/13/2018 - 21:39

jai simhaబాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'జై సింహా'. న‌య‌న‌తార‌, హ‌రిప్రియ‌, న‌టాషా దోషి హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాకి ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా, సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. వ‌సూళ్ళ ప‌రంగా హిట్ స్థాయికి చేరుకుంది. చిత్ర బృందం అందించిన అధికారిక క్లోజింగ్ షేర్స్ ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.28.25 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ మూవీ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.35.85 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని చిత్ర వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ రూ.27 కోట్లు ఉన్న ఈ సినిమా.. ఈ లెక్క‌ల‌ ప్రకారం హిట్ స్థాయికి చేరుకున్న‌ట్లే.  నాలుగోసారి.. అజిత్‌కు జోడీగా న‌య‌న్‌

Updated By ManamMon, 02/05/2018 - 21:09

nayanaకోలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు న‌య‌న‌తార‌. ఓ వైపు హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. మ‌రో వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ జోడీ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా అజిత్‌కు జోడీగా న‌టించేందుకు న‌య‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అజిత్‌, ద‌ర్శ‌కుడు శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న కొత్త‌ చిత్రం 'విశ్వాస‌మ్‌'లో క‌థానాయిక పాత్ర కోసం కీర్తి సురేష్‌, అనుష్క వంటి పేర్లు వినిపించినా.. చివ‌రాఖ‌రికి ఆ అవ‌కాశం న‌య‌న్ చెంత‌కు చేరింది. ఇప్ప‌టికే అజిత్‌, న‌య‌న్ మూడు చిత్రాల్లో న‌టించారు. వాటిలో 'బిల్లా', 'ఆరంభం' ఘ‌న‌విజ‌యం సాధించాయి. 'ఏగ‌న్' ప‌ర‌వాలేద‌నిపించుకుంది. అలాగే ద‌ర్శ‌కుడు శివ కాంబినేష‌న్‌లోనూ అజిత్‌కు ఇది నాలుగో సినిమా. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'వీర‌మ్‌', 'వేదాళ‌మ్' మంచి విజ‌యం సాధించాయి. 'వివేగ‌మ్' ప‌ర్లేద‌నిపించుకుంది. మ‌రి త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయిక‌, ద‌ర్శ‌కుడుతో అజిత్ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం అందుకుంటారేమో చూడాలి. ఈ ఏడాదే ఈ సినిమా తెర‌పైకి రానుంది. క‌మ‌ల్‌కు జోడీగా న‌య‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:02

nayanర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, సూర్య‌.. ఇలా త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. ఈ జాబితాలో మిగిలి ఉన్న మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తోనూ క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'భార‌తీయుడు' (1996) చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు న‌య‌న‌తార పేరు ప‌రిశీలిస్తున్నార‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.'జై సింహా' 5 రోజుల క‌లెక్ష‌న్లు

Updated By ManamWed, 01/17/2018 - 16:26

jai simha'సింహా', 'శ్రీ‌రామ రాజ్యం' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చిత్రం 'జై సింహా'. కె.ఎస్‌.రవికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా.. గ‌త శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మంగ‌ళ‌వారం నాటికి 5 రోజులను పూర్తిచేసుకున్న 'జై సింహా'.. ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.20.55 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా.. తొలి ఐదు రోజుల‌కి గానూ రూ.17.9 కోట్ల షేర్ రాబ‌ట్టుకుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ.27 కోట్ల థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్న ఈ సినిమా.. విజ‌యం సాధించే అవ‌కాశాలున్నాయ‌న్న‌ది ట్రేడ్ వ‌ర్గాల వారి మాట‌.నిర్మాతలకు నయనతార కండిషన్స్

Updated By ManamMon, 01/15/2018 - 20:11
nayanatara

సినిమాలే కాదు...వ్యక్తిగత విషయాలతోనూ దక్షిణాది మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచే నటి నయనతార. కొన్నేళ్ల క్రితం తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కారణం ఏమో తెలియదుగానీ...ఆ తర్వాత శింబుతో కటీఫ్ చేసుకుంది. ఆ తర్వాత నటుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాలతో నయనతార ప్రేమలో పడడం, తెగతెంపులు చేసుకోవడం చకచకా జరిగిపోయింది. రెండేళ్ల క్రితం ఈ అమ్మడు మరో తమిళ నటుడు ఆర్యతో సహజీవనం చేస్తోందన్న పుకార్లు షికార్లు చేశాయి. వారిద్దరూ కలిసి చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టేశారన్న ప్రచారం కూడా జరిగింది. 

అదంతా గతం. ఇప్పుడు ఈ కేరళ కుట్టి, దర్శకుడు విఘ్నేష్ శివ‌న్‌తో పీకల్లోతు ప్రేమ‌లో మునిగినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. దీంతో సినిమాల విషయంలో ఈమె చాలా కండిష‌న్లు పెడుతోంద‌ట‌. అలా అయితేనే సినిమాల‌కు ఓకే చేస్తోందట.  అగ్రిమెంట్ స‌మ‌యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజ‌రుకానని తెగేసి చెబుతోందంట. అలాగే గతంలో బికినీలు ధరించడంతో పాటు, హీరోల‌తో స‌న్నిహితంగా ఉండే టచింగ్ సీన్లు చేయ‌న‌ని చెబుతోంద‌ట‌. ఈ కండిష‌న్ల ప్రకారమే బాలయ్య సరసన ‘జైసింహా’ సినిమా చేసింద‌ట‌. నయనతార కండిషన్స్ చాంతాడంత ఉన్నా సినీ ఇండస్ట్రీలో ఆమెకు డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. 

Related News