cover story

పెళ్లైన తర్వాత..

Updated By ManamSun, 09/30/2018 - 06:28

imageసహజీవన కాలమిది. పెళ్లి అనే తంతుపై చర్చ జరుగుతున్న కాలమిది. ఓవైపు గృహహింస వేధింపుల కేసులు, మరోవైపు విడాకుల కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న కాలమిది. అస్తిత్వ సమస్య ఉధృతమవుతున్న కాలమిది. అదిగో.. అలాంటి కాలంలో పెళ్లయిన తర్వాత ఇద్దరు స్త్రీ పురుషుల సామాజిక జీవితం ఎలాంటి మార్పుకు గురవుతున్నదనే విషయం చర్చించడం ఎందుకు? ఎందుకంటే ఆ చర్చ ఇప్పుడే అవసరం గనుక. కుటుంబం చుట్టూ పెనవేసుకుపోయిన వ్యక్తి జీవితం రోజురోజుకూ మారుతున్న విలువలతో అతలాకుతలం అవుతున్నది గనుక. పాత బంధాలు తగ్గి, కొత్త బంధాలు పెరిగే సమయం గనుక. ఇప్పుడే మనం దీని గురించి మాట్లాడుకోవాలి.

పెళ్లయి దాదాపు ఆరేళ్లయింది. పెళ్లయిత తర్వాత నా సోషల్ లైఫ్ పూర్తిగా మారింది. పెళ్లికాక ముందు ఫ్రెండ్స్‌తో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎక్కడికైనా వెళ్లేవాడ్ని. ఫోన్ చేసి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలిసేవాడ్ని. మేం కాసేపు కూర్చొని, టీ తాగుతూ, సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లం. సినిమాలకు వెళ్లేవాళ్లం, హోటల్‌కు వెళ్లి భోంచేసి వచ్చేవాళ్లం. పెళ్లయ్యూక ప్రతిదీ కష్టంగా మారింది. ఎవరైనా ఫోన్ చేసి రమ్మంటే, ఏదో సాకు చేసి తప్పించుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే, అలా వెళ్తానంటే నా భార్య అలుగుతోంది. ఏదో ఒక పనిచెప్పి, నేను ఫ్రెండ్ దగ్గరకు వెళ్లడాన్ని అడ్డుకుంటోంది. పెళ్లి తర్వాత నా సోషల్ లైఫ్ ఇబ్బందికరంగా తయారయింది. ఈ పరిస్థితిని జీర్ణం చేసుకోవడానికి నాకు కొంత సమయుం పట్టింది. ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్‌లో కొత్తవాళ్లు వచ్చి చేరారు. వారిలో ఎక్కువ మంది నా భార్య తరపు బంధువులే. నేను ఎదురు చూస్తున్న కొత్త సినిమా వస్తుంది. కానీ నా భార్యకు అది చూడ్డం ఇష్టం ఉండదు. దాంతో నేను నా క్లోజ్ ఫ్రెండ్‌తో వెళ్లి ఆ సినిమా చూస్తాను. నా భార్య ఏమనుకున్నా నేను పట్టించుకోవట్లేదు.’’.. ఇవి చంద్రశేఖర్ అనే సాఫ్ట్‌వేర్ నిపుణుడి మాటలు. చాలా మంది ఇదే తరహాలోనో, దీనికి దగ్గరగానో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు.
 

image


మార్పు సహజం
పెళ్లయిన తర్వాత మన జీవితం అకస్మాత్తుగా మారిపోతుందనేది నిజం. ఒక జంటకు పెళ్లయినప్పుడు, అప్పటి దాకా వాళ్ల జీవితంలో కేంద్రంగా, కీలకంగా ఉన్న వ్యక్తులు స్థానభ్రంశం చెందుతారు. భార్యతో జీవితం మెుదలయ్యూక ఆమెతో అనుబంధం మెుదటి స్థానం ఆక్రమించి, తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులతో అనుబంధాలు సెకండరీ అవుతారు. మన ఒక్కరి జీవితమే కాదు, మన తల్లిదండ్రుల జీవితాలైనా, మన తాతల, అమ్మమ్మల జీవితాలైనా అంతే.

భిన్న వాతావరణాలు, అలవాట్లు, ఆచారాల మధ్య పెరిగిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి పేరిట జంటగా కలిసి జీవించాల్సి వచ్చినప్పుడు, వాళ్లు తమ మధ్య బ్యాలెన్స్‌ను సాధించడానికీ, పరిస్థితుల్ని అవగాహన చేసుకోవడానికీ ప్రయుత్నిస్తారు. అదివరకెన్నడూ లేని రీతిలో సర్దుబాట్లు చేసుకుంటారు, రాజీ పడతారు. ఈ క్రమంలో, తమ సొంత అస్తిత్వాన్ని పునర్మించుకోడానికి ప్రయత్నిస్తారు, మనుషులుగా వికాసం చెందుతారు. ఇలాంటి నేపథ్యంలో, మనుషులు మారడం ఆశ్చర్యం కలిగించదు.

పెళ్లయిన తర్వాత నుంచీ, మీ సన్నిహిత స్నేహితులు సైతం మిమ్మల్ని దూరంగా పెట్టేస్తున్నారని అనిపిస్తుండవచ్చు. వాళ్ల సమావేశాలకు మిమ్మల్ని అరుదుగా పిలుస్తుండి ఉంటారు. స్నేహితుల నుంచి చాలా అరుదుగా మాత్రమే మీకు ఫోన్లు వస్తుండి ఉంటారు. మీ స్నేహితులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చాలా చాలా ఆలస్యంగా మీకు తెలుస్తుండి ఉంటారు. ఇలాంటిది నిజంగానే మీ విషయంలో జరుగుతున్నట్లయితే, ఎందుకిలా పరిస్థితులు మారిపోయాయనే విషయం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక్కసారి దీని గురించి సావకాశంగా ఆలోచిస్తే, విషయం మీకే బోధపడుతుంది. మారింది మీ స్నేహితులు కాదు, పెళ్లయ్యూక మీరే మారిపోయారనే విషయం అర్థమవుతుంది. ఇప్పుడు మీ ప్రాధాన్యాలు మారాయనీ, మీ ఫోకస్ అంతా మీ భార్య మీదకూ, కొత్తగా ఏర్పడిన కుటుంబం మీదకూ, కొత్త అనుబంధాల వైపూ మళ్లిందనీ, ఇదెంతో క్లిష్టమైనదే కాక, సున్నితమైన విషయమనీ మీకు అర్థమవుతుంది.
ఇది మీ భార్య మీకు ప్రధాన స్నేహితురాలు కావడమే కాకుండా, ఎక్కువ సమయం ఆమెతోనే గడపడం వల్ల కలిగిన మార్పు. ఆమె లేకపోతే, మీరు ఒంటరి అవుతారు. ఐనప్పటికీ, మీ చిన్ననాటి స్నేహితుల్నీ, సన్నిహితుల్నీ మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్లను చూడాలనీ, కలుసుకోవాలనీ మీకు అనిపిస్తుంటుంది. కానీ ఎక్కువ సమయం ‘ఫ్రెండ్’ పాత్రనూ, అదే సమయంలో ‘భార్య’ ప్రాతనూ ఆమె భర్తీ చేస్తుంటుంది.

స్నేహితుల సర్కిల్ మారుతుంది
imageపెళ్లికి ముందు మీ స్నేహితులతో మంచి అనుబంధాన్ని మీరు కొనసాగిస్తూ వస్తారు. ఎందుకంటే ప్రతి రోజూ వాళ్లను కలుసుకుంటారు, వాళ్లతో మాట్లాడుతుంటారు, ముఖ్యమైన విషయాల్ని వాళ్లతో పంచుకుని, చర్చిస్తుంటారు. అయిుతే పెళ్లి ఒక వ్యక్తి సామాజిక స్థాయిని మార్చేస్తుంది. బహుశా వాళ్లు సింగిల్ ఫ్రెండ్‌తో కాకుండా, ఇతర పెళ్లయిన  జంటలతో స్నేహాన్ని కలుపుకోవడం వల్ల కావచ్చు. జీవిత భాగస్వాములకు వాళ్ల వాళ్ల భిన్నమైన స్నేహ బృందాలు ఉంటారు. ఒకరి ఫ్రెండ్‌తో మరొకరు కలివిడిగా ఉండలేరు. పెళ్లయ్యాక సామాజిక బంధాలు మారడానికి ఇదే ప్రధాన కారణం.

సింగిల్‌గా ఉండేవాళ్లు కుటుంబానికంటే స్నేహితులతోటే ఎక్కువ కాలం గడుపుతుంటారని అధ్యయునాలు తెలుపుతున్నారు. ఒకసారి పెళ్లయితే, సీన్ రివర్సవుతుంది. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, స్నేహితులతో తక్కువ టైమ్ గడిపి, ఇంట్లోవాళ్లతో ఎక్కువసేపు గడుపుతాం. వివాహమనే కంచె ఏర్పాటైన తర్వాత నుంచీ, మనం స్థానికంగా ఉన్నా, ఇంకెక్కిడికైనా వెళ్లినా స్నేహ బంధాల్ని మునుపటిలా కొనసాగించడం కష్టమవుతుంది.
పెళ్లరుున కొద్ది సంవత్సరాల వరకూ చాలా మంది దంపతులకు ఇలాంటి స్థితే ఎదురవుతుంది. ఒకర్ని మనం పెళ్లాడామంటే, మన జీవిత భాగస్వామితోటే ఎక్కువ సమయుం గడపాలని కోరుకుంటాం. హనీమూన్ కాలం గడిచి, దాంపత్యంలోని కొత్తదనం పోయి, వాస్తవ లోకంలోకి వచ్చినాక, పెళ్లికి ముందు మనం ఎవరితో మంచి అనుబంధాలు నెలకొల్పుకొని ఉన్నామో, ఆ వ్యక్తులతో అనుబంధం కొనసాగించడం ఎంత ముఖ్యమో తెలిసి వస్తుంది. వైవాహిక బంధం కఠినంగా అనిపించినప్పుడు మాత్రమే చాలా మంది ఇతరుల సహాయుం కోసం ఎదురు చూస్తుంటారు. నిజానికి పెళ్లికి ముందు మనకి స్నేహితులు ఎంత ముఖ్యమో, తర్వాత కూడా వాళ్లు అంతే ముఖ్యమని మనం గుర్తించాలి. యువతీ యువకులు పెళ్లి చేసుకున్నాక, కొన్ని నెలల వరకు ఒకరిపై ఒకరు ఎక్కువ ఫోకస్ పెట్టడం సాధారణమే. అలాగే మునుపటి స్నేహితులతో గడపడం బాగా తగ్గిపోతుంది. ఇది మనం ఉద్దేశపూర్వకంగా చేయుకపోయినప్పటికీ, ఒక గీత ఏదో మనల్ని స్నేహితుల నుంచి దూరం చేస్తుంది.

ఘర్షణ వద్దు
ఒక చిన్న నిజాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెళ్లయ్యూక మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిస్థితులు మారతారు.image అవే కాదు, మనం కూడా మారతాం. జీవితంలో అనేక అంశాలు మారిపోయూక, పరిస్థితులు ఇదివరకు మాదిరిగానే ఉండాలని ఆశిస్తే, అది సాధ్యం కాదు. తమ అనుబంధం వెలుపల స్నేహం విషయూనికి వచ్చేసరికి దంపతులు తరచూ ఒత్తిడికి గురవుతుంటారు. సోషల్‌గా ఉండాలనే ఉద్దేశంతో దంపతుల్లో ఒకరు ఇతరులతో కలవాలనీ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలనీ భావిస్తే, మరొకరు అలాంటివాటికి దూరంగా ఉండి, తమతో సమయూన్ని గడపాలని ఆశిస్తారు. దీంతో ఇద్దరి మధ్యా ఘర్షణ తలెత్తుతుంది. అందుకని పరస్పరం తమలోని వైరుధ్యాల్ని అర్ధం చేసుకుంటూ, తమ అనుబంధంలోని స్నేహాన్ని మెరుగుపర్చుకుంటూ, ఇతరులతో స్నేహాల్ని వృద్ధి చేసుకోవాలి.

మీ సమయాన్నంతా జీవిత భాగస్వామికే కేటాయిస్తూ, మీరు ఇతరులతో సంభాషించేటప్పుడు కూడా మీ భాగస్వామి కేంద్రంగానే మాట్లాడుతుంటే, మీరు మీ సొంత అస్తిత్వాన్ని కోల్పోతున్నారని అర్థం. మిమ్మల్ని ప్రేమించే స్నేహితుల్ని పెళ్లయ్యూక విస్మరించడం సరైన పని కాదు. అలాగే వాళ్లతో ఉన్నప్పుడు మీ భాగస్వామి గురించే ముగింపులేకుండా మాట్లాడుతూ వాళ్లను ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు.

రెండు దశాబ్దాల వైవాహిక బంధాన్ని పూర్తి చేసుకున్న ఓ జంట, ఈ ఏడాదే వేసవిలో పెళ్లిపేరుతో ఒక్కటైన ఇంకో జంట.. రెండు భిన్న తరాల ప్రతినిధులు.. పెళ్లయ్యాక తమ జీవితంలో కలిగిన మార్పుల గురించి ఏం చెబుతున్నారో చూద్దాం...


పాత స్నేహితులు కలుస్తున్నారు
imageమా పెళ్లయి దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచాయి. పెళ్లవగానే స్వతంత్రం కోల్పోతామని అంటుంటారు చాలామంది. కానీ పెళ్లికి మునుపు పుట్టింటిలో చాలా క్రమశిక్షణ అమలుకావడంతో, వివాహం తరువాతే నాకు రెక్కలొచ్చాయి. పెళ్లి తరువాత రెండు పీజీలు, బీఈడీ చేసి చదువుకోవాలనే కోరిక తీర్చుకున్నాను. స్నేహితులతో హాయిగా కలిసేదాన్ని. ఆ తరువాత అందరు పిల్లల పెంపకం, జీవితంలో కుదురుకోవడంలో తలమునకలవడంతో కలవడం తగ్గింది. ఇప్పుడు పిల్లలు పెరిగి పెద్దవాళ్లయి, అంతర్జాలం పుణ్యమా అని అందరితో సమయం గడపడానికి, మాట్లాడుకోవడానికి తీరిక చిక్కింది. ఇక అత్తగారింట్లో ఉమ్మడికుటుంబం కావడంతో అందరితో బాగా కలిసిపోయి తిరిగి మెప్పించడం కత్తి మీద సామే. నేను ఎవరు ఏమన్నా మౌనంగానే ఉంటూ అందరినీ నా నడవడికతో మెప్పించాను. వారి కుటుంబ సభ్యులతో బావుంటే, భర్తకు కూడా ఆనందమే కదా. అలా మావారి మనసు గెలుచుకున్నాను. ఇప్పుడు మాత్రం మావారి వైపు వారందరూ ఏ సమస్య వచ్చినా నా దగ్గరకే సహాయం కోసం పరుగెత్తుకుని వస్తారు. అలాగని పుట్టింటి వారినీ అశ్రద్ధ చెయ్యకుండా, వారికి కూడా అండదండగా నిలిచాను. మావారు కూడా నా వైపు వారిని తన వారిలాగే అభిమానించడం, వారి బాధ్యతలను ఆయన కూడా స్వీకరించడం వల్ల మా సంసారపునౌక ప్రశాంతంగా సాగింది. వివాహం తరువాత మరో ఇంట్లో అడుగు మోపినపుడు అక్కడ పరిచయం లేని వారి అలవాట్లకి, అభిరుచులకి, మన ఇష్టాలకి తప్పకుండా తేడా ఉండకుండా పోదు. అలాంటప్పుడు వారికి నచ్చనివి కొన్ని వదులుకుంటూ, మన ఇష్టాయిష్టాలను కొన్ని నెమ్మదిగా వివరిస్తే వారు కూడా మనకు అనుకూలంగా మారిపోతారు. ఇప్పుడు పిల్లలు పెద్దయిపోయి చదువులలో ఉద్యోగాలలో వారు బిజీ అయిపోయాక, ఇప్పుడు మళ్లీ పాత స్నేహితులను కలవడానికి తీరిక దొరికింది. ఎవరు ఊర్లోకి వచ్చినా అందరం కలిసి కాసేపు కష్టసుఖాలు కలబోసుకుంటూ ఆనందంగా గడుపుతాం. ఈ వయసులో ఇప్పుడు మానసిక పరిపక్వత వచ్చింది కాబట్టి, పిల్లలకు మా జీవితానుభవాలను వివరిస్తూ, వారి చదువుల విషయంలోనే కాక  మిగిలిన అన్ని విషయాలలో చిన్ననాటి స్నేహితుల సలహాలు, సూచనలు తీసుకుని ధైర్యంగా ముందుకు వెడుతున్నాం.

- ఆర్. పద్మావతి

ఒకరిళ్లకు ఒకరం వెళ్తుంటాం
imageపద్మావతి మా ఇంట్లోకి వచ్చాక కొంచం అవస్థలు పడినా, అన్నీ సహనంతో భరించింది. నా వాళ్లని తన వారిలాగే ఆదరించేది. మా పెద్దన్నయ్య పోవడంతో, ఆ పిల్లలకు కూడా తనే అమ్మగా మారి, వారి బాధ్యతలను తన నెత్తిన వేసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లింది. వారి చదువులు, పెళ్లిళ్లు కూడా తన చేతుల మీదే సాగాయి. ఏ పని చేసిన ఇద్దరమూ చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం. స్నేహితులలో ముందు నాకే పెళ్లి కావడంతో, కొత్తల్లో వాళ్లతో తిరిగి ఆలస్యంగా ఇంటికి వచ్చినా తను ఏమి అనేది కాదు. ఆ తరువాత ఇక అన్నిటికి స్వస్తి చెప్పి, బాధ్యతతో నేను ముందుకు సాగాను. తను ఎవరిని పల్లెత్తు మాట అనేది కాదు. ఎవరైనా ఏమైనా అన్నా మౌనంగా ఊరుకునేది. ఆ తరువాత తనను ఇంట్లో అందరు ఇష్టపడుతూ వచ్చారనే కన్నా తన ప్రవర్తనతో వారిని ఆకట్టుకుందని చెప్పొచ్చు. అన్నయ్య పిల్లలే కాక, అమ్మానాన్నలు కూడా తన మాటకు విలువ ఇచ్చేవారు. ఒకరకంగా మగవాళ్లకు వివాహం తరువాత తమ అలవాట్లను మార్చుకోవలసిన పని ఉండదు. ఎందుకంటే తమ ఇంట్లో తాము ఉంటారు కాబట్టి. కాని అమ్మాయిలు కొత్త ప్రదేశంలో కొత్త మనుషులతో సర్దుకుపోతూ, వారికి తగ్గట్టు తాము మారడం కాస్త కష్టంతో కూడుకున్న విషయమే. ఇక ఉమ్మడి కుటుంబం అయితే మరీ శ్రమ అయిపోతుంది. తనే ముందుకు వచ్చి అన్నీ సమర్థవంతంగా నిర్వహించేది. ఎవరయినా ఒక మాట అన్నా తను తిరిగి జవాబు చెప్పేది కాదు. అలాగని నాకు కూడా ఫిర్యాదు చేసేది కాదు. అందుకే సుమారు ఇరవై ఏళ్ల మా ప్రయాణం ఏ పొరపొచ్చాలు లేకుండా హాయిగా సాగిపోయింది. అలాగే నా భార్య వైపు కుటుంబాన్ని కూడా నా బాధ్యతే అనుకుని, నేనే వారికి కొడుకులా మెలిగాను. పెళ్లంటే రెండు కుటుంబాల కలయికే కదా.
ఇక ఇప్పుడు ఈ వయసులో పిల్లలు పెద్దవాళ్లయిపోయాక కాస్త ఊపిరిపీల్చుకునే తీరిక చిక్కి, చిన్ననాటి నేస్తాలతో కబుర్లు కలబోసుకుంటూ, వినోదాలలో, వేడుకలలో కాసేపు సేద తీరుతుంటే జీవితాన్ని ఈదిన అలసట తీరుతుంటుంది. స్నేహితుల కుటుంబాలన్నీ కలిసి ఈ మధ్యనే తిరుపతి వెళ్లి నాలుగు రోజులు గడిపి దర్శనం చేసుకుని వచ్చాం. ఖాళీ దొరికితే చాలు ఒకరింటికి ఒకరు వెడుతుంటాం. లేకపోతే ఫోన్‌లోనైనా తప్పక రోజూ పలకరించుకుంటాం. 
- ఆర్. ప్రసాద్

నేనే మహారాణిని
imageఈ మేలోనే మా పెళ్లయింది. పెళ్లికి ముందు స్నేహితుల్ని ఫ్రీక్వెంట్‌గా కలుసుకునేదాన్ని. ఎక్కడికి వెళ్లాలంటే అక్కడికి వెళ్లేదాన్ని. చదువు తర్వాత వాళ్లకూ పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో కలవడం తగ్గిపోయింది. అందువల్ల ఫ్రెండ్స్‌ని కలవలేకపోతున్నాననే కంప్లయింట్స్ లేవు నాకు. ఇప్పుడు పెళ్లయ్యాక హైదరాబాద్ నుంచి వారు సింగ్రావ్‌లీ జిల్లా, మధ్యప్రదేశ్ కు రావాల్సి వచ్చింది. అక్కడ్నుంచి సగం రోజు ప్రయూణం. ఇక్కడి రిలయన్స్ పవర్ ప్లాంట్‌లో మావారు ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తెలియని ప్రదేశం, తెలియని మనుషులు. అంతా కొత్త. పైగా ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లెమ్. ఇక్కడింకా నాకెవరూ ఫ్రెండ్స్ కాలేదు. చుట్టుపక్కల తెలుగువాళ్లు ఉన్నా, ఇంకా సరిగా పరిచయం కాలేదు. హైదరాబాద్‌లో అయితే ఒక్కదాన్నే స్కూటర్ మీద ఎక్కడికైనా వెళ్లిపోయేదాన్ని. కిశోర్ డ్యూటీకి వెళ్తే ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నా. ఇంటి పనులు చూసుకుంటూ, పీహెచ్‌డీకి సంబంధించిన వర్క్ ప్లాన్ చేసుకుంటున్నా. ఎంఫార్మసీ చేశాను కాబట్టి, ఆ సబ్జెక్టులోనే పీహెచ్‌డీకి ప్రయత్నిస్తున్నా. తను కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మానాన్నలు చాలా దూరంగా ఉండటం తలచుకుంటుంటే బాధగా అనిపిస్తోంది. కానీ ఉండక తప్పదు. బాధను అణచుకుంటున్నా. కాపురానికి వచ్చేటప్పుడు అమ్మావాళ్లు ఏడవలేదు కానీ నేను మాత్రం తెగ ఏడ్చేశాను. అమ్మానాన్నలకు, తమ్ముడికి దూరమైపోతున్నాననే ఫీలింగ్ వచ్చేసింది. 
ఇప్పుడు ప్రయూరిటీలు పూర్తిగా మారిపోయాయి. పెళ్లయ్యాక అమ్మానాన్నల కంటే అత్తామామలకే మెుదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నిజానికి మా అత్తయ్యవాళ్లు నన్ను కూతురిలా చూసుకుంటున్నారు. చాలా విలువ ఇస్తున్నారు. వాళ్లింట్లోనూ మా ఇంట్లో ఉన్నంత ఫ్రీగానే ఉండగలిగాను. కిశోర్ నన్ను కష్టపెట్టకూడదన్నట్లుగా మసలుకుంటుంటారు. మా వాళ్లందర్నీ వదిలి చాలా దూరం తన వద్దకు వచ్చానని బాగా చూసుకుంటారు. నాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. మా అమ్మానాన్నల్ని బాగా గౌరవిస్తారు. కిశోర్ సోషల్ యూక్టివిటీస్ కూడా చేస్తున్నారు. పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నారు. సాధారణంగా పెళ్లరుున అమ్మారుులు అత్తవారింటికి వెళ్లాక, అమ్మకు ఫోన్ చేసి అత్తవాళ్ల మీద ఫిర్యాదులు చేస్తుంటారు. దీనివల్ల రెండు కుటుంబాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుండటం చాలానే గమనిస్తున్నా. వాటి నుంచి నేను నేర్చుకున్నది.. అక్కడి విషయాలు ఇక్కడా, ఇక్కడి విషయాలు అక్కడా చెప్పకూడదని. అయితే మా అత్తయ్యవాళ్లింట్లో ఇప్పటివరకూ నాకెలాంటి నెగటివ్ విషయాలు కనిపించలేదు. ఇక్కడ మంంచి పని ఏం చేసినా అడ్డు చెప్పేవాళ్లెరూ లేరు. ఇక్కడ నేనే మహారాణిని అన్నట్లుగా ఉంది.
- నాగరేవతి

త్వరగా కలిసిపోయింది
imageమెుదట్నించీ నాకు ఒంటరితనం అలవాటు. స్కూలు రోజుల నుంచీ నేను హాస్టల్‌లో ఉండి చదువుకున్నా. పాలిటెక్నిక్, బీటెక్, ఎంబీఏ చదివి రిలయున్స్ పవర్ ప్లాంట్‌లో ఆపరేషనల్ మేనేజర్‌గా చేస్తున్నా. మరోవైపు డిస్టెన్స్‌లో ఎంటెక్ చేస్తున్నా. ఇస్కాన్ ఫాలోయుర్‌ని. చదువుకు నాన్న నుంచి ఆర్థిక సాయుం తీసుకున్నానే కానీ, ఇండివిడ్యువల్‌గానే ఎదుగుతూ వచ్చా. ఎక్కువ కాలం అమ్మానాన్నలకు దూరంగా ఉండటం వల్ల వాళ్లతో అటాచ్‌మెంట్ తక్కువనే చెప్పాలి. ఫ్రెండ్స్ అరుుతే ఎక్కువే ఉన్నారు. వాళ్లలో ఎక్కువమంది చత్తీస్‌గఢ్ ఏరియాకు చెందినవాళ్లు. అయితే మెుదట్నించీ బయుటకు వెళ్లి తిరగడం తక్కువే నాకు.
బిలాస్‌పూర్‌లో చదువుకునే రోజుల్లో ఒక ఫ్రెండ్ ఇస్కాన్‌కు తీసుకెళ్లాడు. ఆ భావాలు, ఆ వాతావరణం నాకు నచ్చాయి. తర్వాత కోల్‌కతాలోని మాయూపూర్‌లో ఉన్న ఇస్కాన్ ఆశ్రమంలో కొద్ది రోజులు గడిపొచ్చాను. అందువల్ల పెళ్లయితే వచ్చినవాళ్లు నన్నెలా అర్థం చేసుకుంటారోననే చిన్న ఆందోళన ఉండేది. రేవతి నా జీవితంలోకి వచ్చాక అది అర్థం లేనిదనిపించింది. నేను ఊహించిన దానికన్నా నన్ను బాగా అర్థం చేసుకుంది. ఇప్పుడు నాకూ ఒక ఫ్యామిలీ ఉందనే ధైర్యం వచ్చింది. ఇద్దరం కలిసి యోగా, మెడిటేషన్ చేస్తున్నాం. నేను నా జపం గురించి చెబుతుంటే, తన మెడిటేషన్ టెక్నిక్స్ నాకు నేర్పిస్తుంటుంది. నా ఫ్రెండ్స్‌ను తను గౌరవించడం నాకు నచ్చింది. అమెరికాలో ఉంటున్న తన ఫ్రెండ్స్ ఎవరైనా అర్ధరాత్రుళ్లు ఫోన్ చేస్తుంటారు. తను మళ్లీ మాట్లాడతానని ఫోన్ పెట్టేస్తుంది, నాకు డిస్టర్బెన్స్‌గా ఉండకూడదని. నేను ఫర్వాలేదు, మాట్లాడమన్నా.. ఇప్పుడు కాదులే, పొద్దున్నే మాట్లాడతానని నవ్వేస్తుంది. 
తను మా అమ్మానాన్నలను బాగా గౌరవిస్తుంది. వాళ్లకు తనమీద మంచి నమ్మకం ఏర్పడింది. మంచి కోడలు వచ్చిందని హ్యాపీగా ఉన్నారు. మాది గుంటూరు జిల్లా దాచేపల్లి అయినా మా నాన్న ఉద్యోగరీత్యా నేను పుట్టినప్పట్నించీ ఆంధ్రాలో కాకుండా చత్తీస్‌గఢ్‌లోనే పెరిగాను, చదివాను. అందువల్ల మనవాళ్ల ఆచార వ్యవహారాలు అంతగా తెలీదు. రేవతి ఎలా సర్దుకుపోతుందో అనుకున్నా కానీ, తను చాలా త్వరగా కలిసిపోయింది. తన వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా.
- కిశోర్ తేజస్విప్రపంచాన్ని చుట్టేద్దాం!

Updated By ManamSun, 09/23/2018 - 07:46

పది సంవత్సరాల క్రితం డెన్నిస్ టిటో అనే యు.ఎస్. బహుళ మిలియనీర్ ప్రపంచ మొట్టమొదటి స్పేస్ పర్యాటకాన్ని ఆవిష్కరించాడు. ఉత్సుకతతో అంతరిక్షంలో ఎనిమిది రోజుల యాత్ర చేసి పర్యాటకాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధికి నోచుకొనేట్టుగా చేశాడు. తిరిగి భూమికి రావడం అద్భుత విజయంగా భావించి, ఆయన ‘‘నేను స్వర్గం నుంచి తిరిగివచ్చాను!’’ అనడం ప్రపంచ యాత్రికుల్లో మరింత జిజ్ఞాసను రేపింది. ఇటీవల ప్రముఖ అంతరిక్ష స్పేస్ ఎక్స్ అనే సంస్థ చందమామ చుట్టూ పర్యాటకులను తిప్పేందుకు ఒక ప్రాజెక్టును చేపట్టింది. జపాన్‌కు చెందిన బిలియనీర్ యుసాకు మేజావాకు చంద్రునిమీద యాత్ర చేసేందుకు అద్భుత అవకాశమివ్వడం ప్రపంచ పర్యాటకంలో మరో మలుపుగా పేర్కొనాలి.

image


యాత్ర, పర్యటన, దేశ సంచారం అనేవి పర్యాయ పదాలు. మనిషి జిజ్ఞాస మేరకు పర్యటన చేసినా విజ్ఞానం, 
లోక జ్ఞానం కోసమేననేదే పరమార్థంగా చెప్పాలి. యాత్రలో వివిధ దేశాల దర్శనం, పవిత్ర తీర్థాల, పుణ్య క్షేత్రాల దర్శనంతో పాటు చారిత్రిక వారసత్వ కట్టడాల దర్శనం మనిషికి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. భూయానం, సముద్రయానం, ఆకాశయానం పర్యటనలో ప్రధానమైన మార్గాలు.

పర్యటన వల్ల ప్రపంచ భాషలు, జాతీయంగా వివిధ రాష్ట్రాల భాషలు, సంస్కృతులు, చరిత్రలు తెలిసి వస్తాయి. మానవీయ బంధాలు పెంపొందించుకోడానికీ, విజ్ఞాన శాస్త్రం వృద్ధి చెందడానికీ చక్కని అవకాశాలు కలుగుతాయి. బౌద్ధ సన్యాసి ఫాహియాన్.. రెండో చంద్రగుప్తుని కాలంలో (క్రీ.పూ. 339) చీనా నుండి కాలినడకన భారత దేశం వచ్చినట్టుగా చరిత్ర చెప్తోంది. సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక విషయాలే కాకుండా, విజ్ఞానం, కళలు, వ్యక్తిగత లేదా వ్యాపార పరమైన ప్రయోజనాల కోసం సాధారణ పర్యావరణం దాటి దేశ విదేశాలలోని దర్శనీయ స్థలాలకు ప్రజలు  యాత్రగా వెళ్లడంగానే దీన్ని నిర్వచించాలి. ఐతే, పర్యాటకం యావత్తూ పర్యావరణంపై ఆధారపడుతుందనే విషయం గుర్తించుకోవాలి.  

image


చారిత్రక నేపథ్యం
పర్యాటక రంగం మూలాలు మూడు శతాబ్దాల క్రితం కెనడాలో కనిపిస్తున్నాయి. పర్యాటక చరిత్రలో, ఇది ‘పరిచయ దశ’ను సూచిస్తుంది. 1778లో, కెప్టెన్ జేమ్స్ కుక్ వాంకోవర్ ద్వీపంలో మునిగిపోయాడు. తర్వాత 1842లో జేమ్స్ డగ్లస్, హడ్సన్‌కు చెందిన బే కంపెనీకి కొత్త ప్రధాన కార్యాలయాన్ని వెతకటానికి పంపిన ఒక బ్రిటీష్ ఏజెంట్, చివరకు విక్టోరియాను ఎంచుకున్నాడు. 1892 నాటికి కెనడియన్ అయిన బ్రూస్టర్స్ వంటి ఔత్సాహికులు మొట్టమొదటి టూర్ నిర్వాహకులుగా మారడంతో పర్యాటక సంస్కృతి మొదలయింది. బాన్స్ నేషనల్ పార్క్ వంటి ప్రాంతాల్లో ప్రముఖులకు ఆతిథ్యమివ్వడం ద్వారా రవాణా అభివృద్ధి జరిగి కెనడా అంతటా ఉన్న కమ్యూనిటీలు తమ సొంత మార్కెటింగ్ వ్యూహాలను అభివృద్ధి చేశాయి. ఉదాహరణకు, క్యుబెక్‌లో ఉన్న మైసన్నేవ్ పట్టణాన్ని 1907 నుంచి 1915 వరకు ‘లీ పిట్స్‌బర్గ్ డ్యువా కెనడా’ అని పిలిచే ఒక ప్రచారం ప్రారంభమైంది. పర్యాటక రంగం ప్రారంభంలో మిన్నెసోట టెన్ థౌజండ్ లేక్స్ అసోసియేషన్ పాత్రను విస్మరించరాదు. మిన్నెసోటా ప్రజలు 1900 ప్రాంతంలో అక్కడి సరస్సు ప్రాంతాన్ని పర్యాటక వనరుగా గుర్తించడం ప్రారంభించారు. 1920వ దశకంలో ప్రభుత్వ ఏజెన్సీలు మిన్నెసోటాకు పర్యాటకులను తీసుకురావడం ప్రారంభించాయి. ఇల్లినాయిస్ నుంచి పర్యాటకుల రవాణాకు 1927లోనే విదేశీ కార్ల అవసరం ఏర్పడింది. గవర్నర్  క్రిస్టెన్సన్, టెన్ థౌజండ్ లేక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోనా రాబర్ట్స్ మే తొలి వారాన్ని పది వేల లేక్స్ వీక్‌గా ప్రకటించాడు. మిన్నెసోటాలో ఉన్న కమ్యూనిటీలు ఆ ప్రాంతాన్ని ప్రపంచ ప్రజలను ఆకర్షించే విధంగా అభివృద్ధి పరిచారు.  

ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటీవో) ఆధ్వర్యంలో 1920లో ది హాగ్ (నెదర్లాండ్స్)లో అధికారిక ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. ‘యానల్స్ ఆఫ్ టూరిజం రీసెర్చ్’ జర్నల్ ప్రారంభ సంచికల నుంచి వచ్చిన కొన్ని కథనాల ప్రభావంతో ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యుఎన్‌డబ్ల్యుటీవో) అధికారిక పర్యాటక ప్రచార సంస్థల ఇంటర్నేషనల్ యూనియన్ (ఐయూఓటీపీఓ) నుంచి ఉద్భవించింది. ఇప్పటి వరకు జరిగింది పర్యాటక ప్రారంభ దశగానే పేర్కొనాలి. 


1935 నాటికి క్యుబెక్ రాష్ట్రం.. ఒంటారియో, న్యూ బ్రూన్స్‌విక్, నోవా స్కోటియా ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, ప్రాంతీయ పర్యాటక బ్యూరోలు అస్థిత్వంలోకి వచ్చాయి. 1937లో, పర్యాటక రంగాన్ని పెంచే లక్ష్యంతో ప్రత్యేక చట్టం ద్వారా ప్రాంతీయ బ్యూరో ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిస్ట్ డెవలప్ మెంట్ (బీఐటీడీ) ఏర్పడింది. 1938 నాటికి ఈ సంస్థ తన పేరును బ్రిటిష్ కొలంబియా గవర్నమెంట్ ట్రావెల్ బ్యూరో (బీసీజీటీబీ)గా మార్చింది. నూతన ఇంటర్ గవర్నమెంట్ టూరిజం సంస్థ స్థాపన ఆధారంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో 1970లో ఒక తీర్మానం చేసింది. ఆ తీర్మానం ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ అఫిషియల్ ట్రావెల్ ఆర్గనైజేషన్ (ఐయూఓటీఏ) జనరల్ అసెంబ్లీ ప్రపంచ పర్యాటక సంస్థ (డబ్ల్యుటీవో) ఏర్పాటుకు అనుకూలంగా ఉంది. ఆ శాసనాల ఆధారంగా సూచించిన ప్రకారం 51 రాష్ట్రాలు ఆమోదించడంతో అది (డబ్ల్యుటీవో) 1974 నవంబరు 1న అమలులోకి వచ్చింది.  

ప్రపంచ వ్యాప్తం 
పదకొండు వందల సంవత్సరాల క్రితమే పర్యాటక రంగం ప్రారంభమై అనతికాలంలోనే 51 దేశాలలో విస్తరించి, ఆ దేశాలను అభివృద్ధి దశలోకి నెట్టింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో వెలసిన ప్రపంచ పర్యాటక సంస్థ 1970లో పర్యాటక రంగాన్ని గుర్తించినప్పటికీ, 1980వ సంవత్సరం సెప్టెంబర్ 27న పర్యాటక దినోత్సవాన్ని జరిపింది. అప్పటి నుంచి అన్ని దేశాలు ఈ పర్యాటక దినాన్ని అధికారికంగా జరుపుకుంటూనే వస్తున్నాయి. ఈ విధంగా జరుపుకోవడం వల్ల ప్రపంచ ప్రజలు చైతన్యవంతులై అభివృద్ధి పథంలో నడుస్తారని అది ఆశించింది. సంస్థ ముఖ్య కార్యదర్శి జురబ్ పోలోలికాష్‌విలి నేతృత్వంలో ప్రత్యేక ఏజెన్సీ ద్వారా పర్యాటకాన్ని ప్రపంచంలో, అందులో భారతదేశంలో అభివృద్ధి చేస్తున్నారు.

ఇరవయ్యో శతాబ్దం అర్ధ భాగంలో కొన్ని దేశాల సహకారంతో అమెరికా ప్రపంచ పర్యాటకంలో నూతన విప్లవాన్ని తెచ్చింది. భారత్, ఫ్రాన్స్, బ్రెజిల్, వెనిజులా, టర్కీ, సిరియా దేశాలతో కలిసి, ప్రపంచ పర్యాటక కేంద్రాన్ని రాజధాని నగరం న్యూయార్క్‌లో నెలకొల్పింది. దానికి ఆంటోని గట్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైనారు. స్వల్ప కాలంలోనే కాలిఫోర్నియా, శాన్ ప్రాన్సిస్కో పట్టణాల్లో 1945 జూలై 24న ప్రపంచ పర్యాటక దినాన్ని జరిపి ప్రపంచ దేశాలను ఆకర్షించింది.  

భారతదేశంలో పర్యాటకం
భారతదేశంలో సింధులోయ ప్రాచీన నాగరికతకు చిహ్నంగా నిలుస్తోంది. భారతదేశం పర్యాటకానికి అది పురాతన సంప్రదాయంగా మిగిలింది. గంగ, యమున, సరస్వతి లాంటి పుణ్యనదులు ప్రవహించే ఈ భూమిలో దేశ విదేశాల యాత్రికులను ఆకర్షించే అపురూప దర్శనీయ స్థలాలు, చారిత్రక ప్రదేశాలు, దివ్య క్షేత్రాలు అనేకం ఉన్నాయి. 
ఆధునిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న భారతదేశాన్ని సందర్శించే విదేశీయుల ద్వారా పర్యాటకం పరిఢవిల్లుతోంది. బంగ్లాదేశ్ నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువ. లండన్, కెనడా, ఆమెరికా నుంచి ఐదు లక్షల మంది యాత్రికులు ఏటా భారత దేశాన్ని సందర్శించి వెళ్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా, మొన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ఇక్కడి చారిత్రక కట్టడాలైన గోల్కొండ కోటను, ఫలకనామాను దర్శించి వెళ్లారు.  

image


ప్రపంచంలో అత్యంత అధిక జనసాంద్రత కలిగిన భారతదేశంలో వైవిధ్యమైన సంస్కృతి కలిగిన 29 రాష్ట్రాలు ఉన్నాయి. భారతీయ సంస్కృతుల సమ్మేళనంతో అలరారే భారత ఉపఖండం అనేక వేల సంవత్సరాల ప్రాచీన చరిత్ర చేత ప్రభావితమైంది. భారతీయ సంస్కృతి ధార్మిక మతాల వల్ల బాగా ప్రభావం పొంది పరిపూర్ణమైంది. దానితో ఇక్కడ భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, వాస్తుశిల్పం, సంగీతం, కళలు ఎంతగానో అభివృద్ధి చెందాయి. భారతదేశం భౌగోళికంగాను, సాంస్కృతికంగాను నమ్మశక్యం కాని వైవిధ్యంతో కూడుకొని ఉన్న దేశం. కశ్మీర్‌లో మంచుతో కప్పబడిన హిల్ ఘాట్లు మొదలుకొని కన్యాకుమారి సముద్ర తీరాల వరకు ఈ భూమిలో పర్యాటకం ఒక పరిశ్రమగా విస్తరించింది. జీవ నదులు, గుహలు, సరస్సులు దేశానికి అలంకారాలుగా అలరారుతూ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి.  

శిల్ప కళాఖండాలు
శిల్పకళా శోభితమైన మొహంజొదారో, హరప్పా శిల్పాలు, ఎల్లోరా గుహలు, దేవాలయాలు, దివ్యమందిరాలు భారతదేశ కళా నైపుణ్యతలకు నిదర్శనాలు. అవి మన ప్రాచీన శిల్పకళా కౌశలాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. బౌద్ధంనాటి ఎల్లోరా శిల్పకళను గమనిస్తే ఆనాటి శిల్పకళపై గాంధార శిల్పకళ ప్రభావం కనిపిస్తున్నది. సాంచీ, నాసిక్, ఉదయగిరిలలో బౌద్ధ శిలాప్రతిమలను మలచారు. గయను చీనా యాత్రికులు, ఇండోనేషియా, శ్రీలంక దేశాల బౌద్ధ భిక్షువులు సందర్శించి నూతనోత్సవాన్ని పొందుతారు. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు, ఇక్ష్వాకులు కూడా అమరావతిలోని నాగార్జున కొండమీద, పాణిగిరిలో మహా చైత్యాలను నిర్మించారు. 

image


చందేలా రాజుల కాలంలో ఖజురహో శిల్పాలయం వెలసింది. లైంగిక శాస్త్రాలను శిల్పాలుగా చెక్కి, ఓ అపురూప కళా ఖండంగా మెరుగులు దిద్దుకుంది ఖజురహో.  పామరులకు గుప్త జ్ఞానం సంప్రాప్తించేట్టుగా సృజనకారులైన శిల్పులు చెక్కడం అద్భుతమనిపిస్తుంది. వేల సంవత్సరాలైనా అవి చెక్కు చెదరక పోవడం ఆశ్చర్యమేస్తుంది. పల్లవ రాజుల కాలంలో మహాబలిపురంలో చెక్కించిన పాండవుల రథాలలో, చాళుక్యుల కాలంలో కన్నడ దేశంలో నిర్మించిన హోసలేశ్వర దేవాలయంలో హిందూ శిల్పకళ ఉట్టి పడుతుంది. ఆరవ శతాబ్దంలో తెలంగాణలోని ఆలంపురంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ద్రాక్షారామంలో ఇతిహాసపూరిత శిల్పాలు వెలిశాయి. కాకతీయుల శిల్పకళ, పానుగల్లునేలిన కాండూరి చోళుల శిల్పకళలు తెలంగాణకే అందాల్ని తెచ్చిపెట్టాయి. 15వ శతాబ్ది నాటికి విజయనగర రాజులు నిర్మించిన హంపి, లేపాక్షి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, సింహాచల ఆలయాలను చూస్తే శిల్పకళ ఆనాటికి అభివృద్ధి చెందిందని తెలుస్తుంది. కన్ను గ్రహించినట్టుగా, స్పర్శ అనుభవించినట్టుగా అవి రూపొందాయి. కాకతీయ కళా వైభవానికి ప్రతీక తెలంగాణలోని వేయి స్తంభాల ఈశ్వరాలయం. రుద్రదేవుని కాలంలో వెలసిన ఈ శిల్ప కళాఖండంలో చాళుక్య వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది. దీని ప్రభావంతో జనగాం సమీపంలోని నిడిగొండలో అర్ధ వేయి స్తంభాల ఈశ్వరాలయం వెలయడం కాకతీయ కళా విశిష్టతను చాటేదే.

చిత్రకళలు
అలంకారికులు పేర్కొన్న లలితకళల్లో సృజనాత్మకమైన కళ చిత్రకళ. ప్రపంచంలో ఉన్న గుహల్లో ప్రాచీన ఇతిహాస కథలను చిత్రించి తన నైపుణ్యాలను చాటుకొన్నారు చిత్ర కళాకారులు. అల్టామీరా గుహల్లో చిత్రించిన తరహాలోనే భారతదేశ చిత్రకళావిర్భావం జరిగింది. అది జాతి ప్రజల సాంస్కృతిక విలువలను అభివ్యక్తం చేసే చిత్రకళగా రూపాంతరం చెందింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చిత్రకారులు పికాసో, రవివర్మ చిత్రకళ అందాలు ఆస్వాదించని యాత్రికులు తక్కువే. కళా చరిత్రకే అవి గుర్తింపు తెచ్చాయి. ప్రపంచంలోనే మహోన్నతమైన శిల్పకళకు ఆలవాలం అజంతా గుహలోని చిత్రకళ ఆలయం.  

పూర్వం రాజ ప్రాసాదాల్లో, వేశ్యావాటికల్లో, సామంతుల, జమీందార్ల, సంపన్నుల గృహాల్లో చిత్ర శాలలుండేవి. దేశంలోని అనేక రాజాశ్రయాలలో చిత్రకారులుండే వారంటే ఆ కళా వైభవాలెట్లా ఉండేవో ఊహించుకోవచ్చు. అంతేగాదు.. ఇక్కడ గుహ, కుడ్య చిత్రాలు క్రీ.పూ. 200 సంవత్సరాలలో ఆవిర్భవించినవని చెప్పాలి. బౌద్ధం ప్రభావంతో వచ్చింది చిత్రకళ అయితే, జైన ప్రభావంతో వచ్చింది ఘుర్జరి కళ. రాజస్థాన్ కళలో రాగము-రాగిణి రాజపుత్రుల జీవితాలకు అద్దం పట్టాయి. అక్బర్ కాలంలో స్థానికత కలిగిన పర్షియన్-ఖలం చిత్రకళ వెలసింది. మొగల్ కాలంలో పోర్ట్రెయిట్ పెయింటింగ్ అభివృద్ధి చెందింది. అలాగే ఔరంగజేబు కాలంలో వచ్చిన లిపి-కళ, మొగల్ చిత్రకళ, పర్షియన్ హిందూ రీతుల సమ్మేళనంతో,  యూరోపియన్ ప్రభావంతో మినియేచర్ చిత్రాలు పుట్టుకొచ్చాయి. ఓరుగల్ మార్చలాదేవి చిత్రాలయం, పిల్లలమఱ్ఱి చిత్రకళా క్షేత్రం, లేపాక్షి కుడ్య చిత్రాలు, కేరళ తిరువనంతపురం, కలిమానూర్ జమీందారీ కళాలయాలు ప్రసిద్ధి పొందాయి.   

ప్రపంచ జలపాతాలు
దర్శనీయమైన వాటిలో ప్రపంచంలోని ఆయా జలపాతాలు యాత్రికులకు  కనువిందు చేయడమే కాదు, మనస్సుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. అవి ప్రకృతి సిద్ధంగా రూపొంది యాత్రికులను, కవులను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి.    ప్రపంచంలోనే ప్రఖ్యాతిగన్న నయాగరా, ఇగ్లూయూజ్, యోస్‌మైట్, బ్రైడల్ వీల్ వంటి జలపాతాలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నాయి. జాంబియాలోని విక్టోరియా, ఐస్‌ల్యాండ్‌లోని గుల్ఫోస్, స్వార్తిఫోస్ జలపాతాలు, గయానాలోని కైతియుర్ ఫాల్స్, న్యూజిలాండ్‌లోని సుథర్‌ల్యాండ్ ఫాల్స్, వియత్నాంలో బాంజియోక్-డెటియన్ జలపాతం, కెనడాలోని హార్స్ షూ జలపాతం, స్విట్జర్లాండ్‌లోని రైనో ఫాల్స్, నార్వేలోని మార్‌డాల్స్‌ఫోసెన్ ఫాల్స్, ఆస్ట్రేలియాలోని వల్లామన్ జలపాతాలకు ఘనమైన చరిత్ర ఉంది. 

మన పర్యాటక ప్రదేశాలు
ఆధునిక పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న భారతదేశాన్ని సందర్శించే విదేశీయుల ద్వారా పర్యాటకం పరిఢవిల్లుతోంది. బంగ్లాదేశ్ నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువ. లండన్, కెనడా, ఆమెరికా నుంచి ఐదు లక్షల మంది యాత్రికులు ఏటా భారత దేశాన్ని సందర్శించి వెళ్తున్నారు.

భారతదేశంలో దేశ విదేశీయులని జోరుగా ఆకర్షిస్తున్న వివిధ రాష్ట్రాల పర్యాటక ప్రదేశాలను తప్పక పేర్కొనాలి. తమిళనాడులోని మధురైలో ఉన్న మీనాక్షి ఆలయాన్ని   చోళరాజుల కాలంలో నిర్మించారు. అలాగే మహాబలిపురం, తంజావూర్‌లోని బృహదీశ్వరాలయం లాంటివి వెలశాయి. అంతేగాదు, అక్కడి ప్రదేశం ఊటీ యాత్రికులకు నయనానందాన్ని చేకూర్చుతోంది. ప్రపంచంలోని ఎనిమిది వింతల్లో అపూర్వమైన, మహత్తరమైన వింత కట్టడాల్లో  తాజ్‌మహల్ ఒకటి. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఇది వారసత్వ కట్టడంగా నిర్మితమైంది. ఇదేగాక బౌద్ధ యాత్రికులకు దర్శనీయ స్థలమైన గయ ఉంది ఈ రాష్ట్రంలోనే.   

image

          
కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం, హిందూ దేవాలయాలు చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. విశేషంగా విదేశీ యాత్రికులను ఆకర్షించే రాష్ట్రం బిహార్. అక్కడి మహాబోధి, నలంద విశ్వ విద్యాలయం ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు. కర్ణాటకలోని జాతీయ ప్రాజెక్టులు, అనేక రాజకోటలు, హోసల వాస్తు శిల్పిత ఆలయాలు, వారసత్వ కట్టడాలు, హంపి, బాదామి దేశ విదేశీయులకు కనువిందు చేస్తున్నాయి.
గోవాలోని బీచ్‌లు, బాసిలికా ఆఫ్ బామ్, హిందూ దేవాలయాలు, చర్చిలు విదేశీ  యాత్రికులను అమితంగా ఆకర్షిస్తాయి.   

విదేశీ యాత్రలు
భారతదేశం నుంచి అమెరికాను సందర్శించిన గొప్ప తత్త్వవేత్త వివేకానందస్వామి. ఆయన చికాగో యాత్ర భారతదేశానికి గుర్తింపు తెచ్చింది. గాంధీ, అంబేద్కర్   బ్రిటిష్ చదువులు వాళ్లకే కాకుండా దేశానికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే  సుభాష్ చంద్రబోస్, నెహ్రూ లాంటి వాళ్ల విదేశీయాత్రలు గొప్ప ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నాయి. సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ రాజ్యం. దాని రాజధానిగా ఉన్న లండన్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నగరం. అప్పుడూ ఇప్పుడూ దేశ దేశాలవారికి యాత్రా స్థలంగా అలరారుతోంది. తెలుగు కవులలో సి. నారాయణరెడ్డి, చరిత్ర పరిశోధకులు శివనాగిరెడ్డి, ననుమాస స్వామి లాంటి వారెందరో లండన్‌ను సందర్శించి జ్ఞాపకాలను పదిలపరచుకొన్నారు. 

image


ముగింపు
ప్రాచీన కాలంలోనే విదేశీ యాత్రికులు భారత దేశాన్ని సందర్శించడం, ఆధునిక  కాలంలో పర్యాటకం ఇబ్బడిముబ్బడిగా అభివృద్ధి చెందడం అన్నింటికంటే ముఖ్యమైన విషయంగా చెప్పాలి. పర్యాటకం వల్ల మానసిక వికాసం, జ్ఞానంతో పాటు చరిత్ర సంస్కృతులు ప్రభావితమౌతాయి. ఇంత ప్రాధాన్యమున్నందువల్లే వందల దేశాల్లో సెప్టెంబర్ 27న ప్రపంచ ప్రజలు అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం జరుపుకొంటున్నారు.

ప్రొఫెసర్ ననుమాస స్వామిలైట్ తీస్కోకు భయ్యా..!

Updated By ManamSun, 08/12/2018 - 02:05

imageభారతదేశంలో బిట్ కాయిన్, మోనెరో వంటి డిజిటల్ కరెన్సీలకు సంబంధించిన సైబర్ బెదిరింపుల అవగాహన బొత్తిగా లేదు. కానీ అంతర్జాలంలో సంచరించే వాళ్లలో 77 శాతం మందికి డిజిటల్ కరెన్సీ అనేది ఉందని తెలుసు. అయినా కూడా సైబర్ బెదిరింపుల విషయంలో వాళ్లు లైట్ తీసుకుంటున్నారు. తమ వ్యక్తిగత, స్మార్ట్ హోమ్ పరికరాలకు 
హాని కలిగించే క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ గురించి చాలా మంది వినియోగదారులు పట్టించుకోవట్లేదు. వినియోగదారులపై దృష్టిపెట్టే సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ కంపెనీ ‘అవస్త్’ విడుదల చేసిన ఓ నివేదిక ఈ విషయూన్ని వెల్లడించింది. క్రిప్టో కరెన్సీతో తమకెలాంటి సంబంధం లేదు కాబట్టి, క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ తమ వస్తువులకు హాని కలిగించే అవకాశమే లేదని చాలా మంది నమ్ముతున్నారు. 
ఇది పొరపాటు.

వాస్తవమేమంటే, క్రిప్టోమైనింగ్ మాల్‌వేర్ లేదా క్రిప్టోకరెన్సీ మైనింగ్ మాల్‌వేర్ అనేది మన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్స్‌ని చదివేసి, ఆ పరికరంలోని డాటానంతా తన స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి మాల్‌వేర్ భాగాల్ని డెవలప్ చేస్తుంది. వినియోగదారుడి అనుమతితో నిమిత్తం లేకుండానే క్రిప్టోకరెన్సీ మైనింగ్ కోసం ఆ మాల్‌వేర్‌ను ఉపయోగిస్తుంది. ఈ హానికర క్రిప్టోమైనింగ్ విషయంలో మనవాళ్లు ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని అవస్త్ నివేదిక తెలిపింది. దాని ప్రకారం క్రిప్టోకరెన్సీలను మైనింగ్ చేసే మాల్‌వేర్ లేదా మాల్‌వేర్ సోకిన వెబ్‌సైట్ల గురించి 66 శాతం మంది వినియోగదారులు వినివున్నారు కానీ, ఆ మాల్‌వేర్‌పై వాళ్లకు సమగ్ర అవగాహన లేదు.

అక్రమ క్రిప్టోమైనర్స్
ఒక అధ్యయనం ప్రకారం 2018లో ఇప్పటివరకూ రాన్సమ్‌వేర్ ఆధారిత దాడుల కంటే క్రిప్టోమైనర్ ఆధారిత దాడులేimage ప్రమాదకరంగా మారాయి. తొలి త్రైమాసికంలో మెుత్తం 30 కోట్ల మాల్‌వేర్ ఘటనలు చోటు చేసుకోగా, వాటిలో క్రిప్టోమైనర్ ఘటనలు 2.89 కోట్లు! అంటే దాదాపు 10 శాతం. జనవరి నుంచి మార్చి వరకు ఈ ఘటనలు క్రమేణా పెరుగుతూ వచ్చాయిు. అదే సమయంలో రాన్సమ్‌వేర్ ఘటనల్లో తగ్గుదల కనిపించింది. రాన్సమ్‌వేర్ దాడి జరిగినప్పుడు సిస్టమ్‌లోని వనరులన్నీ కరప్ట్ అయినట్లు స్క్రీన్ మీదే తెలిసిపోతుంది. సిస్టమ్‌ను ఆన్ చేయగానే అందులోని ఫైల్స్ అన్నీ ఎన్‌క్రిప్ట్ అయ్యూయనే విషయం స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. ఆ సమస్యకు పరిష్కారంగా డబ్బును డిమాండ్ చేస్తుంది. అయిుతే క్రిప్టోమైనర్ మాల్‌వేర్ అలా చేయదు. మనం ఏదైనా సైట్‌ను సర్ఫింగ్ చేస్తున్నప్పుడే, మనకు తెలీకుండానే ఒక క్రిప్టోమైనర్ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ అయిుపోతుంది. దాని ద్వారా ఆ కంప్యూటర్‌లోని వనరులన్నింటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకొని, క్రిప్టోకరెన్సీ కోసం మైనింగ్ చేస్తుంది. మనకు విషయం తెలిసేసరికే చాలా నష్టపోతామన్న మాట!

సైబర్ నేరగాళ్లు రాన్సమ్‌వేర్ కంటే క్రిప్టోమైనర్స్ మీద ఎందుకు ఇంటరెస్ట్ చూపుతున్నట్లు? రాన్సమ్‌వేర్ ద్వారా తాము అనుకున్న ఫలితాల్ని నేరగాళ్లు సాధించలేక పోతున్నారు. 2017లో రాన్సమ్‌వేర్ దాడులు ఉధృతమవడంతో కంపెనీలు యూంటీ-రాన్సమ్‌వేర్ ప్రమాణాలు తీసుకోవడం మెుదలుపెట్టాయి. వీటిని అధిగమించడం రాన్సమ్‌వేర్‌కు కష్టమవుతూ వస్తోంది. అదొక కారణమైతే, ప్రధాన కారణం మాత్రం, క్రిప్టోకరెన్సీల విలువ చాలా ఎకువ కావడం! రాన్సమ్‌వేర్ డిమాండ్లకు మనం తలొగ్గవచ్చు, తలొగ్గకపోవచ్చు కానీ, క్రిప్టోమైనర్లకు డిజిటల్ కరెన్సీని కంటిన్యూగా సమర్పించుకోక తప్పదు. 

‘మోనెరో’ మహిమ
imageప్రపంచవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరగాళ్లు ఇవాళ ఆనందంతో తబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే వాళ్లు హాయిగా నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు వచ్చిపడుతోంది. డిజిటల్ కరెన్సీ విషయూనికొస్తే, సైబర్ నేరగాళ్లు బిట్‌కాయిన్ కంటే కూడా ‘మోనెరో’నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కారణం, బిట్‌కాయిన్ ట్రాన్‌సాక్షన్స్‌ను ట్రాక్ చేయవచ్చు, దాని వాలెట్లను బ్లాక్ చేయవచ్చు లేదంటే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టొచ్చు. కానీ ఒక నిర్దిష్ట వ్యక్తికి సంబంధించి మోనెరోను ట్రాక్ చేయలేం, బ్లాక్ చేయలేం, ట్రేస్ చేయలేం. అంతే కాకుండా, బిట్‌కాయిన్ బ్లాక్స్‌ను సగటున పది నిమిషాలకోసారి మాత్రమే ఉత్పత్తి చేసే వీలుంటే, మోనెరో బ్లాక్స్‌ను పతి రెండు నిమిషాలకోసారి ఉత్పత్తి చేయెుచ్చు. కాబట్టి దాడి చేయడానికి మరిన్ని ఎక్కువ అవకాశాల్ని మోనెరో కల్పిస్తోందన్న మాట! మోనెరో రాకతో సైబర్ నేరగాళ్లకు గన్‌పౌడర్ దొరికినట్టయింది. విండోస్ సర్వర్స్.. ల్యాప్‌టాప్స్.. ఆండ్రాయిడ్ వస్తువులు.. ఆఖరుకి ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఎండ్‌పాయింట్స్.. ఎవైనా కానివ్వండి, యథేచ్ఛగా అక్రమ మోనెరో మైనర్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తూ ఎలాంటి అనుమానాలకూ అవకాశం ఇవ్వకుండా ప్రపంచవ్యాప్తంగా వాటిని ఆక్రమించేస్తున్నారు సైబర్ గజదొంగలు. వీటి ద్వారా ప్రతి నిమిషం, రేయింబవళ్లు డబ్బు దొంగిలించేస్తున్నారు. ఈ నేరగాళ్లలో ఎక్కువ మంది రష్యా, చైనా దేశాలకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్‌గా గుర్తించారు. అయితే బిట్‌కాయిన్ తర్వాత బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్‌తో నడుస్తోన్న అతి పెద్ద వ్యవస్థ ఎథీరియమ్. స్విట్జర్లాండ్‌లో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్‌ను గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్, ఆయన కొడుకు కూడా మైనింగ్ చేస్తున్నారు! ఎథర్ అనేది క్రిప్టోకరెన్సీ కాదు, క్రిప్టో ఫ్యూయెల్, క్రిప్టో సామగ్రి (కమొడిటీ). అందువల్ల కరెన్సీకి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతున్నారు. బిట్‌కాయిన్ కంటే తక్కువ ధరకే ఎథీరియమ్ దొరుకుతుండటం వల్ల కూడా దీనికి పాపులారిటీ పెరుగుతోంది.

దేన్నీ వదలట్లేదు
సాధారణంగా మనం ఏదైనా సైట్ ఓపెన్ చేస్తే యూడ్స్ ప్రత్యక్షమై, మనం చూడాలనుకుంటున్న సమాచారాన్ని సరిగా చూడనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంటాయి. యూడ్స్‌లేని ఆన్‌లైన్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసేందుకు వినియోగదారుల్లో సగం మంది క్రిప్టోమైనింగ్‌ను ఎంచుకుంటున్నారు. అవస్త్ ఏప్రిల్‌లో నిర్వహించిన ఒక పోలింగ్‌లో పాల్గొన్నవాళ్లలో 19 శాతం మందికి క్రిప్టోకాయిన్స్‌ ఉన్నాయి. లేదంటే వాటిలో పెట్టుబడి పెట్టారు. క్రిప్టోకాయిన్స్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో 37 శాతం మంది ఉన్నట్లు తేలింది. 

‘‘సైబర్, వ్యక్తిగత భద్రతకు క్రిప్టోజాకింగ్ అనేది అంతకంతకూ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. ఇళ్లల్లోని పర్సనల్image కంప్యూటర్స్ నుంచి పెద్ద పెద్ద డాటా సెంటర్ల దాకా ప్రతిదాన్నీ సైబర్ నేరగాళ్లు క్రిప్టోమైనింగ్‌కు గురిచేస్తున్నారు’’ అని తరుణ్ కౌరా చెప్పారు. ఆయన ఎంటర్‌ప్రైజ్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ మేనేజ్‌మెంట్ (ఏషియూ పెసిఫక్ అండ్ జపాన్)కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 2017 చివరి త్రైమాసికంలో ఎండ్‌పాయింట్ కంప్యూటర్స్‌లో కాయిన్‌మైనర్స్ ఘటనలు నమ్మశక్యం కాని రీతిలో 8,500 శాతం పెరిగాయని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ అమ్మకాలు, మైక్రో ఏటీఎంలు, ఎలక్ట్రానిక్ వాలెట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, స్మార్ట్ ఫోన్లు, యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్, సిమ్‌కార్డులు, వైర్‌లెస్ యూక్సెస్ రూటర్లు, ఆధార్‌తో అనుసంధానించిన పేమెంట్ సిస్టమ్‌లు వంటివాటికి భద్రత కల్పించేందుకు భారత కంప్యూటర్ ఎముర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టి-ఇన్) 21 సూచనలను విడుదల చేసింది. సైబర్ నేరాల్ని, బెదిరింపుల్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు అనేక చట్టపర, విధాన, సంస్థాగత చర్యలు తీసుకుంటున్నట్లు హోమ్ మంత్రిత్వ శాఖ చెబుతోంది. ‘‘సైబర్ నేరాలపై పరస్పర సమాచార మార్పిడికై పదిహేను దేశాలతో భారత్ ద్వైపాక్షిక సహకారం కోసం కృషి చేస్తోంది. తాజా సైబర్ బెదిరింపుల్ని అరికట్టడానికి సీఈఆర్‌టీ-ఇన్ సైతం క్రమం తప్పకుండా హెచ్చరికలు జారీ చేస్తోంది’’ అని ఓ అధికారి చెప్పారు.

అయితే దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాతే సైబర్ నేరాలు మరింత పెరిగాయని నిపుణులు అంటున్నారు. ‘‘నోట్ల రద్దు అనంతరం సైబర్ నేరాల్ని అడ్డుకోవడానికి చట్టంలో కొత్తగా నిబంధనలేవీ పొందుపరచలేదు. ఇవాళ సైబర్ నేరాలపై భారతీయ సమాచార సాంకేతిక చట్టం మృదువుగా వ్యవహరిస్తోంది. సైబర్ టెర్రరిజం, చైల్డ్ పోర్నోగ్రఫీని మినహాయిస్తే, ఇతర అన్ని సైబర్ నేరాలకు బెయిల్ లభిస్తోంది. దానర్థం నేరానికి పాల్పడ్డ వ్యక్తి బయటకు వచ్చి, సాక్ష్యాన్ని తుడిచేయడానికి ఆస్కారం కల్పిస్తున్నట్లే’’ అంటారు పవన్ దుగ్గల్. ఆయన సుప్రీంకోర్టులో సైబర్ చట్ట నిపుణుడు. 

imageసైబర్ బెదిరింపులనే సమస్య ఆర్థిక నేరాలతోనే ముడిపడి లేదు. అది టెర్రరిజాన్ని కూడా వ్యాప్తి చేస్తోంది. ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుంటూ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న కనీసం 20 ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సంబంధిత కేసుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) పరిశోధిస్తోంది. ‘‘ప్రజల్ని తీవ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నవాళ్లు మనదేశంలో లేరు. వాళ్లు దేశంలో ఇప్పటికే ఉనికిలో ఉన్న మాడ్యూల్స్‌ను ఆపరేట్ చేస్తుంటారు. త్వరగా ప్రభావితమయ్యే యువతను గుర్తించి తమ పనుల్లోకి దించే టాస్క్‌లను వాళ్లకు అప్పగిస్తుంటారు’’ అని ఒక సీనియర్ ఎన్‌ఐఏ అధికారి తెలిపారు.

బ్యాంకుల సైబర్ భద్రత నిమిత్తం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొన్ని మార్గదర్శకాల్ని విధించగా, హోమ్ మంత్రిత్వశాఖ సైతం వివిధ డ్రైవ్‌లను ప్రారంభించింది. ‘‘సైబర్ భద్రత విషయంలో ఐదేళ్ల కాలానికి సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగు పర్చేందుకు రూ. 100 కోట్లతో ఒక ప్రత్యేక పరిశోధన, అభివృద్ధి నిధిని ఏర్పాటు చేశారు. ‘సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్’ అనే కేంద్ర సెక్టార్ ప్రాజెక్ట్ కింద సైబర్ నేరాల్ని అరికట్టేందుకు అవసరమైన మౌలిక సదుపాయూల్నీ, సామర్థ్యాన్నీ కల్పించేందుకు మెుత్తం రూ. 195.83 కోట్ల అంచనా వ్యయూన్ని ఆమోదించాం.’’ అని కేంద్ర దేశీయ వ్యవహారాల సహాయమంత్రి హంసరాజ్ అహిర్ తెలియజేశారు.

బ్లాక్‌చెయిన్ నేరాలు
2017తో పోలిస్తే ఈ ఏడాది బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ సంబంధిత సైబర్ నేరాలు 629 శాతం పెరిగాయని సైబర్ భద్రతా సంస్థ మెకాఫీ విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. హానికర మైనర్స్, క్రిప్టోజాకింగ్ సంఖ్యలో వృద్ధి ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. 2017 చివరి త్రైమాసికంలో 4 లక్షలున్న ఈ కేటగిరి సైబర్ క్రైమ్ శాంపిల్స్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2.9 మిలియన్లకు మించి పెరిగాయి. దీనికి కారణం ఫైనాన్స్, రిటైల్, హెల్త్‌కేర్, ఆటోమోటివ్ వంటి అన్ని రకాల రంగాలు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తుండటం. రికార్డుల్ని బ్లాక్స్ రూపంలో నిల్వచేసి, క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ ఒకదానికొకటి అనుసంధానం చేయడమే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ. దీన్ని క్రిప్టోకరెన్సీలకు విస్తృతంగా వినియోగిస్తున్నారు. అందుకే సైబర్ క్రిమినల్స్ వీటిని తరచూ లక్ష్యంగా చేసుకుంటున్నారు.

నేరగాళ్లకు నిరంతర ఆదాయం
అప్పుడప్పుడూ సిస్టమ్ పర్ఫార్మెన్స్ నెమ్మదించడం, ఎలక్ర్టిక్ బిల్లులు ఎక్కువగా రావడం వంటివి మినహాయిస్తే, మన సిస్టమ్ హ్యాక్‌కు గురైన విషయమే మనకు తెలీదు. రాన్సమ్‌వేర్ నోట్స్ ఉండవు. పాస్‌వర్డ్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్లను దొంగిలించిన ఫైల్స్ ఉండవు. మీ సిస్టమ్‌లో ఎక్కడ సమస్య ఉందో మంచి టెక్నీషియన్ కూడా కనిపెట్టలేడు. రాన్సమ్‌వేర్ ప్రొటెక్షన్‌ను సైబర్ సెక్యూరిటీ కంపెనీలు అందిస్తుండటంతో, దాని స్థానాన్ని అక్రమ క్రిప్టోమైనింగ్ చాలా వేగంగా రీప్లేస్ చేస్తోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. అక్రమ క్రిప్టోమైనింగ్ విషయంలో ప్రతి నోడ్ స్వతంత్రంగా పనిచేస్తుంది. క్రిమినల్స్ చేయూల్సిందల్లా పలు మైనర్స్‌ను ఇన్‌స్టాల్ చేయడమే. ఇది చాలా సులువైన పని. ఇవాళ మిలియన్ల సంఖ్యలో సిస్టమ్స్ క్రిప్టోమైనింగ్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యూయని గుర్తించారు. అంటే ఏడాదికి 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయూన్ని ఈ సిస్టమ్స్ నేరగాళ్లకు అందిస్తున్నాయి. తొలిసారి ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యూక, తక్కువ ఎఫర్ట్‌తోటే ఇది సాధ్యమవుతుంది. మరింత ముఖ్యమైన విషయం క్రిప్టోమైనింగ్‌కు గురైన విషయం తెలుసుకొనే అవకాశం చాలా తక్కువ కావడంతో, వీటి ద్వారా నిరంతరం నేరగాళ్లకు ఆదాయం లభిస్తుంటుంది. ‘‘మన స్మార్ట్ డివైస్‌లో రహస్యంగా మాల్‌వేర్ రన్ అవుతూ ఉండొచ్చు - మనం క్రిప్టో కరెన్సీ వినియోగదారులమా, కాదా అనేది అప్రస్తుతం. అక్రమ క్రిప్టోమైనర్‌తో మన వ్యక్తిగత సమాచారం మెుత్తం చౌర్యానికి గురయ్యే అవకాశం ఉంది’’ అంటారు ‘అవస్త్’లో సెక్యూరిటీ రీసెర్చర్‌గా పనిచేస్తున్న మార్టిన్ హ్రాన్. క్రిప్టోమైనర్ల దాడిని అడ్డుకోవడానికి సైబర్ సెక్యూరిటీ సంస్థలు ప్రభావవవతమైన టెక్నిక్స్‌ను డెవలప్ చేయగలిగితే, సైబర్ నేరగాళ్లు తిరిగి రాన్సమ్‌వేర్‌కు మళ్లే అవకాశం ఉంది.

ప్రపంచంలో మూడో స్థానంలో..
సైబర్ బెదిరింపుల విషయంలో ప్రపంచంలోనే ప్రస్తుతం భారత్ మూడో స్థానంలో ఉందంటే.. మనవాళ్లు ఇంకెంత మాత్రమూ ఉపేక్షించకూడదని అర్థమవుతోంది. 2017లో ప్రపంచంలోని బెదిరింపుల్లో 5.09 శాతం భారతీయులు ఎదుర్కొన్నవే. ‘ఇంటర్నెట్ సెక్యూరిటీ థ్రెట్ రిపోర్ట్’ ప్రకారం 26.61 శాతంతో అమెరికా, 10.95 శాతంతో చైనా.. మనదేశానికంటే ముందున్నారు. మాల్‌వేర్, స్పామ్, ఫిషింగ్, బాట్స్, నెట్‌వర్క్ ఎటాక్స్, వెబ్ ఎటాక్స్, రాన్సమ్‌వేర్, క్రిప్టోమైనర్స్ అనే ఎనిమిది అంశాలపై ఈ గ్లోబల్ థ్రెట్ ర్యాంకింగ్‌ను నిర్ధారించారు. మనదేశం.. స్పామ్, బాట్స్ విషయంలో రెండో స్థానంలో, నెట్‌వర్క్ దాడుల్లో మూడో స్థానంలో, రాన్సమ్‌వేర్ విషయంలో నాలుగో స్థానంలో నిలుస్తోంది. దేశంలో కొత్తగా అక్రమ కాయిన్‌మైనింగ్ పెరుగుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది.

పోనీ స్టీలర్
కొమొడో సైబర్‌సెక్యూరిటీ థ్రెట్ రీసెర్చి ల్యాబ్స్ జరిపిన అధ్యయనంలో ఇంకో విషయం కూడా వెల్లడైంది. దాని ప్రకారం ‘పోనీ స్టీలర్’ వంటి అధునాతన, ప్రమాదకర పాస్‌వర్డ్ దొంగలు బాగా పెరిగారు. పోనీ స్టీలర్ అనేది చాలా హెచ్చు స్థాయిలో డాటాను దొంగిలిస్తుంది. అది 36 క్రిప్టోకరెన్సీ వాలెట్లను లక్ష్యంగా చేసుకోగలదు. ఇది తమ సమాచారాన్ని దొంగిలిస్తోందనే విషయం బాధితులకు తెలీదు! యూంటీ వైరస్‌లకు చిక్కకుండా కొత్త కొత్త మాల్‌వేర్‌లను సైబర్ దొంగలు సృష్టిస్తున్నారు. ఈ ఏడాదే 241 దేశాల డొమైన్ కోడ్‌లతో ఉన్న 18 మాల్‌వేర్ రకాలను కొమెుడో కనిపెట్టింది!

మూల్యం చెల్లించుకుంటున్నాం
దేశంలో సగటు డాటా ఉల్లంఘటనలు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 7.9 శాతం మేర పెరిగి, రూ. 11.9 కోట్ల మూల్యాన్ని సమర్పించుకున్నాయి. 42 శాతం ఉల్లంఘనలకు వైరస్, క్రిమినల్ దాడులే మూల కారణం. ఏడాదిలో 219 రోజుల్లో సైబర్ దాడులు జరిగాయి. గడచిన ఐదేళ్ల కాలంలో ఈ డాటా ఉల్లంఘనలు దాదాపు రెట్టింపయ్యాయి. 2013లో 9 మిలియన్ల రికార్డులు మాయమవగా, 2016 నాటికి 16 మిలియన్ల రికార్డులు కనిపించకుండా పోయాయి. 1 మిలియన్ రికార్డులు కోల్పోవడం వల్ల్ల సగటున జరిగే నష్టం 4 కోట్ల మిలియన్ డాలర్లు! 50 మిలియన్ రికార్డులు మాయమయ్యాయంటే, దానికి మనం చెల్లించిన మూల్యం 35 కోట్ల డాలర్లు! వీటిలో అత్యధిక శాతం వైరస్‌లు, క్రిమినల్ ఎటాక్‌ల వల్ల జరిగినవే.ఒక్క నేస్తం చాలు

Updated By ManamSun, 08/05/2018 - 09:08

స్నేహం ఒక నిరంతర ప్రక్రియ. ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు నిరంతరం తెలుసుకొనే, కలిసి ఉన్న క్షణాల్ని అమితంగా ఆస్వాదించే ఒక భావన. ఈ లోకంలో అందరికంటే అసలైన సంపన్నులెవరంటే డబ్బున్నవాళ్లు కాదు, మంచి స్నేహితులు ఉన్నవాళ్లే! కలుసుకున్న ప్రతిసారీ స్నేహితుడిచ్చే కావలింత ఎంత బాగుంటుంది! ఎప్పుడైనా సరే స్నేహితుడిగా నీకు నేను తోడు అని చెప్పే ఆ కావలింత ఎంత భరోసానిస్తుంది!!

image


స్నేహితులంటే తమ మధ్య వైరుధ్యాల్ని కూడా ఆస్వాదించేవాళ్లు. ఒకరిలా ఇంకొకరు మారకుండానే ఒకరి అభిరుచుల్ని మరొకరు గౌరవించేవాళ్లు. తమకి తాము ఎంత విలువనిస్తారో, ఎదుటివాళ్లకూ అంత విలువనిచ్చేవాళ్లు. ఆనందాన్నైనా, బాధనైనా పంచుకోడానికి మనకు మొదట గుర్తొచ్చేది స్నేహితుడే.  స్నేహితుడు ఎల్లవేళలా మనతో ఉండటం కుదరకపోవచ్చు. కానీ అవసరమైనప్పుడల్లా వస్తాడు. నీవైపు నిలబడతాడు. నిన్ను నిలబెడతాడు.  కాలం గడిచే కొద్దీ చిక్కనవుతుండటం స్నేహంలోని గొప్పతనం. స్నేహితుడు ఉన్నవాడెవ్వడూ ఒంటరి కాడు. స్నేహం అంటే మన పెదవుల మీది చిరునవ్వు. స్నేహం అంటే వానలో ఉల్లాసంగా చేసే నాట్యం.
 
ఈ డిజిటల్ యుగంలో సోషల్ మీడియా సరికొత్త స్నేహితుల్ని సృష్టిస్తుండవచ్చు. ేస్నేహాన్ని కొంతమంది దుర్వినియోగం చేస్తుండవచ్చు. అదొక నెగటివ్ కోణం. కానీ పాజిటివ్ కోణం కూడా ఉంది. ముగిసిపోయాయనుకున్న స్నేహాలు సోషల్ మీడియా ద్వారానే తిరిగి విరుస్తున్నాయి. ఎప్పుడో తప్పిపోయిన స్నేహితులు మళ్లీ కలుస్తున్నారు. స్నేహబంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆగస్ట్ మొదటి ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు రచయితలు స్నేహానుభవాలనూ, స్నేహానుభూతులునూ పంచుకుంటున్నారు. వాళ్ల హృదయాల్లో స్నేహానికి ఉన్న స్థానమేమిటో చెబుతున్నారు. పదండి.. స్నేహ పరిమళాల్ని ఆస్వాదించేందుకు, స్నేహ వర్షంలో తడిసేందుకు...

స్నేహం మన శ్వాస
imageఇప్పటి దాకా నడిచిన దారిలో ఎన్ని స్నేహ సుమాలు విరిసినా ప్రతి స్నేహం దేనికదే ప్రత్యేకం. ఇప్పుడు ఎంతమంది స్నేహితులైనా ఉండనీ.. స్నేహం అనగానే చిన్నప్పటి స్నేహాలే ముందు గుర్తొస్తాయి. అలాంటి చిన్నప్పటి స్నేహాల్లో మొదటి స్నేహం అక్క మాధవితో.

చిన్నప్పుడు చేమంతుల దారుల్లో నడుస్తూ స్కూల్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కుక్క అరుస్తూ వెంటబడింది. అప్పుడు తనకి అయిదేళ్లు, నాకు నాలుగేళ్లు అనుకుంటా. నన్ను ఎలా ఎత్తుకొని పరిగెత్తిందో తెలీదు. తను నన్ను గుండెలకి హత్తుకోవడం నా మొదటి జ్ఞాపకం. నన్ను కాపాడినా తనకి మాత్రం గాయాలు తప్పలేదు. నెత్తురోడుతున్న కాళ్లతో నన్ను మాత్రం వదలకుండా ఇంటికి పరిగెత్తింది. ఇప్పటికి తన చేయి పట్టుకొని నడుస్తుంటే అదే జ్ఞాపకం వస్తుంది.

చిన్నప్పుడు వర్షంలో ఆడుకున్న ఆటలూ మధ్యాహ్నం వడగళ్లు ఏరుకుని జాగ్రత్తగా గిన్నెలో దాచుకొని నిద్రపోయిimage లేచి చూశాక నీరయిపోయి ఏడుస్తుంటే, అప్పటికి తనూ చిన్నదైనా ఆరిందాలా ఓదార్చేది. మళ్లీ రేపే వడగళ్ల వాన పడుతుందని భరోసా ఇచ్చేది. అదిగో ఆ భరోసాతో సంవత్సరం ఎదురు చూసినా కష్టం అనిపించేది కాదు. 

ఇద్దరి మధ్యా సంవత్సరం మాత్రమే తేడా ఉండటం వల్ల నాకూ, తనకూ కామన్ స్నేహితులు ఉండేవాళ్లు. చిన్నప్పటి ఆటల దగ్గర్నుంచి పెద్దయ్యాక తన స్నేహం ఇచ్చిన శక్తి ఎప్పటికీ ప్రత్యేకమే. అలాగని మా మధ్య ఎప్పుడూ పొరపొచ్చాలు రాలేదని కాదు. చాలా సార్లు వచ్చేవి. అయినా కూడా నేను గాయపడిన ప్రతిసారీ తన కళ్లల్లో సముద్రం ఊరడం మాత్రం మా స్నేహానికి కొలమానం.

మా ఆసక్తుల మధ్య ఎన్నో వ్యత్యాసాలున్నాయి. అయినా నాకిష్టమైన పారిజాతం పూవు పూస్తే తాను పండుగ చేసుకొనేది. అడవి సంపెంగ మొక్కని ఇంట్లో తెచ్చి పెట్టుకొని, మొగ్గ తొడగట్లేదని నేను ఎదురు చూస్తుంటే బెంగ పడేది. నాకు చదువుతో పాటు లిటరేచర్ మీదా, ముగ్గులు వేసుకోవడం, పూసలతో బొమ్మలు అల్లడం.. ఇలా అన్నీ ఇండోర్ వ్యాపకాలు. తను చదువుతో పాటు అన్ని ఆటలూ ఆడేది. తను చాలా ధైర్యంగా అందరితో పోటీ పడుతున్నట్లు ఉండేది. నేను చాలా సిగ్గరిగా తన వెనుక దాక్కునే ఉండేదాన్ని. తన ధైర్యం నాకు ఇప్పటికీ చాలా అమేజింగ్. కెరియర్‌లో కూడా ఆ ధైర్యంతోనే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదుర్కొని టాప్ పొజిషన్‌లోకి వెళ్లింది. ఇన్ని వ్యత్యాసాలున్నా, మా స్నేహం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. రక్తం పంచుకుని పుట్టిన సోదరి కన్నా ఒక స్నేహితురాలిగానే తను ఎక్కువ. స్నేహం అనగానే మేం ఇద్దరం కలిసి చెప్పుకున్న గంటల గంటల కబుర్లు గుర్తొస్తాయి. చేసిన అల్లరి పనులూ.. అసలు ప్రతీ జ్ఞాపకం, నా జీవితంలో ఎదురైన ప్రతీ స్నేహం తనతో కలిపి ముడి వేసినదే. అందుకే, స్నేహం అనగానే అక్క మాధవి గుర్తొస్తుంది.

వీటన్నింటికీ మించి స్నేహం అంటే ఖలీల్ జిబ్రాన్ కవిత గుర్తొస్తుంది!
‘‘నీ అవసరాలకు సమాధానమే నీ మిత్రుడు’’ అంటాడు ఖలీల్. ఎంత లోతైన భావన ఇది. నిజమే! స్నేహం అంటే మన అవసరాలకు సమాధానమే కాదు, స్నేహం మన అవసరం కూడా. స్నేహం ఆక్సిజన్ లాంటిది. అది లేకుండా మనగలగడం చాలా కష్టం! అందుకే స్నేహం విలువ తెలీని వాళ్లు ఉంటారేమో కానీ, స్నేహం తెలీని వాళ్లు బహుశా ఉండరేమో. స్నేహం అంటే ఒకరికొకరుగా బ్రతకడమే కాదు, ఎదుటి వారి స్వేచ్ఛని గౌరవించడం కూడా. ఒక వ్యక్తితో స్నేహం చేసినప్పుడు.. యథాతథంగా వాళ్ల జీవితాన్ని ఇష్టపడాలి. తన ఆలోచనలూ, తన అభిప్రాయాలూ.. వీటిని గౌరవించకపోతే ఇంక స్నేహం ఎక్కడిది? చాలా గాయాలకి కారణం ఈ గౌరవం లేకపోవడమే.

స్నేహం అంటే మనకి నీడ కాదు. స్నేహం మన శ్వాస. స్నేహమంటే మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా మీ గుండె చెప్తున్నది తను అర్థం చేసుకోవాలి. మీ కేరింతల వెనుక దాచిన దుఃఖాన్ని తనూ, తన నవ్వులో దాగున్న శూన్యాన్ని మీరూ.. పట్టుకోగలగాలి.

అందుకే ఖలీల్ జిబ్రాన్ అంటాడు..
‘‘ఆత్మని మరింత విస్తృతపరిచేందుకు తప్పించి స్నేహానికి మరొక ఉద్దేశాన్ని తలపెట్టవద్దు.. తన మర్మాలను వెల్లడి చేయడానికి మించి మరేదో పట్టుకుందామని స్నేహం కోరుకుంటే అది స్నేహం కాదు, అది విసిరిన వల అవుతుంది.. మీ మిత్రునికి మీలో అత్యుత్తమమైనవి కేటాయించండి.. సమయాన్ని వృథాగా గడిపేందుకు స్నేహం వద్దు.. మీ సమయాన్ని సజీవంగా ఉంచేందుకు స్నేహాన్ని కోరుకోండి!’’
స్నేహమంటే ఒక జీవితంలో ఇమడని, రెండు జీవితాలు ఒక్కటై చేసుకునే అనంతమైన మదుపు.
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే!!
    
కాకి ఎంగిలే అస్సల్ దోస్తానా

‘‘మరచిపోని ఓ స్నేహమా..మరపురాని నా ప్రాణమా..యద సవ్వడి వింటే..బ్రతుకు పువ్వుల పంటే..నీ తోడే లేకుంటే గుండె ఆగిపోయెనా

imageనీ తోడే లేకుంటే గొంతు మూగబోయెనా’’ అంటూ బీకామ్ చదివే రోజుల్లో కామ్‌గా ఉండలేక రాసుకున్న పాట. తెల్లారితే నయా సాల్. న్యూ ఇయర్ అని ఫ్రెండ్స్ పాడమంటే, మళ్లీ పాత పాటలెందుకనే ఆలోచన నాది. ఏది ఏమైనా కొత్త పాట రాయాల్సిందే. అప్పటికీ స్నేహం మీద పాటంటే ప్రజావాగ్గేయకారుడు జయరాజన్న రాసిన ‘స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల’ మాత్రమే. 

పాటంటే కొత్తగా చెప్పాలి. కొత్త బాణీ కావాలి. ఫ్రెండ్స్‌ని మెస్మరైజ్ చెయ్యాలి. ఏవేవో ఆలోచనలు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పడం కోసం మందు, విందుల్లో యూత్ అంతా బిజీ. నేను మాత్రం బుద్ధిమంతుల సంఘం జాతీయ అధ్యక్షునిలా పదిహేనేళ్ల క్రితం ఓ రాత్రి పాట రాయడానికి కూర్చున్న జ్ఞాపకం. విద్యార్థి ఉద్యమాల్లో పాటను ఫిరంగిలా పేల్చడమే తెలుసు నాకు. పువ్వులు, పక్షులు కాదు. అసలు ప్రకృతికి సంబంధించిన చింతన అనేదే లేని వయసు. పోరు పాటలకు ఒక విరామం కావాలని నేనేమీ అనుకోలేదు. కాకుంటే రెగ్యులర్ ‘రెడ్’ బాణీ కాకుండా కొత్త స్టైలేదో ట్రై చేసిన. రాత్రంతా పాడుతూ రాస్తూ.. రాస్తూ పాడుతూ పొద్దుటికల్లా పాట కొత్తగా రెక్కలు తొడుక్కుని, భూమిని చీల్చుకొని బయటికొచ్చిన మొక్కలా నవ్వింది.

న్యూ ఇయర్.. న్యూ సాంగ్. ‘‘చలో షురూ’’ అన్నరు ఫ్రెండ్స్. ‘‘చెట్టుకొమ్మపై పక్షుల జంటలా, జీవితానికిimage వెలుగునీడలా.. నా ఊపిరికి ప్రాణం నీవు, నా గుండెకు జీవం నీవు’’ అంటూ తనువు, మనసు పులకించేలా సాగుతున్న పాటలో లీనమైన నేను, నా ఫ్రెండ్స్. ‘‘తొలకరి చినుకులా, వానజల్లులా, మెరుపుతీగలా, తుదకు వరదలా, కడకు గోదారమ్మలా..’’ సాగే చరణం వరద పరవళ్ల దృశ్యం. అచ్చంగా ఒక సినిమా స్టైల్ పాట. పాట ముగిసే ముక్తాయింపులో చినుకులా మొదలై నదిలా పరుగెత్తి సంద్రమైన రూపు. మొత్తంగా ఒక కొత్త ఉషోదయాన్ని బొమ్మ కట్టింది పాట. ప్రతి ఫ్రెండ్‌షిప్ డేకు నాకూ, నా ఫ్రెండ్స్‌కూ ఈ పాట గుర్తుకొస్తది. కూనిరాగంగానైనా వెంటాడుతూనే ఉంటది. నిజానికి ఇది నా పాట గొప్పతనం కాదు. ఫ్రెండ్‌షిప్ గొప్పతనం. ఈ పాటను పాడుకుంటూ వారి వారి ఫ్రెండ్స్‌ని గుర్తు తెచ్చుకున్నతనాల్ని చూశాను. కాలం సినిమా రీల్‌లా గిర్రున తిరిగింది.

కాలాన్ని బట్టే మనుషులు, విలువలు ఉంటాయని నమ్మేవారిలో నేనూ ఒకణ్ణి. అయితే కాలాతీతంగా స్నేహానికి విలువ ఇచ్చే వారి వల్లే ఫ్రెండ్‌షిప్ అనేది ‘ఎక్స్‌పైరీ’ లేని శక్తిగా నిలువగలుగుతున్నది. మానవ సంబంధాలన్నీ మార్కెట్ సంబంధాల దశను దాటి, స్మార్ట్‌ఫోన్ రిలేషన్స్‌గా మారి ఫేస్‌బుక్, వాట్సాప్‌లు తప్ప మరేమీ లేని శూన్య ప్రపంచం మనది. ఇలాంటి సంధికాలంలో ‘వాటీజ్ ఫ్రెండ్‌షిప్’ అని మళ్లీ మళ్లీ వెతుక్కొని నిర్వచించుకోక తప్పదు. గ్లోబలైజేషన్ రెండో దశలో ఇంకా బంధాలు అనుబంధాలు మిగిలే ఉంటాయా? ఏమో వెతుక్కోవాలి. మనిషి జిందగీలో దోస్తానాను మించిన బంధం మరొకటి లేదు. ఏ సంబంధం లేకపోయినా, ఫ్రెండ్స్‌గా మారడానికి అనేక కారణాలు ఉంటాయి. చాలా ఏండ్ల పాటు కలిసి ఉన్నా, స్నేహితులు కాలేనివారు కొందరైతే, కేవలం కొన్ని నిమిషాల్లోనే విడదీయరాని బంధంగా నిలిచిపోయే వారు మరికొందరు. మనలో ఉన్నదేదో వారిలో కూడా ఉండడం వల్ల కావచ్చు. తక్కువ టైమ్‌లో మంచి మిత్రులమైపోతం. అప్పుడు అనిపిస్తది ఫ్రెండ్‌షిప్ బ్లడ్ రిలేషన్ కంటే ఎక్కువ అని. మన ఇంట్లోవాళ్లు మనకోసం ఆలోచించడం, కష్టమొస్తే అల్లాడడం కామన్. కానీ, ఏ సంబంధం లేకుండా కేవలం ఫ్రెండ్ అనే కన్సర్న్‌తో మన గురించి ఆలోచించడం, మనం బాగుండాలని కోరుకోవడం, అందుకోసం ఎంతకైనా తెగించి, ఏదైనా త్యాగం చేసే మంచి స్నేహితులు ఉండడం నిజంగా సంతోషకరం.

ఇవాళ సోషల్ మీడియాలో మనకు ఎందరో పరిచయం అవుతుంటారు. కానీ, వారందరిని నిజమైన స్నేహితులుగా భావించలేం. మొహమాటానికి లైక్ కొట్టేవాళ్లు, ఏదో ఆశించి ఫేస్‌బుక్‌లో కామెంట్లు పెట్టి భజన చేసేవారు.. మన అభిరుచులకు, ఆలోచనలకు సరిపోయేవాళ్లు కాదు. అందుకే ఫేస్‌బుక్‌లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నది లెక్కకాదు. నీకు కష్టమొస్తే కన్నీరు పెట్టేవాళ్లు, నీ ఎదుగుదలకు గర్వపడేవాళ్లు, సంతోషపడేవాళ్లు, లోకం నిన్ను అపార్థం చేసుకున్నా సరే నిన్ను అర్థం చేసుకునేవాళ్లు ఉండడం చాలా గొప్ప విషయం.

నా జీవితంలో ఎంతోమంది మంచి మిత్రులను సంపాదించుకున్నాను. వారందరూ నా శ్రేయోభిలాషులు. అందులో రకరకాల దశల్లో స్నేహితులైనవాళ్లు ఉన్నారు. చిన్ననాటి నుంచి స్కూల్లో స్నేహితులై ఇప్పటివరకు కలిసి నడుస్తున్నవాళ్లు ఉన్నారు. అలాగే మధ్యలో జతై, ఫెవికాల్ బంధంలా అతుక్కుపోయినవారు ఉన్నారు. ఇక సామాజిక జీవితంలో విద్యార్థి ఉద్యమాల నుంచి, వామపక్ష పోరాటాల నుంచి, తెలంగాణ, బహుజన ఉద్యమాల వరకు అనేకమంది తమ హృదయ గవాక్షాలు తెరుచుకొని నన్ను ఆహ్వానించారు. తమ హృదయాల్లో కొంత స్థానం కల్పించారు. వారిని నేనెప్పుడూ మరిచిపోలేను.

ఇక సాహిత్యం అందించిన స్నేహితులైతే లెక్కే లేదు. వరంగల్‌లో మా శివనగర్ బస్తీ నుంచి విదేశాల వరకూ ఎంతోమంది స్నేహితులను అందించింది సాహిత్యం. వారందరిని కలుసుకున్నప్పుడు, కలుసుకోలేని పరిస్థితుల్లో కనీసం ఫోన్లలోనైనా ఆత్మీయంగా మనసారా మాట్లాడుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఉంటున్నా, ఇంత మహానగరంలో చాలా దగ్గరి ఆత్మీయ మిత్రులను కలుసుకోలేకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తది.

మూడున్నర దశాబ్దాల ఈ జీవితంలో చిన్ననాటి ఫ్రెండ్స్‌ని మించిన మంచి ఫ్రెండ్స్ లేరనిపిస్తున్నది ఇప్పుడు. మనుషులు ఎదుగుతున్న కొద్దీ వారి వారి ఆలోచనల్లో, ఆశయాల్లో తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రకరకాల భావజాలాలతో స్నేహాన్ని సంకుచితంగా మార్చేవాళ్లు ఉంటారు. కానీ క్లాస్‌రూమ్‌లో మనతో పాటు బెంచీమీద కూర్చున్నవాడు ఏ కల్మషం లేకుండా నిన్ను స్నేహితునిగా స్వీకరించి చాక్లెట్టో, బిస్కెట్టో పంచి ఇచ్చే స్నేహం చాలా గొప్పది. అట్లా ఐదో క్లాసు వరకు కలిసి చదువుకున్న అఫ్సర్‌గాడు, వేరే స్కూల్‌కి వెళ్తాడని తెలిసి నేను మూడు రోజులు అన్నం తినకుండా ఏడ్చిన జ్ఞాపకం. నాకు తోడబుట్టిన చెల్లెళ్లు లేరని తెలిసి మరో స్నేహితుడు వాళ్ల ఇంటికి తీసుకెళ్లి వాళ్ల సిస్టర్స్‌తో రాఖీ కట్టించిన జ్ఞాపకం. ఆకలికి నేను ఆగలేనని తెలిసి వాడు తినకుండా నాకు పెట్టిన జ్ఞాపకం. పరీక్ష ఫీజులే కాదు, ఖర్చులకు కూడా డబ్బులు సర్దిన మంచి మనసున్న స్నేహితుల జ్ఞాపకం. ‘నువ్ మా అందరి కంటే గొప్పోడివి కావాల్రా’ అని ఒక కంట నన్ను కనిపెట్టిన జ్ఞాపకం. అలాంటి దిల్‌దార్ సోపతిలందరికీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు.

మనిషికీ, కాలానికీ మధ్యవర్తి
imageపనుందిరా పోవాలంటూ చేతులొదిలేస్తూ దగ్గరయ్యే వాళ్లంతా స్నేహితులే. సందర్భాలే వెతుక్కొని నిర్వచించుకోనక్కర్లేకుండా ఉండే ఆత్మబంధువులెలా ఉంటారో తెలుసుకోవాలనుకుంటే స్నేహమే దిక్కు. ఒక్కసారి ఎవరినన్నా ప్రాణ స్నేహితుడెవరని అడిగి చూడండి, లేదా మీ ప్రాణ స్నేహితుడెవరో చెప్పి చూడండి. ఆ క్షణం ఉద్వేగంతో నిండి వచ్చిన సమాధానాల్లో తొంభై తొమ్మిది శాతం మనుషులు కళ్లు తడైనవారుంటారు. వాళ్ల ఉనికి మీలో ఎలా ఉంటుందంటే.. ఒంటరిగా సాగుతున్న పంటకాలవ దగ్గర, మామిడి కొమ్మమీద ముడుచుక్కూర్చుని సుర్రుమని చీమిడి పీల్చుతూ, ఏకాంతాన్ని ఎరగా వేసి ఎట్టకేలకు పట్టుకున్న చేపపిల్లని గుదిగుచ్చి గుట్టుగా ఇంటికి తెచ్చాక, అది ఒక్కటీ వండలేక మీ అమ్మ పారేయమని పంపినపుడు, ఇంకొక్కడ్ని తోడుపెట్టుకుని ఊరవతల దాకా పోయి, కుదురుగా కూర్చుని కాల్చుకుతింటుంటే.. ఆ వెచ్చని పచ్చి చేపా, పడిచచ్చిపోయే ఆ రుచీ మెదళ్లోకెక్కించిన వాడొకడుంటాడు. ‘పంచుకోవడం’ స్నేహమని తెలిపే వయస్సది.

పీచు మిఠాయ్, పిప్పరమెంటు, జాంకాయ, జొన్నపొత్తూ పంచుకోవడంలోని పరమానందం నాకు మాత్రమే తెలుసనే imageమహా గర్వం మూటగట్టుకొని, టింగు టింగున గంట మోగ్గానే చెంగుచెంగున గంతులేస్తూ బడి నుండి ఒడి దాకా పరిగెత్తడం పూర్తయ్యాక, చెప్పా పెట్టకుండా పక్కూరి కాలేజ్ అడ్మిషన్‌తోనో, మనం ఎదగడం భారమైన కుటుంబానికి ఉపాధి దిక్కైన ఊరితోనో బాల్యం జరిగిపోతుంది. కొత్త ముఖంతో కొందరి ముందు ఏడ్వడం రాదు, నవ్వడం చేతకాదు. అలవాటయ్యే దాకా మొహమాటాలు, అప్పుడప్పుడూ మనస్పర్థలూ ఉంటున్నపుడు తప్పు కూడా ఒప్పయ్యే తెలియనితనంలో నీ పాట పాడే వాడొకడుంటాడు. ‘భరోసా బతుకు’ స్నేహమని చెప్పే వయస్సది.

కొన్ని ప్రదేశాలెప్పుడూ మనతోనే ఉంటాయి. మనం పుట్టి పెరిగిన ప్రదేశాలూ, లేక విహారానికి వెళ్లొచ్చినవీ, ఎటైనా వెళుతూ చూసొచ్చినవీ ఆ జాబితాలో ఉండొచ్చు గాక.. వాటితో పాటు వినాయక నిమజ్జనం రోజు చేజారి పడిపోబోతుంటే పట్టుకున్న చెయ్యి మూలాన, ఆహ్వానించబడిన అద్దిల్లొకటి గుర్తుండిపోతుంది. అందులో భార్య పుట్టింటికి వెళ్లాక, అతనూ నువ్వూ మాడ్చుకుని తిన్న వడియాలు గుర్తుండిపోతాయి. ఎన్ని ఫైవ్ స్టార్ రెస్టారెంట్లతో పోల్చుకున్నాక కూడా నీ నోట్లో నీళ్లూరనపుడు తడి నోటితో నువ్వేసిన గుటకకి కారణమై ఒకడుంటాడు. ‘జీవన విధానమే జీవితమ’ని తెలిపే వయస్సది. 

పొద్దున్నే వాకింకెళ్లినపుడు ఆ లాస్ట్‌కి పోతే స్కై కిందకొస్తదనీ, మా డాడీ దాన్ని బైక్ మీద పట్టుకొస్తాడనీ అనే పిల్లాడిలోని అమాయకత్వాన్ని ఫోన్‌లో టైమ్ చూసుకుంటూ దాటిపోతున్నపుడు, వాడెదురొస్తే పిల్లలెప్పుడొస్తారని అడుగుతాడనీ, అందుకు అబద్ధం చెప్పలేక ఎదురొచ్చిన నీ వయసు ముసలాడికి ముఖం దాటేసినపుడు, నిన్ను చూసీ చూడనట్టు వెళ్లిపోవడానికి ఇష్టం లేకున్నా వెనుతిరిగే వాడొకడుంటాడు. అప్పుడు ‘మెరుస్తున్న కళ్ల కంటిచెమ్మే కాలమ’ని తెలిపే వయస్సది.

పచ్చి చేపా, అద్దిల్లూ, వడియాలూ, వాకింగ్.. ఇలా రూపం మార్చుకుంటూ మనిషికీ, కాలానికీ మధ్యవర్తిలా మారే వయసే స్నేహం.సినిమాపై చెరగని మచ్చలు

Updated By ManamSun, 07/29/2018 - 04:25

ఒకవైపు వాణిజ్యపరంగా ఎల్లలు దాటిన తెలుగు సినిమా పశ్చిమాన కూడా తన జెండాను రెపరెపలాడిస్తోంది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో బాలీవుడ్‌పై టాలీవుడ్ పైచేయి సాధిస్తోంది. మరోవైపు ఒకదాని తర్వాత ఒకటిగా పడుతున్న మచ్చలు దేశీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని మసకబారుస్తున్నాయి. మొన్నటికి మొన్న డ్రగ్స్ వ్యవహారం.. నిన్నటికి నిన్న క్యాస్టింగ్ కౌచ్ దుమారం.. ఇప్పుడు అమెరికాలో జరిగిన సెక్స్ రాకెట్ ఉదంతం.. తెలుగు చిత్రసీమను ఉక్కిరిబిక్కిరి చేశాయి, ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఇది బయటకు వచ్చింది, రేపు ఇంకే విషయం వెలుగులోకి వస్తుందోనని సినీ జనాలు గుండెలుగ్గబట్టుకొని చూస్తున్నారు. సరిగ్గా ఏడాది వ్యవధిలో చోటు చేసుకున్న మూడు భిన్న స్కాండల్స్ టాలీవుడ్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. ఎవరో కొద్దిమంది చేస్తున్న పనులకు మొత్తం పరిశ్రమనే వేలెత్తి చూపడం కరెక్టేనా?.. అనే ప్రశ్న వస్తున్నా, గ్లామర్ వరల్డ్ కావడమే దానిపై ఫోకస్‌కు కారణమని విశ్లేషకులు అంటున్నారు.
 

image

షాక్ 1: డ్రగ్స్ అండ్ టాలీవుడ్
ఈ మధ్య కాలంలో అటు సినీ వర్గాల్నీ, ఇటు సినీ ప్రియుల్నీ షాక్ చేసిన అతి పెద్ద కుదుపు డ్రగ్ కేసులు. డ్రగ్ పెడ్లర్స్‌గా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన కెల్విన్ అండ్ గ్యాంగ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారంటూ పన్నెండు మంది టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు రావడం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనాన్నీ, దేశీయంగా దిగ్భ్రమనూ కలిగించింది. 2017 జూలైలో చోటు చేసుకున్న ఈ ఘటనలు తెలుగు సినిమా ప్రతిష్ఠకు మచ్చగా నిలిచాయి. ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ విచారించిన imageవాళ్లలో రవితేజ, పూరి జగన్నాథ్, ఛార్మి వంటి పేరుపొందిన వాళ్లతో పాటు నవదీప్, తరుణ్, తనీశ్, నందు వంటి హీరోలు, ఐటమ్ సాంగ్స్‌కు పేరుపొందిన ముమైత్‌ఖాన్, నటుడు సుబ్బరాజు, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు వంటి వాళ్లు ఉండటం హాట్ టాపిక్ అయింది. మీడియా అటెన్షన్ మొత్తం అటువైపే పడటంతో, దానికి మించిన విషయం మరోటి లేనంతగా రచ్చరచ్చ అయింది. దీనిపై ఎవరికి తోచినట్లు వాళ్లు కథనాలు రాశారు, కథలు అల్లారు. సెలబ్రిటీలను అకున్ సభర్వాల్ గంటల తరబడి విచారించడం, కొందరి నుంచి రక్త నమూనాలను సైతం సేకరించడం అనేది అప్పట్లో జాతీయ స్థాయిలో సెన్సేషనల్ న్యూస్. విచారణ పూర్తయింది. త్వరలోనే దోషుల్ని తేల్చేస్తామన్నారు సభర్వాల్. డ్రగ్స్ ఉచ్చు ఏయే సెలబ్రిటీల మెడకు చుట్టుకుంటుందోనని అందరూ గుండెలు ఉగ్గబట్టుకొని చూశారు.

నెల, రెండు నెలలు.. ఏకంగా సంవత్సరం గడిచింది. ఇప్పటి వరకూ ఈ కేసు పురోగతి గురించిన సమాచారం లేదు. ఇంత కాలమైనా సెలబ్రిటీల్లో ఒక్కరు కూడా డ్రగ్స్ కేసులో దోషులుగా ఉన్నట్లు తేలలేదు. ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.. ఏ ఆధారాలతో చిత్రరంగంలో పేరు ప్రఖ్యాతులున్నవాళ్లను డ్రగ్స్ వ్యవహారంలో విచారించారు? ఆ వ్యవహారానికి ఎందుకంత ప్రచారం కల్పించారు? కెల్విన్ గ్యాంగ్ వద్ద లభ్యమైన పేర్ల ఆధారంగానే సెలబ్రిటీలను విచారించవచ్చా? అంతకు మించిన బలమైన ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదా? సినీ సెలబ్రిటీలను ఈ వ్యవహారంలోకి లాగడమంటే దానికి ఎక్కడలేని ప్రచారం వస్తుందనే విషయం కానీ, గట్టి ఆధారాలు లేకుండా వారిని విచారించడం వల్ల సమాజానికి ఎలాంటి సూచనలు వెళ్తాయనే విషయం కానీ ప్రభుత్వానికి తెలీకుండా ఉంటుందా?

నిజానికి ఈ పన్నెండు మంది సెలబ్రిటీల పేర్లే కాకుండా కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినీరంగానికే చెందిన ఘన చరిత్ర కలిగిన ప్రముఖుల పిల్లల పేర్లు కూడా కెల్విన్ లిస్టులో ఉన్నాయనీ, ముందుగానే విషయం లీకవడంతో వాళ్లు తమ పేర్లు బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారనీ, ఎలాంటి పెద్దతలకాయలు లేనివాళ్లే తెరపైకి వచ్చారనీ ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి కేసు ఏకపక్షంగా మారింది. ఇప్పుడైతే ఆ కేసు వ్యవహారం బుట్టదాఖలైనట్లే కనిపిస్తోంది.

షాక్ 2: క్యాస్టింగ్ కౌచ్
హాలీవుడ్‌లో పేరుపొందిన సీనియర్ ప్రొడ్యూసర్ హార్వే వీన్స్ తమను లైంగికంగా వేధించాడని అక్కడి పలువురుimage తారలు బాహాటంగా ప్రకటించడంతో క్యాస్టింగ్ కౌచ్ దుమారం పెద్ద ఎత్తున చెలరేగింది. ఐశ్వర్యారాయ్ సైతం హార్వే నుంచి త్రుటిలో తప్పించుకున్న వైనం కూడా వెలుగు చూసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘మీటూ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో అనేకమంది తమ అనుభవాలను షేర్ చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఉదంతం చర్చనీయాంశమైంది. ఆ గొడవ సద్దుమణుగుతున్న దశలో శ్రీరెడ్డి అనే ఎవరికీ పెద్దగా తెలీని తార పేల్చిన క్యాస్టింగ్ కౌచ్ బాంబు టాలీవుడ్‌ను అతలాకుతలం చేసేసింది. మహామహులనుకున్నవాళ్లే ఆమె దెబ్బకు బెంబేలెత్తారు.

జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్ఠలున్న నిర్మాణ సంస్థ సురేశ్ పొడ్రక్షన్స్ అధినేత డి. సురేశ్‌బాబు చిన్న కుమారుడు, రానా తమ్ముడు అభిరామ్‌తో అతి సన్నిహితంగా ఉన్న ఫొటోలను మీడియా ముఖంగా శ్రీరెడ్డి బహిర్గతం చేయడంతో కేవలం చిత్రసీమే కాకుండా తెలుగు ప్రజానీకమంతా దిగ్భ్రాంతికి గురైంది. సినిమాల్లో అవకాశాలిస్తామని చాలామంది తనను వాడుకొని, వదిలేశారంటూ శ్రీరెడ్డి ఆరోపించారు. హీరోయిన్లు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులైన స్త్రీలు కానీ సినిమాల్లో అవకాశం రావాలంటే తమ శరీరాన్ని పణంగా పెట్టాల్సిందేనని ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తనకు సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందనీ ఆమె ఆరోపించారు. తనకు న్యాయం చేయాలంటూ ఫిల్మ్‌చాంబర్ సమీపంలో రోడ్డుపైనే ఆమె చేసిన అర్ధనగ్న ప్రదర్శన సమస్యను మరింత వేడెక్కించింది. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రత్యక్షంగా పేర్లు ప్రస్తావించకుండా హీరో నాని, డైరెక్టర్ కొరటాల శివ, రైటర్ కోన వెంకట్‌లను ఉద్దేశించి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. రకుల్‌ప్రీత్ సైతం క్యాస్టింగ్ కౌచ్ ద్వారానే హీరోయిన్ అవకాశాలు పొందిందని ప్రకటించిన ఆమె, ఆ తర్వాత రకుల్‌కు సారీ చెప్పారు. శ్రీరెడ్డి ఆరోపణలపై మొదట మౌనంగా ఉండిపోయిన నాని, కొరటాల, కోన.. ఆరోపణల దాడి అంతకంతకూ ఎక్కువవుతుండటంతో పెదవి విప్పారు. ఆమెతో తమకు ఏమాత్రం సంబంధం లేదనీ, తమ పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించిన ఆమెపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామనీ చెప్పారు. నాని అయితే శ్రీరెడ్డికి నోటీసులు కూడా పంపారు.

శ్రీరెడ్డికి మద్దతు
క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించి శ్రీరెడ్డికి పెద్ద తలకాయలెవరూ మద్దతు తెలపలేదు కానీ, కొంతమంది మహిళా సహాయimage ఆర్టిస్టులు ఆమెవైపు నిలిచారు. సినిమా అవకాశాల విషయంలో తాము ఎదుర్కొన్న అనుభవాలను టీవీ చానళ్ల ద్వారా పంచుకున్నారు. మెగా కుటుంబానికి దగ్గరైన ఓ కో డైరెక్టర్ తమను లైంగికంగా వేధించాడనీ, అతనికి పదహారేళ్ల అమ్మాయిలే కావాలంటూ ఆరోపించడం కలకలం రేపింది. ఈ సమయంలోనే శ్రీరెడ్డితో డైరెక్టర్ తేజ నేరుగా మాట్లాడి, ఆమెకు తన రెండు సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పారు. సీనియర్ సహాయ నటి అపూర్వ సైతం శ్రీరెడ్డికి మద్దతు ప్రకటించారు. అయితే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనేది లేదని కరాటే కల్యాణి వంటి మరో సహాయ నటి స్పష్టం చేశారు. రకుల్, మమతా మోహన్‌దాస్ వంటి తారలు తమకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవలేదని చెప్పగా, మరో హీరోయిన్ రాధికా ఆప్టే తనను ఓ టాలీవుడ్ హీరో ఇబ్బంది పెట్టగా, అతడికి తను గట్టిగా బుద్ధిచెప్పానని ప్రకటించి సంచలనం సృష్టించారు. బాలీవుడ్‌లో సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన సరోజ్‌ఖాన్ అయితే క్యాస్టింగ్ కౌచ్‌లో తప్పేమీ లేదన్నట్లు మాట్లాడటం వివాదాల్ని సృష్టించింది.

ఇండస్ట్రీలో ఎవరూ బలవంతపెట్టరనీ, ఇష్టం ఉన్నవాళ్లే అందుకు సిద్ధపడుతున్నారనీ ఆమె చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన చేయడం నటీనటుల సంఘమైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు తలనొప్పిగా మారింది. నడిరోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన వంటి చర్య ద్వారా సినీ ఇండస్ట్రీ పరువును శ్రీరెడ్డి మంటగలుపుతోందన్న ‘మా’.. మొదట ఆమెకు సభ్యత్వం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. కానీ శ్రీరెడ్డి ఆరోపణలకు గురవుతున్న వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం, వాళ్లలో పేరుపొందిన సినీ కుటుంబాల వాళ్లూ ఉండటంతో ఆమెకు సభ్యత్వం ఇస్తున్నామని ప్రకటించింది ‘మా’. దీంతో దాని ద్వంద్వ వ్యవహారశైలిపై విమర్శలు రేగాయి. 

శ్రీరెడ్డి ఆరోపణలపై స్పందించిన పవన్‌కల్యాణ్.. ఆమె ఆరోపణలు చేయడం కాకుండా నేరుగా ఆధారాలతో పోలీసులకు imageఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. దీంతో ఆమె పవన్‌తో పాటు, ఆయన తల్లినీ కూడా దూషించారు. దీనిపై దుమారం చెలరేగడంతో, ఆమెతో అలా మాట్లాడించింది తానేననీ, పవన్‌ను దూషిస్తే ఈ వ్యవహారంపై మరింతగా అటెన్షన్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆమెకు సలహా ఇచ్చానంటూ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ తెరపైకి వచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఫిల్మ్‌చాంబర్ ఏం చేస్తోందని ప్రశ్నిస్తూ పవన్‌కల్యాణ్ చాంబర్ కార్యాలయానికి వచ్చి హడావిడి చేశారు. తెలుగుదేశం పార్టీవాళ్లే తనను టార్గెట్ చేసి, వెనుక ఉండి శ్రీరెడ్డి చేత అలా మాట్లాడించారని ఆయన ఆరోపిస్తే, వైసీపీ పార్టీ నాయకులే తనను అలా చేయమన్నారని శ్రీరెడ్డి జరిపిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇలా ఈ క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం కాస్తా రాజకీయ రంగు కూడా పులుముకుంది.

శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ సమస్య భవిష్యత్తులో మళ్లీ తలెత్తకుండా దీనిని డీల్ చేయడానికి ‘క్యాష్’ (కమిటీ ఎగనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్)ను ఏర్పాటు చేయనున్నట్లు సినీ పెద్దలు ప్రకటించారు. ఇందులో సినిమావాళ్లతో పాటు, బయటి నుంచి కూడా కొంతమంది వ్యక్తులు ఉంటారన్నారు. కానీ ఇంతవరకు ఈ ‘క్యాష్’ విషయం ఎంతవరకొచ్చిందో వెల్లడి కాలేదు. 

షాక్ 3: అమెరికాలో సెక్స్ రాకెట్
డ్రగ్స్, క్యాస్టింగ్ కౌచ్ కథలింకా పూర్తిగా సద్దుమణగనే లేదు. జనం వాటిని తలచుకోవడం పూర్తిగా మాననే లేదు.. imageఅంతలోనే వచ్చిపడింది మరో ఉపద్రవం. అదీ సెక్స్ రాకెట్ రూపంలో! గతంలో ‘హోటల్‌లో వ్యభిచరిస్తూ పట్టుబడిన సినీతార’, ‘అపార్ట్‌మెంట్‌లో తారల హైటెక్ వ్యభిచారం’ అనే వార్తలు అప్పుడప్పుడూ కనిపించడం మనకు తెలుసు. కొన్నాళ్ల కిత్రం తొలి తెలుగు చిత్రంతోటే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న వర్థమాన తార హెదరాబాద్‌లోని పార్క్ హ్యాత్ అనే ఫైవ్‌స్టార్ హోటల్‌లో వ్యభిచరిస్తూ పట్టుబడిందన్న వార్త పతాక శీర్షికలకు ఎక్కడమూ మనకు తెలుసు. కానీ ఇది వాటన్నింటికంటే మించిన సెక్స్ రాకెట్. తెలుగు సినీ, టీవీ తారల ప్రమేయమున్న ఈ సెక్స్ రాకెట్‌కు అమెరికా వేదికవడంతో సహజంగానే ఈ ఉదంతం దేశం దృష్టిని ఆకర్షించింది. కృష్ణ మోదుగుముడి అనే దళారీ, అతని భార్య కలిసి ఏదో ఒక కార్యక్రమంలో అమెరికాకు వచ్చే తెలుగు తారలతో వ్యభిచారం చేయిస్తున్న వ్యవహారాన్ని అక్కడి పోలీసులు ఛేదించి, వెలుగులోకి తెచ్చారు. వాళ్లు ఒక తార విషయంలో లాగిన తీగతో డొంక కదిలింది. కృష్ణ నివాసంలో తనిఖీలు చేయడంతో విస్తుపోయే సెక్స్ రాకెట్ బయటపడింది. అమెరికన్ పోలీసులు పేర్లు వెల్లడి చేయలేదు కానీ, ఈ రాకెట్‌లో కొంతమంది తెలుగు తారలున్నారని స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఒక మురికి కూపమనే భావనను కలిగించాయి. అతి కొద్దిమంది చేసిన తప్పులకు మొత్తం పరిశ్రమను నిందించడం న్యాయమా?.. అనేవాళ్ల ఆవేదనను పట్టించుకున్నవాళ్లు లేరు.

అసలు అమెరికాలో సినీ తారలు, యాంకర్లు వ్యభిచరించడమేమిటనేది అందర్నీ ఆశ్చర్యానికి లోను చేసిన విషయం.image కృష్ణ, అతని భార్య విటులతో కేవలం వెయ్యి, రెండు వేల డాలర్లకే డీల్ కుదుర్చుకొని తారలను వాళ్ల వద్దకు పంపిస్తున్నారనే విషయం మరింత ఆందోళన కలిగించింది. మన ప్రాంతాన్ని విడిచి అమెరికాలో నివాసముంటున్న వాళ్లు సంఘాలుగా ఏర్పడి, అప్పుడప్పుడూ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ, అతిథులుగా సినీ తారలను, యాంకర్లను పిలవడం మామూలే. ఒకటికి మించి తెలుగు సంఘాలు ఏర్పడి, వాటి మధ్య నెలకొన్న పోటీ కారణంగా కార్యక్రమాల్ని ఘనంగా చేశామని చెప్పుకోడానికి తారల్ని పిలవడం ఆనవాయితీ కావడంతో, తారలకూ ఇది ఆటవిడుపుగానూ, లాభదాయకంగానూ తయారైంది. సాధారణంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పిలిచినప్పుడు తారలు షూటింగ్‌లతో బిజీగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఖాళీగా ఏ తారలున్నారనే విషయం తెలుసుకోడానికి దళారీలు అవసరమయ్యారు. అమెరికా వెళ్లే తారలకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం దగ్గర్నుంచి, అమెరికాలో ఉండేందుకు వసతులు ఏర్పాటు చేయడం వరకూ చూసుకునే దళారీలు పుట్టుకొచ్చారు. ఈ సందర్భంలో తెలుగు తారలతో గడపడానికి ఆసక్తిచూపే అమెరికాలోని డబ్బున్న కొంతమంది తెలుగువాళ్లకు ఇది బాగా పనికొచ్చింది. దళారీలకు కావాల్సింది డబ్బు. దానితో ఇక్కడి తారలతో అక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ వస్తున్నారనేది తాజాగా బయటపడిన భయంకర నిజం.

imageఅలా అని ప్రవాసాంధ్రుల కార్యక్రమాలకు వెళ్లే తారలందరినీ ఒకే గాటన కట్టడం తప్పు. ఇటీవలే తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి, పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఒక హీరోయిన్‌ను ఇలాంటి పనులు చేయడానికి సంప్రదించినప్పుడు, ఆమె దాన్ని తిరస్కరించడమే కాకుండా, పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఈ భాగోతం బయటపడింది. తనతోనూ ఇలాంటి పని చేయించడానికి కృష్ణ మోదుగుమూడి ఫోన్‌లో సంప్రదించాడనీ, తాను తిరస్కరించడంతో సరిపెట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాననీ ఒక పేరుపొందిన యాంకర్ వెల్లడించారు. తమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తారలతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం తెలియడంతో అక్కడి తెలుగువాళ్లలో చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. దీంతో తమకు అతిథులుగా వచ్చే తారల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని వాళ్లు భావిస్తున్నారు.

సాఫ్ట్ టార్గెట్!
యాజమాన్యం కారణంగా ఒక కార్మికుడు ఇబ్బందులు ఎదుర్కొంటే, అతడిని కాపాడ్డానికి కార్మిక సంఘం రంగంలోకి దిగుతుంది. ఒక రాజకీయ నాయకుడు సమస్యల్లో చిక్కుకుంటే, అతడిని పార్టీ కాపాడుకుంటుంది. మరి సినిమా వ్యక్తి కష్టాల్లో పడితే? ఆదుకోవడానికి ఎవరూ రారనేది సాధారణాభిప్రాయం. సినీ రంగమనేది సాఫ్ట్ టార్గెట్‌గా మారిపోతోందని చాలా కాలం నుంచే సినిమావాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కానీ, క్యాస్టింగ్ కౌచ్ విషయంలో కానీ, ఇప్పుడు సెక్స్ రాకెట్ ఉదంతంలో కానీ.. సినిమా రంగాన్నంతా బోనులో నిలబెట్టినట్లు సమాజం వ్యవహరిస్తోందని వాళ్లు వాపోతున్నారు. ఇండస్ట్రీలోని వ్యక్తుల మధ్య ఐకమత్యం లోపించడంతో, ఒక్క గొంతుకగా మారలేక పోతున్నారు, నినదించలేక పోతున్నారు. సినిమావాళ్లు నోరు మెదపలేక పోవడం వల్లే డ్రగ్స్ కేసు రచ్చకెక్కిందనేది విశ్లేషకుల అభిప్రాయం. శ్రీరెడ్డి ఉదంతంలోనూ చిత్రసీమ ఒక్కతీరుగా వ్యవహరించలేక పోయింది. ఇప్పుడు సెక్స్ రాకెట్ వ్యవహారంపైనా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. ఇలా దేనికీ పట్టనట్లు ఉన్నంత కాలం టాలీవుడ్ సాఫ్ట్ టార్గెట్ అవుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. ఇకనుంచైనా తన తీరును టాలీవుడ్ మార్చుకుంటుందా, సమస్యలను ఎదుర్కొనే విషయంలో ఒక్కతాటిపై నిలుస్తుందా?

కోలీవుడ్ కూడా..
పరిస్థితి అదుపు తప్పుతున్నదని భావించిన సినీ పెద్దలు టీవీ చానళ్లతో చేసిన సంప్రదింపుల ఫలితంగా శ్రీరెడ్డి వ్యవహారం కొద్ది రోజుల పాటు సద్దుమణిగినట్లు కనిపించింది. పేరున్న చానళ్లన్నీ ఆమెను దూరం పెట్టేశాయి. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఏవో రాయడం మినహా ఆమెపై ఎవరూ పెద్దగా దృష్టి పెట్టలేదు. అంతలోనే ఆమె మరో బాంబు పేల్చారు. తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ దర్శకులు ఎ.ఆర్. మురుగదాస్, లారెన్స్, సి. సుందర్ (ఖుష్బూ భర్త), నటుడు శ్రీకాంత్ (శ్రీరామ్) వంటి వాళ్లు తనకు అవకాశాలిస్తామని చెప్పి వాడుకొని వదిలేశారని ఆమె ఆరోపించడం కలకలం రేపింది. దీనిపై స్పందించాలని మరో సీనియర్ డైరెక్టర్ టి. రాజేందర్ డిమాండ్ చేయడంతో సి. సుందర్ స్పందించారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన శ్రీరెడ్డిపై లీగల్‌గా చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. హీరో కార్తి స్పందిస్తూ, శ్రీరెడ్డి ఆధారాలతో న్యాయపోరాటం చేస్తే బావుంటుందని సూచించారు. ఈ వ్యవహారంపై హీరో విశాల్ తనను బెదిరించారని ఆరోపించిన శ్రీరెడ్డి, ఆ తర్వాత విశాల్‌కు క్షమాపణలు చెప్పారు. కోలీవుడ్‌లో ఈ రగడ ఇంకా నడుస్తూనే ఉంది.


 

Related News