rupee

కొనసాగిన పతనం కోలుకోని రూపాయి

Updated By ManamWed, 09/19/2018 - 00:23
  • అమెరికా-చైనాల మధ్య పెరిగిన వాణిజ్య సుంకాల యుద్ధం

rupeeeముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) ‘సెన్సెక్స్’ నష్టాలు వరుసగా రెండో సెషన్ మంగళవారంనాడు కూడా కొనసాగాయి. అది 295 పాయింట్లకు పైగా క్షీణించి,  37,291 స్థాయి వద్ద ముగిసింది. నెల పైచిలుకు రోజుల్లో అది ఇంత కనిష్ఠ స్థాయిని చూడడం ఇదే మొదలు. అమెరికా-చైనా వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు పెచ్చుమీరడం, రూపాయి కష్టాలు ఘోరంగా పరిణమించడంతో ఫినాన్షియల్, మోటారు వాహన రంగ షేర్లు తీవ్ర అమ్మకాలను చవి చూశాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 98 పాయింట్లు నష్టపోయి 11,300 స్థాయికి దిగువన ముగిసింది. పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్లలో మరింత నిరుత్సాహం నింపాయి. అమెరికన్ డాలర్‌తో మారకంలో దేశీయ కరెన్సీ మధ్యాహ్న లావాదేవీలలో 27 పైసలు క్షీణించి రూ. 72.78 (ఇంట్రా-డే) వద్ద ఉంది. ట్రంప్ ప్రకటనతో దుమారం చైనా నుంచి 200 బిలియన్ డాలర్ల విలువైన అదనపు దిగుమతులపై కొత్తగా సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించడంతో, ఏషియాలోని ఆ పెద్ద దేశంతో వాణిజ్య యుద్ధం రాజుకున్నట్లయింది. అనుచిత వర్తక విధాలను మార్చుకునేందుకు చైనా విముఖంగా ఉందని ఆరోపిస్తూ, నూతన అదనపు సుంకాల వ్యవస్థ సెప్టెంబర్ 24 నుంచి అమలులోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సంవత్సరాంతం వరకు సుంకాలు 10 శాతంగా ఉంటాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సుంకాలు 25 శాతం స్థాయికి పెరుగుతాయి. 

ఆరంభం బాగున్నా...
బి.ఎస్.ఇ 30 షేర్ల ‘సెన్సెక్స్’ మంగళవారం ఒక మోస్తరు మెరుగైన స్థాయి 37,660.19 వద్ద మొదలై, 37,745.44కు పెరిగినప్పటికీ, తర్వాత, అంతకంతకు క్షీణించిపోతూ వచ్చింది. ఆ దశలో 37,242.85 కనిష్ఠ స్థితిని చూసింది. ట్రేడింగ్ ముగింపులో అమ్మకాలు ముమ్మరమవడంతో, చివరకు 294.84 నష్టంతో 37,290.67 వద్ద ముగిసింది.  ఆగస్టు 2 (37,165.16) తర్వాత ‘సెన్సెక్స్’కి ఇదే అత్యల్ప ముగింపు. ‘సెన్సెక్స్’ సోమవారం 505.13 పాయింట్లు కోల్పోయింది. ‘నిఫ్టీ’ మంగళవారం 98.65 పాయింట్లు కోల్పోయి 11,278.90 వద్ద ముగిసింది. సెషన్‌లో అది 11,268.95 నుంచి 11,411.45 మధ్య ఊగిసలాడింది. దేశీయ మదుపు సంస్థలు సోమవారం రూ. 180.36 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ. 106.54 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించినట్లు తాత్కాలిక డాటా సూచించింది. రూపాయి నిరాశ... మార్కెట్లకు ప్రయాస

Updated By ManamMon, 09/17/2018 - 22:23
  • వీడని ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాలు

  • రెండు సెషన్లలో గడించిన లాభాలకు బ్రేక్ 

  • సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 38వేల దిగువన ముగిసింది

bseముంబై: బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి సోమవారం 505 పాయింట్లు పతనమై 38,000 స్థాయి దిగువకు జారింది. ‘సెన్సెక్స్’ రెండు సెషన్లలో గడించిన లాభాలకు బ్రేక్ పడింది. దేశీయ కరెన్సీ తీవ్రంగా పతనమవకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను ప్రకటించినప్పటికీ, కొనసాగుతున్న రూపాయి కష్టాలు, ప్రపంచ వాణిజ్య యుద్ధ కలతలు ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురికొల్పాయి. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ)  50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ కూడా 137 పాయింట్లకు పైగా కోల్పోయి 11,400 స్థాయికి దిగువన ముగిసింది. ఫినాన్షియల్ సంస్థలు హెచ్.డి.ఎఫ్.సి లిమిటెడ్, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్‌లు  ఈ సెషన్‌లో మార్కెట్లను వెనక్కిలాగి పట్టిన ప్రధాన షేర్లయ్యాయి. కీలక సూచీలను వాటి కీలక స్థాయిల నుంచి కిందకు దింపాయి. అమెరికా-చైనాల మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధంతో  ఏషియన్, యూరోపియన్ మార్కెట్లు మందగొడిగా సాగడం దేశీయ స్టాక్ మార్కెట్లలో జాగరూకతకు దారితీసింది. కరెంట్ అకౌంట్ లోటు విస్తృతిని అరికట్టేందుకు, రూపాయి పతనాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం శుక్రవారం కొన్ని చర్యలను ప్రకటించింది. మసాలా బాండ్లపై విత్‌హోల్డింగ్ పన్ను తొలగింపు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సడలింపు, అప్రధానమైన వస్తువుల దిగుమతులపై ఆంక్షలు వంటివి వాటిలో ఉన్నాయి. 

దెబ్బతిన్న రూపాయి
భారతీయ కరెన్సీ మరోసారి రూ. 72 స్థాయిని అధిగమించి, అమెరికన్ డాలర్‌తో మారకం విలువ రూ. 72.69 (ఇంట్రా-డే)కి పడిపోయింది. ‘‘అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత పెచ్చుమీరడానికి అవకాశం ఉందనే వార్త మార్కెట్లకు మింగుడుపడలేదు. రూపాయిలో బలహీనత మార్కెట్‌ను మరింత కుంగదీసింది. చాలా రంగాల సూచీలు గీటురాయి ‘సెన్సెక్స్’కి అనుగుణంగానే సాగి, దిగువ స్థాయిల్లో ముగిశాయి. ప్రస్తుతం మార్కెట్లు ప్రపంచ రాగాలకు అనుగుణంగా నర్తనమాడుతున్నాయి. ఈ పరిస్థితిలో అంత త్వరగా మార్పు వస్తుందని మేం అనుకోవడం లేదు..’’ అని ఒక విశ్లేషకుడు అన్నారు. బి.ఎస్.ఇ  ‘సెన్సెక్స్’ 38,027.81 వద్ద మొదలై, వేగంగా 38000 స్థాయి దిగువకు జారింది. ఇటీవల పెరిగిన వాటితో సహా, వివిధ రంగాల షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాలతో 37,548.93 పాయింట్ల కనిష్ఠ స్థితిని చూసింది. చివరకు 505.13 పాయింట్ల నష్టంతో, 37,585.51 వద్ద ముగిసింది. 

మార్కెట్ విలువ ఢమాల్ 
బి.ఎస్.ఇలో లిస్ట్ అయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారంనాడు రూ. 1,14,676 కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. షేర్ల సంఖ్యతో షేర్ల విలువను గుణించగా వచ్చే మొత్తాన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. గత రెండు సెషన్లలో  ‘సెన్సెక్స్’ 677.51 పాయింట్లు లాభపడింది. ఎన్.ఎస్.ఇ నిఫ్టీ కూడా 11,366.90 కనిష్ఠ స్థితిని చూసి, చివరకు 137.45 పాయింట్ల నష్టంతో, 11,377.75 వద్ద ముగిసింది. కాగా, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు శుక్రవారం రూ. 1,090.56 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ మదుపు సంస్థలు రూ. 115.14 కోట్ల విలువ చేసే కొనుగోళ్ళు జరిపాయని తాత్కాలిక డాటా సూచించింది. 

తగ్గని చమురు ధరలు
ప్రపంచ మార్కెట్లలో అధికంగా ఉన్న ముడి చమురు ధరలు కూడా ఇక్కడి సెంటిమెంట్లను కుంగదీశాయి. చమురుకు అంతర్జాతీయ గీటురాయిగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర పీపాకు 78.60 వద్ద కోట్ అవుతోంది. డబ్ల్యు.టి.ఐ క్రూడ్  పీపాకు 69.48 డాలర్లుగా కోట్ అవుతోంది. ప్రపంచ మార్కెట్లను తలదన్నుతూ సాగిన భారతదేశపు స్టాక్ మార్కెట్ ఆరోహణకు తెరపడినట్లేనని ప్రపంచ ఫినాన్షియల్ సర్వీసుల కంపెనీ గోల్డ్‌మ్యాన్ శాక్స్ నివేదికలు కూడా మదుపరుల సెంటిమెంట్లపై నీళ్ళు చల్లాయి. స్థిరాస్తులు, విద్యుత్, మౌలిక వసతుల రంగాల సూచీలు మాత్రం మిగిలిన వాటికి భిన్నంగా సోమవారం 1.36 శాతం పెరుగుదలను చూశాయి.మరింత కనిష్టానికి రూపాయి

Updated By ManamWed, 09/12/2018 - 10:52

Rupeeముంబై: గత కొన్ని రోజులుగా పడిపోతూ వస్తున్న దేశీయ కరెన్సీ రూపాయి తాజాగా మరింత కనిష్టానికి చేరింది. బుధవారం ఆరంభంలోనే 41పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్ మారకంలో రుపాయి విలువ 72.91 స్థాయిని తాకింది. ముడిచమురు ధరలు పెరగడంతో పాటు విదేశీ మదుపర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు ప్రపంచ వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో బ్యాంకులు, దిగుమతి దారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. దీంతో రూపాయి విలువ అంతకంతకూ పడిపోతోంది. మరోవైపు రుపాయి పతనం దేశీయ ఈక్విటీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. కీలక సూచీ సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా క్షీణించగా, నిఫ్టీ కూడా 151 పాయింట్లు క్షీణించి 11, 288 వద్ద ముగిసింది.కొత్త కనిష్ఠ స్థితికి కుంగిన రూపాయి

Updated By ManamTue, 09/11/2018 - 22:21

rupee-falling_ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం కొనసాగి మంగళవారం అది సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 72.73కు పడిపోయింది. మధ్యాహ్న ట్రేడ్‌లో అది 28 పైసలు క్షీణించింది. ముడి చమురు ధర పీపాకు 78 డాలర్లు మించడంతో అమెరికన్ కరెన్సీ మరింత పటిష్టపడింది. విదేశీ ఫండ్లు స్టాక్ మార్కెట్ల నుంచి మదుపు మొత్తాలను ఉపసంహరించుకోవడం నిర్విరామంగా సాగుతోంది. బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ మంగళవారం 500 పాయింట్లకు పైగా పతనమవడం కూడా దేశీయ కరెన్సీని కుంగదీసింది. బ్యాంకులు, ఎగుమతిదార్ల నుంచి పెరిగిన అమ్మకాలతో డాలర్‌తో మారకంలో రూపాయి మంగళవారం ఉదయం 20 పైసలు పుంజుకుని రూ. 72.25 వద్ద సానుకూల ధోరణిలోనే మొదలైంది. కానీ, అది ఆ గతిని నిలబెట్టుకోలేక మరో 28 పైసలు క్షీణించి రూ. 72.73కు పడిపోయింది. సోమవారంనాడది రూ. 72.67 కనిష్ఠ స్థాయిని చూసింది. విలవిలలాడుతున్న రూపాయి

Updated By ManamMon, 09/10/2018 - 12:26
Rupee Dives To New Lifetime Low Of 72.48 Against US Dollar

న్యూఢిల్లీ : రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనం అయింది. రూపాయి రోజు రోజుకు బక్కచిక్కుతూ డాలర్ ఎదుట సాగిలపడుతోంది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం రేటు సోమవారం సరికొత్త కనిష్ఠ స్థాయి రూ. 72.44కి పడిపోయింది. ట్రేడింగ్ ఆరంభంలోనే మునుపెన్నడూ లేనివిధంగా తొలిసారి 64 పైసల నష్టంతో 72.37 స్థాయికి చేరింది.

ఓవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, మరోవైపు  రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఆవేశకావేషాల ప్రకటనలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ సెంటిమెంట్లను మరింత దెబ్బతీశాయి.

అలాగే ప్రపంచ అనిశ్చిత పరిస్థితులు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో రూపాయి విలువ క్షీణిస్తున్న గతిలో ఉంది. మరోవైపు రూపాయి పతనంతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే సెన్సెక్స్‌ 233 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్లు క్షీణించాయి.మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Updated By ManamMon, 08/27/2018 - 14:17
petrol, diesel

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం డీజిల్ ధర రికార్డు స్థాయిలో పెరిగింది.  లీటర్ డీజిల్ ధర 69.46కు చేరగా, పెట్రోల్ రూ.78కి చేరింది. అంతర్జాతీయగా ముడి చమురు ధరలు పెరగడంతో పాటు రూపాయి పతనం కూడా ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. డీజిల్ ధ‌ర 14 పైసలు, పెట్రోల్ 13 పైసల మేర పెరిగింది. 

ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.69.46 పైసలు ఉండగా, ముంబైలో 73.74గా ఉంది. అలాగే పెట్రోల్ ఢిల్లీలో లీటర్ రూ.77.91, ముంబైలో  85.33గా ఉంది. కాగా డీజిల్ ధరలు గత కొంతకాలంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మేలో డీజిల్ ధర రూ.69.31గా నమోదైంది. కాగా  గతేడాది జూన్ 15 నుంచి పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో రోజువారి సమీక్షా విధానాన్ని కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.రూపాయి బలపడొచ్చు

Updated By ManamWed, 08/22/2018 - 22:14

rupeeన్యూఢిల్లీ: కొంతకాలంగా తీవ్రంగా దెబ్బతింటూ వస్తున్న రూపాయి ఆసియాలోని చాలా భాగం ప్రవర్థమాన మార్కెట్లు కనబరుస్తున్న రిలీఫ్ ర్యాలీ, దేశంలోకి తరలి వస్తున్న సానుకూలంగా ఉన్న పెట్టుబడుల ప్రవాహాల పుణ్యమా అని విలువను పెంచుకోవచ్చని నిపుణులు చెబు తున్నారు. టర్కిష్ సంక్షోభం మధ్యలో అమెరికన్ డాలర్‌కు పటిష్టమైన డిమాండ్ రావ డంతో, ఆగస్టు 16న దాని తో రూపాయి మారకం విలువ మొదటిసారిగా రూ. 70కి కొద్ది దిగువన ముగిసింది. ప్రపంచ అనిశ్చి త పరిస్థితులు, ద్రవ్యోల్బణంపై ఆందోళనలతో రూపాయి విలువ క్షీణిస్తున్న గతిలో ఉంది. కానీ, కడచిన కొద్ది రోజులుగా అది తిరిగి కొంత కోలుకున్నట్లు కనిపిస్తోంది. ‘‘అమెరికా-చైనా మధ్య తాజా వాణిజ్య చర్చలు మొదలవడం, టర్కిష్ సంక్షోభం సడలిపోవడంతో ఏషియాలోని చాలా ప్రవర్థమాన మార్కెట్ల కరెన్సీలలో ఊరటతో కూడిన ర్యాలీ కనిపిస్తోంది. వాటిననుసరించి భారతీయ రూపాయి విలువ కూడా పెరుగుతోంది’’ అని ఎపిక్ రిసెర్చ్ సి.ఇ.ఓ ముస్తఫా నదీమ్ అన్నారు. అమెరికన్ డాలర్‌పై బేరిష్ పందాలు పెరగడంతో రూపాయి మారకం విలువ అర శాతంపైగా వృద్ధి చెందింది. ప్రస్తుతం రూ. 70.2గా ఉన్న రూపాయి మారకం విలువ బలపడి రూ. 69.4 లేదా రూ. 69.5కి తగ్గవచ్చని ఆయన చెప్పారు. ఈ నెలలో దేశంలోకి ప్రవహిస్తున్న పెట్టుబడుల ప్రవాహాలను ఆధారం చేసుకుని డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68 లేదా రూ. 69 వద్ద స్థిరపడవచ్చని భావిస్తున్న ట్లు ఆర్థిక వ్యవ హారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ కూడా చెప్పారు. రష్యా, బ్రెజిల్, అర్జెంటీనా, టర్కీ కరెన్సీలతో పోలిస్తే, రూపాయి మారకం విలువ బాగానే ఉందని హెచ్.ఎస్.బి.సి గ్లోబల్ అసెట్ మేనేజ్‌మెంట్ (ఇండియా) చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అధికారి తుషార్ ప్రధాన్ కూడా ఇటీవల అన్నారు. రూపాయి మారకం విలువ తరగుదలకి అంతర్గత బలహీనత దేనికన్నా కూడా డాలర్ పటిష్టమవడమే చాలావరకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. రూపాయి మారకం విలువ తిరిగి దాని సహజ స్థితికి చేరుకుంటోందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కూడా అన్నారు.రూపాయి కదలికలనూ ఓ కంట కనిపెట్టండి

Updated By ManamSat, 04/14/2018 - 22:54

rupeeవాషింగ్టన్: ప్రశ్నించదగిన విదేశీ మారక ద్రవ్య విధానాలను అనుసరించడానికి అవకాశం ఉన్న దేశాల పరిశీలన జాబితాలో చైనా, మరో నాలుగు దేశాలతోపాటు ఇండియాను కూడా అవెురికా ట్రెజరీ చేర్చిందని శనివారం నాడిక్కడ విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. ‘‘ప్రధాన వర్తక భాగస్వాముల్లో కరెన్సీ విధానాలను సన్నిహితంగా పరిశీలించవలసిన అవసరం ఉందని భావించిన’’ వాటిని ‘‘పరిశీలన జాబితా’’లో చేర్చినట్లు ట్రెజరీ పేర్కొంది. ఈ జాబితాలో అక్టోబరు నుంచి ఇండియాతోపాటు చైనా, జర్మనీ, జపాన్, కొరియా, స్విట్జర్లాండ్‌లు  కొనసాగుతున్నట్లు కాంగ్రెస్‌కు సమర్పించిన పాక్షిక-వార్షిక నివేదికలో వెల్లడించారు. వరుసగా రెండు విడతల నివేదికలలో ఉన్న దేశాల ‘‘పనితీరు వెర్సస్ ప్రమాణాలలో ఏపాటి మెరుగుదలైనా  తాత్కాలిక అంశాల వల్ల కాక, కొనసాగేదిగా ఉండేట్లు చూసేందుకు’’ అవెురికా ఈ ఏర్పాటు చేసింది. ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఏ దేశమూ కరెన్సీ విలువను పెంచుకునే మాయోపాయాలకు పాల్పడుతున్నట్లు తేలలేదు. కానీ, జాబితాలోని దేశాలలో ఐదు దేశాల వ్యవహార శైలి మూడు గీటురాళ్ళలో రెండింటికి సరిపోలేదిగా ఉంది.  ‘‘మొత్తం మీద అవెురికా వాణిజ్య లోటులో అర్హతకు మించిన వాటాకు’’ కారణమవుతున్నందుకు చైనాను ఈ జాబితాలో చేర్చారు. మొత్తం ప్రపంచ వాణిజ్య లోటు 566 బిలియన్ల డాలర్లలో 337 బిలియన్ల డాలర్ల లోటు ఒక్క చైనాతోనే అవెురికాకు ఉందని ప్రభుత్వ డాటా వెల్లడిస్తోంది. ‘‘మేం పరిశీలనను కొనసాగిస్తూ అసమంజస కరెన్సీ విధానాలపై పోరాడతాం. భారీ స్థాయిలో ఉన్న వాణిజ్య అసమతౌల్యాలను పరిష్కరించేందుకు అనుసరించే విధానాలను, సంస్కరణలు ప్రోత్సహిస్తాం’’ అని అవెురికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్ మినూచన్ ఒక ప్రకటనలో తెలిపారు. వాణిజ్యంలో సానుకూలత పొందేందుకు తమ కరెన్సీ విలువను కృత్రిమంగా నిర్వహించేందుకు ప్రయత్నించే దేశాలను గుర్తించేందుకు కాంగ్రెస్‌కు ఈ ట్రెజరీ నివేదిక అవసరమవుతోంది. ఉదాహరణకు, చౌక ఎగుమతులను పెంపొందించేందుకు మారకం రేటు తక్కువగా ఉండేట్లు చూడవచ్చు. 

అవెురికాతో ఇండియా 23 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. రూపాయి విలువ పెరుగుతూ వస్తున్నా, ‘‘2017 మొదటి మూడు త్రైమాసికాలలో (ఇండియా) విదేశీ మారక ద్రవ్య కొనుగోళ్ళను పెంచింది’’ అని నివేదిక పేర్కొంది. వాషింగ్టన్‌తో రేగుతున్న వాణిజ్య వివాదానికి కేంద్రంగా ఉన్న చైనా కూడా జాబితాలో కొనసాగుతోంది. అవెురికాతో చైనా వాణిజ్య మిగులును తగ్గించడంలో సహాయపడే విధంగా సాగాల్సింది పోయి ‘‘చైనా కరెన్సీ సాధారణంగా వ్యతిరిక్త  దిశలో సాగుతోంది’’ అని ట్రెజరీ పేర్కొంది. దిగుమతులకన్నా ఎగుమతుల విలువ  ఎంత ఎక్కువగా ఉంటే అది ఆ దేశ వాణిజ్య మిగులు అవుతుంది. యూరోపియన్ కరెన్సీ యూనియున్‌లో భాగంగా ఉన్నప్పటికీ, జర్మనీ కూడా ఈ జాబితాలో ఉంది. నిజానికి, యూరో మారకం రేటును జర్మనీ స్వతంత్రంగా నియంత్రించగలిగిన స్థితిలో లేదు. జర్మనీకి ‘‘ప్రపంచంలో అతిపెద్ద కరెంట్ అకౌంట్  మిగులు ఉంది’’ అని నివేదిక తెలిపింది. ‘‘ఈ భారీ మిగులును తగ్గించుకోవడంలో గత మూడేళ్ళలో అది సాధించిన ప్రగతి నామమాత్రం లేదా బొత్తిగా ఏమీ లేదని చెప్పాలి’’ అని నివేదిక వ్యాఖ్యానించింది. మిగులును పరిష్కరించేందుకు ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసిందిగా జాబితాలో ఉన్న దేశాలకు ట్రెజరీ విజ్ఞప్తి చేసింది.పెరిగిన రూపాయి విలువ

Updated By ManamMon, 10/30/2017 - 15:49

rupee v/s dollarముంబై, అక్టోబరు 30: రూపాయి విలువ పెరిగింది. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి విలువ బలపడింది. 16 పైసలు పుంజుకున్న రూపాయి.. డాలర్‌తో మారకం విలువలో రూ.64.89 వద్ద స్థిరపడింది. ద్రవ్య నిధిపై త్వరలోనే ఆంక్షలను ఎత్తేస్తామన్న యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) ప్రకటనతో మార్కెట్లో రూపాయి మారకం విలువ పెరిగింది. యూరోతో పోలిస్తే డాలర్ విలువ బలహీనంగా ఉండడం, ఈసీబీ చర్య వల్ల స్థానికంగా రూపాయికి బలం పెరిగిందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి శుక్రవారం ఒక్కరోజే 23 పైసలు పడిపోయిన రూపాయి.. డాలర్ మారకంతో పోలిస్తే రూ.65.05 వద్ద స్థిరపడింది. 

Related News