Uttam kumar reddy

కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్

Updated By ManamFri, 09/21/2018 - 14:09
ramesh rathod

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో వలసలు జోరందుకున్నాయి.ఇందులో భాగంగా టీఆర్ఎస్ నేత రమేష్ రాథోడ్ గురువారం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కాగా ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేతగా ఉన్న రమేష్ రాథోడ్‌కు టీఆర్‌ఎస్‌లో టికెట్ దక్కని విషయం తెలిసిందే.

ఖానాపూర్ టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయనకు కేసీఆర్ ఝలక్ ఇచ్చారు.  ఖానాపూర్ టిక్కెట్‌ను రేఖా నాయక్‌కు కేటాయించడంతో  అసంతృప్తితో ఉన్న రమేష్ రాథోడ్... ఆ తర్వాత టికెట్‌పై ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపించినా, ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం అందుకు ఆసక్తి చూపలేదు. దీంతో రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.డీఎస్‌తో ఉత్తమ్ కుమార్ భేటీ

Updated By ManamThu, 09/13/2018 - 17:21
uttam kumar reddy met D srinivas

హైదరాబాద్ : టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఉత్తమ్ ఈ సందర్భంగా డీఎస్‌ను ఆహ్వానించారు. కాగా గత కొంతకాలంగా డీఎస్ టీఆర్ఎస్‌ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.

అయితే డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు తీర్మానం చేసి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, పార్టీని వీడేది లేదని స్పష్టం చేసిన డీఎస్, టీఆర్ఎస్సే తనపై బహిష్కరణ  వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాల నేపథ్యంలో ఉత్తమ్‌ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.మైనార్టీలను మోసం చేసిన కేసీఆర్

Updated By ManamThu, 09/13/2018 - 04:55
 • తెలంగాణ ద్రోహులకు అండగా సీఎం

 • మెనార్టీ గర్జన సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 • జగ్గారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తారు

 • సభలో రోదించిన నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి

uttamసంగారెడ్డి: కేసీఆర్ మైనార్టీలను మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.  బుధవారం సంగారెడ్డిలోని మదీనా హోటల్ వద్ద జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి  కాంగ్రెస్ జాతీయ నాయకులు గులాం నబీ అజాద్ రావాల్సింది, కానీ కొండగట్టు ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాప సూచకంగా ఆయన తన ప్రయాణాన్ని మానుకున్నారు. దానితో ఈ కార్యక్రమంలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు షబ్బీర్‌అలీ, గీతారెడ్డి, శశిధర్‌రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. సునితాలకా్ష్మరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముందుగా అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల జయప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ అర్థ రాత్రి పోలీసులు ఎలాంటి నోటీసు లేకుండా,  కారణం చూపకుండా అరెస్టు చేసి తీసుకపోవడం దారుణమంటూనే రోదించారు. జనంలో తిరిగే మనిషి జగ్గారెడ్డికి ఇలాంటి గతి పట్టించడం శోచనీయమని సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు తమకు అండగా ఉండాలని ఆమె వేడుకున్నారు.  

ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ ఒక బట్టే బాజీ అని ఆయన అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఇది ప్రజా స్వామ్యమా..? లేక దోరల పరిపాలనా..? అని ప్రశ్నించారు. జగ్గారెడ్డికి పట్టిన గతే రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు పడుతుందని, జగ్గారెడ్డిని అరెస్టు చేయడంలో అతి చొరువ చూపిని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఆయన ఖబడ్దార్ అని హెచ్చరించారు. కేసు జరిగి 14సంవత్సరాల తరువాత ఎలాంటి నోటిసు లేకుండా ఒక నాయకుడిని అరెస్టు చేయడం ఎంత వరకు సమజసమన్నారు.  2004-5లో మహ్మాద్ రషీద్ అలీ సిఐడి పోలీసులు రికార్డు ప్రకారం అప్పటి టిఆర్‌ఎస్ లీడర్ అమెరికాకు 8 మందికి పంపిచడానికి లేటర్ రాసినట్లు, అలాటే అప్పటి టిఆర్‌ఎస్ లీడర్ హరిశ్‌రావు గుజురాతీ అమ్మాయి నా భార్య ఆమెను అమెరికాకు పంపిచడానికి విసా కొరకు లేటర్ రాసారని ఆ పత్రంలో ఉందని వివరించారు. అ పత్రాన్ని సభ ముఖంగా అందరికి చూయించారు. జగ్గారెడ్డి అ పత్రంలో ఎక్కడ లేదని, కాని ఆయను అరెస్టు చేయడం వెనుక టిఆర్‌ఎస్ కుట్ర ఖచ్చితంగా కనిపిస్తుందని తెలిపారు. దేశానికి ప్రధానిగా రాహుల్ గాంధీని చూస్తారన్నారు. జగ్గారెడ్డి బెయిల్ గురించి ప్రయాత్నాలు జరుగుతున్నాయన్నారు. ఎంఐఎం పార్టీ కూడ టిఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండడం శోచనీయమన్నారు. కేసిఆర్ బండ్లగూడలోని రూజ30కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.3కోట్లకే ఎంఐఎం నాయకుడు ఓవైసికి అప్పగించడం వెనుక అంతార్యమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా సహాకరిస్తుందన్నారు. జిల్లాలో 10కి పది భారీ మేజార్టీతో గెలుస్తుందని హామిచ్చారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మాజీ ఎం.పి. కాంగ్రెస్ సినీయర్ నాయకులు సురేష్‌కుమార్ షేట్కార్, ప్రతాప్‌రెడ్డి, శశికళయాదవరెడ్డి, కాట శ్రీనివాస్‌గౌడ్, శివకుమార్, తోపాజీ అనంత కిషన్, అంజనేయులు, శశిధర్‌రెడ్డి, శ్రీనివాస్, శంకర్ యాదవ్, షకీల్, ఫహీం, అశోక్,  సంతోష్, ప్రభాకర్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.'టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం..' 

Updated By ManamWed, 09/12/2018 - 18:08
 • తెలంగాణను అడ్డుకున్న శక్తులు ఒక్కటయ్యాయని విమర్శ

 • కొండగట్టు కారణంగా కేసీఆర్ రాలేకపోయారు... 

TRS-KTR, option, people, KCR, TRS party, Uttam kumar reddy, Congress party, Chandrababu naidu హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు విపక్షాలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించాయి. కాంగ్రెస్‌లో నుంచి టీఆర్ఎస్‌లోకి.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముదిగొండ, బషిర్‌బాగ్‌లు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. తెలంగాణను అడ్డుకున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. ఓ స్పష్టమైన ప్రత్యామ్నాయం ప్రజల ముందుందని, ఇద్దరిని ఒకే దెబ్బతో కొట్టే అవకాశం లభించిందన్నారు. 60ఏళ్లుగా రాబందుల్లా ప్రజలను పీక్కుతున్న వాళ్లు కావాలా.. రైతుబంధుగా నిలిచిన టీఆర్ఎస్‌ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందని కేటీఆర్ చెప్పారు. గడ్డం పెంచుకున్న ప్రతీ ఒక్కరూ గబ్బర్‌సింగ్‌లు కాలేరని దుయ్యబట్టారు. 

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన పార్టీలు ఒకవైపు.. 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మరోవైపు ఉందని తెలిపారు. అపవిత్ర, నీచమైన పొత్తుతో ప్రజలకు ఓ మంచి అవకాశం లభించిందని చెప్పారు. తాగునీరు ఇవ్వకుండా చేసిన టీడీపీ, కాంగ్రెస్ ఇప్పుడు ఒక్కటయ్యాయాని, ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచారని ధ్వజమెత్తారు. కరెంట్ ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని ముంచిన ఇద్దరు ఒక్కటవుతున్నారని విమర్శలు గుప్పించారు. కొండగట్టు ఘటన కారణంగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు రాలేకపోయారని చెప్పారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం పూర్తి చేస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సెంచరీకి అడుగుదూరంలో నిలిచామన్నారు. కార్పొరేటర్ ఝాన్సీ రాకతో సెంచరీ కొట్టామని కేటీఆర్ స్పష్టం చేశారు.అధికారంలోకి వస్తే ఎవర్నీ వదిలిపెట్టం..

Updated By ManamWed, 09/12/2018 - 16:50
Uttam kumar reddy dares kcr, Will Congress come to power in elections

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టేది లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. గాంధీభవన్‌లో పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్... కాంగ్రెస్ నేతలపై పెట్టిన అక్రమ కేసులను తీవ్రంగా ఖండించారు. 

ఆయన మాట్లాడుతూ...‘జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. కేసు నమోదు అయింది 2005లో, కానీ సుమారు 13 ఏళ్ల తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు?. తెలంగాణ కాంగ్రెస్ నేతల జోలికి వస్తే సహించేది లేదు. మరో రెండు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మేం అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టం. 

బంగారు తెలంగాణ కాదు...కేసీఆర్ బంగారు కుటుంబమైంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెబుదాం. అక్రమ పాస్‌పోర్టు కేసులో కేసీఆర్, హరీశ్‌రావులు ముద్దాయిలు. పలువురు అధికారులు కేసీఆర్‌కు తొత్తులుగా మారారు. అధికారం ఉందికదా అని ఎక్కువ చేస్తే సహించేది లేదు. జరగబోయే ఎన్నికలు ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. 58 ఏళ్లకే వృద్ధులకు ఫించన్ ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం. గుళ్లు, మసీదులు, చర్చిలకు ఉచిత కరెంట్. ప్రతి మహిళా సంఘానికి రూ.లక్ష గ్రాంట్ అందచేస్తాం.10 లక్షలమంది నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు’ ఇస్తామని హామీ ఇచ్చారు.టీఆర్ఎస్‌లో చేరిన సురేష్ రెడ్డి

Updated By ManamWed, 09/12/2018 - 16:18
 • టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో వలసల జోరు...

suresh reddy joined trs

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో నేతల వలసలు జోరందుకున్నాయి. తాజాగా మాజీ స్పీకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సురేష్ రెడ్డి కారెక్కారు.  ఆయన బుధవారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేరెళ్ల ఆంజనేయులు, ఉప్పల్‌కు చెందిన బండారు లక్ష్మారెడ్డితో పాటు పలువురు నేతలు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

congress-gandhi bhavan

మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనూ చేరికలు భారీగా జరిగాయి. గాంధీభవన్‌లో పలువురు నేతలు ఇవాళ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తీర్థం తీసుకున్నారు. 
 హరీశ్, కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయరు?

Updated By ManamTue, 09/11/2018 - 12:56
 • జగ్గారెడ్డి అరెస్ట్‌ను ఖండించిన పీసీసీ చీఫ్ ఉత్తమ్

 • డీజీపీ మహేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు..

jaggareddy-uttam kumar reddy

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అరెస్ట్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. జగ్గారెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఉత్తమ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు మంగళవారం ఉదయం కుందన్‌బాగ్‌లో డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ...‘నకిలీ పాస్ పోర్ట్‌ల కేసులో ఉన్న కేసీఆర్ , హరీష్‌లను ఎందుకు అరెస్ట్ చేయరు?. ఇప్పటికీ హరీశ్ భార్య, పిల్లల పేరుతో అమెరికాలో ఉన్నది వాస్తవం. వాళ్లను అక్రమంగా తీసుకువెళ్లింది హరీశ్‌రావే. 

చెన్నై, అమెరికా ఎంబసీలో రికార్డులు పరిశీలిస్తే తరలించిన వారి వివరాలు ఉంటాయి. మరి హరీశ్, కేసీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని డీజీపీని ప్రశ్నించాం. జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్‌ను కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంటుంది. పోలీసులు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలి’ అని హితవు పలికారు.

అర్థం పర్థం లేని ఆరోపణలతో జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయనకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం, గులాం నబీ ఆజాద్ హాజరు అయ్యే బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలు రాబోతున్నారన్న సమాచారంతో టీఆర్ఎస్ భయపడే ఈ అరెస్ట్ చేయింది. జగ్గారెడ్డిపై అక్రమ యాక్ట్లులు ప్రయోగించారు. బోగస్ రికార్డుల ఆధారంగా పోలీసులు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ యంత్రాంగం సర్కార్ చేతిలో కీలుబొమ్మగా మారింది.  

ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగపరుస్తున్నరనడానికి ఇదే నిదర్శనం.14సంవత్సరాల క్రితం ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఇచ్చారని ఇప్పుడు అరెస్ట్‌కు పూనుకోవడం, నేరంగా పరిగణించడం, బ్లాక్ మెయిల్ చేయడమే. పోలీసుల అదుపులో ఉన్న జగ్గారెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది. ఆయనను వెంటనే న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి. 

ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కేసీఆర్ పోలీసులను ప్రభావితం చేస్తూ కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నరు. కావున తక్షణమే ఆయనను ఆపద్దర్మ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.పొత్తు పొడుస్తున్నది

Updated By ManamMon, 09/10/2018 - 23:54
 • టీడీపీతో చర్చలు ప్రారంభించిన కాంగ్రెస్

 • రేపో, ఎల్లుండో ఇతర పక్షాలతో భేటీలు

 • 18 వరకు జరిగే జెండా పండుగను విజయవంతం చేయాలి: ఉత్తమ్

uttamహైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో కలిసి పని చేసేం దుకు తెలుగుదేశం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఈ దిశగా చర్చల ప్రక్రియను కాంగ్రెస్  ప్రారంభించింది. త్వరలోనే తెలుగు దేశం, తెలంగాణ జనసమితి, సీపీఐతో చర్చలు ప్రారంభిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. కేసీఆర్ దుష్టపాలనను అంతం చేసేందుకు అందరూ కలిసి రావాలని ఉత్తమ్ మరోసారి విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి, యువజన, మహిళా సంఘాలు, ఇతర సంస్థలు కలిసి రావాలన్నారు. పొత్తుల విసయంలో కాంగ్రెస్‌లో స్పష్టత వచ్చిం దని, టీడీపీకి, సీపీఐకి ఏ స్థానాలు కేటాయించాలన్న దానిపై ఒక అవగహనకు వచ్చిన తరువాతే పొత్తులపై చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. టీడీపీకి 15 సీట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సీపీఐకి, కోదండరాం పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. చర్చల సందర్భంగా ఆయా పార్టీలు ఇచ్చే జాబితా ఆధారంగా ఎన్నిసీట్లు, ఎక్కడ ఇవ్వాలన్నదానిపై చర్చించనున్నారు. పొత్తల విషయాన్ని సాధ్యమైనంత త్వరగా తేల్చి, వెంటనే ప్రచారం ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అజాద్ పర్యటన తరువాత కాంగ్రెస్‌లోనూ వివిధ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ప్రచారం ప్రారంభించాలని ఉత్తమ్ భావిస్తున్నారు. సభ ఎక్కడ పెట్టాలి, తేదీ వంటి అంశాలు నిర్ణయించిన తరువాత సభకు సోనియా, రాహుల్ గాంధీలను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు . ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు, వాటిని విస్మరించిన తీరుపైనే ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు, కేసీఆర్ తీరును బహిరంగ సభలో గట్టిగా ఎండకట్టడం ద్వారా ఎదురుదాడికి కాంగ్రెస్ సన్నద్ధం అవుతోంది. 

11 నుంచి 18 వరకు జెండా పండుగ: ఉత్తమ్ 
11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్ జెండా ఎగుర వేయాలని, సమావేశాలు , సభలు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ వాదుల ఇండ్లపై , వాహనాలపై జెండాలు ఎగుర వేయాలని కోరారు. పార్టీ యంత్రాంగాన్ని గ్రామ స్థాయి వరకు సన్నద్దం చేసేందుకు జెండా పండుగను భారీ స్థాయిలో నిర్వహించాలని పార్టీ నాయకులను పీసీసీ కోరింది. అన్ని గ్రామాల్లో బూత్ స్థాయి కమిటీలు, నాయకులు ఓటర్ల జాబితాను పరిశీలించి ,  అర్హులైన వారితో దరఖాస్తులు పెట్టేలా చూడాలని ఉత్తమ్ కోరారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ముందస్తు ఎన్నికల్లో గెలవబోతున్నాం: జానారెడ్డి
ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని సీఎల్పీ మాజీ నేత కె జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ ,డీజిల్‌ను జీఎస్టీలో చేరుస్తామన్నారు. బంద్‌ను విజయవంతం చేసిన కార్యకర్తలు,నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మహ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ పన్నులు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు.'దానం నాగేందర్ నన్ను కలిస్తే తప్పేంటి?'

Updated By ManamMon, 09/10/2018 - 18:38
 • టీపీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన

Danam Nagender, Uttam Kumar reddy, Gulam Nabi Azad, Congress partyహైదరాబాద్‌: త్వరలో అన్ని రాజకీయ పార్టీలతో పొత్తులపై చర్చలు జరుపుతామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ నేత దానం నాగేందర్‌ తనను కలిశారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. దానం తనను కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ నెల 12న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఆజాద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉండే అవకాశం ఉందని చెప్పారు.

రేపటి (మంగళవారం) నుంచి 18 వరకు కాంగ్రెస్‌.. జెండా పండుగ నిర్వహిస్తోందని ఉత్తమ్ చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా కలిసి తమ ఇళ్లు, వాహనాలపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని కోరారు. 12న నిర్వహించే మీడియా సమావేశంలో ఆజాద్‌.. రాఫెల్‌ కుంభకోణంపై మాట్లాడతారని అన్నారు. అనంతరం సంగారెడ్డిలో మైనార్టీల సభలో పాల్గొంటారని ఉత్తమ్ తెలిపారు. కాగా, ఓ హోటల్‌లో ఉత్తమ్‌ను కలిశారంటూ వస్తోన్న ప్రచారాన్ని దానం నాగేందర్‌ ఖండించిన సంగతి తెలిసిందే.  కాంగ్రెస్‌లో చేరికలు

Updated By ManamMon, 09/10/2018 - 00:11
 • ఉత్తమ్‌తో  మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజయ్య భేటీ

 • బీసీ ఐక్యవేదిక నేత రాంకోటి పార్టీలో చేరిక

 • సిద్దిపేట, వైరా, స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తలతో ఉత్తమ్ భేటీ

uttamహైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కదనోత్సాహంతో ఉంది. ఆ పార్టీ నేతలు ఊహించని విధంగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు అనుమతి తీసుకుంటున్నారు. ఉత్తమ్‌ను కలుస్తున్న వారిలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆదివారం కూడా చేరికలు కొనసాగాయి. బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు అల్లంపల్లి రాంకోటి తన అనుచరులతో గాంధీభవన్‌కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉత్తమ్ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. గాంధీభవన్ లో ఉత్తమ్‌తో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరతానని ఉత్తమ్ తో చెప్పగా వై నాట్ తప్పకుండా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తామని భరోసా ఇచ్చారు. ఎప్పుడు చేర్చుకునేది పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ డాక్టర్ రామచంద్ర కుంటియాతో కలసి నిర్ణయిస్తామని ఉత్తమ్ చెప్పారు. ఏఐసీసీ సభ్యులు ప్రియాంకష సందీప్ రాజ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. సిద్ధిపేట, వైరా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్  కార్యకర్తలు కూడా ఉత్తమ్‌ను కలిశారు.  వైరా నియోజకవర్గాన్ని సీపీఐకి కేటాయించవద్దని ఉత్తమ్ కు విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా రాంకోఠి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అందుకే కాంగ్రెస్‌లో చేరానని రాంకోఠి ఈ సందర్భంగా చెప్పారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, అపద్ధర్మ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

Related News