Uttam kumar reddy

కాంగ్రెస్ లో భారీగా చేరికలు

Updated By ManamFri, 09/07/2018 - 23:42
 • సొంత గూటికి చేరుకున్న మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి

 • ఖానాపూర్, దేవరకద్ర నియోజకవర్గాల నుంచి వందల మంది చేరిక

 • కండువాలు కప్పి ఆహ్వానించిన ఉత్తమ్

uttamహైదరాబాద్: కొత్తవారి చేరికలతో శుక్రవారం గాంధీభవన్ కలకలలాడింది. మహబూబ్‌నగర్, గద్వాల, అదిలాబాద్ జిల్లాలకు చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి సొంత గూడికి చేరుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. సమరసింహారెడ్డితో పాటు గద్వాలకు చెందిన న్యాయవాదులు వసంతరావు ఎక్బోటే, పెద్దరాములు, బాణాల క్రిష్ణమూర్తి, అలంపూర్ నియోజకవర్గ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, విక్రంసింహారెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన చారులత రాథోడ్‌తో పాటు వందలాదిమంది కాంగ్రెస్ పార్టీలో చేరారు.  అదే విధంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన న్యాయవాది జి మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ లో చేరారు. బ్రాహ్మణ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యశ్రీరంగం, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమ్ రావు తనయుడు హరీష్‌రావు తదితరులు కూడా పార్టీలో చేరారు. అందరికీ  ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తమ నాయకులకు పార్టీ కండువాలు కప్పేటప్పుడు కార్యకర్తలు ఆనందంతో ఈలలు వేశారు. చప్పట్లు చరిచారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ డాక్టర్ రామచంద్ర కుంటియా, ఎఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్, శ్రీనివాస్ క్రిష్ణణ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నాయకుడు కె జానారెడ్డి, కౌన్సిల్ లో కాంగ్రెస్ మాజీ నేత మహ్మద్ అలీషబ్బీర్, తాజా మాజీ ఎమ్మెల్యేలు డీకే అరుణ, జి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పొత్తులపై నేడు టీడీపీ, కాంగ్రెస్ చర్చలు

Updated By ManamFri, 09/07/2018 - 23:42
 • చంద్రబాబుతో ప్రాథమిక చర్చలు జరిపే అవకాశం

 • 12న ఆజాద్, బాబు భేటీ తర్వాత స్థానాల  ప్రకటన

uttamహైదరాబాద్: శాసనసభ రద్దుతో రాజకీయ పార్టీలు పొత్తుల ప్రక్రియను వేగవంతం చేశాయి. ముందస్తు  ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను  ఓడించాలనే లక్షంతో ఉన్న  కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకు వేసింది.  పొత్తులపై చర్చించేందుకు  తెలుగుదేశం పార్టీని ఆహ్వానించింది. అందుకు టీడీపీ సరేనంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు  దృష్టికి తెచ్చారు. ఆందుకు చంద్రబాబు సరేనన్నారు. చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముందుగా కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తులపై రాష్ట్ర నాయకత్వాలు ప్రాథమిక చర్చలు శనివారం మొదలుపెడుతున్నాయి.  టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పొత్తులపై మాట్లాడుకుందామనే విషయం  చెప్పారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు,ఎపీ సీఎం ఎన్ చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో పార్టీ నేతలతో ముందస్తు ఎన్నికలపై జరిగే సమావేశంలో పాల్గొంటారని ఉత్తమ్ దృష్టికి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగే పోటీయని, టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కలిసి వచ్చే పార్టీలతో పొత్తులకు సిద్ధమని చెప్పారు. ముందుగా మనం మాట్లాడుకుందామని, ఆ తర్వాత  చంద్రబాబుతో మాట్లాడుదామని ఉత్తమ్ చెప్పారు.  ఉదయం గోల్కొండ హోటల్‌లో ఉత్తమ్,రమణ బృందాలు చర్చలు జరిపే అవకాశం ఉంది.  ఆ తర్వాత మధ్యాహ్నం  చంద్రబాబుతో కూడా  ఉత్తమ్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడ భేటీ జరుగుతోందనే విషయాన్ని రహస్యంగా ఉంచారు.  ఈ సందర్భంగా ఇరు పార్టీల బలాబలాలపై చర్చిస్తారు. ఒక అవగాహనకు వస్తారు. పొత్తులతో పాటు ప్రచార కార్యక్రమాలపై మాట్లాడుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నెల 12 న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ రానున్నారు. రాఫెల్ కుంభకోణంపై ఆయన మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా తుది విడత చర్చలు జరుపుతారు. అదే రోజు పొత్తులపై  అధికారికంగా  ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా,  టీడీపీతో పొత్తుపై గులాం నబీ ఆజాద్ వారం నెల రోజుల క్రితమే చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడి నట్లు తెలిసింది. ఆజాద్ సూచనల మేరకే ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కోర్ టీం కమిటీ సభ్యుడు కొప్పుల రాజు రంగంలోకి వచ్చారు. ఆయనతో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క కూడా చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలిసింది. 12న తెలంగాణలో ఆజాద్ పర్యటన

Updated By ManamFri, 09/07/2018 - 16:11
Uttam Kumar Reddy

హైదరాబాద్ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఈ నెల 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్రువీకరించారు. సంగారెడ్డిలో జరిగే మైనార్టీ సభలో ఆజాద్ పాల్గొంటారని ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. ఈనెల 11 నుంచి 18 వరకూ కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తామన్నారు.

అలాగే వార్ రూమ్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నామని, పొత్తుల విషయంలో చర్చలు మొదలుపెడుతున్నామని ఉత్తమ్ వెల్లడించారు.  కాగా ఆజాద్ తెలంగాణ పర్యటన గతంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే వైరల్ ఫీవర్ కారణంగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

అభ్యర్థి ఇంటికే బీ ఫారం..
టికెట్ ఆశించే నేతలు ఢిల్లీకి కానీ, గాంధీభవన్‌కుగానీ రావద్దని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. సర్వే ఆధారంగా అభ్యర్థి ఇంటికే బీ ఫారం పంపుతామని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అలాగే ఈ నెల 10న జరిగే భారత్ బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు.

పార్టీ వీడిన వాళ్ల గురించి బాధలేదు..
మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి పార్టీ వీడటంపై తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుంతియా స్పందించారు. పార్టీని వీడిన వారి గురించి బాధపడాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మానసిక స్థితి సరిగా లేకే రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. కాగా సురేష్ రెడ్డి ఈ నెల 12న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరనున్నారు. సచివాలయానికి రానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రనేనని ఎద్దేవా చేశారు.'ఆ మూడింటిలో తెలంగాణ నెంబర్‌వన్'

Updated By ManamThu, 09/06/2018 - 16:55
 • మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ 

Uttam kumar reddy, KCR, Telangana govt, TPCC Cheif, Farmers suicidesహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలను నాలుగున్నరేళ్లు కేసీఆర్ మోసం చేశారని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. భారతదేశంలో రైతుల ఆత్మహత్యల్లో, మద్యం అమ్మకాల్లో, అప్పులు చేయడంలో తెలంగాణ నెంబర్‌వన్‌ని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినవన్నీ అబద్ధాలేనని అన్నారు. గురువారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ స్థాయి మరిచి విజ్ఞత మరిచి మాట్లాడరని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని ధ్వజమెత్తారు. బందిపోటు దొంగల్లాగా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. మాట ఇచ్చి మోసం చేసిన కేసీఆర్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ముస్లిం రిజర్వేషన్లపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని విధాలుగా తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. పోయేకాలం వచ్చి శాసనసభను రద్దు చేసుకున్నారని, ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందా? అని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చుట్టూ తిరిగి కాళ్లు పట్టుకున్న రోజులు మర్చిపోయారా? ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో మత ఘర్షణలు జరిగాయన్నది అవాస్తమని ఉత్తమ్ కొట్టిపారేశారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముస్లింలను మోసం చేసిన కేసీఆర్‌ను గద్దె దించాలని ఉత్తమ్ విమర్శించారు. కాగా, శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పీసీసీ కార్యవర్గ అత్యవసర సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై టీపీసీసీ చర్చించనున్నట్టు తెలుస్తోంది.   సిద్ధం కండి

Updated By ManamWed, 09/05/2018 - 01:18
 • టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తమ్

 • 7న సంగారెడ్డిలో విద్యార్ధి, యువజన ఆవేదన సభ 

uttamహైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సారి టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఎన్నికల కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి పాల్గొన్నారు.  ఎన్నికల కోసం పార్టీ తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. బహిరంగ సభలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నెలనెలా తెలంగాణకు వస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే మాట ఇచ్చినందున తొలి బహిరంగ సభను భారీ స్థాయిలో నిర్వహించి రాహుల్ గాంధీని, సోనియా గాంధీని తీసుకు రావాలని పీసీసీ నాయకులు నిర్ణయించారు. ప్రగతినివేదన సభలో కేసీఆర్ ఏ ఒక్కదానికీ సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. చేసిన ఏ ఒక్క వాగ్ధానాలను అమలు చేయలేకపోవడం వల్లే చెప్పుకునేందుకు ఏమీ మిగలలేదని ఉత్తమ్ విమర్శించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదా ప్రతులను ప్రతి గ్రామానికి చేరేలా చూడాలని సమావేశంలో ఉత్తమ్ సూచించారు. 7వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్ణయించి ఓటర్ల జాబితాలను పరిశీలించి, సవరణలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 9వ తేదీన గ్రామీణ మండల సమావేశాలు, పట్టణ ప్రాంతాల్లో డివిజన్ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్తమ్ కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 8 లక్షల మంది కొత్త ఓటర్లు పెరిగినప్పటికీ, విచిత్రంగా 21 లక్షల ఓట్లు తగ్గిపోయాయని, దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నందున ప్రతి కార్యకర్త జాగ్రత్తగా ఓటర్ల జాబితా లను పరిశీలించాలని కోరారు. ఓటింగ్ మిషన్లతో పాటు ప్రింటవుట్ వచ్చేందుకు ఏర్పాటు చేసిన మిషన్ల నుంచి ఒక శాతం బదులు, నియోజక వర్గంలో 10 శాతం రండమ్‌గా తీసుకుని లెక్కించాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ కోరింది. 

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలిః పొన్నం
2014 ఎన్నికల సందర్భంగా హుస్నాబాద్ నియోజక వర్గానికి లక్షన్నర ఎకరాలకు సాగునీరు ఇస్తానని కేసీఆర్ వాగ్ధానం చేసి మాట తప్పినందున ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సాగునీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పారని గుర్తు చేశారు. హుస్నాబాద్ ప్రజలకు సమాధానం చెప్పిన తరువాతే కేసీఆర్ అక్కడ సమావేశం పెట్టాలన్నారు. డాలర్‌తో పెట్రోల్ రేటు పెరుగుతుందని, మరో వైపు డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయని పొన్నం ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధర భారం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకో వాల్సిన ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా పన్నులు పెంచుతోందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ కుడు జగ్గారెడ్డి విమర్శించారు. ఈ విషయా న్ని యువత, విద్యార్ధులకు వివరించేందుకు ఈ నెల 7వ తేదీన సంగారెడ్డిలో విద్యార్ధి, యువజన ఆవేదన సభ పేరుతో బహిరంగ సభ పెడుతున్నామని తెలిపారు.'ఉత్తమ్‌ కుమార్‌వి ఉత్త మాటలు'

Updated By ManamMon, 09/03/2018 - 19:43
 • టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ 

Danam Nagender, Uttam Kumar reddy, TRS party, Pragathi Nivedhana Sabhaహైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్త మాటలని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. ప్రగతి నివేదన సభ విజయవంతం అయిందని కొందరు కాకిగోల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు  తెలిపారు. సభ అనుకున్న ప్రకారం మొదలు అయ్యిందని, ట్రాఫిక్ జామ్ వల్ల వేల మంది సభకు రాలేక పోయారని చెప్పారు. హామీలతో ఉత్తమ్ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ భచావో కాదు... గాంధీ భవన్‌లో ‘ఉత్తమ్ కో హఠావ్... కాంగ్రెస్ కో బచావ్’ అని అంటున్నారని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ సభకు వరుణుడు సహకరించిందని అన్నారు.

కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై కాంగ్రె‌స్‌లో తలో మాట మాట్లాడుతున్నారని, లక్షల మంది జనం ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉన్నదని దానం చెప్పారు. బడుగు బలహీన వర్గాల అండ టీఆర్ఎస్‌కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీకి ఒక్క సీటు రాదని ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ చెప్పారు. ప్రగతి నివేదన సభ కావునా.. కేసీఆర్ రాజకీయ విమర్శలు చేయలేదని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రతి పక్షాలను కడిగి పారేస్తారని దానం తెలిపారు. సొంత పార్టీ నేతలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ఉత్తమ్‌కు చెప్పారని అమిత్ షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా  సమావేశం అయ్యారో చెప్పాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ హఠావ్.. తెలంగాణ బచావ్: ఉత్తమ్ 

Updated By ManamSun, 09/02/2018 - 13:01

Uttam Kumar reddy, CM Kcr, TRS, Pragathi Nivedhana sabhaహైదరాబాద్: కేసీఆర్ హఠావ్.. తెలంగాణ బచావ్ అనే నినాదంతో ముందుకెళ్తామని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘ప్రగతి నివేదన సభ’ తుస్సుమందని ఆయన విమర్శించారు. ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం ఉత్తమ్ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ‘ప్రగతి నివేదన సభ కాదు.. ప్రజల ఆవేదన సభ’ అని ఎద్దేవా చేశారు. సభ కోసం ఖర్చు చేసిన సొమ్ము ఎక్కడిది? దోచుకున్నది కాదా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. సభ కోసం బస్సులను బలవంతంగా తరలించారని మండిపడ్డారు. మైనార్టీ రిజర్వేషన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావనే లేదన్నారు.

జోన్లపై ప్రధాని నరేంద్ర మోదీని నిలదీశానని కేసీఆర్ చెబుతున్నారని, కరెంట్ విషయంలో మళ్లీ అవే అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ విధానాలతోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఆవిర్భించిందని ఉత్తమ్ స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రసంగం ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందన్నారు. రాష్ట్రాన్ని మొత్తం ఆల్కహాల్‌లో ముంచి తేలుస్తున్నామన్నారు. ఆత్మహత్యలు, అప్పులు, అవినీతిలో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉందని ఉత్తమ్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టింది మీరేనని విమర్శించారు. కేసీఆర్ హమీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.'

టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రగతి నివేదన సభ అట్టర్ ప్లాప్ అయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.  సభలో కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడారని నిప్పులు చెరిగారు.  ప్రగతి నివేదన సభ ముగిసిన అనంతరం రాత్రి బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివా రం టీఆర్‌ఎస్ నిర్వహించిన సభ ప్రగతి నివేదన సభ కాదనీ, ప్రజల ఆవేదన సభ అని అన్నారు. సీఎం కేసీఆర్ స్పీచ్ తుస్సుమనిందని చెప్పారు. ఈ సభతో కేసీఆర్ అవినీతి బయట పడిందన్నారు. సభకు పెట్టిన ఖర్చు చూసి ప్రపంచం నివ్వెర పోయిందని తెలిపారు. ఈ సభ ధన,బల ప్రదర్శనగా మిగిలిందని చెప్పారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చేందుకు ఇష్టపడని కేసీఆర్ తాను పెట్టే సభలకు మాత్రం చట్టానికి విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలను బెదరించి సభకు బస్సులు వేసుకున్నారని ఆరోపించారు. హోర్డింగులు పెట్టుకోవద్దని ఇతరులకు చెప్పిన కేటీఆర్ సిగ్గు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగులు తాను, తన తండ్రి పేర పెట్టుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఎవడబ్బ సొమ్మని సభకు ఆర్టీసీ బస్సులు వాడుకున్నారని ప్రశ్నించారు.

అధికారులు వివక్ష చూపిస్తే గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. తన సుదీర్ఘ ప్రసంగంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు, ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లుపెంపు, దళితులకు మూడెకరాల భూమి విషయం ప్రస్తావించలేదని విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టుల వల్లే సాధ్యమైందన్నారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క విద్యుత్ ప్రాజెక్టునైనా చేపట్టారా ? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ కమిషన్  భగీరథగా మారిందని ఆరోపించారు. ఈ పథకం ద్వారా చెప్పిన సమయానికి కేసీఆర్ నీళ్లివ్వలేదని చెప్పారు. ప్రగతి నివేదన సభకు రూ.300 కోట్లు ఖర్చయినట్లు చెబుతున్నారని, ఆంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. ఆత్మహత్యల్లో , అవినీతిలో దేశంలోనే నంబర్ 1 గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, అందుకు సిగ్గుపడాలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 వేల చిన్నతరహా పరిశ్రమలు మూతబడ్డాయని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి చెంచాగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఇకపై కేసీఆర్ హఠావో....కాంగ్రెస్ బచావో....నినాదంతో ముందుకు వెళతామని ఉత్తమ్ వివరించారు.ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ కాదు... ప్ర‌జా ఆవేధ‌న స‌భ 

Updated By ManamFri, 08/31/2018 - 18:57
 • స‌భ నిర్వ‌హ‌ణ 300 కోట్లు ? అది అవినీతి  డ‌బ్బు కాదా.. ? 

 • అధికార దుర్వినియోగానికి ప‌రాకాష్ట‌.. 

 • వ్య‌తిరేక‌త‌ను క‌ప్పి పుచ్చుకోవ‌డానికే స‌భ‌

 • టీఆర్ఎస్‌పై విరుచుప‌డ్డ ఉత్త‌మ్‌

Uttam Kumar reddy, TRS govt, KCR, Pragathi Nivedhana Sabha, Congress partyహైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షులు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్ర‌జ‌ల‌నుంచి తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌స్తున్న త‌రుణంలో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు భారీ స‌భ అంటు సీఎం కేసిఆర్ కుయుక్తులు ప‌న్నుతున్నార‌ని విమర్శించారు.  కేసిఆర్ ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేసినా జ‌నం రాబోయే ఎన్నిక‌ల‌లో టీఆర్‌ఎస్‌ను త‌రిమి కొడుతార‌ని ధ్వజమెత్తారు. శుక్ర‌వారం ఆయ‌న ప్రస్తుత రాజ‌కీయాల‌పైన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేసీఆర్ ప్ర‌గ‌తి నివేధిక స‌భ అంటు ప్ర‌చారం చేస్తున్నార‌ని, అస‌లు రాష్ట్రంలో ఏదైనా ప్ర‌గ‌తి జ‌రిగితే క‌దా అని ఎద్దేవా చేశారు. ఇది ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ కాదు, ప్ర‌జ‌ల ఆవేధ‌న స‌భ అని పెడితే బాగుండేద‌ని, ధ‌నిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ‌ను అప్పుల పాలు చేసి, అవినీతితో రాష్ట్రాన్ని అధోగ‌తి పాలు చేసిన కేసిఆర్‌, త‌న కుటుంబం మాత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్ క‌ట్టుకొని ప్ర‌గ‌తి సాధించింద‌ని, ఇది కేసిఆర్ కుటుంబ ప్ర‌గ‌తిగా పెట్టుకుంటే బాగుండేద‌ని ఎద్దేవా చేశారు. 

 ల‌క్ష‌కోట్ల అవినీతి, రెండు లక్ష‌ల కోట్ల అప్పులు, 5 వేల మంది రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, నిరుద్యోగుల ఆక‌లిచావులు, మ‌హిళ‌ల‌కు అవ‌మానాలు, రాజ‌కీయ ఫిరాయింపులు, అభివృద్ది ప‌నులు పేరిట క‌మీష‌న్లు, 500 కోట్ల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌, ప్రైవేట్ విమానాల‌లో ప్ర‌యాణాలు, తెలంగాణ ద్రోహులకు అంద‌లం, తెలంగాన అమ‌రవీరుల‌కు అవ‌మానాలు ఇవేనా తెలంగాణ ప్ర‌గ‌తి అని ఆయ‌న ఎద్దేవా చేశారు. 2014 ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌లు ఏ హామీలు ఇచ్చిన ఒక్క హామీ అయినా అమ‌లు చేశారా.. ఈ విష‌యంలో కేసిఆర్ చ‌ర్చ‌ల‌కు వ‌స్తారా అని ఉత్త‌మ్ స‌వాల్ చేశారు. గ‌త ఎన్నిక‌ల‌లో అర్హులైన ద‌ళిత, గిరిజ‌న కుటుంబాల‌కు మూడు ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమి ఇస్తామ‌ని హామి ఇచ్చారా లేదా, ఒక్క కుటుంబ‌మైనా మూడు ఎక‌రాల భూమి పొందిందా అని ప్ర‌శ్నించారు.

అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికి డ‌బుల్ బెడ్ ఇళ్ళు ఇస్తామ‌న్నారు, ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనైనా ల‌క్ష్యం మేర‌కు ఇచ్చారా ?  నియోజ‌క‌వ‌ర్గానికి ల‌క్ష ఎక‌రాల‌లో సాగునీరు ఇస్తామ‌ని, 4 నెల‌ల‌లో ముస్లీంల‌కు, గిరిజ‌న‌ల‌కు 12 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇస్తామ‌న్నారు, కేజీ టు పిజి ఉచిత నిర్బంధ విద్య అన్నారు, ఇంటికో ఉద్యోగం, జిల్లాకో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప్ర‌తి, లాంటి అనేక హామీలు ఇచ్చిన కేసిఆర్ ఒక్క హామీనైనా నెర‌వేర్చారా అని ఆయ‌న విమ‌ర్శించారు. 

ఈ నాలుగేళ్ళ‌లో దాదాపు ఆరున్న‌ర ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్ కేటాయింపులు జ‌రిగితే రైతుల‌కు ఏక‌కాలంలో రుణ మాఫీ చేయ‌లేద‌ని, క‌మీష‌న్ల పేరిట వేల‌ కోట్ల రూపాయ‌లు దోచుకున్నార‌ని, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేశార‌ని, అమ‌ర‌వీరుల‌కోసం అంత‌ర్జాతీయ స్థాయిలో స్మార‌క స్థూపం క‌డుతామ‌ని చెప్పి క‌నీసం వారికి స్థ‌లం కూడా కేటాయించ‌లేద‌ని, 1200 మంది అమ‌ర‌వీరుల‌ని చెప్పి 400 మందికి కూడా ప‌రిహారాలు ఇవ్వ‌లేద‌ని విమ‌ర్శించారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో యువ‌కుల మీద లేని ప్రేమ‌ను చూపిస్తున్నార‌ని, ఇంత‌కాలం శంకుస్థాప‌న‌లు చేసిన కులాల భ‌వ‌నాల‌కు ఒక్క పైసా కూడా ఇవ్వ‌కుండా ఇప్పుడు మ‌ళ్ళీ ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు అంటు కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నార‌ని,  గ‌త నాలుగేళ్ళుగా వేసిన భ‌వ‌నాల‌కు ఎందుకు నిధులు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ఇప్ప‌డు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్ప‌తు దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో ప్ర‌గ‌తి నివేధ‌న స‌భ అంటు తాను ఏదో చేసినట్టు ప్ర‌చారం చేసుకుంటున్నార‌ని ఇంత డ‌బ్బు టిఆర్ ఎస్‌కు ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. అవినీతికి పాల్ప‌డి ఉండ‌క‌పోత ఈ డ‌బ్బు లెక్క‌లు చెబుతారా అని ప్ర‌శ్నించారు. అధికార దుర్వినియోగం చేస్తున్నార‌ని, మంత్రులు, ఎం.ఎల్.ఎలు, పోలీసు ఉన్న‌తాధికారులు, ప్ర‌భుత్వ అధికారులు అన్ని ప‌నులు ప‌క్క‌న పెట్టి కొంగ‌ర క‌లాన్ స‌భ సేవ‌లోనే ఉండిపోతున్నార‌ని విమ‌ర్శించారు. మిష‌న్ భ‌గీర‌థ నీళ్ళు ఇవ్వ‌క‌పోతే ఎన్నిక‌ల‌లో ఓట్లు అడ‌గ‌న‌ని పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడిన కేసిఆర్ ఇప్ప‌డు ఎన్ని గ్రామాల‌లో మిష‌న్ భ‌గీర‌థ నీళ్ళు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. మిష‌న్ భగీర‌థ పైపుల‌లో ప్ర‌జ‌ల‌కు నీళ్ళు రావ‌డం లేద‌ని, కేటిఆర్ కు మాత్రం క‌మీష‌న్లు వ‌చ్చాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. 

కేసిఆర్ ఎన్ని నివేధిక‌లు పెట్టినా ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితిలో లేర‌ని కాలేశ్వ‌రం ప్రాజెక్టు క‌మీష‌న్లు, మిష‌న్ భ‌గ‌ర‌థలో మింగిన లంచాలు, కాక‌తీయ క‌మీష‌న్లు ఎన్ని నిధులు గుమ్మిరించి స‌భ‌లు నిర్వ‌హించినా టిఆర్ ఎస్‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఓట‌మి త‌ప్ప‌ద‌ని, కాంగ్రెస్ విజ‌యం ఖాయ‌మ‌ని, కాంగ్రెస్ విజ‌యాన్ని ఎవ‌రు ఆప‌లేర‌ని , ఎంత ముంద‌స్తు పెడితే అంత తొంద‌ర‌గా తెలంగాణ‌కు కేసిఆర్ పీడ విర‌గ‌డ అవుతుంద‌ని ఆయ‌న అన్నారుఎన్నికల కమిటీలు?

Updated By ManamThu, 08/30/2018 - 22:50
 • కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు రేవంత్‌కు!

 • మ్యానిఫెస్టో కమిటీకి దామోదర్ రాజనర్సింహ

 • కొత్త జిల్లాలకు అధ్యక్షుల నియామకం

uttam kumarహైదరాబాద్: ముందస్తు ఎన్నికలు వస్తాయన్న వార్తలతో తెలంగాణ కాంగ్రెస్ వేగం పెంచింది. ఎన్నికల పై ఇప్పటికే సీనియర్ నాయకులతో విస్తృతంగా చర్చించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ అధిష్టానం పిలుపుతో గురువారంనాడు ఢిల్లీ వెళ్లారు. ఉత్తమ్ తోపాటు ఏఐసిసి ఇంచార్జ్ రామచంద్ర కుంతియా, ఏఐసిసి కార్యదర్శులు కూడా ఢిల్లీ వెళ్లారు.  ఎన్నికల కోసం పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు పలు కమిటీలను నియమించాల్సి ఉంది. ఇటీవలే ఏఐసిసి 31 జిల్లాలను ఆమోదించినందున ఈ జిల్లాలకు అధ్యక్షులను నియమించాల్సి ఉంది. వీటితో అత్యంత ముఖ్యమైన అభ్యర్ధుల ఎంపిక కమిటీ, ప్రచార కమిటీ, మ్యానిఫెస్టో కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. వీటిపై కసరత్తు చేసిన వివిధ కమిటీలు, డీసీసీ అధ్యక్షుల పేర్లతో కూడిన జాబితాను ఢిల్లీ తీసుకువెళ్లినట్లు తెల్సింది.  ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహ్యంపై కూడా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో కీలకమైన పదవి ఇస్తామని రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఎన్నికల్లో రేవంత్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు ఆయనకు పార్టీ ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తలు వస్తున్నాయి.  మ్యానిఫెస్టో కమిటీ బాధ్యతలను  మరో సీనియర్ నాయకుడు దామోదర రాజనర్సింహకు అప్పగించవచ్చని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ప్రస్తుతం ఉన్న మల్లు భట్టి విక్రమార్కకు తోడుగా మరో ఇద్దరిని నియమించే అవకాశం ఉందని తెలిసింది. పొన్నం ప్రభాకర్‌తో పాటు మరికొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, డి. కే అరుణ లకు కూడా ఈ కమిటీల్లో సముచిత స్థానం కల్పించే అవకాశం ఉంది. 

ఖమ్మం జిల్లాతో పాటు ,కొత్త జిల్లాలకు కూడా అధ్యక్షులను నియమించాల్సి ఉంది. ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు జిల్లా కమిటీల ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమంత్రి గతంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చారు.  అధ్యక్షుల పేర్లతో కూడిన జాబితాను గతంలోనే ఏఐసిసికి అందించారు. ఈ జాబితాను ఆమోదం లభించే అవకాశం ఉందని తెలిసింది. రానున్న రోజుల్లో మిగిలిపోయిన బూత్ కమిటీల అధ్యక్షులను కూడా పీసీసీ నియమించనుంది.అది ప్రగతి లేని నివేదన సభ

Updated By ManamSun, 08/26/2018 - 02:48
 • నియోజకవర్గానికో మేనిఫెస్టో  విడుదల చేస్తాం

 • ప్రధాని మోదీని ఎందుకు కలిశారో వెల్లడించాలి

 • మీడియాతో చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి

uttam హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెడుతున్నది ప్రగతి నివేదన సభ కాదు, ప్రగతి లేని నివేదన సభ అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం నాడు ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నాలుగున్నర సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ నాయకులు చేసిన దోపిడీ నివేదన సభ అంటూ చురకలు వేశారు.  కేసీఆర్ పాలనలో ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏకబిగిన ఏడు గంటల పాటు మంత్రులతో సమావేశం పెట్టిన కేసీఆర్ , వాటి వివరాలను మీడియాకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందస్తు ఎన్నికలకు గతంలోనే కేసీఆర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయని, మరి ఇప్పుడు ఎందుకు కలిసినట్లు ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో వివిధ వర్గాల వారికి జరుగుతున్న అన్యాయాన్ని మీడియా ఎత్తి చూపాలన్నారు.  ఈ విషయంలో ప్రశ్నించకుంటే భవిష్యత్‌లో మీడియాకు కూడా మరిన్ని ఇబ్బందులు వస్తాయన్నారు. గతంలో అధికార పక్షంతో పాటు, ప్రతిపక్షానికి మీడియాలో సమాన ప్రాధ్యానత ఉండేదన్నారు. కేసీఆర్ మీడియాతో పాటు అన్ని వర్గాలను అణిచివేస్తున్నారని  విమర్శించారు. 

నియోజక వర్గానికో మ్యానిఫెస్టో 
ఈ సారి ఎన్నికల్లో ప్రధాన మ్యానిఫెస్టో తో పాటు నియోజక వర్గాల వారీగా కూడా మ్యానిఫెస్టో విడుదల చేస్తామని ఉత్తమ్ తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ఆయా నియోజక వర్గాల్లో ఉన్న సమస్యల పరిష్కారినికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని నియోజక వర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న వారి వివరాలు సేకరించామని, వారందరి పేర్లను సర్వేలో చేర్చుతామన్నారు. అన్ని అనుకూలతలు ఉన్నవారికే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కు 75 సీట్లు వస్తాయన్నారు. కేసీఆర్ వంద సీట్లు వస్తాయని చెబుతున్నారని, బహుశ ఆయన పక్కరాష్ట్రాల్లో సర్వే చేయించి ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

Related News