Public toilets

ఎయిర్‌పోర్ట్‌లో ఆ చోట ప్రాణాంతక వైరస్.. 

Updated By ManamThu, 09/06/2018 - 15:34

airport, security tray, germs, public toiletsనాటింగ్‌హామ్: విమాన ప్రయాణికులరా జర జాగ్రత్త. విమానాశ్రయంలో ఒక చోటు అత్యంత ప్రమాదకరమట. రోత పుట్టించేలా ఉండే ఆ చోటుకు ఎంత దూరంగా ఉంటే అంతమంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రమాదకరమైన సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతాయట. అదే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ చెకింగ్ పాయింట్. ప్రయాణికులు వెంట తీసుకెళ్లే లగేజీ భద్రపరిచే ట్రేల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ అతి ప్రమాదకరమని పరిశోధనలో తేలింది. ఈ వైరస్.. పబ్లిక్ టాయిలెట్లలో ఉండే వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమని గుర్తించినట్టు నాటింగ్‌హామ్, ఫిన్‌లాండ్ నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వెల్‌ఫేర్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇలాంటి ట్రేల ద్వారా డజన్ల కొద్ది సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా సోకి ప్రాణాంతకమైన అంటువ్యాధులు ప్రబలుతాయని పేర్కొన్నారు. సాధారణ జలుబు, న్యుమోనియా, పిత్తాశయం, అంటువ్యాధులు, సార్స్, మెదడు దెబ్బతినడం వంటి వ్యాధులు ప్రబలుతాయని తెలిపారు. 2016లో శీతాకాలం సీజన్‌లో ఫిన్‌లాండ్‌లోని హెల్సింకీ-వాంటా ఎయిర్‌పోర్ట్‌లో పలుచోట్ల పరిశోధక బృందం పరీక్షలు జరిపింది. 

ప్లాస్టిక్ ట్రేల ద్వారా వ్యాప్తి..
ఈ పరీక్షల్లో ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల లగేజీ భద్రపరిచే ట్రేల వద్ద 10 శాతం మేర వైరస్ ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ప్రధానంగా ఎక్స్‌రే చెక్ పాయింట్ వద్ద ప్రయాణికులు క్యూ కట్టిన సమయంలో ప్లాస్టిక్ ట్రేల ద్వారా ఈ వైరస్ ను వ్యాప్తి చేసే బ్యాక్టిరీయా ఉందని గుర్తించినట్టు చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించి జనరల్ బీఎంసీ ఇన్ఫిక్షన్స్ డిసిజేస్‌లో ప్రచురించారు. ప్లాస్టిక్ ట్రేలపై ఉండే బ్యాక్టీరియా కారణంగా సాధారణ జలుబుతో మొదలై శ్వాసకోస వ్యాధులు వస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి వైరస్.. పబ్లిక్ టాయిలెట్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా కూడా గుర్తించలేదని పేర్కొన్నారు.
airport, security tray, germs, public toiletsఈ వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ముందు జాగ్రత్త చర్యగా ప్రతిఒక్కరూ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, జలుబు చేసిన సమయంలో హ్యాండ్ కర్చిఫ్, టిస్యూలను వాడాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఎయిర్‌పోర్ట్ వంటి బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇలాంటి చర్యల ద్వారా వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. ఇలాంటి సులభమైన జాగ్రత్తలను తీసుకోవడం వల్ల వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చనని యూనివర్శిటీ ప్రొఫెసర్ జొనథాన్ వాన్ తెలిపారు.గాంధేయ పద్ధతిలో పెట్రోల్ బంకుల్లో మరుగుదొడ్లు

Updated By ManamTue, 10/31/2017 - 12:38

KTR, Public toilets, Petrol bunks, Central govt, Swachch bharath, swachch Telangana mission హైదరాబాద్: నగరంలోని పారిశుద్ధ్య కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అభినందించిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నగర అభివృద్ధిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధాన మిచ్చారు. జీహెచ్‌ఎంసీలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ తో పాటు స్వచ్ఛ తెలంగాణలో భాగంగా పారిశుద్ధ్యం అనే అంశాన్ని కీలకంగా తీసుకున్నామని చెప్పారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వచ్చిన రూ. 3 కోట్లతో మరుగుదోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. గాంధేయ పద్ధతిలో 295 పెట్రోల్ బంకుల్లో మరుగుదోడ్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అనే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ బంకుల్లో టాయిలెట్లు నిర్మించాలని కేంద్రం ఇతర రాష్ర్టాలకు కూడా సూచించిందని కేటీఆర్ పేర్కొన్నారు.

Related News