Sushma Swaraj

పాస్‌పోర్టు పోయింది, సాయం చేయండి: బ్యాడ్మింటన్ ఆటగాడు

Updated By ManamSat, 10/13/2018 - 14:50

Parupalli Kashyapతన పాస్‌‌‌‌పోర్ట్ పోయిందని, సాయం చేయాలని కోరుతూ భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు విన్నవించాడు భారత బ్యాడ్మింటన్ స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్ట్‌ను చేశాడు కశ్యప్. ‘‘గుడ్ మార్నింగ్ మేడమ్. గత రాత్రి ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో నా పాస్‌పోర్ట్ పోయింది. నేను డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, సార్లౌక్స్ ఓపెన్ ఆడేందుకు జర్మనీ వెళుతున్నారు. డెన్మార్క్‌కు ఈ ఆదివారం నా టికెట్ కన్ఫర్మ్  అయ్యింది. ఈ విషయంలో నాకు సాయం చేయగలరు’’ అంటూ కశ్యప్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను ప్రధాని నరేంద్రమోదీ, క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్‌లకు కూడా కశ్యప్ ట్యాగ్ చేశాడు.

 అమ్మ కాళ్లకు చక్రాలు

Updated By ManamTue, 09/11/2018 - 00:18

మన అమ్మలంతా కాళ్లకు చక్రాలు కట్టుకుంటే? ఈ ఊహకు స్పష్టత లేదనుకోవద్దు.. ‘మదర్ ఆన్ వీల్ ’ పేరుతో నలుగురు అమ్మలు మొదలుపెట్టిన సాహస యాత్ర ఇప్పుడు మనదేశంలో సంచలనం సృష్టిస్తోంది.  వీరంతా రొటీన్‌లో బిజీగా ఉండే ఉద్యోగులే అయినా సమాజానికి ఏదైనా సందేశం ఇవ్వాలన్న తాపత్రయంతో ఖండాతరాల్లో ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలేసుకున్నారు. కొన్ని నెలలపాటు ఇందుకు అనుగుణంగా శారీరకంగా, మానసికంగా సిద్ధమై చాలెంజ్‌కు రూపకల్పన చేసుకున్నారు. ఎప్పుడూ ఇంటి పని, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ విధుల్లో మునిగితేలే ఈ నలుగురు అమ్మలు దేశంలోని ఎంతో మంది అమ్మలను ఇప్పుడు ఆలోచింపచేస్తున్నారు.
 

image


22 దేశాల్లో..
సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లే ఈ బృందం 22 దేశాల గుండా ప్రయాణించి చివరి మజిలీగా బ్రిటన్ చేరుకుంటుంది. 60 రోజులపాటు 20 వేల కిలోమీటర్లను ఏకబిగిన పూర్తి చేస్తూనే దారివెంబడి చిన్నారుల్లో సానుకూల దృక్పథాన్ని ఎలా అలవరచాలో వివరించనుంది. విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్రకు మంచి స్పందన మొదలవ్వడం విశేషం. మాధురి సహస్రబుధే, శీతల్ వైద్య, ఊర్మిళా జోష్, మాధవి సింగ్‌లు చేస్తున్న ఈ సాహస యాత్ర ఎలైట్ ఐ 20 కార్ ద్వారా సాగనుండడంతో వీరికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని హ్యూండాయ్ సంస్థ అందించనుంది.
 

image

 అలాగా.. అగ్నిపర్వతాన్ని అడుగుతా!

Updated By ManamFri, 08/10/2018 - 00:21

imageన్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ.. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు వింత పరిస్థితి ఏర్పడింది. సుశీల్ కే రాయ్ అనే వ్యక్తి సుష్మను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అందులో.. ‘‘ బాలీకి వెళ్లడం క్షేమమేనా? ఈ నెల  11-17 మధ్య  ఇండొనేషియాలోని బాలీకి వెళ్లాలనుకుంటున్నాను.  అక్కడ అగ్నిపర్వతం పేలిందని విన్నాం. మరి అక్కడికి  వెళ్ళడం సురక్షితమేనా? మన ప్రభుత్వం ఏదైనా సూచనను విడుదల చేసిందా? వివరాలుంటే తెలపండి’’ అని ఆ వ్యక్తి కోరారు. దీనికి సుష్మా స్వరాజ్ బదులిస్తూ ‘‘నేను అగ్ని పర్వతాన్ని సంప్రదించాలి’’ అని సుష్మాస్వరాజ్ సరదాగా ట్వీట్ చేశారు.చైనా ఒత్తిడికి సుష్మా సాగిలపడ్డారు

Updated By ManamFri, 08/03/2018 - 00:05
  • వివాదాస్పద ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ  

న్యూఢిల్లీ:  విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. డోక్లాం వివాదం లో చైనా ఒత్తిడికి సుష్మ సాగిలపడ్డార ని రాహుల్ ట్వీట్ చేశారు. దౌత్యప రమైన పరిణితిని ప్రదర్శించి ఒక్క అంగుళం భూమిని కూడా పోగొట్టుకోకుండా డోక్లాం ప్రతిష్ఠంభన తొల గించినట్టు లోక్‌సభలో బుధవారం సుష్మ ప్రకటన చేశాక రాహుల్ ఈ తీవ్ర ఆరోపణలు చేయడం విశేషం.
 

image


  ‘‘చైనా అధికారానికి సుష్మాజీ వంటి వ్యక్తి ఎలా తలొగ్గారో అర్థంకావడం లేదు, మంత్రి వ్యాఖ్యలు సరిహద్దుల్లోని భారత సైనికులను మోసంచేసేలా ఉన్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా చైనా, భూటాన్ మధ్య భూవివాదాలు కొనసాగుతుండగా, డోక్లాంలో మాత్రం యథాతథ పరిస్థితి నెలకొందని సుష్మా లోక్‌సభలో స్పష్టంచేశారు. భారత్, చైనా, భూటాన్ దేశాల ట్రైజంక్షన్‌లోని డోక్లామ్‌లోకి చైనా బలగాలు ప్రవేశించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంతో మన సైన్యం అడ్డుకుంది.సుష్మపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Updated By ManamThu, 08/02/2018 - 17:11
sushma-rahul

న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  తీవ్ర విమర్శలు చేశారు. చైనా ఒత్తిడికి సుష్మ తలొంచారంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా  భారత్‌, చైనా మధ్య డోక్లామ్‌ వివాదంపై సుష్మా స్వరాజ్ బుధవారం లోక్‌సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. డోక్లామ్ వివాదం గత ఏడాదే సద్దుమణిగిందంటూ, దాంట్లో ఎలాంటి మార్పులేదని ఆమె ప్రకటన చేశారు. 

దీంతో సుష్మా స్వరాజ్ ప్రకటనపై రాహుల్ అసహనం వ్యక్తం చేస్తూ చూస్తుంటే చైనా శక్తి ముందు ఆమె తలొగ్గడం ఆశ్చర్యంగా ఉంది అని ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ఆమె వ్యాఖ్యలు జవాన్లను మోసగించేవిగా ఉన్నాయని అన్నారు. రాహుల్ ఈ మేరకు ట్విట్ చేస్తూ ‘డోక్లామ్‌లో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించిన చైనా’ అనే కథనాన్ని కూడా షేర్ చేశారు.
 హైదరాబాద్ చేరుకున్న శరత్ మృతదేహం

Updated By ManamThu, 07/12/2018 - 08:18

sarat-dead-body-reaches-hyderabad

హైదరాబాద్: అవెురికాలోని కన్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన వరంగల్ వాసి కొప్పుల శరత్ మృతదేహం గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంది. ఎయిర్ ఇండియా విమానంలో నేరుగా హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి తరలించడం జరిగింది. 

మృతదేహనికి కేంద్ర మాజీ మంత్రి ఎంపీ బండారు దత్తాత్రేయ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీలు పట్నం నరేందర్ రెడ్డి, శంభిపురి రాజు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ నివాళులు అర్పించారు. శరత్‌ను కడసారి చూసేందుకు ఆయన మిత్రులు, సన్నిహితులు పెద్ద ఎత్తున ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. శరత్ కుటుంబీకులు ఆర్తనాదాలు మిన్నంటాయి. గురువారం సాయంత్రం అంత్యక్రియలు జరిగే అవకాశముంది. కాగా.. అవెురికాలోని మిస్సోరి వర్సిటీలో ఎంఎస్ చదువుతూ అక్కడి రెస్టారెంట్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శరత్ కొప్పు ఓ దొంగ జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. శరత్ మృతదేహం గురువారం రానున్నట్లు ఎంపీ బండారు దత్తాత్రేయ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. హంతకున్ని త్వరలో పట్టుకునేందుకు అమెరికాతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్‌తో మాట్లాడామని దత్తన్న బుధవారం నాడు మీడియాకు వివరించారు.  అమెరికా‌లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సుష్మను కోరినట్లు ఆయన చెప్పారు.సుష్మా స్వరాజ్‌పై భర్త భావోద్వేగపు ట్వీట్

Updated By ManamMon, 07/02/2018 - 09:27

Sushma Swarajన్యూఢిల్లీ: మతాంతర వివాహం చేసుకున్న జంటకు పాస్‌పోర్ట్‌లు జారీ అయ్యేలా చేసిన కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌పై కొంతమంది ప్రశంసలు కురిపించగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు భర్త స్వరాజ్‌ కౌశల్‌ అండగా నిలిచారు. సుష్మా చేసిన పనికి మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేయడంతో కౌశల్, ఆయనకు భావోద్వేగంతో ఓ ట్వీట్‌ను చేశారు.

‘‘మీ మాటలు నన్ను బాధించాయి. అందుకే మీతో కొన్ని విషయాలను పంచుకోవాలనుకుంటున్నా. 1993లో నా తల్లి కేన్సర్‌తో మరణించారు. ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఏడాదిపాటు సుష్మా ఆమె పక్కనే ఉన్నారు. వైద్యసహాయకురాలిని వద్దని చెప్పి మరీ నా తల్లికి స్వయంగా సేవలు చేశారు. కుటుంబం పట్ల ఆమెకున్న అంకితభావం అలాంటిది. అంతెందుకు నా తండ్రి చివరి కోరిక మేరకు ఆయన చితికి సుష్మానే నిప్పంటించారు. ఆమెకు ఎంతో రుణపడి ఉంటాం. దయచేసి ఇంకోసారి అలాంటి వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో మాది మొదటి తరం. సుష్మా ఎప్పటికీ ఆరోగ్యంగా ఉండాలనే మేం కోరుకుంటున్నాం. మీ భార్యను అడినట్లు చెప్పండి’’ అంటూ ఓ వ్యక్తికి కౌశల్‌ బదులిచ్చారు. వీసా దేవత సుష్మా స్వరాజ్ 

Updated By ManamMon, 06/25/2018 - 14:27

Visa Maata న్యూఢిల్లీ: ఆపదల్లో ఉన్న వారికి వీసాలు జారీ చేయడం, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడం ఇలా పలు విషయాలలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మానవతాహృదయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకు ఇబ్బందిని చెబితే చాలు వెంటనే స్పందించి సహాయం చేస్తుంటారు. అయితే తాజాగా లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు ఆమె పాస్‌పోర్ట్ జారీ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే గత వారం రోజులుగా ఇండియాలో లేని సుష్మా స్వరాజ్ తాజాగా తనకు వచ్చిన ట్వీట్లకు స్పందించింది. వాటిలో తనపై వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లను కూడా ఆమె రీ ట్వీట్ చేయడం విశేషం. కాగా అందులో కొందరు సుష్మా స్వరాజ్‌ను వీసా మాత అంటూ సంభోదించి ఆమెకు ఏమీ తెలీదు, మోదీ మీ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించండి అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్ల నుంచి సుష్మాకు విమర్శలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఆమెకు మద్దతు లభించడం విశేషం.యూఎస్‌లో తెలుగు టెకీ మిస్సింగ్!

Updated By ManamFri, 06/22/2018 - 12:36

హైదరాబాద్ :  అమెరికాలోని కాలిఫోర్నియాలో నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  సైదాబాద్‌ వినయ్‌ నగర్‌ కాలనీకి చెందిన బంగారం కుమారుడు పి.రాఘవేంద్రరావు కాలిఫోర్నియాలో మైక్రోసాఫ్ట్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. hyderabad techie missing in California

అయితే గత ఏడాది అక్టోబర్ నుంచి అతడి ఆచూకీ తెలియడం లేదు. అప్పటి నుంచి కుమారుడి గురించి ఆరా తీసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, ఇండియన్ ఎంబసీకి విజ్ఞప్తి చేశారు.ఆ 39 మంది.. ఇక లేరు

Updated By ManamWed, 03/21/2018 - 02:17
  • ఇరాక్‌లో భారతీయుల దుర్మరణం

  • అధికారికంగా తెలియజేసిన ప్రభుత్వం

  • డీఎన్‌ఏ పరీక్ష ద్వారా మృతదేహాల గుర్తింపు

  • వాటిని వారి బంధువులకు అందజేస్తాం

  • రాజ్యసభలో మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన

  • లోక్‌సభలో మంత్రి ప్రకటనకు సభ్యుల అడ్డు

  • సింధియాను రాహుల్ రెచ్చగొట్టి పంపారు

  • చావులతో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది

  • తీవ్రంగా మండిపడిన విదేశీ వ్యవహారాల మంత్రి

imageఇన్నాళ్లూ అదృశ్యమయ్యారని భావించి న 39 మంది భారతీయులు మరణించారు. వారు ఎవరెవరన్న విషయాన్ని కూడా భార త ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో బాధాతప్త హృదయంతో ప్రకటించారు. భారతీయులు ఎక్కడ మరణించారో సరిగా తెలియకపోయినా మోసుల్‌కు ఆగ్నేయ దిశలోని బాదోష్ అనే చోట మృతదేహాలు లభ్యమయ్యాయని, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వారిని గుర్తించామని స్వరాజ్ చెప్పారు. తగిన ఆధారాల్లేకుండా ఏ ఒక్కరూ మరణించినట్లు తాను చెప్పబోనని ఇంతకుముందు అన్న విషయాన్ని గుర్తుచేసిన సుష్మ.. బరువెక్కిన హదయంతో, పూర్తి ఆధారాలతో ఇప్పుడు మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగించి, కేసు క్లోజ్ చేసినట్లు తెలిపారు. 
 

అలా చేస్తే పాపం
సరైన పరీక్షలు చేయకుండా ఎవరో ఒకరి మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తే అది పాపమని.. అందుకే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తిచేసి సాక్ష్యాలు ఇచ్చేవరకు ఆగానని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఎవరికీ తప్పుడు హామీలు ఇవ్వలేది, ఎవరినీ చీకట్లో ఉంచలేదని ఆమె అన్నారు. మృతులలో 27 మంది పంజాబ్‌కు, ఆరుగురు బిహార్‌కు చెందినవారు కాగా నలుగురు హిమాచల్ ప్రదేశ్, మరో ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. మొత్తం 39 మందిలో 38 మంది డీఎన్‌ఏ శాంపిళ్లు పూర్తిగా సరిపోయాయని, మిగిలిన ఒక్కరిది 70 శాతం సరిపోయిందని తెలిపారు. ఐసిస్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాసి చెప్పిన విషయం తప్పని.. భారతీయులను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు అతడు చెప్పినా, ఇప్పుడలా జరగలేదని మంత్రి వివరించారు. 
 

మృతదేహాలను అప్పగించనున్న వీకే సింగ్
విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి మృతదేహాలను ప్రత్యేక విమానంలో తీసుకొస్తారని ఆమె తెలిపారు. తిరిగి వచ్చేటపుడు తొలుత అమృతసర్‌లో ఆగి అక్కడ, తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఆ తర్వాత పట్నా, ఆపై కోల్‌కతా వెళ్లి అక్కడక్కడ వారి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారన్నారు. మంత్రి ఈ ప్రకటన చేయగానే.. చైర్మన్ వెంకయ్యనాయుడు ఇది చాలా దుర్వార్త అని చెప్పారు. అనంతరం మృతులకు సంతాప సూచకంగా సభ్యులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. భారతీయులంతా సురక్షితంగా ఉంటారని ప్రభుత్వం గత సంవత్సరం చెప్పిందని ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ గుర్తుచేశారు. భారతీయుల మరణంపై ఆయన సంతాపం తెలిపారు. 
 

లోక్‌సభలో గందరగోళం
లోక్‌సభలో మాత్రం ఈ అంశంపై సుష్మా స్వరాజ్ ఎలాంటి ప్రకటనా చేయలేకపోయారు. సభలో ముందు నుంచి తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. సుష్మా స్వరాజ్ ఒక సీరియస్ అంశం గురించి ప్రకటన చేయబోతున్నారని, అందువల్ల సభ్యులు అదుపులో ఉండాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే కోరారు. ఈ సమయంలో సుష్మా ఏం మాట్లాడుతున్నారో వినపడనివ్వకుండా.. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు ‘నో.. నో’ అంటూ నినాదాలు హోరెత్తించారు. ఇరాక్‌లో 39 మంది భారతీయుల దుర్మరణం గురించి ఆమె చెప్పాలనుకుంటున్నారని, మంత్రి చెప్పేది వినాలని స్పీకర్ కోరారు. కానీ సభలో గందరగోళ పరిస్థితి ఉండటంతో తాను ఇలాంటి సీరియస్ అంశం చెప్పలేనని సుష్మా స్వరాజ్ చేతులెత్తేశారు. తాను సభలో సాక్ష ్యం ప్రవేశపెట్టాలనుకుంటున్నానని, దయచేసి తాను చెప్పేది వినాలని ఆమె కోరారు. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాల సభ్యులు ఆమె మాటలు వినిపించుకోకుండా తమ నినాదాలు కొనసాగించారు. రాజ్యసభలో తను ప్రకటన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో సహనంతో విన్నారని, అంతా సంతాపం కూడా ప్రకటించారని, అదే లోక్‌సభలో కూడా జరుగుతుందని తాను భావించినా.. ఇక్కడ మాత్రం జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళం సష్టించార ని, ఇది చాలా దురదష్టకరమని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా నీచ రాజకీయాలకు దిగజారిందని, బహుశా కాంగ్రెస్ అధ్యక్షుడే రాజ్యసభలో ఎలాంటి గందరగోళం ఎందుకు జరగలేదని భావించి సిందియాను లోక్‌సభలో నిరసనలకు నాయకత్వం వహించమని చెప్పి ఉంటారని, చావులతో కూడా వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆ తర్వాత.. సభ అదుపులో లేనందున ఇక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేమంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
 

అసలేం జరిగింది...
ఇరాక్‌లో రెండో అతిపెద్ద నగరమైన మోసుల్‌లో 2014 సంవత్సరంలో 40 మంది భారతీయులతో పాటు కొంతమంది బంగ్లాదేశీలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందినవారే. 40 మంది భారతీయుల్లో గుర్‌దాస్‌పూర్‌కు చెందిన హర్‌జీత్ మాసి మాత్రం ఎలాగోలా తప్పించుకుని వచ్చి.. మిగిలిన వారి హత్యాకాండను చూసినట్లు చెప్పారు. ఆయన కథనాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. అవన్నీ కాకమ్మ కథలని అప్పట్లో సుష్మా చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింగా నకిలీపేరు చెప్పి అతడు ఐసిస్ బారి నుంచి తప్పించుకుని వచ్చాడన్నారు. భారతీయులను తొలుత ఒక వస్త్రాల మిల్లులో పెట్టినా, హర్‌జీత్ తప్పించుకున్నాక వారిని బాదోష్‌లోని జైలుకు తరలించారు. వారి కోసం తీవ్రంగా గాలించగా.. చివరకు బాదోష్‌లో సామూహిక సమాధులు కనిపించాయి. భూమి లోపలికి వెళ్లే రాడార్ సాయంతో అక్కడ మృతదేహాలున్నట్లు గుర్తించారు. వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం బాగ్దాద్ పంపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు చాలామంది ఇరాకీలు ఆ నగరం విడిచి వెళ్లిపోయినా భారతీయులు, బంగ్లాదేశీలు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారు ఒకరోజు భోజనం చేసి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ పతనం తర్వాత సహాయమంత్రి వీకే సింగ్ వెళ్లి అక్కడ ఇరాకీ అధికారుల సాయంతో 39 మృతదేహాలను గుర్తించారు. వెతికే సమయంలో సింగ్ ఒక చిన్న ఇంట్లో నేలమీద కూడా పడుకోవాల్సి వచ్చిందని చెబుతూ.. ఆయన సేవలను సుష్మా ప్రస్తుతించారు. 
 

నేనింకా నమ్మలేను
కొన్నేళ్లుగా తన సోదరుడు బతికే ఉండి ఉంటాడని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెబుతున్నారని.. ఇప్పుడు మళ్లీ ఆమె చెబితే తప్ప తన సోదరుడు మరణించిన విషయాన్ని తాను నమ్మలేనని పంజాబ్‌కు చెందిన గుర్‌పీందర్ కౌర్ అంటున్నారు. ఇరాక్‌లో మరణించిన 39 మందిలో ఆమె సోదరుడు మన్‌జీందర్ సింగ్ కూడా ఒకరు. తాను టీవీలలో విన్నానని, కానీ మంత్రి లేదా ఆమె కార్యాలయం అధికారులు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పేవరకు తాను ఈ విషయాన్ని నమ్మలేనని ఆమె వాపోయారు.
 

బతికింది ఒకే ఒక్కడు
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి సజీవంగా తప్పించుకుని వచ్చిన ఏకైక వ్యక్తి... హర్‌జీత్ మాసి. అతడితో పాటు మరో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా మరణించినట్లు తాను ముందునుంచి చెబుతున్నానని హర్‌జీత్ అన్నారు. తాను నిజమే చెప్పానని పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ జిల్లా కాలా అఫ్ఘానా గ్రామంలో ఆయన తెలిపారు. తన కళ్ల ముందే మిగిలినవారందరినీ చంపేశారని.. అదే విషయం తాను ఇన్నేళ్లుగా చెబుతున్నానని అన్నారు. కానీ ప్రభుత్వం ఇంతకుముందు తన మాటలు నమ్మలేదన్నారు. ఒక రోజు తమను మోకాళ్ల మీద కూర్చోబెట్టి వరుసగా తుపాకులతో కాల్చేశారని, తనకు మాత్రం అదృష్టవశాత్తు తొడలో బుల్లెట్ తగిలి స్పృహతప్పి పడిపోయానని చెప్పారు. తనకు గాయమైందని ఉగ్రవాదులకు చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. 

Related News