Sushma Swaraj

ఆ 39 మంది.. ఇక లేరు

Updated By ManamWed, 03/21/2018 - 02:14
 • ఇరాక్‌లో భారతీయుల దుర్మరణం

 • అధికారికంగా తెలియజేసిన ప్రభుత్వం

 • డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వృతదేహాల గుర్తింపు

 • వాటిని వారి బంధువులకు అందజేస్తాం

 • రాజ్యసభలో మంత్రి సుష్మాస్వరాజ్ ప్రకటన

 • లోక్‌సభలో మంత్రి ప్రకటనకు సభ్యుల అడ్డు

 • సింధియాను రాహుల్ రెచ్చగొట్టి పంపారు

 • చావులతో కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది

 • తీవ్రంగా మండిపడిన విదేశీ వ్యవహారాల మంత్రి

sushmaన్యూఢిల్లీ: ఇన్నాళ్లూ అదృశ్యమయ్యారని భావించిన 39 మంది భారతీయులు మరణించారు. వారు ఎవరెవరన్న విషయాన్ని కూడా భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో బాధాతప్త హృదయంతో ప్రకటించారు. భారతీయులు ఎక్కడ మరణించారో సరిగా తెలియకపోయినా మోసుల్‌కు ఆగ్నేయ దిశలోని బాదోష్ అనే చోట మృతదేహాలు లభ్యమయ్యాయని, డీఎన్‌ఏ పరీక్ష ద్వారా వారిని గుర్తించామని స్వరాజ్ చెప్పారు. తగిన ఆధారాల్లేకుండా ఏ ఒక్కరూ మరణించినట్లు తాను చెప్పబోనని ఇంతకుముందు అన్న విషయాన్ని గుర్తుచేసిన సుష్మ.. బరువెక్కిన హదయంతో, పూర్తి ఆధారాలతో ఇప్పుడు మృతదేహాలను వారి సంబంధీకులకు అప్పగించి, కేసు క్లోజ్ చేసినట్లు తెలిపారు. 

అలా చేస్తే పాపం
సరైన పరీక్షలు చేయకుండా ఎవరో ఒకరి మృతదేహాలను బంధువులకు ఇచ్చేస్తే అది పాపమని.. అందుకే డీఎన్‌ఏ పరీక్షలు పూర్తిచేసి సాక్ష్యాలు ఇచ్చేవరకు ఆగానని సుష్మా స్వరాజ్ చెప్పారు. ఎవరికీ తప్పుడు హామీలు ఇవ్వలేది, ఎవరినీ చీకట్లో ఉంచలేదని ఆమె అన్నారు. మృతులలో 27 మంది పంజాబ్‌కు, ఆరుగురు బిహార్‌కు చెందినవారు కాగా నలుగురు హిమాచల్ ప్రదేశ్, మరో ఇద్దరు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు. మొత్తం 39 మందిలో 38 మంది డీఎన్‌ఏ శాంపిళ్లు పూర్తిగా సరిపోయాయని, మిగిలిన ఒక్కరిది 70 శాతం సరిపోయిందని తెలిపారు. ఐసిస్ చెర నుంచి తప్పించుకుని వచ్చిన హర్జిత్ మాసి చెప్పిన విషయం తప్పని.. భారతీయులను ఉగ్రవాదులు కాల్చి చంపినట్లు అతడు చెప్పినా, ఇప్పుడలా జరగలేదని మంత్రి వివరించారు. 

మృతదేహాలను అప్పగించనున్న వీకే సింగ్
విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకేసింగ్ స్వయంగా ఇరాక్ వెళ్లి మృతదేహాలను ప్రత్యేక విమానంలో తీసుకొస్తారని ఆమె తెలిపారు. తిరిగి వచ్చేటపుడు తొలుత అవుతసర్‌లో ఆగి అక్కడ, తర్వాత హిమాచల్‌ప్రదేశ్, ఆ తర్వాత పట్నా, ఆపై కోల్‌కతా వెళ్లి అక్కడక్కడ వారి బంధువులకు మృతదేహాలను అప్పగిస్తారన్నారు. మంత్రి ఈ ప్రకటన చేయగానే.. చైర్మన్ వెంకయ్యనాయుడు ఇది చాలా దుర్వార్త అని చెప్పారు. అనంతరం వుతులకు సంతాప సూచకంగా సభ్యులు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. భారతీయులంతా సురక్షితంగా ఉంటారని ప్రభుత్వం గత సంవత్సరం చెప్పిందని ఈ సందర్భంగా రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ గుర్తుచేశారు. భారతీయుల మరణంపై ఆయన సంతాపం తెలిపారు. 

లోక్‌సభలో గందరగోళం
లోక్‌సభలో మాత్రం ఈ అంశంపై సుష్మా స్వరాజ్ ఎలాంటి ప్రకటనా చేయలేకపోయారు. సభలో ముందు నుంచి తీవ్ర గందరగోళం నెలకొనడంతో.. సుష్మా స్వరాజ్ ఒక సీరియస్ అంశం గురించి ప్రకటన చేయబోతున్నారని, అందువల్ల సభ్యులు అదుపులో ఉండాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే కోరారు. ఈ సమయంలో సుష్మా ఏం మాట్లాడుతున్నారో వినపడనివ్వకుండా.. కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు నో.. నో అంటూ నినాదాలు హోరెత్తించారు. ఇరాక్‌లో 39 మంది భారతీయుల దుర్మరణం గురించి ఆమె చెప్పాలనుకుంటున్నారని, మంత్రి చెప్పేది వినాలని స్పీకర్ కోరారు. కానీ సభలో గందరగోళ పరిస్థితి ఉండటంతో తాను ఇలాంటి సీరియస్ అంశం చెప్పలేనని సుష్మా స్వరాజ్ చేతులెత్తేశారు. తాను సభలో సాక్ష్యం ప్రవేశపెట్టాలనుకుంటున్నానని, దయచేసి తాను చెప్పేది వినాలని ఆమె కోరారు. కానీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాల సభ్యులు ఆమె మాటలు వినిపించుకోకుండా తమ నినాదాలు కొనసాగించారు. రాజ్యసభలో తను ప్రకటన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో సహనంతో విన్నారని, అంతా సంతాపం కూడా ప్రకటించారని, అదే లోక్‌సభలో కూడా జరుగుతుందని తాను భావించినా.. ఇక్కడ మాత్రం జ్యోతిరాదిత్య సింధియా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గందరగోళం సష్టించార ని, ఇది చాలా దురదష్టకరమని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా నీచ రాజకీయాలకు దిగజారిందని, బహుశా కాంగ్రెస్ అధ్యక్షుడే రాజ్యసభలో ఎలాంటి గందరగోళం ఎందుకు జరగలేదని భావించి సిందియాను లోక్‌సభలో నిరసనలకు నాయకత్వం వహించమని చెప్పి ఉంటారని, చావులతో కూడా వాళ్లు రాజకీయం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఆ తర్వాత.. సభ అదుపులో లేనందున ఇక ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేమంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

నేనింకా నమ్మలేను
కొన్నేళ్లుగా తన సోదరుడు బతికే ఉండి ఉంటాడని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చెబుతున్నారని.. ఇప్పుడు మళ్లీ ఆమె చెబితే తప్ప తన సోదరుడు మరణించిన విషయాన్ని తాను నమ్మలేనని పంజాబ్‌కు చెందిన గుర్‌పీందర్ కౌర్ అంటున్నారు. ఇరాక్‌లో మరణించిన 39 మందిలో ఆమె సోదరుడు మన్‌జీందర్ సింగ్ కూడా ఒకరు. తాను టీవీలలో విన్నానని, కానీ మంత్రి లేదా ఆమె కార్యాలయం అధికారులు తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పేవరకు తాను ఈ విషయాన్ని నమ్మలేనని ఆమె వాపోయారు.

అసలేం జరిగింది...
ఇరాక్‌లో రెండో అతిపెద్ద నగరమైన మోసుల్‌లో 2014 సంవత్సరంలో 40 మంది భారతీయులతో పాటు కొంతమంది బంగ్లాదేశీలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. భారతీయుల్లో ఎక్కువ మంది పంజాబ్‌కు చెందినవారే. 40 మంది భారతీయుల్లో గుర్‌దాస్‌పూర్‌కు చెందిన హర్‌జీత్ మాసి మాత్రం ఎలాగోలా తప్పించుకుని వచ్చి.. మిగిలిన వారి హత్యాకాండను చూసినట్లు చెప్పారు. ఆయన కథనాన్ని ప్రభుత్వం కొట్టిపారేసింది. అవన్నీ కాకమ్మ కథలని అప్పట్లో సుష్మా చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన ముస్లింగా నకిలీపేరు చెప్పి అతడు ఐసిస్ బారి నుంచి తప్పించుకుని వచ్చాడన్నారు. భారతీయులను తొలుత ఒక వస్త్రాల మిల్లులో పెట్టినా, హర్‌జీత్ తప్పించుకున్నాక వారిని బాదోష్‌లోని జైలుకు తరలించారు. వారి కోసం తీవ్రంగా గాలించగా.. చివరకు బాదోష్‌లో సామూహిక సమాధులు కనిపించాయి. భూమి లోపలికి వెళ్లే రాడార్ సాయంతో అక్కడ మృతదేహాలున్నట్లు గుర్తించారు. వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం బాగ్దాద్ పంపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మోసుల్ నగరాన్ని స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు చాలామంది ఇరాకీలు ఆ నగరం విడిచి వెళ్లిపోయినా భారతీయులు, బంగ్లాదేశీలు మాత్రం అక్కడే ఉండిపోయారు. వారు ఒకరోజు భోజనం చేసి తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఇస్లామిక్ స్టేట్ పతనం తర్వాత సహాయమంత్రి వీకే సింగ్ వెళ్లి అక్కడ ఇరాకీ అధికారుల సాయంతో 39 మృతదేహాలను గుర్తించారు. వెతికే సమయంలో సింగ్ ఒక చిన్న ఇంట్లో నేలమీద కూడా పడుకోవాల్సి వచ్చిందని చెబుతూ.. ఆయన సేవలను సుష్మా ప్రస్తుతించారు. 

బతికింది ఒకే ఒక్కడు
ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ చెర నుంచి సజీవంగా తప్పించుకుని వచ్చిన ఏకైక వ్యక్తి... హర్‌జీత్ మాసి. అతడితో పాటు మరో 39 మంది భారతీయులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా మరణించినట్లు తాను ముందునుంచి చెబుతున్నానని హర్‌జీత్ అన్నారు. తాను నిజమే చెప్పానని పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్ జిల్లా కాలా అఫ్ఘానా గ్రామంలో ఆయన తెలిపారు. తన కళ్ల ముందే మిగిలినవారందరినీ చంపేశారని.. అదే విషయం తాను ఇన్నేళ్లుగా చెబుతున్నానని అన్నారు. కానీ ప్రభుత్వం ఇంతకుముందు తన మాటలు నమ్మలేదన్నారు. ఒక రోజు తమను మోకాళ్ల మీద కూర్చోబెట్టి వరుసగా తుపాకులతో కాల్చేశారని, తనకు మాత్రం అదృష్టవశాత్తు తొడలో బుల్లెట్ తగిలి స్పృహతప్పి పడిపోయానని చెప్పారు. తనకు గాయమైందని ఉగ్రవాదులకు చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చేశానని అన్నారు. 
 విమర్శలు తిప్పికొట్టిన సుష్మా స్వరాజ్

Updated By ManamTue, 03/20/2018 - 16:04

sushma swarajన్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో నాలుగేళ్ల క్రితం అపహరణకు గురైన 39 మంది భారతీయులను ఐసిస్ అతి కిరాతకంగా హతమార్చడం తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో వెల్లడించారు. మృతుల్లో పశ్చిమ్‌బంగా‌, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందినవారున్నారు.దీంతో వారి కుటుంబీకుల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ వాళ్ల ఇరాక్‌లో చనిపోయినట్లు సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటించే వరకు ఆ విషయం తమకు తెలియని మృతుల కుటుంబీకులు విస్మయం వ్యక్తంచేశారు.

Read related article: ఇరాక్‌లో 39 మంది భారతీయులు హతం

కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకముందే వారు చనిపోయినట్లు సుష్మా స్వరాజ్ పార్లమెంటులో ప్రకటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శలను తోసిపుచ్చిన సుష్మా స్వరాజ్...కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడానికి ముందే వారి మరణంపై పార్లమెంటులో ప్రకటన చేయడాన్ని సమర్థించుకున్నారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశం అయినందునే పార్లమెంటులో తొలుత ప్రకటన చేసినట్లు చెప్పారు. ఇరాక్‌లో ఆచూకీకి కనిపించకుండా పోయిన భారతీయుల గురించి సమాచారం అందిన వెంటనే పార్లమెంటుకు వివరాలు చెబుతానని గతంలో తాను హామీ ఇచ్చానని గుర్తుచేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయడంపై ఆమె ఆసంతృప్తి వ్యక్తంచేశారు.ఇరాక్‌లో 39 మంది భారతీయులు హతం

Updated By ManamTue, 03/20/2018 - 12:36
 • మోసూల్‌లో కిడ్నాపైన భారతీయులను కిరాతకంగా చంపేసిన ఐఎస్ ఉగ్రవాదులు

 • డీఎన్ఏ‌లు సరిపోలాయి.. రాజ్యసభలో సుష్మా స్వరాజ్ ప్రకటన

is killed 39 indians

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు కిడ్నా్ప్ చేసిన 39 మంది భారతీయులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ రాజ్యసభలో ప్రకటించారు. నాలుగేళ్ల క్రితం మోసూల్‌లో కిడ్నాప్ అయిన ఆ భారతీయులందరినీ ఐఎస్ ఉగ్రవాదులు అతికిరాతకంగా చంపేశారని ఆమె వెల్లడించారు. ఇక్కడి నుంచి పంపించిన డీఎన్ఏ నమూనాలు.. ఇరాక్ మోసూల్ నగరంలోని సామూహిక సమాధిలోగల మృతదేహాలతో సరిపోలాయన్నారు. అందులో 38 మంది డీఎన్ఏలో పూర్తిగా సరిపోలగా.. ఒకరి డీఎన్ఏ మాత్రం 70 శాతం సరిపోలిందని ఆమె చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఆ సామూహిక సమాధులను చూశామని, భారతీయుల మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుsushma swaraj making a statement on indians killed by isన్నామని ఆమె వివరించారు.

‘‘చనిపోయినవాళ్లు భారతీయులేనని తేల్చేందుకు ఎంతో కష్టపడ్డాం. అంతటి క్రూరమైన ఉగ్రవాద సంస్థ.. జనాలను సామూహికంగా చంపేసింది. కుప్పలుతెప్పలుగా శవాలను పడేసింది. ఆ శవాల గుట్టల్లో భారతీయుల మృతదేహాలను గుర్తించి బాగ్దాద్ తీసుకొచ్చి డీఎన్ఏ పరీక్షలు చేయించేందుకు ఎన్నో ప్రయాసలను ఎదుర్కొన్నాం’’ అని ఆమె సభలో నిరసన మధ్య ఆ విషయాన్ని ప్రకటించారు. ఇంతటి కఠిన పరిస్థితుల్లోనూ విధులను సమర్థంగా నిర్వహించిన విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్‌ను ఆమె ప్రశంసించారు. కాగా, గత ఏడాది చనిపోయిన భారతీయుల కుటుంబాలను కలిసిన సుష్మా.. వారిని క్షేమంగా భారత్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. చనిపోయిన వారు పంజాబ్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్ వాసులుగా గుర్తించారు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న వారిని 2014లో వారిని ఐఎస్ బందీలుగా పట్టుకుంది. పట్టణాన్ని వీడి వస్తున్న సందర్భంలో వారిని బందీలను చేసింది. 

విపక్షాలపై స్పీకర్ మండిపాటు...
మరోవైపు సభలో వారి మరణానికి సంబంధించి సుష్మా స్వరాజ్ ప్రకటన చేస్తున్న సమయంలో విపక్షాలు ఆందోళనను నిర్వహించాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఆ నిరసనల మధ్యే సుష్మా స్వరాజ్ వారి మరణంపై ప్రకటన చేసింది. అయినా కూడా విపక్షాలు తగ్గకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం అనేదే లేదా అని ప్రశ్నించారు. దేశ సమస్యలు పట్టవా అని మండిపడ్డారు. వెల్‌లోకి వెళ్లిన విపక్ష ఎంపీలను వెనక్కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయినా కూడా సభలో ఆందోళనలు తగ్గకపోవడంతో సభను వాయిదా వేశారు. మోసూల్‌లో మరణించిన భారతీయులకు సభలో ఓ నిముషం పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. విద్యార్థిని కలను నెరవేర్చిన సుష్మా స్వరాజ్

Updated By ManamSat, 01/06/2018 - 07:49

Sushma Swarajన్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఓ విద్యార్థిని కలను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తీర్చారు. రాజస్థాన్‌లోని జలాల్‌పుర్‌కు చెందిన భానుప్రియ హరిత్‌వాల్‌ పదవతరగతి, ఇంటర్మీడియట్‌లలో విశేష ప్రతిభ కనబరిచి.. ఉన్నత విద్య కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే కోటి రూపాయల ఉపకారవేతనానికి ఎంపికైంది. 

ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా స్టేట్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని ఆమె భావించింది. ఇందులో భాగంగా ఆ విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్గత పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అయితే అక్కడకు వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేయగా, దౌత్య కార్యాలయం 2 సార్లు తిరస్కరించింది. దీంతో ఆ కుటుంబం స్థానిక ఎంపీని ఆశ్రయించగా.. ఆయన ఈ విషయాన్ని మంత్రి సుష్మాస్వరాజ్‌ దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి జోక్యంతో అమెరికా దౌత్య కార్యాలయం వీసాను మంజూరు చేసినట్లు రాజస్థాన్‌ ప్రభుత్వం తెలిపింది.కుల్‌భూషణ్ జాదవ్ లేటెస్ట్ వీడియో

Updated By ManamThu, 01/04/2018 - 14:17

jadhavభారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన అభియోగాలు ఎదుర్కొందున్న పాక్...దీన్ని కప్పిపుచ్చుకునేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతోంది. తాజాగా పాకిస్థాన్‌పై జాదవ్ ప్రశంసల వర్షం కురిపిస్తూ...భారత దౌత్య అధికారులను విమర్శిస్తున్న పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ మోసపూరితమైన వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో తన కుటుంబాన్ని కలుసుకునేందుకు వీలు కల్పించడం పట్ల జాదవ్ పాక్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తల్లి, భార్యతో సమావేశమైన సమయంలో భారత దౌత్య అధికారి వారిపై కేకలు వేస్తూ దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. 

తాను పూర్తి ఆరోగ్యంగానే ఉన్నానని, తన ఆరోగ్య పరిస్థితి పట్ల తన తల్లి కూడా సంతృప్తి చెందినట్లు జాదవ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. పాక్ విదేశాంగ అధికారుల జాదవ్‌పై ఒత్తిడి తీసుకొచ్చి వీడియోలో ఈ తరహాలో మాట్లాడించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు మండిపడుతున్నారు. 
 పాక్‌తో క్రికెట్ సిరీస్ ఆడే ప్రసక్తే లేదు

Updated By ManamMon, 01/01/2018 - 17:00

sushma swarajదాయాది దేశాలు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య ఇప్పట్లో క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపించడం లేదు. సీమాంతర ఉగ్రవాదం, కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలను ఆపే వరకు పాకిస్థాన్‌తో భారత్ క్రికెట్ సిరీస్ ఆడబోదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. ఇరు జట్ల మధ్య తటస్థ వేదికపై కూడా మ్యాచ్‌లు నిర్వహించబోమని స్పష్టంచేశారు. ఢిల్లీలో జరిగిన విదేశాంగ వ్యవహారాలపై పార్లమెంట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో సుష్మా స్వరాజ్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో విదేశాంగ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్, విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ కూడా పాల్గొన్నారు. ఇటీవల భారత్‌లో పాక్ దౌత్యవేత్తను కలిసిన సుష్మా స్వరాజ్...ఇరు దేశాల జైళ్లలో పగ్గుతున్న 70 ఏళ్లకు పైబడిన వృద్ధులు, మహిళలు, మానసిక పరిస్థితి సరిగ్గా లేని ఖైదీలను విడిచిపెడుదామని సుష్మా స్వరాజ్ ప్రతిపాదించారు. సుష్మాకు సోషల్ మీడియా సెగ

Updated By ManamFri, 12/29/2017 - 13:07

Sushma swarajసోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ...తన దృష్టికి వచ్చే సమస్యలపై వెంటనే స్పందించే కేంద్ర మంత్రుల్లో సుష్మా స్వరాజ్ ముందు వరుసలో ఉంటారు. కేవలం ట్విట్టర్‌లో అందిన వినతులపై స్పందించి విదేశాల్లో మగ్గుతున్న భారతీయులకు ఆయన సాయం చేశారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె తీరుపైనే విమర్శలు వస్తున్నాయి. ఇరాక్‌లో కనిపించకుండా పోయిన 39 మంది భారతీయుల గురించి ప్రశ్నించినందుకు పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్‌ సింగ్ బజ్వాను ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్ బ్లాక్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.ట్విట్టర్‌లో తనను బ్లాక్ చేయడంపై బజ్వా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాక్‌లో కనిపించకుండా పోయిన 39 మంది జాలర్ల గురించి ప్రశ్నిస్తే విదేశాంగ మంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా అని మండిపడ్డారు. 

అటు తనను ఏ మాత్రం ఇబ్బంది పెట్టేలా ట్విట్టర్‌లో ఎవరు ప్రశ్నించినా వారి ఖాతాను సుష్మా బ్లాక్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్‌కు 10.9 మిల్లియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ బజ్వా లేవనెత్తిన ప్రశ్న సహేతుకమైనదని, దానికి సమాధానం చెప్పకుండా బ్లాక్ చేయడం మంత్రికి తగదని నెటిజన్లు అంటున్నారు. ప్రజా ప్రతినిధిగా ఉండి సోషల్ మీడియాలో ప్రజలను బ్లాక్ చేయడం సరికాదని సూచిస్తున్నారు.సరిహద్దు శాంతే ముఖ్యం

Updated By ManamWed, 12/13/2017 - 19:13
 • డోక్లాం స్టాండాఫ్ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రికి సుష్మా స్వరాజ్ ఉద్ఘాటన

Sushma Swaraj meets her counterpart Chinese Foreign minister Wang Yiన్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య బంధం బలోపేతం కావాలంటే అన్నింటికన్నా ముందు సరిహద్దుల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో ఆమె సమావేశమైన సందర్భంగా వారి మధ్య జరిగిన చర్చకు తాలూకు వివరాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటనను జారీ చేసింది. డోక్లాం సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ వాంగ్ ఈ చెప్పడం.. ఇరు వర్గాలవైపు రాజకీయ పరిపక్వతకు తార్కాణమని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలను అంగీకరించిన సుష్మా స్వరాజ్.. ముందు సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పాలని సూచించినట్టు తెలిపింది. డోక్లాం సమస్య పరిష్కారానికి ఇరు వర్గాలు సుముఖుత చూపిస్తున్నా.. ఆ సమస్య నానాటికీ పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది. అయితే, దౌత్యపర చర్చలతోనే డోక్లాం స్టాండాఫ్ సమస్య పరిష్కారమవుతుందని ఇరు దేశాలు చెప్పినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. రెండు దేశాల సున్నితమైన సమస్యలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని వారు పేర్కొన్నట్టు వివరించింది. కాగా, డోక్లాం స్టాండాఫ్ తర్వాత చైనా అత్యున్నత నేత భారత్‌కు రావడం ఇదే తొలిసారి. రష్యా-ఇండియా-చైనా (ఆర్ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశానికిగానూ వాంగ్ ఈ భారత్‌కు వచ్చారు. సముద్ర వర్తకానికి ఊతం

Updated By ManamMon, 12/11/2017 - 22:32

sushma swarajన్యూఢిల్లీ: దక్షిణ చైనా సముద్ర వివాదంతో సంబంధం లేకుండా, సముద్ర వర్తకాన్ని పెంపొందించుకునే కృషిలో భాగంగా, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా సముద్రయాన స్వేచ్ఛ, విమానాల గగనతల వినియోగ హక్కుల విషయంలో పరస్పరం మద్దతు ఇచ్చి పుచ్చుకునేందుకు భారత, చైనా, రష్యాలు నేడు అంగీకరించాయి. ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రుల 15వ సమావేశంలో ఈ సంగతిని సోమవారం పునరుద్ఘాటించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రొవ్‌లు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో ఇక్కడ సమావేశవుయ్యారు. ‘‘రానురాను ప్రపంచీకరణ చెందుతున్న ప్రపంచంలో సముద్ర వర్తకానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, అంతర్జాతీయ న్యాయ సూత్రాల ఆధారంగా, ముఖ్యంగా సముద్ర న్యాయ చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి రూపొందించిన రీతిరివాజులకు అనుగుణంగా సముద్రయాన స్వేచ్ఛ, గగనతల విమానయాన హక్కులకు మేం మద్దతు ఇస్తున్నాం’’ అని సమావేశానంతరం విడుదైలెన సంయుక్త ప్రకటన వెల్లడించింది. దక్షిణ చైనా సముద్రంపై హేగ్ ట్రైబ్యునల్ తీర్పును చైనా ఉపేక్షించడంతో సముద్రయాన స్వేచ్ఛకు ముప్పు ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణ చైనా సముద్ర వివాదం పెచ్చుమీరినప్పటి నుంచి, అంతర్జాతీయ సముద్రయాన చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత్ గట్టిగా చెబుతూ వస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇప్పుడున్న అంతర్జాతీయ ఒప్పందాలను ‘‘త్వరితగతిన, సమర్థంగా’’ అమలుచేయాలని ఈ ప్రకటన పిలుపునిచ్చింది. 

‘‘ఉగ్రవాదంపై చర్చించినప్పుడు, తాలిబాన్, దయేష్ (ఐసీస్), అల్-కాయిదా, లష్కర్-ఏ-తోయబా వంటి ఉగ్రవాద తండాల ఘాతుక చర్యలు గణనీయంగా పెరిగాయని నేను నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను. అవి అంతర్జాతీయ శాంతి భద్రతలను నేరుగా నీరుగారుస్తున్నాయని చెప్పాను. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచేందుకు, స్వావలంబనతో కూడిన వృద్ధి, అభివృద్ధిలకు వీలు కల్పించేందుకు ప్రస్తుతం సాగుతున్న ప్రయుత్నాలకు అవి ప్రమాదకరంగా పరిణమించాయని చెప్పాను. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సమగ్ర విధానం అవసరమని భారతదేశం గట్టిగా సిఫార్సు చేస్తోందని చెప్పాను’’ అని సుష్మా స్వరాజ్ ఈ సమావేశానంతరం చెప్పారు. ఆ విధానంలో, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మత దురహంకారాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదుల రిక్రూట్‌మెంట్‌ను నివారించడం, ఉగ్రవాదుల కదలికలను విచ్ఛిన్నం చేయడం, ఉగ్రవాదులకు నిధులు సవుకూరుస్తున్న అన్ని వనరులను నిలిపివేయడం, ఉగ్రవాదుల వసతులను కూల్చివేయడం, ఇంటర్‌నెట్ ద్వారా ఉగ్రవాద ప్రచారాన్ని ఎదుర్కోవడం వంటివి ఉండాలని ఆమె సూచించారు. పాక్ నిర్ణయంపై సుష్మా హర్షం

Updated By ManamFri, 12/08/2017 - 21:48

sushma swarajఢిల్లీ: పాకిస్థాన్‌ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ను కలుసుకునేందుకు ఆయన తల్లి, భార్యకు పాకిస్థాన్ ప్రభుత్వం వీసాలు మంజూరు చేయడంపై భారత్ హర్షం వ్యక్తంచేసింది. వీసాలు మంజూరు చేయడం పట్ల భారత  విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ట్విట్టర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న జాదవ్‌ను కలిసేందుకు ఆయన భార్య, తల్లికి వీసాలు మంజూరు చేస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం సమాచారం ఇచ్చిందని వెల్లడించారు. జాదవ్‌ తల్లి అవంతికతో మాట్లాడి ఈ విషయాన్ని తెలియజేశానని తెలిపారు. మొదట పాక్‌ జాదవ్‌ తల్లికి మాత్రమే వీసా ఇస్తామని పాక్ చెప్పిందని...అయితే ఆయన భార్యకు కూడా వీసా ఇవ్వాల్సిందిగా పాక్‌ను కోరామని, అందుకు వారు అంగీకారం తెలిపారని వెల్లడించారు. 

పాకిస్థాన్‌కు వెళ్లనున్న జాదవ్ తల్లి, భార్య భద్రతపైనా ఆందోళనను పాక్ దేశ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వారితో పాటు భారత హైకమిషన్‌కు చెందిన ఓ అధికారి ఉండేందుకు అనుమతి ఇవ్వమని అడిగామని..అందుకు పాక్‌ అధికారులు అంగీకరించారని చెప్పారు. పాక్‌లో వారి రక్షణ, భద్రత, స్వేచ్ఛకు ఎటువంటి భంగం వాటిల్లనివ్వబోమని చెప్పారని సుష్మా పేర్కొన్నారు. డిసెంబరు 25న జాదవ్‌ తన తల్లి, భార్యను కలుసుకునేందుకు పాక్‌ అధికారులు ఏర్పాటు చేసినట్లు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధులు ఇప్పటికే వెల్లడించారు. 

Related News