vi anand

డ్యాన్సర్‌గా రవితేజ..?

Updated By ManamSat, 11/03/2018 - 10:13

Ravi Teja‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ‘డిస్కో రాజా’ అనే  పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘నన్ను దోచుకుందువటే’ ఫేమ్ నబా నటేశ్.. ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో రవితేజ డిస్కో డాన్సర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దానికి తగ్గట్లే ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’లో నటించగా.. ఈ నెల 16న ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ఇలియానా నటించింది.సునీల్ కావాలన్న రవితేజ

Updated By ManamWed, 10/31/2018 - 16:30

Ravi Teja, Sunilప్రస్తుతం ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో నటిస్తున్న రవితేజ.. ఆ తరువాత వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం సునీల్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ, సునీల్‌ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలో తన చిత్రంలో అతడిని తీసుకోమని రవితేజ, వీఐ ఆనంద్‌కు చెప్పాడట. దీంతో ఓ కీలక పాత్ర కోసం అతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నవంబర్ చివరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా తెలియనున్నాయి.ప్రధానిగా మోహన్‌లాల్.. లుక్ వైరల్

Updated By ManamSat, 10/06/2018 - 10:23

Mohanlalసూర్య హీరోగా కేవీ ఆనంద్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్లాల్ విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రంలో మోహన్లాల్‌కు సంబంధించిన ఓ లుక్ లీక్ అయ్యింది. ఆ లుక్‌లో చంద్రకాంత్ వర్మ అనే ప్రధాన మంత్రి పాత్రలో మోహన్‌లాల్ కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రంలో సూర్య సరసన సాయేషా సైగల్ నటిస్తుండగా.. ఆర్య మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదిన విడుదల కానుంది. వీఐ ఆనంద్, సూర్య కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన అయన్(వీడొక్కడే), మాట్రాన్(బ్రదర్స్)మంచి విజయాన్ని సాధించడంతో ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి.రవితేజ తదుపరి చిత్రం విశేషాలు

Updated By ManamSat, 09/08/2018 - 11:29

Ravitejaప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ ఆ తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులుగా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు పలు చిత్రాలలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించినప్పటికీ తండ్రి, కుమారులుగా చేయలేదు. కిక్2లో చేసినప్పటికీ.. అది సినిమా మొత్తం ఉండదు కాబట్టి మొదటిసారి రవితేజ తండ్రీ కుమారులుగా చేయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.‘డిస్కో రాజా’గా మాస్ మ‌హారాజా?

Updated By ManamWed, 04/25/2018 - 17:31

ravitejaమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘నేల టిక్కెట్టు’. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ప‌రంగా తుది దశలో ఉందీ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చేయడానికి ముందే.. ఇదే బ్యానర్‌పై మూడు సినిమాలు చేయడానికి రవితేజ అగ్రిమెంట్ ఇచ్చారని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరుస్తూ.. ఈ బ్యానర్‌పై రవితేజ మరో సినిమా చేయబోతున్నట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

వైవిధ్యభరితమైన క‌థ‌ల‌కు వాణిజ్య అంశాలను ముడిపెడుతూ సినిమాల‌ను తెరకెక్కించే డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. కామెడీ ప్ర‌ధానంగా రూపొంద‌నున్న‌ ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే పేరును పరిశీలిస్తున్నారు. కాగా.. మ‌రోవైపు అల్లు అర్జున్‌కు కూడా ఓ కథను చెప్పారట వి.ఐ.ఆనంద్. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పై కసరత్తులు జరుగుతున్నాయ‌ని తెలిసింది.‘ఒక్క క్షణం’ రివ్యూ

Updated By ManamThu, 12/28/2017 - 15:40

okka kshanamచిత్రం: ఒక్క క్షణం
తారాగణం: అల్లు శిరీష్, సురభి, అవసరాల శ్రీనివాస్, సీరత్ కపూర్, జయప్రకాశ్, రోహిణి, దాస‌రి అరుణ్ కుమార్, ప్ర‌వీణ్‌, స‌త్య, కాశీ విశ్వ‌నాథ్, ఏలూరు శ్రీ‌ను త‌దిత‌రులు
మాట‌లుః అబ్బూరి ర‌వి
ఛాయాగ్ర‌హ‌ణం: శ‌్యామ్ కె. నాయుడు
కూర్పు: చోటా కె ప్రసాద్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: చక్రి చిగురుపాటి
క‌థ‌, స్క్రీన్ ప్లే, దర్శక‌త్వం: వి.ఐ.ఆనంద్
విడుదల: డిసెంబర్ 28, 2017

ఈ లోకంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉన్నట్లే....జీవితాలను పోలిన జీవితం కూడా ఉంటుంది అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ‘ఒక్క క్షణం’. వైవిధ్యభరితమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో అల్లు శిరీష్, సురభి నాయకానాయికలుగా రూపొందిన ఈ చిత్రంపై మ‌నం అందిస్తున్న‌ సమీక్ష మీ కోసం
కథ
డిసెంబ‌ర్ 25, 2017..ఓ షాపింగ్ మాల్ బేస్‌మెంట్‌.. జ్యోత్స్న‌ (సురభి)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు జీవా (అల్లు శిరీష్‌). జో కూడా అత‌న్ని గ‌మనిస్తుంది. ఒక‌రిని ఒక‌రు చూపుల‌తోనే ఇష్ట‌ప‌డ‌తారు. జీవా అడ‌క్క‌పోయినా స‌రే..  ఫోన్ నెంబ‌ర్ ఇస్తుంది జో. ఇద్ద‌రి మ‌ధ్య వాట్స్ అప్ ఛాటింగ్‌తో ప‌రిచ‌యం పెరుగుతుంది. క్ర‌మంగా అది ప్రేమ‌గా మారుతుంది. అంతా బాగుంద‌నుకునే స‌మ‌యంలో..  జో, జీవాకి ఓ షాకింగ్ విష‌యం తెలుస్తుంది. అదేమిటంటే.. జో అపార్ట్‌మెంట్‌కి ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్‌లో ఉన్న‌ శ్రీనివాస్ (శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌), స్వాతి (సీర‌త్ క‌పూర్‌) జంట‌ ప్ర‌స్తుతం.. త‌మ భ‌విష్య‌త్ అని. ఈ క్ర‌మంలో.. స్వాతి హ‌త్య‌కు గుర‌వుతుంది. పోలీసుల ముందు.. ఆ హ‌త్య చేసింది నేనేన‌ని శ్రీ‌నివాస్ ఒప్పుకుంటాడు. దీంతో జో.. జీవాకి దూరంగా ఉండాల‌నుకుంటుంది. స్వాతి హ‌త్య తాలుకూ ర‌హ‌స్యాన్ని ఛేదించిన జీవా.. జోని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగిలిన క‌థ‌.

విశ్లేషణ
 ఒక ప్రేమ జంట ప్ర‌స్తుతాన్ని, మరొక ప్రేమ జంట భ‌విష్య‌త్‌తో ముడి పెట్ట‌డం అనే పాయింట్ విన‌డానికి కొత్త‌గా ఉన్నా.. దాన్ని తెర‌పైకి తీసుకురావ‌డంలో ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ త‌డ‌బడ్డాడు. త‌న గ‌త చిత్రం ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడాని స్క్రీన్ ప్లేతో నిల‌బెట్టిన ఆనంద్‌.. ఈ చిత్రం విష‌యంలో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేయ‌లేక‌పోయాడు. సినిమాలో ఉన్న ప్ర‌ధాన లోపం ఏమిటంటే.. ప్రియురాలిని కాపాడుకోవ‌డం కోసం విధితో అయినా పోరాడే క‌థానాయ‌కుడి ప్రేమ‌లో ఏ కోశానా ఫీల్ లేక‌పోవ‌డం. అదే.. సినిమాకి ప్ర‌ధాన బ‌ల‌హీన‌త అయ్యింది. అలాగే సినిమాలో ఎక్క‌డా  ఎంగేజ్ చేసే మూమెంట్స్ లేవు. మొద‌ట క‌నిపించే దృశ్యం ఒక‌టి అయితే.. దాని తాలుకూ నిజాన్ని చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌గా చూపించ‌డం అనేది విక్ర‌మ్‌ కె.కుమార్ ప‌ద‌మూడు బి త‌దిత‌ర చిత్రాల్లో చూసిందే. అయితే పార్లెల్ లైఫ్ గురించి జ‌య‌ప్ర‌కాష్ వివ‌రించే స‌న్నివేశం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఇందులో అమెరిక‌న్‌ ప్రెసిడెంట్స్ లింకన్, కెనడీల‌ పార్ల‌ల్ లైఫ్‌ని.. అలాగే ఒకే పేరు ఉన్న మేరీ అనే ఇద్ద‌రు స్త్రీల పార్ల‌ల్ లైఫ్‌ని కంపేర్ చేస్తూ చెప్ప‌డం ఆక‌ట్టుకుంటుంది. అలాగే సైన్స్‌, జాత‌కాల‌కి మించిన శ‌క్తి మ‌రొక‌టుంటుంది అంటూ రోహిణి చేత చెప్పించే రెండు స‌న్నివేశాలు బాగున్నాయి. 
న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. గ‌త చిత్రాలతో పోలిస్తే అల్లు శిరీష్ న‌ట‌న ఇందులో ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. సుర‌భి, సీర‌త్ క‌పూర్‌ల‌వి సినిమాలో కీల‌క పాత్ర‌లైనా.. వారి న‌ట‌న అంతంత మాత్ర‌మే. శ్రీ‌నివాస్ సీరియ‌స్ రోల్ జ‌స్ట్ ఓకే. క‌థానాయ‌కుడి త‌ల్లి పాత్ర‌లో రోహిణి మెప్పిస్తుంది. విల‌న్‌గా అవతార‌మెత్తిన దాస‌రి అరుణ్.. కొన్ని చోట్ల ఫ‌ర్లేద‌నిపిస్తాడు. మిగిలిన పాత్రధారులూ ప‌రిధి మేర ఓకే అనిపించుకుంటారు.
సాంకేతికంగా చూసుకుంటే.. శ్యామ్ కె.నాయుడు ఫొటోగ్ర‌ఫీ బాగుంది. మ‌ణిశ‌ర్మ సంగీతంలో గుర్తుండిపోయే పాట‌లేమీ లేవు. నేప‌థ్య సంగీతం త‌న స్థాయిలో లేదు. అబ్బూరి ర‌వి మాట‌ల్లో  “నీ పుట్టుకే గెలుపుతో స్టార్ట్ అయింది...పోరాడు...గెలుపు నీదే రా...” వంటి స్పూర్తి నింపే మాటలతో పాటు, “నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, నచ్చి చేసినా, నచ్చక చేసినా నా చావు నీ చేతుల్లోనే” అని సురభి, శిరీష్ తో చెప్పే డైలాగ్ బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌
పార్ల‌ల్ లైఫ్ కాన్సెప్ట్‌
ఛాయాగ్ర‌హ‌ణం
నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్‌
సంగీతం, నేప‌థ్య సంగీతం
స్క్రీన్ ప్లే
ద‌ర్శ‌క‌త్వం

చివ‌ర‌గా.. ఒక్క క్ష‌ణం.. రెండు స‌మాంత‌ర జీవితాలు
రేటింగ్‌.. 2.5/5ఆస‌క్తిక‌రంగా  ‘ఒక్క క్షణం’ టీజ‌ర్‌

Updated By ManamSun, 12/03/2017 - 11:49

okka kshanamఅల్లు శిరీష్ హీరోగా లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘ఒక్క క్షణం’. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. చక్రి చిగురుపాటి నిర్మాత.  ఇవాళ ఈ చిత్రం టీజ‌ర్‌ని విడుద‌ల చేసారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉందీ టీజ‌ర్‌.  టీజర్ ఓపెనింగ్‌లో.. ఇద్దరు మనుష్యుల జీవితాల గురించి చెప్పే విధానం చాలా ఆసక్తిగా ఉంది. ''ఈ అగ్గిపుల్లల్ని జస్ట్ రాండమ్ గా విసిరాను. ఒక్కో అగిపుల్ల ఒక్కో డైరెక్షన్‌లో పడిందీ అని అనుకుంటాను. ఈ రెండు పుల్లలు మాత్రం పార్లల్‌గా పడ్డాయి. జస్ట్ గుప్పెడు పుల్లల్లో రెండు పార్లల్‌గా పడినప్పుడు.. ఇన్ని కోట్ల  జనాల్లో ఎంత మంది జీవితాలు పార్లల్‌గా ఉండొచ్చని ఆలోచించండి. వాళ్ళ ప్రెజెంట్.. మీ ఫ్యూచర్'' అని జయప్రకాశ్, హీరోహీరోయిన్స్‌తో చెప్పే విధానం బాగుంది.

''నేను ప్రేమించిన అమ్మాయికి ప్రాణం మీదకి వస్తే ఫేటుతో అయినా.. డెస్టినీతో అయినా.. చివరికి చావుతోనైనా పోరాడతాను'' అని అల్లు శిరీష్ (హీరో) చెప్పినప్పుడు.. హీరో క్యారెక్టర్ తను ప్రేమించిన అమ్మాయి (హీరోయిన్) కోసం ఏదైనా చేయడానికి ఎంత దూరమైనా వెళతాడు, ఏమైనా చేస్తాడు అని అర్ధమౌతుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలో ప్రేమను ఆత్మతో ముడిపెట్టిన డైరెక్టర్ వి.ఐ.ఆనంద్.. ఈ సినిమాలో ప్రేమని మూఢ నమ్మకాలతో ముడిపెట్టినట్టు తెలుస్తుంది. ఈ టీజ‌ర్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. జ‌స్ట్ ఎక్స్‌ట్రార్డ‌న‌రీ అని చెప్పొచ్చు. సురభి  క‌థానాయిక‌గా నటించిన ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, సీర‌త్ క‌పూర్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.. ఈ సినిమా డిసెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  అల్లు హీరో షూటింగ్ కి ప‌వ‌ర్‌స్టార్‌

Updated By ManamMon, 11/13/2017 - 14:54

allu, puneethఅల్లు శిరీష్ క‌థానాయ‌కుడిగా వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 'ఒక్క క్ష‌ణం' అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సుర‌భి హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీర‌త్ క‌పూర్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం బెంగుళూరులో జ‌రుగుతోంది. ఈ షూటింగ్ చూడ‌డానికి క‌న్న‌డ ప‌వ‌ర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ విచ్చేసారు. దీంతో చిత్ర బృందం ఆయ‌న‌కి సాద‌ర స్వాగ‌తం ప‌లికింది. ఇంత‌కుముందు పునీత్ అన్న‌య్య శివ‌రాజ్‌కుమార్ న‌టిస్తున్న 'త‌గ‌రు' టీజ‌ర్ లాంచ్‌కి శిరీష్ హాజ‌రయ్యాడు. ఈ సంద‌ర్భంలోనే 'ఒక్క క్ష‌ణం' టైటిల్‌ని శిరీష్ అనౌన్స్ చేశాడు.నిఖిల్ ద‌ర్శ‌కుడితో బ‌న్నీ?

Updated By ManamWed, 11/01/2017 - 11:32

bunny'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్‌. నిఖిల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమా స్క్రీన్ ప్లే ప‌రంగా ఎంతో మందిని అల‌రించింది. దీని కంటే ముందు సందీప్ కిష‌న్‌తో రూపొందించిన 'టైగ‌ర్‌'లోనూ త‌న టాలెంట్‌ని చూపించారు ఆనంద్‌. ప్ర‌స్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అల్లు శిరీష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. మ‌రో వైపు అల్లు అర్జున్‌కి కూడా ఓ క‌థ చెప్పార‌ని.. అది న‌చ్చ‌డంతో బ‌న్నీ కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.

Related News