chandra babu naidu

వైజాగ్‌లో ఇంటెలిజెంట్ హబ్

Updated By ManamThu, 11/15/2018 - 23:31
 • డిజిటల్ లెర్నింగ్ డిజైన్ సంస్థలకు వేదిక

 • 5 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం 

 • ఆన్‌లైన్ సేవలతో అవినీతి లేని రాష్ట్రంగా ఏపీ  

 • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 

babuవిశాఖపట్నం: యునెస్కో సహకారంతో విశాఖలో 50 ఎకరాల్లో ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్ (ఐ-హబ్) ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు తెలిపారు. వచ్చే కేబినెట్‌లో 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమోదం తెలుపుతున్నామని తెలిపారు. యునెస్కో-ఎంజీఐఈపీ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా విశాఖ నగరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న టెక్ (ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సు ఫర్ హ్యుమానిటీ)- 2018 సదస్సును గురువారం జ్యోతీ ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లెర్నింగ్ అనేది ఫనిష్మెంట్ కాకూడదని, ఫన్ గా ఉండాలన్నారు. అందుకు అవసరమైన డిజిటల్ లెర్నింగ్ గేమ్స్, పెడగాగీస్ విస్తృతస్థాయిలో అమల్లోకి తెస్తే భవిష్యత్‌కు ఎంతో మంది మేధావులను అందించవచ్చన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నున్న ఇటువంటి డిజైన్ సంస్థలను ఒకే చోటుకి తీసుకువచ్చేందుకు విశాఖలో ఏర్పాటు చేస్తున్న ఇంటెలిజంట్ గ్లోబల్ హబ్ ప్రధాన వేదిక కానున్నదనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. సుమారు 700 మిలియన్ డాలర్ల పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్న ఈ గ్లోబల్ హబ్ ద్వారా 5 వేల ఉద్యోగ అవకాశాలు కలుగున్నాయని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ప్రకటించిన ‘వైజాగ్ డిక్లరేషన్ ఆన్ డిజిటల్ కంటెంట్‌ను యునెస్కో అడాఫ్ట్ చేసుకునేలా యునెస్కో వరల్డ్ కాన్ఫరెన్స్‌లో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఐఓటీ ఆధారిత సేవలు అమల్లోకి తెచ్చేందుకు ప్రస్తుతం నాలుగో పారిశ్రామిక విప్లవం కొనసాగుతుందన్నారు. ఇటువంటి సేవలను అమల్లోకి తేవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. దేశంలో తొలిసారిగా వర్చ్యుయ ల్ క్లాస్ రూమ్‌లను ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు, ప్రభుత్వ శాఖల్లో పారదర్శకతతో కూడిన ఆన్‌లైన్ సేవలు అమల్లోకి తేవడం వల్ల అవినీతిని చాలా వరకు నియంత్రించగలిగామన్నారు. ప్రస్తుతం 10.5 శాతంగా నున్న గ్రోత్ రేట్ ను 15 శాతానికి తీసుకెళ్లేందుకు వచ్చే ఏడాదిలోగా ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు లక్షల మంది రైతులు ఆరు లక్షల ఎకరాల్లో సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నారని, మరింత విస్తీర్ణంలో ఇటువంటి సాగు కొనసాగేలా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాష్ జవదేకర్ వీడియో సందేశంలో మాట్లాడుతూ తొమ్మిదోతరగతి నుంచి దేశంలో 15 లక్షల క్లాస్‌రూవ్‌ులలో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

దానికి ప్రత్యేకంగా కేంద్రం బడ్జెట్ కేటాయిస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా పాలసీని కూడా సిద్ధం చేశామని, త్వరలో ఈ పాలసీని కూడా అమల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడు తూ రాష్ట్రాన్ని విద్య, విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. కేంద్ర మాన వనరుల అభివద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్.శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఐటీ సేవలు అమల్లో రాష్ట్ర ఎంతో పురోగతిలో ఉందన్నారు. వైజాగ్ డిక్లరేషన్ ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ లెర్నింగ్‌కు, పెడగోగీస్‌కు మార్గదర్శకంగా అవుతుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తంచేశారు. యునెస్కో-ఎంజీఐఈపీ తరపున కిర్జిస్తాన్ మాజీ అధ్యక్షురాలు రోజా ఒతుబుయేవి ప్రారంభోత్స ఉపన్యాసం చేయగా, యునెస్కో డైరెక్టర్ జనరల్ సందేశాన్ని యునెస్కో-ఎంజీఐఈపీ డైరెక్టర్ ఆచార్య డా.అనంత దురైయప్ప చదివి వినిపించారు.స్మార్ట్ కావాలి

Updated By ManamWed, 11/14/2018 - 22:47
 • అన్ని గ్రామాలు, వార్డులు తయరు కావాలి 

 • అప్పుడే రాష్ట్రం స్మార్ట్ ఏపీ అవుతుంది

 • బిల్‌గేట్స్, బఫెట్ వంటి వారు స్ఫూర్తి

 • సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది

 • ‘స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్’లో చంద్రబాబు

chandra-babuఅమరావతి: అన్ని గ్రామాలు, వార్డులు స్మార్ట్ కావాలని, అప్పుడే రాష్ట్రం స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు స్మార్ట్ అయితేనే స్మార్ట్ ఇండియా సాధ్యమని అన్నారు. బుధవారం జరిగిన స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతపై చంద్రబాబు ప్రసంగించారు. బిల్ గేట్స్, వార్న్ బఫెట్ వంటి వారు ఎందరో మనకు స్ఫూర్తి కావాలని అన్నారు. డబ్బులు సంపాదించడంలో కాదు, ఆ సొమ్మును సమాజ సేవకు వినియోగిస్తే మరింత ఆనందం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమాజం మనకెంతో ఇచ్చిందని, సమాజానికి మనం ఏం ఇచ్చామా అని ఆలోచించాలని సూచించారు. సమాజం రుణం తీర్చుకునే అవకాశం సీఎస్‌ఆర్ రూపంలో మన ముందు ఉందని చెప్పారు. ఏ సమాజం మన విజయానికి కారణమో, ఆ సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. మనం ఒక స్ఫూర్తిదాయక సమయంలో ఉన్నామని, మన కృషితో అద్భుతాలు చేయవచ్చని చెప్పారు. ‘స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డ్’ ఒక వినూత్న కార్యక్రమమని పేర్కొనారు. ఇప్పటిదాకా రాష్ట్రానికి 2455 పార్ట్‌నర్‌షిప్‌లు వచ్చాయని, సీఎస్‌ఆర్ కింద రూ. 730 కోట్లు వ్యయం చేశామని వెల్లడించారు. తొలి 3 ఏళ్లలో రాష్ట్రంలో 2,386 కోట్లు వ్యయం చేశామని,  దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ ఉందని అన్నారు. స్మార్ట్ విలేజి-స్మార్ట్ వార్డులో కార్పొరేట్లదే కీలక భూమిక అని అన్నారు. ప్రజాసేవ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని, రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామిక వేత్త లు భాగస్వాములు కావాలని కోరారు. 

అధునాతనంగా ఐఏఎస్ క్వార్టర్లు
అంతర్జాతీయ స్థాయిలో అధునాతన టెక్నాలజీతో ఐఏఎస్ క్వార్టర్ల నిర్మాణం జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అధికారుల అభిరుచులకు తగ్గట్టుగా క్వార్టర్స్‌లోని కిచెన్‌ను, అందుకు తగ్గ వస్తువులను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం రాజధానిలో నూతన నిర్మాణాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. రాయపూడిలోని 12 అంతస్తుల మోడల్, ఐఏఎస్ క్వార్టర్లను చంద్రబాబు పరిశీలించారు. మూడో అంతస్తులో పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన గృహాన్ని పరిశీలించారు. దానిలో చిన్న చిన్న మార్పులకు ఆయన అధికారులకు సూచించారు.

నేడు విశాఖకు  చంద్రబాబు 
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 9.40 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖకు చేరుకుంటారు. అనంతరం ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్‌కు చేరుకొని టెక్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు పాల్గొంటారు. మధ్యాహ్నం చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చేరుకుంటారు. బూజగ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వేగవంతం చేయండి

Updated By ManamMon, 11/12/2018 - 22:30
 • రబీ సీజన్‌లో పంట రుణాల పంపిణీ

 • బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి

 • పెట్టబడులకు ఇబ్బంది ఉండకూడదు

 • ఖరీఫ్ కంటే సాగు విస్తీర్ణం పెరగాలి

 • అధికారులకు చంద్రబాబు ఆదేశం

 • నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్

babuఅమరావతి: రబీ సీజన్‌లో పంట రుణాల పంపిణీ వేగవంతం చేయాలని, బీమా పరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం ద్వారా  రైతులకు పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌లో తగ్గిన పంటల సాగు విస్తీర్ణం రబీ సీజన్‌లో భర్తీ అయ్యేలా చూడాలని, 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అదనంగా సాగు పెరగాలని అధికారులకు సూచించారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లలో వర్షపాతం లోటు తీవ్రంగా ఉన్నా జల సంరక్షణ చర్యలతో నీటి కొరత సమస్యను అధిగమించామని, రైతులకు ఇబ్బంది లేకుండా చూశామని అన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల రాబడి తగ్గకుండా చూశామని తెలిపారు. ‘‘ఈ ఏడాది 34% లోటు వర్షపాతం ఉంది. జూన్ నుంచి ఇప్పటి దాకా 777 మి.మీ.కు గాను 512 మి.మీ మాత్రమే పడింది. అయినా వ్యవసాయం అనుబంధ రంగాల రాబడిని పెంచుకోవాలి. పాలు, గుడ్లు, మాంసం దిగుబడులు నిరుడు నవంబరు కన్నా ఈ ఏడాది ఇప్పటి వరకు 16% వృద్ధి ఉంది. దీనిని మరింతగా పెంచుకోవాలి’’ అని చంద్రబాబు సూచించారు. 

ఏపీ వ్యవసాయంపై ప్రపంచం ఆసక్తి
‘‘మన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జెడ్.బి.ఎన్.ఎఫ్) ఇతర దేశాలకు ఒక నమూనాగా మారింది. మన జెడ్.బి.ఎన్.ఎఫ్ అధ్యయనానికి ఇండోనేషియా భూ ప్రణాళిక శాఖ మంత్రి వస్తున్నారు. ఏపీ వ్యవసాయంపై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపడం మన రైతుల ఘనత. ఏ గ్రామంలో కూడా పశుగ్రాసం కొరత లేకుండా చూడాలి. 203 గోకులాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 300 గోకులాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 51 వేల ఎకరాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా 49 వేల ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సివుంది. మెగా పశుగ్రాస క్షేత్రాలను 5,247 ఎకరాల్లో అభివృద్ధి చేశారు. లక్ష్యంలో మిగిలిన 4,400 ఎకరాల్లో కూడా అభివృద్ధి చేయాలి’’ అని చంద్రబాబు ఆదేశించారు.

క్రిస్మస్‌లోపు కాలనీల్లో సిమెంట్ రోడ్లు
‘‘క్రిస్మస్ పండగ లోపు ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలి. 45 రోజుల్లో అన్ని గ్రామాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి కావాలి. ఈ ఏడాది నరేగా నిధులు పూర్తిగా సద్వినియోగం చేయాలి. వచ్చే ఏడాది నరేగా నిధులకు ప్రణాళిక సిద్ధం చేయాలి. అన్ని గ్రామాల్లో ఇంకుడు కుంటల తవ్వకం ముమ్మరం చేయాలి. పంటకుంటల తవ్వకం రాయలసీమ జిల్లాలకు ఎంతో ఊరట కలిగించింది. అదే స్ఫూర్తితో ఇంకుడు కుంటల తవ్వకం వేగవంతం చేయాలి. అంగన్ వాడి భవనాలు, ప్రహరీ గోడల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలి. జనవరి 1కల్లా అన్ని పంచాయితీలు స్వచ్ఛ గ్రామాలుగా రూపొందాలి. ఓడీఎఫ్ తరహాలోనే ఓడీఎఫ్ ప్లస్ విజయవంతం చేయాలి. శివారు ప్రాంతాలలో కంప చెట్లను తొలగించాలి. ప్రతిగ్రామంలో పచ్చదనం పెంచాలి. గ్రామాలన్నీ స్వచ్ఛంగా మారితే అంటువ్యాధుల బెడద ఉండదు’’ అని ముఖ్యమంత్రి సూచించారు. టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రాజశేఖర్, పూనం మాలకొండయ్య, గ్రామీణాభివృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులు రంజిత్ బాషా, అహ్మద్ బాబు, రాజశేఖర్, ఐ అండ్ పీఆర్ కార్యదర్శి రామాంజనేయులు, ఇతర అధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. 

పెరిగిన ఉద్యానరంగ రాబడి
‘‘గత నాలుగేళ్లలో ఉద్యాన రంగం రాబడి రెండున్నర రెట్లు పెరిగింది. రూ.20 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లకు పెరగడం విశేషం. రాష్ట్రంలో సూక్ష్మ సేద్యం విస్తీర్ణం ప్రస్తుతం ఉన్న 41 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు విస్తరించాలి. వ్యవసాయం అనుబంధ రంగాల రాబడి ప్రతి 5 ఏళ్లకు రెట్టింపు కావాలి’’ అని చంద్రబాబు ఆకాంక్షించారు.

తెగుళ్లు విస్తరించకుండా చర్యలు
‘‘జొన్న, మొక్కజొన్నపై కత్తెర పురుగు నివా రించాలి. పత్తిపై గులాబీ రంగు తెగులును పూర్తిగా నియంత్రించాలి. ఖరీఫ్‌లో 6 వేల హెక్టార్లలో కత్తెర పురుగు, 2,700 హెక్టార్లలో పింక్ బాల్ వార్మ్ ప్రభా వం కనిపించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇటువంటి తెగుళ్లు ఏపీకి విస్తరించకుండా శ్రద్ధ పెట్టాలి. తెగుళ్ల నివారణపై ముందస్తు చర్యల వల్ల సత్ఫలితాలు వచ్చాయి. తెగుళ్లపై రైతులను అప్రమత్తం చేయడంలో డ్వాక్రా మహిళలు, వ్యవసాయ విద్యార్థుల సేవలు వినియోగించుకోవాలి’’ అని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.టికెట్ నీకా.. నాకా?!

Updated By ManamSun, 11/11/2018 - 01:00
 • ప్రకాశం టీడీపీలో మంతనాలు

 • జోరందుకున్న ఆశావహుల ప్రయత్నాలు

 • అప్పుడే జిల్లాలో ఎన్నికల కోలాహలం

 • సిట్టింగ్‌లకే చాన్స్ అంటూ ప్రచారం

 • ఐదారు నియోజకవర్గాల్లో మార్పులు?

 • పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చలు

CHANDRA-BABU-NAIDUఒంగోలు: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా టీడీపీలో అప్పుడే టిక్కెట్ల సందడి మొదలైంది. ఆయా నియోజకవర్గాల నుంచి అధికార టీడీపీ టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలోని మొత్తం 12 నియోజకవర్గాల్లో 3 రిజర్వుడనియోజకవర్గాలు కాగా, మిగిలిన 9 జనరల్ సీట్లుగా ఉన్నాయి. ఇక ప్రస్తుతం చంద్రబాబు ఏపీలోని ఒకొక్క జిల్లా నుంచి టిక్కెట్ల కసరత్తులు ప్రారంభించేశారు. ఇప్పటికే నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొంత మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి వచ్చే ఎన్నికల్లో మరో సారి పోటీకి రెడీ అవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఇటీవల జిల్లా పర్యటనలో ప్రకటించిన విషయం విధితమే. జిల్లాలో ఉన్న మొత్తం 12 స్థానాల్లో 6 నుంచి 7 నియోజకవర్గాల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు అభించే ఛాన్సులు ఉన్నాయి.

దామచర్ల.. వన్ మ్యాన్ షో
జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో సారి పోటీ చేయనున్నారు. ఇక్కడ పోటీ చేసేందుకు ఆశావాహులు ఉన్నా చంద్రబాబు మదిలో   మాత్రం దామచర్ల జనార్దనే ఉన్నారు. జిల్లాలో టీడీపీని బలోపేతం చేయడంతో ఆయనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఎంతో నమ్మకం ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఒంగోలు సీటే కాకుండా జిల్లాలో మరి కొన్ని సీట్లు కూడా అభ్యర్థుల ఎంపికను జనార్దన్ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ ప్రకాశంలో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డిలకు తిరిగి దక్కనున్నాయి. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరంగా సింగిల్ ఆప్షన్‌గా ఉన్నారు. నియోజకవర్గంలో వీరి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కూడా వీరికి టిక్కెట్ విషయంలో తిరుగు లేకుండా చేస్తోంది.

ఆయన కంటిన్యూ అయితే...
పర్చూరులో ఏలూరు సాంబశివరావు సీటుకు ఎలాంటి డోకా లేదనిపిస్తోంది. టిక్కెట్ దక్కే లిస్టులో తొలి వరుసలోనే సాంబశివరావు ఉన్నట్లు సమాచారం. అద్దంకి సీటు విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ గత  ఎన్నికల్లో ఓడిన కరణం వెంకటేశ్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నా... చంద్రబాబు గొట్టిపాటి రవికుమార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సీటు విషయంలో చివరి వరకు తేల్చకపోయినా రవికి సీటు విషయంలో ఎలాంటి ఢోకా లేదు. చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ పార్టీలోనే కంటిన్యూ అయితే తిరిగి బీఫామ్ ఆయనకే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అటున్నారు. దర్శిలో మంత్రి శిద్దా రాఘవరావు తిరిగి అసెంబ్లీకే పోటీ చేస్తే దర్శి సీటు శిద్దా ఫ్యామిలీకే దక్కుతుంది. ఒక వేళ శిద్దా నరసారావుపేట లోక్‌సభకు వెళ్తే, దర్శి సీటును కరణం బలరామ్ తనయుడు కరణం వెంకటేశ్‌కు ఇచ్చి శిద్దా రాఘవరావు తనయుడిని మార్కాపురం నుంచి కూడా పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉందని రాజకీయవర్గాలు అంటున్నాయి.

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అయోమయం..
జిల్లాలో మూడు రిజర్వుడు నియోజకవర్గాలు అయిన ఎర్రగొండపా లెం, సంతనూతలపాడులో పార్టీ తీవ్ర గందరగోళంలో ఉంది. ఎర్రగొండ పాలెంలో పార్టీ గెలిచే పరిస్థితి లేదని, అక్కడ పార్టీ చాలా బలహీనంగా ఉందని అంటున్నారు. సంతనూతలపాడులో సిట్టింగ్ ఇంచార్జి బీఎన్ విజయ్‌కుమార్ పై  పార్టీ కేడర్ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు సీటు ఇస్తే తాము పార్టీకి పనిచేయబో మని నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, నాయ కులు తెగేసి చెప్పడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇక కొండపిలో సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా శ్రీబాలా వీరాంజనేయ స్వామిపై అధిష్టానానికి కొం త సానుకూల అభిప్రాయం ఉన్నా నియోజకవర్గంలో ఆయన్ను వ్యతిరేకిస్తో న్న వర్గం బలంగా మారింది. కొండపి సీటు విషయంలో చంద్రబాబు వీరితో పాటు ఆ నియోజకవర్గంలో పట్టున్న కీలక నాయకుల అభిప్రా యాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్వామికి సీటు దక్కడం కష్టమేనని అంటున్నారు. కొండపి జనార్ధన్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ప్రభావం ఎంతైనా ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి.

కనిగిరి పరిస్థితి ఏమిటి...? 
పశ్చిమ ప్రకాశంలో మరో నియోజకవర్గం అయిన కనిగిరిలో సిట్టింగ్ ఎమ్మల్యే కదిరి బాబురావుకు తిరిగి సీటు లభిస్తుందా..? లేదా అనేది ఇప్పు డు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలు నివేదికల్లో ఆయనకు మైనస్ మార్కులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కనిగిరి సీటు మార్చాలని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించిన విషయం విదితమే. కదిరి బాబురావుకు బదులు గా మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కనిగిరి అసెంబ్లీ సీటు ఇస్తారని.. దీనిపై బాబు దాదాపు నిర్ణయానికి వచ్చేసారని తెలుస్తోంది. ఇక పశ్చిమ ప్రకాశంలో వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మార్కాపురంలో టీడీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న కందుల నారాయణరెడ్డిని కొనసాగించడం సందేహంగానే ఉంది. అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా మరో కొత్త వ్యక్తి పోటీ చేస్తారంటున్నారు. ఏదేమైనా ప్రకాశం టీడీపీలో ఐదారు నియోజకవర్గాల్లో ఎవ్వరూ ఊహించని మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 40 వేల కోట్లతో 10 లక్షల ఇళ్లు

Updated By ManamFri, 11/09/2018 - 23:39
 • పట్టణాల్లోని పేదలకు నిర్మాణం.. ‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో..

 • ఈ నెల 15లోపు లబ్ధిదారుల ఎంపిక

 • 22కల్లా ఆన్‌లైన్ లాటరీ పద్ధతి పూర్తి

 • డిసెంబరు 15న లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలు

 • సీఎం చంద్రబాబునాయుడు వెల్లడి

cmఅమరావతి: పట్టణాల్లోని పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇందుకు అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.  రూ. రూ.40వేల కోట్లతో పట్టణ పేదలకు 10 లక్షల ఇళ్ల నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం పట్టణ గృహ నిర్మాణంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.‘‘దేశానికే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పట్టణ గృహ నిర్మాణ(అర్బన్ హౌజింగ్) కార్యక్రమం. లక్షలాది పేద కుటుంబాల కలల ప్రాజెక్టు. ఏపీలో రూ.39,427 కోట్లతో 9,58,230 ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం.ఇందులో కేంద్రం వాటా రూ.7,946 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.13,481కోట్లు. కేంద్ర, రాష్ట్రాల వాటా కింద ఇప్పటివరకు రూ.5,804కోట్లు విడుదల చేశాం.ఈ ప్రాజెక్టు సమాజానికి అతిపెద్ద సంపద అవుతుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘పట్టణ పేదలకు సొంతింటి కల నిజం చేయాలి. దేశంలోనే బెస్ట్ ఏజెన్సీలను గుర్తించాం. రెండు, మూడు స్థాయిలలో క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నాం. పీఎంఏవై ఎన్టీఆర్ నగర్‌లు (ఏహెచ్ పి) కింద మంజూరైన ఇళ్లు 5,29,786. అందులో గ్రౌండ్ అయినవి 3,29,217. వాటిలో 98,705 ఇళ్లకు శ్లాబులు పడ్డాయి. ఎన్టీఆర్ అర్బన్ హౌజింగ్(బీఎల్‌సీ) కింద మంజూరు అయ్యింది 4,28,444. అందులో గ్రౌండ్ అయ్యింది 1,01,426. వాటిలో ఇప్పటివరకు 56,800 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది’’ అని సీఎం పేర్కొన్నారు. నవంబరు 15లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, ఆన్ లైన్ లాటరీ నవంబరు 22కల్లా పూర్తిచేయాలని సూచించారు. మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులు నవంబరు 30కల్లా ముమ్మరం కావాలన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత జిల్లా ఎంపిక కమిటీ, ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. మీడియా సమక్షంలో లాటరీ పద్ధతిని పారదర్శకంగా నిర్వహించాలని, ఇందులో ఎలాంటి లోపాలు ఉత్పన్నం కారాదని అన్నారు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాజెక్టు ప్రారంభంలో ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో చూపడం లేదని సీఎం ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ, మునిసిపల్ అధికారులు సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఎందులోనూ రాజీపడే ప్రసక్తే లేదని, రోడ్లు,విద్యుత్, తాగునీరు, డ్రైనేజి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలని అన్నారు. వీధి దీపాల ఏర్పాటుతో పాటు పచ్చదనం పెంపొందించాలని సూచించారు.తాను ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు.

‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో..
పట్టణాల్లోని పేదలకు ‘గేటెడ్ కమ్యూనిటీ ప్లస్’ తరహాలో ఇళ్లు నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. ఇళ్లకు దగ్గరలోనే ఆర్ధిక కార్యకలాపాలు(ఎకనామిక్ యాక్టివిటీస్) పెంచుతున్నాం’’ అని సీఎం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, కాలువ శ్రీనివాసులు, పట్టణాభివ ద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్ ఎల్ బిసి కన్వీనర్, ఎమ్మెల్యేలు,మున్సిపల్ కమిషనర్లు,బ్యాంకర్లు పాల్గొన్నారు.

లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు..
డిసెంబరు 15న ‘‘లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు’’ వేడుకగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మన ఇళ్ల నిర్మాణం ఇతర రాష్ట్రాలకు ఒక నమూనా వంటిదని,  ఏడు రాష్ట్రాల ప్రతినిధి బృందాలు చూసి ప్రశంసించాయని చెప్పారు. ‘‘ ఇళ్లు చూడగానే ఆహ్లాదంగా ఉండాలి. యజమాని దగ్గరుండి ఇంటి పనులు చూసుకోవాలి. ఇంటితో అనుబంధం పెంచుకునేలా చేయాలి. ఈ రోడ్లు ఎప్పుడు వేశారు. ఆ పార్కు ఎప్పుడు అభివృద్ధి చేశారు. వీధి దీపాలు ఎప్పుడు పెట్టారు అనే భావన ప్రజల్లో రావాలి. మొత్తం ప్రాజెక్టు వివరాలను ఆన్‌లైన్ లో ఉంచాలి’’ అని సీఎం  పేర్కొన్నారు. 

కొన్ని రంగాల్లోనే అభివృద్ధి?
కొన్ని రంగాలు మినహా మిగతా రంగాల్లో ఆశించినంత వృద్ధి రేటు కనిపించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, ఉత్పాదక రంగంలో జీవీఏ పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’పై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షించారు. వృద్ధి రేటులో పారిశ్రామికాభివృద్ధి చాలా కీలకమని సీఎం పేర్కొన్నారు. కానీ గత మూడేళ్లుగా సేవారంగంలో జీవీఏలో అంతగా వృద్ధి కనిపించడం లేదని చెప్పారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయంతో  పోలిస్తే ఉద్యానరంగంలో నష్టాలు తక్కువని, స్థిరంగా వృద్ధిరేటు సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.  హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆక్వా ఈ మూడు రంగాలు సమంగా అభివృద్ధి చెందితే వృద్ధి రేటు బాగుంటుందని చంద్రబాబు చెప్పారు. సంబంధిత విభాగాలతో వర్కుషాపు నిర్వహించుకుని ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని  ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.  రైతులను వీలున్న చోట, వనరులన్న ప్రదేశాల్లో వ్యవసాయరంగం నుంచి ఆక్వా కల్చర్ కు మళ్లించాలని, అప్పుడే రైతులకు రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ఆహార శుద్ధి పరిశ్రమల అభివృద్ధి,  వ్యవసాయం, అనుంబంధ రంగాలైన ఉద్యానరంగం, ఆక్వా, పాడిపరిశ్రమల అభివృద్ధికి మరింత దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ఈ రంగాలపై దృష్టిపెడితే వృద్ధి రేటు 20 శాతం సాధించే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యాటకులు అత్యధిక సంఖ్యలో వచ్చేందుకు హోటళ్ల నిర్మాణం జరగాల్సి ఉందన్నారు.20 సీట్లు కోరండి

Updated By ManamFri, 11/09/2018 - 06:18
 • ఎల్బీనగర్ సీటుకై బాబు కాళ్లు పట్టుకున్న కార్యకర్తలు

 • గతంలో తాము గెలిచిన స్థానాలకై పట్టు

babuఅమరావతి: తెలంగాణలో పోటీ చేసే సీట్ల విషయంపై చర్చించేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ అయ్యారు. గురువారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో పాటు ఆపార్టీ నాయకులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ తదితర నేతలు బాబు కలిసి చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేతలు అభ్యర్థుల జాబితాను బాబుకు అందించారు. మహాకూటమిలో టీడీపీకి 14 సీట్లు కాకుండా 20 సీట్లు అడగాలని నేతలు బాబును కోరారు. గతంలో టీడీపీ గెలిచిన స్థానాలను టీడీపీకే కేటాయించేలా చూడాలన్నారు. కూటమికి ప్రజల ఆమోదం ఉండడంతో టీడీపీని టీఆర్‌ఎస్ టార్గెట్ చేస్తోందన్నారు. ఈ సందర్భంగా బాబు టీటీడీపీ నేతలకు పలు సూచనలు చేశారు. మహాకూటమి గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. గెలిచే స్థానాలనే కొర దామని, ఒకటి రెండు చోట్ల సర్దుకోక తప్పదని చెప్పారు. కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నేత హనుమంతరావు ఈ భేటీలో చంద్రబాబును కలిశారు. ఎల్బీనగర్ నుంచి సామా రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం నేత భీంరెడ్డి ఎల్బీనగర్ టికెట్ టీడీపీకే వచ్చేలా చూడాలని కార్యకర్తలు బాబు కాళ్లు పట్టుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ స్థానంపై చంద్రబాబు వద్ద ఎడతెగని చర్చ జరిగినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బదులు ఖైరతాబాద్ ఇస్తామనడంపై అభ్యం తరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్, ఎల్బీ నగర్, కొత్తగూడెం, కుత్బుల్లాపూర్ ఇబ్రహీంపట్నం స్థానా లపై పట్టుబట్టాలని నేతలు నిర్ణయిం చినట్లు సమాచారం. రావుల చంద్రశేఖర్ రెడ్డి పోటీపై కూడా సందిగ్ధిత కొనసాగుతోంది. రావుల పోటీకి సిద్దమై తే దేవరకద్రను కేటాయించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ సీరియర్లు అరవిం ద్ కుమర్, పాల్వాయి రజనీ కుమారీ, శోభారాణితో పాటు పలువురు అశావాహాలు బాబుతో టికెట్ కేటాయించాలిని కోరారు

కూటమిని చూస్తే కేసీఆర్‌కు భయం: రమణ
మహాకూటమిని చూస్తే తెరాసకు భయమేస్తోందని తెతెదేపా అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు.  చంద్ర బాబుతో సమా వేశనంతరం ఆయన మాట్లా డుతూ మహా కూటమిలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై చర్చిం చామన్నారు. ఒకట్రెండు రోజుల్లో టీడీపీ అభ్యర్థులను ఖరారు చేస్తామని, తమకు సీట్లు ముఖ్యం కాదని, గెలుపు ముఖ్య మని రమణ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని రమణ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, తెరాసను ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. కేంద్రంలో నియంతృత్వ సర్కారును గద్దె దించేందుకు చంద్రబాబునాయుడు నడుం బిగించారని... దీనిలో భాగంగానే ఆయన భాజపాయేతర పార్టీలను ఏకం చేస్తున్నారని తెలిపారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర చంద్రబాబుకు ఉందని.. ప్రస్తుతం మరోసారి ఆయన జాతీయ రాజకీయాలను శాసిస్తారని పేర్కొన్నారు. కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకే మహాకూటమి ఏర్పాటైందన్నారు. సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వచ్చిందని... ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన వస్తుందన్నారు.

సర్దుబాటు పూర్తయింది: రావుల
మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తి అయ్యిందని, అన్ని పార్టీలు కలిసి పనిచేస్తాయని టీ.టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. బాబుతో భేటీ అనంతరం రావుల మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అంటే భయం కనుకే తమ పార్టీపై కేసీఆర్, టీఆర్‌ఎస్ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు. మహా కూటమి ఏర్పాటుకు కేసీఆరే కారణమన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమాన్ని కేసీఆర్ పూర్తిగా విమర్శించారని ఆరోపించారు. టీడీపీ వలస ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చిన కేసీఆర్‌కు దళితులు, మహిళలు కనిపించలేదా అని ప్రశ్నించారు. 

టీడీపీ ప్రతిపాదిత అభ్యర్ధులు
సత్తుపల్లి     వెంకట వీరయ్య
అశార్వాపేట    మచ్చా నాగేశ్వరరావు
ఉప్పల్    వీరేందర్ గౌడ్
కోదాడ    మల్లయ్య యాదవ్
సికింద్రబాద్    కోనా వెంకటేశ్ గౌడ్/
    సమా సారంగా పాణి
ఖైరతాబాద్    దీపక్ రెడ్డి/బీఎన్ రెడ్డి
కూకట్ పల్లి    పెద్దిరెడ్డి/మందాడి 
    శ్రీనివాసరావు
శేరలింగంపలి    అనంద్ ప్రసాద్/ 
    మువ్వా సత్యనారాయణ
రాజేంద్రనగర్     గణేశ్ గుప్తా/ 
    సామా భూపాల్ రెడ్డి
ఖమ్మం    నామా నాగేశ్వర్ రావు
మక్తల్    కొత్తకోట దయాకర్ రెడ్డి
చార్మినార్     మస్కటీవేటు తప్పదా?

Updated By ManamWed, 11/07/2018 - 01:58
 • యర్రగొండపాలెంలో అభ్యర్థి మార్పు!

 • సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి

 • అభివృద్ధికి ఆమడ దూరం

 • నిధులు తేవడంలో వైఫల్యం 

 • పార్టీ మారినా ఫలితం సున్నా

 • డేవిడ్ రాజుపై తీవ్ర అసంతృప్తి

 • మార్చాలన్న ఎంపీ అభ్యర్థి మాగుంట

david-rajuఒంగోలు: ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమే కాదు.. నియోజకవర్గంపైనా దృష్టి పెట్టాలని, లేకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యేలకు క్రమంగా తెలిసివస్తోంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో కర్నూలు జిల్లా నంద్యాల, గుంటూరు జిల్లాలకు సరిహద్దులలో విస్తరించి ఉన్న నియోజకవర్గం.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం. ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోతూ వస్తోంది. 2009లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, ప్రస్తుత యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు ఇక్కడ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన డేవిడ్ రాజు.. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో సైకిల్ ఎక్కేశారు.

ఎమ్మెల్యే ఘోరంగా విఫలం
గత ఎన్నికల్లో డేవిడ్ రాజు తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి బుడాల అజితారావుపై 19వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. డేవిడ్ రాజు గతంలో సంతనూతలపాడు నుంచి కూడా ఒకసారి టీడీపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే యర్రగొండపాలెంలో తాజా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నియోజకవర్గంలో నాలుగున్నర ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు అభివృద్ధి విషయంలో ఘోరంగా విఫలం అయ్యారనే చెప్పాలి. వైసీపీలో ఉండగా ఆయన్ను అధికారులు పట్టించుకోలేదు. పార్టీ మారినా ఇదే జిల్లాలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలతో పోలిస్తే డేవిడ్ రాజు యర్రగొండపాలేనికి నిధులు రాబట్టడంలో విఫలమయ్యారనే చెప్పాలి.

సొంత పార్టీ నేతల నుంచే...
నియోజకవర్గంలో తాగునీటి సమస్య, అంతర్గత రహదారుల విషయంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా సామాన్య జనాలకు అవసరమైన పింఛన్ల లాంటివి కూడా సరిగ్గా మంజూరు చెయ్యలేదని నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో సగటు ఓటరును మెప్పించలేని డేవిడ్ రాజుపై టీడీపీ వీరాభిమానుల్లో సైతం తీవ్రమైన అసంతృప్తి ఉంది. సొంత పార్టీ వాళ్లే డేవిడ్‌రాజుకు ఇక్కడ టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని చెబుతున్నారు. చంద్రబాబు చేయించిన పలు సర్వేల్లో సైతం డేవిడ్ రాజుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో డేవిడ్ రాజుకు టికెట్ రాదన్న టాక్ బయటకు వచ్చేసింది.

మాగుంట సిఫార్సు సైతం...
తాను గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన సంతనూతలపాడు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీకి రెడీ అవుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సైతం యర్రగొండపాలెం లాంటి సెగ్మెంట్ల వల్లే తాను ఓడిపోయానని, ఇప్పటికీ అక్కడ పరిస్థితిలో మార్పు లేదని.. అక్కడ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని చంద్రబాబుకి ఇప్పటికే సూచించారు. ఈ లెక్కన డేవిడ్ రాజుకు యర్రగొండపాలెం టికెట్ రాదన్నది దాదాపు ఖరారైనట్లే. విపక్ష వైసీపీ ఇక్కడ సంస్థాగతంగా బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం సీటును వైసీపీ గెలుచుకుంటుందని టీడీపీ వాళ్లు సైతం ముక్తకంఠంతో అంగీకరించే పరిస్థితి ఉంది.

విజయానికి దగ్గరలో వైసీపీ..!
2009లో ఇక్కడ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఆదిమూలపు సురేష్ 2014లో సంతనూతలపాడు నుంచి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆయన యర్రగొండపాలెంలో వైసీపీ తరఫున పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా ఉన్నా యర్రగొండపాలెం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. సురేష్‌కు యర్రగొండపాలెం వైసీపీ టికెట్ దాదాపు ఖరారై నట్లే. టీడీపీ నుంచి కొత్త అభ్యర్థి రానుండటంతో ఎవరు పోటీ చేస్తారన్నది చూడాలి. కొత్తగా పోటీకి రెడీ అవుతున్న జనసేన ప్రభావం నియోజకవర్గంలో దాదాపు శూన్యం. ఎన్నికల వేళ ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.కర్ణాటకలో కమలానికి పంచ్

Updated By ManamWed, 11/07/2018 - 01:58
 • కేంద్ర వ్యవస్థను పతనం చేశారు

 • 10న నెల్లూరులో హోదా కోసం ధర్మపోరాట సభ

 • రాజధానిలో భారీ ఎత్తున చివరి పోరాట సభ 

 • జాతీయ పార్టీల నేతలు పాల్గొనే అవకాశం

 • 12న ఆదరణ-2 పనిముట్లు పంపిణీ

 • టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు

babuఅమరావతి: కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి శరాఘాతంగా మారాయని టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ప్రజల్లో బీజేపీపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బతిన్నదని ఒక అభ్యర్థి పోటీ చేయకుండానే తప్పుకున్నారని, పోటీ చేసిన అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారని చంద్రబాబు విమర్శించారు. మోదీ పాలనపై ఉన్న వ్యతిరేకతకు ఈ ఫలితాలే సాక్ష్యమని, ప్రజలకు బీజేపీ ఎంత దూరమైందో ఇదే స్పష్టమైన సంకేతమన్నారు. రాజకీయం రోజురోజుకూమారుతోందని, అహంభావంతో ఉంటే ప్రజలే కళ్లు తెరిపిస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేంద్రంలో బీజేపీ పోకడలతో జనం బేజారెత్తుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో రూపాయి విలువ  ఎప్పుడూ లేనంతగా దిగజారిందని, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచేశారని విమర్శించారు. కేంద్ర వ్యవస్థలను దారుణంగా పతనం చే శారని మండిపడ్డారు. సీబీఐని భ్రష్టు పట్టించి, ఈడీని దుర్వినియోగం చేశారని, ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీశారని పేర్కొన్నారు. దేశంలోని రైతుల్లో తీవ్ర అశాంతి నెలకొందని,మహిళలు, యువత నిరాశలో మునిగారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయ పార్టీల్లో బీజేపీ చిచ్చు...
దేశంలో రాజకీయ పార్టీల్లో బీజేపీ చిచ్చుపెడుతోందని చంద్రబాబు విమర్శించారు. ప్రతిపక్ష నేతల కుటుంబాల్లోనూ కేసులతో భయపెడుతున్నారని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను డబ్బుతో ప్రలోభపెట్టాలని చూస్తున్నారన్నారు. బీజేపీ చేస్తున్న చేష్టల వల్లే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  వచ్చిందని చంద్రబాబు విశ్లేషించారు. విజయానికి అడ్డదారులు లేవని, నిరంతర శ్రమతోనే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. నేతలు నిరంతరం ప్రజలతో ఉండాలని, ఎప్పటికప్పుడు కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 12న ఆదరణ-2 పేరిట 8లక్షల యూనిట్ల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. దానిలో బీసీలకు 4లక్షలు, ఇతరవర్గాలకు మరో 4లక్షల యూనిట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో 4500 కుటుంబాలకు లబ్ది చేకూరుతుందన్నారు. ఉబరైజేషన్ కింద 15వేల ట్రైసైకిళ్లు, ఆటోలు ఇస్తున్నామని, వీటిద్వారా కుటుంబానికి రూ.10వేల రాబడి వస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆదాయం నెలకు కనీసం రూ.10వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో ప్రతిఇంటికి నాణ్యమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. 

10న నెల్లూరులో ధర్మపోరాట సభ...
ఈ నెల 10వ తేదీన నెల్లూరులో ప్రత్యేకహోదాను కాంక్షిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 8వ ధర్మపోరాట సదస్సు నిర్వహించనున్నామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 7 ధర్మ పోరాట సదస్సులు జరిగాయన్నారు. 9వ సదస్సు విజయనగరంలో ఈ నెల 27న  జరుగుతుందని, తరువాత అనంతపురం, శ్రీకాకుళంలో ధర్మపోరాట సభలు ఉంటాయన్నారు. రాజధాని ప్రాంతంలో (గుంటూరు, కృష్ణా జిల్లాల) చివరి సభ భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు. రాజధానిలో జరిగే ధర్మపోరాట సభకు, పలు  జాతీయ పార్టీల నేతలు పాల్గొంటారని చంద్రబాబు వెల్లడించారు.వచ్చే నెల 17న గేట్లు

Updated By ManamTue, 11/06/2018 - 05:33
 • కీలక ఘట్టానికి సర్వం సిద్ధం

 • ఏప్రిల్ నాటికి ప్రధాన పనులు పూర్తి

 • వేగంగా నిర్మించి రికార్డు సృష్టిద్దాం

 • పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష

polavaramఅమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గేట్ల బిగింపు ప్రక్రియ డిసెంబరు 17న మొదలు పెట్టాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రపంచ రికార్డులు అన్నీ తిరగరాసేలా అత్యంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులు జరగాలని అన్నారు. సోమవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలవరం ప్రాజెక్టుతో సహా ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు గేట్ల కోసం ఇప్పటికే  60 మీటర్లు పొడవు, 20 మీటర్ల వెడల్పు కొలతలతో మొత్తం 48 గేట్లను సిద్ధం చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఏప్రిల్ నెలాఖరు కల్లా పోలవరం ప్రాజె క్టునకు సంబంధించి కాఫర్ డ్యామ్, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్ సహా ప్రధానమైన పనులన్నీ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. నెలకు 10 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఉత్పత్తి చేసే క్రషర్లు ఇక నుంచి వినియోగిస్తున్నామని నిర్మాణ సంస్థల ప్రతినిధులు సీఎంకు వివరించారు. 

80వ వర్చువల్ రివ్యూ
పోలవరం ప్రాజెక్టుపై 80వ సారి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ రివ్యూ నిర్వహించారు. కాంక్రీట్ పనులు అత్యంత వేగంగా చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు మొత్తం 60.33 శాతం పూరి ్తకాగా, తవ్వకం పనులు 80.10 శాతం, కాంక్రీట్ పనులు 45.60 శాతం పూర్తయినట్టు తెలిపారు. కుడి ప్రధాన కాలువ 90 శాతం, ఎడమ ప్రధాన కాలువ 65.03 శాతం, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.91 శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు. గత వారం స్పిల్ చానల్, స్పిల్ వే, పైలట్ చానల్, అప్రోచ్ చానల్, లెఫ్ట్ ఫ్లాంక్‌కు సంబంధించి 4.47 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు, స్పిల్ వే, స్పిల్ చానల్, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 52 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులు పూర్తయినట్టు అధికారులు సీఎంకు వివరించారు.

వారంలోనే 12 శాతం కాలనీల నిర్మాణం 
పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు నిర్మిస్తున్న కాలనీలలో మొదటి దశ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని అధికారుల కు ముఖ్య మంత్రి గడువు విధించారు. గడిచిన వారం లో 12 శాతం పనులు పూర్తిచేశా మని అధికారులు వివరించారు. తూర్పు గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న 17 కాలనీలకు సంబంధించి 46 శాతం పనులు, అలాగే పశ్చిమ గోదా వరి జిల్లాలో నిర్మిస్తున్న 29 కాలనీలకు సంబం దించి 42శాతం పనులు పూర్తయ్యాయని ఆయా అధికారులు నివేదిక అందించారు. 

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ..
పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే రహదారి కుంగి, బీటలు వారి న దృశ్యాలను సీఎం పరిశీలించారు. పోలవరం ప్రాంతంలో ఎటువంటి భూప్రకంపనలు కానీ, పేలుడు వంటివి కానీ జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. రహదారి కుంగిపో వడం వల్ల దెబ్బతిన్న విద్యుత్ లైన్లు సరిజేసి సరఫరా పునరుద్ధరించామని చెప్పారు. మట్టి నమూనాలు పరిశోధన శాలకు పంపి రహదారి ఎందుకు బీటలు వారిందో తెలుసు కోవాలని సీఎం సూచించారు. మరోవైపు గోదావరి-పెన్నా మొదటిదశకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఈ నెలాఖరుకల్లా అన్ని ప్రాధాన్య ప్రాజెక్టులకు టెండర్లు పిల వడం పూర్తి కావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వ రరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పోలవరం ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రేఖారాణి, ఈఎన్‌సీ వెంకటేశ్వరావు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

కరువు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ
రాష్ట్రంలో కరవు ప్రభావిత ప్రాంతాల్లోని రైతులకు వెం టనే ఇన్‌పుట్ సబ్సిడీ అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదరణ-2 లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని సూచించారు. యూనిట్ల మంజూరు శరవేగంగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. 2 నెలల్లో 8 లక్షల యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, ఒక్కపైసా అవినీతి జరిగినా సహించేదిలేద న్నారు. కాగా అంటువ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్వైన్ ఫ్లూ, డెంగీపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా అధికారులు శ్రద్ధవహించాలని సీఎం సూచించారు. 

ప్రతి చుక్క సద్వినియోగం 
‘‘రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ ర్షపాతంలో తీవ్ర లోటులో ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహాలు లేవు. రబీలో రైతులు నాట్లు త్వరితగతిన వే సేలా చూడాలి. రిజర్వాయర్లలో ఉన్న ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకుని దిగుబడులు తగ్గకుండా చూడాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రబీలో 100 శాతం కన్నా అధికంగా సాగుచేసిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. అలాగే కరువు, తుపాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. కాగా బాపట్ల వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విత్తనాల పాకెట్లు సరఫరాలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, పాకెట్లు తారుమారు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు పెంచుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. అలాగే గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రజాస్వామ్య రక్షణకే పొత్తు

Updated By ManamFri, 11/02/2018 - 23:42
 • ఇక బీజేపీపై ధర్మపోరాటం 

 • దేశంలోని పార్టీలన్నీ ఒకే తాటిపైకి..

 • నిరంకుశత్వాన్ని ఎదిరించాలి

 • ఎన్టీఆర్ నేర్పింది మనకు అదే..

 • పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

 • నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

babuఅమరావతి: దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ఉండవల్లిలోని తన నివాసం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘దేశం ఇప్పుడు ఆపదలో ఉంది. దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ నేతలు భ్రష్టుపట్టించారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తున్నారు. అందరిలో అభద్రతా భావం తెచ్చారు. ఢిల్లీ మొత్తం గుజరాత్ వాళ్లతో నింపేశారు. తెలుగువారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు. చివరికి పటేల్ విగ్రహంపై తెలుగులో పేరే లేకుండా చేశారు. ఇప్పుడు బీజేపీని ఎదర్కొక పోతే చరిత్రలో చేతగాని వాళ్లంగా మిగిలిపోతాం. ఇదొక ప్రజాస్వామ్య అనివార్యత. నా కోసం కాదు. మీకోసం కాదు. దేశం కోసం, రాష్ట్రం కోసం కాంగ్రెస్, ఇతర పార్టీలను ఏకం చేయాల్సి వచ్చింది’’ అని చంద్రబాబు కార్యకర్తలకు వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవటానికి మనందరం పూనుకోవాలని ఈ సందర్భంగా నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలను కోరారు. ఇంటింటికీ తిరిగి ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. ‘‘నిరంకుశత్వాన్ని ఎదిరించడం ఎన్టీఆర్ నేర్పిందే. పెత్తందారీతనాన్ని ప్రశ్నించడం ఎన్టీఆర్ చెప్పిందే. ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడం ఎన్టీఆర్ నిర్దేశించిందే. గోద్రా అల్లర్లలో నరేంద్ర మోదీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది తెలుగుదేశం పార్టీనే. ట్రిపుల్ తలాక్‌కు మద్దతు ఇవ్వమని ఖరాఖండిగా చెప్పింది టీడీపీనే. రాష్ట్ర, దేశ ప్రయోజనాల కోసమే 2014లో బీజేపీతో కలిసి నడిచాం. న మ్మిన వాళ్లను నరేంద్రమోదీ మోసం చేశారు. నాలుగేళ్లు మోదీ నటన చేశారు. దేశం మొత్తం అసహనం పెరిగిపోయింది. ప్రశ్నించే గొంతును నులివేుస్తున్నారు. వాళ్లతో కలిసివున్నప్పుడు మనపై ఐటీ దాడులు లేవు. బీజేపీ నుంచి దూరం జరిగాకే మనపై దాడులు చేస్తున్నారు. నేను చెప్పిందే దేశం మొత్తం వినాలి.. ప్రత్యర్ధులంతా నాశనం కావాలి.. అన్న నిరంకుశ వైఖరితో మోదీ ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరింది బీజేపీనే. 5 ఏళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని మేనిఫెస్టోలో చెప్పింది. అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏపీని చూస్తామని నమ్మించారు. చట్టంలో అంశాలు, హామీలు నెరవేర్చాలని అడిగాం. అదే బీజేపీ నేతల కంటికి నేరంగా మారింది’’అని చంద్రబాబు పేర్కొన్నారు. 

ప్రజల కోసమే బీజేపీపై ధర్మపోరాటం..
రాష్ట్రం కోసమే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస పెట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసమే బీజేపీపై ధర్మపోరాటం ప్రారంభించామని చెప్పుకొచ్చారు. ఆ అక్కసుతోనే బీజేపీ రాష్ట్రంపై కక్ష గట్టిందని, ఏపీలో పొత్తులో ఉండి కూడా.. తెలంగాణలో పొత్తు లేదని ఏకపక్షంగా చెప్పిందని విమర్శించారు. నల్లధనంపై యుద్ధం అని అవినీతి పరులతో అంటకాగిందని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు దేశంలో బాగుండాలన్నదే టీడీపీ లక్ష్యమని.. అందుకే తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామనుకుంటే కేసీఆర్ దానిని నిరాకరించారన్నారు. తెలంగాణలో పార్టీని నిలబెట్టుకోవటానికే మహా కూటమిలో చేరామని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ అని కేసీఆర్ హడావిడి చేసి తర్వాత వదిలేశారని విమర్శించారు. ఈ వారంలో రెండు సార్లు తాను ఢిల్లీ పర్యటనతో.. బీజేపీకి వ్యతిరేక  పార్టీలంతా, ఒకరిద్దరు తప్ప అందరూ ఒకే వేదికపైకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. మిగిలిన ఒకటి రెండు పార్టీలను కూడా ఒకే వేదికపైకి తెస్తామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Related News