TRS party

టీఆర్‌ఎస్‌కు విరాళాల వర్షం...

Updated By ManamTue, 11/13/2018 - 19:49
 • టీఆర్ఎస్‌కు అందిన విరాళాలు రూ. 19.41 కోట్లు

 • టీటీడీపీకి కేవలం రూ. 1.73 కోట్లు మాత్రమే

Telangana assembly elections:TRS gets Rs 19.4 crore donations

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర సమితికి విరాళాల వర్షం కురిసింది. కేవలం నాలుగు నెలల్లోనే  రికార్డు స్ధాయిలో 19.41 కోట్ల మేరకు విరాళాలు అందాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూలై 23 వరకు ఈ మేరకు పార్టీకి విరాళాలు వచ్చాయి. దాదాపు 51 మంది వ్యక్తులు, సంస్ధలు విరాళాలు అందచేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం. శ్రీనివాసరెడ్డి సీఈవోకు తెలిపారు.  

పార్టీకి విరాళాలు ఇచ్చిన వారిలో  ఖమ్మం పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్  రూ. 2 కోట్లు, టీడీపీ పార్టమెంటు సభ్యులు చామకూర మల్లారెడ్డి కోటి రూపాయలు, జి. సరోజా వివేకానందరెడ్డి  కోటి రూపాయలు, విరాళంగా ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్ రెండు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. కోటి రూపాయల విరాళం ఇచ్చిన సంస్ధల్లో  హోటల్ పార్క్  కాంటినెంటల్,  ఏరోస్పెస్ టెక్నాలజీస్  లాంటి సంస్ధలు ఉన్నాయి.    

ఇక తెలంగాణ తెలుగుదేశం పార్టీకి 2017 -18లో కేవలం రూ. 1.73 కోట్ల మేరకు మాత్రమే విరాళాలు అందాయి. ఈ ఏడాది జూలై 11వ తేదీన  పార్టీ ప్రధాన కార్యదర్శి  ఇ. పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి రూ. 20 వేలకు మించిన పార్టీ విరాళాల వివరాలను సీఈసీకి అందచేశారు.  మొత్తంగా 83 మంది వ్యక్తుల, కొన్ని సంస్ధల నుండి  రూ. 1, 73, 71, 922 అందినట్లు తెలియచేశారు.  మాగుంట శ్రీనివాసరెడ్డి  రూ. 25 లక్షల విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. గోనుగుంట్ల వెంకట శివ శీతారామ ఆంజనేయులు రూ. 11 లక్షలు, గల్లా జయదేవ్ , బోళ్ల బుల్లి రామయ్య , దేవినేని అవినాశ్  రూ. 10 లక్షలు చొప్పున విరాళాలు ఇచ్చారని పేర్కొన్నారు.'సీట్ల సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదు'

Updated By ManamFri, 11/09/2018 - 18:04

Kodanda Ram, Seats Adjustment, Telangana assembly elections, TRS partyహైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలు సమీస్తున్న వేళ.. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారంతో జనంలోకి వెళ్తుంటే.. మరోవైపు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాక భాగస్వామ్య పార్టీల నుంచి అసమ్మతి సెగ భగ్గుమంటోంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై 74 మంది అభ్యర్థులను ఢిల్లీలో గురువారం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీకి 14 స్థానాలు, 8 టీజేఎస్, సీపీఐకి 3 స్థానాలు కేటాయించింది. అయితే తమకు 3 సీట్లు మాత్రమే కేటాయించడంపై సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం టీజేఎస్ అధినేత కోదండరాం మాట్లాడుతూ.. మహాకూటమిలో సీట్లు సర్దుబాటు ఇంకా ఫైనల్ కాలేదన్నారు. కేటాయించే స్థానాలపై కాలయాపన చేయకుండా త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కాంగ్రెస్‌ను కోరారు. సీపీఐ చేసిన సూచనలపై తాము ఆలోచిస్తున్నట్టు తెలిపారు. సీపీఐ విషయంలో కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వాలని కోదండరాం డిమాండ్ చేశారు. కేసీఆర్‌తోనే మరాఠీలకు న్యాయం

Updated By ManamFri, 11/09/2018 - 01:46
 • టీఆర్‌ఎస్‌కే సంపూర్ణ మద్దతు..: ప్రకాష్ పాటిల్   

imageహైదరాబాద్: కేసీఆర్ పాలనలో మరాఠిలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ మరాఠి మండలి సంఘం అధ్యక్షులు ప్రకాష్ పాటిల్ పేర్కొన్నారు. తెలంగాణ మరాఠి మండలి సభ్యులు 10 వాహనాల్లో ఉమ్మడి జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా సభ్యులు ఎంపీ వినోద్ కుమార్ తో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మరాఠి మండలి సభ్యులు ఎంపీ వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా జీవిస్తూ వ్యాపారాలు చేసుకుం టూన్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరాఠి ప్రజలు టిఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్నసంక్షేమ కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఉమ్మడి జిల్లా కేంద్రంలోని 10 వాహనాల్లో 50 మందితో వారం రోజులుగా మరాఠి సంఘం నాయకులు ప్రజలను కలిసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ రూపు దిద్దుకుంటుందని, హైదరాబాద్ నగరంలో 2 ఎకరాల భూమి, రెండు కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. నగరంలో గత ప్రభుత్వాల హయాంలో కరెంటు కోతలతో వ్యాపారాల్లో నష్టపోయామని తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటుతో వ్యాపారాలు చేసుకుంటున్నమని అన్నారు. మాలీ, ప్రజాపతి, దేవసి, మరాఠి సంఘాలు కూడా రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఈ కార్యక్రమంలో ఎల్ కే షిండే, మదన్ జాధో, నివాసు, నిక్కిం, దిలీపు, జిత్తు, సురేష్ బోస్లే, ఆనంద్ పాటిల్, విశాల్ దేషాయీ, లతో పాటు పలువురు పాల్గొన్నారు.
 మళ్లీ కేసీఆరే రావాలె

Updated By ManamFri, 11/02/2018 - 07:36
 • శ్రీకాంతాచారి ఆశయాలకై ఆయన్నే సీఎం చేయాలె

 • నన్ను సోదరిలా ఆదరించిండు.. టీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా

 • తొలి అమరుడి తల్లి శంకరమ్మ

imageహైదరాబాద్: అధినేత కేసీఆర్ అధిష్ఠానుసారం టీఆర్‌ఎస్‌లో అందరూ తనను తమ సోదరిలా ఆదరించారని, తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చెప్పారు. ఆయన ఆదేశం ప్రకారం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని శంకరమ్మ వెల్లడించారు. శ్రీకాంతాచారి ఆశయాలు నెరవేరాలంటే ఉద్యమనేత కేసీఆర్ ముఖ్యమంత్రి సీఎం కావాలె, అందుకని టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. తాను కూడా అధిష్ఠానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని శంకరమ్మ ఈ సందర్భంగా వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు మా కుటుంబానికి, అన్ని వేళలా అండగా నిలిచారని, శ్రీకాంతాచారిపై వారు చూపే అభిమానం, ప్రేమ, మరువలేనివన్నారు.అదే స్థాయిలో తనంటే కూడా కేసీఆర్ ప్రత్యేక ఆప్యాయత, ప్రేమ, సానుభూతి చూపుతున్నారన్నారు. గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి కేసీఆర్ తనకు టికేట్ కేటాయించారని,  నేడో, రేపో ప్రకటించే పేర్లలో తనకు స్థానం దక్కుతుందనే నమ్మకముందని ఆమె పేర్కోన్నారు.
 తారక మంత్రం

Updated By ManamFri, 11/02/2018 - 06:57
 • మాటల తూటాలు... విమర్శనా బాణాలు

 • విలక్షణ రీతిలో విపక్షాలపై విసుర్లు

 • ప్రత్యేక శైలితో దూసుకుపోతున్న కేటీఆర్ 

 • తనయుడి ప్రచార తీరు పట్ల కేసీఆర్ సంతృప్తి

హైదరాబాద్:  ముందస్తు ఎన్నికల ప్రచా రంలో కేటీఆర్ తనదైన శైలిలో దూసుకు పోతున్నారు. ప్రతి రోజూ రాష్ట్రంలో రెండు నుంచి మూడు సభల్లో పాల్గొంటున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా, మాటల తూటాలు పేలుస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు.  విపక్షాలపై పదునైన విమ ర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూనే నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థ్ధితులను చక్కదిద్ద్దుతున్నారు. కేటీఆర్ ఎన్నికల ప్రచారం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్‌రావు ఎన్నికల ప్రచారంలో విరామం లేకుండా తిరుగుతున్న తీరును కేసీఆర్ అభినందించినట్లు తెలిసింది. తాను పర్యటించడానికి ముందే యువ నేత లు ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రజాభిప్రా యాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలం గా మలచుకొనే ప్రయత్నం కొనసాగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇదే తీరులో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని సూచిస్తు న్నారు. కేసీఆర్ ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్ పాల్గొంటున్నారు.

image


స్థ్ధానిక పరిసి ్థతులను వివరిస్తూనే రాష్ట్ర రాజకీయాలపై ఎప్ప టికప్పడు స్పందిస్తున్నారు. కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ కలయికపై కేటీఆర్ గుప్పిస్తున్న విమర్శలు చరనీయాంశాలవుతున్నాయి. తెలంగాణ యువతను కాల్చిచంపిన పార్టీతో కోదండ రామ్‌సార్ జతకట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కాంగ్రెస్ జతకట్టడాన్ని కూడా ఆయన తప్పుబడుతున్నారు. గత నాలుగున్నర ఏండ్ల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరిస్తున్నారు. అభివృద్ధ్దిని వివరిస్తునే విపక్షాలపై విరుచుకుపడుతూ రాబోయే కాలంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవశ్యకతను ఓటర్లకు వివరించడంలో కేటీఆర్ సఫలీకృతులవుతున్నారు. అనేక చోట్ల సిట్టింగ్‌లపై పార్టీ శ్రేణులతో పాటుగా సామాన్య ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని గుర్తించిన కేటీఆర్ అందరిని ఒప్పించి, మెప్పించి దారికి తెచ్చుకొనేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో అసంతృప్తి కొంత వరకు చల్లారిందని టీఆర్‌ఎస్ నాయకులు వెల్లడించారు.

యువ ఓటర్లను ఆకట్టుకొనేందుకు కూడా కేటీఆర్ తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. సోషల్ మీడియాను సమర్ధవంతంగా వినియోగించుకుంటూ విద్యావంతులైన యువతను అకట్టుకుంటున్నారు. కేటీఆర్ బహిరంగ సభలకు యువత పెద్ద ఎత్తున హాజరవుతుందని టీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. కేటీఆర్ ప్రసంగాలను జనం ఎంతో శ్రద్ధగా వింటున్నారని పేర్కొంటున్నారు. కేటీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిచడంతో కల్వకుర్తిలో అసమ్మతి సద్దుమణిగిందంటున్నారు. దాదాపు 26 నియోజక వర్గాల్లో కేటీఆర్ అసమ్మతి సమస్యను పరిష్కరించాడని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం. అనేక నియోజక వర్గాల్లోని ప్రత్యర్థ్ది నాయకులను ఆకట్టుకొని పార్టీ కండువాలు కప్పడంలో కూడా కేటీఆర్ చతురతను ప్రదర్శించారు. నిజామాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్‌తో పాటు హైదరాబాద్‌లో కూడా కేటీఆర్ తనదైన శైలిలో తన మార్కు చూపించారు.

సీమాంధ్ర వాసులను కలుసుకొని మాట్లాడిన తీరు అంతటా చర్చనీయాంశమైంది. మజ్లిస్, బీజేపీ విషయంలో కూడా ఆయన ఆచితూచి వ్యవహరించడం, ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలను ఆశించి చంద్రబాబునాయుడు వ్యవహరించిన తెలంగాణ వ్యతిరేక చర్యలను కూడా ఆయన రాజనీతిజ్ఞతతో తిప్పికొట్టిన తీరు చర్చనీయామైంది. లోక్‌సత్తా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాశ్‌నారాయణ కూడా కేటీఆర్ రాజనీతిజ్ఞతను ప్రశంసించడాన్ని పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ తండ్రి చాటు తనయుడు కాదని తండ్రికి తగ్గ తనయుడని ఇప్పటికే అనేక విధాలుగా రుజువు చేసుకున్నారని పార్టీ సీనియర్లు అభినందిస్తున్నారు. గత కొంత కాలంగా కేటీఆర్ రాజకీయాల్లో తనకంటూ సొంత గుర్తింపు కోసం పాటుపడుతున్నాడు. పరిపాలనలో మంచి గుర్తింపు పొందిన ఆయన రాజకీయాల్లో కూడా స్వతహాగా రాణించగలడనే విశ్వాసాన్ని రుజువు చేస్తున్నారు.  కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడంతో కేసీఆర్  కూడా కొంత వరకు తన  ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కుదించుకొనే అవకాశం ఉందని అంటున్నారు.

కేటీఆర్ స్వతహాగా గెలిపించుకొనే నియోజక వర్గాల్లో కేసీఆర్ పర్యటనలు అవసరం లేదనే ధీమాతో పార్టీ ఉందంటున్నారు.  కేటీఆర్ మున్ముందు ఎన్నికల ప్రచారాన్ని మరింత ఉధృతం చేయబోతున్నారు. సుడిగాలి పర్యటనల కోసం అవసరమైన పక్షంలో హెలికాప్టర్‌ను వినియోగించే ఆలోచనలో ఉన్నారు. అభ్యర్థుల గెలుపుపై తనదైన ముద్ర ఉండాలనే తపనతో కేటీఆర్ నిరంతరం పార్టీకోసం పని చేస్తున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి. దాదాపు 60 నియోజక వర్గాల్లో అభ్యర్థ్దుల గెలుపు పై కేటీఆర్ ముద్ర ఉంటుందనే భావన పార్టీ వర్గాల్లో ఉందంటున్నారు. కేటీఆర్‌కు మద్దతుగా, అండగా మంత్రి హరీష్‌రావు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత కూడా ఎన్నికల ప్రచారంతో దూసుకుపోతున్నారు.దీపావళి తర్వాతే

Updated By ManamThu, 11/01/2018 - 03:19
 • పండగెల్లినంకనే కేసీఆర్ రెండో విడత ఎన్నికల ప్రచారం 

 • అధినేత కోసం సిద్ధ్దమైన ప్రత్యేక ప్రచార రథం

 • రెండు మూడు రోజుల్లో పర్యటన షెడ్యూల్ విడుదల

 • టీఆర్‌ఎస్ పక్షాన 40 మంది స్టార్ క్యాంపెయినర్లు

 • ముమ్మరంగా ప్రచారం చేస్తున్న కేటీఆర్, హరీష్‌రావు, కవిత

 • కూటమి జాబితా విడుదలయ్యాక జోరు పెంచనున్న గులాబీ పార్టీ


imageహైదరాబాద్ః రెండో విడత ఎన్నికల ప్రచారం దీపావళి తర్వాత ప్రారంభించాలని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు జాతీయ,  ప్రాంతీయ పార్టీలకు చెందిన పలువురు ప్రముఖులను టీఆర్‌ఎస్ పక్షాన ఎన్నికల ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. పలువురు సీనియర్ నాయకులతో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ చర్చించారు. ముఖ్యమంత్రి  రోడ్‌షో లకు ప్రత్యేక బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలకు కేసీఆర్ హెలీకాప్టర్‌లో వెళ్లనున్నారు. పలువురు ప్రముఖులతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లను వినియోగించే విషయం కూడా టీఆర్‌ఎస్ ఆలోచిస్తుంది. అన్ని నియోజక వర్గాల్లో కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారం ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల కాబోతుందని పార్టీ నాయకులు తెలిపారు.

మహాకూటమి అభ్యర్ధుల జాబితా వెల్లడి కాకపోవడంతో  కేసీఆర్ ఎన్నికల ప్రచార పర్యటనలో కొంత జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. రోజుకు మూడు నియోజక వర్గాల్లో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలు ఉంటాయని తెలిపారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం, మంచిర్యాల, మహ బూబ్‌నగర్‌లో కేసీఆర్ రోడ్‌షోలు ఉంటాయని తెలిసింది. ప్రచారం కోసం తయారు చేసిన ప్రత్యేక బస్సులోని ఏర్పాట్లను కేసీఆర్ పరిశీలించారు. కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. త్వరలోనే ప్రత్యేక బస్సు అందుబాటులోకి వస్తుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎక్కువ సభలకు కేసీఆర్ హెలికాప్టర్‌లో వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. మహాకూటమి అభ్యర్దులను ప్రకటించిన తర్వాత దేశంలోని కొన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల ప్రముఖులను ఎన్నికల ప్రచారంలో దింపుతామన్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎన్నికల ప్రచారంలో నియోజక వర్గాల వారీగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. కూటమిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక మీదట కూడా ఈ ముగ్గురూ ఎన్నికల ప్రచారం కొనసాగిసారని టీఆర్‌ఎస్ నాయకులు  తెలిపారు. 

మేనిఫెస్టోకు తుది మెరుగులు
టీఆర్‌ఎస్ మేనిఫెస్టో తుది మెరుగులు దిద్దుకుంటుంది. కేసీఆర్ త్వరలోనే విడుదల చేయునున్నారు. వచ్చే వారం imageనుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఉంటుంది, ముందుగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభలు ఉంటాయి, ఆ తర్వాత నియోజక వర్గాల వారీగా రోడ్‌షోలు ఉంటాయి. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత కేసీఆర్ తెలంగాణలో రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్దుల ఎన్నికల ప్రచారం సరళిని పర్యవేక్షిస్తున్నారు.  కేటీఆర్, కవిత, హరీష్‌రావు పర్యటనలపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. కూటమి అభ్యర్దుల జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి జాబితా వెల్లడైన తర్వాత నియోజక వర్గాల వారిగా ప్రచార సరళిపై దిశ నిర్ధేశం చేయబోతున్నారు. దాదాపు 46 నియోజక వర్గాల్లో  ధీటైన అభ్యర్దులు రంగంలో ఉంటారని భావిస్తున్నారు.

అలాంటి నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్దులను గెలిపించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరించవలసి ఉంటుందని భావించాం, అందుకే రెండో దశ ప్రచారం ప్రారంభించడంలో కొంత జాప్యం జరుగుతుంది అని పార్టీ వర్గాలు తెలియచేశాయి. కేటీఆర్, హరీష్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించిన నియోజకవర్గాల్లో కేసీఆర్ పర్యటన ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో ఉంటుందని పేర్కొంటున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులను ఎన్నికల ప్రచారం కోసం ఆ హ్వానించారు. వారు కూడా సుముఖత వ్యక్తం చేశారు. సామాజిక వర్గాల ప్రభావం దృష్టిలో ఉంచుకొని స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపే అవకాశం ఉందంటున్నారు.ప్రచారంపై కేసీఆర్ ఫోకస్

Updated By ManamTue, 10/30/2018 - 23:32
 • సీనియర్లు, అభ్యర్థులతో మంతనాలు.. సిటీలో సీమాంధ్ర ఓట్లపై కన్నేసిన టీఆర్‌ఎస్

 • కాంగ్రెస్‌ను బలహీన పరిచే విధంగా ఎన్నికల ప్రణాళిక

హైదరాబాద్: ప్రచార సరళిపైన టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుల ఎన్నికల బహిరంగ సభలపై ప్రజా స్పందనన గురించి అడిగి తెలుసుకుంటున్నారు. మంగళవారం పలువురు మంత్రులు, అభ్యర్ధులు, ముఖ్యనాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. ప్రచారంలో ఉన్న అభ్యర్ధులతో స్వయంగా మాట్లాడారు. ప్రజాస్పందనపైన ఇంటెలిజెన్సీ నివేదికలను కూడా ముఖ్యమంత్రి కోరినట్టు తెలిసింది. కూటమి ఇప్పటి వరకు అభ్యర్ధులను ప్రకటించనప్పటికీ కొంతమంది అభ్యర్ధులు ప్రచారంలో దూసుకుపోవడంపై కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ముందస్తు ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీ పడుతున్నందున ఆ పార్టీ వ్యూహంపై ముఖ్యమంత్రి కన్నేశారంటున్నారు. టీడీపీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు ప్రసంగించబోతున్నారనే సమాచారంపై కూడా పలువురు నేతలతో కేసీఆర్ చర్చించినట్లు తెలిసింది, హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ బహిరంగ సభ కొంత ఆలస్యంగా నిర్వహించాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్ ఉందంటున్నారు, ముందుగా జిల్లాల్లో కేసీఆర్ బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని, ఎన్నికలకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే సభతో ఎన్నికల ప్రచారం ముగించాలని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్ మానిఫెస్టో పై కూడా కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారు.

image


ఇప్పటికే ప్రకటించిన కొన్ని అంశాలపై వివిధ వర్గాల నుండి మంచి స్పందన వచ్చినందున పూర్తి స్ధాయి మేనిఫెస్టోలో అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. కేటీఆర్ సభలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, ఆయన ప్రసంగాలను సభికులు ఆసక్తిగా వినడంతో పాటు ఆయన లెవనెత్తుతున్న అంశాలపై చర్చించుకుంటున్నారని పార్టీ వేగులు అందించిన సమాచారంతో కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది. త్వరలోనే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనాలని కేసీఆర్ భావిస్తున్నందున బహిరంగ సభల ఏర్పాట్లపైన వివిధ జిల్లాల నాయకులతో మాట్లాడుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే కేసీఆర్ బహిరంగ సభల తేదీలు వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. ఒకే సారి 105 మంది సిట్టింగ్‌లను అభ్యర్ధులుగా ప్రకటించడంతో ఉత్పన్నమయిన సమస్యలను అధిగమించడానికి కూడా రాజకీయ పరిష్కారాలు కనుగొనడంపై కేసీఆర్ దృష్టి కేంద్రీకరించారని పార్టీ నాయకులు తెలిపారు. మహాకూటమిలో కూర్పు కుదరడం లేదని, సీట్ల సంఖ్యపై పేచీలు కొనసాగుతున్నాయని, కాంగ్రెస్‌ను నమ్మిన విపక్షాలకు భంగపాటు తప్పదనే ప్రచారం కొనసాగించాలనే సంకేతాలు వెలువడుతున్నాయని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పలువురు అభ్యర్ధులను కేసీఆర్ మందలించినట్లు కూడా తెలిసింది.

ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలువురు సిట్టింగ్‌లను ప్రజలు నిలదీసిన తీరుపై కూడా ఆరా తీస్తున్నారని తెలియచేశారు. సీనియర్లను కూడా ప్రజలు నిలదీయడమేమిటని కేసీఆర్ ప్రశ్నించడంతో అభ్యర్ధులు సర్దుబాటు చర్యలకు శ్రీకారం చుడుతున్నారని తెలిసింది. తాము ప్రచారానికి వెళ్లడానికి ముందే గ్రామాల్లో చేసిన అభివృద్దిని, మిగిలిపోయిన పనులు గురించి పూర్తి అవగాహనతో ఉండాలని అభ్యర్ధ్దులకు సూచిస్తున్నారు,  చేయాల్సినంత చేశాం, చేయాల్సింది ఇంకేంతో ఉంది, అందుకే మద్దతు ఇవ్వండని కోరుతున్నాం అనే విధంగా ప్రచారం సాగవలసి ఉందని కేసీఆర్ పలువురికి సూచించారని అంటున్నారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే విధంగా ఎన్నికల కార్యాచరణ ఉండాలని, నియోజక వర్గాల వారిగా బలమైన ఓటు బ్యాంకు ఉన్న విపక్ష నాయకులను ఆకట్టుకోవడం కూడా ఎన్నికల ఎత్తుగడలో భాగం కావాలని పార్టీ నాయకత్వం పలువురు అభ్యర్ధులకు సూచించిందని తెలిపారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి తనను కలిసిన సీనియర్ నేతలతో ఎన్నికల ప్రచారంలో భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. విపక్షాలన్ని  కూటమిగా ఏర్పడటం, కొన్ని నియోజక వర్గాల్లో బలమైన నాయకులను రంగంలోకి దింపడం, కాంగ్రెస్ బలంగా ఉన్న నియోజక వర్గాల్లో అనుసరించవలసిన వ్యూహం, హైదరాబాద్‌లో రాజకీయ పరిణామాలు, టీడీపీ పోటీ చేసే స్దానాల్లో అభ్యర్ధుల్దను ఖరారు చేయడం తదితర అంశాలను చర్చించారని తెలిసింది.  గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ బలం పెరగాల్సి ఉందని, టీడీపీ స్దానాలను కైవసం చేసుకొనడంతో ఆ పార్టీకి రాజకీయ మనుగడ లేకుండా చేయాల్సిన అవసరం ఉందని అన్నట్లు తెలిసింది. చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించిన అంశం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. సీమాంధ్రులను ఆకట్టుకోవడం అత్యంత ప్రధానం అని అంటున్నారు.  సీమాంధ్రులకు టీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని, హైదరాబాద్‌లో స్దిరపడిన వారంతా తెలంగాణ వారేననే వాదనను బలపర్చడం, ఆ వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవడం ద్వారా నగరంలో అత్యధిక స్ధానాలను గెలుచుకోవాలని భావిస్తున్నామని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.'కేసీఆర్ వచ్చాకే గజ్వెల్ అభివృద్ధి జరిగింది'

Updated By ManamMon, 10/22/2018 - 15:06
 • ఇంటింటా టీఆర్ఎస్ పార్టీ ప్రచారం

 • ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు కామెంట్స్

KCR, Gajwel city, Harish rao, TRS party సిద్దిపేట: తెలంగాణలో కేసీఆర్ సీఎంగా వచ్చాక మాత్రమే సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ రూపురేఖలు మారాయని ఆపద్దర్మ మంత్రి హరీశ్ రావు చెప్పారు. గజ్వేల్ పట్టణ కేంద్రంలోని కోటమైసమ్మ దేవాలయంలో కొబ్బరికాయ కొట్టి హరీశ్ రావు ఇంటింటా టీఆర్‌ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఇప్పటి నుంచి ప్రతిరోజు గజ్వెల్‌లో జెండా పండగ చేసుకుందామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా తాగునీటి సమస్య తీర్చలేదు కానీ కేసీఆర్ వచ్చాక ప్రతి ఇంటికి తాగునీటి ఇస్తున్నామన్నారు.

కేసీఆర్ కిట్ల వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం వచ్చిన గజ్వెల్‌ను అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు, కానీ కేసీఆర్ వచ్చాక గజ్వెల్ రూపురేఖలు మారాయని స్పష్టం చేశారు. గతంలో ప్రతాప్ రెడ్డి ఆంద్ర వాళ్ళు పంపిన డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తిని విమర్శించారు. పార్టీలు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు.ఉత్తమ్‌కు హరీశ్‌రావు 12 సూటి ప్రశ్నలు..

Updated By ManamTue, 10/09/2018 - 15:07
 • మహాకూటమి ఏర్పాటుపై తెలంగాణ పీీసీసీకి బహిరంగ లేఖ

Harish rao, PCC, Uttam kumar reddy (2173), TRS party (2221), హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఈ విషయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి హరీశ్ రావు పన్నెండు ప్రశ్నలతో బహిరంగ లేఖను సంధించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పొత్తు వల్ల తెలంగాణ ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాలని ప్రధానంగా లేఖలో ప్రస్తావించినట్టు హరీశ్‌రావు పేర్కొన్నారు. మీది షరతులతో కూడిన పొత్తా ? సిగ్గులేని పొత్తా స్పష్టం చేయాలన్నారు. గతంలో టీఆర్ఎస్.. కాంగ్రెస్, టీడీపీలతో షరతులతో కూడిన పొత్తు పెట్టుకున్నాం. పదవులను గడ్డి పోచలాగా వదలుకున్నాం. చంద్రబాబు చివరి దాకా తెలంగాణను అడ్డుకున్నారు. రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కూడా వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. అదేమైనా మార్చుకున్నా అని టీడీపీ పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశారా? అని ఉత్తమ్‌ను సూటిగా ప్రశ్నించారు.

తెలంగాణ వ్యతిరేక వైఖరి వీడానని బాబు హామీ ఇచ్చారా? పోలవరం ఏడు మండలాలు తిరిగి ఇచ్చేస్తామని బాబు హామీ ఇచ్చారా? పోలవరం డిజైన్ మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా? అని లేఖలో వరుస ప్రశ్నలు సంధించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వద్దని బాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని, బాబు వైఖరి మార్చుకుని మళ్లీ కేంద్రానికి లేఖ ఇచ్చారా? కాళేశ్వరం, సీతారామ తదితర ప్రాజెక్టులపై కేంద్రానికి ఇచ్చిన లేఖను బాబు వాపసు తీసుకున్నారా? కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాటాకు సంబంధించి ట్రిబ్యునళ్లలో జరుగుతున్న వాదనల విషయంలో చంద్రబాబు వైఖరి మార్చుకుంటున్నారా? తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీల కృష్ణా జలాలను బాబు రాకుండా అడ్డుకుంటున్నారని లేఖలో హరీశ్ రావు విమర్శించారు. 

ఏపీ మీద మేము పోరాడుతున్నాం. తెలంగాణకు నీళ్లు వద్దంటున్న బాబుతో నీళ్లు ఇప్పిస్తామని చెప్పించగలరా? అని ఉత్తమ్‌ను సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తెలుగు జాతి అని మాట్లాడుతుంటారని, అది ఆయనకు అతకదన్నారు. తెలంగాణలో అన్ని ప్రాంతాల వారు ఉంటే మిషన్ భగీరథ ద్వారా అందరికీ నీళ్లిచ్చే ప్రాజెక్టును బాబు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దానిపై ఆయన వైఖరి మారిందా? బీజేపీ మద్దతుతో 460 మెగావాట్ల సీలేరు హైడెల్ కేంద్రాన్ని బాబు లాక్కున్నారని దుయ్యబట్టారు. దాన్ని తెలంగాణకు బాబుతో తిరిగి ఇప్పిస్తారా? త్రిశంకు స్వర్గంలో ఉన్న 1350 మంది ఉద్యోగులను ఏపీ తీసుకోవడానికి బాబును ఒప్పిస్తున్నారా? నిజాం వారసత్వంగా తెలంగాణకు సంక్రమించాల్సిన ఆస్తులపై బాబు వాదన ఏమైనా మార్చుకున్నారా? హైకోర్టు, మిగతా విభజన హామీలపై బాబుతో హామీ తీసుకున్నారా? మహా కూటమి కనీస ఉమ్మడి ప్రణాళికలో చంద్రబాబుతో ఈ పన్నెండు అంశాలపై సంతకం పెట్టిస్తారా? అని ఉత్తమ్‌కు హరీశ్ బహిరంగ లేఖలో ప్రశ్నలను లేవనెత్తారు. 'కూటమికి ఓటు అడిగే హక్కు లేదు'

Updated By ManamSat, 10/06/2018 - 18:47
 • కూటమికి ఇక ఓటమే.. ఇంటి పార్టీకే ఓటు వేయండి..

 Massive Allaince, Harish Rao, Vote Right, TRS Party, Congress, Telangana Assembly elections హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని ఎన్నికల సెగ తాకింది. దాంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపుందుకుంది. టీఆర్ఎస్‌పై మహాకూటమి, కూటమిపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహాకూటమికి ఇక ఓటమి తప్పదన్నారు. అభివృద్ధి మీ కళ్ళ ముందు ఉందని, ఇంటి పార్టీ టీఆర్‌ఎ‌స్‌కు ఓటు వేయండని కోరారు. అందోల్ అభ్యర్తి క్రాంతి కారు గుర్తుకు 
ఓటేయండని పిలుపినిచ్చారు. శనివారం హైదరాబాద్ మంత్రి నివాసంలో టీఆర్ఎస్‌కి మద్దతుగా అన్ని పార్టీల నాయకులు గులాబీ గూటికి చేరారు. టీడీపీ నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్‌లో చేరారు. 

మంత్రి హరీష్ రావు, అందోల్ అభ్యర్థి క్రాంతి సమక్షంలో టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు గులాబీ కండువ కప్పుకున్నారు. అందోల్ అభ్యర్థి క్రాంతికి రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, జిల్లా టీడీపీ కార్యదర్శి, జోగినాథ్, విజయ్‌లు జై కొడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ ‘‘కూటమి‌కి ఓటు అడిగే హక్కు  లేదు. ఇది ఆరంభమమే.. క్రాంతి గెలుపు కోసం రానున్న రోజుల్లో మహాకూటమి నుంచి భారీ వలసలు కానున్నాయి. పరాయి వద్దు.. స్థానికుడే ముద్దు. పరాయి పాలనకు ఇక చరమగీతం పడతాం. అందోల్ ప్రజలకు బాసటగా నిలుస్తున్న రాజకీయ నాయకులకు ధన్యవాదాలు’’అని తెలిపారు అందరూ కలసి కట్టుగా పని చేసి క్రాంతి కిరణ్ ను భారీ మెజారిటీ‌తో గెలిపించాలని కోరారు.

Related News