TRS party

'ఉత్తమ్‌ కుమార్‌వి ఉత్త మాటలు'

Updated By ManamMon, 09/03/2018 - 19:43
 • టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ 

Danam Nagender, Uttam Kumar reddy, TRS party, Pragathi Nivedhana Sabhaహైదరాబాద్: టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభపై టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డివి ఉత్త మాటలని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. ప్రగతి నివేదన సభ విజయవంతం అయిందని కొందరు కాకిగోల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోమవారం దానం మీడియాతో మాట్లాడుతూ.. ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన వారందరికీ ధన్యవాదాలు  తెలిపారు. సభ అనుకున్న ప్రకారం మొదలు అయ్యిందని, ట్రాఫిక్ జామ్ వల్ల వేల మంది సభకు రాలేక పోయారని చెప్పారు. హామీలతో ఉత్తమ్ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ భచావో కాదు... గాంధీ భవన్‌లో ‘ఉత్తమ్ కో హఠావ్... కాంగ్రెస్ కో బచావ్’ అని అంటున్నారని ఎద్దేవా చేశారు.  టీఆర్ఎస్ సభకు వరుణుడు సహకరించిందని అన్నారు.

కాంగ్రెస్ నేతలు కాకి గోల చేస్తున్నారని విమర్శించారు. ముందస్తు ఎన్నికలపై కాంగ్రె‌స్‌లో తలో మాట మాట్లాడుతున్నారని, లక్షల మంది జనం ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉన్నదని దానం చెప్పారు. బడుగు బలహీన వర్గాల అండ టీఆర్ఎస్‌కు ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ‌లో బీజేపీకి ఒక్క సీటు రాదని ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్ చెప్పారు. ప్రగతి నివేదన సభ కావునా.. కేసీఆర్ రాజకీయ విమర్శలు చేయలేదని, రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రతి పక్షాలను కడిగి పారేస్తారని దానం తెలిపారు. సొంత పార్టీ నేతలు రెండు లక్షల రుణమాఫీ సాధ్యం కాదని ఉత్తమ్‌కు చెప్పారని అమిత్ షాతో ఉత్తమ్ ఎందుకు రహస్యంగా  సమావేశం అయ్యారో చెప్పాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ప్రారంభమైన ప్రగతి నివేదన సభ

Updated By ManamSun, 09/02/2018 - 18:33

Pragathi Nivedhana sabha, Kongarakalan Venue, TRS party, Speical helicopterరంగారెడ్డి: టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొంగరకలాన్ ప్రగతి నివేదన సభ ప్రారంభమైంది. ఇప్పటికే సభా ప్రాంగణానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి లక్షాలదిగా తరలివచ్చారు. కాసేపటి క్రితమే సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కొంగరకలాన్ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభాప్రాంగణం వెనుక వైపు హెలిపాడ్‌ ఏర్పాటు చేశారు. సభావేదికపై ఇప్పటికే ఉన్న పలువురు మంత్రులు రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభావేదికపై కూర్చొన్నారు. 

సభా వేదికపైకి చేరుకున్న కేసీఆర్.. ముందుగా తెలంగాణ తల్లికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు కళాకారులు ఆట పాటలతో హోరెత్తించారు. రాష్ట్ర నలువైపులా నుంచి భారీగా తరలివచ్చిన కళాకారులతో కొంగర కలాన్‌ జనసంద్రంగా మారింది. గులాబీ జాతర

Updated By ManamSun, 09/02/2018 - 03:08
 • చరిత్ర సృష్టించనున్న నేటి ప్రగతి నివేదన సభ

 • భారీ ఎత్తున తరలుతున్న జనం.. గులాబీ మయమైన రహదారులు

 • ఆట పాటలు, డప్పు చప్పుళ్లతో కొంగరకలాన్‌కు కళాకారులు

 • నాలుగేండ్ల అభివద్దిని సగర్వంగా వివరించనున్న సీఎం కేసీఆర్

 • చిరస్మరణీయ ప్రసంగం చేయనున్న ప్రభుత్వ అధినేత

 • ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఆర్‌ఎస్ నాయకులు

image

హైదరాబాద్: చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రను మలుపు తిప్పాలన్నా.. తెలంగాణలో కేసీఆర్ ఒక్కరికే సాధ్యం. తన మాటలతో ప్రజలను మంత్ర ముగ్ధులను చేయడం.. ముందుకు నడిపించడం ఆయనకే సాధ్యైమెంది. ఉద్యమ సారథ్యంలోనే కాదు, రాజకీయ చతురతలోనూ ఆయనకు ఆయనే సాటి. కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో? ఏ పథకాలు ప్రకటిస్తారోనన్న భరోసా, ఆశ ప్రజలకు కలిగేలా చేయడంలో ఆయనకు లేరేవ్వరూ పోటీ అన్న తీరులో పాలన కొనసాగిస్తున్నారు. ప్రతి అంశంలోనూ దిట్ట అయిన సీఎం కేసీఆర్.. మరో చారిత్రక ఘట్టానికి సెప్టెంబరు 2న శంఖం పూరించనున్నారు. ప్రగతి నివేదన సభ పేరిట 25 లక్షల మందితో ఆదివారం భారీ బహిరంగ సభకు సర్వం సిద్దం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ అధినేత పిలుపు మేరకు స్పందించిన అన్నివర్గాల ప్రజలు, టీఆర్‌ఎస్ శ్రేణులు బండెనక బండి కట్టి పదహరు బండ్లు కట్టీ.. అన్నట్లుగా రెండు రోజులు ముందుగానే ట్రాక్టర్లతో బయలుదేరేలా ప్రజా ప్రతినిధులంతా దానికోసమే పని చేసేలా వారిని నడిపిస్తున్నారు. వాహనాలన్నీ కొంగర కొలాన్ బాటపట్టాయి. శనివారం నాటికే ప్రాంగణమంతా గులాబీ దండుతో నిండిపోయింది. మరింత మంది అందుబాటులో ఉన్న ట్రాక్టర్లు, లారీలు, బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎవరికి వారే కావాల్సిన అన్ని సౌకర్యాలు సమకూర్చుకొని ప్రగతి నివేదన సభకు బయలుదేరారు. వాహనాలకు జిల్లాల్లో ఉన్న, మంత్రులు, జిల్లా అధ్యక్షులంతా ఎవరికి జెండా ఊపి లాంచనంగా ప్రారంభించారు. ఒక్కొక్క జిల్లా నుండి 3 లక్షల మంది ప్రజలు తరలడంతో టీఆర్‌ఎస్ అగ్ర నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో సభను నిర్వహిస్తామని, ఇప్పటికే సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నారు. ఇవన్నీ పరిశీలిస్తే సభ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

రాష్ట్రమంతా సభా సందడే కనిపిస్తుంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా ప్రగతి నివేదన కసరత్తు జరుగుతున్నది. ట్రాక్టర్లు, బస్సులు, కార్లు ప్రగతి నివేదన సభకు కదిలి పోతున్నాయి. రాష్ట్రంలో ఎటు చూసినా గులాబీ మయమైన పరిస్థితి ఉంది. మరికొందరు తమ బైకులతో భారీ ఎత్తున ర్యాలీగా యువకులు ప్రజానివేదన సభకు బయలుదేరి వస్తున్నారు. ఇక, ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన కేసీఆర్, అధికారంలోకి రావడమే కాకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో మనకు గౌరవం దక్కిందని...అప్పటి, నుంచే అనేక సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చూసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని చెప్తున్నారు. ప్రగతి నివేదన సభకు వెళ్లే ప్రజలు పోలీసులకు సహాకరిస్తూ, వారు సూచించే సలహాలను,సూచనలను పాటిస్తూ, సురక్షితంగా వెళ్లాలని ఈ సందర్బంగా కోరారు. 

image


గులాబీ మయమైన గ్రామాలు, రహదారులు... దారి పొడవునా జై తెలంగాణ...జై కేసీఆర్ నినాదాలు కొంగర కలాన్‌కు ప్రజలు తరులుతుండటంతో ఆయా గ్రామాలతోపాటు, రహదారులన్నీ గులాబీ మయమయ్యాయి. గ్రామాల్లో యువకులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున సీఎం కేసీఆర్, జిల్లా మంత్రుల బ్యానర్లను కట్టారు. అలాగే ఫ్లెక్సీలు, జెండాలతో అందంగా అలంకరించిన వాహనాలు రహదారులగుండా వెళుతుండటంతో ఆ రహదారులన్నీ పూర్తిగా గులాబీ మయమయ్యాయి. రహదారులన్నీ జై తెలంగాణ నినాదాలతో మారు మోగుతున్నాయి. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ, తెలంగాణ పాటలు, సంప్రదాయ నృత్యాలు, డప్పుల చప్పుళ్ళతో రహదారులన్నీ మారుమోగుతున్నాయి. సభకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్చదంగా ఎవరికి వారే తరలివస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార 25 లక్షల మందితో బారీ బహిరంగ సభను నిర్వహించి ప్రతిపక్ష, విపక్షాలకు చెమటలు పట్టిస్తూ..ఈ జోష్‌లోనే ముందస్తు ఎన్నికలకు పోవాలని భావిస్తొంది. అతి తక్కువ సమయంలో 25 లక్షల మందితో కొంగరకలాన్‌కు మందిని రప్పించి సభ విజయవంతం చేసేందుకు కేసీఆర్ భారి ఆలోచనతో ముందుకు దుసుకువేళ్త్తున్నారు. సభ విజయవంతానికి ఒక సమన్వయ కమిటిని వేశారు.

ఇందులో భాగంగా ఈ కమిటికి భాసగా నిలుస్తూ..సీఎం కుమారుడు మంత్రి కేటీఆర్...తన సహచరులైన పలువురు మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, నాయిని, మహముద్ ఆలీ, నగర మేయర్ బోంతు రామ్మోహన్ , ఎంపీలు బాల్క సుమన్, బూర నర్సయ్య, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, సుంకరీ రాజు, కార్పొరేషన్‌లు చైర్మన్ చిరుమల్ల రాకేష్, గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి, తీగల,ఎం. సుధీర్‌రెడ్డి,సిహెచ్. కనకారెడ్డి, డిప్యూటి మేయర్ భాబా ఫసియోద్దిన్, టీఆర్‌ఎస్‌వీ, టీఆర్‌ఎస్‌యూ, టీఆర్‌ఎస్‌కేవీ, టీఆర్‌ఎస్ ట్రేడ్ యూనియన్ విభాగం నేతలంతా అక్కడే ఉండి ప్రగతి నివేదన సభ పనులను చూస్తున్నారు. సభకు ముందు పది రోజులుందన్న సమయంలో ఓ వారం ముందే సభా స్థలిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఇక సభకు వచ్చె వారికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకే చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్వహక, సమన్వయ కమిటికి సూచించారు. మంత్రి కేటీఆరే చుట్టు ప్రక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో కలియ తిరుగుతూ... సభకు విజయవంతానికి కృషి చేస్తున్న కమిటి సభ్యులతో పాటు, స్థానిక నేతలకు వాటి భాద్యతలను అప్పగించారు. అయితే, సభ విజయవంతానికి మంత్రి ప్రత్యేక చోరవ తీసుకొని అన్ని రహదారులను పర్యవేక్షిస్తున్నారు. సభ వేదికకు వేళ్లేందుకు పాత రోడ్లు ఏడు ఉండగా వాటికి ఆదనంగా మరొ 15 కొత్త రోడ్లను వేశారు. వీటితో నాలుగు జియో, ఎయిర్‌టెల్, ఐడియా, వోడాఫోన్, బిఎస్‌ఎన్‌ఎల్ సేల్‌ఫోన్ టవర్స్, తాత్కలిక విద్యుత్ టవర్స్, 150 ట్రాన్స్‌ఫార్మర్స్, 30 పవర్ జనరేటర్లు, 1500 విద్యుత్ లైట్లు, స్టేజీపై 15 ఏసీలు, కూలర్లు, 300 సీసీ తాత్కలిక కెమెరాలు (పోలీస్, ప్రైవేట్) 50 వేల కుర్చీలు, 24 లక్షల మందికి సరిపడ జంకణాలు, వేదిక పక్కన పరిసర ప్రాంతాల్లో 30 వైద్య బృందాలు, సుమారు 300 మంది డాక్టర్లు, 50 మంచి నీటి ట్యాంకర్లు, 200 టాయిలేట్లు, మహిళలకు ప్రత్యేకంగా టాయిలేట్లతో పాటు వైద్యం, మజ్జిగ, వాటర్ ప్యాకేట్స్ బ్యాగులు, అదిరిపోయే 120 రకాల తెలంగాణ వంటకాలు, వేదికకు కొంచేం దూరంలో 20, జిల్లాల వారిగా వచ్చే వాహనాలకు ఎక్కడికక్కడా సుమారు 60 పైగా పార్కింగ్ ఏరియాలను ఏర్పాట్లు చేశారు. ఇక రెండు రోజుల ముందుగానే, ఖమ్మం, ఆదిలాబాద్, నిజ మాబాద్, కోత్తగూడేం నుండి వందలాది ట్రాక్టర్లు ద్వారా సుమారు 10,0000 మంది రైతన్నలు,స్థానిక టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శనివారం సాయంత్రం  కొంగరకలాన్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. 

భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణలో కమిషనర్ భగవత్
అధికార టీఆర్‌ఎస్ పార్టీ సుమారు 30 లక్షల మందితో నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సారథ్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ట్రై క మిషనరేట్లలోని పోలీసు అధికారులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 20 మంది ఎస్పీలు, 15 మంది ఏఎస్పీలు, 120 మంది డీస్పీలు, 500 మంది సీఐలు, 500 మంది ఎస్సైలు, 9 వేల మంది కానిస్టేబుల్స్‌లో 1500 మంది మహిళా పోలీసులతో పాటు 24 ఫ్లటూన్ల గ్రేహాండ్స్ బలగాలు, 40 ఫ్లటూన్ల ప్రత్యేక బలగాలు బందోబస్తులో ఉంటారు. సీసీ కెమెరా నిఘాలో సభ పరిసర ప్రాంతాల్లో ఉంటాయని..డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌తో ముమ్మర తనిఖీలు చేశామని రాచకోండ సీపి ఎంఎం భగవత్ తెలిపారు.

దీనికి తోడు మరో 300 మంది బౌన్సర్లతో ప్రవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ సభలో 5000 మంది వాలంటీర్లతో సభకు తరలివచ్చేవారికి సహాయం అందజేయనున్నారు. సభా స్థలానికి పాతవి 7, కొత్తవి 15 రోడ్లతో అనుసంధానం చేశారు. సభకు నలువైపులా 19 ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ స్థలాల వద్ద కూడా పోలీసులు ప్రత్యేక బందోబస్తును నిర్వర్తిస్తున్నారు. సభా వేదికపై 500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడంతో పాటు సభా ప్రాంగణాలను మొత్తం నిఘా నీడలో ఉంచారు. సభ వేదికపై జరిగే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణంలో 50 భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఆదివారం ప్రయాణాలు పెట్టుకోవద్దని...ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు పీవీఎక్స్‌ప్రెస్ హైవే మీదుగా వె ళ్లాలని ఓఆర్‌ఆర్ మీదుగా ప్రయాణాలు పెట్టుకోవద్దని నగర పోలీసులు సూచించారు. 70 మందితో తొలి జాబితా సిద్ధం

Updated By ManamSun, 09/02/2018 - 03:08
 • 20 నుండి 25 మందికి నో ఛాన్స్

 • ఒకరిద్దరు అమాత్యులు పార్లమెంటుకు

 • కొందరు ఎంపీలు శాసనసభకు పోటీ చేసే అవకాశం

 • తెరాసలో కొనసాగుతున్న అభ్యర్థుల ఎంపిక కసరత్తు

imageహైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో  తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు 70 మంది జాబితాను తొలి విడతలో ప్రకటించడానికి చర్యలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో 82 స్ధానాలు కలిగి ఉన్న తెరాస డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఈ సంఖ్యను 100కు పెంచుకొనేందుకు  కార్యాచరణ రూపొందించుకుంది.  పార్టీలో  అభ్యర్ధుల జాబితా పై ఇంకా  కసరత్తు కొనసాగుతోంది. అత్యధికులైన సిట్టింగ్‌లకు తిరిగి టికెట్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తం చేస్తున్నారు.  అయితే  అభ్యర్దుల జాబితా విషయంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.  దాదాపు 20 నుండి 25 మంది సిట్టింగ్‌లకు టికెట్లు దొరికే అవకాశం లేదనే ప్రచారం జరుగుతుంది. కొందరు అమాత్యుల సేవలను పార్టీకి వినియోగించుకోవాలని భావిస్తున్నారు.

నియోజక వర్గాల్లో రాజకీయంగా పట్టు కోల్పోతున్న మరి కొందరికి పరోక్షంగా పదవుల ఆశ చూపి గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు. ప్రస్తుతం శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న వారిలో ఇద్దరు ముగ్గురిని పార్లమెంటుకు పంపించడం, పార్లమెంటు సభ్యులుగా ఉన్న వారితో శాసనసభకు పోటీ చేయించడం పై  పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకరిద్దరు మంత్రులను పార్లమెంటుకు పంపించే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లు  పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్ధుల ఎంపికలో ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జోక్యం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇటీవల పార్టీలో చేరిన వారు, ఇప్పటికే పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు ఇవ్వాల్సిన పరిస్ధితి నెలకొందంటున్నారు.

సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వడం సాధ్యం కాదని, కొందరు కొత్తవారికి, ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి, సామాజిక సమీకరణలో నేపథంలో మరికొంత మందికి టికెట్లు ఇవ్వడం, వారిని గెలిపించుకోవడం అనివార్యం అంటున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇప్పటికే శాసనసభ్యుల పనితీరును గ్రేడింగ్ చేశారు. మంత్రుల పనితీరును కూడా పరిగణలోకి తీసుకున్నారు. అసెంబ్లీలో  ప్రస్తుతం తెరాసకు 82 స్థానాలు, కాంగ్రెస్‌కు 17, మజ్లీస్‌కు 7, భాజపాకి 5, తెదేపాకు 3 సీట్లు ఉన్నాయి. తెరాస 82 సీట్ల బలాన్ని 100కు మించే విధంగా రాజకీయ వ్యూహంతో ముందస్తు ఎన్నికలు సిద్దమయ్యారు. సెప్టెంబర్ 2న ప్రయాణాలు వాయిదా వేసుకోండి

Updated By ManamTue, 08/28/2018 - 06:54
 • ప్రగతినివేదన సభకు ఏర్పాట్లు ముమ్మరం

 • టీఆర్‌ఎస్ నేతలంతా కొంగర కలాన్‌లోనే..

 • మరో రికార్డు సృష్టించనున్న అధికార పార్టీ


హైదరబాద్: అధికార టీఆర్‌ఎస్ పార్టీ మరో అరుదైన రికార్డును సృష్టిం చనుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్  జిల్లా ప్రకాష్‌రెడ్డిపేటలో టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా, ఉద్యమ నాయకునిగా కేసీఆర్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు సుమారు ఇరవై లక్షలకు పైగా తెలంగాణ ప్రజలు హాజరై రికార్డుల్లోకి ఎక్కగా ..ఇప్పుడు ఆ రికార్డును అదే టీఆర్‌ఎస్ పార్టీ అధికార పార్టీ హోదాలో తిరగరాయనుంది. సెప్టెంబర్ 2 న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో 25 లక్షల పై చిలుకు ప్రజలతో నిర్వహించునున్న ప్రగతి నివేదిక సభే అందుకు వేదికగా మారనుంది. ఎన్నికలకు ముందు అధికార టీఆర్‌ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఫ్పై లక్షల వరకు ప్రజలను, పార్టీ కార్యకర్తలను తరలించాలని సీఎం ఆదేశించడంతో రాష్ట్ర నాయకులంతా జనసమీకరణలో నిమగ్నమయ్యారు. కొంగరకలాన్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి . వాహనాలన్నింటిని సభ కోసం ఉపయోగిస్తున్నందు వల్ల ప్రజలు సాధ్యమైనంత వరకు తమ ప్రయాణాలు ఆ రోజు వాయిదా వేసుకోవాలని నేతలు ప్రజలకు విజ్ఙప్తి చేస్తున్నారు.

image


సభలు పెట్టడం  టీఆర్‌ఎస్‌కు కొత్తేమి కాదు
భారీ బహిరంగ సభలు పెట్టడం, జన సమీకరణ చేయడం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలను సకల జనుల సమ్మె పేరుతో ఒక్కతాటిపై నిలిపిన నాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అంటేనే ప్రజలు ఎన్ని పనులు ఉన్నా ఉరుకులు పరుగుల మీద వస్తారు. అలా తన ఉద్వేగభరిత ప్రసంగాలతో ప్రజల మనస్సు గెలుచుకున్న కేసీఆర్ ఉద్యమ కాలంతో పాటు అధికారంలోనికి వచ్చాక మెజార్టీ ప్రజలు, కార్యకర్తలతో నిర్వహించిన సభలన్నీ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా నే రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నం కొంగరకొలాన్‌లో క నివిని ఎరుగని రీతీలో సెప్టెంబర్ 2 న ప్రగతి నివేదన సభ పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల నుంచి 30 లక్షల మందిని తరలించాలన్నది తెరాస అధిష్టాన నిర్ణయం. ఇందులో భాగంగానే మంత్రులు మొదలుకుని గ్రామ స్థాయి నాయకుని వరకు ఇప్పటికే జనసమీకరణకు కావాల్సిన కార్యచరణ రూపొందించడంతో పాటు ప్రజలను సభా ప్రాంగణానికి తరలించాల్సిన వాహనాల ఏర్పాటుపై దృష్టి సారించారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఔటర్‌రింగ్ రోడ్డుతో సహా రంగారెడ్డి జిల్లా మొత్తం జనసంద్రం కానుంది. అందుకే అత్యవసర పరిస్థితులైతే తప్ప ఆ రోజు ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

శరవేగంగా ఏర్పాట్లు
ప్రగతి నివేదన సభ నభూతో న భవిష్యత్ అన్న రీతీలో నిర్వహించేందుకు టీఆర్‌ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్య నాయకులంతా అక్కడే మకాం వేసి బహిరంగ సభ ఏర్పాట్ల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ కోసం 600 ఎకరాలు సభ కోసం, 1500 ఎకరాలు వాహనాల పార్కింగ్ కోసం వినియోగిస్తున్నామని నేతలు చెబుతున్నారు. నాలుగైదు రోజుల్లో పనులు పూర్తవుతాయని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే ప్రజల కోసం 200, 100, 60, 40 అడుగుల వెడల్పుతో 15 అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సభాప్రాంగణంలో 300 శౌచాలయాలతో పాటు తాగునీటి వసతి, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. సభ నిర్వహణకు ఎనమిది ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సభా ప్రాంగణ వేదిక నిర్మాణ పనులు చురుగ్గా సాగుతుండగా వర్షం పడినా ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకు ప్రత్యేక రేకుల షెడ్డులను నిర్మిస్తున్నారు. దాదాపు 200 జేసీబీలు, ఇటాచీలు, బుల్‌బోజర్లతో పనులు జెట్‌స్పీడ్‌తో జరుగుతున్నాయి. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు ప్రత్యేక కంట్రోల్ రూం సైతం ఏర్పరచుకుని బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.డిల్లీలో ఆట మొదలైంది..

Updated By ManamSun, 08/26/2018 - 00:28
 • రాష్ట్రంలో జాతర షురువైంది.. ముందస్తు సమరానికి ‘టిఆర్‌ఎస్’సై

 • యంత్రాంగంతో ‘సీఎం’ మంత్రాంగం.. అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికల ప్రకటనే  తథ్యం

 • సిట్టింగుల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు

కరీంనగర్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఆట మొదైలెంది. ఆటకు అధికార పార్టీ రంకేస్తోంది.  సమరానికి సై అంటోంది. జబ్బకు సంచి చేతిలో జండా..జాతరెల్లిపోదామా.. ఎన్నికల జాతర పోదామా..అంటూ  రాజకీయాన్ని రక్తికట్టిస్తోంది.  డిల్లిలో సిఎం కెసిఆర్ తిష్ట వేసి ఎన్నికల అధికారులు, కేంద్రం పెద్దలతో మంతనాలు చేపట్టటండతో ఇక తెలంగాణలో  రాజకీయ చదరంగం మొదైలెందని చెప్పొచ్చు.  తెలంగాణలో  ముందస్తు ఎన్నికలకు సిద్దమా.. అనే సందేహాలకు డిల్లీ యాత్రతో సిఎం తెరదించారు. ఇదివరకే  ముందస్తు సమరానికి సిద్దమయ్యేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమాలోచనలు చేపట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య సలహాదారులతో ప్రత్యేకంగా భేటి కావడమే ఇందుకు నిదర్శనం.   నియోజకవర్గాలుగా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికల ప్రకటన ఇక మిగిలింది.  తెలంగాణలో తాము చేపట్టిన  ప్రభుత్వం సంక్షేమ పతకాలు, వాటి అమలు తీరు.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రజల్లోకి ఎలా వెల్లాయి. ముందస్తుగా ఎన్నికలకు పోతే ప్రజలు ఎలా ఆదరిస్తారనే మీమాంస అధికార టిఆర్‌ఎస్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సిఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తాజా రాజకీయాల్లో తనైదెన శైలీలో సిఎం  వ్యూహరచన చేపట్టారు.  సిఎం కెసిఆర్ అత్యవసరంగా మంత్రులతో భేటి కావడంతో పలు ఊహాగానాలకు తెరతీసింది.
 

image


  ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ముందస్తు సూచనలు చేశారు. అభ్యర్థుల ఎంపిక.. ఎన్నికల ప్రకటనే ఇక మిగిలింది.  తాజా రాజకీయ సమీకరణాలతో  మంత్రులు, ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు తరుముకొస్తున్న వేళ  మూడు రోజుల క్రితమే మంత్రి కెటిఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు రాజీవ్ శర్మలు డిల్లీ బాట పట్టారు. సీఈసీలో మంతనాలు జరిపారు.  అంతకు ముందు రోజు సిఎం కెసిఆర్ గవర్నర్ నర్సింహాన్‌తో చర్యలు జరపడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.   ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో సగానికి  సగం సగం  చెక్ పేట్టే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.  ఇటీవల సిట్టింగ్‌లకే టిక్కెట్లు అని సిఎం కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సిఎం ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రజాదరణలేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదని ప్రకటిస్తే.. అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ ఎత్తుగడలో భాగంగా ఈ ప్రకటన చేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. లోపటి మనిషికి చూపకుండా జాగ్రత్త పడుతున్నారు.  
 
సిట్టింగుల్లో పరుగెడుతున్న రైళ్లు
సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ప్రజా విశ్వాసం లేని ఎమ్మెల్యేలకు చెక్ పెట్టే యోచనలో సిఎం ఉన్నట్లు సమాచారం. మీద మీద మీకే టిక్కెట్లు అని చెబుతున్నా.. మససులో మరో మాట ఉన్న తీరు సిఎం కెసిఆర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు.. వారికి తిరిగి టిక్కెట్ ఇస్తే గెలుస్తారా.. అనే విషయంపై సిఎం ఎవరికి అనుమానాలు రాకుండా సర్వే చేయించినట్లు ప్రచారం జోరందుకుంది. ఉస్మానియా విద్యార్థులచే గుట్టు చప్పుడుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వచ్చా.. లేదా అనే అంశంపై సర్వే చేయించినట్లు సమాచారం..

ఈ సర్వేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 13 నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలలో  సగానికి సగం మంది ఎమ్మెల్యేలకు ఓటమి తప్పదనే సంకేతాలు రావడంతో.. వారిని గుర్తించి ముందస్తుగా చెక్ పెట్టే పనిలో సిఎం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రమంతా ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  మరో పక్క  గెలుపు గుర్రాలకై ఇప్పటికే వేట మొదైలెంది.  తాజా రాజకీయ పరిణామాలతో సిట్టింగ్ మంత్రులు, ఎమ్మెల్యేలలో రైళ్లు పరుగెడుతున్నాయి.సీఎం కేసీఆర్‌కు ప్రజలే దేవుళ్ళు

Updated By ManamSun, 07/15/2018 - 01:56
 • మన కారు పుష్పక విమానం: ఎంపీ కవిత

imageహైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు ప్రజలే దేవుళ్లని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలందరికీ అందాలని ఆయన నిరంతరం ఆలోచిస్తారని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంచాలన్న సుమున్నత లక్ష్యం నిర్దేశించుకుని సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో పార్టీ నేతలు ఎవరైనా సరే చిన్న తప్పు చేసినా కేసీఆర్ క్షమించరని ఇందుకు తనకూ మినహాయింపు లేదని కవిత వివరించారు.

శనివారం నాడు ఆర్మూర్ మండల కేంద్రంలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. ఇతర పార్టీల నేతల చేరికలతో కారు ఓవర్ లోడ్ అయిందంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని చెప్పారు. టీఆర్‌ఎస్ కారు పుష్పక విమానం లాంటిదని.. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్ రెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు.టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి

Updated By ManamSat, 06/09/2018 - 20:05

MLC Damodhar reddy, TRS party, Harish rao, Nagam janardhan reddyహైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం దామోదర్‌ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. దామోదర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు కూడా టీఆర్‌ఎస్‌‌ పార్టీలో చేరారు. నాగర్‌కర్నూల్‌లో దామోదర్‌ రెడ్డికి మంచి పట్టు ఉంది. ఇటీవల నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని సైతం కలిసి నాగం చేరికపై తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. పార్టీ అధిష్ఠానం తన మాట పట్టించుకోలేదనే అసంతృప్తితో టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయానికి వచ్చారు.'దళితులకు భరోసా కల్పించే బాధ్యత కేంద్రానిదే'

Updated By ManamTue, 04/03/2018 - 16:59

Harish rao, Dalits attacks, TRS party, BJP, Congress, National partiesహైదరాబాద్: దేశవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. దేశంలో మూస రాజకీయాలు పోవాలని, గుణాత్మక మార్పు రావాలని ఆయన అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో దళితుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉందని చెప్పారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, బీహార్‌, యూపీ రాష్ట్రాల్లోనే ఎక్కువగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి రాష్ట్రాల్లో దళితులపై నమోదైన కేసులే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దళితులు తీవ్రమైన ఆవేదనతోనే రోడ్డెక్కారని, సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని జాతీయ పార్టీలు ఆలోచించడం లేదని విమర్శించారు. భారత్‌ బంద్‌ వరకు పరిస్థితి ఎందుకు వచ్చిందో.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి హరీశ్ రావు హితవు పలికారు. పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలంతా తిరిగొచ్చేస్తారా!?

Updated By ManamThu, 03/22/2018 - 14:55

Congress Jumped Mla's Discontent In TRS Party

హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలంతా మళ్లీ మాతృపార్టీలోకి వచ్చేస్తారా? అంటే దాదాపు అవుననే సమాధానాలే వస్తున్నాయి.! ఇందుకు కారణం అధికార పార్టీ మమ్మల్ని పట్టించుకోకపోవడమేనంటూ అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుంచి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిచిన భాస్కర్‌రావు ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు సైతం హస్తాన్ని వీడి.. గులాబీగూటికి చేరుకున్న సంగతి తెలిసిందే.

ఎమ్మెల్యే భాస్కర్‌రావు మాట్లాడుతూ...
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలను చిన్న చూపు చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిని చులకన చూస్తున్నందునే తమ నియోజక వర్గంలో బీటీ రోడ్ల పునరుద్దరణ జరపటంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భాస్కర్‌‌రావు ఒక్కరు నోరు విప్పడంతో మిగతా ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే నడిచారు. 

ముక్కు నేలకు రాస్తా..!
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లుగా తన నియోజకవర్గంలో బీటీ రోడ్లు పునరుద్ధరణ చేపట్టలేదని అలా కాదు పనులు జరిగినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సభలోని మిగతా ఎమ్మెల్యేలంతా ముక్కున వేలేసుకునేంత పనైంది. ఇదిలా ఉంటే వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌‌ తన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో వెనకబడిందని, బీటీ రోడ్ల పై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు

కాగా అసెంబ్లీ వేదికగానే అధికార పార్టీలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలు ఇలా అంటున్నారంటే.. మిగతా వారి పరిస్థితేంటి?.. మున్ముందు ఇంకా ఎంతమంది నోరు మెదుపుతారో వేచి చూడాల్సిందే మరి. వీళ్లంతా ఎన్నికల సమయానికి మళ్లీ పార్టీ మారతారా? అనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిరిగొస్తామనేది ఆలస్యం.. మరో క్షణమే మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పేందుకు ఆ పార్టీ పెద్దలు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related News