chandra babu naidu

మీ ఇష్టం తమ్ముళ్లూ..

Updated By ManamSun, 09/09/2018 - 00:16
 • పొత్తులపై స్థానిక నేతలదే అధికారమన్న చంద్రబాబు

 • పార్టీకి, ప్రజలకు లబ్ధి చేకూరేలా ముందుకు పోవాలని సూచన

 • పూర్తి సహకారమందిస్తానని టీడీపీ అధినేత వెల్లడి

Chandra Babuహైదరాబాద్: మూడున్నర దశాబ్దాలకుపైగా ఉప్పు, నిప్పులా ఉన్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఏకమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఉమ్మడి శత్రువు కేసీఆర్‌ను ఓడించేందుకు.. టీడీపీతో పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే ప్రకటి స్తుండగా, టీటీడీపీ నాయకులు సైతం అదే అభిలాషను తమ నాయకుడు చంద్రబాబు ఎదుట వెల్లడించారు. ప్రజ లకు, పార్టీకీ ఏది మంచైతే అదే నిర్ణయం తీసుకోండని తమ్ముళ్లకూ బాబు నిర్ణయాధికారం కట్టబెట్టారు. తెలంగాణ ప్రజలకు, పార్టీకీ లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకుని సమిష్టి గా ముందుకెళ్లాలని సూచించారు. ఎన్నికల్లో పోరాటానికి తన పూర్తి సహకారమందిస్తానని భరోసానిచ్చారు. శని వారం, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన టీటీడీపీ సర్వసభ్య సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షుని హోదాలో చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాలుగున్నరేండ్లలో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చిందని బాబు ప్రశ్నించారు. 2019లో రావాల్సిన ఎన్నికలు ఇప్పుడే రావడానికి గల కారణమేంటో ప్రజలు ఆలోచించాల న్నారు.  పార్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఎవరికీ ప్రయోజనముండదని హితవు పలికారు. తెలంగాణలో ఎన్నికలప్పుడొచ్చినా ఎదుర్కొనేం దుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు బాబు పిలుపునిచ్చారు. ప్రజల మనోభావాలకు అనుగు ణంగా ముందుకెళ్లాలన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండడం చారిత్రక అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయంతో అందరికీ సీట్లు రాకపోవచ్చుగానీ, పార్టీని నమ్ముకున్న వాళ్లందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా పోరాడండి
విభజన హామీలను అమల్జేయకుండా తెలు గు రాష్ట్రాలను మోసం చేసిన బీజేపీకి సహకరిం చడం న్యాయమో, అన్యాయమో తెలుగు ప్రజలు ఆలోచించాలని బాబు సూచించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు సమన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని విభజించాలని చెప్పానే తప్ప, తెలంగాణ విభజనను తానెప్పుడూ వ్యతిరేకిం చలేదన్నారు. తెలుగు జాతి ప్రయోజనాలకు కోసం నాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడా మని, అనంతరరం ప్రజాప్రయోజనార్థం బీజేపీ తో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. న్యాయం చేస్తారని నాలుగేండ్లు ఎదురు చూశామన్నారు. న్యాయం చేయకపోగా, అన్యాయం చేసేందుకు ఎన్డీఏ కుట్ర చేయడంతో పొత్తులు తెగదెంపులు చేసుకున్నామన్నారు. పార్లమెంటు సాక్షిగా తనకు, కేసీఆర్‌కు మధ్య తగాదా పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించారని ఆరోపించారు. ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల శంఖారావం
తెలుగుదేశం సర్వ సభ్య సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్నికల శంఖారావం మోగించాల్సిందిగా ఓ కార్యకర్త చంద్రబాబుకు శంఖువునందించారు. శంఖారావం పూరించాల్సిందిగా బాబు, రమణకు శంఖువు అందించబోయారు. రమణ సున్నితంగా నిరాకరిస్తూ బాబునే శంఖారావం పూరించాలని కోరారు. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహిస్తున్నందున రమణ పూరించడమే సబబుగా ఉంటుందని చెప్పిన బాబు, అందుకు ఆయన్ను ఒప్పించి చేతిలో శంఖువు పెట్టారు. అనంతరం రమణ ఆనందంగా శంఖువు ఊది ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు.  కేసీఆర్ బలవంతంగా టీడీపీ నాయకులను లాక్కున్నా, పార్టీ కేడర్ చెక్కుచెదరలేదన్నారు. టీడీపీ మద్దతు లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడదని ధీమా వ్యక్తంచేశారు. టీడీపీ ఆంధ్ర పార్టీ కాదని, అందరి పార్టీ అని రమణ పేర్కొన్నారు. కలిసి వచ్చే పార్టీలతో కలిసి పన్జేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ నాయకులు నామా నాగేశ్వర్‌రావు, దేవేందర్‌గౌడ్, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, నన్నూరి నర్సిరెడ్డి, బండ్రు శోభారాణి తదితరులు మాట్లాడారు.

పొత్తులపై సమాలోచన
ఇటీవల మరణించిన నందమూరి హరికృష్ణ దశదిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నా రు. అనంతర, టీటీడీపీ నేతలతో బాబు లేక్ వ్యూ అతిథి గృహంలో పొత్తులపై సమాలోచనలు చేశారు. వామపక్షాలు, కోదండరాం వైఖరిపై ఆరా తీశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని నాయకులు బాబుకు వివరించారు. నాయకులు వెళ్లినా, కేడర్ బలంగా ఉందని చెప్పారు. నియోజకవర్గాలవారీగా పార్టీకి వచ్చే ఓట్ల శాతాన్ని అంచనా వేసి బాబుకు నివేదించారు. అయితే, మరోసారి సమావేశమయ్యాక బాబు తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.వాజ్‌పేయి రాజకీయ భీష్ముడు

Updated By ManamThu, 09/06/2018 - 22:13
 • తెలుగువారంటే ఇష్టం, ఎన్టీఆర్‌కు సన్నిహితుడు

 • నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన నేత

 • కొనియాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

 • తొలి రోజు సభలో మాజీ ప్రధాని సంతాప తీర్మానం

chandrababuఅమరావతి: లోక్‌సభకు 11 సార్లు, రాజ్యసభకు  రెండు సార్లు ప్రాతినిధ్యం వహించి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలను శాసించిన మహానీయుడు అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ భీష్ముడిగా అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గురువారం వాజ్‌పేయి మృతికి సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. రాజకీయ నాయకులకు మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆదర్శమని, అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో మరొకరు లేరని ఆయన ప్రశంసించారు. భారతదేశం మంచి నాయకుడుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యేక వ్యక్తిగా, దేశ ప్రధానిగా అనేక సంస్కరణలు తెచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని సీఎం గుర్తుచేశారు. దేశ రాజకీయాలపై, సవుస్యలపై ఎంతో పరిజ్ఞానం కల్గిన వ్యక్తి అని చంద్రబాబు కొనియాడారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో వాజ్‌పేయి చాలా సన్నిహితంగా ఉండేవారని, రాష్ట్రంలో ఆగస్టు సంక్షోభం జరిగి ప్రజాస్వామ్యం అపహాస్యం చేసినప్పుడు ఆయన ఏపీకి వచ్చి ఆ ఘటనను తీవ్రంగా ఖండించారని గుర్తుచేశారు. వాజ్‌పేయికి తెలుగువారంటే అమితమైన ప్రేమ అని, తెలుగుదేశం పార్టీ నేతలతోనూ చాలా అభిమానంగా ఉండేవారని ఆయన చెప్పుకొచ్చారు. వాజ్‌పేయి ప్రధానిగా అధికారంలో ఉన్నప్పుడు తాను అనేక సార్లు ఆయనతో విభేదించానని, అయినా వాటిని ఏమీ పట్టించుకోకుండా పెద్దరికంగా వ్యవహరించేవారని సీఎం కొనియాడారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో విదేశాలను తలదన్నేలా జాతీయ రహదారులు వేయించారని, టెలీకమ్యూనికేషన్ రంగంలో పెనుమార్పులు జరిగాయని గుర్తుచేశారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మహానీయుడని, రాష్ట్రపతిగా వైునార్టీ నేత అబ్దుల్ కలాంను నిలబెట్టి మతసావురస్యాన్ని వాజ్‌పేయి కాపాడారని ప్రశంసించారు. పోక్రాన్ అణుపరీక్ష, కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్‌కు బస్సు యాత్ర  తదితర సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి వాజ్‌పేయి అని చంద్రబాబు కొనియాడారు. కాగా శాసనమండలిలో వాజ్‌పేయి మృతికి సంతాప తీర్మానాన్ని ఆర్థిక మంత్రి యనమల రావుకృష్ణుడు ప్రవేశపెట్టారు. 

పేదలకు మెరుగైన వైద్యం  
ఆరోగ్య ఉపకేంద్రాలను ఆధునీకరించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గురువారం నాడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటన్నింటిని నిర్మాణాలను దశల వారీగా ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు సాయంతో రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాలను అత్యాధునిక వైద్య పరికరాలు ఉండేలా చేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 13 జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. వాటిలో  ఫార్మాసిస్టు గ్రేడ్ 2- 329 ఖాళీలు, పారావెుడికల్ ఆఫ్తాల్మిక్ అధికారి- 10, స్టాప్ నర్స్‌లు 1497, ఎంపీహెచ్‌ఎ(ఎఫ్)- 1693, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2- 364, రేడియోగ్రాఫర్-71, ఎంపీహెచ్‌ఎ(ఎం)-2055 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా వైద్య అధికారుల నిర్లక్ష్యం వల్లే విశాఖ, విజయనగరంలో డెంగ్యూ వ్యాధి ప్రబలిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి డెంగ్యూ కేసును జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. పేదలకు వైద్య సహాయం చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు.

వీళ్లు మారరా..?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తమ పార్టీకి చెందిన పలువురు సభ్యులపై కోపం వచ్చింది. గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యే ముందు సచివాలయానికి సమీపంలోని వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 140 మంది సభ్యులు పాల్గొనాలని ముందురోజు చంద్రబాబు చెప్పారు. అయితే ఎన్టీఆర్ నివాళుల కార్యక్రమానికి 15 మంది మాత్రమే హాజరయ్యారు. మంత్రులు దేవినేని ఉమా,  అచ్చెన్నాయుడు, జవహర్, లోకేశ్‌తో పాటు ఎమ్మెల్యే చాంద్‌బాషా, యామిని బా, ఎమ్మెల్సీ కరణం బలరామ్ తదితరులు ఉన్నారు. తాను రమ్మని గట్టిగా చెప్పినా హాజరుకాకపోవడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. పదవులు వచ్చాక మాట వినడం లేదని మండిపడ్డారు. ఇలాగే వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం అనవసరమంటూ పెదవివిరిచారు. కొత్తవారైనా క్రమశిక్షణతో మెలిగేవారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. బుధవారం జరిగిన విసృ్తత స్థాయి సమావేశంలో ఇదే విషయమై చర్చించినా ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏమిటంటూ హాజరైన నేతలతో చంద్రబాబు చర్చించారు.‘పోలవరం’ పనులు స్పీడు పెంచండి

Updated By ManamMon, 09/03/2018 - 23:40
 • పునరావాస పనులు డిసెంబరుకు పూర్తికావాలి

 • అధికారులు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి ఆదేశం 

chandrababuఅమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగం పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, ఇంజనీర్లను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సోమవారం నాడు 73వ వర్చ్యువల్ సమీక్ష చేశారు. వర్షాల కారణంగా గత వారం జరిగిన పోలవరం ప్రాజెక్టు పనుల జాప్యాన్ని ఈ వారం పూరించి వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. స్పిల్ వే పనులు 87 వేల క్యూబిక్ మీటర్లు జరిగిందని, జెట్ గ్రౌటింగ్ పనులు 52.5 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. లక్ష్యాలను చేరుకోవాలని సీఎం సూచించారు. పునరావాస పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని, ప్రాజెక్టు కన్నా ఇదే ముందు పూర్తి కావాలన్నారు. 10వ తేదీ కల్లా గేలరీ వాకింగ్ పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు, ఏ రోజైన దానిని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్‌సి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

అవార్డులు ప్రగతికి చిహ్నం 
అవార్డులు ప్రభుత్వం సాధించిన ప్రగతికి నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి 2016-17లో రాష్ట్రానికి 5 అవార్డులు వచ్చాయని, 2017-18లో 10అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది 20 అవార్డులు సాధించాలని అధికారులకు సూచించారు. మన రాష్ట్రానికి వివిధ విభాగాల్లో 10 అవార్డులు రావడం గర్వకారణం అని, ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికీ అభినందనలు అని ముఖ్యమంత్రి చెప్పారు.

మూడు ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం..
రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాభావం నెలకొందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.  నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీశైలంలో 7టిఎంసిలు, నాగార్జున సాగర్‌లో 7టిఎంసీలు, పులిచింతలలో 29టిఎంసిల నీరు చేరాల్సివుందన్నారు. మూడు రిజర్వాయర్లకు ఇంకా 43 టిఎంసిలు రావాలన్నారు. 40 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు పుష్ చేస్తున్నామని తెలిపారు. వర్షంతో సంబంధం లేకుండా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం 33లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు తీసుకెళ్లాలన్నారు. కరువు మండలాల్లో నరేగా పనులను ముమ్మరం చేయాలన్నారు. సరైన ధరకు రైతుల వద్ద ఉల్లిని కొనుగోలు చేయాలన్నారు. విజయనగరాన్ని వీడని జ్వరాలు

Updated By ManamMon, 09/03/2018 - 23:40
 • 80కి పైగా డెంగ్యూ కేసులు, 50 మంది మృతి

 • సీఎం హెచ్చరించినా కదలని యంత్రాంగం    

 • ముఖ్యమంత్రి పోర్టుపోలియో కావడంతో.. పట్టనట్టు వ్యవహారిస్తున్న జిల్లా మంత్రులు! 

chandrababuవిజయనగరం: విజయనగరం జిల్లా ప్రజలను విష జ్వరాలు పట్టిపీడిస్తున్నాయి. సీజన్ ప్రారంభమైన తర్వాత జిల్లాలో ఆగస్టు 25 నాటికి 2,22,354 మంది జ్వరాల బారిన పడ్డారు. ఇందులో 294 మలేరియా కేసులు కాగా, 81 డెంగ్యూ కేసులున్నాయని వైద్య,ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే వాస్తవంలో మాత్రం పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామాల్లోని చిన్న చిన్న ఆస్పత్రుల నుంచి పట్టణంలోని కార్పోరేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్‌లు కూడా దొరకని పరిస్థితి ఉంది. జిల్లా 81 డెంగ్యూ కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరే మరణించారని అధికారులు చెబుతన్నారు. నిజానికి డెంగ్యూ, ఇతర విష జ్వరాల బారిన పడి మరణించిన వారి సంఖ్య 50కి పైగా ఉంటుంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు చేసుకొని, అటు తర్వాత చనిపోయిన వారిని అధికారిక లెక్కల్లోకి తీసుకోబోమంటూ డీఎంహెచ్ విజయలక్ష్మి తెలిపారు. దీని ప్రకారం ప్రభుత్వ గణాంకాలకు వాస్తవానికి చాలా తేడా ఉందని స్పష్టమవుతుంది. సాలూరు మండలం ఖరాస వలసలో 20 రోజుల్లో పది మంది విష జ్వరాలు, వివిధ రకాల వ్యాధులతో మరణించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపై స్పందించారు. జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. సోమవారం నాటికి జ్వరాలు నియంత్రణలోకి రాకపోతే తానే స్వయంగా పర్యటిస్తానని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. దీంతో జిల్లా యంత్రాంగం ఆదివారం మరోసారి ఖరాసవలసకు పరుగులు తీసింది. గ్రామంలోని పరిస్థితిని ఆరా తీసింది. మరో పది మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నట్టు గమనించారు. వారిని విశాఖ, విజయనగరం, సాలూరు ఆసుపత్రులకు తరలించారు.

chandrababu

పట్టనట్టు వ్యవహరిస్తున్న మంత్రులు.. 
జిల్లాలో ఇంత జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు మాత్రం పెద్దగా స్పందించడం లేదు. జిల్లా నేత, రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఇప్పటివరకు  ఖరాసువలస వైపు కన్నెత్తి చూడలేదు. జిల్లాలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపిన సుజయ్‌కృష్ణ జ్వరాల విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. మరోపక్క జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా జిల్లాలో ప్రబలిన జ్వరాలపై ఇప్పటివరకు కనీసం స్పందించలేదు. వీరి తీరు పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరు మంత్రులు వర్షాకాలం సీజన్ మొదలైన తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్నా గంటా, విశాఖ నుంచే పని మొత్తం కానిస్తున్నారు. ఒకటి, అరా కార్యక్రమాలలో పాల్గొనడానికి మంత్రి గంటా జిల్లాకు వచ్చారు. ఆ తర్వాత జిల్లా పాలనపై, పరిస్థితులపై ఒక్కసారి కూడా సమీక్షలు చేయలేదు. టీడీపీకి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న ఎంపీ అశోక్‌గజపతిరాజుతో మంత్రి గంటాకు సఖ్యత లేకపోవడం వల్లే గంటా జిల్లా వ్యవహారాలపై పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

సీఎం పోర్టుపోలియో కావడం వల్లే..
కామినేని శ్రీనివాస్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత ఆ శాఖను ప్రభుత్వం ఎవ్వరికీ కేటాయించలేదు. వైద్య, ఆరోగ్య శాఖ ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆధీనంలోనే ఉంది. శాఖ సీఎం పరిధిలో ఉన్నందువల్ల సమీక్షలు చేయాలన్నా, ఆ శాఖ అధికారులతో చర్చించాలన్నా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వెనకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. విజయనగరంతో పాటు విశాఖ జిల్లాలోను పెద్ద ఎత్తున జ్వరాలు ప్రబలుతున్నా, ప్రజల ప్రాణాలో పోతున్నా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ కనీసం ప్రకటనలు కూడా చేయలేకపోవడానికే ఇదే ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు.విశాఖలో సబ్‌మెరైన్ మ్యూజియం

Updated By ManamSat, 08/25/2018 - 06:31
 • నగరానికి ప్రత్యేక ఆకర్షణ కావాలి

 • వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించండి

 • పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: చంద్రబాబు

 • ప్రత్యేక తపాలా బిళ్లలు ఆవిష్కరించిన సీఎం

babuఅమరావతి: పారిస్‌కు ఈఫిల్ టవర్‌లా, ఆగ్రాకు తాజ్‌మహల్‌లా, విశాఖకు సబ్‌మైరెన్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. శుక్రవారం తన కార్యాలయంలో టూరిజం ప్రమోషన్ బోర్డ్ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో సబ్‌మైరెన్ మ్యూజియం ఏర్పాటుపై ముఖ్యమంత్రి చర్చించారు. మాస్టర్ ప్లాన్ వెంటనే రూపొందించాలని ఆదేశించారు. అటు వినోదం ఇటు విజ్ఞానాభివృద్ధికి ఈ మ్యూజియం దోహదపడాలన్నారు. ఈ మ్యూజియం ద్వారా ప్రజల్లో ఆసక్తి పెంపుతో పాటు దేశభక్తి పెరుగుతుందని.. ప్రపంచ నౌకాబలం, భారత నౌకాబలం పరిణామక్రమం ఆసక్తికరం ఉంటుందన్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్, మ్యూజియం భవనాల నిర్మాణంలో ఆధునికత ఉట్టిపడాలని సూచించారు. అదే విధంగా ఆతిథ్యం పర్యాటకానికి అతిముఖ్యమని సూచించారు. అతిథుల అభిమానం పొందడంలోనే పర్యాటకాభివృద్ధి సాధ్యమన్నారు. పర్యాటకుల సందర్శనపైనే మన శాఖ ఆధారపడి ఉందనేది గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాలలో స్కై స్కూల్ యాక్టివిటీస్ ప్రోత్సహించాలన్నారు. కళింగపట్నం పర్యాటకాభివృద్ది చేయాలన్నారు. ప్రకాశం బ్యారేజి ఎగువన వైకుంఠపురం ఎత్తిపోతల పథకం, దిగువన చోడవరం ఎత్తిపోతల పథకం పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్ ఫ్రంట్ ఆసాంతం అద్భుతంగా ఉంటుందన్నారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు నుంచి 50 కి.మీ. వాటర్ ఫ్రంట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. కనిష్ఠ పెట్టుబడి, గరిష్ఠ భాగస్వామ్యం లక్ష్యంగా టూరిజం అభివృద్ధికి కషి చేయాలన్నారు. ‘‘అంతర్జాతీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ సందర్శనకు ఆసక్తి చూపేలా చర్యలు తీసుకోవాలి. పర్యాటకుల భద్రత, రక్షణ పకడ్బందీగా ఉండాలి. అక్కడక్కడ పర్యాటకులపై దాడులు, దొంగతనాల వంటి కథనాలు మీడియాలో చూస్తున్నాం. అటువంటి నేరాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలి. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాలలో నిఘా ముమ్మరం చేయాలి. కోటప్ప కొండ వద్ద పర్యాటకం బాగా అభివృద్ధి చేశారు, అలాగే యారాడ కొండలను కూడా మరింత సుందరంగా తీర్చిదిద్దాలి’’ అని చంద్రబాబు సూచించారు. విజన్ ఇస్తున్నా, పాలసీ ఇస్తున్నా, అయినా మందకొడిగా ఉండటం సరికాదని సీఎం హెచ్చరించారు. టూరిజం యాక్టివిటీస్ వేగవంతం చేయాలన్నారు. ఏపీ పర్యాటకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేశారు. రాష్ట్రంలో 12 పర్యాటక స్థలాలపై రూపొందించిన తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఏపి పర్యాటకంలో తపాలా శాఖ భాగస్వామ్యం కావడం సంతోషంగా పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్న ఏపీ పర్యాటకం నెం 1 స్థానానికి చేరాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి అఖిల ప్రియ, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, హిమాంశు శుక్లా, పట్టణాభివద్ధి శాఖ కార్యదర్శి కరికాల వలవన్, సీఎంవో కార్యదర్శులు గిరిజా శంకర్, రాజమౌళి, జస్వంత్ కుమార్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.రూ. 600 కోట్ల నష్టం

Updated By ManamThu, 08/23/2018 - 01:51
 • వరదలతో ఉభయ గోదావరుల్లో అల్లకల్లోలం.. మునిగిన వరిచేలకు హెక్టారుకు రూ. 25వేలు

 • కూలిపోయిన ఇళ్లకు రూ. 2 లక్షల పరిహారం.. రోడ్ల మరమ్మతులకు రూ. 35 కోట్లు మంజూరు

 • 6,400 హెక్టార్లలో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు.. 195 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

 • ఎర్రకాలువ వరదతో పశ్చిమకు తీవ్ర నష్టం.. ఏరియల్ సర్వే అనంతరం సీఎం చంద్రబాబు

aerial-surveyరాజమహేంద్రవరం: భారీ వర్షాలు.. వరదల వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు రూ. 600 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం ఆయన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరద  ముంపునకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌లో పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరద ముంపునకు గురైన వరి చేలకు హెక్టారుకు రూ. 25 వేల చొప్పున పరిహారంగా ఇచ్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. వరదల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రైతులను అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 6,400 హెక్టార్ల పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనాలలో తెలిసిందని అన్నారు. 195గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని, మరిన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయని చెప్పారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాలువ పొంగి, 80 వేల క్యూసెక్కుల నీళ్లు రావడమే అక్కడి నష్టానికి ప్రధాన కారణమని సీఎం తెలిపారు. ఎర్రకాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తగు చర్యలు తీసుకుంటావున్నారు. మూడు నాలుగు రోజులుగా గోదావరి వరదనీరు ఎక్కువగా వస్తోందని అన్నారు. బాగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 లక్షల వరకు పరిహారం అందించే యోచనలో ఉన్నామని.. ఈ విషయంలో అధికారులు సర్వే ద్వారా నిర్ణయాలు తీసుకుంటారని ఆయన చెప్పారు. రోడ్ల మరమ్మతులకు రూ. 35 కోట్లు మంజూరు చేశామన్నారు. లంక గ్రామాల ప్రజలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏటిగట్లను పటిష్ఠం చేసేందుకు అన్ని విధాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. లంక గ్రామాల ప్రజలకు భద్రత గురించి ఆందోళన ఉందని, అలాగే కూరగాయలు పండించే రైతులు కూడా వరదల్లో నష్టపోయినందున వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా 2019 మే నాటికి నీరు విడుదల చేసేందుకు నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో జరగవలసిన పనులు సాధ్యమైనంత వరకు పూర్తిచేస్తామన్నారు. నదులను అనుసంధానం చేయడం ద్వారా లక్షలాది ఎక రాలకు సాగునీరు, తాగునీరు అందిస్తామన్నారు.

ఎప్పటికప్పుడు పోలవరం పనులు స్వయంగా పరిశీలిం చడంతో పాటు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చిస్తున్నామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా 2019 నాటికి కనిగిరి తదితర  ప్రాంతాలకు నీరు ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు. వరదలు వచ్చినపుడు గోదావరి నీరు సముద్రంలో కలుస్తుందని, అలా కాకుండా వాటిని నిల్వచేయడానికి కొత్త నిర్మాణాల గురించి ఆలోచిస్తామని సీఎం చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూక్ష్మ సేద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. 34 ఎకరాలు ఈ తరహా సేద్యంలో ఉండగా, దాన్ని కోటి ఎకరాలకు పెంచేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా కార్తికేయ మిశ్రా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో వరదల సమయంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను వివరించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. గర్భిణులను ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి ఆహారం, మందులు ఇస్తామన్నారు. ఎర్రకాలువలోని నీరు అత్యంత వేగంగా పెరిగి నష్టం వాటిల్లిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ అన్నారు. వరద బాధితులను శిబిరాలలో చేర్చి వారికి నాణ్యపరమైన ఆహారంతోపాటు వైద్యసదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, జవహార్, మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.భారీగా తరలిరావాలి

Updated By ManamSun, 08/19/2018 - 00:55
 • ఈ నెల 28న గుంటూరులో వైునార్టీ సభ

 • వైునార్టీల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి

 • వారి జీవన ప్రమాణాల్లో ఎంతో మార్పు వచ్చింది

 • టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్

chandrababuఅమరావతి: ‘‘నారా హమారా టీడీపీ హమారా’’ నినాదంతో ఈ నెల 28వ తేదీన గుంటూరులో జరిగే మైనార్టీ సభకు మైనార్టీ సోదర సోదరీమణులు ఉత్సాహంగా పాల్గొనేలా జిల్లాల్లో పార్టీ నాయకులు కృషి చేయాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. శనివారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ నేతలు, పార్టీ ముఖ్యులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైునార్టీల జీవన ప్రమాణాల్లో ఎంతో మార్పు తెచ్చింద న్నారు. మైనార్టీల అభ్యున్నతికి, పేదరిక నిర్మూనలకు నిరుద్యోగాన్ని రూపు మాపేందుకు ప్రభుత్వం నాలుగేళ్లుగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు రూ.200 కోట్లు ఉన్న మైనార్టీ బడ్జెట్ ప్రస్తుతం రూ.1000 కోట్లకు పైగా పెంచామన్నారు. మైనార్టీల్లో పెళ్లి చేసుకున్నవారికి ఇచ్చే దుల్హన్ పథకం, రంజాన్ తోఫా వంటి పథకాల వల్ల మైనార్టీలకు, టీడీపీ ప్రభుత్వం అండగా నిలుస్తుందనే ధైర్యం నింపగలిగామని పేర్కొన్నారు. విజయవాడ, కడపల్లో హజ్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. పేదరికంలో మగ్గుతున్న ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో పెద్ద మొత్తాన్ని స్కాలర్‌షిప్స్, ఫీజ్ రీయింబర్స్‌మెంట్ల కోసం కేటాయిస్తోందని చెప్పుకొచ్చారు. మక్కా దర్శించుకునే హజ్ యాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక చొరవ చూపుతున్నామన్నారు. మేనిఫెస్టోలో హామీ మేరకు ఇమామ్‌కు రూ.5,000, మౌజన్‌లకు రూ. 3,000 గౌరవవేతనం ప్రకటించి వారిని సముచితంగా గౌరవించామని చంద్రబాబు పేర్కొన్నారు.

సుప్రీంకు మెడికల్ సీట్ల వివాదం
మెడికల్ కాలేజీలలో సీట్ల ఎంపికలో రిజర్వేషన్ అభ్యర్థులకు స్వేచ్ఛ చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీల్లో సీట్ల ఎంపిక రిజర్వేషన్ అభ్యర్థుల నిర్ణయానికి వదిలేయాలని 2001లో ఇచ్చిన జీవో 550 అమలుకు ఎదురైన ఇబ్బందులపై చర్చించారు. మెడికల్ కాలేజీల ఎంపికలో స్వేచ్ఛను రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు నష్టదాయకంగా పరిణమిస్తోందని రిజర్వేషన్ అభ్యర్థులు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి ఈ అంశాలను సంబంధిత అధికారులతో సమగ్రంగా చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని అధికారులకు సీఎం సూచించారు.  జీవో 550 ప్రకారం గతంలో రిజర్వేషన్ అభ్యర్థులకున్న అనుకూల పరిస్థితులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం, ప్రభుత్వం తరఫున రెండు పిటిషన్లను వేర్వేరుగా సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. ఈ నెల 30 లోపు మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ నేపధ్యంలో సుప్రీం కోర్టులో సమగ్రంగా వాదించి రిజర్వుడు విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ప్రయత్నాలు సాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.మృదుస్వర మంజరి ఆ మురళి

Updated By ManamFri, 08/10/2018 - 02:54

chandrababuస్వరాన్ని సంగీతంలో తడిపి, శ్రావ్వమైన పద్ధతిలో చేసేదే గానం. ఆ గానానికి ప్రాణం పోసి శాస్త్రీయ సంగీతాన్ని నలుదిక్కులా వ్యాప్తి చేయాలనే  తన గురువుల స్ఫూర్తితో  ముందుకు సాగుతున్న స్వర ఝరి. స్వరాలను, సరాలను తన గానంలో మేళవించి ప్రదర్శించే తీరు అనితర సాధ్యం. ఓ స్థాయి గుర్తింపు వచ్చాకా సినీరంగం వైపు అడుగులు వేసే తోటి గాయకులకు ఆమె కాస్త భిన్నం. సినీ గానంలో సాహిత్యానికి ప్రాధాన్యత ఉంటేనే ఆలపిస్తాను అంటున్న స్వర మంజరి మృదురవళి. సంగీతానికి అవధులు లేవు. సరిహద్దులను చెరిపేసే సంగీతానికి అందరూ బంధువులే. త్యాగరాజ కీర్తనలు, అన్నమయ్య సంకీర్తనలు, లలిత గీతాలు అన్నీ ఆమె గొంతులో ఒదిగి మెరిసాయి. అటు చదువును, ఇటు సంగీతాన్ని రెండింటి కీ సమయాన్ని కేటాయిస్తూ దూసుకుపోతున్న స్వరఝరి మృదురవళితో మిసిమి ముచ్చట్లు... తను సాధించిన విజయశిఖరాలకు నాంది చిన్నతనంలోనే పడింది అంటుంది రవళి. గానం, వీణా వాయిద్యం ఇలా తను అనుకున్న రంగాలలో విజయాలకు అక్క  హరిణి కూడా సింగరే కావడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. హరిణితో కలిసి దర్భా సిస్టర్స్ గా చాలా సంగీత కచేరీలు చేసారు. ఎపీ డిపార్ట్ మెంట్ ఆఫ్ కల్చరల్ కి రవళి సింగర్‌గా ఎంపికయ్యారు. ప్రభుత్వం తరపున జరిగే ప్రతి కార్యక్రమం ముందుగా రవళి పాటతోనే ప్రారంభం 
అవుతుంది. 

సొంత ఊరు....
పుట్టింది, పెరిగిందీ అంతా విజయవాడే. అమ్మ శ్రావణి, నాన్న ఫణీంద్ర. ఇద్దరం అమ్మాయిలమే అయినా మా ఇష్టాలని గౌరవించారు. మా సంగీత కచేరీలకు, పాటల కాంపిటీషన్స్ కు నాన్నగారు అమ్మా దగ్గరుండి తీసుకెళ్ళేవారు. 

సంగీతానికి గురువులు.., 
మాకు సంగీతం వారసత్వంగా వచ్చిందనుకుంటాను. నాయనమ్మ దశిక పార్వతి. ఆమె మంగళంపల్లి బాలమురళీకృష్ణగారికి సమకాలికురాలు. వారికి గట్టి పోటీ ఇచ్చేదట. నా మూడవ యేటనే  బాల మురళీకృష్ణగారి ఒడిలో కూర్చుని పాడాను. అంపోలు మురళీకృష్ణగారి దగ్గర సంగీతాన్ని అభ్యసించాను. ఇప్పుడు చెన్నైలో శ్రీమతి సవితా నర  సింహంగారి దగ్గరకు వెళ్ళి నేర్చుకుంటున్నాను. వీరే నా గురువులు.

చదువు, కచేరేలు..
 టెన్త్ , ఇంటర్ లో స్టేట్ లెవల్ లో ర్యాంక్ సాధించాను. ఎమ్. బి. ఏ, చేసాను. సంగీతంలో ఎమ్. ఏ మ్యూజిక్,  చేసాను. అలాగే మ్యూజిక్ లో పి.ఎచ్.డి  ప్రయత్నాలలో ఉన్నాను. నా మొదటి కచేరీ నా తొమ్మిదవ యేటనే ఇచ్చాను. ఇప్పటికి చాలా కచేరీలు చేసాను. అన్నమాచార్య ఉత్సవాలకు చాలా ఏళ్ళుగా పాడుతున్నాను.

ఇప్పటి తరానికి మీరు చెప్పే మాట....
చదువు కావాలి గానీ చదువే అన్నీ కాకూడదు. నేటి యువతకు చదువే అన్నీ అయిపోతుంది. ఆటలు, పాటలకు వారికి సమయమే ఉండదు. తల్లితండ్రులు కూడా చదువుకు ఇస్తున్న ప్రాధాన్యత సంగీతానికి, ఆటలకూ ఇవ్వడంలేదు. చదువు కాకుండా మిగతా వ్యాపకాలు ఉండాలి. సంగీతం ఒత్తిడిని దూరం చేస్తుంది. దీనివలన చదువులో ఒత్తిడిని అధిగమించవచ్చు. తల్లితండ్రులు అటుగా తమ పిల్లలను ప్రోత్సహించాలి.

అవార్డులు.. రివార్డులు...
ఆలిండియా రేడియో, దూరదర్శన్ బిగ్రేడ్ ఆర్టిస్ట్ గా ఉన్నాను.  సెంట్రల్  గవర్నమెంట్  కాలర్షిప్ హోల్డర్ ని. అలాగే నేషనల్ యూత్ ఫెస్టివల్ లో అన్ని స్టేట్స్ మీద  ఏపీ తరపున మొదటి బహుమతి గెలిచాను. ఆలిండియా రేడియోవారు నేషనల్ లెవల్ లో నిర్వహించిన కాంపిటీషన్ లో డియోషనల్ కేటగిరిలో  మూడవ బహుమతి వచ్చింది. షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్

Updated By ManamWed, 08/08/2018 - 22:47
 • ముఖ్యమైన నగరాల సరసన విజయవాడ

 • అందుబాటులోకి 15 ఎలక్ట్రిక్ ఈ2వో ప్లస్

 • వాహనాలను ప్రారంభించిన చంద్రబాబు 

 • మహీంద్రా, జూమ్‌కార్ ఈవీ సేవలు.. ఏపీ టూరిజం సహకారంతో ప్రారంభం

babuవిజయవాడ: న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పుణె, వైుసూర్, హైదరాబాద్, జైపూర్ తర్వాత విజయవాడ షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో మహీంద్రా ఎలెక్ట్రిక్, జూమ్‌కార్ తమ వినూత్నమైన ఈవీ సేవలను షేర్డ్ మొబిలిటీ సొల్యూషన్‌గా విజయవాడలో విస్తరించింది. జూమ్‌కార్ ఫ్లాట్‌ఫామ్‌పై 15 స్వచ్ఛమైన ఎలక్ట్రిక్ మహీంద్రా ఈ2వో ప్లస్ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. బుధవారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ జయరామిరెడ్డి, పర్యాటక-సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి, చైర్మన్ ముకేష్ కుమార్ మీనా, ఏపీటీడీసీ ఎండీ హిమాంశు శుక్లా, జూమ్‌కార్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ మోరాన్ తదితరులు పాల్గొన్నారు. 2030 ప్రభుత్వ విజన్‌పై నీతి ఆయోగ్ సూచలనకనుగుణంగా అనుసంధానిత, షేర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ నమూనాను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో విజయవాడ ముఖ్యమైన నగరాల్లో ఒకటి కావడం, దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన వ్యాపార కూడలి కావడంతో విజయవాడను ఎంపిక చేశారు. జూమ్‌కార్ ఫ్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్ ఈ2వో ప్లస్ వాహనాలు  అద్దెకు అందుబాటులో ఉంటాయి. గ్రెగ్ మోరాన్ మాట్లాడుతూ.. ‘‘మహీంద్రా ఎలక్ట్రిక్ భాగస్వామ్యంతో విజయవాడ ప్రజలకు సృజనాత్మకత, గ్రీన్ మొబిలిటీ పరిష్కారాలను అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. 15 ఈవీలకు తోడు ఏపీ ప్రభుత్వ లక్ష్యమైన క్లీన్, గ్రీన్ ఇండియాకు అనుగుణంగా ఏర్పాటు చేసిన వేగవంతమైన చార్జింగ్ సదుపాయాలను కూడా ప్రారంభిస్తున్నాం’’ అని అన్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈవో మహేశ్ బాబు మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అగ్రగామి అయిన మహీంద్రా ఎలక్ట్రిక్ పలు కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఈవీ టెక్నాలజీని ఎక్కువ మంది స్వీకరిచేందుకు భరోసా కల్పిస్తున్నాం. జూమ్‌కార్‌తో భాగస్వామ్యం విస్తరించుకుంటూ ఎలక్ట్రిక్ షేర్డ్ మొబిలిటీ పరిష్కారాలను విజయవాడ వాసులకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు.రాష్ట్రపతిని కలవండి 

Updated By ManamMon, 08/06/2018 - 22:56
 • కేంద్రం చేసిన అన్యాయం ఆయనకు తెలియాలి

 • ఈ వారం కీలకం, పోరాటం ముమ్మరం చేయాలి

 • ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం

cm babuఅమరావతి: పార్లమెంట్ సమావేశాలు ముగిసే ముందు రోజు టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలోని 5కోట్ల ప్రజల హక్కులను కేంద్రం కాలరాశిన అంశాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. ఎప్పటికప్పుడు ఫ్లోర్ లీడర్లతో సంప్రదిం పులు జరిపి, అన్ని పార్టీల సహకారం తీసుకోవాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అటు సభలోనూ, క్షేత్రస్థాయిలో పోరాటం ముమ్మరం చేయాలని సూచిం చారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలోని ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలు చివరి వారానికి చేరాయని, ఈ వారం రోజులు పోరాటంలో కీలకమని, ఎంపీలు పోరాటాన్ని ముమ్మరం చేయాలని. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇదే స్ఫూర్తితో పోరాడాలని, విశాఖ రైల్వే జోన్‌పై ఉత్తరాంధ్ర ఎంపీలు పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. కడప స్టీల్ పై రాయలసీమ ఎంపీలు పోరాడాలని, ఉక్కు సంకల్పంతో కడప ఉక్కును సాధించాలని, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350కోట్లు వెనక్కి తీసుకోవడంపై నిలదీయాలని కోరారు. ఖాతాలో వేసిన నిధులు వెనక్కి తీసుకోవడం చాలా తీవ్రమైన అంశమని, దీనిపై సభలో తీవ్రంగా ప్రతిఘటించాలన్నారు. అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు నెరవేరేలా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదే అని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Related News