high court

జగన్ కేసులో చంద్రబాబుకు నోటీసులు

Updated By ManamTue, 11/13/2018 - 14:05

YS Jagan Attack case: High court issues notice to chandrababu naiduహైదరాబాద్ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో హైకోర్టు ఎనిమిదిమందికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ డీజీపీ ఠాకూర్, తెలంగాణ డీజీపీ సహా ఎనిమిది మంది నోటీసులు అందుకున్నారు. 

ఇందుకు సంబంధించి రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దాదాపు గంటన్నర పాటు కోర్టులో వాదనలు జరిగాయి. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తేనే... వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. మరోవైపు సిట్ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని హైకోర్టు సూచించింది.జనవరి 1న ఏపీలో హైకోర్టు ప్రారంభం

Updated By ManamMon, 11/05/2018 - 14:15
  • హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు పలు సూచనలు

Separate High Courts for Andhra pradesh from January 1st

న్యూఢిల్లీ :  అతి త్వరలో రెండు తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు కార్యకలాపాలు కొనసాగుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు విభజనపై ఉన్నత న్యాయస్థానం సోమవారం పలు సూచనలు చేసింది. వచ్చే ఏడాది జనవరి 1న ఆంధ్రప్రదేశ్ రాజధానిలో హైకోర్టు ప్రారంభం అవుతుందని న్యాయస్థానం వెల్లడించింది. నిర్మాణం కొనసాగుతున్నందున అప్పటివరకూ అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.  అలాగే అప్పటివరకూ జడ్జీల నివాసం కూడా అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

కాగా డిసెంబరు 15వ తేదీకల్లా హైకోర్టు అవసరాల నిమిత్తం తాత్కాలిక భవనాలను నిర్మిస్తున్నామని  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించి ఏపీ సర్కార్ ఇచ్చిన అఫిడవిట్‌పై సుప్రీంకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు జడ్జీలు కూడా సుముఖంగా ఉన్నారని న్యాయస్థానం పేర్కొంది.
 కాలుష్య నియంత్రణకు ‘సుప్రీం’ ముందడుగు..! 

Updated By ManamSat, 11/03/2018 - 02:31

courtమనదేశంలో వాతావరణ కాలుష్యం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. ఈ కాలుష్యం మానవమనుగడనే ప్రశ్నార్ధకంగా మారుస్తోంది. దీనిని నియంత్రించడానికే దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకున్నది. దీపావళి పండుగనాడు కేవలం రెండుగంటలే టపాసులు కాల్చుకునేం దుకు అనుమతినిచ్చింది. అదేవిధంగా పర్యావరణానికి నష్టం కలిగించే వాటిని నిషేధించింది. కేవలం పర్యావర ణానికి తక్కువ కాలుష్యాన్ని కలిగించే టపాసులను మాత్రమే కాల్చాలని నిబంధన తీసుకువచ్చింది. వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు టపాసులపై దేశవ్యాప్తంగా నిషేధించాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అశోక్ భూషణ్, ఎకె సిక్రిలతో కూడిన ధర్మాసనం వాదనలు, ప్రతివాదనలు విన్న అనంతరం ఈ తీర్పు వెలువరించింది. అయితే అదే సమయంలో టపాసులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకమైన ఆదేశాలిచ్చింది. కాలుష్య మేఘాలు అంత కంతకూ కమ్ముకోవడం మూలాన ఆందోళన కలిగిస్తోంది. పట్టణాల పరిస్థితి రోజురోజుకూ అత్యంత దారుణంగా తయారవుతోంది. గ్రామాల నుండి పట్టణాలకు వలసలు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తీవ్రం అవుతోంది. ప్రపంచ మొత్తం జనాభాలో సగం జనాభా నగరాలలోనే నివసిస్తుందని ప్రాథమిక సర్వేలు చెబుతున్నాయి. గడిచిన ఏడాది దీపావళి తెల్లారి రోజునా నమోదైన వాయువు అంచనా నాలుగు వందలకు మించడం, నాలుగు వందల తొంబైకి చేరడం ప్రమాద ఘంటికలు మోగించింది. ఆ పొగకు వాహనాలు కూడా సరిగా తిరగలేని పరిస్థితి ఢిల్లీలో నెలకొంది. ముఖ్యంగా దీపావళి పండుగ తరువాత పరిస్థితి దేశంలోనే అనేకనేక నగరాల్లో వాయుకాలుష్యం ఆందోళన కలిగించే పరిస్థితికి నెలకొంది. అప్పుడు దట్టంగా అలుముకున్న వాయుకాలుష్యం నగరజీవి ఊపిరితిత్తులకు తూట్లుపొడస్తుందని ఆ సర్వేలో బయటపడింది. పారిశ్రామిక కాలుష్యం బెంగళూరు నగరంలో భారీస్థాయిలో ఉన్నట్లు, వాయు కాలుష్యంలో హైదరాబాద్ ఉన్నట్లు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాదులో ప్రస్తుతం జరుగు తున్న నిర్మాణరంగం నుంచి వెలువడుతున్న దుమ్ము ధూళి వల్ల భాగ్యనగర వాసులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాయు కాలుష్యంతో మృత్యువాత పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ రకంగా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ కాలుష్య భూతాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయాలి. ఇటీవలె సుప్రీంకోర్టు ఇచ్చిన రెండు గంటల నిబంధనలను తూచ తప్పకుండా పాటించినట్లయితే బాగుంటుంది. అదేవిధంగా వాతావరణ కాలుష్యంపై అటు ప్రభుత్వాలు, ఇటు పౌరసమాజం, ప్రకృతి ప్రేమికులు, మేధావులు, సంఘసంస్క ర్తలు, ఇతర సంఘాలను కలుపుకొని ముందుకు సాగినట్లయితే పర్యావరణ కాలుష్యాన్ని చాలావరకు తగ్గించవచ్చు. 
 శ్రీనివాస్ చిరిపోతుల
96034 71199జగన్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

Updated By ManamThu, 11/01/2018 - 11:29

YS Jagan Mohan Reddyహైదరాబాద్: గత వారం విశాఖ విమానాశ్రయంలో తనపై జరిగిన దాడిపై జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. జగన్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ నిరంజన్ రెడ్డి ఈ దాడి వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థతో ఈ కేసును దర్యాప్తు చేయించాలని కోరారు. ఇక ఇదే కేసులో ఏపీ ప్రభుత్వం తరపున వాదించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్.. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ అవసరం లేదని అన్నారు. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. కాగా కోర్టు విచారణ నిమిత్తం గత గురువారం హైదరాబాద్‌కు వస్తున్న జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జగన్ చేతికి బలమైన గాయం తగిలింది. అది మానేందుకు 45రోజుల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపిన విషయం తెలిసిందే. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ జగన్

Updated By ManamWed, 10/31/2018 - 16:15
  • ఏపీ ప్రభుత్వ వైఖరి వల్లే దాడి జరిగిందని రిట్ పిటిషన్

  • ప్రతివాదిగా చంద్రబాబును చేర్చిన జగన్

 Ys Jagan Mohan reddy Writ Petition For CBI Enquiry Filed At High Court

హైదరాబాద్ : తనపై జరిగిన హత్యాయత్నం కేసులో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కుట్ర జరిగిందని, ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై దాడి జరిగిందని ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

అంతేకాకుండా ఆ పిటిషన్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రతివాదిగా చేర్చారు. కేసు విచారణను ప్రభుత్వం తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని...కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించాలని వైఎస్ జగన్ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు గురువారం విచారణకు రానుంది. 

కాగా వైఎస్ జగన్‌పై గత గురువారం విశాఖ విమానాశ్రయంలో జనుపల్లి శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జగన్‌కు భుజానికి గాయం కాగా, తొమ్మిది కుట్లు పడ్డాయి.జగన్‌పై దాడి కేసు విచారణ వాయిదా

Updated By ManamMon, 10/29/2018 - 15:18
high court

హైదరాబాద్ : ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఏదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. అయితే  విశాఖపట్నం విమానాశ్రయంలో భద్రతా లోపాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను న్యాయస్థానం మంగళవారం విచారించనుంది. పిల్ విచారణ అనంతరం వైవీ సుబ్బారెడ్డి పిటిషన్‌పై విచారణ చేపడతామని న్యాయస్థానం పేర్కొంది. రేవంత్‌కు భద్రత పెంచండి: హైకోర్టు

Updated By ManamMon, 10/29/2018 - 14:35

Revanth Reddyహైదరాబాద్: టీపీసీసీ కార్య నిర్వాహకు అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని ఈసీ, కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉందని, భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. రేవంత్‌కు భద్రత పెంచాలని కేంద్రాన్ని, ఈసీని ఆదేశించింది. అయితే భద్రతకు అయ్యే ఖర్చు మాత్రం రేవంత్ రెడ్డినే భరించాలని హైకోర్టు ఆదేశించింది.దినకరన్‌కు హైకోర్టు షాక్

Updated By ManamThu, 10/25/2018 - 11:37

Dinakaranచెన్నై: శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్రాసు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటును హైకోర్టు సమర్ధించింది. దీంతో పళని ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించినట్లైంది. దీనిపై మాట్లాడిన దినకరన్.. కోర్టు తీర్పును గౌరవిస్తానని, శుక్రవారం ఎమ్మెల్యేలను కలుస్తానని అన్నారు. తీర్పు వ్యతిరేకంగా వస్తుందనే ఎమ్మెల్యేలను ముందస్తుగా రిసార్ట్‌కు పంపానని, ఎమ్మెల్యేలతో చర్చించిన తరువాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. ఈ అనర్హతపై సుప్రీంలో అప్పీలు చేస్తామని ఆయన అన్నారు.

18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో ఖాళీ అయిన స్థానాలకు మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంలో దినకరన్‌కు సానుకూలంగా తీర్పు వస్తే తప్ప ఇక్కడ ఎన్నికలు జరగడం అనివార్యమైంది. ఒకవేళ అదే జరిగితే పళని ప్రభుత్వానికి మరో సమస్య ఎదురుకానుంది.3 నెలల్లో ఏపీలో పంచాయతీ ఎన్నికలు

Updated By ManamTue, 10/23/2018 - 12:31
  • ఏపీ సర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురు

  • మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే

High Court orders to AP panchayat elections with in 3 months

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు అయింది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మాజీ సర్పంచ్‌ల పిటిషన్‌పై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం, స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.90ని కొట్టేసింది. స్పెషల్ ఆఫీసర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగులను నియమిస్తుందంటూ మాజీ సర్పంచులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్  ఇచ్చింది.బోండా ఉమా తక్షణమే రాజీనామా చేయాలి..

Updated By ManamWed, 10/17/2018 - 16:30
  • బోండా ఉమా శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలి

CPM Demands TDP MLA Bonda Umamaheswara rao Resignation

అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరరావు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. కాగా ఎమ్మెల్యే బోండా ఉమతో పాటు ఆయన భార్య సహా తొమ్మిదిమందిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ...‘ బోండా ఉమా శాసనసభ సభ్యత్వాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

ఇప్పటికైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలి. గతంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ...బోండా ఉమ అనుచరుల వల్లే చనిపోయింది. సీఎం వెంటనే బోండాపై చర్యలు తీసుకోవాలి. కబ్జాల నాయకుడుపై కేసులు పెట్టాలి. రాబోయే రెండు రోజుల్లో ఎమ్మెల్యే బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో అన్నిపార్టీలతో కలిసి ఉద్యమిస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆయనను తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. 

కాగా ఓ భూ వివాదానికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఆరోపణల కేసులో బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలంటూ బెజవాడ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఆయనతో పాటు ఆయన భార్య మరో 9మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

Related News