high court

బోండా ఉమకు హైకోర్టు షాక్

Updated By ManamWed, 10/17/2018 - 13:08

Bonda Umaఅమరావతి: అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూమికి సంబంధించి నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ ఆరోపణల కేసులో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బెజవాడ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో ఆయనతో పాటు ఆయన భార్య మరో 9మందిపై చర్యలు తీసుకోవాలని కోర్టు వెల్లడించింది.

బోండా ఉమ మోసానికి పాల్పడ్డాడంటూ గతంలో రామినేని కోటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. కేసును విచారించిన హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.అసెంబ్లీ రద్దు పిటిషన్ల కొట్టివేత

Updated By ManamSat, 10/13/2018 - 02:19
  • ఓటరు జాబితా కేసు 31కి వాయిదా..

  • ఆఖరి వరకూ అభ్యంతరాలు చెప్పొచ్చు.. 

highహైదరాబాద్: అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అసెంబ్లీని రద్దు చేశారంటూ కాంగ్రెస్ నేతలు డీకే అరుణ, శశాంక్ రెడ్డి తదితరులు వేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం విచారణ జరిపిన హై కోర్టు దీనిపై స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రద్దయిన శాసనసభలకు  ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించవలసి ఉన్నందున తాము తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టు దర్మాసనానికి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటరు జాబితాను కూడా విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యంతరాలు ఉంటే నామినేషన్ల చివరి రోజు వరకు తెలియచేసే అవకాశం ఉందన్నారు. దీనిపై స్పందించిన హై కోర్టు ధర్మాసనం, ఓటరు నమోదు ప్రక్రియను తామే పర్యవేక్షిస్తామని తెలియచేసింది. ప్రభుత్వ రద్దకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఓటరు జాబితాపై వాదనలు వాయిదాపడినందున ఈ నెల 31న మరోసారి తమ వాదనలు వినిపిస్తామని కాంగ్రెస్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు.గ్రూప్-2 నియామకాలకు లైన్ క్లియర్

Updated By ManamFri, 10/12/2018 - 16:13
High Court Gives line clear for Group-2 Recruitment

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్-2  నియామక ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-2 పరీక్షల్లో వైటర్న్, డబుల్ బబ్లింగ్ చేసినవారిని హైకోర్టు అనర్హులుగా ప్రకటించింది. 267మందిని ఇంటర్వ్యూ జాబితా నుంచి తొలగించాలని సూచించింది. అలాగే అర్హత సాధించిన 3,247మందిని 1:2 పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశించింది. 2016 సెప్టెంబర్‌లో 1032 పోస్టులకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతరం గత ఏడాది ఏడాది నవంబర్‌లో పరీక్ష నిర్వహించింది. 

కాగా గ్రూప్‌ 2 పరీక్షలో .. జవాబు పత్రంపై వైట్‌నర్‌ వాడితే ఆ పత్రాలను పెండింగ్‌లో పెడతామంటూ అధికారులు ముందే ప్రకటించారు. అయితే టీఎస్‌పీఎస్‌సీ ఎంపిక చేసినవారిలో డబుల్ బబ్లింగ్ చేసినవారు.. ఆన్సర్‌షీట్లలో వైట్‌నర్‌ వాడినవారు ఎక్కువమంది ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. 

అలాగే 42 ప్రశ్నలు తప్పులతడకలుగా వున్నాయంటూ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఒప్పుకోవడంపైకూడా విమర్శలు వచ్చాయి. దీంతో  వైట్నర్ వాడిన జవాబు పత్రాలనూ పరిగణలోకి తీసుకున్నారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాకుండా గ్రూప్-2 ఫలితాలు వివాదాస్పదం కావడంతో ఈ పరీక్షలు మళ్లీ నిర్వహించాలని డిమాండ్ కూడా చేశారు.తొలగించేలా ఆదేశించండి

Updated By ManamFri, 10/12/2018 - 00:34
  • రోడ్లకు అడ్డంగా ప్రార్థనా మందిరాలు

  • హైకోర్టులో పిటిషన్ దాఖలు.. విచారణ

high courtహైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోడ్లకు అడ్డంగా ఉన్న ప్రార్థనా మందిరాలు తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రార్థనా మందిరాలతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పిటిషనర్ మామిడి వేణుమాధవ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అక్రమంగా నిర్మించిన మందిరాలు కొందరికి వ్యాపార కేంద్రాలుగా మారాయని, ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మిస్తున్నారని ఆయన కోర్టుకు వెల్లడించారు. అనుమతిలేని ఆలయాలను తొలగించాలని సుప్రీం కోర్టు గతంలో ఆదేశాలిచ్చిందని వేణు మాధవ్ కోర్టుకు విన్నవించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2010లో ఈ విషయంపై పాలసీ తయారీకి, అమలుకు ప్రభుత్వం 262, 263 జీవోలు సైతం తెచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. అనుమతులు లేని ప్రార్థనాలయాల తొలగింపునకు కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీలు వేసినా పరిస్థితిలో ఏ మార్పు రాలేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను వివరణ కోరింది. 2013లో 150 అనుమతిలేని ప్రార్థనా మందిరాలను తొలగించామని ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. అయితే, ఏపీ ప్రభుత్వం కౌంటర్‌లో నిజం లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కాగా, కౌంటర్ దాఖలు చేయని తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. హైకోర్టు సెలవుల అనంతరం తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది.స్టార్ హీరోకు హైకోర్టు వార్నింగ్

Updated By ManamThu, 10/11/2018 - 14:16

Simbuకోలీవుడ్ స్టార్ హీరో శింబుకు మద్రాస్ హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ‘అరసన్’ అనే చిత్రానికి తీసుకున్న అడ్వాన్స్ వడ్డీతో సహా చెల్లించాలని లేదంటే ఆస్తులను జప్తు చేస్తామని హైకోర్టు మరోసారి హెచ్చరించింది.

అయితే 2013లో అరసన్ అనే చిత్రంలో నటించేందుకు ఫ్యాషన్ మూవీ మేకర్స్ నిర్మాతలు రూ.50లక్షల అడ్వాన్స్‌ను శింబుకు ఇచ్చారు. అయితే ఆ చిత్రానికి ఇంతవరకు కాల్‌షీట్స్ కేటాయించకపోవడంతో ఆ నిర్మాతలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆ మొత్తాన్ని ఎప్పుడు చెల్లించేది తెలియజేయడానికి నాలుగువారాల గడువు ఇచ్చింది. ఆ లోపు తెలియజేయకుండా శింబుకు చెందిన కారు, ఫోన్ వంటి వస్తువులను జప్తు చేయనున్నట్లు తెలిపింది. అయితే ఆ హెచ్చరికలకు శింబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో మరోసారి ఈ కేసు విచారణకు రాగా.. శింబు మొత్తం రూ.85లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని, ఎప్పుడు చెల్లిస్తారో ఈ నెల 31లోగా చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో శింబు ఆస్తులను జప్తు చేయనున్నట్లు హెచ్చరించారు.టీ. ఎన్నికల షెడ్యూల్‌పై డీకే అరుణ పిటిషన్

Updated By ManamMon, 10/08/2018 - 12:22
DK aruna-Mnama Telugu News

హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్నాయి. కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం రద్దు చేసిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, శాసనసభను సమావేశపరచకుండా  9 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు.ఓటర్ల జాబితాపై ఈసీ కౌంటర్ అఫిడవిట్

Updated By ManamMon, 10/08/2018 - 12:11
High court

హైదరాబాద్ : ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌పై ఎన్నికల సంఘం సోమవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం వాదనలు జరగనున్నాయి. టెక్నాలజీ సహాయంలో 30 లక్షల బోగస్ ఓట్లను తొలగించినట్లు ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది. జాబితాలో ఉన్న ఓటర్లకు మాత్రమే ఓటు హక్కు ఉంటుందని ఈసీ కోర్టుకు తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.ఓటరు లిస్టుకు బ్రేక్

Updated By ManamSat, 10/06/2018 - 00:16
  • విచారణ పూర్తయ్యేవరకూ

  •  తుదిజాబితా ప్రకటించొద్దన్న హైకోర్టు

  • పిటీషన్‌పై విచారణను 8కి వాయిదా వేసిన హైకోర్టు

  • ముందస్తుపై పెరుగుతోన్న ఉత్కంఠ

  • ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష

breakహైదరాబాద్: ఓటర్ల జాబితా అభ్యంతరాలపై దాఖలైన పిటీషన్‌పై విచారణ పూర్తయ్యేవరకు తుదిజాబితా ప్రకటించొద్దని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది.  తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలపై దాఖలైన పిటీషన్ల విచారణను సుప్రీంకోర్టు గురువారం హైకోర్టుకు బదిలీ చేసిన విషయం విదితమే. దీనిపై శుక్రవారం ఉమ్మడి హైకోర్టు విచారణ చేపట్టింది. దాఖలైనమూడింటిలో రెండు పిటీషన్లను కొట్టివేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనిలో పేర్కొన్న అంశాలను పరిశీలించిన న్యాయస్థ్ధానం తదుపరి విచారణకు ఈ నెల 8కి వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకు ఓటర్ల తుది జాబితాను ప్రకటించొద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

అనుకూలంగా లేని వారి పేర్లను తొలగించారు: మర్రి శశిధర్ రెడ్డి
కేసీఆర్ తమకు అనుకూలంగా లేని వారి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగిస్తే ఎన్నికల్లో చాలా సులభంగా గెలువొచ్చని భావించారని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఇదే వైఖరితో 2015 నుంచి ఆ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సీమాంధ్రకు చెందిన వారు తెరాసకు ఓటు వేయలేదు గనుక వారి పేర్లను తొలగించాలని ఎన్నికల సంఘం అధికారులకు ఆదేశాలు ఇచ్చారని శశిధర్ రెడ్డి  పేర్కొన్నా రు.  జమిలి ఎన్నికలు కావాలని చెప్పిన కేసీఆర్ ముందస్తుకు ఎందుకు పోతున్నారని ఆయన ప్రశ్నించారు. తోటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై  కేసీఆర్ వాడిన పదజాలాన్ని తాను వాడలేనన్నారు. ఓటర్ల అక్రమ జాబితా ఆధారంగా ఎన్నికల్లో గెలుస్తామనే ధీమాతోనే కేసీఆర్  ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని శశిధర్‌రెడ్డి ఆరోపించారు. 

ముందస్తుపై ఉత్కంఠ
కోర్టు కేసు నేపథ్యంలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 8న ఓటర్ల తుది జాబితా ప్రకటించవలసి ఉంది. ఓటర్ల జాబితా వెల్లడించకుండా ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం సాధ్యం కాదు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు ఓటరు జాబితాను విడుదల చేయరాదని హైకోర్టు ఆదేశించడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పిటీషన్‌పై విచారణ పొడిగించవలసి వస్తే కోర్టు మరో రోజుకు వాదనలను వాయిదా వేసే అవకాశం ఉంది.  అలాంటి పరిస్థితిలో ఓటరు జాబితాను విడుదల చేయడం సాధ్యం కాదంటున్నారు. ఓటరు నమోదును జనవరి 2019 నుండి జనవరి 2018కి కుదించడం, ఓటరు జాబితాలో అవకతవకల పైన కోర్టు తీసుకొనే నిర్ణయం పై ఎన్నికల ప్రక్రియ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.ఎన్నికల సంఘం ఇచ్చే వివరణతో కోర్టు సంతృప్తి చెందుతుందా? లేక అర్హులైన వారందరు ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకొనే అవకాశం ఇస్తుందా? ఓటరు జాబితాలో లొసుగులు తొలగించడానికి సమయం ఇస్తుందా? అనే అంశాలు రాజకీయ నేతలను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. 

ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ సమీక్ష..  10న హైదరాబాద్‌కు అధికారులు!
తెలంగాణలో ఎన్నికల సన్నద్ధ్దతపైన కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించింది. ఓటరు జాబితా తయారీ, ఈవీఎంల సిద్ధం వంటి అంశాలపై  దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌తో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సమావేశమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక ప్రక్రియపై ప్రధానంగా చర్చించింది. ఈ నెల 10న ఈసీ బృందం హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు లతో కూడా సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఉన్న పరిస్థితులను రజత్ కుమార్ సీఈసీకి వివరించారు. ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై దాఖలైన పిటీషన్‌పై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థ్ధానం తుది విచారణ పూర్తయ్యేంత వరకు ఓటరు జాబితాను విడుదల చేయవద్దని ఆదేశించింది.ఓటర్ల జాబితా అవకతవకలపై హైకోర్టులో విచారణ

Updated By ManamFri, 10/05/2018 - 15:40
high court hearing on Discrepancies in Telangana voter list

హైదరాబాద్ : తెలంగాణలో ఓటర్ల జాబితా అవకతవకలపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ కాపీ అందడంతో హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా అవకతవకలపై మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు కాగా న్యాయస్థానం రెండు పిటిషన్లను కొట్టేసింది. మరో రెండు పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది.‘ముందస్తు’పై సుప్రీంకోర్టులో విచారణ

Updated By ManamThu, 10/04/2018 - 14:43
Supreme Court hearing  on Early Elections in telangana

న్యూఢిల్లీ : తెలంగాణలో ముందస్తు ఎన్నికల పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇందుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు విచారణ చేపట్టాలని హైకోర్టుకు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఒకవేళ ఎన్నికలపై స్టే విధించాల్సి వస్తే ఆ అధికారం హైకోర్టుకు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అలాగే తెలంగాణ ఓటర్ల జాబితా అంశంపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీం కోర్టు సూచించింది. పిటిషన్‌లోని మెరిట్ ఆధారంగా ఓటర్ల తుది జాబితా గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు ఉన్నత ధర్మాసనం సూచన చేసింది.  తెలంగాణలో 68 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించినట్లు న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తెలిపారు.

Related News