Aravindha Sametha

అరవింద సమేత..చవితి శుభాకాంక్షలు

Updated By ManamWed, 09/12/2018 - 18:03
  • 20న అరవింద సమేత ఆడియో విడుదల

Aravinda sametha audio function on september 20

హారికా, హాసిని ప్రొడక్షన్స్‌లో దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. ఈ పోస్టర్‌లో ఎన్టీఆర్ నవ్వుతూ... స్టైలిష్‌గా కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఇక అరవింద సమేత’. ‘వీర రాఘవ’ అనేది ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఆ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 11న అంటే సరిగ్గా నెల రోజుల తర్వాత  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.వెంటపడ్డానా.. నరికేస్తా

Updated By ManamWed, 08/15/2018 - 09:10

NTRఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ టీజర్ తెరకెక్కగా.. అదిరిపోయే యాక్షన్‌ పర్ఫామెన్స్‌తో ఎన్టీఆర్ ఆకట్టుకుంటున్నాడు. ‘‘మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా..? మచ్చలపులి ముఖం మీద గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా..? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా’’ అనే జగపతిబాబు డైలాగ్‌లతో టీజర్ ప్రారంభం కాగా.. ‘‘కంటబడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా, నరికేస్తా ఓబా’’ అంటూ ఎన్టీఆర్ అదరగొట్టాడు. అలాగే టీజర్‌లో సునీల్‌ కూడా ఉండటాన్ని గమనించవచ్చు. ఇక టీజర్‌కు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ కూడా అదిరింది.  అంతేకాదు మామూలుగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రాల టీజర్‌కు ఇది విభిన్నంగా ఉండటం విశేషం. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. నాగబాబు, ఈషారెబ్బా, జగపతి బాబు తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని పతాకంపై నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.‘అరవింద సమేత’ అదిరిపోతుంది అంతే: నిర్మాత

Updated By ManamTue, 08/14/2018 - 13:58

Aravindha Samethaఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా ఈ చిత్ర టీజర్‌ను బుధవారం ఉదయం 9గంటలకు విడుదల చేయనున్నారు. క్రేజీ కాంబోగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌పై అటు అభిమానుల్లోనే కాకుండా, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ చాలా అంచనాలే ఉన్నాయి. వాటన్నింటిని మరింత పెంచేలా తాజాగా యువ నిర్మాత నాగవంశీ(సితార ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాతల్లో ఒకరు) టీజర్‌పై ప్రశంసలు కురిపించాడు.

దీనిపై సోషల్ మీడియాలో పంచుకున్న నాగవంశీ.. ‘‘ఇప్పుడే అరవింద సమేత టీజర్‌ చూశాను. ఎన్టీఆర్ అభిమానిగా చెబుతున్నా, మీరు సిద్ధమైపోండి. మన ఎన్టీఆర్ అద్భుతంగా చేశాడు, దర్శకుడు త్రివిక్రమ్ గొప్పగా తెరకెక్కించారు. రేపు ఉదయం 9గంటలకు సిద్ధంగా ఉండండి’’ అంటూ పేర్కొన్నాడు. ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా.. హారిక అండ్ హారిక పతాకంపై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..

Updated By ManamThu, 08/09/2018 - 20:44

Jr NTR, Director Trivikram, Aravindha Sametha,  Young tiger, first look of Jr NTR, New Teaser releaseయంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ త్వరలో ఓ టీజర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘చివరకు మీరంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అరవిందసమేత’ టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయనున్నాం. సమయాన్ని త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ పేర్కొంది. ఈ చిత్రంలో తారక్‌ సరసన అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 

15 రోజులకు పైగా ఈ చిత్రం షెడ్యూల్‌ షూటింగ్ ఇక్కడే సాగనుంది. అనంతరం పొలాచ్చిలో తదుపరి చిత్ర షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అదే యాసలో తారక్‌ డైలాగ్‌లు ఉండనున్నాయి. రాయలసీమ యాసలో తారక్ చెప్పే డైలాగ్‌లు అభిమానులు సహా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. వెండితెరపై మరోసారి తారక్.. తన సిక్స్‌ ప్యాక్‌తో మెరవనున్నారు. ఈ చిత్రం కోసం తారక్.. చాలా రోజుల నుంచి నిపుణుల సమక్షంలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చే యోచనలో చిత్రబృందం ఉంది. 

Related News