ravi teja

ముగ్గురు కాదు.. ఒకరేనా..! 

Updated By ManamMon, 09/10/2018 - 15:15

AAA'వెంకీ, దుబాయ్‌ శీను చిత్రాల తర్వాత' రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోని'. ఈ సినిమాలో రవితేజ మూడు పాత్రలను పోషిస్తారని అందరూ అనుకున్నారు. అలాగే ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో రవితేజ మూడు గెటప్స్‌ను విడుదల చేశారు. కానీ సినిమాలో రవితేజ ఒకడేనట. మూడు షేడ్స్‌లో కనపడతారట. లెటెస్ట్‌ సమాచారం ప్రకారం రవితేజ మల్లిపుల్‌ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపుడుతుంటారట. దాని కారణంగా తనకు తెలియకుండా అమర్‌ , అక్బర్‌, ఆంటోని క్యారెక్టర్స్‌గా మారిపోతుంటారట. దీని కారణంగా సన్నివేశాల్లో వచ్చే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుందని సమాచారం. అక్టోబర్‌లో విడుదల కాబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఇలియానా హీరోయిన్‌గా నటిస్తుంది. రవితేజ తదుపరి చిత్రం విశేషాలు

Updated By ManamSat, 09/08/2018 - 11:29

Ravitejaప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటిస్తున్న మాస్ రాజా రవితేజ ఆ తరువాత ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించన్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. తండ్రి, కొడుకులుగా రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకుముందు పలు చిత్రాలలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించినప్పటికీ తండ్రి, కుమారులుగా చేయలేదు. కిక్2లో చేసినప్పటికీ.. అది సినిమా మొత్తం ఉండదు కాబట్టి మొదటిసారి రవితేజ తండ్రీ కుమారులుగా చేయనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని రామ్ తల్లూరి నిర్మిస్తుండగా.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.పింక్ బికీనీలో ఇలియానా.. చూస్తే మతిపోతుందంతే

Updated By ManamTue, 08/14/2018 - 11:51

ileanaగోవా బ్యూటీ ఇలియానాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేయకున్నా, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ హాట్ బ్యూటీకి ఫాలోవర్లు కోకొల్లలు. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో అబ్బాయిల మతిని పోగొడుతోంది. పింక్ బికినీ ఓ సముద్ర తీరంలో ఆమె సేదతీరుతుండగా.. ఆ ఫొటోలో చూపులతోనే కవ్విస్తోంది ఇలియానా. ఇక ఈ ఫొటోను ఇలియానా ప్రియుడు ఆండ్రూ తీయడం మరో విశేషం. ఆ విషయాన్ని ఆమే వెల్లడించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇలియానా తెలుగులో రవితేజ సరసన అమర్ అక్బర్ ఆంటోనిలో నటిస్తున్న విషయం తెలిసిందే.

 

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

 ఆ భాషలో మొదటిసారిగా..

Updated By ManamMon, 06/11/2018 - 10:01

Kajal కెరీర్ అయిపోయింది అనుకునే సమయంలో చందమామ కాజల్‌కు ఒకదాని తరువాత మరొక ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ పంజాబీ చిత్రానికి కాజల్ ఓకే చెప్పింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. త్వరలో ఓ పంజాబీ చిత్రంలో తాను నటించబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపింది కాజల్. దీంతో పంజాబీలోనూ ఎంట్రీ ఇవ్వబోతోంది కాజల్. 

అంతేకాదు రవితేజ హీరోగా తెరకెక్కనున్న తెరి రీమేక్‌లోనూ కాజల్ నటించనుంది. ఇదిలా ఉంటే కాజల్ ప్రస్తుతం క్వీన్ తమిళ రీమేక్‌లో నటిస్తోంది. ఈ చిత్రానికి రమేశ్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తాను కంగనా రనౌత్‌ను ఫాలో అవ్వలేదని, డిఫరెంట్‌గా నటిస్తున్నానని తెలిపింది కాజల్. రవితేజ కోసం శ్రీనువైట్ల కొత్త టెక్నాలజీ

Updated By ManamSat, 06/02/2018 - 14:27

Ravi Teja, Srinu Vaitlaమాస్‌రాజా రవితేజతో శ్రీనువైట్ల తెరకెక్కించనున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక కథ రీత్యా ఈ చిత్రం ఎక్కువగా ఫారిన్ లొకేషన్స్‌లో చేయనున్నారు. కాగా ఈ మూవీ కోసం శ్రీనువైట్ల సరికొత్త టెక్నాలజీని టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

అమెరికాలోని విభిన్న వాతావరణ పరిస్థితుల్లో షూటింగ్ చేసేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను 8కె క్వాలిటీతో రూపొందిస్తున్నారట. ఇక ఈ చిత్రంతో ఇలియానా మళ్లీ టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.


 షూటింగ్ పూర్తి చేసుకున్న రవితేజ

Updated By ManamTue, 05/08/2018 - 10:04

nela ticket రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నేల టికెట్’. మాలవిక శర్మ ఈ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. సెట్స్‌పైకి వెళ్లినప్పటి నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర షూటింగ్ తాజాగా పూర్తైంది. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో వెల్లడించారు.

‘‘నేల టికెట్ షూటింగ్ పూర్తైంది. చాలా సంతోషంగా, కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. మాస్ రాజా రవితేజతో పనిచేయడాన్ని చాలా ఇష్టపడ్డా. లవ్ యు సర్’’ అంటూ కల్యాణ్ కృష్ణ ట్వీట్ చేశారు. ఇక ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. 10వ తేదిన ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 స‌మంత పాత్ర‌లో కాజ‌ల్‌?

Updated By ManamSat, 04/28/2018 - 22:48

kajalఆ మ‌ధ్య దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న‌ హీరో రవితేజ.. ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ప్ర‌స్తుతం 'నేల టిక్కెట్టు', 'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' సినిమాలు చేస్తున్న ర‌వితేజ‌.. అతి త్వ‌ర‌లో తమిళంలో విజయవంతమైన ‘తెరి’ సినిమా తెలుగు రీవేుక్‌లో నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. సంతోశ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజకు జంటగా కాజల్ నటించనుంద‌ని తెలిసింది. తమిళంలో సమంత నటించిన పాత్రను కాజల్ చేయనుండటం విశేషం. అలాగే.. త‌మిళంలో ఎమీ జాక్స‌న్ చేసిన పాత్ర‌ను కేథ‌రిన్ ట్రెసా చేయ‌నుంద‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే క‌థానాయిక‌ల విష‌యంపై క్లారిటీ వ‌స్తుంది.‘డిస్కో రాజా’గా మాస్ మ‌హారాజా?

Updated By ManamWed, 04/25/2018 - 17:31

ravitejaమాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘నేల టిక్కెట్టు’. ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ప‌రంగా తుది దశలో ఉందీ చిత్రం. ఇదిలా ఉంటే.. ఈ సినిమా చేయడానికి ముందే.. ఇదే బ్యానర్‌పై మూడు సినిమాలు చేయడానికి రవితేజ అగ్రిమెంట్ ఇచ్చారని ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలకు బలం చేకూరుస్తూ.. ఈ బ్యానర్‌పై రవితేజ మరో సినిమా చేయబోతున్నట్లు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

వైవిధ్యభరితమైన క‌థ‌ల‌కు వాణిజ్య అంశాలను ముడిపెడుతూ సినిమాల‌ను తెరకెక్కించే డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. కామెడీ ప్ర‌ధానంగా రూపొంద‌నున్న‌ ఈ చిత్రానికి ‘డిస్కో రాజా’ అనే పేరును పరిశీలిస్తున్నారు. కాగా.. మ‌రోవైపు అల్లు అర్జున్‌కు కూడా ఓ కథను చెప్పారట వి.ఐ.ఆనంద్. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్‌పై కసరత్తులు జరుగుతున్నాయ‌ని తెలిసింది.రవితేజ మూవీతో ఆ హీరోయిన్ రీ ఎంట్రీ 

Updated By ManamFri, 04/06/2018 - 19:00

laya మాస్ రాజా రవితేజ ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్‌’లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంలో నటించబోతున్నాడు. ఇందులో రవితేజ సరసన ఒక హీరోయిన్‌గా అనూ ఇమ్మాన్యుల్ నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం ఈ సినిమా ద్వారా ఒకప్పటి హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇందులో అను ఇమ్మాన్యుల్ తల్లి పాత్రలో లయ కనిపించబోతుందట. అంతేకాదు ఆమె కుమార్తె శ్లోక కూడా ఈ మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే 2010లో ‘బ్రహ్మలోకం టు యవలోకం వయా భూలోకం’ చిత్రంలో చివరి సారిగా కనిపించిన లయ.. దాదాపుగా ఎనిమిదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.రామ్‌తో ర‌వితేజ హీరోయిన్‌?

Updated By ManamFri, 03/23/2018 - 15:53

malavikaరవితేజ కథానాయకుడిగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ‘నేల టికెట్టు’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో రవితేజ సరసన కొత్త‌మ్మాయి మాళవిక శర్మ క‌థానాయికగా నటిస్తోంది. ఇప్ప‌టికే 60 శాతం చిత్రీకరణ జరుపుకుందీ చిత్రం. చిత్రీకరణలో ఉండగానే ఈ సినిమాలో నటిస్తున్న మాళవికకు వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రామ్, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రంలో మాళవికను ఎంపిక చేశారని సమాచారం. ఆసక్తిని రేకెత్తించే కథ, కథనంతో తెరకెక్కబోయే ఈ చిత్రంలో.. రామ్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్‌ చాలా డిఫ‌రెంట్‌గా చూపించ‌నున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాళవిక పాత్రను ఏ విధంగా డిజైన్ చేసుంటారోన‌ని అంతా ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు.

అలాగే టాలీవుడ్‌లో మరికొంతమంది దర్శక నిర్మాతలు కూడా మాళవిక కాల్షీట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ అమ్మడి జోరు చూస్తూ ఉంటే ప్రస్తుతం ఉన్న కథానాయికలకు చెక్ పెట్టేట‌ట్టే ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Related News