Vishwaroopam 2 review

‘విశ్వరూపం 2’ రివ్యూ

Updated By ManamFri, 08/10/2018 - 13:07
Vishwaroopam 2

ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌:  రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌

ప్రెజెంట్స్: ఆస్కార్ ఫిలిమ్స్ వి. ర‌విచంద్ర‌న్‌

ఆర్టిస్ట్స్: కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్ త‌దిత‌రులు

మ్యూజిక్‌: గిబ్రాన్‌, 

లిరిక్స్: రామజోగయ్యశాస్త్రి, 

కెమెరా: శామ్‌దత్‌, షైనుదీన్‌, షను జాన్‌ వర్గీస్‌, 

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌, 

డైలాగ్స్: శశాంక్‌ వెన్నెలకంటి, 

ప్రొడ్యూస‌ర్స్: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌, 

డైర‌క్ష‌న్‌: కమల్‌హాసన్‌. 

రిలీజ్ డేట్‌: 10.8.2018

క‌మ‌ల్‌హాస‌న్ అత్యంత ప్యాష‌న్‌తో తెర‌కెక్కించిన చిత్రం `విశ్వ‌రూపం`. ఆ సినిమా విడుద‌ల‌కు ఎన్ని ఇబ్బందుల్ని ఎదుర్కుందో తెలిసిందే. ఆ సినిమా క్లైమాక్స్ లోనే ఆయ‌న సెకండ్ పార్ట్ గురించి హింట్ ఇచ్చారు. తొలి భాగం విడుద‌లైన నెల రోజుల్లోనే రెండో భాగం విడుద‌ల‌వుతుంద‌ని అంద‌రూ ఎదురుచూశారు. ఎందుకంటే అప్ప‌టికే షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ విడుద‌ల‌కు మాత్రం ఐదు ఏళ్లు స‌మ‌యం ప‌ట్టింది. అయినా క‌మ‌ల్ అంతే ఆస‌క్తిగా ఆ సినిమాకు ప్ర‌మోష‌న్ చేశారు. ఇంత‌కీ తొలి సినిమా ఉన్నంత ఆస‌క్తిక‌రంగా రెండో సినిమా ఉంటుందా? జ‌స్ట్ హావ్ ఎ లుక్‌... 

 

క‌థ‌: 

రా ఏంజెట్ విసాద్ అహ్మ‌ద్‌(క‌మ‌ల్ హాస‌న్‌) .. అల్‌ఖైదాలో ఓమ‌ర్(రాహుల్ దేవ్‌) వేసిన ప్లాన్‌ను లండ‌న్‌లో భ‌గ్నం చేస్తాడు. అక్క‌డ నుండి ఇండియా వెళ్లే క్ర‌మంలో ఓమ‌ర్ మ‌రో ప్లాన్ వేశాడ‌నే సంగ‌తి తెలిస్తుంది. రెండో ప్ర‌పంచ యుద్ధంలో ఇంగ్లాండ్‌లో మునిగిపోయిన అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేస్తే... అవి పేలి.. పెద్ద సునామీ వ‌చ్చి.. లండ‌న్ న‌గ‌రం నాశ‌నం అయిపోతుంది. కాబ‌ట్టి అణు ఆయుధాల‌ను యాక్టివేట్ చేయాల‌నేది ఓమ‌ర్ ఆలోచ‌న‌. దాన్ని ప‌సిగ‌ట్టిన విసాద్ స‌ముద్రంలోకి త‌న భార్య నిరుప‌మ స‌హాయంతో ఆ ప్లాన్ స‌క్సెస్ కాకుండా అడ్డుకుంటాడు. అక్క‌డ నుండి ఇండియా చేరుకున్న విసాద్ త‌న పై అధికారుల‌ను క‌లిసే ప్ర‌య‌త్నంలో ఉండ‌గా.. అత‌ని భార్య‌, అసిస్టెంట్ ఆశ్రిత‌, త‌ల్లిని ఓమ‌ర్ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. అప్పుడు విసాడ్ ఏం చేస్తాడు?  అస‌లు ఓమర్ ప్లాన్ ఏంటి? ఇండియాలో ఓమ‌ర్ వేసిన ప్లాన్‌ను విసాద్ ఎలా అడ్డుకున్నాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...

ప్ల‌స్ పాయింట్స్‌:

- క‌మ‌ల్ హాస‌న్ స‌హా ఇత‌ర న‌టీన‌ట‌ల ప‌నితీరు

- నిర్మాణ విలువ‌లు

- కెమెరా వ‌ర్క్‌

- సీజీ వ‌ర్క్‌

 మైన‌స్ పాయింట్స్‌:

- సీన్స్‌లో ల్యాగ్ ఎక్కువ‌గా ఉండ‌టం

- ఎడిటింగ్‌

- నేప‌థ్య సంగీతం

- క‌న్‌ఫ్యూజ‌న్ చేసేలా ఉండ‌టం

Vishwaroopam

విశ్లేష‌ణ‌:

క‌మ‌ల్ హాస‌న్ హీరోగా న‌టిస్తూనే.. సినిమాను చ‌క్క‌గా డైరెక్ట్ చేశారు. విశ్వ‌రూపం పార్ట్ వ‌న్‌లో ప్రేక్ష‌కుల‌కు చాలా ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. అయితే పార్ట్ వ‌న్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగింది. ఇక సీక్వెల్‌లో పార్ట్ వ‌న్‌లోని ప్ర‌శ్న‌ల‌న్నింటినీ క్లియ‌ర్ చేసినా.. స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రంగా లేవు. యాక్ష‌న్‌సీన్స్ లో క‌మ‌ల్ హాస‌న్ ఎలాంటి డూప్‌లేకుండా చ‌క్క‌గా న‌టించారు. అయితే యాక్ష‌న్ పార్ట్ ఎగ్జ‌యిటింగ్‌గా ఎక్క‌డా అనిపించ‌దు. ఫ‌స్టాఫ్‌లో లండ‌న్ స‌ముద్రంలోని స‌న్నివేశాల్లోని సీజీ వ‌ర్క్ బావుంది. కానీ అస‌లు ఇండియాలో సినిమా స్టార్ట‌వుతుంద‌ని అనుకున్న ప్రేక్ష‌కుడికి సినిమా ఎటువెళుతుందో అనే సందేహం మొద‌ల‌వుతుంది. ఇక ఎడిటింగ్ షార్ప్‌గా లేదు. స‌న్నివేశాలు ల్యాగ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ రాజ ఏజెంట్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించారు. పూజా కుమార్ పార్ట్ వ‌న్ కంటే దీంట్లో గ్లామ‌ర్ శాతం పెంచారు. ఆండ్రియా యాక్ష‌న్ సీన్స్‌కే ప‌రిమితం అయ్యింది. మొత్తంగా చూస్తే.. పార్ట్ వ‌న్ పై ఉన్న అంచ‌నాల‌తో  విశ్వ‌రూపం 2 కి వ‌చ్చిన ప్రేక్ష‌కులు నిరాశ‌ను మిగిలుస్తుంది

చివ‌ర‌గా.. విశ్వ‌రూపం 2.. ఆస‌క్తి త‌గ్గింది 

రేటింగ్‌: 2.5/5

Related News