NASA's Parker Solar Probe

సూర్యుడికి దగ్గరగా సోలార్ ప్రోబ్

Updated By ManamWed, 10/31/2018 - 04:17
  • భానుడికి 26.55 మిలియన్ మైళ్ల దూరంలో పార్కర్

  • అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త రికార్డు

Solar probeవాషింగ్టన్: సూర్యుడి పుట్టుక, ఇతర రహస్యాలను చేధించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పంపిన స్పేస్‌క్రాఫ్ట్ భానుడికి అతి చేరువగా వెళ్లింది. ఇప్పటివరకూ సూర్యుడికి అతి చేరువగా వెళ్లిన మానవ నిర్మిత వస్తువు ఇదే కావడం ఓ రికార్డు. ఈ మేరకు సూర్యుడికి బాగా దగ్గరగా వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌గా పార్కర్ సోలార్ ప్రోబ్ చరిత్ర సృష్టించిందని నాసా తెలిపింది. 78 రోజుల క్రితం ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ అక్టోబరు 29 నాటికి సూర్యుడికి 26.55 మిలియన్ మైళ్ల దూరం వరకూ వెళ్లినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ఇది మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుందని, సూర్యుడికి 3.83 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్న బిందువు వరకూ వెళ్లడం దీని చివరి గమ్యస్థానమని ప్రాజెక్టు మేనేజర్ ఆండీ డ్రైస్‌మాన్ వెల్లడించారు. ఆఖరి మజిలీ 2024 కల్లా పూర్తయ్యే అవకాశమున్నట్లు వివరించారు. గతంలో 1976లో జర్మనీ-అమెరికా సంయుక్తంగా ప్రయోగించిన హీలియోస్ 2 అంతరిక్షనౌక సూర్యుడికి దగ్గరగా వెళ్లిన చరిత్ర ఉంది.  ఇప్పుడు ఆ రికార్డును పార్కర్ ప్రోబ్ అధిగమించింది. ‘‘ఇది మా బృందానికి ఎంతో గర్వకారణం. అంతరిక్ష నౌక ప్రయోగించిన నాటి నుంచి దాని వేగం, దశ, దిశ వంటి వాటిని పరిశీలిస్తున్నాం. అక్టోబరు 31 నుంచి ప్రాజెక్టు మలి దశ మొదలు కాబోతోంది. సూర్యుడికి ఇంకా దగ్గరగా వెళ్లి నవంబరు 5న అత్యంత సమీప బిందువును చేరుకుంటుంది. భానుడికి అతి సమీపానికి వెళ్లిన పార్కర్ మాకు బాగా సహకరిస్తోంది. ‘‘సోలార్ పార్కర్ సూర్యుడి నుంచి దారుణమైన ఉష్ణోగ్రత, రేడియేషన్ ఎదుర్కొంటోంది’’ అని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు.



సూర్యుడి దగ్గరికి ప్రోబ్

Updated By ManamMon, 08/13/2018 - 03:15
  • విజయవంతంగా దూసుకెళ్లిన డెల్టా 4 రాకెట్..

  • ప్రపంచంలోనే తొలిసారి భానుడిపై పరిశోధన

వాషింగ్టన్: సూర్యుడిపైకి తొలిసారిగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. సాంకేతిక కారణాలతో శనివారం వాయిదా పడిన నాసా ‘పార్కర్  సోలార్ ప్రోబ్’ను ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అనుకున్న సమయానికి డెల్టా 4 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపారు. ఇక్కడి కేప్‌కెనరాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రివ్వున ఎగిసింది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రాకెట్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించనుంది. సూర్యుడి ఉపరితలంలోని కరోనా వ్యవస్థపై ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ చేయనుంది.

image


తన ప్రయాణంలో ఈ ప్రోబ్ సూర్యుడి ఆవల ఉండే కరోనా వ్యవస్థను 24సార్లు దాటుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సూర్యుడి దగ్గరగా వెళ్లనున్న ప్రయోగం ఇదే. పార్కర్‌తో సౌర రహస్యాలు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి వాతావరణం కంటే అధికంగా.. కరోనా ఎందుకు సెగలు చిమ్ముతుందో ఈ పరిశోధన ద్వారా తేల్చనున్నారు.పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేస్తుంది.  దీని ద్వారా నక్షత్రాలకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు. సూర్యుడి గతశీలతను, దాని అనుక్రమంపై ఓ అంచనా వేయొచ్చు.
 

image

 





Related News