Amit Shah

ఒంటరి పోరే..

Updated By ManamSun, 09/16/2018 - 01:00
 • టీఆర్‌ఎస్‌తో దోస్తీ ఉండదు

 • తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీ 

 • ముందస్తు ఎందుకో కేసీఆర్ చెప్పాలి?

 • చంద్రబాబుకు నోటీసులొస్తే ఏమైతది..?

 • బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

Amit Shahహైదరాబాద్: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తుండదని, టీఆర్‌ఎస్‌తో ఎలాంటి దోస్తీ లేదని చెప్పారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు తాము వ్యతిరేకమని, తెలంగాణలో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని, తమ పార్టీ బలపడిందని పేర్కొన్నారు. అసలు టీఆర్‌ఎస్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతుందో చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేస్తారని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీకి భయపడి టీఆర్‌ఎస్ పార్టీ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించడంలేదని ఆరోపించారు. అమిత్ షా రాష్ట్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని ముషీరాబాద్ నియోజకవర్గంలో ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత పాతబస్తీలోని లాల్‌దర్వాజ మహంకాళీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

‘ముందస్తు’ ఎందుకో చెప్పాలి
ఒకే దేశం, ఒకే ఎన్నిక తమ విధానమని, జమిలి ఎన్నికలను సీఎం కేసీఆర్ సమర్థించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లడమేంటని షా ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన చిన్న రాష్ట్రంలో ఒకే ఏడాది రెండు సార్లు ఎన్నికల నిర్వహిండం వల్ల ప్రజలపై రూ. కోట్ల భారం వేశారని ఆరోపించారు. అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్‌వి ఓటు బ్యాంక్ రాజకీయాలు అని, 12శాతం మైనారిటీ రిజర్వేషన్ చేస్తామని అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి కేంద్రానికి పంపారని గుర్తుచేశారు.2014లో దళితులకు సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని, 2019లో అయినా ఇస్తారా అని ప్రశ్నించారు.  రాష్ట్రంలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎంకు పట్టదా అని మండిపడ్డారు. ఖమ్మంలో రైతులకు సంకెళ్లు వేశారని, ఇలాంటి అన్యాయం ఎక్కడా చూడలేదన్నారు. సిరిసిల్లలో దళితులపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కాకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఫసల్ బీమాను అమలు చేయడంలో టీఆర్‌ఎస్ విఫలమైందని విమర్శించారు. 

కాంగ్రెస్ కంటే 20 రెట్లు ఎక్కువే ఇచ్చాం..
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలా కృషి చేసిందని వివరించారు. 13వ ఆర్థిక సంఘం నుంచి రూ. 16,579 కోట్లు తెలంగాణ వచ్చాయని, ఇప్పటి వరకు రాష్ట్రానికి 2.30లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చామని తెలిపారు. గిరిజన విశ్వవిద్యాలయం, వెటర్నిటీ యూనివర్సిటీ, జయశంకర్ భూపాలపల్లి విశ్వవిద్యాలయాలను ఇచ్చామని చెప్పారు. ఎయిమ్స్‌కు 1200 కోట్లు ఇచ్చామని తెలిపారు. మిషన్ ఇంద్రధనుష్ పథకంతో ఎంతో మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కంటే 20 రెట్లు ఎక్కువగా తెలంగాణకు ఇచ్చామని వివరించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కోసం మోదీ సర్కార్ ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో అడ్డుపుల్ల వేసిందని గుర్తుచేశారు. ఓబీసీ కమిషన్‌కు అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు 12శాతం రిజర్వేషన్ ఆపగలదా అని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారు..
నాలుగేళ్లలో బీజేపీకి ప్రజల మద్దతు అనూహ్యంగా పెరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ జనం విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే పెట్రోల్ ధరలు పెరిగాయని, త్వరలో దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

చంద్రబాబుకు నోటీసులిస్తే ఏమైతది..
ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులపై స్పందిస్తూ.. నోటీసులు పూర్తిగా కోర్టు వ్యవహారం అని, బీజేపీకి సంబంధంలేదని వ్యాఖ్యానించారు.  కోర్టు నుంచి 25 నోటీసులు వచ్చినా ఆయన కేసుకు హాజరు కాలేదని, అలాంటి నోటీసులు వస్తే ఏమైతుందని ప్రశ్నించారు. 2010లో అక్కడ, ఇక్కడ అధికారంలో కాంగ్రెస్‌పార్టీనే ఉందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు. రాజకీయ సానుభూతి కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నాని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ తెలుగు బిడ్డలు అయిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి అంజయ్యను ఏ విధంగా అవమాన పరిచారో నేటికీ తెలంగాణ ప్రజలు గుర్తుంచుకున్నారని తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల పొత్తు రాష్ట్ర ప్రజలు హర్షించరని ఆయన చెప్పారు. కేఆర్ ఇచ్చిన హామీ ఏమైంది?: అమిత్ షా

Updated By ManamSat, 09/15/2018 - 12:57
 • అవకాశ రాజకీయాలతోనే ముందస్తు ఎన్నికలు కేసీఆర్

 • దళితుడిని సీఎంను చేస్తాన్న కేసీఆర్ హామీ ఏమైంది?

 • తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ

 • టీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందనుకోవడం లేదు

 BJP President Amit Shah Pressmeet in Hyderabad

హైదరాబాద్ :  ఒకే దేశం-ఒకే ఎన్నికలు అనేది తమ నాయకుడు నరేంద్ర మోదీ నినాదమని భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఉటంకించారు. తెలంగాణలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. శనివారం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ఆయన పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం అయ్యారని అమిత్ షా విమర్శించారు.

‘జమిలీ ఎన్నికలను కేసీఆర్ ముందు సమర్థించారు. అయితే ఆయన అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ప్రజలపై కోట్లాది రూపాయలు భారం ఎందుకు వేయాలనుకుంటున్నారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలు చేయడం లేదా?. తన కుటుంబం కోసమే ఆయన ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారు. తెలంగాణను మళ్లీ రజాకార్ల చేతిలో పెట్టాలనుకుంటున్నారా?

కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం. కేసీఆర్ పాలన చూస్తుంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకోవడం లేదు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది?. 2014లో దళితుడే సీఎం అన్న కేసీఆర్ మాట ఏమైంది?.  2018లో అయినా దళిత సీఎం హామీ నిలబెట్టుకుంటారా?. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ విషయంలోనూ కేసీఆర్ విఫలం అయ్యారు.

మూఢ నమ్మకాలతో సచివాలయానికి వెళ్లని సీఎం కేసీఆర్ ఒక్కరే. అలా చేయడం సబబేనా?. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను ప్రపంచస్థాయికి చేరుస్తామన్న హామీ ఏమైంది? టీఆర్ఎస్ పాలనలో 4,500మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. పంటకు మద్దతు ధర అడిగిన రైతులను ఖమ్మంలో అరెస్ట్ చేయించారు. అలాగే ఇసుక మాఫియా  ప్రశ్నిస్తే నేరెళ్లలో దళితుల్ని వేధించారు’ అని అమిత్ షా మండిపడ్డారు.హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

Updated By ManamSat, 09/15/2018 - 11:32

BJP chief amit shah reached hyderabadహైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి నగరానికి వచ్చేసిన ఆయనకు బేగంపేట విమాశ్రయంలో పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. కాగా తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పాలమూరులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు.  బీజేపీ నిర్వహిస్తున్న తొలి ఎన్నికల సభ ఇదే కావడంతో పార్టీ శ్రేణులు విస్తృతంగా ఏర్పాటు చేశాయి.బాబుకు అరెస్ట్ వారెంట్.. టీడీపీ నేతల మండిపాటు

Updated By ManamFri, 09/14/2018 - 11:29

Chandrababuహైదరాబాద్: బాబ్లీ కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఇదంతా మోదీ, అమిత్ షా కుట్ర అని మంత్రి బోండా ఉమ వ్యాఖ్యలు చేశారు. 8 ఏళ్ల నాటి కేసులో ఇప్పుడెందుకు అరెస్ట్ వారెంట్ ఇచ్చారని, ఇది కూడా ఆపరేషన్ గరుడలో భాగమేనని అన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే బాబ్లీ ఉద్యమం చేశారని, మహారాష్ట్ర బీజేపీ ప్రమేయంతోనే ఈ కుట్ర అంతా జరిగిందని చెప్పారు. మరోవైపు దీనిపై స్పందించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఇదంతా మోదీ, అమిత్ షా ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.

వారితో పాటు మంత్రి నక్కా ఆనంద్‌బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు చరిష్మాను దెబ్బతీయాలని కేంద్రం చూస్తోందని, తెలుగు ప్రజల హక్కుల కోసమే బాబ్లీ ఆందోళన చేశారని అన్నారు. ఇక ఈ వివాదంపై స్పందించిన మంత్రి సోమిరెడ్డి.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా వారెంట్ ఇవ్వడం కక్షసాధింపు చర్యేనని వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల కోసం న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారని, తెలంగాణలో మహాకూటమికి షాక్ ఇవ్వాలనే చంద్రబాబుకు వారెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇక ఈ వారెంట్‌కు నిరసనగా నెల్లూరులో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నట్లు సోమిరెడ్డి చెప్పారు. 24 గంటల్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేసును ఉపసంహరించుకోవాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు.ఖరారైన అమిత్‌షా తెలంగాణ పర్యటన

Updated By ManamThu, 09/13/2018 - 12:17

Amit Shahహైదరాబాద్: బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న అమిత్ షా‌ తెలంగాణకు రానున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్న అమిత్ షా.. అనంతరం శక్తి కేంద్ర ప్రముఖులతో సమావేశం కానున్నారు. వారితో పాటు ఆఫీస్ బేరర్స్, జిల్లా ఇంచార్జ్‌లు, అధ్యక్షులతో భేటీ కానున్నారు అమిత్ షా. అనంతరం 15న సాయంత్రం మహబూబ్‌నగర్‌లో జరగబోయే బహిరంగసభలో పాల్గొననున్నారు.అమిత్ షా వచ్చిన తర్వాతే...

Updated By ManamWed, 09/12/2018 - 18:22
 • కుటుంబ పాలనను ఓడించాలి

 • గ్రామాల్లో బీజేపీలో భారీ చేరికలు

 • ఎన్నికల షెడ్యూల్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన

 • బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి

bjp leader kishan reddy comments on party condidates list

హైదరాబాద్ : గత కొన్ని రోజలుగా అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో మునిగిపోయాయి. కానీ బీజేపీ మాత్రం తమకేం తొందర లేదని, ముందెళ్లిన పార్టీలు తొందరగా అలసిపోతాయని ఆ పార్టీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ వంటి కుటుంబ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నాలుగేండ్ల తర్వాత ఫ్రంట్ పెడతామని టీఆర్‌ఎస్ అంటే తెలంగాణ ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న వారసత్వ రాజకీయాలకు బుద్ధిచెప్పాలని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చిన తర్వాతనే ఏ పార్టీతోనైనా చర్చలు, పొత్తులు ఉంటాయని ప్రకటించారు.

కేంద్రంలో బీజేపీ పథకాలను చూసి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున యువత చేరుతోందని తెలిపారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని నష్టపోయినట్టు పేర్కొన్నారు. చుట్టు పక్కల రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, తెలంగాణలోనూ బీజేపీనే గెలుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ తీసుకువస్తున్న ఫ్రంట్‌ల‌తో టెంట్లతో తమకేమీ నష్టం లేదని విమర్శించారు. తెలంగాణలో తమ హామీలపై వస్తున్న విమర్శలను చూసి టీఆర్‌ఎస్ భయపడి ముందస్తు ఎలక్షన్స్ పెట్టిందని విమర్శించారు.

అసోంలో చివరి మూడు రోజుల్లో తీర్పు మారిందని, ఆంధ్రలో కూడా వారం రోజుల ముందు జగన్ ముందున్నప్పుటికీ మోదీ పర్యాటనతో టీడీపీ గెలిచిందని వివరించారు. తెలంగాణలో చేయాల్సిన కార్యచరణపై బహిరంగ సభలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. అమిత్ షా సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థులను ముందుగానే ప్రకటించబోమని, ఎన్నికల షెడ్యూల్ తర్వాతే బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.బీజేపీలో కొనసాగుతున్న సస్పెన్స్

Updated By ManamSun, 09/09/2018 - 12:49
 • ఎంఐఎం, బీజేపీతో పొత్తులో టీఆర్ఎస్!

 • బీజేపీ, ఎంఐఎం స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించని గులాం అధినేత!

Suspense Continues on Telangana bjp codidate list

హైదరాబాద్ : అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేందుకు ముందు కొస్తుంటే బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఎన్ని కల్లో అభ్యర్థులను ప్రకటించడంలో కొన్ని రోజలు వేచిచూడనున్నట్టు తెలుస్తోంది. అధికారం తమకే వస్తుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ఇంకా తమ అభ్యర్థుల విషయంలో 15వ తేదీ వరకు వేచి చూస్తామనడంతో పార్టీ వర్గాల్లో కొత్త టెంక్షన్ మొదలైంది. ఎవరికి టికెట్ దక్కుతుందోనని అభ్యర్థులు ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు. 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పక్కా వ్యూహంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించడం లో కొన్నిరోజులు వేచి చూస్తుండటం చూస్తుంటే ఇప్పటికే దేశం అంతటా విస్తరిస్తున్న బీజేపీ తెలంగాణలోనూ తమ జెండాను ఎగురవేసేందుకు సిద్ధమౌతున్నట్టు సమాచారం. తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలపై భారీ బహిరంగ సభలో పేర్కొననున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీజేపీ జెండాను తెలంగాణ లో ఎగురవేసేందుకు ఇప్పటికే తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి టీజేఎస్ పార్టీతో చర్చలు జరిపారు.

బీజేపీ, ఎంఐఎం బలంగా ఉన్న స్థానాల్లో టీఆర్‌ఎస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించక పోవడం చూస్తుంటే ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందేమో అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. నిలబెట్టినా పార్టీలో బలం ఉన్న అభ్యర్థులను కాకుండా కొత్త వారిని నిలబెట్టడంతో గెలిచినా, ఓడినా లాభమేనని వ్యూహం పన్నుతున్నట్టు పలువురు రాజకీయ వేత్తలు పేర్కొన్నారు. 

ఎంఐఎం తమ మిత్ర పక్షమే అని కేసీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొనడం చూస్తుంటే ఎంఐఎం, బీజేపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ తమ అభ్యర్థులపై జాబితాను అమిత్ షా సభ తర్వాత ప్రకటించడం చూస్తుంటే పక్కా వ్యూహంతో బీజేపీ వస్తున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. 15వ తేదీలోపు సభ ఏర్పాటు చేసి అభ్యర్థులను కూడా అదే సభలో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని పార్టీలు బీసీలకు పెద్ద పీఠ వేయ కుండా తక్కువ శాతం ఉన్న కులాలకే ప్రాధాన్యత ఇస్తుండటంతో బీసీలపై బీజేపీ దృష్టి సారించను న్నట్టు సమాచారం. 

తెలంగాణలో 50శాతానికిపైగా ఉన్న ఉన్న బీసీలపై ప్రాధాన్యం ఇస్తే పార్టీకి ఓట్లు రా లే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 119స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ పొత్తుపెట్టుకుంటే అధికారం లోకి వచ్చే అవకాశం ఉండటంతో బీజేపీ పలు వ్యూ హాలను రచిస్తోంది. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టికెట్టు కేటాయించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తమ నియోజక వర్గంలో బలంగా ఉన్న అభ్యర్థులు పార్టీ టికెట్ దక్కని వారిని కూడా బీజేపీ కండువ కప్పనున్నట్టు సమాచారం. ఇప్పటికే తమతో కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నేతలు టచ్‌లో ఉన్నారని తాజా మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ చెబుతుండటంతో బీజేపీ పార్టీపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.శ్రీమఠాన్ని సందర్శించిన అమిత్ షా

Updated By ManamSat, 09/01/2018 - 23:26
 • రాఘవేంద్రస్వామి కటాక్షంతో దేశం సుభిక్షంగా ఉండాలి : బీజేపీ జాతీయాధ్యక్షుడు

imageమంత్రాలయం: మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి మఠాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం సందర్శించారు. మంత్రాలయంలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా, శ్రీమఠం పీఠాధిపతి శ్రీసుభుదేంద్రతీర్థుల నేతృత్వంలో రాఘవేంద్రస్వామి పీఠానికి శనివారం ఉదయం విచ్చేశారు. మఠం సాంప్రదాయాల మేరకు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత అమిత్‌షా గ్రామదేవత మాంచాలమ్మను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం శ్రీమఠంలోని జగద్గురువులు శ్రీరాఘవేంద్రస్వామి సజీవ బృందావనం సన్నిధికి చేరుకొని విశిష్ట పూజలు నిర్వహించారు.

పీఠాధిపతి ఆశీర్వాద గదిలో శ్రీసుభుదేంద్రతీర్థులు శ్రీరాఘవేంద్రస్వామి విశిష్టతను, మహిమను అమిత్ షాకుimage తెలియజేశారు. ఆ తర్వాత పీఠాధిపతి అమిత్ షాను మఠం సాంప్రదాయాల మేరకు సన్మానించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి జ్ఞాపికను అందజేసి, తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఆపై అమిత్ షా శ్రీమఠం నిర్వహణలో కొనసాగుతున్న గోశాలను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం శ్రీసుజయీంద్ర ఆరోగ్యశాల దగ్గర అమిత్‌షా విలేకరులతో మాట్లాడారు. జగద్గురువు శ్రీరాఘవేంద్రస్వామి కొలువైన కారణంగా మంత్రాలయం ఎంతో చారిత్రక విశిష్టతను సంతరించుకోవడమేగాక పుణ్యభూమిగా రూపుదిద్దుకొందన్నారు. మంత్రాలయం క్షేత్ర దర్శనం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. స్వామి కృపాకటాక్షాలతో దేశం సుబిక్షంగా ఉంటుందన్నారు. ప్రధాని మోదీ కొనసాగిస్తున్న ప్రజారంజక పాలనతో సంతసించిన దేశవాసులు మరోమారు మోదీనే ప్రధానిగా ఎన్నుకోవడానకి సిద్ధంగా ఉన్నారని అమిత్ షా అన్నారు.ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది...

Updated By ManamThu, 08/30/2018 - 17:02
 • ఎన్డీయేతో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు

 • బిహార్‌లో ఎన్డీయేతో జేడీయూ టై-అప్

 • బీజేపీకి 20, జేడీయూకు 12 సీట్లు

nitish kumar- amit shah

పట్నా: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు వేగవంతం చేశాయి. అంతేకాకుండా పొత్తులపై ఆయా పార్టీలు ఎడతెగని మంతనాలు జరుపుతున్నాయి. తాజాగా బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.... సీఎం నితీశ్ కుమార్‌తో చర్చల అనంతరం సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా... బీజేపీకి 20 సీట్లు, జేడీయూ 12, రాంవిలాస్ పాశ్వాన్ ఎల్‌‌జేపీ 6, ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పి 2సీట్లలో  పోటీ చేయనున్నట్లు ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిప్పు-ఉప్పుగా ఉండే ఆర్జేడీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు జేడీయూ నేత నితీష్ కుమార్. అయితే ఆర్జేడీ-జేడీయూ మధ్య సఖ్యత ఎక్కువ కాలం సాగలేదు. దీంతో నితీశ్ మళ్లీ ఎన్డీయేకు దగ్గరయ్యారు. అయితే  వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై బీజేపీ-జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా... అమిత్ షా భేటీతో ... సీట్ల పంపకాల మధ్య అవగాహన కుదిరింది. ఎయిమ్స్‌లోనే అమిత్ షా మకాం..

Updated By ManamThu, 08/16/2018 - 10:21
amit shah

న్యూఢిల్లీ :  బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించారు. కాగా వాజ్‌పేయికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.

కాగా బుధ‌వారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప‌లువురు కేంద్ర‌మంత్రులు వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించారు. అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.  గత 24 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విష‌మించింద‌ని బుధవారం రాత్రి 10.15 గంటలకు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. కాగా కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయ్ జూన్ 11న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు.
 

Related News