Amit Shah

ఎయిమ్స్‌లోనే అమిత్ షా మకాం..

Updated By ManamThu, 08/16/2018 - 10:21
amit shah

న్యూఢిల్లీ :  బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం అంతకంతకు క్షీణించడంతో కేంద్ర మంత్రులతో పాటు పార్టీ నేతలు ఎయిమ్స్‌లోనే ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుక్రవారం ఉదయం ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని పరామర్శించారు. కాగా వాజ్‌పేయికి వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరికాసేపట్లో ఎయిమ్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనుంది.

కాగా బుధ‌వారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప‌లువురు కేంద్ర‌మంత్రులు వాజ్‌పేయిని ప‌రామ‌ర్శించారు. అలాగే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు.  గత 24 గంటల్లో వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి మరింత విష‌మించింద‌ని బుధవారం రాత్రి 10.15 గంటలకు ఎయిమ్స్ ఒక ప్రకటన విడుద‌ల చేసిన విషయం తెలిసిందే. కాగా కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో వాజ్‌పేయ్ జూన్ 11న ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తూనే ఉన్నారు.
 ఒకేసారి ఎన్నికలు అసాధ్యం: ఈసీ

Updated By ManamTue, 08/14/2018 - 12:46
Election commission

న్యూఢిల్లీ : ‘వన్ నేషన్-వన్ పోల్’ విధానాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఈసీ స్పష్టం చేసింది. అయితే  వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు జరుగుతాయంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

కాగా వచ్చే ఏడాది లోక్‌సభతో పాటు 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ను సమర్థిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్‌కు సోమవారం లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై ఈసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏకకాలంలో ఎన్నికలపై  కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తగినన్ని వీవీప్యాట్స్‌ లేవని తెలిపారు. అయితే జమిలీ ఎన్నికల నిర్వహణపై రెండు, మూడు నెలల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

ఒకవేళ ఒకవేళ జమిలీ ఎన్నికలు జరిగితే 34 లక్షల ఈవీఎంలు, 26 లక్షల కంట్రోల్ యూనిట్లు, 27 లక్షల వీవీప్యాట్‌లు అవసరం కానున్నాయి. కాగా జమిలీ ఎన్నికలను... అధికార ఎన్డీఏతో పాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌ వాదీ, టీఆర్‌ఎస్‌ సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. 

Updated By ManamSun, 08/12/2018 - 09:02
  • ఎయిమ్స్‌లో పరామర్శించిన అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్..

Rajnath Singh, Amit Shah, Atal Bihari Vajpayee, AIIMSన్యూఢిల్లీ: ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి (93) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయిని పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎయిమ్స్ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కిడ్నీలో ఇన్ఫెక్షన్‌, ఛాతిలో నొప్పి, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో పాటు డయాబెటిస్ ఉన్న ఆయన జూన్ 11న ఎయిమ్స్‌లో చేరారు. అప్పటినుంచి అక్కడే వాజ్‌పేయి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయనకు ఒక కిడ్నీ మాత్రమే పనిచేస్తుండగా.. దానికితోడు డిమెన్షియా కూడా ఉంది. 2009లో వాజ్‌పేయికి గుండెపోటు వచ్చింది. కాగా, వాజ్‌పేయి ఆరోగ్యానికి సంబంధించి ఇటీవల వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. అమిత్ షాకు నల్లజెండాలతో నిరసన

Updated By ManamSat, 08/11/2018 - 14:51
  • అమిత్ షా పర్యటన సందర్భంగా కోల్‌కోతాలో  టెన్షన్ వాతావరణం

amit shah kolkata tour

కోల్‌కతా :  భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు కోల్‌కోతా పర్యటన ఉద్రిక్తంగా మారింది. అమిత్ షా పర్యటన సందర్భంగా... ఓవైపు బీజేపీ శ్రేణుల ఘన స్వాగతం, మరోవైపు తృణమూల్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తాయి. శనివారం ఉదయం కోల్‌కతా విమానాశ్రయంలో అమిత్ షాకు పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం, జైశ్రీరామ్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

కాగా మయో రోడ్‌లో ఏ బీజేపీ యువ మోర్చా నిర్వహిస్తున్న యువ స్వాభిమాన్ ర్యాలీలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు.. ప్రధాని మోదీ, అమిత్ షా, ఎంపీ పూనం మహాజన్‌లకు స్వాగతం పలుకుతూ రోడ్ల వెంబడి భారీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు.  అయితే దానికి కౌంటర్‌గా తృణమూల్ కాంగ్రెస్ శ్రేణులు అమిత్‌షా రాకను వ్యతిరేకిస్తూ ‘భాజపా గోబ్యాక్‌’ పోస్టర్లు పెట్టారు. 

అంతేకాకుండా అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓ దశలో అమిత్ షా కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు తృణమూల్ కార్యకర్తలు యత్నించారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా బీజేపీ, తృణమూల్ కార్యకర్తలు పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించడంతో పలు ప్రాంతాల్లో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.రాహుల్ బాబా లెక్కపెట్టడం వచ్చా?

Updated By ManamSat, 08/04/2018 - 17:12
  • సోనియా, రాహుల్‌పై నిప్పులు చెరిగిన అమిత్ షా

amit shah

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ... యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. శనివారం రాజస్థాన్‌లోని రాజ్‌సమద్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు ఇటాలియన్ భాష రాదు. ఒకవేళ ఆ భాష వచ్చి ఉంటే రాహుల్ గాంధీకి ఆ భాషలోనే జవాబు చెప్పి ఉండేవాడిని. రాహుల్ బాబా మీకు లెక్కించడం వస్తే లెక్కపెట్టండి, నాకు ఇటాలియన్ రాదు, లేకుంటే ప్రజలకు మేం ఎంత చేశామో మీకు ఇటాలియన్‌లోనే చెప్పి ఉండేవాడిని’ అని నిప్పులు చెరిగారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజస్థాన్ ప్రజల కోసం మోదీ ప్రభుత్వం 116 పథకాలను అమలు చేస్తోందని అమిష్ షా అన్నారు.

కాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అక్కడ  రాజస్థాన్ గౌరవ యాత్రను ప్రారంభించింది. 58 రోజుల పాటు కొనసాగనున్న  ఈ యాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. మోదీ, అమిత్ షాతో కృష్ణంరాజు భేటీ

Updated By ManamWed, 08/01/2018 - 17:59
krishnam raju

న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో భేటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానంపై కీలకంగా చర్చించారు. అలాగే  ఏపీలో రాజకీయ పరిణామాలు, వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలు  తదితర అంశాలపై ప్రత్యేకంగా తయారు చేయించిన నివేదిక సమర్పించారు.

కాగా గత కొంతకాలంగా కృష్ణంరాజు  క్రియశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ప్రధాని, పార్టీ అధ్యక్షుడితో కృష్ణంరాజు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి: అమిత్ షా

Updated By ManamWed, 08/01/2018 - 17:22

amit shah

 

 

 

 

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అమిత్ షా  ఈ నెల 11న  కోల్‌కతా పర్యటించనున్నారు. బీజేపీ  యువ మోర్చా ఆధ్వర్యంలో సిటీ పోలీసు ప్రధాన కార్యాలయం వెలుపల జరిగే నిరసన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు.

అయితే ఆ ర్యాలీకి బెంగాల్ పోలీసుల నుంచి అనుమతి లభించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన స్పందిస్తూ..‘ ఇక్కడ అనుమతి సమస్య కాదు. ర్యాలీకి  పోలీసులు ఇచ్చినా, ఇవ్వకపోయినా నేను కోల్‌కతా వెళుతున్నా. కావాలనుకుంటే వారు నన్ను అరెస్ట్ చేసుకోవచ్చు’ అని వ్యాఖ్యలు చేశారు. 

కాగా  2019 సార్వత్రిక ఎన్నికలపై అమిత్ షా ఇప్పటికే వ్యూహ రచనలో బిజిబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన  పశ్చిమ బెంగాల్‌లో పట్టు కోసం పావులు కదుపుతున్నారు. ఆ రాష్ట్రంలో 50 శాతం లోక్‌సభ సీట్లు కైవసం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. బెంగాల్‌లో ప్రాబల్యం పెంచుకునేందుకు అమిత్‌ షా ప్రచార ర్యాలీలతో హోరెత్తించేందుకు సిద్దమయ్యారు. 

అయితే నాలుగేళ్ల క్రితం కూడా కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీకి అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి అనుమతి పొందింది. తాజాగా అమిత్ షా పర్యటనపై బెంగాల్ పార్టీ వర్గాలు మాట్లాడుతూ... అమిత్ షా పర్యటనపై పోలీసుల అనుమతికి సంబంధించి ఇప్పటివరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు. పౌరసత్వంపై అట్టుడికిన రాజ్యసభ

Updated By ManamTue, 07/31/2018 - 13:27
rajyasabha

న్యూఢిల్లీ  : అసోం అంశంపై రాజ్యసభ రెండోరోజు కూడా అట్టుడికింది. దాదాపు 40 లక్షల మంది పౌరులకు పౌరసత్వం లభించకపోవడంపై విపక్షాలు ఇవాళ కూడా సభలో  నిరసన వ్యక్తం చేశాయి. పోడియం చుట్టుముట్టిన విపక్ష సభ్యులు ఎన్డీయే సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నిరసన విరమించాలని కోరినా ఫలితం లేకపోయింది.  అనంతరం ఇదే అంశంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  సభా కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలగడంతో సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.

మరోవైపు లోక్‌సభలోనూ రోహింగ్యా శరణార్థులపై వాడీవేడిగా చర్చ జరిగింది. అక్రమంగా వచ్చిన వారిని వెనక్కి తిప్పి పంపుతామని కేంద్రం స్పష్టం చేసింది. కాగా రోహింగ్యాలపై ఎన్డీయే తీరును టీఎంసీ తప్పుబట్టింది.

అంతకు ముందు పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు ఆందోళన బాటపట్టాయి. అసోంలో ఎన్‌ఆర్సీ ముసాయిదా విడుదలపై టీఎంసీ, సమాజ్‌వాదీ సభ్యులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే 40లక్షలమందికి పౌరసత్వాన్ని తిరస్కరించారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ఎన్డీయే విధానాలతో స్వదేశంలోనే భారతీయులు శరణార్థులుగా మారిపోయారని మండిపడ్డారు.శివసేన అధినేతకు అమిత్ షా ఫోన్

Updated By ManamThu, 07/19/2018 - 16:22
  • రంగంలోకి దిగిన అమిత్ షా

  • అవిశ్వాసం ఎదుర్కొనేందుకు యత్నాలు

amit shah

న్యూఢిల్లీ: మోదీ సర్కార్ శుక్రవారం నాడు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ అమిత్ షా పాత, కొత్త మిత్రులను సంప్రదిస్తున్నారు. ఫోన్‌లో మాజీ స్నేహితులను పలకరిస్తూ మద్దతుగా నిలవాలంటూ కోరుతున్నారు. ఓ వైపు పార్టీ ఎంపీలతో వ్యూహాత్మక సమావేశం ఏర్పాటు చేసిన షా.. మరోవైపు చిరకాల మిత్రుడు, భాగస్వామి శివసేన అధినేతకు ఫోన్ కలిపారు.

ఇరువురి మధ్య జరిగిన మంతనాల సారాంశం.. అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే అండగా నిలవాలంటూ అమిత్ షా అభ్యర్థించగా, థాక్రే అంగీకరించారట. ఈ విషయాన్ని శివసేన అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలనే నిర్ణయం జరిగిపోయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అంతకుముందు, శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో ఏంజరగనుందనే విషయంపై గురువారం సాయంత్రానికీ స్పష్టంకాలేదని రౌత్ వివరించారు. మరో 24 గంటల పాటు ఎదురుచూస్తే.. తమ పార్టీ ఎవరివైపు నిలుచుందనే విషయం తేలిపోతుందని రౌత్ పేర్కొన్నారు.అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు

Updated By ManamSat, 07/14/2018 - 13:55
amit shah

న్యూఢిల్లీ :  అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు చేశారంటూ వస్తున్న వార్తలపై ఆ పార్టీ క్లారిటీ ఇచ్చింది. అమిత్ షా తెలంగాణ పర్యటన సందర్భంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లోగా అయోధ్యలో రామాలయ నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్పినట్లు మీడియాలో వస్తున్న వార్తలను బీజేపీ ఖండించింది. 

‘అమిత్ షా శుక్రవారం తెలంగాణ పర్యటన సందర్భంగా రామ మందిర నిర్మాణంపై ప్రకటన చేశారంటూ  కొన్ని మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. అయితే రామ మందిరంపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆ అంశంపై ఎజెండాలో కూడా లేదంటూ’ఆ పార్టీ శనివారం ట్వీట్ చేసింది. 

కాగా వచ్చే ఎన్నికల లోపే రామ మందిర నిర్మాణం చేపట్టేలా చర్యలు ఉంటాయని అమిత్ షా తెలిపారని  బీజేపీ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ శ్రేణులతో అమిత్ షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ సొంత బలంతోనే రాబోవు ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా అమిత్ షా దిశా నిర్దేశం చేశారన్నారు.  బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేలా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సాగిందన్నారు.

Related News