suicide attempt

గాంధీ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్

Updated By ManamSun, 11/04/2018 - 18:52
  • పెట్రోల్ పోసుకున్న భిక్షపతి యాదవ్ అనుచరుడు

 Bikshapathi Protest: Tension mounted at Gandhi Bhavan

హైదరాబాద్ : టికెట్ ఆశావాహులు ఆందోళనకు దిగటంతో గాంధీ భవన్ వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. సీట్ల కేటాయింపుపై గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లి టికెట్ కోసం కాంగ్రెస్ నేత భిక్షపతి యాదవ్ ఆదివారం తన అనుచరులతో గాంధీ భవన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనలో ఒక్క సారిగా భిక్షపతి యాదవ్ అనుచరుడు పెట్రోల్ పోసుకోని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరొకరు చేతిని కోసుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ... అతడిని అక్కడ నుంచి ఆస్పత్రికి తరలించారు.

 Bikshapathi Protest: Tension mounted at Gandhi Bhavan

 కేసీఆర్‌‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చా..

Updated By ManamSun, 09/30/2018 - 17:01
  • ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదు

  • ఉస్మానియా వైద్య సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి వచ్చా.

man compaliant against to Osmania Hospital హైదరాబాద్ : ప్రగతి భవన్ ఎదుట ఆదివారం ఓ వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడన్న వార్త కలకలం రేపింది. అయితే గుడిమల్కాపూర్‌కు చెందిన తోఫిక్ ... చాదర్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లగా అక్కడ వైద్య సిబ్బంది సరైన వైద్యం అందించలేదు.

దీనిపై ప్రశ్నించగా, దాడికి పాల్పడ్డారని, వారి నిర్వాకంపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయటానికి వచ్చానట్లు బాధితులు తెలిపాడు. అయితే తన గాయాలు చేసిన సీఎం క్యాంప్ ఆఫీస్ పోలీసులు వెంటనే చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పాడు. అంతేగానీ తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడలేదని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 నా పై దాడి చేసి చంపాలని చూశారు: బాల్క 

Updated By ManamWed, 09/12/2018 - 15:55
MP Balka Suman Sensational Comments over nallala odelu follower suicide attempt

చెన్నూరు : ఎంపీ బాల్క సుమన్‌కు చెన్నూరు అసెంబ్లీ టికెట్ కేటాయింపుతో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. చెన్నూర్‌ నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదేలుకు కాకుండా ఆ సీటును బాల్క సుమన్‌కు కేటాయించడంపై ఓదేలు అనుచరులు నిరసన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. 

జైపూర్‌ మండలం ఇందారంలో బుధవారం శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా ఓదేలు అనుచరులు నిరసనకు దిగారు. అంతేకాకుండా బాల్క సుమన్‌ను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఓ కార్యకర్త తనతో పాటు తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అయితే అతడితో పాటు మరో నలుగురికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

odelu supporters

ఈ ఘటనపై ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ... టికెట్ కేటాయించిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన తనపై దాడి చేసి చంపాలని చూశారని, తాను చనిపోతే చెన్నూర్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఓదేలు వర్గం వారు చేస్తున్న బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు.

పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకే తాను చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగుతున్నట్లు చెప్పారు. ఆ నెల 14 నుంచి చెన్నూరులో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని, చెన్నూరును మరో సిద్ధిపేటలాగా అభివృద్ధి చేస్తానని బాల్క సుమన్ తెలిపారు.బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కలకలం

Updated By ManamWed, 08/15/2018 - 13:11
  • బంజారాహిల్స్ పీఎస్ వద్ద వ్యక్తి ఆత్మహత్యాయత్నం

Man Suicide Attempt Front Of  Banjarahills Police Station

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఇది చూసిన పోలీసులు, స్థానికులు మంటలను ఆర్పి, ఆస్పత్రికి తరలించారు. కాగా ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి ముషీరాబాద్‌కు చెందిన సతీష్‌గా పోలీసులు తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగానే అతడు ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించారు.

వివరాల్లోకి వెళితే బంజారాహిల్స్‌ దేవరకొండ బస్తీకి చెందిన యువతితో సతీష్‌కు వివాహమైంది. అయితే వారిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సతీష్ నిన్న అత్తంటి ఎదుట గొడవ చేయడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో తనపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సతీష్... అత్తింటివారిని బెదిరించాడు. అయితే వారు ఫిర్యాదు వెనక్కి తీసుకోకపోవడంతో అతడు ఇవాళ ఉదయం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సతీష్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

 

Related News