rambabu

మెసేంజర్ యాప్‌లో ప్రియుడితో స్కెచ్ వేసి.. భర్తను చంపిన భార్య

Updated By ManamWed, 09/12/2018 - 11:40

Murderఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో దారుణం జరిగింది. ప్రియుడి కోసం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపింది భార్య. మెసేంజర్ యాప్ ద్వారా స్కెచ్ వేసి తన భర్తను చంపేసి ఏమీ తెలీనట్లు ఉండిపోయింది ఆ భార్య. గత నెల 26న అనుమానాస్పద స్థితిలో భర్త మరణించగా.. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది.

కాగా తోటవారిపల్లె వీధికి చెందిన రాంబాబు, ప్రియదర్శిని 17ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరిద్దరికి ఒక బాబు, పాప కూడా ఉన్నారు. అయితే ఆ తరువాత నుంచి ఈ ఇద్దరి మధ్య తరచుగా తగాదాలు వస్తుండగా.. ఆ క్రమంలో ప్రియదర్శినికి ఫేస్‌బుక్‌లో పరిచయం అయ్యాడు శివసాయి కిశోర్. ఇంట్లో తగాదాల వలన భర్తను వదిలిపెట్టి ప్రియుడితో చెన్నైకి చెక్కేసింది ప్రియదర్శిని. అయితే పోలీసుల సాయంతో మళ్లీ ప్రియదర్శినిని వెనక్కి తెచ్చుకున్నాడు రాంబాబు. 

ఇక ఆ తరువాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న ప్రియదర్శిని.. ఇటీవల మెసేంజర్ యాప్ ద్వారా ప్రియుడు కిశోర్‌తో ముచ్చట్లు మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఈ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతో రాంబాబును చంపేందుకు వారిద్దరు ప్రణాళికను వేసుకున్నారు. గత నెల 26న కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ప్రియదర్శిని, రాంబాబుకు ఇవ్వగా అతడు నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాత వారి ఇంటికి వచ్చిన కిశోర్, ప్రియదర్శిని సాయంతో రాంబాబు గొంతు నలిపి చంపేశాడు. అనంతరం కేసు తన మీదకు రాకూడదని కిశోర్‌కు 2లక్షల రూపాయలను కూడా ఇచ్చింది. అయితే పోస్ట్‌మార్టంలో అసలు విషయం బయటపడటంతో పోలీసులు ప్రియదర్శినిని ప్రశ్నించగా నిజం బయటికొచ్చింది. వెంటనే ప్రియదర్శిని, కిశోర్‌లపై కేసును నమోదుచేసుకున్న పోలీసులు వారిద్దరి తమ అదుపులోకి తీసుకున్నారు.నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించారు...

Updated By ManamWed, 08/22/2018 - 16:54
  • విద్యార్థిని గర్భవతిని చేసి, అబార్షన్ టాబ్లెట్స్ ఇచ్చిన టీచర్

Teacher Paraded Naked

ఏలూరు : పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేయిస్తానంటూ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడని ఆరోపిస్తూ ఓ ఉపాధ్యాయుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. అతగాడి బట్టలు ఊడదీసి, నగ్నంగా వీధుల్లో ఊరేగించిన అనంతరం పోలీసులకు అప్పగించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఏలూరులోని ఓ ప్రయివేట్ స్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌‌గా పనిచేస్తున్న రాంబాబు... పరీక్షల్లో ఎక్కువమార్కులు వేయిస్తానంటూ గత రెండేళ్లుగా ఆ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. 

ఇటీవలే ఆ విద్యార్థిని గర్భం దాల్చడంతో... రాంబాబు ఆమెకు అబార్షన్‌ అయ్యేందుకు టాబ్లెట్స్ ఇచ్చాడు. దీంతో ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో ... కుటుంబీకులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఉపాధ్యాయుడిని మాట్లాడదాం రమ్మంటూ... అతడికి దేహశుద్ధి చేశారు.

నడిరోడ్డుపై అతడిని నగ్నంగా ఊరేగించారు. ఈ తతంగాన్ని అంతా సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. కాగా పోలీస్ స్టేషన్‌కు తీసుకు వచ్చేసరికి రాంబాబు ఒంటిపై నూలుపోగు కూడా లేదు. దీంతో స్టేషన్‌లో అతడికి కప్పుకునేందుకు ఓ షర్టు, కట్టుకునేందుకు టవల్ ఇచ్చారు. అనంతరం రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News