September

బ్యాంకులకు వరుస సెలవులపై క్లారిటీ..

Updated By ManamFri, 08/31/2018 - 13:23
No continuous holidays for banks starting september 1st week

న్యూఢిల్లీ : వచ్చే నెల (సెప్టెంబర్ మొదటివారంలో) వరుసగా బ్యాంకులకు సెలవులంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం స్పందించింది. బ్యాంకులకు వరుస సెలవుల వార్తలు, కేవలం వదంతులేనంటూ కొట్టిపారేసింది. కేవలం రెండో శనివారం ఆదివారం మాత్రమే హాలిడేస్ అని స్పష్టం చేసింది. మిగతా రోజులు బ్యాంకులు పనిచేస్తాయని తెలిపింది. అలాగే అన్ని రాష్ట్రాల్లోని ఏటీఎంలో సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని పేర్కొంది. 

కాగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బ్యాంకులకు వరుసగా ఆరు రోజులు సెలవులు అంటూ సామాజిక మాద్యమాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో పాటు బ్యాంకు ఉద్యోగులు సామూహిక సెలవు ప్రకటించడంతో సామాన్య ప్రజానీకంతో పాటు చిరు ఉద్యోగులు కూడా బెంబేలు పడుతున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ... ఆర్బీఐ ఉద్యోగులు మాత్రమే సెలవు ప్రకటించారని, మిగతా బ్యాంకు ఉద్యోగులకు దీంతో ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఇక ఆన్‌లైన్ సేవలు యథాతథంగా కొనసాగనున్నట్లు పేర్కొంది.



వారంలో గ్రూప్-డీ హాల్ టికెట్లు.. సెప్టెంబర్‌లో పరీక్ష! 

Updated By ManamSat, 08/25/2018 - 16:56
  • ప్రస్తుతం గ్రూపు-సీ పరీక్షల నిర్వహణ.. వచ్చేనెలలో గ్రూపు-డీ

  • కేరళలో వరదలతో గ్రూపు-సీ పరీక్ష రద్దు చేసిన రైల్వే బోర్డు..

  • సెప్టెంబర్‌ 4న గ్రూపు-సీ పరీక్ష.. ఆ తర్వాతే గ్రూపు-డీ పరీక్ష

RRB Group D admit card 2018: Exam date to release by next week, call letters by Septemberన్యూఢిల్లీ: ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆర్ఆర్‌బీ గ్రూపు-డీ పరీక్ష తేదీలు వారంలో వెలువడనున్నాయి. కొన్ని మీడియాల్లో కథనాల ప్రకారం.. రైల్వే రిక్ర్కూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) ఆగస్టు 30న గ్రూపు డీ పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్‌బీ గ్రూపు-డీ పరీక్షను వాయిదా వేసుకుంటు వచ్చిన రైల్వే బోర్డు సెప్టెంబర్‌లో పరీక్షలను నిర్వహించనుంది. ప్రస్తుతం గ్రూపు-సీ (ఎఎల్పీ, టెక్నిషియన్) 66,502 పోస్టులకు ఆర్ఆర్‌బీ ఫస్ట్ స్టేజ్ పరీక్షను నిర్వహిస్తోంది. గ్రూపు-డీ అడ్మిట్ కార్డులు విడుదల చేసిన వెంటనే అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్ఆర్‌బీ గ్రూపు-సీ పరీక్షను నిర్వహిస్తుండగా కేరళల వరదల కారణంగా రైల్వే బోర్డు ఈ నెల 17న పరీక్షను మరోసారి రద్దు చేసింది. కేరళలో రద్దు చేసిన గ్రూపు-సీ పరీక్షను సెప్టెంబర్ 4న నిర్వహించనుంది. ఈ పరీక్షకు కేరళ నుంచి 27వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నెల 9న రద్దు చేసిన పరీక్షకు హాజరుకావాల్సిన అభ్యర్థుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు రైల్వే బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. 





Related News