PV Sindhu

ప్రీ క్వార్టర్స్‌కు సింధు

Updated By ManamWed, 11/14/2018 - 23:27
  • సమీర్ వర్మ కూడా... సైనాకు షాక్

  • హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

sindhuకౌలూన్ (హాంకాంగ్): ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు, సమీర్‌వర్మ బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తమతమ ప్రత్యర్థులను ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. తేలుగుతేజం, మూడో సీడ్ సింధు ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన నిచ్చాన్ జిందాపొల్‌ను 21-15, 13-21, 21-17తో మట్టికరిపించింది. తర్వాత జరగబోయే మ్యాచ్‌లో సింధు కొరియాకు చెందిన  సంగ్ జీ హ్యున్‌తో పోటీపడనుంది. మరో మహిళల సింగిల్స్‌లో సైనా నేహ్వాల్‌కు షాక్ తగిలింది. సైనా 21-10, 10-21, 19-21తో జపాన్‌కు చెందిన రెండో సీడ్ యవుగూచి చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్‌వర్మ 21-17, 21-14తో థాయ్‌లాండ్‌కు చెందిన సుప్నయ్‌ని ఓడించాడు.

షట్లర్ల ప్రతిభపై కోచ్ గోపీచంద్ సంతృప్తి
ఎడతెరిపిలేని టోర్నీలున్న ఈ ఏడాది భారత షట్లర్లపై జాతీయ బ్యాడ్మింటన్ ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ సంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఓవరాల్‌గా ఈ ఏడాది మాకు చాలా కఠినమైన సంవత్సరం. ఏ ఒక్క టోర్నీకి సిద్ధపడేందుకు తగినంత సమయం లేదు. ఈ ఏడాదిలోనే ఆసియా, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి పెద్ద టోర్నీలు వచ్చాయి. తప్పులను సరిచేసుకుని మరో టోర్నీలో పాల్గొనేందుకు తగినంత ప్రాక్టీస్ సమయం లేదు. అయినప్పటికీ కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు ఉన్నతమైన ర్యాంక్‌లు సాధించారు. పెద్ద టోర్నీల్లో అంటే ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ లేదా వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు సాధించారు. మా షట్లర్ల ప్రతిభ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను. వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తున్నాం’ అని గోపీచంద్ అన్నారు.



టైటి ల్‌పై కన్నేసిన సింధు

Updated By ManamTue, 11/13/2018 - 00:10

sindhuకొవ్‌లూన్ (హాంకాంగ్): భారత స్టార్ షట్లర్, తేలుగుతేజం పీవీ సింధు మంగళవారం నుంచి ప్రారంభంకాబోయే హాంకాంగ్ ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ ఏడాది జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో రజత పతకం సాధించిన సింధు... ఇండియా ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో సింధు తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన  జిన్‌దాపొల్‌తో పోటీపడనుండగా... క్వార్టర్స్‌లో చైనాకు చెందిన హీ బిన్‌గిజియోతో తలపడే అవకాశం ఉంది. ఈ ఏడాది బిన్‌గిజియోతో తలపడిన మూడు సార్లు సింధు ఓడిపోయింది. కామన్‌వెల్త్ గేమ్స్ లో రెండోసారి బంగారు పతకం సాధించిన సైనా నేహ్వాల్ ఆగస్టులో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సైనా తన తొలి మ్యాచ్‌లోనే జపాన్‌కు చెందిన రెండో సీడ్ యమగూచితో పోటీపడనుంది. గతనెల్లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో సైనా ఫైనల్‌కు చేరుకుని రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల విభాగంలో కిదాంబి శ్రీకాం త్ హాంకాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌తో పోటీపడనుండగా... సెకండ్ రౌండ్‌లో భారత్‌కు చెందిన ప్రణయ్‌తో పోటీపడే అవకాశముంది. ప్రణయ్ తన తొలి రౌండ్ ను డెన్మార్క్‌కు చెందిన ఆండర్స్‌తో తలపడనున్నాడు. ఈ సీజన్‌లో స్విస్ ఓపెన్, హైదరాబాద్ ఓపెన్ టైటిల్స్ గెలుపొందిన సమీర్‌వర్మ కూడా థాయ్‌ులాండ్‌కు చెందిన సుప్నయ్‌తో తొలి రౌండ్ ఆడనున్నాడు. గతేడాది సింగపూర్ టైటిల్ గెలుపొందిన సాయి ప్రణీత్ థాయ్ ఆటగాడు కోసిట్‌తో ఆడనున్నాడు. ఇక పురుషుల డ బుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి, మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్న ప్ప- సిక్కిరెడ్డి జంట తమ సత్తా చూపటానికి సిద్ధమయ్యారు.



సింధు మూడో‘సారీ’

Updated By ManamSat, 11/10/2018 - 05:50
  • బింగ్జియావో చేతిలో ఓటమి

  • శ్రీకాంత్‌కు కూడా చుక్కెదురు 

sindhuఫుఝౌ (చైనా): ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఓటమిపాలయ్యారు. శుక్రవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింధు 17-21, 21-17, 15-21తో చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హి బింగ్జియావో చేతిలో పోరాడి ఓడింది. ఈ ఏడాది కామన్వెల్త్, ఆసియా గేమ్స్, వరల్డ్ చాంపి యన్‌షిప్‌లలో పతకాలు గెలిచిన సింధు చైనా షట్లర్ చేతిలో ఓటమి పాలు కావడం ఇది మూడోసారి. గతంలో అంటే ఈ ఏడాది జూలై, అక్టోబర్‌లలో జరిగిన ఇండోనేషియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో సింధును బింగ్జియావో ఓడించింది. తర్వాత జరిగిన పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌పై 14-21, 14-21తో ప్రపంచ 3వ ర్యాంక్ షట్లర్ చౌ టీన్ చెన్ వరుస సెట్లలో గెలుపొందాడు. ఇక సింధు మ్యాచ్ విషయానికొస్తే.. ఎడమ చేతి షట్లర్ బింగ్జియావో ఒకవైపు ర్యాలీస్‌ను కంట్రోల్ చేస్తూనే మరోవైపు పర్ఫెక్ట్ స్ట్రోక్స్‌ను ఆడింది. దీంతో సింధు డిఫెన్స్‌లో పడింది. తొలి గేమ్‌లో 8-3తో ఆధిక్యంలో ఉన్న సింధు చివరికి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ ఆలస్యంగా విజృంభించిన సింధు పుంజుకుని రెండో గేమ్‌ను సొంతం చేసుకుంది. ఆరంభంలో 4-1 ఆధిక్యంలో ఉన్న సింధు తర్వాత 8-3కు చేరుకుంది. కానీ బింగ్జియావో కోలుకోవడంతో స్కోరు 9-9తో సమమైంది. తర్వాత 15-15 వరకు ఇద్దరు షట్లర్లు నువ్వా నేనా అన్నట్టు ఆడారు. కానీ చైనా షట్లర్ వరుసగా మూడు పాయింట్లు సాధించడంతో సింధు వెనకబడింది. అయినప్పటికీ సింధు 17-18తో చైనా షట్లర్‌కు చేరువైంది. కానీ బింగ్జియావో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో బింగ్జియావో 4-2 ఆధిక్యం సంపాదించింది. కానీ సింధు తన ప్లాన్‌కు పక్కాగా అమలు చేసి విరామం సమయానికి 11-6తో నిలిచింది. తర్వాత చైనా షట్లర్ పుంజుకుని 15-8కి చేరింది. అయినప్పటికీ సింధు రెండో గేమ్‌ను గెలుచుకుంది. కానీ తర్వాత జరిగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో చైనా షట్లర్ సింధుకు మరో అవకాశం ఇవ్వకుండా మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుని సెమీఫైనల్‌కు చేరుకుంది. 

ఇక పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ ఏ దశలోనూ తన చైనీస్ తైపీ ప్రత్యర్థికి గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. చెన్ ఈ ఏడాది జర్మనీ, సింగపూర్, కొరియా టైటిళ్లను గెలిచాడు. ఈ మ్యాచ్‌లో చెన్ చాలా కాన్ఫిడెన్స్‌తో ఆడాడు. మరోవైపు శ్రీకాంత్‌లో ఆ ఆత్మవిశ్వాసం కొరవడింది. దీంతో శ్రీకాంత్ తన ప్రత్యర్థికి సునాయాసంగా పాయింట్లు ఇచ్చాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ బాగా ఆడి ప్రారంభంలోనే 10-8 ఆధిక్యంతో నిలిచాడు. కానీ విరామం తర్వాత చెన్ రెచ్చిపోయాడు. స్మాష్ షాట్‌తో చెన్ గేమ్ పాయింట్‌కు చేరుకున్నాడు. తర్వాత శ్రీకాంత్ కొట్టిన రిటర్న్ షాట్ వైడ్‌గా వెళ్లడంతో చెన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో మరోసారి శ్రీకాంత్ ఇబ్బంది పడ్డాడు. ఒకనొద దశలో 4-10తో వెనకబడ్డాడు. కానీ శ్రీకాంత్ కొట్టిన స్మాష్ షాట్‌తో పాటు ప్రత్యర్థి చేసిన రెండు అనవసర తప్పిదాల వల్ల భారత షట్లర్ 7-10కి చేరుకున్నాడు. శ్రీకాంత్ కొట్టిన షాట్ నెట్‌కు తగడంలో విరామం సమయానికి చెన్ 11-7 ఆధిక్యంతో నిలిచాడు. విరామం తర్వాత కూడా చెన్ ఆధిపత్యం కొనసాగింది. చెన్ ర్యాలీస్ ఆడగా.. శ్రీకాంత్ అనవసర తప్పిదాలు చేశాడు. స్కోరు 11-18 వద్ద ఉన్నప్పుడు శ్రీకాంత్ మరో స్మాష్ షాట్‌తో ఒక పాయింట్ సాధించాడు. కానీ తర్వాత చెన్‌కు ఎనిమిదిసార్లు మ్యాచ్ పాయింట్ అవకాశం లభించింది. శ్రీకాంత్ రెండుసార్లు ప్రత్యర్థి మ్యాచ్ పాయింట్‌ను సేవ్ చేశాడు. కానీ చెన్ ఆ చివరి పాయింట్‌ను సాధించి రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇక పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌కు చుక్కెదురైంది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జంట 11-21, 21-16, 12-21తో ఇండోనేషియాకు చెందిన మహ్మద్ ఎహ్‌సాన్, హెండ్ర సెతియావన్ జోడీ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. 



క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్

Updated By ManamFri, 11/09/2018 - 02:48
  • చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

sindhuఫుజౌ(చైనా): టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్‌లో మరో అడుగు ముందుకు వేసింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో థాయిలాండ్ షట్లర్ బుసానన్‌పై సింధు విజయం సాధించింది. సింధు 21-12, 21-15తో గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆరంభం నుంచే ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించిన సింధు.. తొలి గేమ్‌ను 21-12తో కైవసం చేసుకుంది. అనంతరం అదే జోరు కొనసాగించి 21-15తో రెండో గేమ్‌నూ గెలుచుకుంది. 2016లో టైటిల్ గెలిచిన సింధు తర్వాత జరగబోయే మ్యాచ్‌లో బిన్‌గిజియోతో పోటీపడనుంది.  అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్ పైనల్లో అడుగు పెట్టాడు. రెండో రౌండ్‌లో ఇండోనేషియా ఆటగాడు టామీ సుగియార్టోతో జరిగిన పోరులో 10-21, 21-9, 21-9తో కిదాంబి విజయం సాధించి క్వార్టర్స్‌కి చేరుకున్నాడు. తొలి గేమ్‌ను 10-21తో కోల్పోయిన కిదాంబి ఆ తర్వాత నుంచి ప్రత్యర్థిపై దూకుడు ప్రదర్శించాడు. ఈ క్రమంలో వరుసగా రెండు, మూడు గేమ్‌లను 21-9, 21-9తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. 2014లో చైనా ఓపెన్ టైటిల్‌ను గెలుపొందిన శ్రీకాంత్ తర్వాత జరగబోయే పోరులో చైనీస్ తైపీకు చెందిన చో తైన్ చెన్‌తో తలపడనున్నాడు. 



రెండో రౌండ్‌లో సింధు

Updated By ManamWed, 11/07/2018 - 01:58
  • చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ

sindhuఫుజుహో (చైనా): భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. మంగళవారమిక్కడ జరిగిన తొలి రౌండ్‌లో సింధు రష్యాకు చెందిన ఎవ్‌జెనియాను చిత్తుచేసింది. ఒలింపిక్ రజత పతక విజేత సింధు 21-13, 21-19తో ఎవ్‌జెనియాని ఓడించింది. మూడో సీడ్ సింధు తొలి రౌండ్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టింది. వరుసగా ఆరు పాయింట్లు సాధించి తొలి రౌండ్‌ని తన ఖాతాలో వేసుకుంది. కానీ రష్యాకు చెందిన ఎవ్‌జెనియా రెండో రౌండ్‌లో సింధుని కాస్త ఒత్తిడికి గురిచేసింది. సింధుకు ధీటుగా ఆడుతూ రెండో సెట్‌ని గె లుపొందేలా కనిపించింది. కానీ సింధు తనదైన శైలిలో ఆడి రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా గెలుచుకుంది. 23 ఏళ్ల సింధు తర్వాత జరగబోయే రెండో రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన బస్‌నన్‌తో తలపడనుంది. ఇక ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ విభాగంలో భారత్  జోడికి చుక్కెదురైంది. అశ్విని పొన్నప్ప- సిక్కిరెడ్డి జోడి 19-21, 15-21, 21-17తో జపాన్‌కు చెందిన తనక్- కొహుర్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు.



సింధు వర్సెస్ ఎవ్‌జెనియా

Updated By ManamTue, 11/06/2018 - 06:39
  • నేటి నుంచి చైనా ఓపెన్

sindhuఫుజుహో (చైనా): భారత స్టార్ షట్లర్, తేలుగుతేజం పీవీ సింధు మంగళవారం నుంచి జరగబోయే చైనా ఓపెన్ టైటిల్‌ను సాధించాలనే పట్టుదలతో ఉంది. ఈ ఏడాది సింధు ఒక టైటిల్‌ను కూడా గె లుపొందలేదు. చైనా ఓపెన్ మహిళల సింగిల్స్ మొదటి మ్యాచ్‌లో సింధు రష్యాకు చెందిన ఎవ్‌జెనియాతో పోటీని ప్రారంభించనుంది. ఒలింపిక్ రజత పతక విజేత అయినా సింధు ఈ ఏడాది జరిగిన ఐదు బ్యాడ్మింట న్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. కానీ టైటిల్‌ను గెలవలేకపోయింది. ప్రపంచ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్న సింధు, జపాన్‌కు చెందిన నొజొమి ఒకుహర ఒక్కే డ్రాలో ఉన్నారు. వీరిద్దరూ సెమీస్‌లో తలపడే అవకాశం ఉంది. మరోక్క డ్రాలో ఒలింపిక్, వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), వరల్డ్ నెంబర్ 2 యమగూచి (జపాన్) ఉన్నారు. సింధుతో పాటు ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో వైష్ణవి రెడ్డి థాయ్‌ులాండ్‌కు చెందిన చోచువొంగ్‌తో బుధవారం తలపడనుంది. మహిళల డబుల్స్ విభాగంలో అశ్వినిపొన్నప్ప- సిక్కిరెడ్డి జోడి జపాన్‌కు చెందిన షిహో థనాకా- కొహర్ ద్వయంతో పోటీపడనుండగా... పురుషుల డబుల్స్‌లో మనుఅట్రి- సుమీత్‌రెడ్డి జంట డెన్మార్క్‌కు చెందిన కిమ్- అండర్స్ జోడితో పోరుకు సిద్ధమయ్యారు. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.



క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ ఓటమి

Updated By ManamSun, 10/28/2018 - 09:35

ముగిసిన భారత్ పోరు
ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్
పారిస్: హైదరాబాద్ స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యారు. దీంతో సింగిల్స్‌లో భారత్ పోరు ముగిసినట్టయింది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు 13-21, 16-21తో చైనాకు చెందిన హి బింగ్జియావో చేతిలో ఓటమిపాలైంది. ఈ ఏడాది చైనీస్ షట్లర్ చేతిలో సింధు ఓడిపోవడం ఇది వరుసగా రెండోసారి. జూలైలో జరిగిన ఇండోనేషియా ఓపెన్‌లోనూ సింధుపై బింగ్జియావో వరుస సెట్లలో గెలిచింది. ఈ గెలుపుతో బింగ్జియావో సింధుపై 7-5తో తన ముఖా ముఖీ పోరును మెరుగు పరచుకుంది. శుక్రవారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సైనా 20-22, 11-21తో చైనీస్ తైపీకి చెందిన ఐ జు యింగ్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. సైనా కూడా యింగ్ చేతిలో ఓటమిపాలు కావడం వరుసగా ఇది రెండోసారి. ఇటీవలే జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లోనూ సైనాపై యింగ్ గెలిచింది. 

శ్రీకాంత్ కూడా ఓటమిపాలు కావడంతో ఈ టోర్నీలో భారత్‌కు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 16-21, 19-21తో జపాన్‌కు చెందిన కెంటొ మొమొట చేతిలో పరాజయం పాలయ్యాడు. గత వారంలో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లోనూ శ్రీకాంత్‌పై మొమొట గెలుపొందాడు.



సింధు శుభారంభం

Updated By ManamWed, 10/24/2018 - 01:03
  • ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్

sindhuపారీస్: ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. డెన్మార్క్ ఓపెన్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం రెండో రౌండ్‌లో ప్రవేశించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్‌లో తొలి రౌండ్లో మూడో సీడ్ సింధు 21-17, 21-8 తేడాతో అవెురికాకు చెందిన బెవెన్ ఝాంగ్‌ను చిత్తు చేసింది. గత కొన్ని టోర్నీలలో వరుసగా విఫలమవుతున్న సింధు ఈ సారి ఫైనల్స్ వరకు చేరుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సింధు దూకుడైన ఆటను కనబర్చంది. అయితే తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో తొలి గేమ్ హోరాహోరీగా సాగింది. అయితే చివర్లో సింధు ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని సాధించి తొలి గేమ్‌ను 21-17తో గెలుచుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లో ఆరంభం నుంచే సింధు ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగింది. అవెురికా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో సింధు 21-8తో రెండో గేమ్‌తో పాటూ మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. 



ఫ్రెంచ్ ఓపెన్‌పై... సింధు, సైనా, శ్రీకాంత్ గురి

Updated By ManamTue, 10/23/2018 - 03:45
  • నేటి నుంచి వరల్డ్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ   

imageపారిస్: డెన్మార్క్ ఓపెన్ తర్వాత హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఫ్రెంచ్ ఓపెన్‌పై దృష్టి పెట్టారు. ఈ టోర్నీ మంగళవారమిక్కడ ప్రారంభం కానుంది. డెన్మార్క్ ఓపెన్‌లో ప్రపంచ 10వ ర్యాంక్ షట్లర్ సైనా అద్భుత ప్రతిభ కనబరిచి ఫైనల్‌కు చేరుకుంది. కానీ తుది పోరులో ఐ జు యింగ్ చేతిలో ఓటమిపాలైంది. ఇదే టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ వరకు పోరాడగా సింధు ఆదిలోనే వెనుదిరిగింది. పురుషుల సింగిల్స్ డ్రాలో శ్రీకాంత్‌తో పాటు బి. సాయి ప్రణీత్, సమీర్ వర్మ కూడా ఉన్నారు. డెన్మార్క్ ఓపెన్ మారథాన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సమీర్ సహచరుడు శ్రీకాంత్ చేతిలో ఓడాడు. అశ్వినీ పొన్నప్ప మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రమే పాల్గొంటోంది. సాత్విక్‌రాయిరాజ్‌తో కలిసి బరిలోకి దిగనుంది.
 



ప్రీ క్వార్టర్‌లో సైనా నెహ్వాల్

Updated By ManamWed, 10/17/2018 - 01:36

sainaఒడెన్సె (డెన్మార్క్): డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా.. పీవీ సింధు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. మంగళవారమిక్కడ ప్రారం భమైన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యా చ్‌లో సైనా 20-22, 21-17, 24-22తో హాంకాంగ్‌కు చెందిన ఎన్‌గాన్ యీ చుంగ్‌పై పోరాడి గెలిచింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సైనాకు చుంగ్ గట్టీ పోటీ ఇచ్చింది. 2016లో చుంగ్‌తో సైనా చివరిసారిగా ఆడింది. ఆ మ్యాచ్‌లో సైనా ఓడింది. తొలి గేమ్‌లోనే సైనా చుంగ్ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. మూడో గేమ్‌లో 21-20, 22-21 వద్ద రెండుసార్లు సైనా మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుంది.
 
సింధుకు షాక్
హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఆమె నిష్క్రమిం చింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ సింధు 17-21, 21-16, 18-21తో అమెరికాకు చెందిన బీవెన్ ఝాంగ్ చేతిలో పోరాడి ఓడింది. ఝాంగ్ చేతిలో సింధు ఓడిపోవ డం వరుసగా ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లోనూ సింధుపై ఝాంగ్ గెలిచింది. జ కార్తా ఆసియన్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జపాన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్‌లో గావో ఫాంగ్జీ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలైంది. చైనా ఓపెన్‌లోనూ ఇదే మాదిరిగా జరిగింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ 6వ ర్యాంక్ షట్లర్ చెన్ యుఫీ 21-11, 11-21, 21-15తో సింధుపై గెలిచింది. 





Related News