PV Sindhu

పీవీ సింధుకు షాక్

Updated By ManamTue, 10/16/2018 - 18:00
 •  తొలి రౌండ్‌లోనే నిష్క్రమణ 

 • డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్

PV Sindhu Loses To Unseeded Rival

ఒడెన్సె (డెన్మార్క్): హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. డెన్మార్క్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే ఆమె నిష్క్రమించింది. మంగళవారమిక్కడ ప్రారంభమైన ఈ టోర్నీ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ సింధు 17-21, 21-16, 18-21తో అమెరికాకు చెందిన బీవెన్ ఝాంగ్ చేతిలో పోరాడి ఓడింది. ఝాంగ్ చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఇండియన్ ఓపెన్‌లోనూ సింధుపై ఝాంగ్ గెలిచింది. జకార్తా ఆసియన్ గేమ్స్‌లో రజత పతకం గెలిచిన తర్వాత సింధు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. జపాన్ ఓపెన్ రెండో రౌండ్ మ్యాచ్‌లో గావో ఫాంగ్జీ చేతిలో వరుస సెట్లలో ఓటమిపాలైంది. చైనా ఓపెన్‌లోనూ ఇదే మాదిరిగా జరిగింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ 6వ ర్యాంక్ షట్లర్ చెన్ యుఫీ 21-11, 11-21, 21-15తో సింధుపై గెలిచింది.ఉపాసన, పీవీ సింధు.. శక్తిమంత సంపన్నులు

Updated By ManamTue, 09/25/2018 - 09:27

Sindhu, Upasanaశక్తివంత సంపన్నులో ఒలంపిక్ పతక విజేత పీవీ సింధు, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన స్థానం సంపాదించారు. వ్యాపారం, వాణిజ్యం, నటన, క్రీడలకు సంబంధించి మన దేశానికి చెందిన 22మందితో కూడిన జాబితాను టైకూన్స్ ఆఫ్ టుమారో పేరిట తాజాగా ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఆయా రంగాల్లో వారు చూపుతున్న ప్రతిభను బట్టే వీరిని ఎంపిక చేశామని.. నికర సంపదను ప్రామాణికంగా తీసుకోలేదని ఫోర్బ్స్ స్పష్టం చేసింది,

ఇక ఇదే జాబితాలో అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కరణ్‌ అదానీ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనంత్‌ గోయెంకా, ఫ్యూచర్‌ కన్జూమర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆశ్ని బియానీ, బిర్లా వారసురాలు, స్వాతంత్య్ర మైక్రోఫైనాన్స్‌ వ్యవస్థాపకురాలు, క్యూరోకార్ట్‌-ఎంపవర్‌ సహ వ్యవస్థాపకురాలు అనన్య బిర్లా, యెస్‌ బ్యాంక్‌ సీఈఓ రాణా కపూర్‌ కుమార్తె, త్రీ సిస్టర్స్‌-ఇన్‌స్టిట్యూషనల్‌ ఆఫీస్‌ వ్యవస్థాపకురాలు రాధా కపూర్‌, పార్లే ఆగ్రోకు చెందిన నదియా చౌహాన్‌, ఐడి ఫ్రెష్‌ ఫుడ్‌ సహ వ్యవస్థాపకులు పీసీ ముస్తాఫా, ఫ్రెష్‌ వర్క్స్‌ వ్యవస్థాపకులు గిరీశ్‌ మాతృబూథమ్‌, జెరోధా సహ వ్యవస్థాపకులైన నిఖిల్‌ కామత్‌ - నితిన్‌ కామత్‌, మెట్రోపోలిస్‌ హెల్త్‌కేర్‌కు చెందిన అమీరా షా, బిబా ఆపెరల్‌ ప్రతినిధి సిద్ధార్థ బింద్రా, సియట్‌కు చెందిన అనంత్‌ గోయెంకా, యూపీఎల్‌ నుంచి విక్రమ్‌ ష్రాఫ్‌, స్థిరాస్తి సంస్థ లోధా గ్రూప్‌నకు చెందిన అభిషేక్‌ లోధా, క్లియర్‌ట్యాక్స్‌ వ్యవస్థాపకులు అర్చిత్‌ గుప్తా, మాసివ్‌ రెస్టారెంట్స్‌ వ్యవస్థాపకులు జొరావర్‌ కల్రా, నటులు విక్కీ కౌశల్‌, భూమి పడ్నేకర్‌, బిరా 91 బీర్‌ వ్యవస్థాపకులు అంకుర్‌ జైన్‌, ఓయో రూమ్స్‌ నుంచి రితేశ్‌ అగర్వాల్‌‌లు చోటు దక్కించుకున్నారు.సంధు, శ్రీకాంత్ ఓటమి

Updated By ManamFri, 09/21/2018 - 23:46
 • ముగిసిన భారత్ పోరు..

 • మొమొటా చేతిలో కిదాంబి శ్రీకాంత్ మూడోసారి పరాజయం 

 • చైనా ఓపెన్ బ్యాడ్మింటన్

Sandhu, Srikanthచాంగ్‌ఝౌ: చైనా ఓపెన్ బీడబ్ల్యుఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు తేజాలు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. దీంతో టోర్నీలో భారత్ పోరు ముగిసినట్టయింది. శుక్రవారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీకాంత్ 9-21, 11-21తో ప్రస్తుత వరల్డ్ చాంపియన్ కెంటో మొమొట చేతిలో ఓటమిపాలయ్యాడు. దీంతో 24 ఏళ్ల శ్రీకాంత్‌కు మొమొటాతో ముఖాముఖీ పోరులో 3-7 రికార్డు నమోదైంది. ఇంతకుముందు శ్రీకాంత్ జూన్‌లో మలేసియా ఓపెన్‌లో, జూలైలో ఇండోనేషియా ఓపెన్‌లో మొమొటా చేతిలో పరాజయంపాలయ్యాడు. చట్టవిద్ధంగా క్యాసినోకు వెళ్లి ఒక సంవత్సరం నిషేధానికి గురైన మొమొటా అసాధారణ ఫామ్‌లో ఉన్నాడు. అతని ఆట ముందు శ్రీకాంత్ నిలువలేకపోయాడు. ఆరంభంలో శ్రీకాంత్ 1-5తో వెనబడ్డాడు. తర్వాత వరుసగా మూడు పాయింట్లు సాధించి 4-5తో సమాన స్కోరుకు దగ్గరగా వచ్చాడు. కానీ తర్వాత మొమొటతో పోరాడలేకపోయాడు. 19-6తో భారీ ఆధిక్యాన్ని సంపాదించిన మొమొట తర్వాత తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్‌లో ఆరంభం నుంచే మొమొట 4-3 ఆధిక్యలో నిలిచాడు. తర్వాత వరుసగా తొమ్మిది పాయింట్లు 13-3 ఆధిక్యానికి చేరుకున్నాడు. ఆ తర్వాత కూడా మొమొట తన ఆధిపత్యాన్ని కొనసాగించి పెద్దగా కష్టపడకుండానే రెండో గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.

ఇక మహిళల విభాగంలో మూడో సీడ్ పీవీ సింధు 11-21, 21-11, 15-21తో చైనాకు చెందిన ప్రపంచ 6వ ర్యాంక్ షట్లర్ చెన్ యూఫీ చేతిలో పోరాడి ఓడింది. గతంలో వీళ్లిద్దరు ఆరుసార్లు జరిగిన పోరాటంలో 20 ఏళ్ల సింధు నాలుగుసార్లు చెన్‌పై గెలిచింది. కానీ శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సింధు తన తప్పుదాలను అదుపు చేయడం కానీ ప్రత్యర్థి ఆధిపత్యాన్ని బ్రేక్ చేయడం కానీ చేయలేకపోయింది. తొలి గేమ్‌ను చెన్ 6-3 ఆధిక్యంతో ప్రారంభించింది. ఆ తర్వాత కూడా అమె అద్భుతమైన, పవర్‌ఫుల్ రిటర్న్ షాట్లతో 11-5 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బ్రేక్ తర్వాత సింధు రెండు పాయింట్లు సాధించింది. కానీ బలహీనమైన రిటర్న్ షాట్, మరో షాట్ అవుట్‌కు వెళ్లడంతో చైనీ షట్లర్ 15-7కు చేరుకుంది. సింధు కొన్ని తప్పిదాలు చేయడంతో చెన్ తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో వైవిధ్యమైన పేస్‌తో, రాల్లీస్‌తో ఆడాలన్న సింధు ఎత్తుగడ ఫలిం చింది. దీంతో సింధు 6-1 ఆధిక్యం సంపాదించింది. అయితే ప్రత్యర్థి చె న్ చాలా వేగంగా ఆడటం, ఊహిం చని స్మాష్‌ల కారణంగా 5-6కు చేరు కుంది. తర్వాత చెన్ కొట్టి షాట్స్ వైడ్‌గా వెళ్లాయి. దీంతో సింధు 10-6తో నిలిచింది. ఆ తర్వాత సింధు రెండు షాట్స్ నెట్‌కు తగలడంతో విరామం సమయానికి 11-8కి చేరు కుంది. విరామం తర్వాత సింధు 15-10 ఆధిక్యం సంపా దించింది. తర్వాత ఇద్దరూ చెరో పాయింట్ సాధిస్తూ హో రాహోరీగా పోరాడినప్పటికీ రెండో గేమ్‌ను సింధు గెలి చింది. ఇక చివరి, నిర్ణయాత్మక గేమ్‌లో ప్రత్య ర్థికి సింధు గట్టి పోటీ ఇచ్చింది. కానీ గేమ్‌ను సొంతం చేసుకోలేక పోయింది. సింధు శుభారంభం

Updated By ManamTue, 09/18/2018 - 23:51
 • సైనా ఔట్.. చైనా ఓపెన్  

చాంగ్‌జౌ: చైనా ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధు శుభారంభం చేసింది. ఈ టోర్నీలో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్‌లో జపాన్‌కు చెందిన కవకమిపై 21-15, 21-13తో విజయం సాధించింది. దీంతో సింధు ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ టోర్నీలో మరో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ నిరాశపరిచింది. తొలి రౌండ్‌లో కొరియాకు చెందిన సుంగ్ జి హ్యూన్‌తో తలపడిన సైనా 22-20, 8-21, 14-21తో ఓటమి చవిచూసింది. తొలి గేమ్‌లో హోరాహోరీగా తలపడిన సైనా రెండో గేమ్‌లో మాత్రం హ్యూన్‌ను నిలువరించలేకపోయింది.

image


ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ తడబడిన నేహ్వాల్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్ర్కమించి ఇంటి ముఖం పట్టింది. 2014లో సైనా చైనా ఓపెన్ టైటిల్‌ను దక్కించుకుంది. ఈ టైటిల్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. ఇక పురుషుల డబుల్స్‌లో మను అట్రి- సుమీత్ రెడ్డీ జోడీ రెండో రౌండ్‌కు దూసుకె ళ్లింది. తొలి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన మిన్ చున్- చింగ్ హెంగ్‌పై మను అట్రి - సుమీత్ జోడీ 13-21, 21-13, 21-12తో విజయం సాధించింది.చైనా ఓపెన్‌పై కన్నేసిన సింధు, శ్రీకాంత్

Updated By ManamTue, 09/18/2018 - 01:11
 • నేటి నుంచి చైనా ఓపెన్

sindhuచాంగ్‌జౌ: మంగళవారం నుంచి ప్రారంభం కాబోయే చైనా ఓపెన్‌లో భారత షట్లర్లు పీ.వీ. సింధు, కిదాంబి శ్రీకాంత్ టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. గత వారం జరిగిన జపాన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో ఇంటిముఖం పట్టిన సింధు గతేడాది అక్టోబర్‌లో జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో మొదటి రౌండ్‌లోనే ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఏడాది జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో సింధు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.  మూడో సీడ్ సింధు తన మొదటి మ్యాచ్‌ని హాంకాంగ్‌కు చెందిన చియంగ్ ఎన్‌గన్ యితో తలపడనుండగా, రెండు సార్లు కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన సైనా నేహ్వాల్ మొదటి రౌండ్‌లో కొరియాకు చెందిన ఐదో సీడ్ సంగ్ జీ హ్యున్‌తో పోటీపడ నుంది. గత సీజన్‌లో అద్భుతమైన ప్రతిభ కన బర్చి నాలుగు టైటిల్స్ గెలిచిన కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్‌కు చెందిన రసముస్ జెమ్‌కీతో తన పోరును ప్రారంభించనున్నాడు.సింధు, ప్రణయ్ ఔట్.. క్వార్టర్స్‌లోకి కిదాంబి

Updated By ManamThu, 09/13/2018 - 17:08
 • జపాన్ ఓపెన్ నుంచి ఇద్దరు భారత షటర్లు నిష్ర్కమణ

Japan Open, PV Sindhu, HS Prannoy, Kidambi Srikanth టోక్యో: జపాన్ ఓపెన్ టోర్నమెంట్‌ నుంచి భారత షట్లర్ పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ నిష్ర్కమించారు. మరో భారత షట్లర్ 7వ సీడ్‌గా బరిలోకి దిగిన కిదాంబీ శ్రీకాంత్ ఒక్కడే పురుషుల సింగిల్స్ విభాగంలో విజయం సాధించాడు. హంకాంగ్ క్రీడాకారుడు వింగ్ కి విన్సెంట్ వాంగ్‌ను 16వ రౌండ్‌లో 21-14, 21-15 తేడాతో గెలుపొందాడు. కామన్ వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన కిదాంబీ క్వార్టర్స్ దూసుకెళ్లాడు. కొరియా క్రీడాకారుడు లీ డంగ్ క్వెయిన్‌తో శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో తలపడనున్నాడు. మహిళల సింగిల్స్ విభాగంలో మూడో సీడెడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్‌లో ప్రపంచ నెంబర్ 14 గాయో ఫంగ్జీ (చైనా) చేతిలో అలవోకగా గెలిచినప్పటికీ 16వ రౌండ్‌లో 18-21, 19-21 తేడాతో పరాజయం పాలైంది.

అలాగే పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 10 అంటోనీ గింటింగ్ (ఇండోనేషియా) చేతిలో ప్రణయ్ కూడా 16వ రౌండ్‌లోనే 14-21, 17-21 తేడాతో ఓటమి చెందాడు. మూడో సీడెడ్‌గా బరిలోకి దిగిన సింధు తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్ 13 సయాంక తఖాషిపై 21-17, 7-21, 21-13తో గెలుపొందింది. చైనా క్రీడాకారిణి గాయోతో చైనా ఓపెన్‌లో ఒకసారి మాత్రమే సింధు తలపడగా.. నేరుగా ఆడిన ఆటల్లో 21-11, 21-10 తేడాతో గాయో చేతిలో పరాజయం పాలైంది. రెండో రౌండ్‌లో సింధు, శ్రీకాంత్

Updated By ManamWed, 09/12/2018 - 00:36
 • ప్రణయ్ కూడా.. జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్

sindhuటోక్యో: హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు చెమటోడ్చగా.. కిదాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ సునాయాస విజయాలతో జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు మంగళవారమిక్కడ జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో 21-17, 7-21, 21-13తో అన్ సీడెడ్ స్థానిక షట్లర్ సయక టకహషిపై పోరాడి గెలిచింది. తదుపరి మ్యాచ్‌లో చైనాకు చెందిన ఫాంగ్జీ గావోతో ఆడుతుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రణయ్ 21-18, 21-17తో ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత జోనాథాన్ క్రిస్టీని చిత్తు చేశాడు. మరో మ్యాచ్‌లో శ్రీకాంత్ 21-13, 21-15తో చైనాకు చెందిన యుజియాంగ్ హ్వాంగ్‌పై నెగ్గాడు. అయితే మరో మ్యాచ్‌లో సమీర్ వర్మ 18-21, 22-20, 10-21తో కొరియాకు చెందిన లీ డాంగ్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టాడు. కాగా మిక్స్‌డ్ డబుల్స్‌లో రాంకీ రెడ్డి, పొన్నప్ప జోడీ 13-21, 17-21తో చైనాకు చెందిన యిల్యు వాంగ్, డాంగ్‌పింగ్ హ్వాంగ్ జంట చేతిలో, పురుషుల డబుల్స్‌లో చోప్రా, రెడ్డి ద్వయం 9-21, 16-21తో మాథ్యూ ఫాగర్టీ, ఇసాబెల్ ఝంగ్ జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు. నేను కూలీ నెంబర్ వన్

Updated By ManamWed, 09/05/2018 - 22:59
 • రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్ చేయడమే లక్ష్యం  

 • మానవవనరుల అభివృద్ధి బాధ్యత టీచర్లదే

 • గురుపూజోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు 

chandrababuగుంటూరు: ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం విద్యార్థులకు ఉందని, వారిని ఆ దిశగా నడిపించే దిక్సూచిలా ఉపాధ్యాయులు ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విద్యార్థులను  ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ద్వారా రాష్ట్రాన్ని మేలైన మానవ వనరులకు గమ్యస్థానంగా మలచాలని, ఈ బాధ్యతను ఉపాధ్యాయులందరూ తీసుకోవాలని కోరారు. మానవ వనరుల అభివృద్ధికే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదగడం ఆయన పట్టుదలకు నిదర్శనమని అన్నారు. అదే పట్టుదల, స్ఫూర్తి ఇప్పుడు అందరికీ కావాలన్నారు. chandrababuరాధాకృష్ణన్ వంటి వ్యక్తి తెలుగు గడ్డపై పెరగడం మనకు గర్వకారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విజ్ఞానాంధ్రప్రదేశ్‌గా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి వివరించారు. తాను రాష్ట్రంలో నెంబర్‌వన్ కూలీలా కష్టపడుతున్నానని, అందరం అదేస్థాయిలో శ్రమిస్తే అత్యుతమ ఫలితాలు సాధించవచ్చని చెప్పారు. తనను జీవితంలో ఎక్కువ ప్రభావితం చేసింది గురువులేనని, తనకు వారిపై అంచంచల విశ్వాసం, నమ్మకం ఉందన్నారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తా...
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సమాజంలో సమస్యలకు పరిష్కారం చూపేదిగా చదువు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఒత్తిడి నడుమ విద్యను అభ్యసించే పరిస్థితి ఉండకూడదని, ఆహ్లాదంగా-ఆనందంగా విద్యను అర్జించేలా చూడాలని చెప్పారు. ఉపాధ్యాయులు 24 గంటలు తరగతి గదుల్లోనే గడపకుండా ప్రకృతిని ప్రేమిస్తూ సేద తీరాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నరేగా నిధులతో ప్రహరీ గోడలు నిర్మించడంతో సహా 2022 నాటికి అన్ని జూనియర్ కళాశాలలకు సొంత భవనాలు సిద్ధం చేయాలని సంకల్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరికొన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ప్రారంభిస్తున్నామని, అలాగే ఉపాధ్యాయుల నియామకాలు చేపడతామని చెప్పారు. డ్రాప్ అవుట్స్ భారీగా తగ్గించగలగడం, 2014కు ముందు విద్యారంగంలో వెనుకబడిన రాష్ట్రాన్ని ప్రస్తుతం దేశంలోనే 3వ ర్యాంకులో నిలబెట్టడం ప్రభుత్వ విజయాలుగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి నిత్య విద్యార్థి: గంటా  
విద్య, విజ్ఞానం అంటే ఎంతో ఆసక్తి చూపే ముఖ్యమంత్రి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా విద్యాభివృద్ధికి రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టారని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఎంతో జ్ఞానం వున్నా కొత్త విషయాలు నేర్చుకునేందుకు ముఖ్యమంత్రి నిత్య విద్యార్ధిలా ముందుంటారని చెప్పారు. కార్యక్రమంలో ముందుగా జ్యోతిని వెలిగించి, సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాల వేసి సభను ప్రారంభించిన ముఖ్యమంత్రి, చివరిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి పురస్కారాలు ప్రదానం చేశారు.

పీవీ సింధుకు సత్కారం
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకకు హాజరైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సభా వేదిక మీద ముఖ్యమంత్రిchandrababu గౌరవించి, సత్కరించారు. దేశం గర్వించదగిన క్రీడాకారిణి పీవీ సింధూ ఈ కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతిని, గౌరవాన్ని తీసుకువచ్చారని చెప్పారు. కామన్వల్త్ క్రీడలు, వరల్డ్ చాంపియన్ షిప్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన సింధుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఒలంపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాలని ఆకాంక్షించారు.   పీవీ సింధు 23 ఏళ్ల వయసులోనే ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఆమె ఎంతో కఠోరంగా శ్రమించారని చెప్పారు. సింధు మాదిరిగా ఎందరినో తయారుచేయాలని ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి కోరారు.

తల్లిదండ్రులే తొలి గురువులు: సింధు
ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తన కు మొదటి ఉపాధ్యాయులని, తనను ఈస్థానంలో గురువులే నిలిపారని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి మరింత పేరు తెస్తానని, ప్రజల ఆశీస్సులు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.స్వర్ణం తప్పక సాధిస్తా: సింధు

Updated By ManamThu, 08/30/2018 - 22:50
 • సింధు, సైనాలకు ఘన స్వాగతం

sindhuహైదరాబాద్: ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించకపోయినప్పటికీ రజత పతకాన్ని సాధించడం ఆనందంగా ఉందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చెప్పింది. 18వ ఏషియన్ గేమ్స్లో పతకాలు సాధించి హైదరాబాద్‌కు తిరిగొచ్చిన పీవీ సింధు, సైనా నెహ్వాల్‌కు ఘన స్వాగతం లభించింది. వారిద్దరికి, క్రీడా ప్రముఖులు, అభిమానులు అభినందించారు. అనంతరం గోపీ చంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వ హించిన మీడియా సమావేశంలో గోపీచంద్, సింధు, సైనా నెహ్వాల్ మాట్లాడారు. ఆసియా క్రీడల్లో ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా జరిగిందని సింధు తెలిపింది. ఫైనల్‌లో పదే పదే ఓడిపోవడం పట్ల స్పందిస్తూ.. ఫైనల్ ఫోబియా తనకు లేదని, ఫైనల్ వరకు రావడం ఎంత కష్టమో అలోచించాలని కోరారు. మున్ముందు మరింత ఎక్కువగా సాధన చేసి స్వర్ణ పతకాన్ని తప్పక సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆసియా క్రీడల్లో ఇద్దరు క్రీడాకారులు పతకాలు సాధించడం ఆనందంగా ఉందని కోచ్ గోపీచంద్ అన్నారు. ఎక్కువమంది క్రీడాకారులు మున్ముందు మరిన్ని ఎక్కువ పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గెలుపోటములు సహజమని, ఆడిన ప్రతి మ్యాచ్‌లో గెలవడం సాధ్యం కాదని మరో క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అన్నారు. మున్ముందు స్వర్ణ పతకం సాధించేందుకు శ్రమిస్తానని పేర్కొంది.సైనా, సింధుకు ఎంపీ కవిత అభినందనలు

Updated By ManamTue, 08/28/2018 - 16:38

sainaహైదరాబాద్ : ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధుకూ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. వుమెన్స్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా కాంస్య,  పీవీ సింధు సిల్వర్ మెడల్ గెలుపొందిన విషయం తెలిసిందే.  కాగా ఫైనల్స్‌లో సింధు ఓడిపోయినప్పటికీ  ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో  రజిత పతకంల్ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించింది. ‘యూ హావ్ మేడ్ అజ్ పౌడ్’ అంటూ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సైనా, సింధును ఎంపీ కవిత అభినందించారు.

 

Related News