Nandamuri harikrishna

సోదరి కోసం ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ప్రచారం

Updated By ManamFri, 11/16/2018 - 10:23
Suhasini, NTR, Kalyan Ram

హైదరాబాద్: ప్రతిష్టాత్మక నియోజకవర్గం కూకట్‌పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెను గెలిపించే బాధ్యతను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హీరోలు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌లకు అప్పగించినట్లు తెలుస్తోంది. సోదరిని గెలిపించేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు వారిని అడిగినట్లు సమాచారం. ఈ విషయంపై సోదరులిద్దరూ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో బాలకృష్ణ కూడా ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం ‘యన్‌టిఆర్’ షూటింగ్‌కు ఆయన పది రోజులు గ్యాప్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సుహాసిని తరఫున కూబి బాలయ్య ప్రచారం చేయనున్నట్లు సమాచారం. మరి నందమూరి ప్రచారంతో సుహాసిని ఆ స్థానాన్ని గెలుస్తుందో లేదో చూడాలి.తమ్ముడి హరి మరణవార్తతో దిగ్భ్రాంతి...

Updated By ManamThu, 08/30/2018 - 15:53
mohan babu-harikrishna

హైదరాబాద్ : టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణంపై ప్రముఖ నటుడు మోహన్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు. ‘నేను ఇండియాలో లేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. తమ్ముడు హరికృష్ణ మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒళ్ళంతా కంపించిపోయింది. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు మా అన్నగారి బిడ్డ. 

తమ సొంత బ్యానర్‌లో నిర్మించిన డ్రైవర్ రాముడు షూటింగ్ జరిగేటప్పుడు నన్నెంతో ప్రేమగా చూసుకున్నాడు. ఆ రోజు మొదలైన మా అనుబంధం ఈ నాటికి కొనసాగుతూనే ఉంది. స్వర్గస్తుడైన తమ్ముడు హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. కాగా మోహన్ బాబు, హరికృష్ణ ...శ్రీరాములయ్య చిత్రంలో కలిసి నటించారు. సినీ ప్రపంచ సాహసరత్నం

Updated By ManamThu, 08/30/2018 - 06:10
  • రాజకీయ చైతన్య రథసారథ్యం 

  • సినిమా రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు..

  • రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కుదిపేసిన వార్త.. 

  • సినీ, రాజకీయ రంగాల్లో పెను విషాదాన్ని నింపేసిన అకాల మరణం...

  • మరో నాలుగు రోజుల్లో పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిన మనిషి..

  • ఇంటి నుంచి బయల్దేరిన కొన్ని గంటల్లోనే మృత్యువు ఒడిలోకి..

  • స్నేహితుడి కుమారుడి వివాహానికి వెళుతూ ప్రమాదానికి గురైన నందమూరి హరికృష్ణ.

నందమూరి హరికృష్ణ ఇకలేరు
నల్గొండలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ (61) దుర్మరణం పాలయ్యారు. నందమూరి తారకరామారావు, బసవతారకం నాలుగో సంతానంగా హరికృష్ణ సెప్టెంబరు 2, 1956న కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న హరికృష్ణ బాలనటుడిగా 1967లో ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘తల్లా పెళ్లామా’, ‘రామ్ రహీమ్’ చిత్రాల్లో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు పోషించారు. ఎన్.టి.రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దాన వీర శూర కర్ణ’ చిత్రంలో అర్జునుడుగా నటించి మెప్పించారు. ఆ తర్వాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్న హరికృష్ణ 1998లో ‘శ్రీరాములయ్య’ చిత్రంతో మరోసారి తెరపైకి వచ్చారు. ఈ చిత్రంలో విప్లవ నాయకుడు సత్యం పాత్రకు జీవం పోశారు. ఆ తర్వాత ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామరాజు’ చిత్రాల విజయంలో కీలక పాత్ర పోషించారు. ‘సీతయ్య’ చిత్రంలో ఎవ్వరి మాటా వినని పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆ తర్వాత ‘టైగర్ హరిశ్చంద్రప్రసాద్’ చిత్రంలో రైతు సమస్యలపై పోరాడే పాత్రలో వ్యక్తిగా రైతుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ సినిమా తర్వాత ‘స్వామి’, ‘శ్రావణమాసం’ చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరించారు. ‘శ్రావణమాసం’ చిత్రం తర్వాత ఆయన ఏ సినిమాలోనూ నటించలేదు.
 

image


చైతన్య రథసారధిగా..
నందమూరి హరికృష్ణతోపాటు ఆయన కుటుంబసభ్యులకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ రాజకీ యాల్లోకి వచ్చిన కొత్తలో ఆయ న చైతన్యరథాన్ని హరికృష్ణ స్వయంగా నడిపారు. ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో హరికృష్ణ చైతన్యరథం నడుపుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తండ్రి ఎన్టీఆర్‌ను సినిమా షూటింగ్‌లకు తానే స్వయంగా కారు నడుపుతూ తీసుకెళ్లేవారు. ఇంట్లో పలువురు డ్రైవర్లు ఉన్నా.. స్వయంగా వాహనం నడపడానికే ఆయన ఇష్టపడేవారు. డ్రైవింగ్‌లో ఆయన నిష్ణాతుడు అని పేరు ఉంది. తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వెళ్లాక.. ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. మళ్లీ తెలుగుదేశంలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నప్పటికీ కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
 
పుత్రోత్సాహం
imageనందమూరి హరికృష్ణ తనయులు కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కల్యాణ్‌రామ్ హీరోగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా ఎన్నో విజయ వంతమైన సినిమాల్లో నటించి తాతకు తగ్గ మనవడిగా మంచి పేరు తెచ్చుకుంటు న్నారు. హరి కృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకిరామ్ నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు.
 
నందమూరి కుటుంబాన్ని వెంటాడుతున్న రోడ్డు ప్రమాదాలు
నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడు తున్నాయి. 2009లో తెలుగు దేశం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని హైదరా బాద్ తిరిగి వస్తున్న ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలతో బయటడ్డారు. 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ మృతి చెందారు. నల్గొండ జిల్లాలోనే ఈ మూడు ప్రమాదాలు జరగడం గమనార్హం. మునగాల మండలం ఆకుపాముల వద్ద జానకిరామ్ ప్రమాదానికి గురవగా, సూర్యాపేట సమీపంలోని మోతె గ్రామం వద్ద ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి లోనైంది. ఈరోజు నల్గొండ జిల్లాలోని అన్నెపర్తి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ ప్రాణాలు విడిచారు. ఇలా నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడడం అందరినీ కలచివేస్తోంది. 
అభిమానులకు హరికృష్ణ చివరి లేఖ!

imageమరో నాలుగు రోజుల్లో అంటే సెప్టెంబర్ 2న నందమూరి హరికృష్ణ పుట్టినరోజు. ప్రతి ఏడాది నందమూరి అభిమానులు హరికృష్ణ పుట్టినరోజు వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. మన రాష్త్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్త్రంలో భారీ వర్షాల కారణంగా ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అభిమానులకు హరికృష్ణ ఓ లేఖ రాశారు. దాన్ని యధాతథంగా అందిస్తున్నాం.

‘‘సెప్టెంబరు 2 నా అరవై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్త్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ రాష్త్రంలో వరదలు, వర్షాలు కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులైనారు. ఇది మన అందరికీ ఎంతో విషాదాన్ని కలిగించే విషయం. అందువల్ల నా జన్మదినం సందర్భంగా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, పుష్ప గుచ్చాలు, దండలు తీసుకురావద్దని, వాటికి అయ్యే ఖర్చును వరదలు, వర్షాలు కారణంగా నష్టపోయిన కుటుంబాలకు అందజేయాలని కోరుతున్నాను. అంతేకాకుండా, నిరాశ్రయులైన వారికి దుస్తులు, వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు మీ శక్తి మేరకు అందజేయాలని కోరుతున్నాను. 
- ఇట్లు 
మీ నందమూరి హరికృష్ణ’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.

తండ్రి అడుగు జాడల్లో..
1962లో జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో తనimage తండ్రి ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ ఫోటోను దర్శకుడు క్రిష్ అందరికీ షేర్ చేశారు. బాల్యం నుంచే ఆయన ప్రజల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. తన తండ్రి అడుగుజాడల్లో నడిచి, మంచి వ్యక్తిగా ఖ్యాతిగడించారు. ‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథసారథ్యం. చిన్నతనంలోనే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం. నందమూరి హరికృష్ణ 1962 జాతీయ రక్షణ ఫండ్ యాక్టివిటీ సమయంలో ఎన్టీఆర్‌గారి కంటే ముందు నడిచారు’ అని ట్వీట్ చేశారు.

యన్.టి.ఆర్ బయోపిక్‌లో హరికృష్ణ
నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ‘యన్.టి.ఆర్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ... ఎన్.టి.రామారావు పాత్రను పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం క్రిష్.. ఎన్టీఆర్, ఆయన కుటుంబ సభ్యుల జీవితాల గురించి పరిశోధనలు చేశారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ప్రచార రథ సారథిగా ఆయన వెంటే ఉండి తండ్రికి ఎంతో సేవ చేశారు హరికృష్ణ. ఇప్పుడు ఆ పాత్రను కూడా ‘యన్.టి.ఆర్’ చూపించనున్నారు. ఆ పాత్రను కల్యాణ్‌రామ్ పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. హరికృష్ణ మృతి బాధాకరం: చంద్రబాబు

Updated By ManamWed, 08/29/2018 - 18:52
  • కుటుంబసభ్యుడినే కాదు...పార్టీ ముఖ్యనేతను కూడా కోల్పోయా..

chandrababu naidu

హైదరాబాద్ : ఇష్టం ఉన్నా లేకపోయినా... వాస్తవాలను కుండబద్దలు కొట్టేలా చెప్పడం హరికృష్ణ నైజం అని ఆయన బామ్మర్ది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ ఓ సీనియర్ నేతను కోల్పోవడం బాధాకరమని అన్నారు. బుధవారం సాయంత్రం చంద్రబాబు... మీడియాతో మాట్లాడుతూ..  హరికృష్ణ ఏ పదవిలో ఉన్నా నీతిని నిజాయితీతో పని చేశారు. 

ఎన్టీఆర్‌కు రథసారధిగా హరికృష్ణ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఓవైపు కుటుంబసభ్యుడిగా, మరోవైపు పార్టీ అధ్యక్షుడిగా నందమూరి హరికృష్ణ లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేనిద్దన్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నట్లే సినిమా రంగంలోనూ ఆయన మంచి పేరు సంపాదించుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. 

‘ప్రమాదం జరిగిన సమయంలో హరికృష్ణే వాహనాన్ని నడుపుతున్నారని, మంచినీళ్ల బాటిల్ కోసం కిందకు వంగినప్పుడు మలుపు రావడం, దాన్ని తప్పించబోయి... డివైడర్‌ను కొట్టడం జరిగింది. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఆయన వాహనంలో నుంచి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. పడటమే పెద్ద రాయిపై పడటంతో తలకు బలమైన గాయం తగిలింది. ఆయన గుండె కూడా అప్పుడే ఆగిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలిపారు. కుటుంబసభ్యుడినే కాకుండా, పార్టీకి ముఖ్యనేతను కోల్పోయా’ అని చంద్రబాబు పేర్కొన్నారు.ఏపీ సర్కార్ 2రోజులు సంతాప దినాలు

Updated By ManamWed, 08/29/2018 - 17:29
Nandamuri Harikrishna death: AP government declarestwo-day state mourning

అమరావతి : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ మృతి ఏపీ ప్రభుత్వం రెండు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించింది. గతంలో హరికృష్ణ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన విషయం తెలిసిందే.

మరోవైపు రాష్ట్ర గవర్నర్ నరసింహన్... హరికృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ‘టీడీపీ చైతన్య రథయాత్రను నడిపిన కృష్ణుడిని కోల్పోయింది. హరికృష్ణ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని అన్నారు. మరోవైపు హరికృష్ణ పార్థీవదేహాన్ని కడసారి చూసేందుకు ఓ వైపు టీడీపీ శ్రేణులు, మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు తరలి వస్తున్నారు. 

governor-nandamuri harikrishna

 మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు

Updated By ManamWed, 08/29/2018 - 16:33
  • కుటుంబసభ్యులు కోరినచోట అంత్యక్రియలు: తలసాని

Nandamuri Harikrishna death-kcr

హైదరాబాద్ : నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ఆయన కుటుంబసభ్యుల అభీష్టం మేరకే జరుగుతాయని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కాగా హరికృష్ణ అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి.  నందమూరి హరికృష్ణ అంత్యక్రియల సందర్భంగా  ఆయన సందర్శనార్థం వచ్చే అభిమానులకు  ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని  ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 

గురువారం సాయంత్రం నాలుగు గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే అంతకు ముందు హరికృష్ణ అంత్యక్రియలు ... మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తారనే వార్తలు వెలువడ్డాయి. చివరికి మహాప్రస్థానంలోనే అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. హరికృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి

Updated By ManamWed, 08/29/2018 - 15:28
KCR pays tributes to nandamuri harikrishna

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. మోహదీపట్నంలోని నందమూరి హరికృష్ణ నివాసానికి కేసీఆర్ విచ్చేసి, నివాళులు అర్పించి కుటుంబసభ్యుల్ని పరామర్శించారు.

ntr kcr

కాగా కేసీఆర్...కొద్దిసేపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. అనంతరం జూనియర్ ఎన్టీఆర్‌ను దగ్గరకు తీసుకుని ఓదార్చారు. అంత్యక్రియల ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో  రేపు సాయంత్రం (గురువారం) హరికృష్ణ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.

ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ సీఎం మహ్మద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.హరికృష్ణ అరుదైన ఫొటో.. నాన్న ముందు రథసారధి

Updated By ManamWed, 08/29/2018 - 15:14

Harikrishnaనల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ కన్నుమూశారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన మరణంపై సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్.. ఓ అరుదైన ఫొటోను షేర్ చేసుకున్నారు.

అది హరికృష్ణ చిన్న వయసుకు సంబంధించింది కాగా.. అందులో ఎన్టీఆర్ ముందు నడుస్తున్నారు. 1962లో దేశ రక్షణ కోసం ఎన్టీఆర్ విరాళాలు సేకరిస్తున్న సందర్భంలో ఈ ఫొటోనే తీశారు. దీన్ని షేర్ చేసిన క్రిష్.. ‘‘మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారధి.. చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం’’ అంటూ పేర్కొన్నారు.హరికృష్ణ తనయులకు చంద్రబాబు పరామర్శ

Updated By ManamWed, 08/29/2018 - 14:58

Chandrababuహైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో మరణించిన సినీ, రాజకీయ నాయకుడు హరికృష్ణ కుమారులు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. నల్గొండ జిల్లా నర్కాట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడున్న ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లను కలిసి పరామర్శించారు. పోస్ట్‌మార్టం అనంతరం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ హరికృష్ణకు నివాళులు అర్పించారు.స్వగృహానికి హరికృష్ణ పార్ధివదేహం

Updated By ManamWed, 08/29/2018 - 14:48

Harikrishnaహైదరాబాద్: ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు హరికృష్ణ భౌతికకాయం మెహదీపట్నంలోని ఆయన ఇంటికి చేరింది. దీంతో ఆయన చివరి చూపును చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. మరోవైపు హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ క్రమంలో మొయినాబాద్‌లోని ముర్తుజగూడ ఫామ్‌హౌస్‌లో కొడుకు జానకి రామ్‌కు జరిగిన ప్రదేశంలోనే హరికృష్ణ అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి.

Related News