nandamuri janakiram

జానకిరాం మృతితో కుంగిపోయిన హరికృష్ణ

Updated By ManamWed, 08/29/2018 - 09:26
Nandamuri Harikrishna, actor and TDP leader, dies in road accident

హైదరాబాద్‌ : చెట్టంత కొడుకును రోడ్డు ప్రమాదంలో కోల్పోవడంతో నందమూరి హరికృష్ణ మానసికంగా కుంగిపోయారు. పెద్ద కుమారుడు నందమూరి జానకిరాం మృతితో ఆయన చాలాకాలం కోలుకోలేదు. హరికృష‍్ణకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె.  ఆయనకు కుటుంబమంటే అమితమైన ప్రేమ. ముగ్గురు కొడుకులంటే మరింత ఇష్టం. సెప్టెంబర్‌ 2న హరికృష్ణ పుట్టినరోజు... ఇంతలోనే ఆ ఫ్యామిలీని రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించడం తీరని విషాదమే.

నందమూరి వారసుడిగానే కాకుండా వ్యక్తిగతంగా ఎదిగిన హరికృష్ణ... ఎన్టీఆర్ చైతన్య రథాన్ని నడిపించారు. తండ్రి మరణం అనంతరం రాజకీయ పార్టీ పెట్టినా తర్వాత మళ్లీ టీడీపీలోనే చేరారు. 1956 సెప్టెంబర్2న జన్మించిన హరికృష్ణ... శ్రీకృష్ణ అవతారం సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా నిర్మాతగా కూడా పనిచేసేశారు. మలి వయసులోనూ హీరోగా చేసిన ఆయన ‘సీతయ్య ఎవడి మాట వినడు’ అనే డైలాగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులు మరచిపోలేరు. హరికృష్ణ ఫ్యామిలీని విధి వెంటాడుతుందా?

Updated By ManamWed, 08/29/2018 - 08:53
  • హరికృష్ణ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయా?

  • అప్పుడు జనకిరాం... ఇప్పుడు హరికృష్ణ

Tragic road accidents in nandamuri harikrishna family

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల రూపంలో నందమూరి హరికృష్ణ కుటుంబాన్ని విధి వెంటాడినట్లు కనిపిస్తోంది. వరుస ఘటనలు చూస్తే అలాగే అనిపిస్తోంది. హరికృష్ణతో పాటు ఆయన పెద్ద కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే దుర్మరణం చెందారు. అంతేకాకుండా మరో కుమారుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా రోడ్డు ప్రమాదంలో  తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాదాలు అన్ని నల్గొండ జిల్లా విజయవాడ హైవే మీదే జరగడం గమనార్హం. నాలుగేళ్ల క్రితమే హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్‌ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ రోడ్డు ప్రమాద ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

కాగా డ్రైవింగ్‌ అంటే హరికృష్ణతో పాటు ఆయన కుటుంబసభ్యులకు చాలా ఇష్టం.  డ్రైవర్లు ఉన్నా వాహనం నడపడానికే ఇష్టపడతారు. రెండేళ్ల క్రితం జానకిరామ్ స్వయంగా నడుపుతూ ఆకుపామల వద్ద ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు హరికృష్ణ కూడా ప్రమాదం జరిగిప్పుడు వాహనాన్ని డైవ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే నల్గొండ 2009లో  జిల్లాలో సూర్యాపేట వద్ద జరిగిన ప్రమాదంలో హరికృష్ణ మరో కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. అప్పుడు కూడా ఆయనే కారు నడిపారట.

Tragic road accidents in nandamuri harikrishna family

హరికృష్ణ ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందు హైదరాబాద్‌ నుంచి నెల్లూరు వెళుతుండగా వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి మరో వాహనాన్ని ఢీకొట్టింది ఈ ఘటనతో ఆయన వాహనంలో నుంచి రోడ్డుపై పడిపోయారు. హరికృష్ణ​ తల, వెన్నెముకకు తీవ్ర గాయాలు అయ్యాయి. 

దాదాపు రెండు, మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రమాద సమయంలో కారులో ఆయనతోపాటు నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ తమ కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు.నందమూరి హరికృష్ణ దుర్మరణం

Updated By ManamWed, 08/29/2018 - 08:19
hari krishna

హైదరాబాద్‌ : నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ కుమారుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆయనను హుటాహుటీన కామినేని ఆస్పత్రికి తరలించారు.

తీవ్ర గాయాలపాలై దాదాపు మూడు గంటల పాటు మృత్యువుతో పోరాడిన హరికృష్ణ చివరకు కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు హుటాహుటిన అక్కడకు వెళ్లగా.. ఆయన బావ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ కూడా నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరోవైపు ఆయన మృతితో ఇటు కుటుంబసభ్యులు, అటు అభిమానులు తీవ్ర విషాదంలో మునగగా.. పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. 

HarikrishnaHarikrishnaHarikrishna

 

Related News