pambala

గ్రామ దేవతలకు దండం పెట్టు

Updated By ManamThu, 08/30/2018 - 22:50

అంతరించి పోతున్నాయి అనుకున్న కళలు, సాంప్రదాయాల జాబితాలోకి ఇప్పటికి చాలా చేరిపోయాయి. మిగిలిన గ్రామ సంప్రదాయాలు కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిైపెనా ఉంది. కొన్ని సంప్రదాయాలు వింతగా తోస్తే, మరికొన్ని వినోదాన్ని, వివరాన్ని కలిగి ఉంటాయి. చిన్నతనంలో దసరా ఉత్సవాలకు పెద్ద డప్పు మోతలతో రకరకాల వేషాల్లో వేషగాళ్ళు ఊరి మీదకు వచ్చినప్పుడు, కాస్త భయం, మరింత ఉత్సాహం, ఉత్సుకత కలిగేవి. మరిప్పుడు కనుమరయ్యాయని చెప్పలేముగానీ ఆదరణను కోల్పోతున్నాయి. అలాగే హరిదాసులు కాలంగాని కాలంలో కనిపించి కాస్త ఆశ్చర్యపరుస్తున్నారు కూడా. నిజానికి  కళలు సాంప్రదాయాలు మారుతున్న కాలంతో పోటీ పడి నిలిచేందుకు తమ వంతు కృషి చేస్తునే ఉన్నాయి. 

గ్రామదేవతల పూజావిధానం తరతరాలుగా మనకు వస్తున్న గ్రామీణ సాంప్రదాయం. మాతృదేవతారాధనలో సకల imageచరాచర సృష్టికి మూలకారకురాలు మాతృదేవత అని గ్రహించిన పురాతన మానవుడు ఆమెను సంతృప్తి పరచేటందుకు యెన్నో మార్గాలను ఆశ్రయించాడు.అందులో ప్రార్థన, మంత్రతాంత్రికతలు, పవిత్రీకరణ, ఆత్మహింస, బలి అనేవి ప్రధానంగా కనిపిస్తాయి. గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యంగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. ఈ దేవతలను గ్రామాలను చల్లగా చూస్తూ అందరినీ కాచే తల్లులుగా భావిస్తారు మన పెద్దలు. తరాలు మారుతున్నా ఈ పద్దతులను ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం. సంప్రదాయాలను అనుసరించి గ్రామరక్షణగా ఈ దేవతలను ఊరి పొలివేురలలో ఏర్పాటు చేసేవారు. వారికి ప్రతి ఏడు ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే పోతరాజులు, బైడ్ల, దేవతలు, కొలుపులు, పంబాల అని పిలిచే వీరు నృత్యంతో కూడుకునే కథను పాడుతుంటారు. ఇందులో పోచమ్మ, వైుసమ్మ, ఎల్లమ్మ, గంగరాజు కథ ఇలా చాలా కథలను వాయిద్యాలు వాయిస్తూ చెపుతుంటారు. వీరిని కొందరు స్వాములు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా  పంబాల కళాకారులంతా మగవారే ఉంటారు.

imageకొందరికి ఇలవేల్పులుగా ఈ దేవతలు కొలువై ఉంటారు. అటువంటివారు తమ బిడ్డల పెళ్ళిళ్ళకు కొలుపును నిర్వహిస్తారు. కొలుపు అంటే ఆరాధన. పెద్ద ఆరాధన అయితే పదిహేను మందివరకూ హాజరవుతారు. చిన్న ఆరాధనలకు ఐదుగురు సరిపోతారు. మగవారిచేత జరిగే ఈ ఉత్సవంలో ఎల్లమ్మ కథ, వైుసమ్మ కథ, పోచమ్మ కథలుముఖ్యంగా ఉంటాయి.  పంబాల కళ కూడా ఒకప్పుడు ఉన్న ఆదరణ ఇప్పుడు లేకపోయినా కొన ఊపిరితో మిగిలి ఉంది. ఇందులో కళాకారులు కూడా కొత్తవారు ఉండరు. అందరూ తాత ముత్తాతలనుండీ  వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నవారే ఎక్కువ. పంబాలను బైండ్ల అని పిలిచే వీరు షెడ్యూలు కులాల జాబితాలో 10 కులం. ఈ కులస్థులు మాదిగల పౌరోహిత్యం,  వైుసమ్మలను మేల్కొల్పటం చేస్తుంటారు. వీరిని బైండ్లు, పంబల, జముకు, కొమ్మువారు, ఆసాదులు అనికూడా అంటారు. ఈ బైండ్లవారు మాదిగలకు పూజారులు. కాకతీయ చక్రవర్తుల కాలంలో వీర శైవ మతస్థులకు వినోదాన్ని కలిగించేవారు. మాతంగి కొలుపులు చేసేది కూడా వీరే. బైండ్లవారు ఉపయోగించే వాయిద్యం జమిడిక, జిమిలిక, జముకు. సమిడికయే. కొన్ని ప్రాంతాలలో దీన్ని పంబ అంటారు. కాబట్టి వీరిని పంబాలి వాళ్ళు అని కూడా అంటారు.  కథకుడు మధ్యలో ఉండి కథాగానం చేస్తూ వుంటే పక్కన ఉన్నవారు వంతులుగా జిమిడికల్ని వాయిస్తూ వుంటారు.

ఈ జిమిడికలు కొన్ని ఇత్తడితోనూ, మరికొన్ని కర్రతోనూ తయారు చేసుకుంటారు. ఇవి జుకజుం జుకజుం అనిimage నినాదాన్నిస్తాయి. రేణుకా, ఎల్లమ్మ, గంగాణమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, ఎర్రమారెమ్మ, మహాలక్షమ్మ,మహంకాళమ్మ మొదైలెన దేవతలను కొలుస్తారు. దేవతల పుట్టు పూర్వోత్తరాలను కథాగానం చేసే పూజారులుగా ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు కురవకపోయినా, రోగాలు వచ్చినా గ్రామదేవలను ప్రసన్నులను చేసుకోవడానికి కొలిచే కొలుపుల్లో పంబల కులస్తులు వాయిద్యాలు వయించేవారు.  కొలుపు అనేది వారం రోజులు పాటు జరుగుతుంది. తాటి వనంలో కొలిస్తే  వారం ఉంటుంది. ఏడు రోజులు ఏడు రకాలుగా ఆరాధన జరుగుతుంది. మొదటిది పట్టు పోయడం, బోన ప్రదక్షణ, కుంభంపోయడం, నైవెద్యం సమర్పించడం, జాగు పట్టడం ( అంటే మేకను నోటితో కొరికి అమ్మవారికి బలి సమర్పిస్తారు) ఇలా ఎల్లమ్మకు శాంతి చేస్తారు.

Related News