manam misimi

మరుగవుతున్న చిందు యక్షగానం

Updated By ManamFri, 09/21/2018 - 01:04

imageతెలుగు జాతికి గర్వకారణైమెన అన్య ప్రాంతీయులకు కూడా ఆదర్శప్రాయైమెన శాస్త్రీయ, సంప్రదాయ... జానపద నృత్య కళ చిందు యక్షగానం. పూర్వం తెలుగు నాడును యక్షభూమి అని పిలిచేవారు. గంధర్వ జాతికి చెందిన యక్షులు ఆడిపాడిన భూమి కనుక వారి నృత్య శైలియే యక్షగానంగా వర్థిల్లింది. యక్షగానం అతి ప్రాచీనైవెున  పల్లె ప్రజలకు అందుబాటులో వున్న రమణీయ కళారూపం. ఈ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందువారు. ఈ నృత్యం సుమారు రెండువేల సంవత్సరాలనాటిదంటారు. నాటి నుండి నేటిదాకా ఒక ప్రత్యేకతను సంతరించుకుని పండితుల్ని, పామరుల్ని తమ కళా నైపుణ్యంతో ఈ కళాకారులు మెప్పిస్తున్నారు. 

మన దేశంలో హరిజనుల వర్గానికి చెందిన మాదిగ వారిపై ఆధారపడి జీవించేవారు చిందు కళాకారులు . ప్రతిimage గ్రామంలోనూ ప్రదర్శన ఇచ్చే సమయంలో ఎల్లమ్మ ఆట ఆడటం వీరి ప్రత్యేకత. గ్రామాలు సస్యశ్యామలంగా వుండాలని కోరుతూ తన్మయత్వంతో ఆడతారు, ఆ ఆటవల్ల కరువు కాటకాలు రావని నమ్మే ప్రజలు నిజామాబాద్ జిల్లాల్లో అనేక గ్రామాల్లో ఉన్నారు. మోహినీ, రుక్మాంగధ, సారంగధర, చెంచు లక్ష్మి, వీరాభిమన్య, సుందరకాండ, సతీ సావిత్రి, వైురావణ మొదైలెన నాటకాలను ప్రదర్శిస్తారు. ఎక్కువగా చిందు కళాకారులు ఒకే కుటుంబానికి చెందినవాైరె ఉంటారు.

గడ్డం శ్రీనివాస్ చిందు కళాకారుడు...
imageమాది జనగాం జిల్లా, లింగాల ఘనపురం. చిందు యక్షగానం మా తాతముత్తాల కాలం నుండీ మా వంశంలో ఉంది.  ఈ కళను వంశపారంపర్యంగా స్వీకరిస్తున్నాం. నేను నాలుగో తరానికి చెందిన వాడిని. మేము హరిజనుల దగ్గర యాచించి బ్రతికేవారము. ప్రతి మూడేళ్ళకు ఒకసారి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ ఊరి పెద్దలను ఊరి పొలివేురలో ఉన్న ఎల్లమ్మ దేవాలయానికి ఆహ్వానించి, చాప పరిచి, తిలకం దిద్ది మర్యాదలు చేస్తాము. మా యక్షగానంతో ఆడిపాడి ఆనందపరుస్తాము. తరువాత  మా పూర్వీకుల నుండీ వస్తున్న గిల్లలను( ఇవి పూర్వీకులనుండీ వస్తున్నాయి. గిల్లలు వెండితోగానీ, ఇత్తడితోగానీ చేసినవి. రింగులుగా ఉంటాయి. వాటిని చేతికి తగిలించుకుని తాళం వేస్తూ ఆడతాము) ధాన్యంతో కలిపి పెద్దల దోసిళ్ళలో పోసి వారిని దీవిస్తాము. కైవారం చదివి జాంబవంతుని వేషం కట్టి, ఏట నరికి, ఆ రక్తాన్ని వారి ఇళ్ళల్లో చల్లి, వారికి సకల శుభాలు కలగాలని దీవిస్తాము. ఇందులో అన్ని వేషాలనూ మగవారే కడతారు. దానికి ఊరి పెద్దలు పంచెలు, ధోవతీ, చీరలు ఇచ్చి, తోచిన ధాన్యం ఇచ్చి పంపేవారు. ఇప్పుడు అంత ఆదరణ లేకపోయినా, తోచిన ధనం ఇస్తారు. కాలం మారి ఈ టీవి, సినిమాలు వచ్చాకా మా యక్షగానానికి రోజులు చెల్లాయి. పూర్వం యక్షగానం ఉందంటే ఎడ్లబండి మీద వచ్చి మరీ చూసేవారు. మరిప్పుడో పట్టుమని ఇరవై మంది కూడా కూర్చోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకా మమ్మల్ని గుర్తించినా ఆ సహాయం మాకు సరిపోవడం లేదు. మా పిల్లలు ఈ కళను స్వీకరించడంలేదు. మరి కొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే మా తరువాత చిందు యక్షగానం బ్రతకదనిపిస్తుంది.

చిందుల యల్లమ్మ...
ఈ బృందానికి చిందుల ఎల్లమ్మ ప్రత్యేక ఆకర్షణ. ఆమె అలంకారము, సారంగధర లో చిత్రాంగి పాత్రకు ప్రాణం పోసింది. స్త్రీ పాత్రలనే కాదు పురుష పాత్రలను కూడా ఎల్లమ్మ సమర్థవంతంగా నటించి ఆబాలగోపాలాన్ని మెప్పించింది. ఇందుకు గాను ఆంధ్రప్రదేశ్ నృత్య అకాడమీ అధ్యక్షులు, నటరాజ రామకృష్ణగారు అకాడమీ విశిష్ట సభ్యత్వం ఇచ్చి గౌరవించారు.క్లిక్‌మనిపిస్తే..

Updated By ManamFri, 09/07/2018 - 00:08

imageఅటు ఫోటోగ్రఫీని, ఇటు తనలో దాగిన కళను రెండిటినీ సమన్వయ పరుస్తూ రఘు మందాటి  ప్రొఫెషనల్ గా దూసుకుపోతున్నారు. ఫోటోగ్రఫీతో పాటు డిజిటల్ చిత్రాలు వేయడం, సాహిత్యం మీద మక్కువతో రచనలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం తన అభిరుచులు. ఓ కళతో తాను ఆధరణ పొందటమే కాకుండా పదిమందికి పనికల్పించడం రఘూలో ఉన్న మరో ప్రత్యేకత. ఫోటోగ్రఫీనే వృత్తిగా ప్రవృత్తిగా స్వీకరించిన రఘు మందాటితో ఈ వారం మిసిమి ముచ్చట్లు....

చిన్నతనంలో పుట్టినరోజుకో, పెళ్ళికో ఫోటో తీయించుకోవాలంటే చాలా ప్రయాసతో కూడిన పనిగా ఉండేది. మరిప్పుడో కాదే సందర్భమూ ఫోటోకి అనర్హము అన్నట్టు తయాైరెంది. ప్రతీ సందర్భాన్ని కెవెురాలో బంధించుకుని చూసి మురిసిపోతున్నాం. ఫోటోలు అందరూ తీస్తారు. కానీ వాటిలో జీవాన్ని, జవాన్ని నింపి చూపగలిగే వారు కొందరే ఉంటారు. ఫోటో అనేది మన జ్ఞాపకాల పొదరిల్లుకు జీవం పోసేది. మరిలాంటి ఫోటో జీవితాంతం మన జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకోవాలంటే దానికి ఒకప్పుడు ఏమోగానీ ఇప్పుడు మాత్రం చాలా సులుైవెపోయింది. ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ చేతిలో తమ వేడుకను పెడితే చాలు దివి భువికి దిగి వచ్చిందా అన్నంత  ఆశ్చర్యాన్ని మన కళ్ళల్లో నింపి మొత్తం వేడుకను రూపొందిస్తున్నారు.

image


వరంగల్‌లో పుట్టాను. చదువంతా అక్కడే జరిగింది. హైదరాబాద్‌కి డిగ్రీ చదువుతుండగా వచ్చాను. వరంగల్‌లో చదువుతున్నప్పుడే ఐడియాలో పని చేసాను. అదే జాబ్ లో హైదరాబాద్ లోనూ చేరాను. తరువాత కొద్ది కాలానికి మల్టీ నేషనల్ కంపెనీలో అవకాశం వచ్చింది. అప్పుడే ఫోటోగ్రఫీ కళమీద ఆసక్తి కలిగింది. దీనితో పాటు సినిమా, రచనైవెపు కూడా దృష్టి పెట్టాను. చిన్న పోకెట్ కెమెరా పట్టుకుని ఖాళీ దొరికితే ప్రకృతి వైపు పరుగులు పెట్టేవాడిని. నేను తీసిన ఫోటోకి బహుమతిని అందుకున్నాకా, ఇంకా బలంగా ఫోటోగ్రఫీ మీద ప్రేమ బలపడింది. తీసిన ఫిల్మ్  డెవలెప్ చేయించడానికి నాదగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఆ నెగిటివ్‌లోనే  రంగుల్లో  ఫోటో ఏలా ఉంటుందో ఊహించుకునే వాడిని. తరువాత చిన్నగా డబ్బులు పోగుచేసుకున్నాకా నాలుగు నెలలకు ఫింట్ వేయించి వాటిని చూసుకుని మురిసిపోయెువాడిని. ఫోటో తీయడమే కాదు, ప్రకృతిలో అందాలను చూపించడంలో మరో కోణాన్ని చూడసాగాను.

 ఫోటోగ్రఫీకి సంబంధించి కొన్ని గ్రూపుల ద్వారా ఫేస్ బుక్, ట్విట్టర్‌లలో వారితో పరిచయంతో పాటు వర్క్ పరంగా మంచి సలహాలను తీసుకునే వాడిని. ప్రతివారం గ్రూపు సభ్యులం అందరం ఏదో ఒక చోట కలిసేవారం. తెలియకుండానే ఓ కొత్తప్రపంచం వచ్చి నన్ను హత్తుకున్నట్టు ఉండేది. హైదరాబాద్‌లోనే కాకుండా చుట్టుపక్కల యాత్రకు వెళ్ళి అక్కడి దృశ్యాలను కూడా కెవెురాలో బంధించేవాడిని. 

నెమ్మదిగా నా ఫోటోగ్రఫీ కళపై ఆసక్తి కొనసాగుతుండగానే, ఇటు నా ఊరు, చిన్ననాటి జ్ఞాపకాలను పేపరుపై పెట్టడం imageమొదలుపెట్టాను. అలా నాకు తెలియకుండానే నాలో దాగున్న రచయిత మేలుకున్నాడు. రాసిన వాటిని నా ఫేస్ బుక్ వాల్ మీద పెట్టేవాడిని. అవి చదివిన స్వర్ణగారని, ఆమె డాక్టర్. తను నా జ్ఞాపకాలను పుస్తక రూపంలోకి చెస్తానని అన్నారు. అలా నా కథలన్నీ కలిపి జ్ఞాపకాల గొలుసు పుస్తకం వెలువడింది. కొంత కాలానికి నెమ్మదిగా ఉద్యోగం వదిలి ఫుల్ టైం ప్రొఫిషనల్ ఫోటోగ్రాఫర్‌గా నిలదొక్కుకున్నాను. అప్పుడే బాంబేలో ఓ కల్చర్ మొదైలెంది. వెడ్డింగ్ నంతా ఓ వీడియోలో మూడు నుండీ నాలుగు నిముషాల పాటు కుదించి వెడ్డింగ్ హైలెట్స్ లా వీడియో చేయడం. ఇది మన హైదరాబాద్ లో నేనూ ప్రారంభించాను. యూట్యూబ్‌లో పెడితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదే నా కెరియర్ ప్రారంభానికి నాంది. రెండు మూడేళ్ళలో 200 పెళ్ళిళ్ళకు వర్క్ చేసాను. అప్పటినుండీ  నాతో కొందరిని కలుపుకుని ఓ సంస్థను స్థాపించాను. అదే  మెమరీ మేకర్స్. ఫోటోగ్రఫీతో సంస్థద్వారా  చాలా ప్రదేశాలు చుట్టి వచ్చాము. అందులో నాకు చాలా ఆనందం కనిపిస్తుంది. చరిత్ర ఆనవాళ్లు చెరిగిపోతున్నాయి

Updated By ManamThu, 09/06/2018 - 22:35

imageశిల్పాలపై పరిశోధన గురించి అనేది మాటలు కాదు. పురావస్తు శాఖ వారికి ఫలానా శతాబ్దపు ఆనవాళ్ళు భూమిలో లభ్యమయ్యాయి. అని తెలిసినప్పుడు ఒకింత ఉత్సాహం కలుగుతుంది. మన పురాతన కట్టడాలను, ప్రదేశాలు చూసినప్పుడు అబ్బా ఏమి శిల్ప కళా నైపుణ్యం అనుకుని అబ్బుర పడక మానము. అటువంటి వాటిని పరిశోధన చేసి కొత్త విషయాలను తెలుసుకుంటున్న వైద్యురాలు వరంగల్‌కు చెందిన హిందోళ గుడిబోయిన. వృత్తిరిత్యా వైద్యురాైలెన ఈమె. అభిరుచి కాస్త భిన్నమే. అసలు అటుగా ఎలా వెళ్ళిందో మనం మిసిమి అడిగి తెలుసుకుంటుంది. మీరూ రండి. 

చిన్నతనం నుండీ పెద్దవాళ్ళు పూర్వీకులనాటి చరిత్ర గురించి, వారి వస్త్రధారణ గురించి, వారి వైభవం గురించి చెప్పినప్పుడు, పుస్తకాల్లో చదివినపుడు మనలో తెలియకుండానే ఓ రకైమెన ఆతృత మొదలవుతుంది.వాటి గురించి ఎలా అయినా తెలుసుకోవాలనిపిస్తుంది. నాలోనూ అలా మొదైలెందే పురాతన కట్టడాలు, పురావస్తు చరిత్ర ఇలాంటి అంశాల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. చాలా మందిలో ఉండే తపనే అయినా నాలో ఆపాళ్ళు కాస్త ఎక్కువగా ఉండేది. నాకు ఉన్న ఆసక్తిని మావాళ్ళు ప్రోత్సహించారు. అటు చదువుని కొనసాగిస్తూనే మరోపక్క పురావస్తు అంశాలను ప్రదేశాలను రిసెచ్ చేయడం మొదలుపెట్టాను. 
 

image


డాక్టర్ వృత్తి కొనసాగిస్తూనే, పరిశోధనలకు వీలు ఏలా చిక్కుతుంది.
దంతైవెద్యురాలిగా చాలా బిజీగా ఉండే నేను మిగతా పనులన్నీ వీకెండ్ లోనే చేసుకుంటాను. అందులోనూ ఎక్కువ వీలుగా ఉండే దగ్గరి ప్రదేశాలను ఎన్నుకుని అటు వెళుతుంటాను. నిజమే ఇందులో ఒకటి వృత్తి మరొకటి నా అభిరుచి రెండిటినీ సరిసమానంగా నడిపించడం, వాటికి న్యాయం చేయడం కాస్త కష్టమే. అయినా నా పరిశోధనలు మానలేదు. చిన్నతనంలో అమ్మనాన్నలు డాక్టర్స్ కావడం వల్ల చాలా బిజీగా ఉండేవారు. అందుకు మా మావయ్య సూర్యనారాయణగారు నన్ను అన్ని చోట్లకీ తిప్పేవారు. అలా నేను చూసిన మొదటి కట్టడం గోల్కొండ కోట అక్కడికి ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళి ఉంటానో లెక్కలేదు. ఆ తరువాత చూసింది సాలార్ జంగ్ మ్యూజియం, కుతుబ్ షాహీ టూబ్స్ చిన్నతనంలో నాకు తప్పకుండా వెళ్ళి వాటిగురించి తెలుసుకోవాలి, చూడాలి అనిపించిన ప్రదేశాలవి. ఆతరువాత నేను చూసిన ప్రదేశం అజంతా ఎల్లోరా గుహలు. ఈ అన్వేషణ అనేది నాలో నాకే తెలియకుండా బలపడిపోతూ వచ్చింది. అందులోంచి దీనివెనుక ఇంకా ఏదో దాగుంది. చరిత్రకారులు మనకు చెప్పని మరో కోణమేదో చెప్పాలి అనే తపన పుట్టింది. 

ఆర్కియాలజీ వైపు వెళ్ళకుండా డాక్టర్ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు మరి...
అమ్మానాన్న ఇద్దరిదీ వైద్య వృత్తి. పుట్టింది వరంగల్ జిల్లా. వృత్తి రిత్యా ఎక్కడ ఉన్నా రిటైర్ అయ్యాకా మళ్ళీ తిరిగి వరంగల్ లోనే సెటిల్ అయ్యాం. నా తల్లితండ్రుల ఇద్దరిదీ బీద కుటుంబాలనుండీ వచ్చినవారే కావడంతో నాకు ఆ కష్టం తెలీనీయలేదు. డాక్టర్ వృత్తి అంటే చాలా ఒత్తిడికి గురికావలసి ఉంటుంది. అలాగే పని వేళలు కూడా సరిగా ఉండవు అనేది వారి వాదన.  చిన్నతనం నుండీ ప్రతి విషయానికీ చాలా ప్రశ్నలు నన్ను చుట్టు ముట్టేవి. వాటికి జవాబులు వెతుకులాడుతూ ఉండేదాన్ని. డాక్టర్ కావడానికి కూడా నాకు తగ్గ బలైమెన కారణాలు నాకున్నాయ్. ఈ వెతుకులాట అనేది నాతోపాటు పెరుగుతూ వచ్చిందనే చెప్పాలి. 
 

image


పూర్తిగా సమయాన్ని కేటాయిస్తూ పరిశోధనలు మొదలు పెట్టింది ఎప్పుడు?
రెండేళ్ళ నుండీ పూర్తిగా ఇన్వాల్ అయ్యాను. అలా అని డాక్టర్ వృత్తిని వదిలికాదు. ఉదయం 11 నుండీ 2 వరకూ హాస్పటల్ ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6గంటలకే తెరిచేది,  కనుక ఈ మధ్య సమయాన్ని విశ్రాంతికి వెచ్చించకుండా వరంగల్ చుట్టుపక్కల దగ్గరలోని ప్రదేశాలకు వెళతాను. ఇక వరంగల్ చుట్టూ చాలా పురాతన కట్టడాలు ఉన్నాయి. కొన్నిటిని ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరికొన్నిటిని ప్రజలే నిర్లష్యం చేస్తున్నారు. ఓ పురాతన కట్టడంగానీ శిల్పంగానీ పాడైందంటే దాని పూర్తి భాద్యత ప్రభుత్వానిదే  కాదు, ప్రజలకూ ఉంది. కానీ వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు అనుకుంటారు అంతే. అలా పాడుబడి శిథిలైవెుపోతున్న ప్రదేశాలు వరంగల్ చుట్టూ చాలా ఉన్నాయి. సెలవు రోజులప్పుడు కాస్త దూరంలో ఉన్న ప్రదేశాలకు వెళుతుంటాను. ఓ శిల్పం గురించిగానీ మరే ఇతర వాటిగురించి చెప్పాలన్నా, డాక్యమెంట్ చేయాలంటే దానికి ఫోటోగ్రఫీ కూడా చాలా అవసరం. అది కూడా నేర్చుకున్నాను.
 
ఇప్పటి వరకూ అంతుచిక్కని, మీ ఆలోచనల్లో ఓ ప్రశ్నగా మిగిలిన ప్రదేశం ?
ఉందండి. ఇప్పుడు కాకతీయులకు కాకతీయ అనే పేరు ఏలా వచ్చింది అనేది ఓ మిస్టరీ. మనకి రాజుల గురించిగానీ, రాజ్యాంగాల గురించిగానీ వివరాలు తెలిసేది శాసనాల ద్వారా. ఇంకొక  మార్గం రచనల ద్వారా. ఇవే మనకున్న మార్గాలు. కొందరు ఏమంటారంటే  పూర్వం కాకతీ అనే దేవతను ఆరాధించేవారు అందుకు కాకతీయ అనే పేరు వచ్చింది అంటారు. మరికొందరు గుమ్మడి తీగను కాకతీ అని పిలుస్తారు, అందులోంచి కాకతీయ అనే పేరు వచ్చింది అంటారు. దీనిమీద కూడా చాలా పరిశోధించాను. వరంగల్ జిల్లాలో ఎక్కడా  ఒక్క గుడి లో కూడా ఆ దేవత గురించి లేదు. ఆమె దుర్గా దేవి స్వరూపమే అని అనుకున్నా ఆ అంశ తీసుకున్న ఆధారాలు కూడా లేవు. ఎక్కడో  చిన్న లింక్ మిస్ అవుతున్నాం. 

ఇలాంటిదే మిమ్మల్ని ఆలోచనలో పడేసిన మరో శిల్పం...
చాలానే ఉన్నాయ్. మనకు కొన్ని శిల్పాలు చూస్తుంటే ఈ శిల్పికి ఇంత తెలుసా అనిపిస్తుంది. అప్పటి శిల్పి అనేవాడు ఎంతో జ్ఞానం కలిగి ఉండేవాడు. అతడికి శిల్పశాస్త్రం, మానతార మీద ఎంతో పట్టు ఉండేది. వీటి ఆధారంగా ఓ శిల్పాన్ని చెక్కేందుకు ఎటువంటి శిలను ఎంచుకోవాలి, ఏ కొలతలు ఆధారంగా శిల్పం తయారుచేయాలి. అనే వాటిని అనుసరిస్తూ శిల్పి తన పనితనాన్ని చూపాలి. అందులో మరో అంశం. కాకతీయుల శిల్ప రీతి ఉంది కదా అది ముఖ్యంగా చాళుక్యులది. వారి రీతినే కాకతీయులు కొనసాగించారు. కానీ దీనంతటికీ కాకతీయుల శిల్ప రీతిగా పేరు పొందింది. కళ్యాణీ చాళుక్యుల నుండీ వచ్చిన ఈ కళ నెమ్మదిగా కాకతీయ కళగా రూపు దిద్దుకుంది. ఈ విషయంగా ఇంకా రీసెచ్ చేస్తున్నాను.

ఈ శిల్పాల అన్వేషణలో మీకు కలిగే సందేహాలను, సలహాలను ఎవరి దగ్గర నివృత్తి చేసుకుంటారు.
ఎక్కువ నాకు కలిగే సందేహాలను పుస్తకాల ద్వారానే నివృత్తి చేసుకుంటాను. హెరిక్లేజన్ కల్చర్ గ్రూప్ ఆఫ్ ఇండియా అని ఫేస్ బుక్ పేజ్‌లో పోస్ట్ చేస్తుంటాను. అలానే దేనిమీైదెనా ప్రభావం అనేది ఉండకూడదు. మత పరైమెన, ప్రాంత పరైవెునవి. కానీ ఈ చరిత్ర పునాదులపై చాలా వరకూ జైన దేవాలయాలను, హిందూ దేవాలయాలుగా మార్చేశారు. అటువంటివి వరంగల్ జిల్లాలో చాలానే ఉన్నాయి.

వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ బిల్డ్గింగ్ కాంప్లెక్స్‌లో ఉండే  మ్యూజియమ్ ముందు భాగంలో ఎక్కడినుండీ తీసుకువచ్చారో గానీ జైన ప్రతిమను అమ్మవారిగా మార్చి ప్రతిష్టించేసారు. అలాగే పద్మాక్షి టెంపుల్ వరంగల్ కూడా ఆకోవలోకే  వస్తుంది. ఆ చుట్టుపక్కల ఏ శిల్పాైలైనా జైన సాంప్రదాయంలోనే ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా ఉదాహరణకు ముస్లిములు ఉంటే దర్గాలు గాను, హిందు రాజులు అధికారంలో ఉంటే దేవాలయాలుగానూ మార్చేసారు. దీనివలన ఏమౌతుంది. వాస్తవాలు మరుగున పడిపోయి. కల్పితాలు మాత్రమే చరిత్రగా, సాక్షాలుగా మిగులుతున్నాయి. ఇలా వరంగల్ ప్రాంతానికే పరిమితమై ఉండకుండా మొత్తం మన శిల్ప సంపద ఉన్న ప్రదేశాలన్నీ చూసి పరిశోదిస్తే ఇంకా అంతుచిక్కని అంశాలెన్నో తెలిసే అవకాశం లేకపోలేదు.వయ్యారాల గొల్లభామ

Updated By ManamThu, 08/30/2018 - 23:07

అగ్గిపెట్టెలో పట్టే చీరను, మదిని దోచే మరెన్నో ఆకృతులకు సజీవ రూపం పోసిన సిద్దిపేట చేనేతల శ్రమైక సౌందర్యంలో నుండే గొల్లభామ పురుడుపోసుకొని నేటికీ  సజీవంగా వర్ధిల్లుతూ వస్తోంది. సిద్దిపేట పట్టణం చేపల మార్కెట్ సమీపంలో నివాసముంటున్న తుమ్మ గాలయ్య పూర్వీకుల అద్భుత ఆలోచనల సృష్టిలో నుండి ఉద్భవించిందే గొల్లభామ చీర. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి, ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఈ గొల్లభామ చీరను మెచ్చారు. ప్రముఖ సినీ నటి సమంత బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న గొల్లభామ చీరలపై ‘మనం మిసిమి’ ప్రత్యేక కథనం.
 

image


తలమీద పాల కడవ జారిపోకుండా, పెరుగు ముంతను వయ్యారంగా పట్టుకుని సరిలేరు నాకెవ్వరూ అంటూ తన వయ్యారాల నడుము ఒంపులతో నాట్యం చేస్తూ వెళుతున్న గొల్లపిల్ల మళ్ళీ నేనున్నానంటూ వెలుగులోకి వచ్చింది. మారుతున్న ఫ్యాషన్ రంగంలో గుర్తింపు పొందేందుకు పెద్ద సాహసమే చేసింది. ప్రభుత్వాల ప్రోత్సాహమో, సినీ జనాల వకాల్తానో మొత్తానికి గొల్లభామ ముద్రతో సిద్ధపేట గొల్లభామ చీరలు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. 

ఎన్నో కష్టాలను, మరెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న చేనేత రంగంలో ప్రత్యేకత చూపితే తప్ప మనుగడ అసాధ్యమనే భావనలో నుండి గొల్లభామ పుట్టింది. సిద్దిపేటకు చెందిన తుమ్మ గాలయ్య పూర్వీకులు 70 సంవత్సరాల క్రితమే అత్యంత కళాత్మకంగా గొల్లభామ చీరలకు రూపకల్పన చేశారు. నాడు 90 రూపాయలకు లభించిన గొల్లభామ చీర నేడు రూ.1500 నుండి 5000లు పలుకుతోంది. అత్యంత కష్టతరమైన పని అయినప్పటికీ ఎంతో ఇష్టంగా కార్మికులు గొల్లభామ చీరలను నేస్తూ వస్తున్నారు. ఒకప్పుడు దినదిన ప్రవర్ధమానంగా వెలిగిన గొల్లభామ చీరల అమ్మకం రోజురోజుకు తగ్గిపోతూ ఉనికే ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితికి చేరుకుంది. వందల సంఖ్యలో హైండ్‌లూమ్స్‌పై వయలు పోయిన గొల్లభామ చీర నేడు ఆదరణ కరువై నేసే వారు లేక కాలగర్భంలో కలిసిపోతుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. పూర్వీకులు ఇచ్చిన అద్భుత సంపద గొల్లభామను సజీవంగా నేటి తరానికి అందిస్తూ వస్తున్నాడు తుమ్మ గాలయ్య. పాత మార్కెట్ చౌరస్తా సమీపంలో 70 సంవత్సరాలుగా ఇదే వృత్తిని దైవంగా భావిస్తూ గొల్లభామ చీరలను నేటి తరానికి అందిస్తూ వస్తున్నాడు.

పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, చీరలను నేసే కార్మికులు లేక ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటు న్నప్పటికీimage ఎలాగైనా గొల్లభామను కాపాడాలన్న సత్సంకల్పంతో చిట్ట చివరికి మిగిలిన 16 మంది కార్మికులతో గొల్లభామ చీరల ప్రశస్తిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. షైనింగ్ కాటన్, మస్రస్ కాటన్, గొల్లభామ కాటన్ వంటి చీరలకు అవసరమైన ముడిసరుకులను సూరత్, భీమండి, ముంబాయి నుండి తెప్పిస్తూ గొల్లభామలను నేస్తున్నాడు. ఒక్కో చీరను నేసేందుకు నాలుగు రోజుల సమయం పడుతుందని, భీము నుండి మగ్గంపైకి చీరను నేసేందుకు వరుస క్రమంలో 3600ల పోగులను సరి చేసే అత్యంత కఠినమైన పనిగా గొల్లభామ చీర ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఒకానొక దశలో గొల్లభామకు ఆదరణ లేక అవసాన దశకు వెళ్ళిపోగా సిద్దిపేటకే చెందిన కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో చేనేత రంగానికి చేయూతను అందించేందుకు ముందుకొచ్చారు.

చేనేతకు చేయూత అందించడంతోపాటు గొల్లభామకు పూర్వపు వైభవాన్ని తీసుకురావాలన్న నిర్ణయం తీసుకోవడంతో గత నాలుగేళ్ల నుండి గొల్లభామ పేరు ఎక్కడ చూసినా నానుతుంది. చేనేత ఎగ్జిబిషన్‌లలో తప్పనిసరిగా గొల్లభామ ఉండి తీరాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ప్రభుత్వం ప్రోత్సహించిన రీతిలో గొల్లభామకు ఆదరణ లేకపోవడం, టెస్కో గొల్లభామలను ఖరీదు చేసేందుకు ముందుకు రాకపోవడం పవర్ లూమ్స్‌పై తయారవుతున్న చీరలు గొల్లభామ  చీరలకంటే తక్కువ ఖరీదు కావడంతో గొల్లభామను కొనుగోలు చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదన్నది అందరికీ తెలిసిందే. 

image


తుమ్మ గాలయ్య కుటుంబమంతా గొల్లభామ చీరలను విక్రయించడం ద్వారానే జీవనోపాధి పొందుతుంది. తుమ్మ గాలయ్యతోపాటు అతని భార్య రాజమణి ఇదే పనిని చేస్తూ బతుకుబండిని ఈడ్చుతున్నారు. దీనిలో ఒక కుమారుడు దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జిబిషన్‌లలో చీరలను విక్రయిస్తుండగా, మరో కుమారుడు ఆన్‌లైన్‌లో చీరలను విక్రయిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న చీరలకు అద్భుతమైన స్పందన  ఉండడం మూలంగానే కనీసం బతుకుబండిని లాగుతున్నామంటూ చెప్పుకొచ్చాడు తుమ్మ గాలయ్య. తాతలు అందించిన అద్భుతమైన కళను భావితరాలకు అందించాలని ఎంతో ఉన్నప్పటికీ నేర్చుకునేందుకు నేటి తరం యువకులు ముందుకు రావడం లేదన్నారు. కార్మికులకు సరైన కూలీ గిట్టక పోవడం, ఎప్పటివో మగ్గాలు ఉండడం మూలంగా కార్మికులు నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదంటున్నాడు. ప్రభుత్వం చేయూతనిస్తే గొల్లభామ చీరల ప్రాభవాన్ని రక్షించేందుకు కృషి చేస్తానంటున్నాడు తుమ్మ గాలయ్య. 150 సంవత్సరాల చరిత్ర కలిగి ప్రపంచవ్యాప్తమవుతున్న గొల్లభామ చీర తమ  పూర్వీకులు సంపాదించిన గొప్ప ఆస్తి అని గాలయ్య పేర్కొన్నాడు, గత మూడు తరాల నుండి గాల్లభామ చీరలనే నేస్తున్నానని, గొల్లభామ చీర సిద్దిపేట పేటెంట్ కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. 1990 సంవత్సరం నుండి చేనేత సంక్షోభంలో ఉన్నా కళను కాపాడుకుంటూ వస్తున్నామని, ఇటీవల అంతర్జాతీయ చీరల ప్రదర్శనలో గొల్లభామకు 41వ స్థానం లభించిందన్నారు. 

గొల్లభామ చీరలకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తున్నప్పటికీ అంతగా స్థానికుల నుండి స్పందన రావడం లేదనే చెప్పవచ్చు. ఇతర ప్రాంతాలకు చెందిన మహిళలే గొల్లభామ చీరలను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నారు తప్పితే స్థానిక మహిళలు అంతగా ఆసక్తిని చూపడం లేదు. గొల్లభామ చీరలనే కాకుండా గొల్లభామ వస్త్రాన్ని కూడా తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గొల్లభామ వస్త్రంతో షర్ట్స్, వాస్‌కోట్స్ ధరించడం కూడా ఫ్యాషన్‌గా మారింది. ఎంత మార్పు వచ్చినా ప్రభుత్వం నుండి ప్రత్యక్షంగా ప్రోత్సాహం అందిస్తే తప్ప గొల్లభామ బతికిబట్టకట్టేలా కనిపించడం లేదు. గొల్లభామను తప్పనిసరిగా ధరించాలన్న నిబంధన కానీ, గొల్లభామ చీరలను ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే కళను కాపాడుకునే అవకాశం ఉంది. కొత్తగా కార్మికులకు గొల్లభామ చీరల తయారీ పట్ల మెలకువలు నేర్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపి ట్రైనింగ్  సెంటర్ ఏర్పాటు చేస్తే గొల్లభామ పది కాలాలపాటు పరిఢవిల్లే అవకాశం లేకపోలేదు.

సంక్లిష్టం తయారీ విధానం
    గొల్లబామ చీరల తయారీ అత్యంత సంక్లిష్టమైనది. గతంలో ముడి సరుకులు తీసుకువచ్చి, రంగులు అద్ది, చీరలు నేసేవారు. కాలక్రమేణా రంగులద్దే విధానం మరుగునపడింది. ప్రస్తుతం కలర్‌కోంబ్ (దారపు ఉండలు) తీసుకువచ్చి వాటిని బింగిరీలకు చుట్టి వాటిని అత్యంత నేర్పుగా గ్రిల్ మిషన్‌పైకి ఎక్కించి ఒక్కో బింగిరీ నుండి వచ్చే దారంతో బీముపై పోస్తారు. ఒక్కో బీముపై పోసిన దారాన్ని తీసుకువెళ్లి మగ్గంపై అచ్చుకు ఎక్కిస్తారు. అచ్చుకు ఎక్కించే క్రమంలో 3600ల పోగులను ఒక్కొ రంధ్రం గుండా మగ్గంపై ఏర్పాటు చేసి, రెండు మూడు రోజులు కష్టిస్తేనే చీర తయారవుతుంది. ఒక్కో బీముపై తయారు చేసిన దారం 30 చీరలకు సరిపోతుంది. 


 

Related News