us open 2018

చాంపియన్ జొకోవిచ్

Updated By ManamMon, 09/10/2018 - 22:40
  • సంప్రాస్ రికార్డు సమం చేసిన సెర్బియా ఆటగాడు 

  • యూఎస్ గ్రాండ్ శ్లామ్ ఓపెన్

imageన్యూయార్క్: సెర్బియా ఆటగాడు నోవక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారమిక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 7-6 (7/4), 6-3తో జువాన్ మార్టిన్ డెల్ పొట్రోను వరుస సెట్లలో ఓడించాడు. దీంతో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలిచిన పీట్ సాంప్రాస్ రికార్డును సమం చేశాడు. ‘అతిపెద్ద టెన్నిస్ దిగ్గజాలలో సాంప్రాస్ ఒకడు. ఆయన నా చిన్ననాటి హీరో. ఆయన ఆటను చూస్తూ పెరిగాను. ఆయన తొలి రెండు వింబుల్డన్ పోటీలను టీవీల్లో చూశాను. ఆ స్ఫూర్తితోనే టెన్నిస్‌ను ఎంచుకున్నాను. ఈ గెలుపుతో ఫెడరర్ 20 టైటిళ్ల రికార్డుకు ఆరు విజయాల దూరంలో, నాదల్ 17 టైటిళ్ల దూరానికి మూడు టైటిళ్ల దూరంలో జొకోవిచ్ ఉన్నాడు. గతేడాది మోచేయి గాయం కారణంగా జొకోవిచ్ ర్యాంక్ కూడా పడిపోయింది. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరే క్రమంలో జొకోవిచ్‌కు చాలా అంశాలు కలిసొచ్చాయి. డ్రా కింది అర్ధ భాగంలో ఉన్న ఫెడరర్‌ను నాలుగో రౌండ్‌ను జాన్ మిల్‌మన్ ఓడించడంతో జొకోవిచ్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. మరోవైపు డెల్ పొట్రోతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా ఆట మధ్యలో తప్పుకోవడంతో జొకోవిచ్‌కు టైటిల్ మరింత సులువైంది. 

నాదల్, ఫెదరర్‌లకు రుణపడివుంటా
‘బహుశా పదేళ్ల కిందట అనుకంటా... ఈ యుగం ఆటగాళ్లు నాదల్, ఫెదరర్‌లతో అసంతృప్తిగా ఉన్నానని చెప్పాను. కానీ నేను ఈ రోజు ఓ గొప్ప ఆటగాడినయ్యాను. ఫెదరర్, నాదల్‌లతో వైరమే నన్ను గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. నన్ను నేను ఓ ఆటగాడిగా మలచుకునేందుకు వాళ్లతో వైరం ఉపయోగపడింది. నిజంగా వారికి నేనెంతో రుణపడివున్నాను’ అని జొకోవిచ్ అన్నాడు. ఈ టోర్నీకి ముందే జొకోవిచ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి వారంలో ఇక్కడి వేడిని తాళలేక ఇబ్బందిపడ్డ  చాలా మందిలో జొకోవిచ్ కూడా ఒకడు. తొలి రౌండ్‌లో హంగేరీకి చెందిన మార్టన్ ఫక్సోవిక్స్‌ను, రెండో రౌండ్‌లో అమెరికాకు చెందిన టెన్నిస్ సాండగ్రెన్‌ను చిత్తు చేశాడు. 
 

image

ఒలే నోల్
ఫైనల్స్‌కు చేరుకునే క్రమంలో ఫ్రాన్స్‌కు చెందిన రిచర్డ్ గాస్కెట్‌తో, పోర్చుగల్‌కు చెందిన జోయావో సౌస, మిల్‌మన్, 2014 ఫైనలిస్ట్ కీ నిషికోరీలతో హోరా హోరీ పోరు కొనసాగించాడు. రెండో సెట్ ఆరంభంలోనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఉన్నట్టుండి వరుసగా మూడు గేమ్‌లు కోల్పోయాడు. అయితే తర్వాత 20 నిమిషాల పాటు జరిగిన మారథాన్ గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. ఇందులో ఎనిమిదాస్లు డ్యూస్ కొనసాగింది. స్టేడియంలోని ప్రేక్షకులందరూ డెల్ పొట్రోకు మద్దతుగా నిలిచారు. ఫైనల్లో డెల్ పొట్రోతో పోరును హెవీవెయిట్ క్లాష్‌గా జొకోవిచ్ అభివర్ణించాడు. ‘ఈ మ్యాచ్‌లో కొన్నిసార్లు మెరుపు వేగంతో ఆట జరిగింది. ముఖ్యంగా రెండో సెట్‌లో మునివేళ్లపై ఆడాల్సివచ్చింది.  నన్ను నమ్మండి... పైకప్పు మూసేసినప్పుడు అభిమానుల ఆరుపులతో స్టేడియం దద్దరిల్లింది. ఆ శబ్దం ఆటగాడిపై గొప్ప ప్రభావం చూపుతాయి. అయితే చాలా ఫన్నీగా ఉండింది.

ఎందుకంటే నా నిక్ నేమ్ నోల్. కానీ అభిమానులు ఒలే.. ఒలే.. ఒలే.. ఒలే అని అరిచినప్పుడు నా పేరుimage ఉచ్చరించినట్టు అనిపించింది. అయినప్పటికీ వాటిన్నంటిని తట్టుకుని టైటిల్ గెలవడం నాకు చాలా సంతోషంగా ఉంది’ అని జొకోవిచ్ చెప్పాడు. అయితే ఫెడరర్ 20 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల రికార్డును జొకోవిచ్ సాధించాలని డెల్ పొట్రో ఆకాంక్షించాడు. ‘అతను ఖచ్చితంగా సాధిస్తాడు. ఇప్పటికే 14 టైటిళ్లు అతని ఖాతాలో ఉన్నాయి. అతను పూర్తి ఆరోగ్యంతో, ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఏడాదికి రెండు టైటిళ్లు గెలవగలడు. నేను, రాఫా, రోజర్ గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల కోసం పోరాతామని భావిస్తున్నాను. ఎందుకంటే చరిత్ర సృష్టించడం కోసం జరిపే పోరాటం చాలా బాగుటుంది’ అని పొట్రో చెప్పాడు. 
 
Read also: నేను మోసం చేయలేదు: సెరెనా

Updated By ManamSun, 09/09/2018 - 11:14
serena williams

న్యూయార్క్ : యూఎస్ ఒపెన్ ఫైనల్ మ్యాచ్‌లో తాను నిబంధనలు ఉల్లంఘించలేదని, తాను ఎవరినీ మోసం చేయలేదని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ పేర్కొంది. తాను ఛీటర్‌ను కాదని, మోసగించబడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. క్రీడల్లో మహిళల పట్ల వివక్షత చూపుతున్నారనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శం అంటూ సెరెనా ఆరోపణలు చేసింది.

వివరాల్లోకి వెళితే.. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్-2018 మహిళల సింగిల్స్‌లో సెరెనాపై  6-2, 6-4 తేడాతో నయోమి ఒసాకా విజయం సాధించిన విషయం తెలిసిందే. సెరెనాను వరుస సెట్లలో ఓడించిన ఒసాకా గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకున్న తొలి జపాన్ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.

కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కోచ్ సూచనలను తీసుకోవడంతో సెరెనాను అంపైర్  కార్లోస్ రామోస్ హెచ్చరించాడు. అయితే అంపైర్ నిర్ణయాన్ని తప్పబడుతూ ఆమె అంపైర్‌తో వాగ్వివాదానికి దిగింది.  కార్లోస్ ఓ మోసగాడు, దొంగ అంటూ సెరెనా వ్యాఖ్యానించింది. అంపైర్ తనకు క్షమాపణ చెప్పాలంటూ కోర్టులోనే వాదనకు దిగింది. 

మరోవైపు సెరెనా విలియమ్స్‌కు ఆమె కోచ్ కూడా మద్దతుగా నిలిచాడు. ఆమె ఎలాంటి తప్పుచేయలేదని, మ్యాచ్ నిబంధనలు ఉల్లంఘించలేదని ప్యాట్రిక్ మౌరాటోగ్లో స్పష్టం చేశాడు. ఏది ఏమైనా మ్యాచ్‌ సందర్భంగా అంపైర్‌తో వాగ్వివాదానికి దిగి, అతడిని మోసగాడు, దొంగ అని వ్యాఖ్యలు చేసి సెరెనా వివాదంలోకి చిక్కుకున్నట్లు అయింది.ఫైనల్లో తలపడనున్న జొకోవిచ్, పోట్రో

Updated By ManamSat, 09/08/2018 - 22:32
  • మోకాలి గాయంతో తప్పుకున్న నాదల్

  • యూఎస్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్  

imageన్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్ శ్లామ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో నోవక్ జొకోవిచ్, జువాన్ మార్టిన్ డెల్ పోట్రో ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్ మోకాలి గాయం కారణంగా పోటీ మధ్యలో తప్పుకున్నాడు. 2009 చాంపియన్, మూడో సీడ్ డెల్ పొట్రో 7-6 (7/3), 6-2తో ఆధిక్యంతో ఉన్నప్పుడు నాదల్ రిటైర్ అయ్యాడు. దీంతో 2011, 2015 చాంపియన్ జొకోవిచ్‌తో తుది పోరుకు డెల్ పొట్రో సిద్ధమయ్యాడు. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో నోవక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో జపాన్‌కు చెందిన కీ నిషికోరిపై వరుస సెట్లలో గెలిచాడు. 10 ఏళ్ల ముఖా ముఖీ పోరులో డెల్ పొట్రోతో జొకోవిచ్‌కు 14-4 రికార్డు ఉంది. 2007, 2012 యూఎస్ ఓపెన్‌లలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండా పొట్రోపై జొకోవిచ్ గెలిచాడు. ‘ఇప్పటి వరకు ఒక్క గ్రాండ్ శ్లామ్ ఫైనల్లోనూ మేము తలపడలేదు. పొట్రో అంటే ప్లేయర్‌గా, వ్యక్తిగా నాకు చాలా గౌరవం ఉంది. అతను చాలా మంచి వాడు. గతంలో అతను గాయాలతో సతమతమయ్యాడు’ అని గాయం కారణంగా 2017 టోర్నీకి దూరమైన జొకోవిచ్ అన్నాడు. మరోవైపు గాయం కారణంగా సెమీఫైనల్ పోరు నుంచి తప్పుకోవడంతో నాదల్ క్రుంగిపోయాడు. ‘నాకు నచ్చని పదం రిటైర్’ అని కెరీర్ ఆద్యంతం వరుస మోకాలి గాయాలతో సతమతమైన నాదల్ అన్నాడు.

 జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మారిన్ సిలిక్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఐదో సెట్‌లో నాదల్image రిటైర్ అయ్యాడు. ‘టెన్నిస్‌లో ఒకే వ్యక్తి ఉండడు. కోర్టు అవతలి వైపు మరో వ్యక్తి ఆడతాడు’ అని నాదల్ అన్నాడు. నాలుగోసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను, 18వ మేజర్ టైటిల్‌ను గెలుచుకోవాలని నాదల్ భావించాడు. సెమీఫైనల్‌కు చేరుకునేందుకు 16 గంటలు ఆడాడు. క్వార్టర్ ఫైనల్లో డామ్నిక్ థీమ్‌తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో దాదాపు ఐదు గంటలు నాదల్ పోరాడాడు. కానీ అతని శ్రమ ఫలించలేదు. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో సెట్‌లో రిటైర్ నిర్ణయం తీసుకోకముందు రెండుసార్లు కుడి మోకాలికి బ్యాండేజ్ కట్టుకున్నాడు. ‘మ్యాచ్ ఇలా గెలవడం సరైంది కాదు. రాఫాతో ఆడటమంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే టెన్నిస్‌లో అతను బిగ్ ఫైటర్. అతను బాధపడుతుంటే చూడటం నాకు ఇష్టం లేదు’ అని 29 ఏళ్ల డెల్ పొట్రో అని అన్నాడు. పొట్రోకు ఇది రెండో గ్రాండ్ శ్లామ్ ఫైనల్

నిజంగా రాఫా దురదృష్టం
‘నిజంగా రాఫా దురదృష్టకరం. కానీ అతనిపై ఉత్తుత్తమ ప్రతిభ కనబరిచినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని తొలి సెట్‌లో పోరాడి గెలిచిన పొట్రో అన్నాడు. తొలి సెట్‌లో నాలుగు గేమ్‌ల తర్వాత నాదల్‌కు గాయం సమస్య మొదలైంది. ఏడో గేమ్ తర్వాత అతను తన కుడి మోకాలికి పట్టీ వేయించుకున్నాడు. తర్వాత 10వ గేమ్‌లో అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించి డెల్ పొట్రో సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేశాడు. కానీ తొలి సెట్‌ను టై బ్రేక్‌కు తీసుకెళ్లిన ఆర్జెంటీనా ఆటగాడు ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌లో మూడు గేమ్‌ల తర్వాత బ్యాండెజ్‌ను మార్చేందుకు నాదల్ మెడికల్ టైమ్ అవుట్‌ను తీసుకున్నాడు. తర్వాత పొట్రో చెమటోడ్చి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంతో నిలిచాడు. 

మరోవైపు నాదల్ మోకాలి గాయంతో సతమతమవుతున్నాడు. మరోసారి నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన పొట్రో 5-2తో నిలిచాడు. రెండో సెట్‌లో గెలుపుకు పొట్రో దగ్గరయ్యాడు. ‘నాకు ఇష్టమైన మరో గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరతానని అనుకోలేదు. 2009లో ఈ కోర్టులో నాకు చిరస్మరణీయ జ్ఞాపకాలు ఉన్నాయి. ముందుగా రాఫాను తర్వాత ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను ఓడించాను. అప్పుడు నేను పిల్లాడిని. ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను’ అని పొట్రో గుర్తు చేసుకున్నాడు. 

వింబుల్డన్ చాంపియన్ జొకోవిచ్ 11వ యూఎస్ ఓపెన్ సెమీఫైనల్ ఆడాడు. నిషికొరితో 17సార్లు తలపడిన జొకోవిచ్ 15వ విజయం సాధించాడు. ఈసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిస్తే 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు గెలిచిన పీట్ సాంప్రాస్ రికార్డును జొకోవిచ్ సమం చేస్తాడు.ప్రీ క్వార్టర్స్‌కు నాదల్, సెరెనా

Updated By ManamSat, 09/01/2018 - 22:48

imageన్యూయార్క్: న్యూయార్క్ వేదికగా జరుగు తున్న యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో నాదల్, సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. యూఎస్ ఓపెన్‌లో భాగంగా జరిగిన మహి ళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు తలపడ్డారు. ఈ పోరులో సెరె నా 6-1, 6-2తో వీనస్‌పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో స్పెయి న్ బుల్ రఫెల్ నాదల్ 5-7, 7-5, 7(9)- 6(7), 7(7)ర- 6(3)తో రష్యాకు చెందిన కరెన్ కచానొవ్‌పై విజ యం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు.

మరో మ్యాచ్ లో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్ 3-6, 6-3, 7(7)- 6(5), 6-4తో టేలర్ ఫ్రిట్జ్(అవెురికా)పై విజయం సాధించగా, డసన్ లాజవిక్(సెర్బియా)ని 6(8)-7(10), 7(8)- 6(6)చ 3-6, 5-7తో  ఇస్నర్ (అవెురికా) చిత్తు చేశాడు. సౌతాఫ్రికాకు చెందిన కెవిన్ అండర్సన్ 4-6, 6-3, 6-4, 4-6, 6-4తో డేనిస్ షపోవలోవ్ (కెనడా)పై గెలుపొంది ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. అంతకముందు జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో బెలారస్‌కు చెందిన అజరెంకాపై  3-6, 4-6తో అవెురికాకు చెందిన స్టీఫెన్స్ విజయం సాధించింది.

Related News