four arrested

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం

Updated By ManamMon, 09/10/2018 - 16:44
4 arrested by Hyderabad CCS police over duping job aspirants

హైదరాబాద్ : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దేశవ్యాప్తంగా నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసి, మోసానికి పాల్పడుతున్న ఓ ముఠాను సీసీఎస్  క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న  నలుగురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.

ఢిల్లీ కేంద్రంగా గుర్గావ్‌కు చెందిన సుమన్ భరద్వాజ్, ప్రవీణ్ గుప్తా, సునీల్ రాజా ఓ ముఠాగా ఏర్పడి విదేశాల్లో ఉద్యోగాలు అంటూ ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి అందినకాడికి నిరుద్యోగుల నుంచి దండుకున్నారు. ఆ తర్వాత స్పందించకపోవడంతో పలువురు బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు...ముఠా సభ్యులను వలపన్ని పట్టుకున్నారు.రూ.కోటి విలువైన రద్దైన నోట్లు సీజ్..

Updated By ManamMon, 09/03/2018 - 14:02
Police arrested four men with demonetised notes with the face value of Rs 1 crore

చెన్నై : పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాదిన్నర పూర్తి కావస్తున్నా... ఇంకా ఆ నోట్లు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తమిళనాడు మధురైలో రూ.కోటి విలువైన పెద్ద నోట్లను నిన్న పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఓ కారులో ఈ నగదును తరలిస్తుండగా... వాహనాల తనిఖీల్లో భాగంగా ఈ నోట్లు బయటపడ్డాయి. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Related News