vijay mallya

మాల్యా పరారీ వెనుక..!

Updated By ManamFri, 09/14/2018 - 15:58
 • ముందే ఊహించిన ఎస్‌బీఐ అధికారులు

 • సీనియర్ న్యాయవాది దవేతో సమాలోచన

 • సుప్రీంకు వెళ్లాలని సూచించిన లాయర్

 • అయినా స్పందించని స్టేట్‌బ్యాంక్ వర్గాలు

 • రెండు రోజులకే లండన్ పారిపోయిన మాల్యా

Vijay Mallya escape row: SBI Chairman says not all high-value clients

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉండి భారతీయ అధికారులు, బ్యాంకులను ముప్పు తిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పారిపోవడానికి కారణం ఎవరు? మాల్యా భారతదేశం వదిలి వెళ్లిపోవడానికి దాదాపు నెల రోజుల ముందే... మాల్యా తమకు దాదాపు రూ. 2వేల కోట్లు బాకీ ఉన్నారని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. డెట్ రికవరీ ట్రైబ్యునల్ (డీఆర్‌టీ)కి సమర్పించిన డిక్లరేషన్‌లో భాగంగా ఈ విషయం తెలిపింది. ఆ ట్రైబ్యునల్ అప్పటికి మాల్యా, ఆయన కంపెనీలు చెల్లించాల్సిన బాకీల విషయం చూస్తోంది.

ఎస్‌బీఐ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియం 2014 జనవరి 31 నాటికి ఉన్న బాకీలను ఆ నివేదికలో తెలిపాయి. వాటిలో ఒక్క ఎస్‌బీఐకే మాల్యా దాదాపు రూ. 2,043 కోట్లు కట్టాల్సి ఉంది. అన్ని బ్యాంకులకు కలిపి రూ. 6,963 కోట్లు బాకీ ఉన్నారు. కొన్ని వారాల తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే ఫిబ్రవరి 28న ఎస్‌బీఐ సీనియర్ అధికారులను కలిశారు. మాల్యా దేశం వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆ సమావేశంలో బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

అప్పుడు వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి, మాల్యా దేశం వదిలి వెళ్లకుండా ఉత్తర్వులు పొందాలని దవే వారికి సూచించారు. దానికి నాటి ఎస్‌బీఐ చైర్మన్ అరుంధతి భట్టాచార్య కూడా సరేనన్నారు. మర్నాడు సోమవారం కావడంతో వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని దవే సూచించారు. ఆరోజు ఆయన కోర్టుకు వెళ్లినా, ఎస్‌బీఐ అధికారులు మాత్రం ఎవరూ అక్కడకు రాలేదు. అలాగే, మాల్యా దేశం విడిచి వెళ్లకుండా ఆదేశించాలన్న పిటిషన్ కూడా దాఖలు కాలేదు. సరిగ్గా రెండు రోజుల తర్వాత.. అంటే మార్చి 2న విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లిపోయారు. 

అంతటి సీనియర్ న్యాయవాది చెప్పిన తర్వాత, పైగా స్వయంగా బ్యాంకు ఉన్నతాధికారులకే అనుమానం వచ్చిన తర్వాత కూడా వాళ్లు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. అప్పుడే కోర్టుకు వెళ్లి ఉంటే, మాల్యా పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని.. ఆయన దేశం విడిచి వెళ్లకుండా చూడగలిగే అవకాశం ఉండేది. అయితే, తమవైపు నుంచి ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని ఎస్‌బీఐ వర్గాలు అంటున్నాయి. బాకీ ఉన్న మొత్తాలను రికవరీ చేసుకోడానికి బ్యాంకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలిపాయి. అవును మాల్యా చెప్పింది వాస్తవమే...

Updated By ManamThu, 09/13/2018 - 17:49
subramanian Swamy says order to downgrade Mallya notice came from

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడానంటూ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుంటే...మరోవైపు బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి అది వాస్తవమేనంటూ మరో బాంబ్ పేల్చారు. బ్యాంకులకు కోట్లాది రూపాయిలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న మాల్యాను భారత్‌కు రప్పించే అంశంపై లండన్‌లోని ఓ కోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన మాల్యా తాను భారత్ విడిచే ముందు జైట్లీతో రుణాల్ని చెల్లించే విషయంలో చర్చించినట్టు వ్యాఖ్యలు చేశారు. 

ఇదే విషయంపై సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను లండన్ వెళ్లిపోతున్నానంటూ విజయ్ మాల్యా పార్లమెంటులో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీకి చెప్పిన విషయం ‘తిరుగులేని వాస్తవమని’, మాల్యాపై విడుదలైన లుక్‌అవుట్ నోటీసును ‘బలహీనపర్చింది’ కూడా అంతే నిజమని స్వామి కుండబద్దలు కొట్టారు.  

మాల్యా విదేశాలకు ‘వెళ్లకుండా అడ్డుకోండి’ అంటూ సీబీఐ జారీ చేసిన లుక్‌అవుట్ నోటీసును ‘వెళ్లిపోతే చెప్పండి’ అని మార్చినట్టు తనకు సమాచారం ఉందని, ఆర్ధిక శాఖలో ఎవరో ఈ మేరకు ఆదేశించినట్టు తెలిసిందంటూ ఆ వ్యక్తి ఎవరు?’ అని సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు. ఈ విషయంలో ఇప్పటికే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి మాల్యా వ్యాఖ్యలతో అధికార పక్షంపై గట్టి అస్త్రం దొరికినట్లు అయింది. దీంతో సోషల్ మీడియాలో కూడా జైట్లీ, విజయ్ మాల్యామధ్య స్నేహ బంధం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. 

జైట్లీ రిజైన్ చేయాలి: రాహుల్
మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా దూకుడు పెంచారు. ఆర్థిక మంత్రి  జైట్లీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశం విడిచి వెళ్ళే ముందు రుణాల చెల్లింపుపై  జైట్లీతో తాను  చర్చించానని  మాల్యా నిన్న లండన్‌లో చెప్పిన విషయం దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. విజయ్ మాల్యాకు తాను అపాయింట్ మెంట్ ఇవ్వలేదని, పార్లమెంటులోనే విజయ్ మాల్యాని కలిశానని అరుణ్ జైట్లీ ఇచ్చిన వివరణ కూడా వివాదాస్పదంగా మారింది. ఓ పారిశ్రామికవేత్త రుణ చెల్లింపు వ్యవహారాన్ని చాలా నిర్లక్ష్యంగా  జైట్లీ డీల్ చేశారని కూడా కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. జైట్లీతో మాట్లాడా.. బాకీలన్నీ తీర్చేస్తా: మాల్యా

Updated By ManamWed, 09/12/2018 - 19:51

Finance Minister, Vijay Mallya, Lies, Arun Jaitleyన్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి విదేశాలకు చెక్కేసిన లిక్కర్ కింగ్, కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా అందరి బాకీలు పూర్తిగా తీర్చివేస్తానని స్పష్టం చేశాడు. మాల్యాను భారత్‌కు రప్పించే అంశంపై లండన్‌లోని ఓ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో భాగంగా కోర్టుకు వచ్చిన మాల్యా మీడియాతో మాట్లాడారు. ‘రుణాల చెల్లింపులపై కర్ణాటక హైకోర్టులో ప్రతిపాదించాను. ఈ ఏడాది జూన్‌ 22న కర్ణాటక హైకోర్టులో ఓ దరఖాస్తు దాఖలు చేశాను. కోర్టు అధీనంలో ఉన్న నా ఆస్తులను అమ్మేందుకు అనుమతించాలని కోరాను. ఆ ఆస్తులను అమ్మేసి అందరి బాకీలు తీర్చివేస్తాను’ అని మాల్యా చెప్పారు.

ఈ సందర్భంగా మాల్యా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడిన అంశాన్ని ప్రస్తావించారు. రుణాలు తీసుకున్న అంశాన్ని సమర్థించుకున్న మాల్యా.. తాను భారత్ విడిచే ముందు జైట్లీతో రుణాల్ని చెల్లించే విషయంలో చర్చించినట్టు వ్యాఖ్యానించారు. మాల్యా వ్యాఖ్యలపై ఫేస్‌బుక్ వేదికగా స్పందించిన అరుణ్ జైట్లీ తీవ్రంగా ఖండించారు. మాల్యా చెప్పేవి అన్ని అబద్దాలుగా కొట్టిపారేశారు. తాను అసలు మాల్యాకు ఎప్పుడు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. ఓసారి పార్లమెంట్ ఆవరణలో హడావుడిగా తనతో మాల్యా మాట్లాడినట్టు జైట్లీ పోస్ట్‌లో పేర్కొన్నారు.  విజయ్ మాల్యాకు స్వల్ప ఊరట..

Updated By ManamMon, 09/03/2018 - 21:19

Vijay Mallya, 3 Weeks To Reply, Probe Agency Applicationముంబై: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోమవారం ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం మాల్యా కేసును విచారించింది. మాల్యాను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు’గా గుర్తించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై సమాధానం ఇస్తూ మాల్యాకు కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. సెప్టెంబర్‌ 24లోపు మాల్యా వివరణ ఇవ్వాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎగవేత వీరులు వీరే

Updated By ManamSat, 08/04/2018 - 00:47
 • 28 మంది ఎగవేతదారుల పేర్లు వెల్లడి

 • అందరికీ పెద్దన్న మాల్యా.. జాబితాలో నీరవ్.. మెహుల్

 • రుణాల ఎగవేత.. ఆపై పరారీ.. విదేశాలకు ఆర్థిక నేరస్తులు

 • కొందరికి అక్కడి పౌరసత్వం.. జాబితా తెలిపిన ఆర్థిక శాఖ

vijay న్యూఢిల్లీ: బ్యాంకులకు టోపీ పెట్టి.. వాటి నుంచి పెద్దమొత్తంలో అప్పులు తీసుకుని పారిపోయినవారందరికీ పెద్దన్న విజయ్ మాల్యానే అని తేలింది. ఎగవేతదారులకు తనను పోస్టర్‌బోయ్‌గా చేసేశారని ఆయన ఎంత మొత్తుకున్నా.. అత్యధిక మొత్తం తీసుకుని పరారీలో ఉన్నది మాల్యానే అన్న విషయం కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. మాల్యా దాదాపు రూ. 7,500 కోట్ల మేర (దీనిమీద వడ్డీలు అదనం) బ్యాంకులను మోసం చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లోక్‌సభకు అందించిన జాబితాలో తెలిపింది. ఆయన తర్వాత వజ్రాల వ్యాపారులు మెహుల్ చోక్సీ రూ. 7080 కోట్లు, నీరవ్ మోదీ రూ. 6498 కోట్ల మేర మోసం చేశారు. వీరిలో చోక్సీ గీతాంజలి జ్యూవెల్స్ ప్రమోటర్ కాగా, నీరవ్ మోదీకి తన పేరుతోనే సొంత లగ్జరీ డిజైనర్  జ్యూవెలరీ బ్రాండ్ ఉంది. వీరితర్వాత స్టెర్లింగ్ బయోటెక్ ప్రమోటర్లు చేతన్ సందేసరా, నితిన్ సం దేసర, దీప్తిబెన్ సందేసరా ఉన్నారు. వీళ్లు దాదాపు రూ. 5,383 కోట్లు ఎగ్గొట్టారు. రూ. 5 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో వీళ్ల ఫార్మాకంపెనీకి చెందిన రూ. 4,701 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎటాచ్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో విన్సమ్ డైమండ్స్ ప్రమోటర్ జతిన్ మెహతా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ పౌరసత్వం పొంది ఉన్నారు. ఆయన బ్యాంకులను రూ. 4,625 కోట్ల మేర మోసం చేశారు. ఇంకా.. కోల్‌కతాకు చెందిన శ్రీ గణేశ్ జ్యూయలరీ హౌస్ ప్రమోటర్లు నీలేష్ పారేఖ్, ఉమేష్ పారేఖ్, కవులేష్ పారేఖ్ కూడా రూ. 2,672 కోట్ల మోసంతో జాబితాలో ఉన్నారు. 

పూర్తి జాబితా ఇదీ..
విజయ్ మాల్యా, జతిన్ మెహతా, పుష్పేశ్ బైద్, చేతన్ జయంతిలాల్ సందేసరా, నితిన్ జయంతిలాల్ సందేసరా, దీప్తిబెన్ చేతన్‌కుమార్ సందేసరా, ఏకలవ్య గార్గ్, సంజయ్ కుమార్ కల్రా, సబ్య సేథ్, రాజీవ్ గోయల్, అల్కా గోయల్, సన్నీ కల్రా, ఆర్తి కల్రా, వర్షా కల్రా, సుధీర్ కుమార్ కౌరా, సురేందర్ సింగ్, అంగద్ సింగ్, హర్‌సాహిబ్ సింగ్, హర్లీన్ కౌర్, వినయ్ మిట్టల్, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ భారత్‌ రావాలనుకుంటున్న మాల్యా..?

Updated By ManamWed, 07/25/2018 - 12:21

mallya లండన్: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్‌ మాల్యా భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నారట. అంతేకాదు స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడానికి మాల్యా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మాల్యా తన ప్రతినిధులను దర్యాప్తు సంస్థల వద్దకు పంపి ఈ విషయాన్ని చెప్పినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.

ప్రస్తుతం మాల్యాపై లండన్‌లోని కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం మాల్యా ఆస్తులను వెంటనే జప్తు చేసే అవకాశం ఉంది. మరోవైపు పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఈడీ, ఇటీవల ముంబయిలోని అవినీతి నిరోధక చట్టం(ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కోర్టు ఆగస్టు 27న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని మాల్యాకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల ప్రకారం చెప్పిన తేదీకి కోర్టు ఎదుట హాజరుకాకపోతే మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడుగా ప్రకటించే అవకాశం ఉంది. దీంతో మాల్యా భారత్‌కు రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.అలా అనడం తప్పే: కేంద్రమంత్రి ఓరమ్

Updated By ManamSat, 07/14/2018 - 13:07
 • ‘మాల్యా’ప్రస్తావనపై కేంద్రమంత్రి వివరణ

Jual Oram హైదరాబాద్ : కేంద్ర గిరిజన శాఖ మంత్రి జోయల్ ఓరమ్ నోరు జారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. బ్యాంకులకు  కోట్లాది రూపాయిలు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాను కేంద్ర మంత్రి ప్రశంసలు కురిపించడం విమర్శలకు దారి తీసింది.  

దీంతో ఆయన నాలుక కరుచుకుని తాను అనుకోకుండా మాల్యా పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఆ సమయంలో వేరేవారి పేరు ప్రస్తావించబోయి పొరపాటున మాల్యా పేరు ఉదహరించినట్లు తెలిపారు. తాను మాల్యా పేరును ప్రస్తావించడం తప్పిదమే అంటూ కేంద్ర మంత్రి జోయల్ ఓరమ్ పేర్కొన్నారు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో  శుక్రవారం జాతీయ గిరిజన పారిశ్రామికవేత్తల సదస్సులో కేంద్ర మంత్రి జోయల్ ఓరమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘గిరిజన పారిశ్రామికవేత్తలకు కేంద్రం అన్నివిధాలు ప్రోత్సహిస్తుంది. గిరిజన సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేయుతతో గిరిజనులు చురుకుగా మారి పారిశ్రామికవేత్తలుగా మారాలి. చురుకుగా, తెలివిగా మారాలి. స్వశక్తితోనే ఏదైనా సాధ్యం అవుతుంది’అని అన్నారు.

పనిలో పనిగా విజయ మాల్యా చాలా చురుకైన వ్యక్తి అంటూ అని పొగిడారు. అంతేకాకుండా మాల్యాను అందరూ విమర్శిస్తారు కానీ మాల్యా అంటేనే బీ స్మార్ట్, ఆయన చాలమందికి ఉద్యోగాలు ఇచ్చారు. బ్యాంకులు, ప్రభుత్వానికి, రాజకీయ వేత్త్తలకు ఎంతోకొంత చేశారు... అంటూ మంత్రి వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సమవేశానికి హాజరైనవారు మంత్రివర్యుల వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. మంత్రి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చుకున్నారు.రుణాలు తిరిగి చెల్లిస్తా: మాల్యా

Updated By ManamTue, 06/26/2018 - 15:54

రుణం చెల్లించాలన్నదే నా అభిమతం
అప్పుడు.. ఇప్పుడూ.. అదే ప్రయత్నంలో ఉన్నా: మాల్యా

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించానని.. ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నానని విజయ్ మాల్యా స్పష్టం చేశారు. అయితే, బ్యాంకులు మాత్రం తనను రుణాల ఎగవేతదారుగా పోస్టర్లకు ఎక్కించాయని ఆయన విమర్శించారు.

mallya

భారత్ లో ఉన్నపుడు కూడా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించాలనే ప్రయత్నించినట్లు వివరించారు. అందుకోసం పట్టుదలగా ప్రయత్నించానని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవడంతో బ్యాంకులు తనను ముద్దాయిగా నిలబెట్టాయని ఆరోపించారు. ఎప్పుడైతే లోన్ రికవరీ అంశంలో రాజకీయ శక్తులు జోక్యం చేసుకున్నాయో.. అప్పుడిక తనకు చేయడానికి ఏమీ మిగలలేదని మాల్యా తెలిపారు. 

వాస్తవానికి రుణాల వసూలు అంశం సివిల్ పరిధిలోకి వచ్చినా.. భారత ప్రభుత్వం మాత్రం ప్రజల ముందు తనను క్రిమినల్‌గా నిలబెట్టిందని మండిపడ్డారు. 2016లో ఇదే విషయానికి సంబంధించి ప్రధాని మోదీతో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి తాను లేఖ రాసానని మాల్యా తెలిపారు. అయితే, వారి నుంచి తనకు ఎలాంటి జవాబు రాలేదని పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖలను మాల్యా మీడియాకు విడుదల చేశారు. లిక్కర్ బేరన్‌గా ప్రసిద్ధి చెందిన విజయ్ మాల్యా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో దాదాపు 9 వేల కోట్ల రుణం తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలపై మాల్యా మంగళవారం  స్పందించారు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు. న్యాయ పర్యవేక్షణలో తన ఆస్తులను విక్రయించడానికి కోర్టు అనుమతి ఇవ్వాలని ప్రస్తుతం మాల్యా కోరారు. విక్రయించిన ఆస్తుల ద్వారా తాను బ్యాంకులకు రుణాలు చెల్లించనున్నట్టు ఒప్పుకున్నారు. ఈమేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తాను గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖనూ బయటపెట్టారు.మాల్యాకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

Updated By ManamThu, 06/21/2018 - 09:52

Mallya ముంబై: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ దాఖలు చేసి ఛార్జిషీట్ నేపథ్యంలో ముంబై ప్రత్యేక కోర్టు అతడికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. తదుపరి కేసు విచారణను జూలై 30వ తేదికి వాయిదా వేసింది. 

అయితే మనీ లాండలింగ్ చట్టం కింద రూ.6వేల కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మాల్యా మోసగించారంటూ ఈడీ తాజాగా ఓ ఛార్జిషీటును దాఖలు చేసింది. 2005-10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027కోట్ల మేర నష్టపోయిన కేసును సంబంధించిన ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ ఈ చార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది.విజయ్ మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Updated By ManamMon, 06/18/2018 - 00:00
 • రూ. 9 వేల కోట్ల ఆస్తుల జప్తుకు వీలుకల్పిస్తున్న ఆర్డినెన్స్ అస్త్రం

vijayaన్యూఢిల్లీ: మద్యం వ్యాపారి విజయ్ మాల్యా మరిన్ని చిక్కుల్లో పడనున్నారు. గుప్త ధనాన్ని చెలామణీలోకి తీసుకురావడం, జాతీయీకరణ బ్యాంకుల కన్సార్టియంను రూ. 6,027 కోట్ల మేర మోసగించడానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇ.డి) త్వరలోనే మాల్యాపైన, ఆయన కంపెనీలపైన తాజా చార్జిషీటు దాఖలు చేయనుంది. ఈ చార్జిషీటు (దీన్నే ప్రాసిక్యూషన్ ఫిర్యాదు అని కూడా అంటారు)తో  కేంద్ర దర్యాప్తు సంస్థ మాల్యాకు చెందిన రూ. 9,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను  ‘‘జప్తు’’ చేసేందుకు కోర్టు అనుమతి కోరే అవకాశం చిక్కుతుంది. కేంద్రం ఇటీవల జారీ చేసిన పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల ఆర్డినెన్స్ కింద ఆ రకంగా అభ్యర్థించే వీలు ఉంది. మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. సుమారు రూ. 900 కోట్ల మేర ఐ.డి.బి.ఐ బ్యాంక్-కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లు పాల్పడినట్లు చెబుతున్న బ్యాంక్ రుణ మోస కేసులో మాల్యాపై ఇ.డి గత ఏడాది మొదటి చార్జిషీటు దాఖలు చేసింది. ఈ కేసులో ఇంతవరకు అది రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనపరచుకుంది. బ్యాంకుల కన్సార్టియం తరఫున భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ) నుంచి అందిన ఫిర్యాదు ననుసరించి రానున్న చార్జిషీటు రూపొందనుంది. మాల్యా యాజమాన్యంలోని సంస్థలు తమకు రూ. 6,027 కోట్ల మేర నష్టాన్ని వాటిల్లజేశాయని వాటి ఆరోపణ. అవి 2005-10 కాలంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేదని బ్యాంకులు పేర్కొన్నాయి. ఈ ఉదంతంలో సి.బి.ఐ దాఖలు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను పరిగణనలోకి తీసుకుని ఇ.డి తన దర్యాప్తును కొనసాగించింది. ఇ.డి. దాని తాజా చార్జిషీటును గుప్త ధన చెలామణీ నిరోధక చట్టం కింద ముంబైలో ప్రత్యేక కోర్టులో దాఖలు చేయనుంది. ఎస్.బి.ఐ, దాని కన్సార్టి యం బ్యాంకులు 2005- 2010 మధ్య కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వివిధ రుణ సదుపాయాలు కల్పించాయని ఆరోపణలున్నాయి. కంపెనీ 2009-10లో రుణాలు తిరిగి చెల్లిం చడంలో విఫలమైంద ని సి.బి.ఐ ఎఫ్.ఐ.ఆర్ తెలిపింది.బ్యాంకుల కన్సార్టియం వద్ద ఎయిర్‌లైన్స్ తన ఖాతాను సరిగ్గా నిర్వహించలేదు. దాంతో ఆ రుణాలు నిరర్థక ఆస్తులుగా పరిణమించాయి. 

దాంతో బ్యాంకుల కన్సార్టియం రుణ సదుపాయాలు వెనక్కి తీసుకుంది. యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ (యు.బి.హెచ్.ఎల్) కార్పొరేట్ గ్యారంటీని, మాల్యా వ్యక్తిగత గ్యారంటీని కూడా అవి ఎత్తివేశాయి. రుణ దాతలను మోసగించేందుకు  గ్రూప్ కంపెనీలు, ప్రమోటర్, అజ్ఞాత వ్యక్తుల మధ్య కుట్ర జరిగిందని సి.బి.ఐ పేర్కొంది. ఈ నిధుల కైంకర్యానికి అనేక డొల్ల, డమ్మీ కంపెనీలను ఉపయోగించుకున్నట్లు తేలిందని ఇ.డి. అధికారులు చెప్పారు. రానున్న చార్జిషీటులో ఆ వివరాలను ఇ.డి పొందుపరచనుంది. పరారీలో ఉన్న నిందితులకు సంబంధించి ఒక కొత్త ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాధికారత పొందిన ఈ సంస్థ ఈ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు (చార్జిషీటు)ను పరిగణనలోకి తీసుకుని విజయ్ మాల్యాను ‘‘పరారీలో’’ ఉన్న నిందితునిగా అధికారికంగా ప్రకటించవలసిందిగా కోరే అవకాశం ఉంది. మాల్యాను లండన్ నుంచి రప్పించి ఈ ఆరోపణలకు సంబంధించి ఇక్కడి న్యాయ వ్యవస్థలో విచారణను ఎదుర్కొనేట్లు చేయడానికి భారతదేశం ప్రయత్నాలు సాగిస్తోంది. మాల్యాను అప్పగించాలని బ్రిటన్‌ను ఇండియా కోరుతోంది. అయితే, ఈ ఆరోపణలను మాల్యా లండన్ కోర్టులో సవాల్  చేశారు. పెద్ద మొత్తాలలో బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులన్నింటినీ ఒకచోట చేర్చి, కొత్త చట్టం కింద ఎగవేతదార్లను నోటిఫై చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఇటీవల ప్రయత్నాలు మొదలుపెట్టింది. గుప్త ధన చెలామణీ నిరోధక చట్టం కింద ప్రస్తుతం ఉన్న న్యాయ ప్రక్రియ ప్రకారం, ఒక కేసులో విచారణ ముగిసిన తర్వాత మాత్రమే, ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జప్తు చేయగలుగుతుంది. కానీ, విచారణ పూర్తవడానికి సాధారణంగా అనేక ఏళ్ళు పడుతుంది. ‘‘క్రిమినల్ ప్రొసీడింగులు మొదలవుతాయని ఊహించి, లేదా ప్రొసీడింగులు పెండింగ్‌లో ఉన్నప్పుడు, భారతీయ కోర్టుల విచారణ పరిధి నుంచి తప్పించుకునేందుకు ఆర్థిక నేరస్తులు దేశం విడిచి పారిపోతున్న సంఘటనల దృష్ట్యా’’ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుల బిల్లు 2018ని మార్చి 12న లోక్ సభలో ప్రవేశపెట్టారు. కానీ, వివిధ అంశాలపై ప్రతిష్టంభన వల్ల పార్లమెంట్ ఈ బిల్లును చేపట్టలేకపోయింది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడడంతో ఆర్డినెన్స్‌ను ప్రతిపాదించారు. ఫుగిటీవ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్సుకు కేంద్ర మంత్రివర్గం ఏప్రిల్ 21 ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ జారీకి రాష్ట్రపతి ఆ మరుసటి రోజునే ఆమోద ముద్ర వేశారు. 

 గుప్త ధన నిరోధక చట్టం (2002) కింద ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు, ఒక వ్యక్తిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తునిగా ప్రకటించేందుకు, సదరు వ్యక్తి ఆస్తులను తక్షణం స్వాధీనపరచుకునే విధంగా ఆదేశాలు జారీ చేసేందుకు ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తోంది. షెడ్యూల్డు నేరానికి సంబంధించి అరెస్టు వారంట్ జారీ అయిన వ్యక్తి, క్రిమినల్ ప్రాసిక్యూషన్‌ను తప్పించుకునేందుకు ఇండియా నుంచి ఉడాయించిన వ్యక్తి, లేదా విదేశాల్లో ఉంటూ, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేందుకు ఇండియాకు తిరిగి వచ్చేందుకు తిరస్కరిస్తున్న వ్యక్తి ఫుగిటీవ్ ఎకనామిక్ అఫెండర్ అవుతాడు’’ అని ప్రభుత్వం పేర్కొంది. రూ. 100 కోట్లకు మించిన మోసాలు, చెక్కులు చెల్లకపోవడం లేదా రుణాల ఎగవేత కేసులు ఈ ఆర్డినెన్స్ పరిధిలోకి వస్తాయి. అయితే, సదరు వ్యక్తులకు రాజ్యాంగపరంగా ఉండవలసిన హక్కులకు ఈ ఆర్డినెన్సు భంగం కలగనీయలేదు. వారు న్యాయవాది ద్వారా వాదనలు వినిపించుకోవచ్చు. జవాబు దాఖలు చేసేందుకు తగిన సమయం కూడా ఇస్తారు. అయితే, వారు ఇండియాలో ఉన్నా, విదేశంలో ఉన్నా కూడా సమన్లు జారీ చేయవచ్చు. అలాగే, నిందితులు కూడా ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవచ్చు. 

Related News